నేను నా సార్ట్ అప్ లో పెట్టుబడి
సమీకరిస్తున్నప్పుడు
ఒక పెట్టుబడిదారు నాతో ఏమన్నారంటే,
"అశ్విని, నువ్వు కొన్ని లక్షల డాలర్లు
సమీకరిస్తావేమో.
ఇంకా నీ వ్యాపార సంస్థ ఐదు లేదా ఏడు కోట్ల
డాలర్లకు అమ్ముడుపోతుందేమో.
నువ్వు చాలా సంతోషిస్తావు.
నీ తొలి పెట్టుబడిదారులు కూడా
చాలా సంతోషిస్తారు.
కానీ నేను మాత్రం చాలా బాధపడతాను.
అందువల్ల నేను దీని లో పెట్టుబడి పెట్టాను."
నేను అవాక్కయినట్టు గుర్తు.
ఎవరు సంతోషముగా ఉండరు,
నలబై లేదా యాభై లక్షల డాలర్లు ఒక సంస్థ లో
పెట్టుబడి పెట్టి
దానిని, ఐదు లేదా ఏడు కోట్ల డాలర్లకు
అమ్ముకొని?
నేను నూతన వ్యాపారవేత్తను.
వ్యాపార పెట్టుబడి పెట్టటానికి, నాకు
ధనికులతో పరిచయాలు లేవు,అందుకే
వెంచర్ కాపిటలిస్ట్ లను కలిసాను
వీరు సాధారణముగా టెక్నాలజీ సంస్థల్లో
పెట్టుబడి పెడతారు.
కానీ, నేను ఎప్పుడూ అర్ధం చేసుకోవటానికి
ప్రయత్నించలేదు
వెంచర్ కాపిటలిస్ట్ని పెట్టుబడికి
ప్రోత్సహించేది ఏమిటి అని.
వ్యవస్థాపకత లో మనం ఇప్పుడు ఒక
ఉజ్వల దశలో ఉన్నామని నమ్ముతున్నాను.
సంస్థలు పెట్టటానికి గతం కంటే
ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
కానీ, ఆవిష్కారణ లను ప్రోత్సహించే
ఆర్థిక వ్యవస్థలు,
వెంచర్ కాపిటల్,
గడిచిన ఇరవై నుంచి ముప్పై ఏళ్లలో
పరిణతి చెందలేదు.
వెంచర్ కాపిటల్ రూపొందించింది
భారీ పెట్టుబడులను
తక్కువ సంస్థల్లో పెట్టి తరువాత
కోట్ల డాలర్లకి అమ్ముకోవాటినికి.
అవి పెట్టుబడి పెట్టటానికి,
చిన్న చిన్న సంస్థలు,
తక్కువ లాభాలు ఆర్జించే నా సంస్థల
లాంటివాటి కోసం రూపొందించలేదు.
అది వీటిని నిరోధిస్తుంది,
కొత్త ఆలోచనకి లభించే పెట్టుబడి,
కొత్త సంస్థల సృష్టి
ఇంకా ఎవరు నిజంగా ఆ పెట్టుబడుల వల్ల
వృద్ధి సాధిస్తారో.
ఇది ఒక కఠినమైన ప్రశ్న లేవెనెత్తుతుంది.
మన వ్యవస్థాపకత లక్ష్యం ఏమిటి?
మన లక్ష్యం చిన్న సంఖ్య లో కోట్ల డాల్లర్ల
సంస్థలను సృష్టించడమైతే,
వెంచర్ కాపిటల్ నే వాడదాం,
అది పనిచేస్తుంది.
కానీ మన లక్ష్యం ఆవిష్కరణలకి
స్ఫూర్తిని ఇవ్వాటం
ఇంకా ఎక్కువ జనులు వివిధ స్థాయి లో ఉన్న
సంస్థలను స్థాపించడం అయితే,
మనకు వీటి మూలధన సమీకరణకు
కొత్త దారి కావాలి.
మనకు ఒక అనువైన ఏర్పాటు కావాలి
అది వ్యాపారవేత్తలను, పెట్టుబడి దారులను
ఇరికించి
ఒక పరిమితి కలిగిన ఆర్థిక ఫలితం ఇవ్వకూడదు.
పెట్టుబడి ధనం అందరికి అందుబాటులో ఉండాలి.
2017 వేసవి లో, నేను
సాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాను,
ఇంకో ముప్పై సంస్థలున్న టెక్ ఆక్సిలేటర్లో
చేరటానికి.
ఆ ఆక్సిలేటర్ మాకు వెంచర్ పెట్టుబడి ఎలా
సేకరించాలి నేర్పించాలి.
కానీ నేను అక్కడికి వెళ్లేసరికి
స్టార్ట్ అప్ సమూహం ఐ.సి.ఓ/ఇనీటియాల్ కాయిన్
ఆఫరింగ్స్ గురించి చర్చించుకుంటున్నారు.
మొదటిసారి, ఐ.సి.ఓ.లు నూతన స్టార్ట్ అప్ ల
కోసం ఎక్కువ పెట్టుబడి సాధించాయి,
వెంచర్ కాపిటల్ కంటే కూడా.
అది కార్యక్రమంలో మొదటి వారం.
ఉత్సాహవంతమైన శుక్రవారం.
ఇంకా వ్యవస్థాపకులు మాట్లాడుతూనే ఉన్నారు.
"నేను ఇక ఐ.సి.ఓ. సాదిస్తాను."
"నేను ఇక ఐ.సి.ఓ. సాదిస్తాను."
ఇంతలో ఒక వ్యక్తి అన్నాడు,
" ఇది మనందరం కలిసి చేస్తే ఎలా ఉంటుంది?,
మనం మన సంస్థల విలువని బట్టి
ఒక ఐ.సి.ఓ. తయారు చేద్దాం
ఒక బృందంగా పెట్టుబడి సాధిద్దాం."
ఆ సందర్భం లో,నేను ఈ ప్రశ్న అడిగాను,
"మిత్రులారా, ఐ.సి.ఓ అంటే ఏమిటి?
ఐ.సి.ఓలు , నూతన సంస్థల కి కావాల్సిన
పెట్టుబడిని సమీకరించడానికి
డిజిటల్ కరెన్సీ ని జారీ చేస్తాయి
అది సంస్థ విలువ మరియు సేవలతో
ముడి పడి ఉంటుంది.
ఈ కరెన్సీ ఒక సంస్థ వాటాలతో పోలి ఉంటాయి,
పబ్లిక్ షేర్ మార్కెట్ లో లాగా,
వాటి విలువ ఆన్లైన్ ట్రేడింగ్ వల్ల
పెరుగుతూ ఉంటుంది.
ముఖ్యముగా, ఐ.సి.ఓ లు పెట్టుబడిదారుల
సమూహాన్నీ విస్తరింపచేస్తుంది,
కొన్ని వందల వెంచర్ కాపిటల్ సంస్థల నుంచి
పెట్టుబడి పెట్టటానికి ఆసక్తి చూపే
కొన్ని లక్షల సామాన్య ప్రజల వరకు.
ఈ మార్కెట్ ఎక్కువ ధనాన్ని కలిగి ఉంది.
ఇది ఎక్కువ పెట్టుబడిదారులని కలిగి ఉంది.
అంటే మూలధనం సాధించే
సంభావ్యత ఎక్కువ.
నాకు ఆలోచన బాగా నచ్చింది.
కానీ,ఇది అందరం కలిసి చేద్దామనే ఆలోచన
కొంచెం వెర్రితనంలా అనిపిస్తుంది.
పెట్టుబడి కోసం స్టార్ట్ అప్ ఒకరితో
ఒకరు పోటీ పడతారు,
ఒక చెక్ సాదించటానికి కొన్ని వందల
చర్చలు జరపవలసి వస్తుంది.
నేను ఒక పెట్టుబడిదారు తో విలువైన
పదిహేను నిముషాలు గడుపుతూ
నా సంస్థ గురించే కాకుండా, జట్టులోని ఇతర
సంస్థల గురించి మాట్లాడటం అనేది,
చాలా కొత్తగా ఉంది.
కానీ ఈ ఆలోచన జనామోదం పొందినది.
మేము పోటీ పడే బదులు పరస్పరం
సహకరించుకుందామని నిర్ణయించుకున్నాము.
ప్రతి సంస్థ తన ఈక్విటీ లోని పది శాతం
సంపదని ఒకే చోట పేర్చి వీటిని
లావాదేవీలకు అనుకూలముగా క్రిప్టోకరన్సీలా
విభజించాము,పెట్టుబడిదారు
కొనుగోలు లేదా అమ్మటం చేయటానికి.
ఆరు నెలలు , నాలుగు చట్ట సంస్థల తరువాత
(నవ్వులు)
జనవరి 2018 లో మొదటి
ఐ.సి.ఓ విడుదల చేసాము
ఇది సుమారుగా ముప్పై సంస్థల విలువను
సూచిస్తుంది
ఇంకా ఇది పెట్టుబడి సాదించటానికి ఒక
నూతన మార్గం.
మాకు చాలా ప్రచారం వచ్చింది.
మా గురించి ,నాకు ఇష్టమైన శీర్షిక ఇలా ఉంది
"వెంచర్ కాపిటలిస్ట్ లారా ,
ఇది చదవండి, ఏడవండి."
(నవ్వులు)
మా ఫండ్ సహజంగానే చాలా భిన్నమైనది.
స్థాపకుల్లో ఇరవై శాతం మహిళలే.
యాభై శాతం అంతర్జాతీయులు.
పెట్టుబడిదారులు కూడా చాలా
ఉత్సాహం చూపించారు.
ఎక్కువ ప్రతిఫలం పొందే అవకాశం వచ్చింది,
ఎందుకంటే మేము వెంచర్ క్యాపిటల్లో
మధ్యవర్తి రుసుము తొలగించాం.
ఇంకా వారు వారి సొమ్ము తీసుకొని,
తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు,
ఇంకొన్ని కొత్త ఆలోచల్లో వేగంగా
పెట్టుబడి పెట్టచ్చు.
ఇది ఒక నిరంతర ధనం సృష్టిస్తుంది అని
భావిస్తున్నాను
ఇది ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు
విజయవంతం అవటానికి తోడ్పడుతుంది.
ఎందుకంటే, పెట్టుబడి ఉండటం అంటే,
అవకాశం ఉన్నట్టే.
ఇంకా మేము ఇప్పుడు ఊహించడం మొదలుపెట్టాం
పెట్టుబడి అందరికి అందుబాటులో
ఉంటె ఏమి జరుగుతుందో అని.
నేను ఎప్పుడూ ఊహించలేదు, నా సొంత
పెట్టుబడి వెతుకులాట నన్ను
ఈ వేదిక వరకు తీసుకువస్తుందని,
ముప్పై సంస్థల్లో పెట్టుబడికి
సహకరిస్తుందని.
ఒకసారి ఊహించండి, పారిశ్రామికవేత్తలు,
కొత్త పెట్టుబడి మార్గాలని సృష్టిస్తే,
పాత మార్గాలని పాటించకుండా.
ఇది ఏమి తయారవుతుందో,ఎలా తయారవుతుందో,
మార్చివేస్తుంది ఇంకా
ఇది ఆర్థిక వ్యవస్థ మీద దీర్ఘకాలీక
ప్రభావం చూపిస్తుంది.
నేను నమ్ముతున్నాను,
ఇది ఇంకా ఉత్తేజం కలిగిస్తుంది
మరో కోట్ల డాలర్ల స్టార్ట్ అప్ లో
పెట్టుబడి పెట్టటం కంటే.
ధన్యవాదములు.
(చప్పట్లు)