-
ఇప్పుడు మనం గేమ్ ప్రోగ్రామర్లు రోజూ వాడే
అంశాల గురించి నేర్చుకోబోతున్నాం. వాటిని
-
ఈవెంట్లు అంటారు. ఏదైనా జరిగినప్పుడు వినమని
ఒక ఈవెంట్ మీ ప్రోగ్రాముకు చెబుతుంది. అది
-
జరిగినప్పుడు, అది ఒక చర్యను చేస్తుంది.
ఈవెంట్లకు కొన్ని ఉదాహరణలుగా, ఒకమౌస్ క్లిక్
-
ఒకయారో బటన్ వినడం, లేదా స్క్రీన్ పై తాకడం.
ఇక్కడ, ఒక ప్లేయర్ స్పేస్ బోట్ పై క్లిక్
-
చేస్తే అది ఎర్త్‌లింగ్స్ ని పలకరించేలా
చేయబోతున్నాం. మనం "వెన్ క్లిక్డ్" బ్లాక్
-
వాడి,దానికి "సే" బ్లాక్ జోడిస్తాం.ప్లేయర్
స్పేస్ బోట్ పై క్లిక్ చేసినప్పుడు, ఈ
-
"వెన్ క్లిక్డ్" కి జోడించియున్న ప్రతీదీ
పని చేస్తుంది. మీ సహచరి ఏమంటోంది మరి?
-
అక్కడ "వెన్ యారో" బ్లాకులు కూడా ఉన్నాయి.
మీరు వీటికి "మూవ్" బ్లాకులు లింక్ చేస్తే
-
మీ యాక్టర్లను పైకీ, కిందికీ, ఎడమకూ కుడికీ
కదిలించొచ్చు. దశవారీగా మీగేమ్ బాగుంటుంది.
-
నేను ఒక గేమ్ కంపెనీ మొదలుపెట్టాలనే కారణం
లో భాగం ఏమిటంటే నేను గేములు చేయాలనుకోవడం
-
మనుషులు ఇష్టపడి, ఆడి, ఆనందించేది చేయాలని
నేను అనుకున్నాను.
-
పనులు చేసి కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవాలనే
పిల్లలకు నా సలహా, ఏదో ఒకటి మొదలుపెట్టండని.
-
ఆడటం మొదలు చేయండి. మీకు కొంత అభద్రత లేదా
కొంచెం భయమున్నా, ఏమీ పర్వాలేదు.
-
మరింత అనుభవమున్న మిత్రుణ్ణి కనుక్కోండి.
వీడియో బోధనలు చూడండి.
-
ఊరకే అటూ ఇటూ చూసి ఏదో ఒకటి చేయండి. "ఇది
కాస్త చిత్రంగా లేదూ" అని మీకనిపించినా సరే.
-
లేదా దానివైపు చూసి "సరే నేను దీనితో ఎక్కడో
ఓ చోట ఆడుకుంటా" అనిపించినా సరే.
-
మీ స్వంత చూపుతో ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నం
అద్భుతమైన తమాషా అనుభవం.
-
మరి ఏదో ఒకటి చేస్తూ ఉండేవాళ్ళని నేను
ప్రోత్సహిస్తా. అదే చాలా ముఖ్యమైన భాగం.