హాయ్, నా పేరు మాడిసన్ మాక్సే. నాకు లూమియా అనే కంపెనీ ఉంది, మేము చక్కని దుస్తుల తయారీ కోసం చక్కని వస్త్రాలు మరియు చక్కని ఉత్పత్తులు చేస్తాం. జవుళీ విషయానికి వస్తే ఆకాశమే హద్దు. నా పేరు డానియెల్ ఆపిల్ స్టోన్, నేను అదర్ మెషీన్ కంపెనీ సిఇఓ గా ఉన్నా. మేమొక డెస్క్ టాప్ మిల్లింగ్ యంత్రం చేస్తాం మిల్లింగ్ యంత్రం తిరిగే కటింగ్ టూల్ తో 3D వస్తువు తయారీకి సామగ్రిగుండా కదుల్తుంది కప్పు కింద, కంప్యూటర్లన్నీ అవే తొలి నాలుగు పనులే చేస్తాయి. అవి సమాచారాన్ని తీసుకుంటాయి, సమాచారాన్ని నిల్వచేసి ప్రక్రియ చేస్తాయి, తర్వాత సమాచారాన్ని బయటికి ఇస్తాయి. ఈ పనులన్నీ కంప్యూటర్ యొక్క వేర్వేరు భాగాలు చేస్తాయి. బయటి నుంచి ఇన్‌పుట్ తీసుకొని దాన్ని బైనరీ సమాచారంగా మార్చే ఇన్‌పుట్ ఉపకరణాలున్నాయి. ఈ సమాచారాన్ని నిల్వ చేసే మెమరీ ఉంటుంది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా CPU ఉంది ఇక్కడ లెక్కింపులన్నీ జరుగుతాయి. ఇక చివరికి, సమాచారం తీసుకొని భౌతికఔట్‌పుట్ లోకి మార్చే ఔట్‌పుట్ ఉపకరణాలు ఉన్నాయి. మొదట ఇన్‌పుట్ గురించి మాట్లాడదాం. కంప్యూటర్లు అనేక రకాల ఇన్‌పుట్ తీసుకుంటాయి కంప్యూటర్ కీబోర్డ్, ఫోన్ యొక్క టచ్ ప్యాడ్, ఓ కెమెరా, ఓ మైక్రోఫోన్ లేదా ఒక GPS లాగా. ఐతే కారు థర్మోస్టాట్ లేదాడ్రోన్ పై సెన్సర్ వంటివి కూడా వేర్వేరు ఇన్‌పుట్ ఉపకరణాలే. ఇపుడు, కంప్యూటర్ గుండా ఇన్‌పుట్ ఎలా వెళ్ళి ఔట్‌పుట్ గా మారుతుందో ఒక ఉదాహరణ చూద్దాం. మీ కీబోర్డ్ పై కీ నొక్కినపుడు- "B" అక్షరం ఐతే. కీబోర్డ్ అక్షరాన్ని అంకెగా చేస్తుంది ఆ అంకె బైనరీగా, ఒకట్లు మరియు జీరోలుగా కంప్యూటర్ లోనికి పంపించబడుతుంది. ఈ అంకెతో మొదలై, "B" అక్షరాన్ని పిక్సెల్ పిక్సెల్ గా ఎలా చూపాలో CPU లెక్కిస్తుంది. CPU మెమరీని దశలవారీ సూచనలు కోరుతుంది, అది "B" అక్షరాన్ని ఎలా గీయాలో చెబుతుంది. CPU ఈ సూచనల్ని రన్ చేసి ఫలితాలను మెమరీలో పిక్సెల్స్ గా నిల్వ చేస్తుంది. చివరికి, ఈ పిక్సెల్ సమాచారం బైనరీలో స్క్రీన్ కి పంపించబడుతుంది. స్క్రీన్ ఒక ఔట్‌పుట్ డివైజ్,అది పంపే బైనరీ సంకేతాల్ని చిన్నలైట్లు రంగులుగా చూస్తారు. ఇదంతా చాలా త్వరగా తక్షణం జరిగిపోతుంటుంది, ఐతే ఒక్కోఅక్షరం చూపడానికి కంప్యూటర్ వేలాది సూచనల్ని నడుపుతుంది, మీ వ్రేలు కీ పాయింట్ ని నొక్కిన క్షణంనుండి మొదలై. ఆ ఉదా.లో ఔట్‌పుట్ ఉపకరణం స్క్రీన్, ఐతే అనేక వేర్వేరు రకాల ఔట్‌పుట్ లు ఉన్నాయి అవి కంప్యూటర్ నుండి బైనరీ సంకేతం తీసుకుని భౌతిక ప్రపంచంలో కొంత పని చేస్తాయి. ఉదా. స్పీకర్ ధ్వనిని ప్లే చేస్తుంది, ఓ 3D ప్రింటర్ ఒక ఆబ్జెక్టును ప్రింట్ చేస్తుంది ఔట్‌పుట్ ఉపకరణాలు రొబోటిక్ చెయ్యి ఒక కార్ మోటర్ వంటి భౌతిక చలనాల్ని అదుపు చేస్తాయి, లేదా కంపెనీ చేసే మిల్లింగ్ మెషీన్ యొక్క కటింగ్ టూల్ ని. కొత్తరకాల ఇన్‌పుట్ ఔట్‌పుట్లు కంప్యూటర్లని పూర్తిగా కొత్తమార్గాల్లో పనిచేయనిస్తాయి. ఇది మెమరీ, CPU యొక్క వేగం మరియు సైజును మెరుగుపరచడానికి చాలా సహాయపడింది. ఎంత క్లిష్టంగా పని ఉంటే, అంత ఇన్‌పుట్ లేదా ఔట్‌పుట్ సమాచారం ఎక్కువగా ఉంటుంది, కంప్యూటర్ కి కావాల్సిన ప్రాసెసింగ్ శక్తి మరియు మెమరీ అంతఎక్కువ అవుతుంది. స్క్రీన్ పై టైప్ చేయడం సులభం కావచ్చు, ఐతే క్లిష్టమైన 3d గ్రాఫిక్స్, లేదా హైడెఫినిషన్ మూవీ చేయడానికి ఆధునిక కంప్యూటర్లకు తరచూ అనేక CPU లు అవసరం, ఆ సమాచారం మరియు అనేక గిగాబైట్ల మెమరీ ప్రాసెస్, నిల్వచేయడానికి. మీరు కంప్యూటర్ తో ఏ పని చేయాలనుకున్నా సరే, ప్రతి చిన్న పనీ వీటి గురించి: భౌతిక ప్రపంచం నుంచి సమాచారాన్ని ఇవ్వడం, ఆ సమాచారం నిల్వ చేసి మరియు ప్రాసెస్ చేయడం, మరియు కొంత ఔట్‌పుట్ ని తిరిగి భౌతిక ప్రపంచానికి పొందడం.