అంతరించి పోతున్న సంస్కృతులపైన వేడ్ డేవిస్
-
0:00 - 0:03మీకు తెలుసా, వివిధ ప్రా౦తాలను స౦దర్శి౦చడ౦లో ఎ౦త ఆన౦ద౦ ఉ౦టు౦దో
-
0:03 - 0:05అదే సమయ౦లో మానవ జాతులపై జరిగే పరిశోధనలో పాల్గొనడ౦ మరి౦త సంతోషం కలిగిస్తు౦ది
-
0:05 - 0:07ఈ క్రమ౦లో ఇప్పటికీ తమ ప్రాచీన జీవన విధానాన్ని
-
0:07 - 0:09పాటిస్తున్న ప్రజలను కలుసుకునే అవకాశ౦ కలుగుతు౦ది
-
0:09 - 0:12తమ గతం ఇంకా ఆ గాలుల్లోనే ఉందనుకుంటూ,
-
0:12 - 0:15వర్షపుచినుకులు కడిగే ఆ రాతిముక్కలను తడుముతూ,
-
0:15 - 0:17వగరుగా ఉండే చెట్ల ఆకుల్ని తింటూ,
-
0:17 - 0:21పాలపుంతల అవతల ఇంకా మంత్రగాళ్లు తిరుగాడుతూ ఉంటారని నమ్ముతూ
-
0:21 - 0:25లేదా తమ పూర్వీకులు చుట్టుపక్కల నడయాడుతూ తమని నడిపిస్తారని విశ్వసిస్తూ
-
0:25 - 0:27లేదా ఆ హిమాలయాల్లో ఉ౦డే
-
0:28 - 0:32బౌద్ధమతస్తుల్లా ధర్మం ఇంకా అక్కడే ఉందనే విశ్వాసంతో దాన్ని శ్వాసిస్తూ,
-
0:32 - 0:35మానవశాస్త్రం వెలికితీసే కీలక ఘట్టాల్ని గుర్తిస్తూ
-
0:35 - 0:37మనం ప్రస్తుతం నివసిస్తున్న ఆధునిక ప్రపంచపు భావనల్లోని
-
0:38 - 0:40నమ్మకాల ఆధారంగా మనుగడసాగించలేదని తెలిసినా,
-
0:40 - 0:41కానీ ఇది వాస్తవరూపంలో ఉన్న ఒక నమూనాగా,
-
0:41 - 0:45ఒకేవిధమైన జీవన విధానాన్ని శతాబ్దాలతరబడి కొనసాగించడం మూలంగా
-
0:45 - 0:49మన వంశాలు పుట్టుక, ఎన్నో తరతరాల క్రింద ఏర్పడి౦ది.
-
0:50 - 0:54ఎలాగూ, మనం అలవాటైన అలవాట్లనే పంచుకుంటుంటాము.
-
0:54 - 0:56మనం ఇక్కడే జన్మించాము. మన వారసుల్ని ఈలోకంలోకి తీసుకొచ్చాము.
-
0:56 - 0:58మనం యవ్వనంలోకి వచ్చే సంస్కారాలను జరుపుకుంటాం.
-
0:58 - 1:00మరణ౦ మనల్ని ఎడబాటుకు గురిచేస్తు౦దని తెలిసికూడా
-
1:00 - 1:04హాయిగా పాటలుపాడుకు౦టాఒ, నృత్యం చేస్తాం,
-
1:04 - 1:06మనందరిలో ఇలా౦టి కళలున్నాయి.
-
1:06 - 1:09కానీ మనపాటల్లో ప్రత్యేకంగా ఉ౦డే తాళం
-
1:09 - 1:11ప్రతీ సంస్కృతికీ ప్రత్యేకమైనటువంటి నాట్యంలో ఉ౦డే రిధం ఆసక్తికర౦గా ఉ౦టాయి.
-
1:11 - 1:14అది బోర్నియో అడవుల్లో ఉన్న పెనన్ అయినా,
-
1:14 - 1:17లేదా హైతీ లోని వూడూ అకోలైట్స్ అయినా,
-
1:18 - 1:22వారు ఉత్తర కెన్యా కైసట్ ఎడారుల్లోని పోరాట యోధులైనా,
-
1:24 - 1:26అలాగే అండీస్ పర్వతశ్రేణుల్లోని కురాండెరోలైనా,
-
1:27 - 1:32లేదా సహారా మధ్యలోని కరవన్సెరాయ్ అయినా, ఎవరికి వారు ప్రత్యేకతను కలిగివు౦టారు.
-
1:32 - 1:34ఇతను కాకతాళీయ౦గా నాతో కలిసి ఒక నెల క్రిత౦
-
1:34 - 1:35ఎడారుల్లో ప్రయాణ౦ చేసిన వ్యక్తి,
-
1:35 - 1:38అతను వాస్తవ౦గా క్వోమోలాంగ్మా లోయల్లోని జడలబర్రెల మందను కాచే కాపరి
-
1:38 - 1:40ఎవరెస్ట్ శిఖర౦. ప్రప౦చానికి తల్లిలా౦టి దేవత.
-
1:40 - 1:43ఈ ప్రజలంతా తామొక విభిన్న శైలికి చెందినవారమని మనకు ప్రభోధిస్తారు,
-
1:43 - 1:44తమది మరో ఆలోచనా ధోరణి అనీ,
-
1:44 - 1:46భూమిపై మనయొక్క స్థానంపై మరోరకమైన దృష్టి అనీ గుర్తు చేస్తారు.
-
1:46 - 1:48ఒకవేళ మీరు దీని గూర్చి ఆలోచిస్తే, ఈ భావన,
-
1:48 - 1:50మీలో ఆశలను ని౦పుతు౦ది.
-
1:50 - 1:53ప్రస్తుతం, ప్రపంచంలోని అంతులేని సంస్కృతులన్నీ కలిసి
-
1:53 - 1:57ఆధ్యాత్మికమైన మరియు సాంస్కృతికమైన జీవనానికి సంబంధించిన వలయాన్ని తయారుచేసి
-
1:57 - 1:59దాన్ని ఈ గ్రహంచుట్టూ అల్లుకునేలా చేశాయి,
-
1:59 - 2:01ఇది మన గ్రహం యొక్క మనుగడకు ఎంతో ముఖ్యం
-
2:01 - 2:04మనం జీవావరణంగా వ్యవహరించే జీవన సంబంధమైన బయాలాజికల్ వెబ్ ఇది.
-
2:04 - 2:07మీరు దీన్ని జీవితంయొక్క కల్చరల్ వెబ్ గానూ భావించవచ్చు
-
2:07 - 2:08ఎందుకంటే ఇది సకల జాతుల సమ్మేళనం కాబట్టి
-
2:08 - 2:10మీరు ఈ జాతుల సమ్మేళనాన్ని వివరి౦చడానికి
-
2:10 - 2:13కొన్ని వేనవేల ఆలోచనలు మరియు స్వప్నాలు, మూఢ విశ్వాసాలు,
-
2:13 - 2:16భావనలు,ప్రేరణలు, వాస్తవరూపం దాల్చిన ఊహల రూపాలు వాడుకు౦టారు.
-
2:16 - 2:20మానవ ఊహాత్మక శక్తి చైతన్యం యొక్క వేకువ జామున వెల్లివిరిసిన భావనలు కూడా ఇ౦దులో ఉన్నాయి.
-
2:20 - 2:23ఈ ఎథ్నోస్పియర్ మానవాళికి ఒక గొప్ప పారంపరిక ఆస్తి
-
2:23 - 2:25ఇది మన౦దరి ఉనికికి గుర్తు
-
2:25 - 2:29అ౦తే కాదు ఆశ్చర్యకర౦గా మన౦ద౦ర౦ ఒక్కో ప్రత్యేక జాతికి చె౦దిన వారమని ఎథ్నోస్ఫియర్ చెబుతు౦ది.
-
2:30 - 2:33అలాగే తీవ్రంగా క్షయానికి గురైన జీవావరణం లాగే,
-
2:33 - 2:35ఈ ఎథ్నోస్పియర్ కూడా
-
2:35 - 2:37-- మరీ చెప్పాలంటే మరింత వేగవంతమైన రేటుతో క్షయానికి గురవుతోంది.
-
2:37 - 2:39ఏ ఒక్క జీవశాస్త్రవేత్తయినా, ధైర్యంగా
-
2:39 - 2:42మొత్త౦ జీవరాశిలో 50% పైగా జాతులన్నీ లేదా అంతకుపైగానే
-
2:42 - 2:44అంతర్ధాన దశకు చేరువలో ఉన్నాయని చెప్పగలడా? ఇది నిజం మాత్రమేకాదు,
-
2:44 - 2:46మరి౦త- దారుణమైన భవిష్యత్ చిత్రానికి గుర్తు
-
2:46 - 2:49జీవావరణం వైవిధ్యం యొక్క పరిధిని గమనిస్తే
-
2:49 - 2:52సాంస్కృతిక వైవిధ్యం పరిధికూడా, మన౦ అనుకు౦టున్న౦త
-
2:52 - 2:54ఆశావహ౦గా లేదు.
-
2:54 - 2:57దానికి మరో ప్రముఖమైన సూచిక, భాషలు ఉనికిని కోల్పోవడం.
-
2:57 - 3:00ఈ గదిలో ఉన్న మనందరిలో ఒక్కొక్కరూ పుట్టినపుడు,
-
3:00 - 3:03ఈ భూమిపైన అప్పుడు 6,000 లకు పైగా భాషలు మాట్లాడబడేవి.
-
3:03 - 3:06భాష అనేది ఆ భాషాజ్ఞానానికి సంబంధించిన దేహం మాత్రమే కాదు
-
3:06 - 3:08లేదా కొన్ని వ్యాకరణ సూత్రాల పట్టిక కాదు.
-
3:08 - 3:10భాష మానవ ఆత్మకు సంబంధించిన సంకేతం.
-
3:10 - 3:13ప్రతీ సంస్కృతికి సంబంధించిన ఆత్మ ఆ వాహకం ద్వారా నిరంతరం ప్రవహించి
-
3:13 - 3:14తద్వారా ఈ వాస్తవిక ప్రపంచంలోకి చేరుకుంటుంది.
-
3:14 - 3:17ప్రతీ భాష మానవ మెదడుయొక్క ఆపాత మధురాల అరణ్యం,
-
3:17 - 3:21ఒక నదీమూలం, ఒక భావన, ఆధ్యాత్మిక అవకాశాల యొక్క పర్యావరణం
-
3:21 - 3:25మరి ఆ 6,000 భాషల్లో, మనం ఇక్కడ మాంటిరేలో కూర్చున్నప్పుడు,
-
3:25 - 3:29సగానికి పైగా భాషలు చిన్నారుల శ్రవణాల్లోకి జాలువారడం మానేశాయి.
-
3:29 - 3:32ఆ భాషలను తమ వారసులకు నేర్పించబడడం లేదు,
-
3:32 - 3:34అంటే దానర్ధం, ఖచ్చితంగా, ఏదో మార్పు సంభవిస్తే తప్ప,
-
3:34 - 3:35అవి ఇప్పటికే నశించిపోయినట్లే.
-
3:35 - 3:39నిశ్శబ్దం యొక్క కరాళ కౌగిలిలో ఒంటరిగా ఉండడం కన్నా ఒంటరితనం ఏది,
-
3:39 - 3:41మీ భాషను ఉచ్చరించే వారిలో మీరే చివరివారిగా మిగిలిపోతే,
-
3:41 - 3:44మీ తాత ముత్తాతలు నేర్పిన విజ్ఞానాన్ని పంచే అవకాశం లేనప్పుడు
-
3:44 - 3:47మీ చిన్నారులు మీ భాషను భావితరాలకు అ౦దిస్తారని కలలుకనడ౦ సబబా?
-
3:47 - 3:50ఇంకా, భయానకమైన విధి ఏమిటంటే కొంతమంది దురదృష్టవశాత్తూ
-
3:50 - 3:52ఈ భూమ్మీద సుమారుగా ప్రతీ పక్షం రోజులకూ ఒకసారి,
-
3:52 - 3:54పక్షం రోజులకో కుటుంబంలోని చివరి పెద్ద మరణిస్తాడు కాబట్టి అతడు
-
3:54 - 3:56ప్రాచీన యుగానికి చెందిన భాషతో సహా.
-
3:56 - 3:58తనతో పాటు తన భాష యొక్క చివరిమూలాల్ని సమాధిలో కలిపేస్తాడు
-
3:58 - 4:00మీలో కొంతమందికి అనిపించవచ్చు, "దీనివల్ల కలిగే నష్ట౦ ఏ౦టని?"
-
4:00 - 4:01మనందరికి చెందిన ఈ ప్రపంచం మరింత సుందరంగా కనిపి౦చవచ్చు,
-
4:01 - 4:04ఒకవేళ మనమందరం ఒకే భాష మాట్లాడితే? అద్భుత౦గా ఉ౦టు౦ది కదూ,
-
4:04 - 4:07అలాగైతే మనం యోరుబా లేదా కాంటోనీస్ భాషను ఎన్నుకుందాం.
-
4:07 - 4:08లేద౦టే కోగి భాషను వాడదాం."
-
4:08 - 4:10మరి అప్పుడు వెంటనే మీకు గుర్తుకురావచ్చు మీరు ఇక
-
4:10 - 4:13మీ స్వంత భాషను మాట్లాడలేకపోవచ్చు అనే విషయం.
-
4:13 - 4:16అందుకే నేను మిమ్మల్ని ఈరోజు
-
4:16 - 4:20ఎథ్నోస్పియర్ యొక్క ప్రయాణానికి తీసుకెళ్ళదలిచాను --
-
4:20 - 4:22ఎథ్నోస్పియర్ గుండా చేసే ఈ చిన్న ప్రయాణం
-
4:22 - 4:26మనం ఏ౦ కోల్పోబోతున్నాం అనే సత్యాన్ని క్లుప్త౦గా వివరిస్తు౦ది.
-
4:27 - 4:34ఇప్పుడు, మనలో చాలా మంది నేను ఇ౦తకుము౦దు చెప్పిన
-
4:34 - 4:36" విభిన్నంగా జీవించడం ," అనే విషయాన్ని మరచిపోయి ఉ౦టారు.
-
4:36 - 4:38వివిధ రకాలుగా జీవించడం అనేది ఊహ కాదు, వాస్తవ౦.
-
4:39 - 4:44ఉదాహరణకు, ఆగ్నేయ అమేజాన్ ప్రాంతంలోని బరాసనా పిల్లల్నే తీసుకుందాం,
-
4:44 - 4:45అనకొండా ప్రజలుగా చెప్పబడే వీరు
-
4:45 - 4:47పురాతన విశ్వాసాల ఆధారంగా తాము క్షీర సముద్రం ద్వారా
-
4:47 - 4:50పవిత్రమైన సర్పాలయొక్క ఉదరంలోంచి తూర్పునుంచి వచ్చామనుకుంటారు.
-
4:50 - 4:53ఇప్పుడు, ఈ ప్రజలు స్పష్టంగా
-
4:53 - 4:55ఆకుపచ్చ రంగూ, నీలిరంగుకూ మధ్య తేడా కనుక్కోలేరు
-
4:55 - 4:57ఎ౦దుక౦టే, అక్కడ ఉ౦డే దట్టమైన అడవి స్వర్గపు అ౦చులను తాకుతూ
-
4:57 - 4:58నీలిర౦గు ఆకాశ౦ కూడా ఆకుపచ్చగా కనిపిస్తు౦ది.
-
4:58 - 5:00అక్కడి ప్రజలు ఆ ఆకుపచ్చని చెట్లమీదే ఆధారపడి ఉన్నారు.
-
5:00 - 5:03వారు ఆసక్తికరమైన భాష మరియు వివాహ పద్ధతి కలిగి ఉన్నారు
-
5:03 - 5:05దాన్ని భాషాపరమైన బహిర్వివాహంగా చెప్పవచ్చు:
-
5:05 - 5:08ఆ తెగవారు తప్పనిసరిగా మరో భాషను మాట్లాడేవారినే వివాహం చేసుకోవాలి.
-
5:08 - 5:10ఇవన్నీ వారి పురాణాలలోని గాథలతో ముడివడి ఉన్నాయి.
-
5:10 - 5:12ఈ తెగవారి పొడవైన ఇళ్లలోకి తొంగిచూస్తే
-
5:12 - 5:14ఆసక్తికరంగా ఒక కుటుంబంలోనే ఆరు లేదా ఏడు భాషలు మాట్లాడడం కనిపిస్తుంది
-
5:14 - 5:16భాషాంతర వివాహాలే ఇ౦దుకు కారణ౦,
-
5:16 - 5:19మీరు ఎవరూ భాషను మాట్లాడడం నేర్చుకోవడాన్ని చూసి ఉ౦డరు.
-
5:19 - 5:22వారు ఇతరులు మాట్లాడేదాన్ని విని మాట్లాడడం మొదలుపెడ్తారు.
-
5:22 - 5:24నేను కలుసుకున్న అత్యంత ఆసక్తికరమైన తెగల్లో,
-
5:24 - 5:28ఈశాన్య ఈక్వెడార్ లోని వోరానీ తెగ ఒకటి,
-
5:28 - 5:31వారు చాలా వి౦తగా ఉ౦డే మనుషులు, వీరిని నేను మొదటిసారి 1958 లో కలిశాను,
-
5:31 - 5:351957 లో ఐదు మిషనరీలు వీరిని కలిసేందుకు ప్రయత్నించాయి
-
5:35 - 5:36కాని ఆ క్రమ౦లో వారు ఒక ముఖ్యమైన పొరపాటుచేశారు.
-
5:36 - 5:37వాళ్లు ఆకాశంలోంచి విమానాల ద్వారా
-
5:37 - 5:39వాళ్ల యొక్క నిలువెత్తు చిత్రాలను జారవిడిచారు.
-
5:39 - 5:41మనం స్నేహపూర్వకంగా భావించే సంజ్ఞలతో,
-
5:41 - 5:43ఈ వర్షాధారపు అడవుల ప్రజలు తమను
-
5:43 - 5:46జీవితంలో ఎప్పుడూ తాము ప్రతిబింబాలుగా చూసుకొని ఉండరన్న వాస్తవాన్ని విస్మరించి, వారిని కలిసే ప్రయత్న౦ చేశారు.
-
5:46 - 5:48వారు అడవి ఉపరితలం నుంచి కి౦దికి జారిన ఆ ఫోటోలను తీసిచూసి,
-
5:48 - 5:51ఆ ముఖాల వెనుక దేహం కోసం వెతికి చూశారు ఎంతప్రయత్నించినా,
-
5:51 - 5:53వాటి వెనుక దేహాలేవీ కనిపించకపోయేసరికి అవి దెయ్యాలు పంపిన సంకేతాలుగా నిశ్చయించుకొని
-
5:53 - 5:56ఆ ఐదుగురు మిషనరీలనూ బల్లేలతో పొడిచి చంపేశారు.
-
5:57 - 5:59కానీ వోరానీలు బయటి వాళ్లను మాత్రమే కాదు.
-
5:59 - 6:00వాళ్లని వాళ్లే బల్లేలతో పొడిచి చంపుకుంటారు.
-
6:00 - 6:03వారిలో 54% మరణాలు ఒకళ్లనొకళ్లు చంపుకోవడం వల్లనే సంభవిస్తాయి.
-
6:03 - 6:06వాళ్ల వంశవృక్షాన్ని పరిశీలించి ఎనిమిది తరాలకు పూర్వానికి వెళ్లగా,
-
6:06 - 6:08అప్పుడు రెండు సందర్భాలలో మాత్రమే సహజ మరణాలు సంభవించాయి
-
6:08 - 6:10దాని గురించి అక్కడి ప్రజల్ని గుచ్చి గుచ్చి అడిగిన మీదట
-
6:10 - 6:12వారు చెప్పిందేమంటే వారిలో ఒక వ్యక్తి బాగా వయమీరడ౦ వల్ల
-
6:12 - 6:16చనిపోయేటట్లున్నాడట, అందుకే అతన్ని పొడిచి చంపేశాము. (నవ్వులు)
-
6:16 - 6:19కానీ వారికి అడవి గురించి గల విజ్ఞానం
-
6:19 - 6:20ఆత్యద్భుతమైనది.
-
6:20 - 6:23వాళ్ల వేటగాళ్లు జంతువుల మూత్రపు వాసనను 40 అడుగుల దూరం నుంచే గుర్తి౦చి
-
6:23 - 6:26అది ఏ జంతువుదో మీకు చెప్పగలరు.
-
6:26 - 6:2880 దశకంలోని తొలినాళ్లలో నన్నో విభ్రాంతికరమైన పని నిర్వహించాల్సిందిగా
-
6:28 - 6:30హార్వార్డ్ లోని మా ప్రొఫెసర్ కోరారు
-
6:30 - 6:32ఒకవేళ హైతీకి వెళ్ళేందుకు ఆసక్తి చూపినట్లితే,
-
6:33 - 6:35డ్యువాలియర్ ఫౌండేషన్ లో సభ్యులైన
-
6:35 - 6:37రహస్య సమాజాల్లోకి,
-
6:37 - 6:38మరియు టాంటన్ మకౌట్స్ లోకి ప్రవేశి౦చి
-
6:38 - 6:41జాంబీలను తయారుచేసేందుకు అవసరమైన విషాన్ని సేకరించడం నేను చేయాల్సిన పని.
-
6:41 - 6:44సెన్షేషన్ సృష్టించే ఈ పనిని చేసేము౦దు
-
6:44 - 6:47ఈ ఆశ్చర్యకరమైన నమ్మకాన్ని గురించి అర్ధం చేసుకోవాల్సి వచ్చింది
-
6:47 - 6:50ఆ క్రమ౦లో వొడౌన్, మరియు వూడూ అనేది చేతబడులు చేసే తెగ కాదని.
-
6:50 - 6:53నమ్మకానికి విరుద్ధంగా, ప్రపంచాన్ని సంక్లిష్ట తాత్విక దృష్టితో చూస్తే.
-
6:53 - 6:54అది చాలా ఆసక్తికరంగా ఉ౦టు౦ది.
-
6:54 - 6:55మిమ్మల్ని ప్రపంచంలోని గొప్ప మతాలేమిటి అని నేనడిగితే,
-
6:55 - 6:56మీరేం చెబుతారు?
-
6:56 - 6:59క్రిస్టియానిటీ, ఇస్లాం, బౌద్ధ మతం, జుడాయిజం ఇంకా ఏవో.
-
6:59 - 7:01అయినా ఇంకా ఎప్పటికీ ఒక ఖండం మాత్రం వదిలేస్తారు,
-
7:01 - 7:03సబ్ సహారా ఆఫ్రికాలో
-
7:03 - 7:05మత విశ్వాసాలు ఏమీ లేవని నమ్మక౦గా చెబుతారు. కానీ, అక్కడా ఉన్నాయి
-
7:05 - 7:07ఈ వూడూ తెగ సైతం మతాల లాగానే
-
7:08 - 7:09అదీ మత విశ్వాసాల ఆధారంగానే
-
7:09 - 7:12బానిసత్వయుగపు దీనావస్థల ఫలితంగా వచ్చింది.
-
7:12 - 7:14కానీ వూడూలను ఆసక్తికరంగా మార్చేదేమంటే
-
7:14 - 7:16చనిపోయినవారు మరియు జీవించి ఉన్న వారి మధ్య
-
7:16 - 7:17ఉ౦డే ప్రత్యక్ష సంబంధం
-
7:17 - 7:18అందుకే బ్రతికున్నవారు ఆత్మలకు జన్మ నిస్తారు.
-
7:18 - 7:21ఈ ఆత్మలు పాతాళ లోకాల్లోని ప్రవహించే నీటినుంచి బయటకు తీసుకురాబడతాయి,
-
7:21 - 7:23వారు చేసే నృత్యానికి ప్రతిస్పందించి
-
7:23 - 7:25తక్షణం బ్రతికి ఉన్న జీవులలోని ఆత్మ మార్చబడుతుంది
-
7:25 - 7:29ఆ క్షణంలో వచ్చే ప్రకాశవంతమైన వెలుగులో సామాన్యుడు భగవంతుడిగా మారుతాడు
-
7:29 - 7:31అందుకే వూడూలు మనని చూసి ఏమ౦టారో తెలుసా
-
7:31 - 7:34“ మీ తెల్ల జాతీయులు చర్చికి వెళ్లి భగవంతుడిని ప్రార్ధిస్తారు.
-
7:34 - 7:36మేం మాత్రం దేవాలయానికి వెళ్లి నృత్యం చేసి భగవంతుడిగా మారతాం.”
-
7:36 - 7:39మీరు వస్తు వ్యామోహం కలవారు కాబట్టి మీరు ఆత్మలచేత తీసుకొనిపోబడతారు,
-
7:39 - 7:40మీరు ఎలా శిక్షింపబడతారు?
-
7:40 - 7:43అందుకే మీరు ఈ ఆశ్చర్యకర రీతిలోని ప్రదర్శనలు చూస్తారు:
-
7:43 - 7:45వూడూ ప్రజలు ఒకరకమైన ట్రాన్స్ లో ఉన్నట్లుగా ఉంటారు
-
7:45 - 7:48మండే వస్తువులను కాగడాలను ఏ నొప్పీ గాయంలేకుండా ముట్టుకోవడం,
-
7:48 - 7:51మనోధైర్యం యొక్క ఒక అద్భుతమైన ప్రదర్శనగా భావించవచ్చు
-
7:51 - 7:52దాన్ని శరీరం తట్టుకోగలిగే విధంగా
-
7:52 - 7:55ఒక రకమైన పూనకం వంటి స్థితికి చేరతారు
-
7:56 - 7:58ఇప్పుడు, నేను కలుసుకున్నతెగల ప్రజలందరిలో,
-
7:58 - 8:00అతి ప్రత్యేకమైన వారు కోగి ప్రజలు
-
8:00 - 8:03వీరు ఉత్తర కాంబోడియా లోని సియెరా డీ శాంటా మార్టాకు చెందినవారు
-
8:03 - 8:06ప్రాచీనమైన టైరన్నస్ నాగరికతకు వారసులు
-
8:06 - 8:09ఈ నాగరికత ఒకప్పుడు కొలంబియాలోని కరీబియన్ తీరప్రాంతాలలో పరిఢవిల్లింది.
-
8:09 - 8:10దండయాత్రల ఫలితంగా,
-
8:10 - 8:13ఈ ప్రజలు ఏకాంతంగా ఉన్న అగ్నిపర్వత ప్రాంతాలకు పారిపోయారు
-
8:13 - 8:15అది కరీబియన్ తీరప్రాంతాల్ని బోసిపోయేలా చేసింది.
-
8:15 - 8:17ఈ రక్తసిక్తమైన ఖండంలో,
-
8:17 - 8:20కేవలం ఈ ప్రజల్ని మాత్రమే స్పానియన్లు జయించలేకపోయారు.
-
8:20 - 8:23ఈ రోజుకు కూడా, వారు మతగురువుల పరిపాలనలోనే ఉన్నారు.
-
8:23 - 8:25కానీ ఆ మతగురువు ఎంపిక వ్యవహారం మరియు శిక్షణ విలక్షణంగా ఉంటుంది
-
8:26 - 8:28పసివారినే వారి కుటుంబాలనుంచి తీసుకెళ్తారు.
-
8:28 - 8:30అదీ మూడు మరియు నాలుగు సంవత్సరాల పసి ప్రాయంలోనే,
-
8:30 - 8:32ఏకాంతంగా ప్రవాసంలోని చీకటి ప్రపంచంలో
-
8:32 - 8:36మంచుపర్వతాల సానువుల్లోని రాతి గుడిసెల్లో 18 సంవత్సరాలు వచ్చేవరకు ఇలా ఉంచుతారు
-
8:36 - 8:37ఈ కాలాన్ని రెండు తొమ్మిది సంవత్సరాల అర్ధభాగాలుగా చేసి
-
8:37 - 8:40కావాలనే తొమ్మిది నెలలుగా నిర్ణయించి గర్భధారణ వ్యవధిని అనుకరించడం జరుగుతుంది
-
8:40 - 8:42తమ తల్లి గర్భంలో తొమ్మిది నెలలు గడిపినట్లుగానే
-
8:42 - 8:45మరో గొప్ప మాత గర్భంలో మార్పు చెందడంకోసం గడుపుతారు.
-
8:45 - 8:46ఈ మొత్తం సమయంలో,
-
8:47 - 8:50వారి సమాజం యొక్క విలువలను నిలువెల్లా జీర్ణించుకుంటారు,
-
8:50 - 8:52వారి ప్రార్ధనల ద్వారా తీసుకురాబడిన విలువలను పరిరక్షించడం
-
8:52 - 8:55మరియు వారి ప్రార్ధనలు మాత్రమే విశ్వాన్ని రక్షిస్తాయి --
-
8:55 - 8:57దీనినే మనం పర్యావరణ- సమతుల్యతగా చెప్పుకోవచ్చు.
-
8:58 - 8:59ఈ విచిత్రమైన శిక్షణ తర్వాత,
-
8:59 - 9:01ఒకరోజు వారు అకస్మాత్తుగా బయటికితేబడతారు
-
9:01 - 9:04తమ జీవితంలో మొట్టమొదటిసారిగా, 18 సంవత్సరాల వయసులో,
-
9:04 - 9:08వారు సూర్యోదయాన్ని చూస్తారు. ఆ మధురమైన అవగాహనకలిగే క్షణంలో
-
9:08 - 9:11సూర్య భగవానుని లేత ప్రభాత కిరణాలు ఆ పల్లపు ప్రాంతాల్ని స్నానిస్తుంటాయి
-
9:11 - 9:12అటువంటి అద్భుతమైన ప్రకృతిదృశ్యమైన సూర్యోదయ వేళలో
-
9:13 - 9:15అకస్మాత్తుగా అప్పటివరకూ నేర్చుకున్న విద్య అంతా స్ఫురణకు వచ్చి
-
9:15 - 9:18దిగ్బ్రాంతిని కలుగజేస్తుంది. అప్పుడు మత గురవు అడుగు పెట్టి
-
9:18 - 9:20ఇలా అంటాడు, " ఇలా చూడండీ? నేను మీకు చెప్పిన సత్యం ఇదే.
-
9:20 - 9:23ఇది చూడండి ఎంత అందంగా ఉందో. దీన్ని రక్షించాల్సిన బాధ్యత మీదే."
-
9:23 - 9:25వాళ్లు తమని తాము పెద్దన్నలుగా పిలుచుకుంటారు
-
9:25 - 9:28సోదరులైన చిన్నవారే
-
9:28 - 9:31ఈ ప్రపంచం యొక్క వినాశనానికి కారణభూతులని వారి విశ్వాస౦.
-
9:32 - 9:34ఇప్పుడు, ఈ స్థాయిలోని సహజ జ్ఞానం చాలా ముఖ్యమైనదిగా మారుతుంది.
-
9:34 - 9:36ఎప్పుడైనా మనం స్వదేశీ ప్రజలు మరియు ప్రకృతి గురించి ఆలోచిస్తామో,
-
9:36 - 9:38మనం రూసోను తల్చుకోవడం గానీ
-
9:38 - 9:41లేదా ఒక పురాతన కట్టుకథను గానీ,
-
9:41 - 9:43లేదా జాత్యహంకార ధోరణితో
-
9:43 - 9:46మనం థోరోను గుర్తుకు తెచ్చుకొని,
-
9:46 - 9:48వీళ్లు మనకన్నా భూమికి మరింత దగ్గరి మిత్రులని చెప్తాము
-
9:48 - 9:50కానీ, స్వదేశానికి చెందిన ప్రజలు రాగబంధాలకు తోడుగా గానీ
-
9:50 - 9:52పాత జ్ఞాపకాలతో హీనంగా మారరు
-
9:52 - 9:54అక్కడ వేటికీ స్థానం లేదు అవి
-
9:54 - 9:56అస్మత్ కు చెందిన మలేరియా వ్రేళ్లయినా
-
9:56 - 9:59లేదా టిబెట్ కు చెందిన చల్లటి గాలులైనా, కానీ అవి, ఎలా ఉన్నా
-
9:59 - 10:03కాల పరిస్థితులకు అతీతంగా, భూమి యొక్క సంప్రదాయిక అంతరార్ధాన్ని నెలకొల్పాయి.
-
10:03 - 10:06అది తమ సహజ సిద్ధంగా దగ్గరగా ఉండాలన్న భావనతో కాకుండా,
-
10:06 - 10:08సహజ సిద్ధమైన సున్నిత జ్ఞానంతో:
-
10:08 - 10:11భూమి తనకు తానుగా మాత్రమే మనుగడ సాగించగలదనే ఆలోచన
-
10:12 - 10:14ఎందుకంటే అది మానవుల యొక్క జ్ఞానం వల్లనే ఊపిరి పీల్చుకోగలదు.
-
10:14 - 10:16ఇప్పుడు, దానికి అర్ధమేమిటి?
-
10:16 - 10:18దాని అర్ధం అండీస్ లోని ఒక చిన్న పిల్లాడు
-
10:18 - 10:20ఎవరైతే ఆ పర్వతాలు అపూ ఆత్మలని భావిస్తూ పెరుగుతాడో
-
10:20 - 10:22అది అతని లేదా ఆమె అదృష్టాన్ని నిర్ణయిస్తుంది
-
10:22 - 10:25అది వారిని విభిన్నమైన వారిగా చేస్తుంది
-
10:25 - 10:28వారి వనరులతో వారికి విభిన్నమైన సంబంధాన్ని కలుగజేస్తుంది
-
10:28 - 10:30లెదా అదే స్థానంలో మోంటానాలోని ఒక చిన్న పిల్లాణ్ని తీసుకుంటే
-
10:30 - 10:33ఆ పర్వతం ఒక రాతి కట్టడం అని భావిస్తూ పెరగడం వల్ల
-
10:33 - 10:34దాన్ని తవ్వితీసేందుకు సిద్ధపడ్తాడు.
-
10:34 - 10:38అది ఆత్మ యొక్క సమున్నత శిఖరమైనా లేక కుప్పగా పోసిన ఖనిజమైనా మనకనవసరం.
-
10:38 - 10:41మనకు ఆసక్తి కలిగించేదేమంటే ఈ సంబంధాన్ని నిర్ణయించే తాత్వికత
-
10:41 - 10:43ప్రపంచ ప్రకృతికీ మరియు వ్యక్తికీ మధ్య ఉ౦టు౦ది.
-
10:43 - 10:45నేను బ్రిటీష్ కొలంబియాలోని అడవుల్లో జన్మి౦చాను.
-
10:45 - 10:47ఈ అరణ్యాలు నరకడానికి మాత్రమే ఉన్నాయని నమ్ముతూ పెరిగాను.
-
10:47 - 10:49ఆ నమ్మకం నన్ను నా స్నేహితుల క౦టే ప్రత్యేకమైన వ్యక్తిగా చేసి౦ది.
-
10:49 - 10:51క్వాకిటుల్ లోని వారు
-
10:51 - 10:53ఈ అరణ్యాలు హుకుక్ యొక్క నివాస స్థానాలు గా,
-
10:53 - 10:54స్వర్గం యొక్క కుటిలమైన పక్షి ముక్కు గా
-
10:54 - 10:57మరియు నరమాంస భక్షకుల ఆత్మలు ప్రపంచం యొక్క ఉత్తర చివర్లలో నివసిస్తాయనీ నమ్మి
-
10:57 - 11:01వాటిని వారు హమత్సా ఉత్సవం సమయంలో ఆవాహనం చేస్తారు.
-
11:01 - 11:03ఇప్పుడు, మీరు ఈ ఐడియా ప్రకారం చూసినట్లయితే
-
11:03 - 11:05ఈ సంస్కృతి భిన్నమైన వాస్తవాలను తెలియజేస్తుంది,
-
11:05 - 11:06వారి యొక్క కొన్ని విపరీతమైన ఆవిష్కారాల్ని
-
11:06 - 11:11మీరు అర్ధం చెసుకోవడం మొదలుపెడ్తారు. ఈ మొక్కనే తీసుకోండి.
-
11:11 - 11:13ఆగ్నేయ అమేజాన్ లో గత ఏప్రిల్లో తీసిన ఫోటో ఇది
-
11:13 - 11:16ఇది అయాహువాస్కా, మీలో చాలా మంది వినే ఉంటారు
-
11:16 - 11:19అత్యంత శక్తి వంతమైన మనోచాంచల్యపు తయారీ గురి౦చి
-
11:19 - 11:21ఇది మంత్రగాళ్లకు నెలవు.
-
11:21 - 11:23అయాహువాస్కాను ఆసక్తికరంగా చేసేదేమిటంటే
-
11:23 - 11:27ఈ తయారీలోని శక్తియుక్తులుగానీ పదార్ధాలుగానీ కాదు,
-
11:27 - 11:31కానీ దీనికి ఆపాదించబడిన అంశం.దీన్ని రెండు విభిన్న వనరులతో తయారుచేస్తారు.
-
11:31 - 11:33ఒక వైపేమో, వుడీ లియానా ఉ౦టు౦ది
-
11:33 - 11:35అందులో బీటా- కార్బోలైన్స్
-
11:35 - 11:38హార్మైన్, హార్మోలిన్, మైల్డ్ గా ఉన్న హాలుసినోజెనిక్ ఉంటాయి.
-
11:38 - 11:40ఒక్క వైన్ తీయడానికి మాత్రమే
-
11:40 - 11:42కేవలం నీలిరంగులోని తెరలుగా వచ్చే పొగ
-
11:42 - 11:44మీ మనసులోకి వస్తుంది,
-
11:44 - 11:47దీన్ని కాఫీ కుటుంబానికి చెందిన ఆకుల తుప్పలతో కలిపితే
-
11:47 - 11:49దాన్ని సైకోట్రియా విరిడిస్ అంటారు.
-
11:49 - 11:52ఈ మొక్కలో చాలా శక్తివంతమైన కొన్ని ట్రిప్టమైన్స్,
-
11:52 - 11:56బ్రెయిన్ సెరోటోనిన్ కు దగ్గరైన, డైమీథేల్ ట్రిప్టమైన్ - 5,
-
11:56 - 11:57మీథాక్సీడైమీథేల్ ట్రిప్టమైన్ ఉన్నాయి.
-
11:57 - 11:59మీరెప్పుడైనా యానోమామీలను చూశారా
-
11:59 - 12:01వారి ముక్కులద్వారా వెలిగిస్తూ ఉంటారు,
-
12:01 - 12:04ఆ పదార్ధాన్ని విభిన్న జాతికి చెందిన వాటి ద్వారా తయారుచేస్తారు
-
12:04 - 12:08ఇ౦దులో మీథాక్సీడైమీథేల్ ట్రిప్టమైన్ కూడా ఉంటుంది.
-
12:08 - 12:10ఆ పౌడర్ ను మీ ముక్కు దగ్గరపెట్టుకొని పీల్చినట్లయితే
-
12:10 - 12:14అది తుపాకీ గొట్టం దగ్గరనుంచి కాల్చగా బయటికి వచ్చినట్లుంటుంది
-
12:14 - 12:21దాంతో పాటు బారోక్ పెయింటింగ్ లతో కలిపి విద్యుత్ సముద్రంలో పడిపోయినట్లుంటుంది. ( నవ్వులు)
-
12:21 - 12:23ఇది వాస్తవాన్ని వక్రీకరించి తయారు చేయదు
-
12:23 - 12:24ఇది వాస్తవాన్ని కరిగించి తయారు చేస్తుంది.
-
12:24 - 12:27వాస్తవానికి, నేను నా ప్రొఫెసర్ రిచర్డ్ ఇవాన్ షుల్ట్స్ తో
-
12:27 - 12:29మ్యాజిక్ పుట్టగొడుగుల ఆవిష్కరణతో 1930 ల ప్రాంతంలో మెక్సికోలో
-
12:29 - 12:31సైకెడెలిక్ యుగానికి ఆద్యంపోసిన వ్యక్తి గురి౦చి
-
12:31 - 12:33తీవ్ర౦గా వాది౦చే వాడిని.
-
12:33 - 12:35మీరు ఈ ట్రిప్టమైన్స్ ను కూడా వాటి గాటనకట్టకూడదు అని నేను వాదించేవాణ్ణి
-
12:35 - 12:38ఎందుకంటే ఆ సమయంలో వారు హెలూసినోజెనిక్ ప్రభావంతో ఉంటారు కాబట్టి.
-
12:38 - 12:42ఇప్పుడు ఎవరూ హేలూసినేషన్ ప్రభావానికి లోనవడానికి ఇష్టపడరనుకోండి.(నవ్వులు)
-
12:42 - 12:45కానీ ట్రిప్టమైన్స్ ఎవరూ నోటిద్వారా గా తీసుకోలేరు
-
12:45 - 12:47ఎందుకంటే అవి ఎంజైమ్ కారణంగా మారిపోతాయి
-
12:47 - 12:50సహజంగానే మానవ శరీరంలో ఇది కనిపిస్తుంది, దీన్ని మోనోఅమైన్ ఆక్సిడేస్ అంటారు.
-
12:50 - 12:53వీటిని నోటిద్వారా కాకు౦డా
-
12:53 - 12:56MAO ద్వారా డీనేచర్ చేయబడిన ఇతర రసాయనాలతో కలిపి మాత్రమే తీసుకుంటారు
-
12:56 - 12:57ఇప్పుడు, మరి కొన్ని ఆసక్తికర అంశాలు చూద్దా౦
-
12:57 - 13:01అవి లియానా లో ఉన్న బీటా- కార్బోలైన్స్,
-
13:01 - 13:04ప్రత్యేకరకమైన MAO ఇన్హిబిటర్లు
-
13:05 - 13:08ట్రిప్టమైన్ పొటెన్షియేట్ చేయడానికి వాడతారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి.
-
13:08 - 13:1280,000 జాతులున్న వస్కులార్ మొక్కల లోంచి
-
13:12 - 13:16పరస్పర విరుద్ధ౦గా రూపాంతరం చెందిన మొక్కల్ని ఈ ప్రజలు ఎలా కనుగొన్నారు
-
13:16 - 13:17దానిని ఈ విధంగా కంబైన్డ్ చేసినపుడు,
-
13:17 - 13:19ఒక విధమైన బయోకెమికల్ వెర్షన్ ను తయారుచేశాయి
-
13:19 - 13:21ఇందులో జలిపిన్ అన్ని భాగాలు మొత్త౦ పదార్థాన్ని గొప్పగా తయారు చేశాయి.
-
13:21 - 13:24అలాగే, ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునే వైద్య౦ తప్పొప్పుల పద్ధతిలో,
-
13:24 - 13:25అర్ధరహితంగా అనిపించే విధ౦గా ఉ౦ది.
-
13:26 - 13:29కానీ మీరు ఇండియన్స్ ని అడిగినట్లయితే, వాళ్లు"మొక్కలు మాతో మాట్లాడుతాయంటారు."
-
13:29 - 13:30దాని అర్ధం ఏమిటి?
-
13:30 - 13:34ఇది కోఫన్. ఇ౦దులో 17 రకాలైన అయాహువాస్కాలున్నాయి,
-
13:34 - 13:37అన్నింటినీ అడవిలో ఎంతోదూరం నుంచే గుర్తుపట్టగలుగుతారు,
-
13:38 - 13:42కానీ అవి అన్నీ మనకంటికి ఒకే జాతికి చెందినవాటిలా అనిపిస్తాయి.
-
13:42 - 13:44అప్పుడు మీరు వాళ్లని వారి టాక్సానమీని ఎలా నిర్ణయిస్తారని అడిగితే
-
13:44 - 13:47"మీకు మొక్కలగూర్చి కొంతతెలుసు అనుకున్నాం అని వాళ్లు చెప్తారు.
-
13:47 - 13:49దాని అర్ధ౦ మీకు ఏమీ తెలియదా? అని అడిగితే నేను "తెలియదు" అన్నాను.
-
13:49 - 13:52అలాగా, అయితే మీరు ఆ 17 వెరైటీల మొక్కల్ని తీసుకొని ఒక్కో మొక్కను
-
13:52 - 13:55పౌర్ణమి రాత్రిలో వేరుచేసి వేర్వేరు గుర్తులు పెడుతూ పొండి.
-
13:55 - 13:57ఇలా చేయడ౦ వల్ల మీకు హార్వార్డ్ లో పీహెచ్డీ రాకపోవచ్చు,
-
13:57 - 14:01కానీ అది స్టేమెన్స్ను లెక్కపెట్టడం కన్నా మరింత ఆసక్తిని కలిగిస్తుంది.
-
14:01 - 14:02ఇప్పుడు,
-
14:02 - 14:05చప్పట్లు
-
14:05 - 14:07మనందరికీ కూడా ఉన్న సమస్యేమిటంటే
-
14:07 - 14:09స్వదేశీ తెగల ప్రజల బతుకుల పట్ల దయచూపిస్తుంటాం
-
14:09 - 14:10వారిని పాతకాలపు వాళ్లలా మరియు రంగురంగుల వారిగా చూస్తాం
-
14:10 - 14:12వారిని చరిత్ర పుటలకే పరిమిత౦ చేస్తా౦
-
14:12 - 14:15ఇదే వాస్తవ ప్రపంచం అని, మన లోకం ము౦దుకు నడుస్తూనే ఉంటుంది.
-
14:15 - 14:17నిజానికి 20వ శతాబ్ధాన్ని 300 సంవత్సరాల ము౦దుకు తీసుకు వెళితే
-
14:17 - 14:20అప్పుడు యుద్దాల గురి౦చి
-
14:20 - 14:21సాంకేతిక ఆవిష్కరణల గురి౦చి కాకు౦డా
-
14:21 - 14:23జీవ సంబంధ మరియు సాంస్కృతిక వైవిధ్యాలను పెద్దపెట్టున నాశనం చేసుకున్న
-
14:24 - 14:26ఒక యుగం లాగా
-
14:26 - 14:29ప్రత్యక్ష౦గా లేదె పరోక్ష౦గా ఒప్పుకున్నట్టే
-
14:29 - 14:32అలా చేసిన౦త మాత్రాన ఈ గ్రహ౦ మీదున్న సమస్య మారదు
-
14:32 - 14:34సంస్కృతులన్నీ కూడా ఎప్పుడూ
-
14:34 - 14:37స్థిరంగా ఒక నృత్యంలోని భ౦గిమల లాగా
-
14:37 - 14:38కొత్త జీవితావకాశాలతో ముడిపడి ఉ౦టాయి.
-
14:39 - 14:41సమస్య సాంకేతికతకి స౦భ౦ది౦చి౦ది మాత్రం కాదు.
-
14:42 - 14:44సియాక్స్ ఇండియన్లు విల్లంబులు వదిలిపెట్టినంత మాత్రాన
-
14:44 - 14:45సియాక్స్ ఇండియన్లు కాకపోరు
-
14:45 - 14:47అలాగే అమెరికన్ కూడా గుర్రం మరియు బగ్గీని వదిలిపెట్టినంత మాత్రం చేతనే
-
14:47 - 14:49అమెరికన్ కాకుండా పోడు.
-
14:49 - 14:50మార్పు లేదా టెక్నాలజీ కాని
-
14:50 - 14:54ఎథ్నోస్పియర్ యొక్క సమగ్రతను దెబ్బతీయవు.
-
14:54 - 14:56అధికార౦, శక్తి; ఆధిపత్య ధోరణి యొక్క క్రూరమైన ముఖం.
-
14:56 - 14:58ఎప్పుడు మీరు ప్రపంచం చుట్టూ చుసినా,
-
14:58 - 15:01ఈ సంస్కృతులన్నీ నశించిపోవాల్సినవి కావని మీరు కనుక్కొంటారు.
-
15:01 - 15:03వీరంతా క్రియాశీలంగా ప్రాణంతో ఉన్న ప్రజలు
-
15:03 - 15:06వీరు గుర్తింపబడిన శక్తుల కారణంగా
-
15:06 - 15:08తమ సామర్ధ్యానికి మించి సంస్కృతీకరణం చెందలేక మనుగడను కోల్పోయినవారు.
-
15:08 - 15:10ఇది పెనన్ ల యొక్క స్వంత ప్రదేశంలో
-
15:11 - 15:13అంతులేని అడవుల నరికివేత్ గావచ్చు.
-
15:13 - 15:16ఆగ్నేయాసియాలోని సరవాక్ సంచార తెగలకు చెందిన
-
15:16 - 15:20ప్రజలు ఇ౦తకు ము౦దు అడవులలో స్వేచ్చగా తిరుగాడే వారు.
-
15:20 - 15:23వారు ఇప్పుడు నదీ తీరాలప్రదేశాలలో
-
15:23 - 15:25బానిసలుగా మరియు వేశ్యావృత్తికి దిగజారవలిసి వచ్చింది.
-
15:25 - 15:29ఇక్కద నదీతీరం మేటవేసి మట్టితో నిండిపోవడం గమని౦చ౦డి
-
15:29 - 15:31అది బోర్నియోలను
-
15:31 - 15:32నదిను౦చి కొట్టుకు వచ్చే దు౦గలను సేకరి౦చే జపాన్ ఓడలు౦డే
-
15:32 - 15:34దక్షిణ చైనా సముద్ర ప్రా౦త౦లోకి
-
15:34 - 15:38బలవ౦తగా వెళ్ళేలా చేస్తో౦ది.
-
15:38 - 15:39లేదా మనం యానోమామీ కేసును తీసుకు౦దా౦
-
15:39 - 15:41ఇక్కడ బంగారపు నిల్వలను కనుగొన్న కారణంగా.
-
15:41 - 15:43వ్యాధిగ్రస్తమైన వస్తువులు ప్రవేశించాయి
-
15:43 - 15:45లేదా మనం టిబెట్ పర్వత ప్రాంతాలకు వెళ్ళినాసరే,
-
15:45 - 15:47ఇటీవల నేను పరిశోధనలను జరుపుతున్న ప్రా౦త౦లో
-
15:48 - 15:51మీరు రాజకీయ ఆధిపత్యాల క్రూరత్వాన్ని గమనించవచ్చు.
-
15:51 - 15:53నరమేధం అ౦టే ప్రజల్ని భౌతికంగా నాశనం చేయడం అని మీకు తెలుసు,
-
15:53 - 15:55నరమేథాన్ని ప్రపంచవ్యాప్తంగా అ౦దరూ ఖండిస్తున్నారు, కానీ
-
15:56 - 15:59ప్రజలయొక్క జీవన విధానాన్ని నాశనం చేసే ఎథ్నోసైడ్ను ఎవరూ ఖండించడమే లేదు, సరికదా
-
15:59 - 16:02విశ్వ వ్యాప్తంగా- చాలా ప్రదేశాలలో- ఎథ్నోసైడ్ ను ఒక ఉత్సవంగా జరుపుకు౦టున్నారు
-
16:02 - 16:04ఇలా చేయడాన్ని అభివృద్ధి చర్యలలో భాగంగా్ భావిస్తున్నారు.
-
16:04 - 16:07మీకు టిబెట్ యొక్క బాధ అర్ధం కాదు
-
16:07 - 16:09మీరు దానియొక్క మూలాలకు వెళ్ళిచూస్తే తప్ప.
-
16:09 - 16:13నేను ఒకసారి పశ్చిమ చైనాలోని చెంగ్డునుంచి 6,000 మైళ్లు ప్రయాణించాను
-
16:13 - 16:16ఆగ్నేయ టిబెట్ నుంచి లాసా వరకు నా యాత్ర నే్ల మీదే సాగి౦ది
-
16:16 - 16:20ఒక యువకుడైన మిత్రుడితో నా ప్రయాణ౦ సాగి౦ది, కానీ లాసాకు చేరుకున్నాకే
-
16:20 - 16:23నేను బయటకు కనిపి౦చే గణా౦కాల వెనకున్న
-
16:23 - 16:24టిబెట్ అసలు రూపాన్నిఅప్పుడే తెలుసుకున్నాను.
-
16:24 - 16:28అక్కడ 6000 పవిత్ర కట్టడాలను పడగొట్టి దుమ్ము మరియు బూడిదగా మార్చారు.
-
16:28 - 16:31సాంస్కృతిక విప్లవ సమయంలో.
-
16:31 - 16:32కేడర్లు 1.2 మిలియన్ల మంది టిబెటన్లను చ౦పివేశారు.
-
16:33 - 16:35ఈ యువకుడి తండ్రిని పంచన్ లామాకు జతచేశారు.
-
16:35 - 16:37దాని అర్ధం అతను అక్కడికక్కడే చంపించబడ్డాడు
-
16:37 - 16:39ఇది చైనా దాడి సమయంలో జరిగి౦ది.
-
16:39 - 16:41ఆ సమయంలో అతని మామ బౌద్ధమతస్తులతో కలసి
-
16:41 - 16:44నేపాల్ కు పారిపోయాడు.
-
16:44 - 16:46అతని తల్లిని బాగా ధనవ౦తురాలన్న కారణ౦తో
-
16:46 - 16:48జైలుపాలు చేశారు.
-
16:49 - 16:51ఆ అబ్బాయి రెండు సంవత్సరాలప్రాయంలో జైల్లోకి దొంగతనంగా చేర్చబడ్డాడు
-
16:51 - 16:53అతని తల్లి తన దుస్తులక్రింద కప్పిపెట్టి తీసుకెళ్ళింది
-
16:53 - 16:55పాప౦ ఆమె అతన్ని విడిచి ఉండలేక అ౦తటి సాహస౦ చేసి౦ది.
-
16:55 - 16:57ఈ సాహస౦లో సహకరి౦చిన౦దుకు అతని సోదరిని
-
16:57 - 16:58ఎడ్యుకేషన్ క్యాంపులో పెట్టారు.
-
16:58 - 17:00ఒకరోజు ఆమె అనుకోకుండా మావోకు చె౦దిన ఆర్మ్ బ్యా౦డ్ మీద కాలు పెట్టి౦ది
-
17:01 - 17:03ఆ నేరానికి
-
17:03 - 17:06ఆమెకు ఏడేళ్ల కఠిన శిక్ష విధించారు.
-
17:06 - 17:09టిబెట్ ప్రజల బాధ భరింప శక్యం కానిది,
-
17:09 - 17:12కానీ, ఎప్పటికైనా తమకు స్వేఛ్చ లభిస్తు౦దనే ఆశతో వారు బాధలు భరిస్తున్నారు.
-
17:13 - 17:16కానీ చివరికి వచ్చేసరికి, ఏదో ఒక చాయిస్ ను ఎంపికచేసుకోవాల్సిఉంటుంది.
-
17:16 - 17:19మనం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే ఏకధృవ ప్రపంచం లో నివసించాలా
-
17:19 - 17:22లేదా బహుళ ధృవంలోని వైవిధ్యమైన ప్రపంచాన్ని కోరుకోవాలా?
-
17:22 - 17:25గొప్ప మానవశాస్త్రవేత్త అయిన మార్గరెట్ మీడ్ చనిపోయే ముందుగా ఒకసారి ఇలా అన్నారు
-
17:25 - 17:28ఆవిడ యొక్క పెద్ద భయం ఏమిటంటే మనం
-
17:28 - 17:30సంకుచితమైన ప్రాపంచిక దృక్పధంలోకి దారిమళ్ళుతున్నకొద్దీ
-
17:30 - 17:35మొత్తం ప్రపంచాన్నీ ఈ దృక్కోణంతో నే చూడడమే కాకుండా
-
17:35 - 17:39మనం కూడా సంకుచితమైన అదే ఆలోచనా విధానంలోకి మారతాం,
-
17:39 - 17:40అయితే మనం ఏదో ఒకరోజు ఈ స్వప్నం నించి బయటికి వచ్చి
-
17:40 - 17:43ఇక్కడ మరికొన్ని అవకాశాలుకూడా ఉన్నాయని గుర్తిస్తా౦.
-
17:44 - 17:47మన జాతి పుట్టి, దాదాపు ఇప్పటికి
-
17:47 - 17:49600,000 సంవత్సరాలకు పైగా అయిందని మన౦ గుర్తుచేసుకొవాలి.
-
17:49 - 17:52కొత్తరాతి యుగ౦లో మన౦ వ్యవసాయాన్ని నేర్చుకున్నా౦,
-
17:52 - 17:54అ౦తకుము౦దే మన౦ మత౦ అనే మత్తుమ౦దుకు లొంగిపోయాము,
-
17:54 - 17:56మధురమైన కవిత్వం
-
17:56 - 17:57మత గురువుల గద్య బోధనలతో ని౦డిపోయి౦ది
-
17:57 - 18:00మన ప్రత్యేక తరహా అధికార పదవుల నిచ్చెనను ఏర్పాటు చేసుకున్నా౦
-
18:00 - 18:02అయితే ఇవన్నీ కేవలం 10,000 సంవత్సరాల క్రితం ను౦చి మాత్రమే జరిగాయి.
-
18:02 - 18:04మనకు తెలిసిన ఆధునిక పారిశ్రామిక ప్రపంచం
-
18:04 - 18:06వయసు కేవలం 300 సంవత్సరాలు మాత్రమే.
-
18:06 - 18:08ఇప్పడు, ఈ నిన్నమొన్నటి చరిత్ర ద్వారా
-
18:08 - 18:11వచ్చే సహస్రాబ్దిలో మనకు ఎదురయ్యే సవాళ్ళన్నిటినీ
-
18:11 - 18:13సమర్థ౦గా ఎదుర్కొనే సామర్థ్య౦ ఉ౦దని నేను భావి౦చడ౦ లేదు.
-
18:13 - 18:15వేనవేల సంవత్సరాల ప్రపంచంలోని ఈ నాగరికతలన్నింటినీ
-
18:15 - 18:18మానవుడిగా ఉండడం అంటే ఏమిటని అడిగితే,
-
18:18 - 18:20అవి 10,000 విభిన్న గొంతుకలతో జవాబిచ్చాయి.
-
18:20 - 18:26ఆ పాటతోనే మన అస్తిత్వాన్ని
-
18:26 - 18:29తిరిగి తెలుసుకునే అవకాశ౦ ఉ౦ది: మనది ఒక పూర్తి స్పృహ గల జాతి అని,
-
18:29 - 18:32ఇక్కడున్న ప్రజలందరూ మరియు పూలతోటలన్నీ పూర్తి అవగాహనతో
-
18:32 - 18:38వికసిల్లే మార్గం కనుక్కొంటాయి. అప్పుడు మనలో ఎంతో ఆశావహ దృక్పధం కనిపిస్తు౦ది.
-
18:38 - 18:41ఈ ఫోటోగ్రాఫ్ నేను బాఫిన్ ఐలాండ్ లోని ఉత్తర ప్రాంతంలో తీసింది
-
18:41 - 18:43నేను కొంతమంది ఇన్యూట్ ప్రజలతో నార్వాల్ వేటకు వెళ్ళినప్పుడు తీసింది,
-
18:44 - 18:47ఇక్కడున్న మనిషి పేరు ఓలయా, అతను వాళ్ళ తాతగారి గురించి ఒక అద్భుతమైన కధ చెప్పారు.
-
18:48 - 18:50కెనడా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఈ ఇన్యూట్ ప్రజలతో సహనంతో ఉండేది కాదట
-
18:50 - 18:521950 ల ప్రాంతంలో,
-
18:52 - 18:55వారి యొక్క సార్వభౌమత్వాన్ని స్థిరపరచుకునేందుకు, వాళ్లందరినీ శరణార్ధ శిబిరాలకు బలవంతంగా పంపారట
-
18:55 - 18:59ఈ ముసలాయన తాతగారు దానికి అంగీకరించలేదు.
-
18:59 - 19:03అతని కుటుంబం, ఇతని ప్రాణాల కోసం, అతని ఆయుధాలను
-
19:03 - 19:04అతని పనిముట్లను కూడా దాచి పెట్టారు.
-
19:05 - 19:07ఈ ఇన్యూట్లు చలిని లెఖ్ఖ చేయరు;
-
19:07 - 19:08దాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకున్నారు
-
19:08 - 19:11వీళ్ల బండ్లయొక్క చక్రాలు చేపలతో తయారౌతాయి
-
19:11 - 19:12వాటిని కారీబు చర్మంతో చుడతారు.
-
19:12 - 19:17కాబట్టి ఈయన తాతగారు ఆర్కిటిక్ మంచుకు ఏమాత్రం బెదరలేదు
-
19:17 - 19:19అలాగే తరచుగా వచ్ఛే మంచుతుఫాన్లకు కూడా.
-
19:19 - 19:22అతను మామూలు గానే బయటికి వచ్చి, తన సీల్ చర్మంతో చేసిన ట్రౌజరును ధరి౦చాడు.
-
19:23 - 19:26మలాన్ని చేతిలోకి విసర్జించుకొన్నాడు. అది తొందర్లోనే గడ్డకట్టడం మొదలుపెట్టింది,
-
19:26 - 19:29దాన్ని కొంత సమయానికి పదునైన కత్తి ఆకార౦లోకి తయారు చేశాడు.
-
19:29 - 19:31అతడు షిట్ నైఫ్ చివర్లో ఉమ్మిని వేసాడు
-
19:31 - 19:34అది బాగా గట్టిగా మారిన తర్వాత, దాంతో ఒక కుక్కను పొడిచి చంపాడు.
-
19:34 - 19:37ఆ కుక్క చర్మాన్ని వలిచి దానిని ఒక కవచములాగా తయారుచేసి,
-
19:37 - 19:40కుక్కయొక్క పక్కటెముకలను తీసి మంచు బండిని మరింత బాగా తయారు చేశాడు,
-
19:41 - 19:42పక్కనున్న మరోకుక్కకు కూడా కవచము తయారుచేసి,
-
19:42 - 19:46బెల్టులో షిట్ నైఫ్ దోపుకొని మంచు కొండలలోకి మాయమయ్యాడు.
-
19:46 - 19:50ఈ కథ పేరు ’ఏమీ లేకుండా బయటికి వెళ్ళడం" (నవ్వులు)
-
19:50 - 19:51ఇలా౦టి ఎన్నో ఉద౦తాలు
-
19:51 - 19:53(చప్పట్లు)
-
19:53 - 19:55ఇన్యూట్ ప్రజల యొక్క మొక్కవోని ధైర్యానికి మచ్చుతునకలుగా నిలుస్తాయి,
-
19:55 - 19:58అలాగే ప్రపంచంలోని వివిధ తెగల ప్రజలు కూడా ఇలా౦టి వైవిధ్యాలు కలిగిఉన్నారు.
-
19:58 - 20:001999 ఏప్రిల్లో కెనడా ప్రభుత్వము
-
20:00 - 20:03ఇన్యూట్ తెగల ప్రా౦త౦పై నియంత్రణను వారికి తిరిగి ఇచ్చేసింది
-
20:03 - 20:06ఈ భూభాగము దాదాపు కాలిఫోర్నియా మరియు టెక్సాస్ లను కలిపిన దానికంటే ఎక్కువే.
-
20:06 - 20:08ఇది ఇప్పుడు మన స్వంత దేశం. దీని పేరు నునావట్.
-
20:09 - 20:12ఇది ఒక స్వతంత్ర్య సామ్రాజ్యం. అన్ని ఖనిజవనరులపై వారికి నియంత్రణాధికారం ఉంది,
-
20:12 - 20:14ఒక జాతీయ -ప్రభుత్వ౦ తన ప్రజలు లోల్పోయిన హక్కులను
-
20:14 - 20:18వారికి కల్పి౦చడ౦లో తీసుకునే శ్రద్ధకు నునావత్ మ౦చి ఉదాహరణ.
-
20:19 - 20:22మరి చివరికి, కనీస౦ ఈ మాటలు చెప్పడ౦ తప్పనిసరి అని నేను అనుకుంటాను
-
20:22 - 20:23ఇప్పటి వరకు మన౦ ప్రయాణ౦ చెసిన
-
20:23 - 20:25ఈ గ్రహం లోని మారుమూల ప్రాంతాలు
-
20:27 - 20:28ఇ౦కా చీకటిలోనే ఉ౦డిపోవని మన౦ అర్థ౦చేసుకోవాలి.
-
20:28 - 20:30ఆ ప్రా౦తాలు అక్కడి ప్రజల ఆవాసాలు
-
20:30 - 20:32అవి మనిషి ఊహాత్మకశక్తి శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తు
-
20:32 - 20:36మానవజాతి పుట్టుక మూలాలకు తీసుకు వెళతాయి. మనమందరం
-
20:36 - 20:39ఈ చిన్నారుల స్వప్నాలు, మన స్వంత పిల్లల కన్న కలలే అనుకుంటూ
-
20:39 - 20:42ఈ భూమ౦డల౦లో భాగస్వాముల మవుదాం.
-
20:42 - 20:46అందువల్ల, మనం చివరగా నేషనల్ జాగ్రఫీ ద్వారా
-
20:46 - 20:50ఈ రాజకీయవేత్తలు ఏమీ సాధించలేరని తెలియజేస్తున్నా౦.
-
20:50 - 20:51మనం ఆలోచించి చూస్తే ఈ వివాద పరిష్కార తర్కాలు--
-
20:51 - 20:53చప్పట్లు
-
20:53 - 20:55ఈ తర్కాల వల్ల సాధించేది ఏమీ ఉ౦డదని నా అభిప్రాయ౦
-
20:55 - 20:58కానీ ఈ చరిత్రను చెప్పడం వల్ల ప్రపంచాన్ని మార్చగలమని నేను భావిస్తాను
-
20:58 - 21:01అందుకే మనం చరిత్రను కథలుగా చెప్పే గొప్ప ప్రప౦చ సంస్థగా భావించుకోవాలి.
-
21:01 - 21:04ప్రపంచం మొత్తంలో నెలలో 35 మిలియన్ల మంది మన వెబ్ సైట్ ను చూస్తున్నారు.
-
21:04 - 21:07156 దేశాలు మన ఛానెల్ ను ప్రసారం చేస్తున్నాయి.
-
21:08 - 21:10మన పత్రికలను లక్షలమంది చదువుతున్నారు.
-
21:10 - 21:13మరి మనం ఈ ఎథ్నోస్పియర్ లో చేస్తున్న
-
21:13 - 21:15ఈ ప్రయాణాల పరంపరలో మనతోబాటు మన ప్రేక్షకులను
-
21:15 - 21:17అద్భుతమైన ఆ సాంస్కృతిక ప్రదేశాల వద్దకు తీసుకెళ్ళడ౦ వల్ల
-
21:18 - 21:20వాటికి సహాయం చేయలేకపోయినా అవి వెలుగులోకి రావడానికి ఉపయోగపడుతు౦ది.
-
21:20 - 21:22మనకు అదృష్టవశాత్తు కనిపి౦చిన ప్రదేశాలను
-
21:22 - 21:25మెల్లిగా ఒక్కొక్క దాన్ని, మరి౦త దగ్గరగా పరిశీలిస్తే
-
21:25 - 21:27మానవశాస్త్రం యొక్క సారాన్ని వెలికితీస్తూ
-
21:27 - 21:31ఈ ప్రపంచం విభిన్న పార్శ్వాలతో ఉండదగిందిగా భావిస్తూ,
-
21:31 - 21:32మనం మరో జీవన మార్గానికి బాటలు వేద్దా౦,
-
21:32 - 21:35ఒక వాస్తవిక బహుళ సాంస్కృతిక ప్రపంచంలోకి
-
21:35 - 21:37ఎక్కడైతే జనులందరి విజ్డం
-
21:37 - 21:40మనందరి బాగుకోసం వినియోగించ బడుతుందో అక్కడికి.
-
21:40 - 21:41కృతఙతలు.
-
21:41 - 21:43(కరతాళ ధ్వనులతో అభిన౦దనలు)
- Title:
- అంతరించి పోతున్న సంస్కృతులపైన వేడ్ డేవిస్
- Speaker:
- Wade Davis
- Description:
-
With stunning photos and stories, National Geographic Explorer Wade Davis celebrates the extraordinary diversity of the world's indigenous cultures, which are disappearing from the planet at an alarming rate.
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 21:44