-
హాయ్, నా పేరు మాడిసన్ మాక్సే.
-
నాకు లూమియా అనే కంపెనీ ఉంది,
-
మేము చక్కని దుస్తుల తయారీ కోసం చక్కని
వస్త్రాలు మరియు చక్కని ఉత్పత్తులు చేస్తాం.
-
జవుళీ విషయానికి వస్తే ఆకాశమే హద్దు.
-
నా పేరు డానియెల్ ఆపిల్ స్టోన్, నేను అదర్
మెషీన్ కంపెనీ సిఇఓ గా ఉన్నా.
-
మేమొక డెస్క్ టాప్ మిల్లింగ్ యంత్రం చేస్తాం
-
మిల్లింగ్ యంత్రం తిరిగే కటింగ్ టూల్ తో
3D వస్తువు తయారీకి సామగ్రిగుండా కదుల్తుంది
-
కప్పు కింద, కంప్యూటర్లన్నీ అవే తొలి నాలుగు
పనులే చేస్తాయి.
-
అవి సమాచారాన్ని తీసుకుంటాయి,
-
సమాచారాన్ని నిల్వచేసి ప్రక్రియ చేస్తాయి,
-
తర్వాత సమాచారాన్ని బయటికి ఇస్తాయి.
-
ఈ పనులన్నీ కంప్యూటర్ యొక్క వేర్వేరు భాగాలు
చేస్తాయి.
-
బయటి నుంచి ఇన్‌పుట్ తీసుకొని దాన్ని బైనరీ
సమాచారంగా మార్చే ఇన్‌పుట్ ఉపకరణాలున్నాయి.
-
ఈ సమాచారాన్ని నిల్వ చేసే మెమరీ ఉంటుంది.
-
సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా CPU ఉంది
-
ఇక్కడ లెక్కింపులన్నీ జరుగుతాయి.
-
ఇక చివరికి, సమాచారం తీసుకొని భౌతికఔట్‌పుట్
లోకి మార్చే ఔట్‌పుట్ ఉపకరణాలు ఉన్నాయి.
-
మొదట ఇన్‌పుట్ గురించి మాట్లాడదాం.
-
కంప్యూటర్లు అనేక రకాల ఇన్‌పుట్ తీసుకుంటాయి
కంప్యూటర్ కీబోర్డ్, ఫోన్ యొక్క టచ్ ప్యాడ్,
-
ఓ కెమెరా, ఓ మైక్రోఫోన్ లేదా ఒక GPS లాగా.
-
ఐతే కారు థర్మోస్టాట్ లేదాడ్రోన్ పై సెన్సర్
వంటివి కూడా వేర్వేరు ఇన్‌పుట్ ఉపకరణాలే.
-
ఇపుడు, కంప్యూటర్ గుండా ఇన్‌పుట్ ఎలా వెళ్ళి
ఔట్‌పుట్ గా మారుతుందో ఒక ఉదాహరణ చూద్దాం.
-
మీ కీబోర్డ్ పై కీ నొక్కినపుడు- "B" అక్షరం
ఐతే. కీబోర్డ్ అక్షరాన్ని అంకెగా చేస్తుంది
-
ఆ అంకె బైనరీగా, ఒకట్లు మరియు జీరోలుగా
కంప్యూటర్ లోనికి పంపించబడుతుంది.
-
ఈ అంకెతో మొదలై, "B" అక్షరాన్ని పిక్సెల్
పిక్సెల్ గా ఎలా చూపాలో CPU లెక్కిస్తుంది.
-
CPU మెమరీని దశలవారీ సూచనలు కోరుతుంది,
అది "B" అక్షరాన్ని ఎలా గీయాలో చెబుతుంది.
-
CPU ఈ సూచనల్ని రన్ చేసి ఫలితాలను మెమరీలో
పిక్సెల్స్ గా నిల్వ చేస్తుంది.
-
చివరికి, ఈ పిక్సెల్ సమాచారం బైనరీలో
స్క్రీన్ కి పంపించబడుతుంది.
-
స్క్రీన్ ఒక ఔట్‌పుట్ డివైజ్,అది పంపే బైనరీ
సంకేతాల్ని చిన్నలైట్లు రంగులుగా చూస్తారు.
-
ఇదంతా చాలా త్వరగా తక్షణం జరిగిపోతుంటుంది,
-
ఐతే ఒక్కోఅక్షరం చూపడానికి కంప్యూటర్ వేలాది
సూచనల్ని నడుపుతుంది,
-
మీ వ్రేలు కీ పాయింట్ ని నొక్కిన క్షణంనుండి
మొదలై.
-
ఆ ఉదా.లో ఔట్‌పుట్ ఉపకరణం స్క్రీన్, ఐతే
అనేక వేర్వేరు రకాల ఔట్‌పుట్ లు ఉన్నాయి
-
అవి కంప్యూటర్ నుండి బైనరీ సంకేతం తీసుకుని
భౌతిక ప్రపంచంలో కొంత పని చేస్తాయి.
-
ఉదా. స్పీకర్ ధ్వనిని ప్లే చేస్తుంది, ఓ 3D
ప్రింటర్ ఒక ఆబ్జెక్టును ప్రింట్ చేస్తుంది
-
ఔట్‌పుట్ ఉపకరణాలు రొబోటిక్ చెయ్యి ఒక కార్
మోటర్ వంటి భౌతిక చలనాల్ని అదుపు చేస్తాయి,
-
లేదా కంపెనీ చేసే మిల్లింగ్ మెషీన్ యొక్క
కటింగ్ టూల్ ని.
-
కొత్తరకాల ఇన్‌పుట్ ఔట్‌పుట్లు కంప్యూటర్లని
పూర్తిగా కొత్తమార్గాల్లో పనిచేయనిస్తాయి.
-
ఇది మెమరీ, CPU యొక్క వేగం మరియు సైజును
మెరుగుపరచడానికి చాలా సహాయపడింది.
-
ఎంత క్లిష్టంగా పని ఉంటే, అంత ఇన్‌పుట్ లేదా
ఔట్‌పుట్ సమాచారం ఎక్కువగా ఉంటుంది,
-
కంప్యూటర్ కి కావాల్సిన ప్రాసెసింగ్ శక్తి
మరియు మెమరీ అంతఎక్కువ అవుతుంది.
-
స్క్రీన్ పై టైప్ చేయడం సులభం కావచ్చు, ఐతే
క్లిష్టమైన 3d గ్రాఫిక్స్, లేదా హైడెఫినిషన్
-
మూవీ చేయడానికి ఆధునిక కంప్యూటర్లకు తరచూ
అనేక CPU లు అవసరం, ఆ సమాచారం మరియు అనేక
-
గిగాబైట్ల మెమరీ ప్రాసెస్, నిల్వచేయడానికి.
-
మీరు కంప్యూటర్ తో ఏ పని చేయాలనుకున్నా సరే,
ప్రతి చిన్న పనీ వీటి గురించి:
-
భౌతిక ప్రపంచం నుంచి సమాచారాన్ని ఇవ్వడం,
-
ఆ సమాచారం నిల్వ చేసి మరియు ప్రాసెస్ చేయడం,
-
మరియు కొంత ఔట్‌పుట్ ని తిరిగి భౌతిక
ప్రపంచానికి పొందడం.