-
సర్క్యూట్ల గురించి నేను కనుగొన్న ఒక మంచి
విషయం ఏమిటంటే,
-
సర్క్యూట్రీ అనేది ఒక కళా రూపం, నాకు ఉన్న
సృజనని నేను సర్క్యూట్లతో వెలికి తీయవచ్చు.
-
సో, మీకు గనక ఆలోచనలుంటే, వాటిని నిజజీవితం
లోకి తీసుకురాడానికి టెక్నాలజీ వాడుకోవచ్చు
-
కంప్యూటర్ యొక్క ప్రతి ఇన్పుట్ మరియు ఔట్
పుట్ సమర్థవంతంగా ఒక రకం సమాచారము, దానిని
-
ఆన్ లేదా ఆఫ్ విద్యుత్ సిగ్నల్స్ తో లేదా
-
ఒకట్లు మరియు సున్నాలతో తెలియజేయవచ్చు.
-
ఇన్పుట్ గా వచ్చే సమాచారాన్ని ప్రక్రియచేసి
ఔట్పుట్ సమాచారంగా చేయడానికి గాను, ఒక
-
కంప్యూటర్ ఆ ఇన్పుట్ సిగ్నల్స్ ని మార్చి
సమ్మేళనం చేయాల్సి ఉంటుంది.
-
దీనికి, కంప్యూటర్ కి మిలియన్లకొద్దీ చిన్న
ఎలక్ట్రానిక్ అంశాలు సర్క్యూట్లుగా కావాలి
-
సర్క్యూట్లు సమాచారాన్ని మార్చి ఎలాప్రక్రియ
చేసి ఒకట్లు జీరోలుగా చూపుతాయో చూద్దాంమరి.
-
ఇది అద్భుతమైన ఒక సులువైన సర్క్యూట్.
-
ఇది ఆన్ లేదా ఆఫ్ విద్యుత్ సిగ్నల్ తీసుకొని
దానిని తిరగవేస్తుంది.
-
మీరిచ్చిన సిగ్నల్ 1 ఐతే, సర్క్యూట్ మీకు 0
ఇస్తుంది,
-
మీరు సర్క్యూట్ కి 0 ఇస్తే మీకు1ఇస్తుంది.
-
లోపలికెళ్ళే సిగ్నల్, బయటికొచ్చే సిగ్నల్
ఒకటేకాదు, అందుకేమనం సర్క్యూట్ నాట్ అంటాం
-
అతి క్లిష్టమైన సర్క్యూట్లు పలు సిగ్నల్స్
తీసుకొని కలుపుతాయి, మీకు వేరే ఫలితమిస్తాయి
-
ఈ ఉదా.లో ఓ సర్క్యూట్ 2 విద్యుత్ సిగ్నల్స్
తీసుకుంటుంది, ఇప్పుడు ప్రతీదీ 1 లేదా 0.
-
వచ్చే సిగ్నల్స్ లో ఏది 0 ఐనా, అపుడు ఫలితం
కూడా 0 అవుతుంది.
-
సర్క్యూట్ మీకు 1 మాత్రమే ఇస్తుంది,
-
ఒకవేళ మొదటి మరియు రెండో సిగ్నల్ కూడా 1 ఐతే
దాన్ని మనం సర్క్యూట్ అండ్ అంటాం.
-
సులువైన తార్కిక లెక్కలు చేసే ఇలాంటి చిన్న
సర్క్యూట్లు అనేకం ఉన్నాయి.
-
ఈ సర్క్యూట్లను కలిపి కనెక్ట్ చేస్తే, మరింత
కఠినలెక్కలు చేసే కఠినసర్క్యూట్లను చేయొచ్చు
-
ఉదా, 2 బిట్స్ కలిపి జోడించే యాడర్ అనబడే
ఒక సర్క్యూట్ ని మీరు చేయవచ్చు.
-
ఈ సర్క్యూట్ 2 విడి బిట్స్ తీసుకుంటుంది, 1
లేదా 0, మొత్తం లెక్కకు వాటిని కూడుతుంది.
-
మొత్తం 0 ప్లస్ 0 కూడితే 0 కావచ్చు,
-
0 ప్లస్ 1 కూడితే 1,లేదా 1 ప్లస్ 1కూడితే 2.
-
బైటికి రావడానికి మీకు 2 వైర్లు కావాలి,
మొత్తం తెలపడానికి 2 బైనరీ అంకెలు కావాలిగా
-
2 బిట్స్ సమాచారం కూడటానికి మీవద్ద ఒక
సింగిల్ యాడర్ ఉందంటే,
-
ఇంకాపెద్ద అంకెల్ని కలపడానికి మీరు ఈ యాడర్
సర్క్యూట్లగుణకాలను ప్రక్కప్రక్కన ఉంచొచ్చు
-
ఉదా, ఒక 8-బిట్ యాడర్, సంఖ్యలు 25 మరియు 50
లను ఎలా కూడుతుందో ఇక్కడ చూడండి.
-
ప్రతి నంబర్ 8 బిట్స్ తో చూపబడింది,ఫలితంగా
16వేర్వేరు విద్యుత్ సిగ్నల్స్ సర్క్యూట్లో.
-
8-బిట్ యాడర్ కొరకు సర్క్యూట్లో అనేక చిన్న
యాడర్లుంటాయి, అవి మొత్తాన్ని లెక్కిస్తాయి.
-
వేర్వేరు విద్యుత్ సర్క్యూట్లు తీసివేత లేదా
గుణింతం వంటిసులువైన లెక్కల్ని చేయగలుగుతాయి
-
నిజానికి, మీ కంప్యూటర్ చేసే సమాచారప్రక్రియ
అంతా అనేక చిన్నచిన్న పనుల్నికలిపిచేస్తుంది
-
కంప్యూటర్ చేసే ప్రతి పనీ, ఒక మనిషి చేసేటంత
చాలా సులువైన పనిగా ఉంటుంది.
-
ఐతే కంప్యూటర్ లో ఉండేసర్క్యూట్లు చాలావేగం.
-
ఒకప్పుడు ఈ సర్క్యూట్లు పెద్దవి, చిక్కైనవి,
-
ఒక 8-బిట్ యాడర్ ఫ్రిజ్ అంత పెద్దది, మరియు
ఒకచిన్న పనిచేయడానికి నిముషాలకొద్దీ పట్టేది
-
ఈరోజు కంప్యూటర్ సర్క్యూట్లు సైజులో అతి
సూక్ష్మం మరియు అతి వేగం.
-
చిన్న కంప్యూటర్లు కూడా ఎందుకు అంత వేగం?
-
ఎందుకంటే చిన్నసర్క్యూట్లలో తక్కువ దూరానికి
విద్యుత్ సిగ్నల్ వెళ్ళాల్సి ఉంటుంది.
-
విద్యుత్తు కాంతివేగంలాగా వెళుతుంది, అందుకే
ఆధునిక సర్క్యూట్లు సెకనుకి బిలియన్లలెక్కలు
-
చేస్తాయి. సో, మీరు గేమ్ ఆడుతున్నా, వీడియో
రికార్డ్ చేస్తున్నా లేదా కాస్మోస్ వెతికినా
-
టెక్నాలజీతో మీరు చేసే ప్రతి పనికీ అనేక
సమాచారం త్వరగా ప్రక్రియ కావాల్సి ఉంటుంది.
-
ఈ క్లిష్టత కింద అనేకానేక చిన్న సర్క్యూట్లు
ఉండి అవి బైనరీ సిగ్నల్స్ ని వెబ్సైట్లు,
-
వీడియోలు, సంగీతం, ఇంకాగేమ్స్ గా మారుస్తాయి
-
ఈ సర్క్యూట్లు వ్యాధినిర్ధారణకై DNA డీకోడ్
చేయడానికి కూడా మనకు సహాయపడతాయి.
-
మరి ఈ సర్క్యూట్లతో ఏం చేయాలనుకుంటున్నారు?