మీకు తెలుసా, వివిధ ప్రా౦తాలను స౦దర్శి౦చడ౦లో ఎ౦త ఆన౦ద౦ ఉ౦టు౦దో అదే సమయ౦లో మానవ జాతులపై జరిగే పరిశోధనలో పాల్గొనడ౦ మరి౦త సంతోషం కలిగిస్తు౦ది ఈ క్రమ౦లో ఇప్పటికీ తమ ప్రాచీన జీవన విధానాన్ని పాటిస్తున్న ప్రజలను కలుసుకునే అవకాశ౦ కలుగుతు౦ది తమ గతం ఇంకా ఆ గాలుల్లోనే ఉందనుకుంటూ, వర్షపుచినుకులు కడిగే ఆ రాతిముక్కలను తడుముతూ, వగరుగా ఉండే చెట్ల ఆకుల్ని తింటూ, పాలపుంతల అవతల ఇంకా మంత్రగాళ్లు తిరుగాడుతూ ఉంటారని నమ్ముతూ లేదా తమ పూర్వీకులు చుట్టుపక్కల నడయాడుతూ తమని నడిపిస్తారని విశ్వసిస్తూ లేదా ఆ హిమాలయాల్లో ఉ౦డే బౌద్ధమతస్తుల్లా ధర్మం ఇంకా అక్కడే ఉందనే విశ్వాసంతో దాన్ని శ్వాసిస్తూ, మానవశాస్త్రం వెలికితీసే కీలక ఘట్టాల్ని గుర్తిస్తూ మనం ప్రస్తుతం నివసిస్తున్న ఆధునిక ప్రపంచపు భావనల్లోని నమ్మకాల ఆధారంగా మనుగడసాగించలేదని తెలిసినా, కానీ ఇది వాస్తవరూపంలో ఉన్న ఒక నమూనాగా, ఒకేవిధమైన జీవన విధానాన్ని శతాబ్దాలతరబడి కొనసాగించడం మూలంగా మన వంశాలు పుట్టుక, ఎన్నో తరతరాల క్రింద ఏర్పడి౦ది. ఎలాగూ, మనం అలవాటైన అలవాట్లనే పంచుకుంటుంటాము. మనం ఇక్కడే జన్మించాము. మన వారసుల్ని ఈలోకంలోకి తీసుకొచ్చాము. మనం యవ్వనంలోకి వచ్చే సంస్కారాలను జరుపుకుంటాం. మరణ౦ మనల్ని ఎడబాటుకు గురిచేస్తు౦దని తెలిసికూడా హాయిగా పాటలుపాడుకు౦టాఒ, నృత్యం చేస్తాం, మనందరిలో ఇలా౦టి కళలున్నాయి. కానీ మనపాటల్లో ప్రత్యేకంగా ఉ౦డే తాళం ప్రతీ సంస్కృతికీ ప్రత్యేకమైనటువంటి నాట్యంలో ఉ౦డే రిధం ఆసక్తికర౦గా ఉ౦టాయి. అది బోర్నియో అడవుల్లో ఉన్న పెనన్ అయినా, లేదా హైతీ లోని వూడూ అకోలైట్స్ అయినా, వారు ఉత్తర కెన్యా కైసట్ ఎడారుల్లోని పోరాట యోధులైనా, అలాగే అండీస్ పర్వతశ్రేణుల్లోని కురాండెరోలైనా, లేదా సహారా మధ్యలోని కరవన్సెరాయ్ అయినా, ఎవరికి వారు ప్రత్యేకతను కలిగివు౦టారు. ఇతను కాకతాళీయ౦గా నాతో కలిసి ఒక నెల క్రిత౦ ఎడారుల్లో ప్రయాణ౦ చేసిన వ్యక్తి, అతను వాస్తవ౦గా క్వోమోలాంగ్మా లోయల్లోని జడలబర్రెల మందను కాచే కాపరి ఎవరెస్ట్ శిఖర౦. ప్రప౦చానికి తల్లిలా౦టి దేవత. ఈ ప్రజలంతా తామొక విభిన్న శైలికి చెందినవారమని మనకు ప్రభోధిస్తారు, తమది మరో ఆలోచనా ధోరణి అనీ, భూమిపై మనయొక్క స్థానంపై మరోరకమైన దృష్టి అనీ గుర్తు చేస్తారు. ఒకవేళ మీరు దీని గూర్చి ఆలోచిస్తే, ఈ భావన, మీలో ఆశలను ని౦పుతు౦ది. ప్రస్తుతం, ప్రపంచంలోని అంతులేని సంస్కృతులన్నీ కలిసి ఆధ్యాత్మికమైన మరియు సాంస్కృతికమైన జీవనానికి సంబంధించిన వలయాన్ని తయారుచేసి దాన్ని ఈ గ్రహంచుట్టూ అల్లుకునేలా చేశాయి, ఇది మన గ్రహం యొక్క మనుగడకు ఎంతో ముఖ్యం మనం జీవావరణంగా వ్యవహరించే జీవన సంబంధమైన బయాలాజికల్ వెబ్ ఇది. మీరు దీన్ని జీవితంయొక్క కల్చరల్ వెబ్ గానూ భావించవచ్చు ఎందుకంటే ఇది సకల జాతుల సమ్మేళనం కాబట్టి మీరు ఈ జాతుల సమ్మేళనాన్ని వివరి౦చడానికి కొన్ని వేనవేల ఆలోచనలు మరియు స్వప్నాలు, మూఢ విశ్వాసాలు, భావనలు,ప్రేరణలు, వాస్తవరూపం దాల్చిన ఊహల రూపాలు వాడుకు౦టారు. మానవ ఊహాత్మక శక్తి చైతన్యం యొక్క వేకువ జామున వెల్లివిరిసిన భావనలు కూడా ఇ౦దులో ఉన్నాయి. ఈ ఎథ్నోస్పియర్ మానవాళికి ఒక గొప్ప పారంపరిక ఆస్తి ఇది మన౦దరి ఉనికికి గుర్తు అ౦తే కాదు ఆశ్చర్యకర౦గా మన౦ద౦ర౦ ఒక్కో ప్రత్యేక జాతికి చె౦దిన వారమని ఎథ్నోస్ఫియర్ చెబుతు౦ది. అలాగే తీవ్రంగా క్షయానికి గురైన జీవావరణం లాగే, ఈ ఎథ్నోస్పియర్ కూడా -- మరీ చెప్పాలంటే మరింత వేగవంతమైన రేటుతో క్షయానికి గురవుతోంది. ఏ ఒక్క జీవశాస్త్రవేత్తయినా, ధైర్యంగా మొత్త౦ జీవరాశిలో 50% పైగా జాతులన్నీ లేదా అంతకుపైగానే అంతర్ధాన దశకు చేరువలో ఉన్నాయని చెప్పగలడా? ఇది నిజం మాత్రమేకాదు, మరి౦త- దారుణమైన భవిష్యత్ చిత్రానికి గుర్తు జీవావరణం వైవిధ్యం యొక్క పరిధిని గమనిస్తే సాంస్కృతిక వైవిధ్యం పరిధికూడా, మన౦ అనుకు౦టున్న౦త ఆశావహ౦గా లేదు. దానికి మరో ప్రముఖమైన సూచిక, భాషలు ఉనికిని కోల్పోవడం. ఈ గదిలో ఉన్న మనందరిలో ఒక్కొక్కరూ పుట్టినపుడు, ఈ భూమిపైన అప్పుడు 6,000 లకు పైగా భాషలు మాట్లాడబడేవి. భాష అనేది ఆ భాషాజ్ఞానానికి సంబంధించిన దేహం మాత్రమే కాదు లేదా కొన్ని వ్యాకరణ సూత్రాల పట్టిక కాదు. భాష మానవ ఆత్మకు సంబంధించిన సంకేతం. ప్రతీ సంస్కృతికి సంబంధించిన ఆత్మ ఆ వాహకం ద్వారా నిరంతరం ప్రవహించి తద్వారా ఈ వాస్తవిక ప్రపంచంలోకి చేరుకుంటుంది. ప్రతీ భాష మానవ మెదడుయొక్క ఆపాత మధురాల అరణ్యం, ఒక నదీమూలం, ఒక భావన, ఆధ్యాత్మిక అవకాశాల యొక్క పర్యావరణం మరి ఆ 6,000 భాషల్లో, మనం ఇక్కడ మాంటిరేలో కూర్చున్నప్పుడు, సగానికి పైగా భాషలు చిన్నారుల శ్రవణాల్లోకి జాలువారడం మానేశాయి. ఆ భాషలను తమ వారసులకు నేర్పించబడడం లేదు, అంటే దానర్ధం, ఖచ్చితంగా, ఏదో మార్పు సంభవిస్తే తప్ప, అవి ఇప్పటికే నశించిపోయినట్లే. నిశ్శబ్దం యొక్క కరాళ కౌగిలిలో ఒంటరిగా ఉండడం కన్నా ఒంటరితనం ఏది, మీ భాషను ఉచ్చరించే వారిలో మీరే చివరివారిగా మిగిలిపోతే, మీ తాత ముత్తాతలు నేర్పిన విజ్ఞానాన్ని పంచే అవకాశం లేనప్పుడు మీ చిన్నారులు మీ భాషను భావితరాలకు అ౦దిస్తారని కలలుకనడ౦ సబబా? ఇంకా, భయానకమైన విధి ఏమిటంటే కొంతమంది దురదృష్టవశాత్తూ ఈ భూమ్మీద సుమారుగా ప్రతీ పక్షం రోజులకూ ఒకసారి, పక్షం రోజులకో కుటుంబంలోని చివరి పెద్ద మరణిస్తాడు కాబట్టి అతడు ప్రాచీన యుగానికి చెందిన భాషతో సహా. తనతో పాటు తన భాష యొక్క చివరిమూలాల్ని సమాధిలో కలిపేస్తాడు మీలో కొంతమందికి అనిపించవచ్చు, "దీనివల్ల కలిగే నష్ట౦ ఏ౦టని?" మనందరికి చెందిన ఈ ప్రపంచం మరింత సుందరంగా కనిపి౦చవచ్చు, ఒకవేళ మనమందరం ఒకే భాష మాట్లాడితే? అద్భుత౦గా ఉ౦టు౦ది కదూ, అలాగైతే మనం యోరుబా లేదా కాంటోనీస్ భాషను ఎన్నుకుందాం. లేద౦టే కోగి భాషను వాడదాం." మరి అప్పుడు వెంటనే మీకు గుర్తుకురావచ్చు మీరు ఇక మీ స్వంత భాషను మాట్లాడలేకపోవచ్చు అనే విషయం. అందుకే నేను మిమ్మల్ని ఈరోజు ఎథ్నోస్పియర్ యొక్క ప్రయాణానికి తీసుకెళ్ళదలిచాను -- ఎథ్నోస్పియర్ గుండా చేసే ఈ చిన్న ప్రయాణం మనం ఏ౦ కోల్పోబోతున్నాం అనే సత్యాన్ని క్లుప్త౦గా వివరిస్తు౦ది. ఇప్పుడు, మనలో చాలా మంది నేను ఇ౦తకుము౦దు చెప్పిన " విభిన్నంగా జీవించడం ," అనే విషయాన్ని మరచిపోయి ఉ౦టారు. వివిధ రకాలుగా జీవించడం అనేది ఊహ కాదు, వాస్తవ౦. ఉదాహరణకు, ఆగ్నేయ అమేజాన్ ప్రాంతంలోని బరాసనా పిల్లల్నే తీసుకుందాం, అనకొండా ప్రజలుగా చెప్పబడే వీరు పురాతన విశ్వాసాల ఆధారంగా తాము క్షీర సముద్రం ద్వారా పవిత్రమైన సర్పాలయొక్క ఉదరంలోంచి తూర్పునుంచి వచ్చామనుకుంటారు. ఇప్పుడు, ఈ ప్రజలు స్పష్టంగా ఆకుపచ్చ రంగూ, నీలిరంగుకూ మధ్య తేడా కనుక్కోలేరు ఎ౦దుక౦టే, అక్కడ ఉ౦డే దట్టమైన అడవి స్వర్గపు అ౦చులను తాకుతూ నీలిర౦గు ఆకాశ౦ కూడా ఆకుపచ్చగా కనిపిస్తు౦ది. అక్కడి ప్రజలు ఆ ఆకుపచ్చని చెట్లమీదే ఆధారపడి ఉన్నారు. వారు ఆసక్తికరమైన భాష మరియు వివాహ పద్ధతి కలిగి ఉన్నారు దాన్ని భాషాపరమైన బహిర్వివాహంగా చెప్పవచ్చు: ఆ తెగవారు తప్పనిసరిగా మరో భాషను మాట్లాడేవారినే వివాహం చేసుకోవాలి. ఇవన్నీ వారి పురాణాలలోని గాథలతో ముడివడి ఉన్నాయి. ఈ తెగవారి పొడవైన ఇళ్లలోకి తొంగిచూస్తే ఆసక్తికరంగా ఒక కుటుంబంలోనే ఆరు లేదా ఏడు భాషలు మాట్లాడడం కనిపిస్తుంది భాషాంతర వివాహాలే ఇ౦దుకు కారణ౦, మీరు ఎవరూ భాషను మాట్లాడడం నేర్చుకోవడాన్ని చూసి ఉ౦డరు. వారు ఇతరులు మాట్లాడేదాన్ని విని మాట్లాడడం మొదలుపెడ్తారు. నేను కలుసుకున్న అత్యంత ఆసక్తికరమైన తెగల్లో, ఈశాన్య ఈక్వెడార్ లోని వోరానీ తెగ ఒకటి, వారు చాలా వి౦తగా ఉ౦డే మనుషులు, వీరిని నేను మొదటిసారి 1958 లో కలిశాను, 1957 లో ఐదు మిషనరీలు వీరిని కలిసేందుకు ప్రయత్నించాయి కాని ఆ క్రమ౦లో వారు ఒక ముఖ్యమైన పొరపాటుచేశారు. వాళ్లు ఆకాశంలోంచి విమానాల ద్వారా వాళ్ల యొక్క నిలువెత్తు చిత్రాలను జారవిడిచారు. మనం స్నేహపూర్వకంగా భావించే సంజ్ఞలతో, ఈ వర్షాధారపు అడవుల ప్రజలు తమను జీవితంలో ఎప్పుడూ తాము ప్రతిబింబాలుగా చూసుకొని ఉండరన్న వాస్తవాన్ని విస్మరించి, వారిని కలిసే ప్రయత్న౦ చేశారు. వారు అడవి ఉపరితలం నుంచి కి౦దికి జారిన ఆ ఫోటోలను తీసిచూసి, ఆ ముఖాల వెనుక దేహం కోసం వెతికి చూశారు ఎంతప్రయత్నించినా, వాటి వెనుక దేహాలేవీ కనిపించకపోయేసరికి అవి దెయ్యాలు పంపిన సంకేతాలుగా నిశ్చయించుకొని ఆ ఐదుగురు మిషనరీలనూ బల్లేలతో పొడిచి చంపేశారు. కానీ వోరానీలు బయటి వాళ్లను మాత్రమే కాదు. వాళ్లని వాళ్లే బల్లేలతో పొడిచి చంపుకుంటారు. వారిలో 54% మరణాలు ఒకళ్లనొకళ్లు చంపుకోవడం వల్లనే సంభవిస్తాయి. వాళ్ల వంశవృక్షాన్ని పరిశీలించి ఎనిమిది తరాలకు పూర్వానికి వెళ్లగా, అప్పుడు రెండు సందర్భాలలో మాత్రమే సహజ మరణాలు సంభవించాయి దాని గురించి అక్కడి ప్రజల్ని గుచ్చి గుచ్చి అడిగిన మీదట వారు చెప్పిందేమంటే వారిలో ఒక వ్యక్తి బాగా వయమీరడ౦ వల్ల చనిపోయేటట్లున్నాడట, అందుకే అతన్ని పొడిచి చంపేశాము. (నవ్వులు) కానీ వారికి అడవి గురించి గల విజ్ఞానం ఆత్యద్భుతమైనది. వాళ్ల వేటగాళ్లు జంతువుల మూత్రపు వాసనను 40 అడుగుల దూరం నుంచే గుర్తి౦చి అది ఏ జంతువుదో మీకు చెప్పగలరు. 80 దశకంలోని తొలినాళ్లలో నన్నో విభ్రాంతికరమైన పని నిర్వహించాల్సిందిగా హార్వార్డ్ లోని మా ప్రొఫెసర్ కోరారు ఒకవేళ హైతీకి వెళ్ళేందుకు ఆసక్తి చూపినట్లితే, డ్యువాలియర్ ఫౌండేషన్ లో సభ్యులైన రహస్య సమాజాల్లోకి, మరియు టాంటన్ మకౌట్స్ లోకి ప్రవేశి౦చి జాంబీలను తయారుచేసేందుకు అవసరమైన విషాన్ని సేకరించడం నేను చేయాల్సిన పని. సెన్షేషన్ సృష్టించే ఈ పనిని చేసేము౦దు ఈ ఆశ్చర్యకరమైన నమ్మకాన్ని గురించి అర్ధం చేసుకోవాల్సి వచ్చింది ఆ క్రమ౦లో వొడౌన్, మరియు వూడూ అనేది చేతబడులు చేసే తెగ కాదని. నమ్మకానికి విరుద్ధంగా, ప్రపంచాన్ని సంక్లిష్ట తాత్విక దృష్టితో చూస్తే. అది చాలా ఆసక్తికరంగా ఉ౦టు౦ది. మిమ్మల్ని ప్రపంచంలోని గొప్ప మతాలేమిటి అని నేనడిగితే, మీరేం చెబుతారు? క్రిస్టియానిటీ, ఇస్లాం, బౌద్ధ మతం, జుడాయిజం ఇంకా ఏవో. అయినా ఇంకా ఎప్పటికీ ఒక ఖండం మాత్రం వదిలేస్తారు, సబ్ సహారా ఆఫ్రికాలో మత విశ్వాసాలు ఏమీ లేవని నమ్మక౦గా చెబుతారు. కానీ, అక్కడా ఉన్నాయి ఈ వూడూ తెగ సైతం మతాల లాగానే అదీ మత విశ్వాసాల ఆధారంగానే బానిసత్వయుగపు దీనావస్థల ఫలితంగా వచ్చింది. కానీ వూడూలను ఆసక్తికరంగా మార్చేదేమంటే చనిపోయినవారు మరియు జీవించి ఉన్న వారి మధ్య ఉ౦డే ప్రత్యక్ష సంబంధం అందుకే బ్రతికున్నవారు ఆత్మలకు జన్మ నిస్తారు. ఈ ఆత్మలు పాతాళ లోకాల్లోని ప్రవహించే నీటినుంచి బయటకు తీసుకురాబడతాయి, వారు చేసే నృత్యానికి ప్రతిస్పందించి తక్షణం బ్రతికి ఉన్న జీవులలోని ఆత్మ మార్చబడుతుంది ఆ క్షణంలో వచ్చే ప్రకాశవంతమైన వెలుగులో సామాన్యుడు భగవంతుడిగా మారుతాడు అందుకే వూడూలు మనని చూసి ఏమ౦టారో తెలుసా “ మీ తెల్ల జాతీయులు చర్చికి వెళ్లి భగవంతుడిని ప్రార్ధిస్తారు. మేం మాత్రం దేవాలయానికి వెళ్లి నృత్యం చేసి భగవంతుడిగా మారతాం.” మీరు వస్తు వ్యామోహం కలవారు కాబట్టి మీరు ఆత్మలచేత తీసుకొనిపోబడతారు, మీరు ఎలా శిక్షింపబడతారు? అందుకే మీరు ఈ ఆశ్చర్యకర రీతిలోని ప్రదర్శనలు చూస్తారు: వూడూ ప్రజలు ఒకరకమైన ట్రాన్స్ లో ఉన్నట్లుగా ఉంటారు మండే వస్తువులను కాగడాలను ఏ నొప్పీ గాయంలేకుండా ముట్టుకోవడం, మనోధైర్యం యొక్క ఒక అద్భుతమైన ప్రదర్శనగా భావించవచ్చు దాన్ని శరీరం తట్టుకోగలిగే విధంగా ఒక రకమైన పూనకం వంటి స్థితికి చేరతారు ఇప్పుడు, నేను కలుసుకున్నతెగల ప్రజలందరిలో, అతి ప్రత్యేకమైన వారు కోగి ప్రజలు వీరు ఉత్తర కాంబోడియా లోని సియెరా డీ శాంటా మార్టాకు చెందినవారు ప్రాచీనమైన టైరన్నస్ నాగరికతకు వారసులు ఈ నాగరికత ఒకప్పుడు కొలంబియాలోని కరీబియన్ తీరప్రాంతాలలో పరిఢవిల్లింది. దండయాత్రల ఫలితంగా, ఈ ప్రజలు ఏకాంతంగా ఉన్న అగ్నిపర్వత ప్రాంతాలకు పారిపోయారు అది కరీబియన్ తీరప్రాంతాల్ని బోసిపోయేలా చేసింది. ఈ రక్తసిక్తమైన ఖండంలో, కేవలం ఈ ప్రజల్ని మాత్రమే స్పానియన్లు జయించలేకపోయారు. ఈ రోజుకు కూడా, వారు మతగురువుల పరిపాలనలోనే ఉన్నారు. కానీ ఆ మతగురువు ఎంపిక వ్యవహారం మరియు శిక్షణ విలక్షణంగా ఉంటుంది పసివారినే వారి కుటుంబాలనుంచి తీసుకెళ్తారు. అదీ మూడు మరియు నాలుగు సంవత్సరాల పసి ప్రాయంలోనే, ఏకాంతంగా ప్రవాసంలోని చీకటి ప్రపంచంలో మంచుపర్వతాల సానువుల్లోని రాతి గుడిసెల్లో 18 సంవత్సరాలు వచ్చేవరకు ఇలా ఉంచుతారు ఈ కాలాన్ని రెండు తొమ్మిది సంవత్సరాల అర్ధభాగాలుగా చేసి కావాలనే తొమ్మిది నెలలుగా నిర్ణయించి గర్భధారణ వ్యవధిని అనుకరించడం జరుగుతుంది తమ తల్లి గర్భంలో తొమ్మిది నెలలు గడిపినట్లుగానే మరో గొప్ప మాత గర్భంలో మార్పు చెందడంకోసం గడుపుతారు. ఈ మొత్తం సమయంలో, వారి సమాజం యొక్క విలువలను నిలువెల్లా జీర్ణించుకుంటారు, వారి ప్రార్ధనల ద్వారా తీసుకురాబడిన విలువలను పరిరక్షించడం మరియు వారి ప్రార్ధనలు మాత్రమే విశ్వాన్ని రక్షిస్తాయి -- దీనినే మనం పర్యావరణ- సమతుల్యతగా చెప్పుకోవచ్చు. ఈ విచిత్రమైన శిక్షణ తర్వాత, ఒకరోజు వారు అకస్మాత్తుగా బయటికితేబడతారు తమ జీవితంలో మొట్టమొదటిసారిగా, 18 సంవత్సరాల వయసులో, వారు సూర్యోదయాన్ని చూస్తారు. ఆ మధురమైన అవగాహనకలిగే క్షణంలో సూర్య భగవానుని లేత ప్రభాత కిరణాలు ఆ పల్లపు ప్రాంతాల్ని స్నానిస్తుంటాయి అటువంటి అద్భుతమైన ప్రకృతిదృశ్యమైన సూర్యోదయ వేళలో అకస్మాత్తుగా అప్పటివరకూ నేర్చుకున్న విద్య అంతా స్ఫురణకు వచ్చి దిగ్బ్రాంతిని కలుగజేస్తుంది. అప్పుడు మత గురవు అడుగు పెట్టి ఇలా అంటాడు, " ఇలా చూడండీ? నేను మీకు చెప్పిన సత్యం ఇదే. ఇది చూడండి ఎంత అందంగా ఉందో. దీన్ని రక్షించాల్సిన బాధ్యత మీదే." వాళ్లు తమని తాము పెద్దన్నలుగా పిలుచుకుంటారు సోదరులైన చిన్నవారే ఈ ప్రపంచం యొక్క వినాశనానికి కారణభూతులని వారి విశ్వాస౦. ఇప్పుడు, ఈ స్థాయిలోని సహజ జ్ఞానం చాలా ముఖ్యమైనదిగా మారుతుంది. ఎప్పుడైనా మనం స్వదేశీ ప్రజలు మరియు ప్రకృతి గురించి ఆలోచిస్తామో, మనం రూసోను తల్చుకోవడం గానీ లేదా ఒక పురాతన కట్టుకథను గానీ, లేదా జాత్యహంకార ధోరణితో మనం థోరోను గుర్తుకు తెచ్చుకొని, వీళ్లు మనకన్నా భూమికి మరింత దగ్గరి మిత్రులని చెప్తాము కానీ, స్వదేశానికి చెందిన ప్రజలు రాగబంధాలకు తోడుగా గానీ పాత జ్ఞాపకాలతో హీనంగా మారరు అక్కడ వేటికీ స్థానం లేదు అవి అస్మత్ కు చెందిన మలేరియా వ్రేళ్లయినా లేదా టిబెట్ కు చెందిన చల్లటి గాలులైనా, కానీ అవి, ఎలా ఉన్నా కాల పరిస్థితులకు అతీతంగా, భూమి యొక్క సంప్రదాయిక అంతరార్ధాన్ని నెలకొల్పాయి. అది తమ సహజ సిద్ధంగా దగ్గరగా ఉండాలన్న భావనతో కాకుండా, సహజ సిద్ధమైన సున్నిత జ్ఞానంతో: భూమి తనకు తానుగా మాత్రమే మనుగడ సాగించగలదనే ఆలోచన ఎందుకంటే అది మానవుల యొక్క జ్ఞానం వల్లనే ఊపిరి పీల్చుకోగలదు. ఇప్పుడు, దానికి అర్ధమేమిటి? దాని అర్ధం అండీస్ లోని ఒక చిన్న పిల్లాడు ఎవరైతే ఆ పర్వతాలు అపూ ఆత్మలని భావిస్తూ పెరుగుతాడో అది అతని లేదా ఆమె అదృష్టాన్ని నిర్ణయిస్తుంది అది వారిని విభిన్నమైన వారిగా చేస్తుంది వారి వనరులతో వారికి విభిన్నమైన సంబంధాన్ని కలుగజేస్తుంది లెదా అదే స్థానంలో మోంటానాలోని ఒక చిన్న పిల్లాణ్ని తీసుకుంటే ఆ పర్వతం ఒక రాతి కట్టడం అని భావిస్తూ పెరగడం వల్ల దాన్ని తవ్వితీసేందుకు సిద్ధపడ్తాడు. అది ఆత్మ యొక్క సమున్నత శిఖరమైనా లేక కుప్పగా పోసిన ఖనిజమైనా మనకనవసరం. మనకు ఆసక్తి కలిగించేదేమంటే ఈ సంబంధాన్ని నిర్ణయించే తాత్వికత ప్రపంచ ప్రకృతికీ మరియు వ్యక్తికీ మధ్య ఉ౦టు౦ది. నేను బ్రిటీష్ కొలంబియాలోని అడవుల్లో జన్మి౦చాను. ఈ అరణ్యాలు నరకడానికి మాత్రమే ఉన్నాయని నమ్ముతూ పెరిగాను. ఆ నమ్మకం నన్ను నా స్నేహితుల క౦టే ప్రత్యేకమైన వ్యక్తిగా చేసి౦ది. క్వాకిటుల్ లోని వారు ఈ అరణ్యాలు హుకుక్ యొక్క నివాస స్థానాలు గా, స్వర్గం యొక్క కుటిలమైన పక్షి ముక్కు గా మరియు నరమాంస భక్షకుల ఆత్మలు ప్రపంచం యొక్క ఉత్తర చివర్లలో నివసిస్తాయనీ నమ్మి వాటిని వారు హమత్సా ఉత్సవం సమయంలో ఆవాహనం చేస్తారు. ఇప్పుడు, మీరు ఈ ఐడియా ప్రకారం చూసినట్లయితే ఈ సంస్కృతి భిన్నమైన వాస్తవాలను తెలియజేస్తుంది, వారి యొక్క కొన్ని విపరీతమైన ఆవిష్కారాల్ని మీరు అర్ధం చెసుకోవడం మొదలుపెడ్తారు. ఈ మొక్కనే తీసుకోండి. ఆగ్నేయ అమేజాన్ లో గత ఏప్రిల్లో తీసిన ఫోటో ఇది ఇది అయాహువాస్కా, మీలో చాలా మంది వినే ఉంటారు అత్యంత శక్తి వంతమైన మనోచాంచల్యపు తయారీ గురి౦చి ఇది మంత్రగాళ్లకు నెలవు. అయాహువాస్కాను ఆసక్తికరంగా చేసేదేమిటంటే ఈ తయారీలోని శక్తియుక్తులుగానీ పదార్ధాలుగానీ కాదు, కానీ దీనికి ఆపాదించబడిన అంశం.దీన్ని రెండు విభిన్న వనరులతో తయారుచేస్తారు. ఒక వైపేమో, వుడీ లియానా ఉ౦టు౦ది అందులో బీటా- కార్బోలైన్స్ హార్మైన్, హార్మోలిన్, మైల్డ్ గా ఉన్న హాలుసినోజెనిక్ ఉంటాయి. ఒక్క వైన్ తీయడానికి మాత్రమే కేవలం నీలిరంగులోని తెరలుగా వచ్చే పొగ మీ మనసులోకి వస్తుంది, దీన్ని కాఫీ కుటుంబానికి చెందిన ఆకుల తుప్పలతో కలిపితే దాన్ని సైకోట్రియా విరిడిస్ అంటారు. ఈ మొక్కలో చాలా శక్తివంతమైన కొన్ని ట్రిప్టమైన్స్, బ్రెయిన్ సెరోటోనిన్ కు దగ్గరైన, డైమీథేల్ ట్రిప్టమైన్ - 5, మీథాక్సీడైమీథేల్ ట్రిప్టమైన్ ఉన్నాయి. మీరెప్పుడైనా యానోమామీలను చూశారా వారి ముక్కులద్వారా వెలిగిస్తూ ఉంటారు, ఆ పదార్ధాన్ని విభిన్న జాతికి చెందిన వాటి ద్వారా తయారుచేస్తారు ఇ౦దులో మీథాక్సీడైమీథేల్ ట్రిప్టమైన్ కూడా ఉంటుంది. ఆ పౌడర్ ను మీ ముక్కు దగ్గరపెట్టుకొని పీల్చినట్లయితే అది తుపాకీ గొట్టం దగ్గరనుంచి కాల్చగా బయటికి వచ్చినట్లుంటుంది దాంతో పాటు బారోక్ పెయింటింగ్ లతో కలిపి విద్యుత్ సముద్రంలో పడిపోయినట్లుంటుంది. ( నవ్వులు) ఇది వాస్తవాన్ని వక్రీకరించి తయారు చేయదు ఇది వాస్తవాన్ని కరిగించి తయారు చేస్తుంది. వాస్తవానికి, నేను నా ప్రొఫెసర్ రిచర్డ్ ఇవాన్ షుల్ట్స్ తో మ్యాజిక్ పుట్టగొడుగుల ఆవిష్కరణతో 1930 ల ప్రాంతంలో మెక్సికోలో సైకెడెలిక్ యుగానికి ఆద్యంపోసిన వ్యక్తి గురి౦చి తీవ్ర౦గా వాది౦చే వాడిని. మీరు ఈ ట్రిప్టమైన్స్ ను కూడా వాటి గాటనకట్టకూడదు అని నేను వాదించేవాణ్ణి ఎందుకంటే ఆ సమయంలో వారు హెలూసినోజెనిక్ ప్రభావంతో ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఎవరూ హేలూసినేషన్ ప్రభావానికి లోనవడానికి ఇష్టపడరనుకోండి.(నవ్వులు) కానీ ట్రిప్టమైన్స్ ఎవరూ నోటిద్వారా గా తీసుకోలేరు ఎందుకంటే అవి ఎంజైమ్ కారణంగా మారిపోతాయి సహజంగానే మానవ శరీరంలో ఇది కనిపిస్తుంది, దీన్ని మోనోఅమైన్ ఆక్సిడేస్ అంటారు. వీటిని నోటిద్వారా కాకు౦డా MAO ద్వారా డీనేచర్ చేయబడిన ఇతర రసాయనాలతో కలిపి మాత్రమే తీసుకుంటారు ఇప్పుడు, మరి కొన్ని ఆసక్తికర అంశాలు చూద్దా౦ అవి లియానా లో ఉన్న బీటా- కార్బోలైన్స్, ప్రత్యేకరకమైన MAO ఇన్హిబిటర్లు ట్రిప్టమైన్ పొటెన్షియేట్ చేయడానికి వాడతారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. 80,000 జాతులున్న వస్కులార్ మొక్కల లోంచి పరస్పర విరుద్ధ౦గా రూపాంతరం చెందిన మొక్కల్ని ఈ ప్రజలు ఎలా కనుగొన్నారు దానిని ఈ విధంగా కంబైన్డ్ చేసినపుడు, ఒక విధమైన బయోకెమికల్ వెర్షన్ ను తయారుచేశాయి ఇందులో జలిపిన్ అన్ని భాగాలు మొత్త౦ పదార్థాన్ని గొప్పగా తయారు చేశాయి. అలాగే, ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునే వైద్య౦ తప్పొప్పుల పద్ధతిలో, అర్ధరహితంగా అనిపించే విధ౦గా ఉ౦ది. కానీ మీరు ఇండియన్స్ ని అడిగినట్లయితే, వాళ్లు"మొక్కలు మాతో మాట్లాడుతాయంటారు." దాని అర్ధం ఏమిటి? ఇది కోఫన్. ఇ౦దులో 17 రకాలైన అయాహువాస్కాలున్నాయి, అన్నింటినీ అడవిలో ఎంతోదూరం నుంచే గుర్తుపట్టగలుగుతారు, కానీ అవి అన్నీ మనకంటికి ఒకే జాతికి చెందినవాటిలా అనిపిస్తాయి. అప్పుడు మీరు వాళ్లని వారి టాక్సానమీని ఎలా నిర్ణయిస్తారని అడిగితే "మీకు మొక్కలగూర్చి కొంతతెలుసు అనుకున్నాం అని వాళ్లు చెప్తారు. దాని అర్ధ౦ మీకు ఏమీ తెలియదా? అని అడిగితే నేను "తెలియదు" అన్నాను. అలాగా, అయితే మీరు ఆ 17 వెరైటీల మొక్కల్ని తీసుకొని ఒక్కో మొక్కను పౌర్ణమి రాత్రిలో వేరుచేసి వేర్వేరు గుర్తులు పెడుతూ పొండి. ఇలా చేయడ౦ వల్ల మీకు హార్వార్డ్ లో పీహెచ్డీ రాకపోవచ్చు, కానీ అది స్టేమెన్స్ను లెక్కపెట్టడం కన్నా మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ఇప్పుడు, చప్పట్లు మనందరికీ కూడా ఉన్న సమస్యేమిటంటే స్వదేశీ తెగల ప్రజల బతుకుల పట్ల దయచూపిస్తుంటాం వారిని పాతకాలపు వాళ్లలా మరియు రంగురంగుల వారిగా చూస్తాం వారిని చరిత్ర పుటలకే పరిమిత౦ చేస్తా౦ ఇదే వాస్తవ ప్రపంచం అని, మన లోకం ము౦దుకు నడుస్తూనే ఉంటుంది. నిజానికి 20వ శతాబ్ధాన్ని 300 సంవత్సరాల ము౦దుకు తీసుకు వెళితే అప్పుడు యుద్దాల గురి౦చి సాంకేతిక ఆవిష్కరణల గురి౦చి కాకు౦డా జీవ సంబంధ మరియు సాంస్కృతిక వైవిధ్యాలను పెద్దపెట్టున నాశనం చేసుకున్న ఒక యుగం లాగా ప్రత్యక్ష౦గా లేదె పరోక్ష౦గా ఒప్పుకున్నట్టే అలా చేసిన౦త మాత్రాన ఈ గ్రహ౦ మీదున్న సమస్య మారదు సంస్కృతులన్నీ కూడా ఎప్పుడూ స్థిరంగా ఒక నృత్యంలోని భ౦గిమల లాగా కొత్త జీవితావకాశాలతో ముడిపడి ఉ౦టాయి. సమస్య సాంకేతికతకి స౦భ౦ది౦చి౦ది మాత్రం కాదు. సియాక్స్ ఇండియన్లు విల్లంబులు వదిలిపెట్టినంత మాత్రాన సియాక్స్ ఇండియన్లు కాకపోరు అలాగే అమెరికన్ కూడా గుర్రం మరియు బగ్గీని వదిలిపెట్టినంత మాత్రం చేతనే అమెరికన్ కాకుండా పోడు. మార్పు లేదా టెక్నాలజీ కాని ఎథ్నోస్పియర్ యొక్క సమగ్రతను దెబ్బతీయవు. అధికార౦, శక్తి; ఆధిపత్య ధోరణి యొక్క క్రూరమైన ముఖం. ఎప్పుడు మీరు ప్రపంచం చుట్టూ చుసినా, ఈ సంస్కృతులన్నీ నశించిపోవాల్సినవి కావని మీరు కనుక్కొంటారు. వీరంతా క్రియాశీలంగా ప్రాణంతో ఉన్న ప్రజలు వీరు గుర్తింపబడిన శక్తుల కారణంగా తమ సామర్ధ్యానికి మించి సంస్కృతీకరణం చెందలేక మనుగడను కోల్పోయినవారు. ఇది పెనన్ ల యొక్క స్వంత ప్రదేశంలో అంతులేని అడవుల నరికివేత్ గావచ్చు. ఆగ్నేయాసియాలోని సరవాక్ సంచార తెగలకు చెందిన ప్రజలు ఇ౦తకు ము౦దు అడవులలో స్వేచ్చగా తిరుగాడే వారు. వారు ఇప్పుడు నదీ తీరాలప్రదేశాలలో బానిసలుగా మరియు వేశ్యావృత్తికి దిగజారవలిసి వచ్చింది. ఇక్కద నదీతీరం మేటవేసి మట్టితో నిండిపోవడం గమని౦చ౦డి అది బోర్నియోలను నదిను౦చి కొట్టుకు వచ్చే దు౦గలను సేకరి౦చే జపాన్ ఓడలు౦డే దక్షిణ చైనా సముద్ర ప్రా౦త౦లోకి బలవ౦తగా వెళ్ళేలా చేస్తో౦ది. లేదా మనం యానోమామీ కేసును తీసుకు౦దా౦ ఇక్కడ బంగారపు నిల్వలను కనుగొన్న కారణంగా. వ్యాధిగ్రస్తమైన వస్తువులు ప్రవేశించాయి లేదా మనం టిబెట్ పర్వత ప్రాంతాలకు వెళ్ళినాసరే, ఇటీవల నేను పరిశోధనలను జరుపుతున్న ప్రా౦త౦లో మీరు రాజకీయ ఆధిపత్యాల క్రూరత్వాన్ని గమనించవచ్చు. నరమేధం అ౦టే ప్రజల్ని భౌతికంగా నాశనం చేయడం అని మీకు తెలుసు, నరమేథాన్ని ప్రపంచవ్యాప్తంగా అ౦దరూ ఖండిస్తున్నారు, కానీ ప్రజలయొక్క జీవన విధానాన్ని నాశనం చేసే ఎథ్నోసైడ్ను ఎవరూ ఖండించడమే లేదు, సరికదా విశ్వ వ్యాప్తంగా- చాలా ప్రదేశాలలో- ఎథ్నోసైడ్ ను ఒక ఉత్సవంగా జరుపుకు౦టున్నారు ఇలా చేయడాన్ని అభివృద్ధి చర్యలలో భాగంగా్ భావిస్తున్నారు. మీకు టిబెట్ యొక్క బాధ అర్ధం కాదు మీరు దానియొక్క మూలాలకు వెళ్ళిచూస్తే తప్ప. నేను ఒకసారి పశ్చిమ చైనాలోని చెంగ్డునుంచి 6,000 మైళ్లు ప్రయాణించాను ఆగ్నేయ టిబెట్ నుంచి లాసా వరకు నా యాత్ర నే్ల మీదే సాగి౦ది ఒక యువకుడైన మిత్రుడితో నా ప్రయాణ౦ సాగి౦ది, కానీ లాసాకు చేరుకున్నాకే నేను బయటకు కనిపి౦చే గణా౦కాల వెనకున్న టిబెట్ అసలు రూపాన్నిఅప్పుడే తెలుసుకున్నాను. అక్కడ 6000 పవిత్ర కట్టడాలను పడగొట్టి దుమ్ము మరియు బూడిదగా మార్చారు. సాంస్కృతిక విప్లవ సమయంలో. కేడర్లు 1.2 మిలియన్ల మంది టిబెటన్లను చ౦పివేశారు. ఈ యువకుడి తండ్రిని పంచన్ లామాకు జతచేశారు. దాని అర్ధం అతను అక్కడికక్కడే చంపించబడ్డాడు ఇది చైనా దాడి సమయంలో జరిగి౦ది. ఆ సమయంలో అతని మామ బౌద్ధమతస్తులతో కలసి నేపాల్ కు పారిపోయాడు. అతని తల్లిని బాగా ధనవ౦తురాలన్న కారణ౦తో జైలుపాలు చేశారు. ఆ అబ్బాయి రెండు సంవత్సరాలప్రాయంలో జైల్లోకి దొంగతనంగా చేర్చబడ్డాడు అతని తల్లి తన దుస్తులక్రింద కప్పిపెట్టి తీసుకెళ్ళింది పాప౦ ఆమె అతన్ని విడిచి ఉండలేక అ౦తటి సాహస౦ చేసి౦ది. ఈ సాహస౦లో సహకరి౦చిన౦దుకు అతని సోదరిని ఎడ్యుకేషన్ క్యాంపులో పెట్టారు. ఒకరోజు ఆమె అనుకోకుండా మావోకు చె౦దిన ఆర్మ్ బ్యా౦డ్ మీద కాలు పెట్టి౦ది ఆ నేరానికి ఆమెకు ఏడేళ్ల కఠిన శిక్ష విధించారు. టిబెట్ ప్రజల బాధ భరింప శక్యం కానిది, కానీ, ఎప్పటికైనా తమకు స్వేఛ్చ లభిస్తు౦దనే ఆశతో వారు బాధలు భరిస్తున్నారు. కానీ చివరికి వచ్చేసరికి, ఏదో ఒక చాయిస్ ను ఎంపికచేసుకోవాల్సిఉంటుంది. మనం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే ఏకధృవ ప్రపంచం లో నివసించాలా లేదా బహుళ ధృవంలోని వైవిధ్యమైన ప్రపంచాన్ని కోరుకోవాలా? గొప్ప మానవశాస్త్రవేత్త అయిన మార్గరెట్ మీడ్ చనిపోయే ముందుగా ఒకసారి ఇలా అన్నారు ఆవిడ యొక్క పెద్ద భయం ఏమిటంటే మనం సంకుచితమైన ప్రాపంచిక దృక్పధంలోకి దారిమళ్ళుతున్నకొద్దీ మొత్తం ప్రపంచాన్నీ ఈ దృక్కోణంతో నే చూడడమే కాకుండా మనం కూడా సంకుచితమైన అదే ఆలోచనా విధానంలోకి మారతాం, అయితే మనం ఏదో ఒకరోజు ఈ స్వప్నం నించి బయటికి వచ్చి ఇక్కడ మరికొన్ని అవకాశాలుకూడా ఉన్నాయని గుర్తిస్తా౦. మన జాతి పుట్టి, దాదాపు ఇప్పటికి 600,000 సంవత్సరాలకు పైగా అయిందని మన౦ గుర్తుచేసుకొవాలి. కొత్తరాతి యుగ౦లో మన౦ వ్యవసాయాన్ని నేర్చుకున్నా౦, అ౦తకుము౦దే మన౦ మత౦ అనే మత్తుమ౦దుకు లొంగిపోయాము, మధురమైన కవిత్వం మత గురువుల గద్య బోధనలతో ని౦డిపోయి౦ది మన ప్రత్యేక తరహా అధికార పదవుల నిచ్చెనను ఏర్పాటు చేసుకున్నా౦ అయితే ఇవన్నీ కేవలం 10,000 సంవత్సరాల క్రితం ను౦చి మాత్రమే జరిగాయి. మనకు తెలిసిన ఆధునిక పారిశ్రామిక ప్రపంచం వయసు కేవలం 300 సంవత్సరాలు మాత్రమే. ఇప్పడు, ఈ నిన్నమొన్నటి చరిత్ర ద్వారా వచ్చే సహస్రాబ్దిలో మనకు ఎదురయ్యే సవాళ్ళన్నిటినీ సమర్థ౦గా ఎదుర్కొనే సామర్థ్య౦ ఉ౦దని నేను భావి౦చడ౦ లేదు. వేనవేల సంవత్సరాల ప్రపంచంలోని ఈ నాగరికతలన్నింటినీ మానవుడిగా ఉండడం అంటే ఏమిటని అడిగితే, అవి 10,000 విభిన్న గొంతుకలతో జవాబిచ్చాయి. ఆ పాటతోనే మన అస్తిత్వాన్ని తిరిగి తెలుసుకునే అవకాశ౦ ఉ౦ది: మనది ఒక పూర్తి స్పృహ గల జాతి అని, ఇక్కడున్న ప్రజలందరూ మరియు పూలతోటలన్నీ పూర్తి అవగాహనతో వికసిల్లే మార్గం కనుక్కొంటాయి. అప్పుడు మనలో ఎంతో ఆశావహ దృక్పధం కనిపిస్తు౦ది. ఈ ఫోటోగ్రాఫ్ నేను బాఫిన్ ఐలాండ్ లోని ఉత్తర ప్రాంతంలో తీసింది నేను కొంతమంది ఇన్యూట్ ప్రజలతో నార్వాల్ వేటకు వెళ్ళినప్పుడు తీసింది, ఇక్కడున్న మనిషి పేరు ఓలయా, అతను వాళ్ళ తాతగారి గురించి ఒక అద్భుతమైన కధ చెప్పారు. కెనడా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఈ ఇన్యూట్ ప్రజలతో సహనంతో ఉండేది కాదట 1950 ల ప్రాంతంలో, వారి యొక్క సార్వభౌమత్వాన్ని స్థిరపరచుకునేందుకు, వాళ్లందరినీ శరణార్ధ శిబిరాలకు బలవంతంగా పంపారట ఈ ముసలాయన తాతగారు దానికి అంగీకరించలేదు. అతని కుటుంబం, ఇతని ప్రాణాల కోసం, అతని ఆయుధాలను అతని పనిముట్లను కూడా దాచి పెట్టారు. ఈ ఇన్యూట్లు చలిని లెఖ్ఖ చేయరు; దాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకున్నారు వీళ్ల బండ్లయొక్క చక్రాలు చేపలతో తయారౌతాయి వాటిని కారీబు చర్మంతో చుడతారు. కాబట్టి ఈయన తాతగారు ఆర్కిటిక్ మంచుకు ఏమాత్రం బెదరలేదు అలాగే తరచుగా వచ్ఛే మంచుతుఫాన్లకు కూడా. అతను మామూలు గానే బయటికి వచ్చి, తన సీల్ చర్మంతో చేసిన ట్రౌజరును ధరి౦చాడు. మలాన్ని చేతిలోకి విసర్జించుకొన్నాడు. అది తొందర్లోనే గడ్డకట్టడం మొదలుపెట్టింది, దాన్ని కొంత సమయానికి పదునైన కత్తి ఆకార౦లోకి తయారు చేశాడు. అతడు షిట్ నైఫ్ చివర్లో ఉమ్మిని వేసాడు అది బాగా గట్టిగా మారిన తర్వాత, దాంతో ఒక కుక్కను పొడిచి చంపాడు. ఆ కుక్క చర్మాన్ని వలిచి దానిని ఒక కవచములాగా తయారుచేసి, కుక్కయొక్క పక్కటెముకలను తీసి మంచు బండిని మరింత బాగా తయారు చేశాడు, పక్కనున్న మరోకుక్కకు కూడా కవచము తయారుచేసి, బెల్టులో షిట్ నైఫ్ దోపుకొని మంచు కొండలలోకి మాయమయ్యాడు. ఈ కథ పేరు ’ఏమీ లేకుండా బయటికి వెళ్ళడం" (నవ్వులు) ఇలా౦టి ఎన్నో ఉద౦తాలు (చప్పట్లు) ఇన్యూట్ ప్రజల యొక్క మొక్కవోని ధైర్యానికి మచ్చుతునకలుగా నిలుస్తాయి, అలాగే ప్రపంచంలోని వివిధ తెగల ప్రజలు కూడా ఇలా౦టి వైవిధ్యాలు కలిగిఉన్నారు. 1999 ఏప్రిల్లో కెనడా ప్రభుత్వము ఇన్యూట్ తెగల ప్రా౦త౦పై నియంత్రణను వారికి తిరిగి ఇచ్చేసింది ఈ భూభాగము దాదాపు కాలిఫోర్నియా మరియు టెక్సాస్ లను కలిపిన దానికంటే ఎక్కువే. ఇది ఇప్పుడు మన స్వంత దేశం. దీని పేరు నునావట్. ఇది ఒక స్వతంత్ర్య సామ్రాజ్యం. అన్ని ఖనిజవనరులపై వారికి నియంత్రణాధికారం ఉంది, ఒక జాతీయ -ప్రభుత్వ౦ తన ప్రజలు లోల్పోయిన హక్కులను వారికి కల్పి౦చడ౦లో తీసుకునే శ్రద్ధకు నునావత్ మ౦చి ఉదాహరణ. మరి చివరికి, కనీస౦ ఈ మాటలు చెప్పడ౦ తప్పనిసరి అని నేను అనుకుంటాను ఇప్పటి వరకు మన౦ ప్రయాణ౦ చెసిన ఈ గ్రహం లోని మారుమూల ప్రాంతాలు ఇ౦కా చీకటిలోనే ఉ౦డిపోవని మన౦ అర్థ౦చేసుకోవాలి. ఆ ప్రా౦తాలు అక్కడి ప్రజల ఆవాసాలు అవి మనిషి ఊహాత్మకశక్తి శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తు మానవజాతి పుట్టుక మూలాలకు తీసుకు వెళతాయి. మనమందరం ఈ చిన్నారుల స్వప్నాలు, మన స్వంత పిల్లల కన్న కలలే అనుకుంటూ ఈ భూమ౦డల౦లో భాగస్వాముల మవుదాం. అందువల్ల, మనం చివరగా నేషనల్ జాగ్రఫీ ద్వారా ఈ రాజకీయవేత్తలు ఏమీ సాధించలేరని తెలియజేస్తున్నా౦. మనం ఆలోచించి చూస్తే ఈ వివాద పరిష్కార తర్కాలు-- చప్పట్లు ఈ తర్కాల వల్ల సాధించేది ఏమీ ఉ౦డదని నా అభిప్రాయ౦ కానీ ఈ చరిత్రను చెప్పడం వల్ల ప్రపంచాన్ని మార్చగలమని నేను భావిస్తాను అందుకే మనం చరిత్రను కథలుగా చెప్పే గొప్ప ప్రప౦చ సంస్థగా భావించుకోవాలి. ప్రపంచం మొత్తంలో నెలలో 35 మిలియన్ల మంది మన వెబ్ సైట్ ను చూస్తున్నారు. 156 దేశాలు మన ఛానెల్ ను ప్రసారం చేస్తున్నాయి. మన పత్రికలను లక్షలమంది చదువుతున్నారు. మరి మనం ఈ ఎథ్నోస్పియర్ లో చేస్తున్న ఈ ప్రయాణాల పరంపరలో మనతోబాటు మన ప్రేక్షకులను అద్భుతమైన ఆ సాంస్కృతిక ప్రదేశాల వద్దకు తీసుకెళ్ళడ౦ వల్ల వాటికి సహాయం చేయలేకపోయినా అవి వెలుగులోకి రావడానికి ఉపయోగపడుతు౦ది. మనకు అదృష్టవశాత్తు కనిపి౦చిన ప్రదేశాలను మెల్లిగా ఒక్కొక్క దాన్ని, మరి౦త దగ్గరగా పరిశీలిస్తే మానవశాస్త్రం యొక్క సారాన్ని వెలికితీస్తూ ఈ ప్రపంచం విభిన్న పార్శ్వాలతో ఉండదగిందిగా భావిస్తూ, మనం మరో జీవన మార్గానికి బాటలు వేద్దా౦, ఒక వాస్తవిక బహుళ సాంస్కృతిక ప్రపంచంలోకి ఎక్కడైతే జనులందరి విజ్డం మనందరి బాగుకోసం వినియోగించ బడుతుందో అక్కడికి. కృతఙతలు. (కరతాళ ధ్వనులతో అభిన౦దనలు)