< Return to Video

Dance Party - Properties

  • 0:02 - 0:07
    హౌర్ ఆఫ్ కోడ్ | డాన్స్ పార్టీ: ప్రాపర్టీస్
  • 0:09 - 0:10
    నా పేరు మరియా
  • 0:10 - 0:13
    నేను వాషింగ్టన్ యూనివర్సిటీలో జూనియర్ ని
  • 0:13 - 0:15
    మరియు అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీరును కూడా.
  • 0:17 - 0:19
    నాకు కంప్యూటరు పరిజ్ఞానము అంటే చాలా ఇష్టం
  • 0:19 - 0:22
    ఎందుకంటే అది సమస్యల పరిష్కారం చేస్తుంది ఇంకా సూక్ష్మమైన ఆలోచనలను వృద్ధి చేస్తుంది.
  • 0:22 - 0:25
    గంటలకొద్దీ మీ శ్రమని అందులో పెట్టాక,
  • 0:25 - 0:29
    ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది.
  • 0:33 - 0:37
    ఇప్పటి వరకు మీకు వివిధ రకములైన నృత్యకారులతో కలిసి పనిచేయడానికి అవకాశం కలిగింది
  • 0:37 - 0:41
    వారికి ఎన్నో నాట్య భంగిమలను మీరు సృష్టించడం కూడా జరిగింది.
  • 0:41 - 0:45
    అయితే ఈ నాట్య భంగిమలు ఎలా పని చేస్తాయో ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా?
  • 0:45 - 0:49
    ప్రతి నాట్య భంగిమ "ఫ్రేమ్స్" అనబడే వరుసగా పేర్చబడిన చిత్రాలతో ఏర్పడి ఉంటుంది.
  • 0:49 - 0:53
    ప్రతి ఫ్రేము దాని ముందు ఫ్రేము కంటే భిన్నంగా ఉంటుంది.
  • 0:53 - 0:57
    మీరు సృష్టించిన ప్రోగ్రాము, కంప్యూటరులో మొదలైనప్పుడు అది ఒక ఫ్రేము తరువాత మరొక ఫ్రేమును ప్రదర్శిస్తుంది.
  • 0:57 - 1:00
    అవి అత్యంత వేగంగా చూపించడం ద్వారా మనకి నృత్యకారుడు కదులుతున్నట్టు కనిపిస్తుంది.
  • 1:00 - 1:04
    యానిమేషన్ ప్రపంచమంతా ఈ రహస్యాన్ని ఆధారం చేసుకునే నడుస్తుంది.
  • 1:04 - 1:06
    మీరు నృత్యకారుడి నాట్య భంగిమలనే కాకుండా
  • 1:06 - 1:09
    వారి లక్షణాలను కూడా మార్చుకోవొచ్చు.
  • 1:09 - 1:14
    లక్షణాలకు ఉదాహరణగా నృత్యకారుడు తెరపై కనబడే స్థానం, నృత్యకారుడి యొక్క పరిమాణం,
  • 1:14 - 1:16
    నృత్యకారుడి రంగు,
  • 1:16 - 1:18
    మొదలైనవి చెప్పుకోవొచ్చు.
  • 1:20 - 1:25
    నృత్యకారుడి లక్షణాలు మార్చాలి అంటే "సెట్ బ్లాక్"ను ఉపయోగించాలి.
  • 1:25 - 1:29
    ఇప్పుడు సెట్ బ్లాక్ ను ఉపయోగించి నృత్యకారుడ్ని చిన్న పరిమాణంలో చూపడం ఎలాగో తెలుసుకుందాము.
  • 1:29 - 1:32
    మొదట, సెట్ బ్లాక్ ను ప్రోగ్రాములోకి తీసుకు రావాలి.
  • 1:32 - 1:36
    ఆ తర్వాత ఏ నృత్యకారుడి పరిమాణం తగ్గించాలో ఎన్నుకోవాలి
  • 1:36 - 1:39
    అక్కడ ఇచ్చిన ఎంపికలో మీకు నచ్చిన పరిమాణం పెట్టాలి, అంతే, మీ నృత్యకారుడి పరిమాణం మీరు చేసిన మార్పుకి తగ్గట్టు తెరపై కనపడుతుంది.
  • 1:51 - 1:53
    పూర్తి పరిమాణం వందవ అంకె ద్వారా తెలుసుకోవొచ్చు.
  • 1:53 - 1:58
    తక్కువ సంఖ్యను ఎంచుకుంటే, నృత్యకారుడి పరిమాణం తగ్గుతుంది.
  • 1:58 - 2:01
    నృత్యకారుడు పరిమాణం చిన్నదయ్యేకొద్దీ దూరంగా ఉన్నట్టు కనిపిస్తాడు.
  • 2:01 - 2:04
    వెనుకనే నిలబడి నాట్యం చేసేవారిని సృష్టించడానికి ఇదొక గొప్ప మార్గం.
  • 2:10 - 2:16
    ఈ సెట్ బ్లాక్ ఉపయోగించడం ద్వారా నృత్యకారుడి యొక్క కొలతలను
  • 2:16 - 2:17
    భ్రమణాన్ని,
  • 2:18 - 2:19
    స్థానాన్ని
  • 2:20 - 2:22
    మరియు రంగుని మార్చుకోవొచ్చు.
  • 2:22 - 2:24
    ఈ లక్షణాలతో చుట్టూ ఆడటం ద్వారా
  • 2:24 - 2:28
    ఈ లక్షణాలతో ప్రయోగం చేయడం ద్వారా మీరు అనేక రకములైన మార్పులను చేయవచ్చు. ఆ మార్పులను పాటల యొక్క వేరు వేరు భాగాలకు జతపర్చవచ్చు.
  • 2:29 - 2:35
    మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది వరకు మీరు సృష్టించిన నృత్యకారుడి లక్షణాలు మాత్రమే మీరు మార్చగలరు.
  • 2:35 - 2:39
    . సెట్ బ్లాక్ అనేది ఎల్లప్పుడూ "మాక్ ఎ న్యూ డాన్సర్" బ్లాక్ [కొత్త నృత్యకారుడ్ని సృష్టించే ఎంపిక] తర్వాతనే రావాలి.
  • Not Synced
    ప్రయోగాలు చేయడానికి వెనుకాడొద్దు, మీ సృజనాత్మకతను
  • Not Synced
    వాడండి మరియు ఆనందంగా మీ ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళండి.
Title:
Dance Party - Properties
Description:

Start learning at http://code.org/

Stay in touch with us!
• on Twitter https://twitter.com/codeorg
• on Facebook https://www.facebook.com/Code.org
• on Instagram https://instagram.com/codeorg
• on Tumblr https://blog.code.org
• on LinkedIn https://www.linkedin.com/company/code-org
• on Google+ https://google.com/+codeorg

more » « less
Video Language:
English
Duration:
02:52
TranslateByHumans edited Telugu subtitles for Dance Party - Properties
TranslateByHumans edited Telugu subtitles for Dance Party - Properties
TranslateByHumans edited Telugu subtitles for Dance Party - Properties

Telugu subtitles

Revisions