క్రిప్టోకరెన్సీలు స్టార్ట్ అప్ లలో పెట్టుబడులకు ఎలా సహకరించగలవు.
-
0:02 - 0:04నేను నా సార్ట్ అప్ లో పెట్టుబడి
సమీకరిస్తున్నప్పుడు -
0:04 - 0:06ఒక పెట్టుబడిదారు నాతో ఏమన్నారంటే,
-
0:06 - 0:10"అశ్విని, నువ్వు కొన్ని లక్షల డాలర్లు
సమీకరిస్తావేమో. -
0:10 - 0:15ఇంకా నీ వ్యాపార సంస్థ ఐదు లేదా ఏడు కోట్ల
డాలర్లకు అమ్ముడుపోతుందేమో. -
0:16 - 0:18నువ్వు చాలా సంతోషిస్తావు.
-
0:18 - 0:21నీ తొలి పెట్టుబడిదారులు కూడా
చాలా సంతోషిస్తారు. -
0:22 - 0:24కానీ నేను మాత్రం చాలా బాధపడతాను.
-
0:24 - 0:26అందువల్ల నేను దీని లో పెట్టుబడి పెట్టాను."
-
0:27 - 0:30నేను అవాక్కయినట్టు గుర్తు.
-
0:31 - 0:33ఎవరు సంతోషముగా ఉండరు,
-
0:33 - 0:37నలబై లేదా యాభై లక్షల డాలర్లు ఒక సంస్థ లో
పెట్టుబడి పెట్టి -
0:37 - 0:41దానిని, ఐదు లేదా ఏడు కోట్ల డాలర్లకు
అమ్ముకొని? -
0:42 - 0:44నేను నూతన వ్యాపారవేత్తను.
-
0:44 - 0:47వ్యాపార పెట్టుబడి పెట్టటానికి, నాకు
ధనికులతో పరిచయాలు లేవు,అందుకే -
0:47 - 0:49వెంచర్ కాపిటలిస్ట్ లను కలిసాను
-
0:49 - 0:52వీరు సాధారణముగా టెక్నాలజీ సంస్థల్లో
పెట్టుబడి పెడతారు. -
0:53 - 0:57కానీ, నేను ఎప్పుడూ అర్ధం చేసుకోవటానికి
ప్రయత్నించలేదు -
0:57 - 0:59వెంచర్ కాపిటలిస్ట్ని పెట్టుబడికి
ప్రోత్సహించేది ఏమిటి అని. -
1:01 - 1:05వ్యవస్థాపకత లో మనం ఇప్పుడు ఒక
ఉజ్వల దశలో ఉన్నామని నమ్ముతున్నాను. -
1:05 - 1:09సంస్థలు పెట్టటానికి గతం కంటే
ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. -
1:10 - 1:14కానీ, ఆవిష్కారణ లను ప్రోత్సహించే
ఆర్థిక వ్యవస్థలు, -
1:14 - 1:16వెంచర్ కాపిటల్,
-
1:16 - 1:20గడిచిన ఇరవై నుంచి ముప్పై ఏళ్లలో
పరిణతి చెందలేదు. -
1:20 - 1:24వెంచర్ కాపిటల్ రూపొందించింది
భారీ పెట్టుబడులను -
1:24 - 1:30తక్కువ సంస్థల్లో పెట్టి తరువాత
కోట్ల డాలర్లకి అమ్ముకోవాటినికి. -
1:30 - 1:35అవి పెట్టుబడి పెట్టటానికి,
చిన్న చిన్న సంస్థలు, -
1:35 - 1:40తక్కువ లాభాలు ఆర్జించే నా సంస్థల
లాంటివాటి కోసం రూపొందించలేదు. -
1:40 - 1:43అది వీటిని నిరోధిస్తుంది,
కొత్త ఆలోచనకి లభించే పెట్టుబడి, -
1:43 - 1:45కొత్త సంస్థల సృష్టి
-
1:45 - 1:49ఇంకా ఎవరు నిజంగా ఆ పెట్టుబడుల వల్ల
వృద్ధి సాధిస్తారో. -
1:49 - 1:52ఇది ఒక కఠినమైన ప్రశ్న లేవెనెత్తుతుంది.
-
1:52 - 1:55మన వ్యవస్థాపకత లక్ష్యం ఏమిటి?
-
1:55 - 2:01మన లక్ష్యం చిన్న సంఖ్య లో కోట్ల డాల్లర్ల
సంస్థలను సృష్టించడమైతే, -
2:01 - 2:04వెంచర్ కాపిటల్ నే వాడదాం,
అది పనిచేస్తుంది. -
2:04 - 2:08కానీ మన లక్ష్యం ఆవిష్కరణలకి
స్ఫూర్తిని ఇవ్వాటం -
2:08 - 2:12ఇంకా ఎక్కువ జనులు వివిధ స్థాయి లో ఉన్న
సంస్థలను స్థాపించడం అయితే, -
2:12 - 2:14మనకు వీటి మూలధన సమీకరణకు
కొత్త దారి కావాలి. -
2:14 - 2:16మనకు ఒక అనువైన ఏర్పాటు కావాలి
-
2:16 - 2:19అది వ్యాపారవేత్తలను, పెట్టుబడి దారులను
ఇరికించి -
2:19 - 2:23ఒక పరిమితి కలిగిన ఆర్థిక ఫలితం ఇవ్వకూడదు.
-
2:24 - 2:27పెట్టుబడి ధనం అందరికి అందుబాటులో ఉండాలి.
-
2:28 - 2:312017 వేసవి లో, నేను
సాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాను, -
2:31 - 2:34ఇంకో ముప్పై సంస్థలున్న టెక్ ఆక్సిలేటర్లో
చేరటానికి. -
2:34 - 2:39ఆ ఆక్సిలేటర్ మాకు వెంచర్ పెట్టుబడి ఎలా
సేకరించాలి నేర్పించాలి. -
2:39 - 2:40కానీ నేను అక్కడికి వెళ్లేసరికి
-
2:40 - 2:47స్టార్ట్ అప్ సమూహం ఐ.సి.ఓ/ఇనీటియాల్ కాయిన్
ఆఫరింగ్స్ గురించి చర్చించుకుంటున్నారు. -
2:47 - 2:53మొదటిసారి, ఐ.సి.ఓ.లు నూతన స్టార్ట్ అప్ ల
కోసం ఎక్కువ పెట్టుబడి సాధించాయి, -
2:53 - 2:55వెంచర్ కాపిటల్ కంటే కూడా.
-
2:56 - 2:57అది కార్యక్రమంలో మొదటి వారం.
-
2:57 - 2:59ఉత్సాహవంతమైన శుక్రవారం.
-
2:59 - 3:01ఇంకా వ్యవస్థాపకులు మాట్లాడుతూనే ఉన్నారు.
-
3:01 - 3:02"నేను ఇక ఐ.సి.ఓ. సాదిస్తాను."
-
3:03 - 3:04"నేను ఇక ఐ.సి.ఓ. సాదిస్తాను."
-
3:04 - 3:06ఇంతలో ఒక వ్యక్తి అన్నాడు,
-
3:06 - 3:09" ఇది మనందరం కలిసి చేస్తే ఎలా ఉంటుంది?,
-
3:09 - 3:12మనం మన సంస్థల విలువని బట్టి
ఒక ఐ.సి.ఓ. తయారు చేద్దాం -
3:12 - 3:14ఒక బృందంగా పెట్టుబడి సాధిద్దాం."
-
3:14 - 3:17ఆ సందర్భం లో,నేను ఈ ప్రశ్న అడిగాను,
-
3:17 - 3:19"మిత్రులారా, ఐ.సి.ఓ అంటే ఏమిటి?
-
3:19 - 3:23ఐ.సి.ఓలు , నూతన సంస్థల కి కావాల్సిన
పెట్టుబడిని సమీకరించడానికి -
3:23 - 3:26డిజిటల్ కరెన్సీ ని జారీ చేస్తాయి
-
3:26 - 3:30అది సంస్థ విలువ మరియు సేవలతో
ముడి పడి ఉంటుంది. -
3:30 - 3:33ఈ కరెన్సీ ఒక సంస్థ వాటాలతో పోలి ఉంటాయి,
-
3:33 - 3:35పబ్లిక్ షేర్ మార్కెట్ లో లాగా,
-
3:35 - 3:37వాటి విలువ ఆన్లైన్ ట్రేడింగ్ వల్ల
పెరుగుతూ ఉంటుంది. -
3:38 - 3:44ముఖ్యముగా, ఐ.సి.ఓ లు పెట్టుబడిదారుల
సమూహాన్నీ విస్తరింపచేస్తుంది, -
3:44 - 3:46కొన్ని వందల వెంచర్ కాపిటల్ సంస్థల నుంచి
-
3:46 - 3:50పెట్టుబడి పెట్టటానికి ఆసక్తి చూపే
కొన్ని లక్షల సామాన్య ప్రజల వరకు. -
3:51 - 3:54ఈ మార్కెట్ ఎక్కువ ధనాన్ని కలిగి ఉంది.
-
3:54 - 3:56ఇది ఎక్కువ పెట్టుబడిదారులని కలిగి ఉంది.
-
3:56 - 4:00అంటే మూలధనం సాధించే
సంభావ్యత ఎక్కువ. -
4:01 - 4:02నాకు ఆలోచన బాగా నచ్చింది.
-
4:03 - 4:06కానీ,ఇది అందరం కలిసి చేద్దామనే ఆలోచన
కొంచెం వెర్రితనంలా అనిపిస్తుంది. -
4:06 - 4:09పెట్టుబడి కోసం స్టార్ట్ అప్ ఒకరితో
ఒకరు పోటీ పడతారు, -
4:09 - 4:12ఒక చెక్ సాదించటానికి కొన్ని వందల
చర్చలు జరపవలసి వస్తుంది. -
4:14 - 4:17నేను ఒక పెట్టుబడిదారు తో విలువైన
పదిహేను నిముషాలు గడుపుతూ -
4:18 - 4:22నా సంస్థ గురించే కాకుండా, జట్టులోని ఇతర
సంస్థల గురించి మాట్లాడటం అనేది, -
4:22 - 4:23చాలా కొత్తగా ఉంది.
-
4:25 - 4:26కానీ ఈ ఆలోచన జనామోదం పొందినది.
-
4:27 - 4:31మేము పోటీ పడే బదులు పరస్పరం
సహకరించుకుందామని నిర్ణయించుకున్నాము. -
4:32 - 4:37ప్రతి సంస్థ తన ఈక్విటీ లోని పది శాతం
సంపదని ఒకే చోట పేర్చి వీటిని -
4:37 - 4:41లావాదేవీలకు అనుకూలముగా క్రిప్టోకరన్సీలా
విభజించాము,పెట్టుబడిదారు -
4:41 - 4:42కొనుగోలు లేదా అమ్మటం చేయటానికి.
-
4:43 - 4:46ఆరు నెలలు , నాలుగు చట్ట సంస్థల తరువాత
-
4:46 - 4:48(నవ్వులు)
-
4:48 - 4:52జనవరి 2018 లో మొదటి
ఐ.సి.ఓ విడుదల చేసాము -
4:52 - 4:55ఇది సుమారుగా ముప్పై సంస్థల విలువను
సూచిస్తుంది -
4:55 - 4:58ఇంకా ఇది పెట్టుబడి సాదించటానికి ఒక
నూతన మార్గం. -
4:59 - 5:01మాకు చాలా ప్రచారం వచ్చింది.
-
5:01 - 5:03మా గురించి ,నాకు ఇష్టమైన శీర్షిక ఇలా ఉంది
-
5:03 - 5:05"వెంచర్ కాపిటలిస్ట్ లారా ,
ఇది చదవండి, ఏడవండి." -
5:05 - 5:08(నవ్వులు)
-
5:08 - 5:10మా ఫండ్ సహజంగానే చాలా భిన్నమైనది.
-
5:10 - 5:12స్థాపకుల్లో ఇరవై శాతం మహిళలే.
-
5:13 - 5:15యాభై శాతం అంతర్జాతీయులు.
-
5:15 - 5:17పెట్టుబడిదారులు కూడా చాలా
ఉత్సాహం చూపించారు. -
5:18 - 5:19ఎక్కువ ప్రతిఫలం పొందే అవకాశం వచ్చింది,
-
5:19 - 5:22ఎందుకంటే మేము వెంచర్ క్యాపిటల్లో
మధ్యవర్తి రుసుము తొలగించాం. -
5:22 - 5:25ఇంకా వారు వారి సొమ్ము తీసుకొని,
తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు, -
5:25 - 5:28ఇంకొన్ని కొత్త ఆలోచల్లో వేగంగా
పెట్టుబడి పెట్టచ్చు. -
5:30 - 5:35ఇది ఒక నిరంతర ధనం సృష్టిస్తుంది అని
భావిస్తున్నాను -
5:35 - 5:39ఇది ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు
విజయవంతం అవటానికి తోడ్పడుతుంది. -
5:39 - 5:42ఎందుకంటే, పెట్టుబడి ఉండటం అంటే,
అవకాశం ఉన్నట్టే. -
5:42 - 5:45ఇంకా మేము ఇప్పుడు ఊహించడం మొదలుపెట్టాం
-
5:45 - 5:48పెట్టుబడి అందరికి అందుబాటులో
ఉంటె ఏమి జరుగుతుందో అని. -
5:50 - 5:53నేను ఎప్పుడూ ఊహించలేదు, నా సొంత
పెట్టుబడి వెతుకులాట నన్ను -
5:53 - 5:55ఈ వేదిక వరకు తీసుకువస్తుందని,
-
5:55 - 5:59ముప్పై సంస్థల్లో పెట్టుబడికి
సహకరిస్తుందని. -
6:00 - 6:06ఒకసారి ఊహించండి, పారిశ్రామికవేత్తలు,
కొత్త పెట్టుబడి మార్గాలని సృష్టిస్తే, -
6:06 - 6:08పాత మార్గాలని పాటించకుండా.
-
6:08 - 6:11ఇది ఏమి తయారవుతుందో,ఎలా తయారవుతుందో,
మార్చివేస్తుంది ఇంకా -
6:11 - 6:14ఇది ఆర్థిక వ్యవస్థ మీద దీర్ఘకాలీక
ప్రభావం చూపిస్తుంది. -
6:14 - 6:17నేను నమ్ముతున్నాను,
ఇది ఇంకా ఉత్తేజం కలిగిస్తుంది -
6:17 - 6:20మరో కోట్ల డాలర్ల స్టార్ట్ అప్ లో
పెట్టుబడి పెట్టటం కంటే. -
6:20 - 6:21ధన్యవాదములు.
-
6:21 - 6:25(చప్పట్లు)
- Title:
- క్రిప్టోకరెన్సీలు స్టార్ట్ అప్ లలో పెట్టుబడులకు ఎలా సహకరించగలవు.
- Speaker:
- అశ్విని అన్బురాజన్
- Description:
-
అశ్విని అన్బురాజన్ అంటారు "ఆవిష్కరణల్లో మనం ఒక సువర్ణ శకం లో ఉన్నాం." కానీ వెంచర్ కాపిటల్ (పెట్టుబడి / మూలధన) ఇంకా పరిణితి చెందలేదు, స్టార్టుప్ లు ఎదగటానికి ఎలాంటి పెట్టుబడి పొందటంలేదు. ఈ చర్చ లో ఆవిడ, తన సంస్థ లో పెట్టుబడి పెట్టటానికి ,పరస్పర సహకారం మరియు క్రిప్టో కరెన్సీ లను వాడి మూలధన సముపార్జనకు ఎలా ఒక కొత్త దారిని కనుగొన్నారో , ఆ ఆలోచనని పంచుకుంటారు.
- Video Language:
- English
- Team:
closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 06:38
![]() |
Samrat Sridhara approved Telugu subtitles for How cryptocurrency can help start-ups get investment capital | |
![]() |
Samrat Sridhara edited Telugu subtitles for How cryptocurrency can help start-ups get investment capital | |
![]() |
Samrat Sridhara accepted Telugu subtitles for How cryptocurrency can help start-ups get investment capital | |
![]() |
Samrat Sridhara edited Telugu subtitles for How cryptocurrency can help start-ups get investment capital | |
![]() |
Anil Kumar Reddy Gade edited Telugu subtitles for How cryptocurrency can help start-ups get investment capital | |
![]() |
Anil Kumar Reddy Gade edited Telugu subtitles for How cryptocurrency can help start-ups get investment capital | |
![]() |
Anil Kumar Reddy Gade edited Telugu subtitles for How cryptocurrency can help start-ups get investment capital |