సర్క్యూట్ల గురించి నేను కనుగొన్న ఒక మంచి విషయం ఏమిటంటే, సర్క్యూట్రీ అనేది ఒక కళా రూపం, నాకు ఉన్న సృజనని నేను సర్క్యూట్లతో వెలికి తీయవచ్చు. సో, మీకు గనక ఆలోచనలుంటే, వాటిని నిజజీవితం లోకి తీసుకురాడానికి టెక్నాలజీ వాడుకోవచ్చు కంప్యూటర్ యొక్క ప్రతి ఇన్‌పుట్ మరియు ఔట్ పుట్ సమర్థవంతంగా ఒక రకం సమాచారము, దానిని ఆన్ లేదా ఆఫ్ విద్యుత్ సిగ్నల్స్ తో లేదా ఒకట్లు మరియు సున్నాలతో తెలియజేయవచ్చు. ఇన్‌పుట్ గా వచ్చే సమాచారాన్ని ప్రక్రియచేసి ఔట్‌పుట్ సమాచారంగా చేయడానికి గాను, ఒక కంప్యూటర్ ఆ ఇన్‌పుట్ సిగ్నల్స్ ని మార్చి సమ్మేళనం చేయాల్సి ఉంటుంది. దీనికి, కంప్యూటర్ కి మిలియన్లకొద్దీ చిన్న ఎలక్ట్రానిక్ అంశాలు సర్క్యూట్లుగా కావాలి సర్క్యూట్లు సమాచారాన్ని మార్చి ఎలాప్రక్రియ చేసి ఒకట్లు జీరోలుగా చూపుతాయో చూద్దాంమరి. ఇది అద్భుతమైన ఒక సులువైన సర్క్యూట్. ఇది ఆన్ లేదా ఆఫ్ విద్యుత్ సిగ్నల్ తీసుకొని దానిని తిరగవేస్తుంది. మీరిచ్చిన సిగ్నల్ 1 ఐతే, సర్క్యూట్ మీకు 0 ఇస్తుంది, మీరు సర్క్యూట్ కి 0 ఇస్తే మీకు1ఇస్తుంది. లోపలికెళ్ళే సిగ్నల్, బయటికొచ్చే సిగ్నల్ ఒకటేకాదు, అందుకేమనం సర్క్యూట్ నాట్ అంటాం అతి క్లిష్టమైన సర్క్యూట్లు పలు సిగ్నల్స్ తీసుకొని కలుపుతాయి, మీకు వేరే ఫలితమిస్తాయి ఈ ఉదా.లో ఓ సర్క్యూట్ 2 విద్యుత్ సిగ్నల్స్ తీసుకుంటుంది, ఇప్పుడు ప్రతీదీ 1 లేదా 0. వచ్చే సిగ్నల్స్ లో ఏది 0 ఐనా, అపుడు ఫలితం కూడా 0 అవుతుంది. సర్క్యూట్ మీకు 1 మాత్రమే ఇస్తుంది, ఒకవేళ మొదటి మరియు రెండో సిగ్నల్ కూడా 1 ఐతే దాన్ని మనం సర్క్యూట్ అండ్ అంటాం. సులువైన తార్కిక లెక్కలు చేసే ఇలాంటి చిన్న సర్క్యూట్లు అనేకం ఉన్నాయి. ఈ సర్క్యూట్లను కలిపి కనెక్ట్ చేస్తే, మరింత కఠినలెక్కలు చేసే కఠినసర్క్యూట్లను చేయొచ్చు ఉదా, 2 బిట్స్ కలిపి జోడించే యాడర్ అనబడే ఒక సర్క్యూట్ ని మీరు చేయవచ్చు. ఈ సర్క్యూట్ 2 విడి బిట్స్ తీసుకుంటుంది, 1 లేదా 0, మొత్తం లెక్కకు వాటిని కూడుతుంది. మొత్తం 0 ప్లస్ 0 కూడితే 0 కావచ్చు, 0 ప్లస్ 1 కూడితే 1,లేదా 1 ప్లస్ 1కూడితే 2. బైటికి రావడానికి మీకు 2 వైర్లు కావాలి, మొత్తం తెలపడానికి 2 బైనరీ అంకెలు కావాలిగా 2 బిట్స్ సమాచారం కూడటానికి మీవద్ద ఒక సింగిల్ యాడర్ ఉందంటే, ఇంకాపెద్ద అంకెల్ని కలపడానికి మీరు ఈ యాడర్ సర్క్యూట్లగుణకాలను ప్రక్కప్రక్కన ఉంచొచ్చు ఉదా, ఒక 8-బిట్ యాడర్, సంఖ్యలు 25 మరియు 50 లను ఎలా కూడుతుందో ఇక్కడ చూడండి. ప్రతి నంబర్ 8 బిట్స్ తో చూపబడింది,ఫలితంగా 16వేర్వేరు విద్యుత్ సిగ్నల్స్ సర్క్యూట్లో. 8-బిట్ యాడర్ కొరకు సర్క్యూట్లో అనేక చిన్న యాడర్లుంటాయి, అవి మొత్తాన్ని లెక్కిస్తాయి. వేర్వేరు విద్యుత్ సర్క్యూట్లు తీసివేత లేదా గుణింతం వంటిసులువైన లెక్కల్ని చేయగలుగుతాయి నిజానికి, మీ కంప్యూటర్ చేసే సమాచారప్రక్రియ అంతా అనేక చిన్నచిన్న పనుల్నికలిపిచేస్తుంది కంప్యూటర్ చేసే ప్రతి పనీ, ఒక మనిషి చేసేటంత చాలా సులువైన పనిగా ఉంటుంది. ఐతే కంప్యూటర్ లో ఉండేసర్క్యూట్లు చాలావేగం. ఒకప్పుడు ఈ సర్క్యూట్లు పెద్దవి, చిక్కైనవి, ఒక 8-బిట్ యాడర్ ఫ్రిజ్ అంత పెద్దది, మరియు ఒకచిన్న పనిచేయడానికి నిముషాలకొద్దీ పట్టేది ఈరోజు కంప్యూటర్ సర్క్యూట్లు సైజులో అతి సూక్ష్మం మరియు అతి వేగం. చిన్న కంప్యూటర్లు కూడా ఎందుకు అంత వేగం? ఎందుకంటే చిన్నసర్క్యూట్లలో తక్కువ దూరానికి విద్యుత్ సిగ్నల్ వెళ్ళాల్సి ఉంటుంది. విద్యుత్తు కాంతివేగంలాగా వెళుతుంది, అందుకే ఆధునిక సర్క్యూట్లు సెకనుకి బిలియన్లలెక్కలు చేస్తాయి. సో, మీరు గేమ్ ఆడుతున్నా, వీడియో రికార్డ్ చేస్తున్నా లేదా కాస్మోస్ వెతికినా టెక్నాలజీతో మీరు చేసే ప్రతి పనికీ అనేక సమాచారం త్వరగా ప్రక్రియ కావాల్సి ఉంటుంది. ఈ క్లిష్టత కింద అనేకానేక చిన్న సర్క్యూట్లు ఉండి అవి బైనరీ సిగ్నల్స్ ని వెబ్‌సైట్లు, వీడియోలు, సంగీతం, ఇంకాగేమ్స్ గా మారుస్తాయి ఈ సర్క్యూట్లు వ్యాధినిర్ధారణకై DNA డీకోడ్ చేయడానికి కూడా మనకు సహాయపడతాయి. మరి ఈ సర్క్యూట్లతో ఏం చేయాలనుకుంటున్నారు?