< Return to Video

విమానంలో క్రిముల ప్రయాణం--ఎలా నివారించగలం

  • 0:00 - 0:03
    మీ చేతుల్ని నాకోసారి చూపిస్తారా
  • 0:03 - 0:07
    ఇందులో ఎందరు గత ఏడాది
    విమాన ప్రయాణం చేసారు
  • 0:08 - 0:09
    మంచి సంఖ్యే
  • 0:09 - 0:12
    మీతోబాటు మూడు బిలియన్ ల మందికి
  • 0:12 - 0:15
    ఇది తెలిసి వుండాలి
  • 0:15 - 0:18
    చాలా మంది విమానప్రయాణం చేస్తున్నప్పుడు
  • 0:18 - 0:20
    అవి ప్రపంచమంతా ప్రయాణిస్తున్నందున
  • 0:20 - 0:23
    కొన్ని సార్లు ఇలాంటివి జరుగుతుంటాయి
  • 0:23 - 0:25
    మీకో అంటువ్యాధి సోకవచ్చు
  • 0:25 - 0:27
    గత ఏడాది ఎబోలా గురించి విన్నప్పుడే
  • 0:27 - 0:30
    నాకీ ఆలోచన వచ్చింది
  • 0:30 - 0:31
    అది ఇలా రూపు మార్చుకుంది
  • 0:31 - 0:34
    ఎబోలా ఇలా వ్యాపించినా , ఎక్కువభాగం
  • 0:34 - 0:36
    వేరే మార్గాల ద్వారా
    కూడా వస్తాయి
  • 0:36 - 0:37
    ఇలాంటి వ్యాధులు
  • 0:37 - 0:39
    విమానాల క్యాబిన్ల ద్వారానూ విస్తరించవచ్చు
  • 0:39 - 0:43
    విచారించాల్సిన విషయమేంటంటే , గణాంకాలను
  • 0:43 - 0:44
    పరిశీస్తే భయం వేస్తుంది
  • 0:44 - 0:46
    అలాగే H1N1 గురించి కూడా
  • 0:46 - 0:48
    ఈ అబ్బాయి విమానంలో వెళ్ళాలని
    నిర్ణయించుకున్నాడు
  • 0:48 - 0:50
    ఒకసారి విమానంలో ప్రయాణించినప్పుడు
  • 0:50 - 0:52
    వ్యాథి వస్తే ఆది 17 మంది ఇతర
    ప్రయాణీకులకు సోకవచ్చు
  • 0:52 - 0:54
    అలాంటిది ఈ అబ్బాయి SARS జబ్బుతో
  • 0:55 - 0:57
    3 గంటల పాటు విమానంలో ప్రయాణించాడు
  • 0:57 - 0:59
    దాంతో 22మంది కి ఈ వ్యాధి సోకింది
  • 1:00 - 1:03
    నా ఉద్దేశ్యం అదొక్కటే కాదు దూరదృష్టితో
  • 1:04 - 1:06
    గమనిస్తే మనకే అర్థమౌతుంది
  • 1:06 - 1:09
    ఇలాంటి వ్యాథులను కనిపెట్టడం చాలా కష్ఠమని
  • 1:10 - 1:12
    అయితే ఒక వ్యక్తి విమానంలో వెళ్తునప్పుడు
  • 1:12 - 1:13
    అస్వస్థులు కావచ్చు
  • 1:13 - 1:15
    వారిలో వ్యాధి లక్షణాలు నిగూఢంగా వుండవచ్చు
  • 1:15 - 1:18
    ఆ దశలోనే వ్యాధి సోకివుండవచ్చు
  • 1:18 - 1:19
    లక్షణాలు ప్రస్ఫుటంగా కన్పించవు
  • 1:19 - 1:21
    అలా వారితో వ్యాధి క్యాబిన్ లోని
  • 1:21 - 1:23
    మరెందరికో వ్యాపిస్తుంది
  • 1:23 - 1:25
    అదెలా సాధ్యం అంటే, ఇప్పుడు
  • 1:25 - 1:27
    మనకు గాలి క్యాబిన్ పైవైపు నుండి వస్తుంది
  • 1:27 - 1:30
    మీరు చూస్తున్నట్లుగా ప్రక్కలనుండి
    కూడా వస్తుంది
  • 1:30 - 1:34
    ఆ గాలి సమర్థవంతమైన ఫిల్టర్ల
    ద్వారా బయటికి వెళ్తుంది
  • 1:34 - 1:39
    ఈ ఫిల్టర్లు 99.97% సూక్ష్మ క్రిములను
    వెళ్ళే దారిలో వదిలేస్తాయి
  • 1:39 - 1:41
    అప్పుడేం జరుగుతుందంటే
  • 1:41 - 1:43
    మనకు వచ్చే గాలి, వెళ్లే గాలితో కలుస్తుంది
  • 1:43 - 1:45
    ఎవరైనా తుమ్మితే
  • 1:45 - 1:48
    ఆ గాలి ఆ ఫిల్టర్ల ద్వారా వెళ్ళడానికి ముందు
  • 1:48 - 1:51
    అదే ప్రాంతాల్లో సుళ్ళు తిరుగుతుంది
  • 1:52 - 1:55
    నా దృష్టి లో ఇది తీవ్రమైన సమస్య
  • 1:55 - 1:59
    బయటికి వెళ్లి , ఇంకో విమానం
    కొనేంత డబ్బు నావద్దలేదు
  • 1:59 - 2:01
    ఐతే నేనో కంప్యూటర్ ను సిధ్దం
    చేసుకోవాలనుకున్నాను
  • 2:01 - 2:04
    ఇది కంప్యుటేషనల్ ఫ్లూయిడ్
    డైనమిక్స్ సహాయంతో రూపొందుతుంది
  • 2:04 - 2:07
    ఈ కృత్రిమ వాతావరణాన్ని మనం అనుకరించగలం
  • 2:07 - 2:09
    అది విమానంలో తీసుకున్న
    రీడింగ్ లకంటే
  • 2:09 - 2:12
    ఖచ్చితమైన వివరాలను అందించగలదు
  • 2:13 - 2:16
    ఇదెలా పనిచేస్తుందంటే,ఈ 2D డ్రాయింగ్ ల
  • 2:16 - 2:18
    రూపంలో అది మొదలవుతుంది
  • 2:18 - 2:21
    ఇవే టెక్నికల్ పేపర్ల రూపంలో అంతర్జాలం లో
    చెక్కర్లు కొడుతున్నాయి
  • 2:21 - 2:24
    దాన్ని తీసుకుని 3D మోడలింగ్ సాఫ్ట్ వేర్ లో
    ప్రవేశపెట్టాను
  • 2:24 - 2:25
    నిజంగా3D మోడల్ ని సృష్టించాను
  • 2:25 - 2:30
    దాన్నిఅతి చిన్నభాగాలుగాతయారుచేసి జోడించాను
  • 2:30 - 2:34
    కంప్యూటర్ కు అనుసంధానం అయ్యేలా
    కృషి చేసాను
  • 2:34 - 2:37
    తర్వాత కంప్యూటర్ కు భౌతిక శాస్త్ర
    సూత్రాల ద్వారా క్యాబిన్ లో గాలి
  • 2:37 - 2:39
    ఎలా ప్రసరిస్తోందో ఆ డేటా ఇచ్చాను
  • 2:39 - 2:43
    వాస్తవానికి కంప్యూటర్ ఈ అనుకరణను
    లెక్కించే వరకు నేను అక్కడే వేచి వున్నాను
  • 2:44 - 2:48
    సాంప్రదాయిక క్యాబిన్ ద్వారా జరిగేదేంటంటే
  • 2:48 - 2:50
    మధ్యలో ఉన్న వ్యక్తి తుమ్మడాన్ని
    మీరు గమనించేవుంటారు
  • 2:51 - 2:54
    ఆ తుంపరలు చుట్టుప్రక్కలున్నవారి
    మొహాలపై చిందుతాయి
  • 2:55 - 2:57
    అది చిరాకు పుట్టిస్తుంది
  • 2:57 - 2:59
    ముందున్న ఆ ఇద్దరు ప్రయాణీకులను
    మీరు గమనించారా
  • 2:59 - 3:01
    మధ్యవ్యక్తికి ఇరుప్రక్కలున్నారే వారు
  • 3:01 - 3:03
    వారిని విసిగించే వ్యవహారం ఇది
  • 3:03 - 3:05
    పక్కనుంచి దీన్ని పరిశీలించినప్పుడు
  • 3:05 - 3:09
    సూక్ష్మ క్రిములు క్యాబిన్ అంతా వ్యాపించడం
    గమనించి వుంటారు
  • 3:10 - 3:12
    మొదటగా నాకొచ్చిన ఆలోచన
    ఇది బాగాలేదు అని
  • 3:12 - 3:16
    నిజానికి 32 కంటే ఎక్కువ రకాల
    పరిస్థితులపై అధ్యయనం చేసాను
  • 3:16 - 3:19
    అంతిమంగా ఈ పరిష్కారాన్ని కనుగొన్నాను
  • 3:19 - 3:23
    ఇదే నేను చెప్పే -- పేటెంట్ పెండింగ్---
    గ్లోబల్ ఇన్ లెట్ డైరెక్టర్
  • 3:23 - 3:25
    దీనితో మనం సూక్ష్మ క్రిముల
    వ్యాప్తిని అరికట్టగలం
  • 3:25 - 3:27
    దాదాపు 55 రెట్లు గా
  • 3:27 - 3:30
    190 % తాజాగాలిని పీల్చేలా చేయగలం
  • 3:30 - 3:32
    నిజానికి ఇదెలా పని చేస్తుందంటే
  • 3:32 - 3:35
    మిశ్రమ పదార్థాలతో తయారైన ఈ సాధనాన్ని
    మనం అమర్చాలి
  • 3:35 - 3:38
    విమానంలోని కొన్ని ప్రదేశాలలో
  • 3:38 - 3:40
    అమర్చడం చాలా చవకైనది
  • 3:40 - 3:42
    దీన్ని రాత్రికిరాత్రే పూర్తిచేయవచ్చు
  • 3:42 - 3:46
    మనం చేయాల్సిందేంటంటే 2 స్కృూలు దానిలో
    బిగిస్తే చాలు పనిచేస్తుంది
  • 3:46 - 3:49
    వచ్చే ఫలితాలు మాత్రం అద్భుతంగా వుంటాయి
  • 3:49 - 3:52
    కలుషిత మైన గాలి సుళ్ళు తిరగకుండా
  • 3:52 - 3:54
    మనం గాలితో గోడలను సృష్టిస్తాం
  • 3:54 - 3:56
    అది ప్రయాణీకుల మధ్యవచ్చి చేరుతుంది
  • 3:56 - 3:58
    వ్యక్తి గతంగా గాలి పీల్చేలా చేస్తుంది

  • 3:58 - 4:01
    మధ్య సీట్ లోని వ్యక్తి మళ్ళీ
    తుమ్ముతున్నాడు గమనించండి
  • 4:01 - 4:04
    ఈ సారి మనం దాన్ని క్రిందికి జరపడం ద్వారా
  • 4:04 - 4:06
    బయటికి నెట్టే ఫిల్టర్లను చేరేలా చేస్తాం
  • 4:06 - 4:08
    అలాగే ప్రక్కల నుంచి కూడా
  • 4:08 - 4:11
    ఆసూక్ష్మ క్రిములను నేరుగా కిందికి
    పంపడాన్ని మీరు గమనించండి
  • 4:12 - 4:15
    ఇదే దృశ్యాన్ని మీరు మరో సారి చూడండి
  • 4:15 - 4:17
    కొత్త పరికరాన్ని అమర్చాక
  • 4:17 - 4:19
    మధ్య వ్యక్తి తుమ్మడాన్ని మీరు చూసారా
  • 4:19 - 4:22
    ఈ సారి దాన్ని నేరుగా outlet వైపుగా
    క్రిందికి తోస్తున్నాము
  • 4:22 - 4:26
    ఇతరులకు సోకే కంటే ముందుగానే
  • 4:26 - 4:29
    మధ్యవ్యక్తికి ప్రక్కలనున్న ప్రయాణీకులను
    మీరు గమనించారా
  • 4:29 - 4:31
    వారు స్వచ్చమైన గాలిని పీలుస్తున్నారు
  • 4:31 - 4:34
    దీన్నే ప్రక్కలనుంచి కూడా చూడండి
  • 4:34 - 4:35
    సమర్థమైన ప్రక్రియను మీరు చూసారు
  • 4:35 - 4:38
    క్లుప్తంగా చెప్పాలంటే ఈ ప్రక్రియతో
    మనం గెలిచాము
  • 4:39 - 4:42
    దీని అర్థమేంటని పరిశీలిస్తే
  • 4:42 - 4:46
    మనం చూసే దాంట్లో మధ్యవ్యక్తి
    తుమ్మినప్పుడు మాత్రమే కాకుండా
  • 4:46 - 4:48
    కిటికీ వద్దఉన్న ప్రయాణీకుడు
    తుమ్మినా ఇది పనిచేస్తోంది
  • 4:48 - 4:51
    నడిచే దారి ప్రక్కనున్న వారు తుమ్మినాకూడా
  • 4:51 - 4:54
    ఇలాంటి పరిష్కారాలతో ప్రపంచానికేం లాభం?
  • 4:54 - 4:58
    మనం దీన్ని గమనిస్తే
  • 4:58 - 5:00
    కంప్యూటర్ అనుకరణనుండి నుండి నిజజీవితానికి
  • 5:00 - 5:03
    నేను సృష్టించిన ఈ 3D మాడల్ ద్వారా
    మనం దీన్ని చూడగలం
  • 5:03 - 5:05
    3D ముద్రణ వాడడం దీనిలో తప్పనిసరి
  • 5:05 - 5:08
    అవే గాలి విన్యాసాలు క్రిందికి రావడాన్ని
    మనం చూస్తున్నాం
  • 5:08 - 5:10
    నేరుగా ప్రయాణీకుల దగ్గరికి
  • 5:11 - 5:14
    గతంలో వచ్చిన SARS అంటువ్యాధి ప్రపంచంతో
  • 5:14 - 5:16
    40 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టించింది
  • 5:16 - 5:17
    భవిష్యత్తులో కూడా
  • 5:17 - 5:20
    పెద్ద వ్యాధి వ్యాపిస్తే ప్రపంచంతో
    ఇలాంటి ఖర్చు చేయిస్తుంది
  • 5:20 - 5:22
    3 ట్రిలియన్ కంటే ఎక్కువ డాలర్లను
  • 5:22 - 5:25
    ముందుగా పనికిరాని ఒక విమానంలో దీన్ని
    ప్రయోగించి చూడాలి
  • 5:25 - 5:27
    ఒకటి లేదా రెండు నెలల కోసం
  • 5:27 - 5:31
    పదుల ,వేల మానవ పనిగంటలతో బాటు
    ఎన్నో మిలియన్ల డాలర్లను ఖర్చుపెట్టి
  • 5:31 - 5:32
    ఒక అంశాన్ని మార్చాలంటే
  • 5:32 - 5:36
    కానీ నేడు మనం అవసరమైనదాన్ని
    రాత్రికిరాత్రే అమర్చగలం
  • 5:36 - 5:38
    వెంటనే ఫలితాలను కూడా తెలుసుకోగలం
  • 5:38 - 5:41
    ఇప్పుడిది నమోదు చేయించాల్సిన అంశం మాత్రమే
  • 5:41 - 5:42
    విమానంలో పరీక్షించడం అంటే
  • 5:42 - 5:45
    అమలులో వున్న అనుమతులను పొందడానికే
  • 5:45 - 5:48
    నిజం చెప్పాలంటే కొన్నిసార్లు
    శ్రేష్ఠమైన పరిష్కారాలు
  • 5:48 - 5:50
    చాలా సరళమైనవి కూడా ఉంటాయి
  • 5:50 - 5:53
    గడచిన 2 సం . వరకు కూడా
  • 5:53 - 5:55
    ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేది కాదు
  • 5:55 - 5:58
    కేవలం సాంకేతికసహకారం లేనందువల్లే
  • 5:58 - 6:00
    కాని నేడు కంప్యూటర్ సామర్థ్యం పెరిగింది
  • 6:00 - 6:02
    మన అంతర్జాలం ఎంతో అభివృధ్ధి చెందింది కూడా
  • 6:02 - 6:05
    నూతన ఆవిష్కరణలకిది ఒక స్వర్ణయుగం
  • 6:05 - 6:08
    మిమ్మల్ని నేడొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను
    ఆలస్యమెందుకు?
  • 6:08 - 6:11
    మనందరం కలిసి నేడే భవిష్యత్తును నిర్మిద్దాం
  • 6:11 - 6:12
    కృతజ్ఞతలు
  • 6:12 - 6:15
    ( కరతాళధ్వనులు )
Title:
విమానంలో క్రిముల ప్రయాణం--ఎలా నివారించగలం
Speaker:
రేమాండ్ వాంగ్
Description:

రేమాండ్ వాంగ్ వయస్సు కేవలం 17 సంవత్సరాలే.కానీ ఒక ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడంలో తోడ్పడుతున్నాడు.ఫ్లూయిడ్ డైనమిక్స్ ను ఉపయోగించి విమానాల్లో గాలి ఎలా ప్రయాణిస్తుంది అన్న విషయంపై కృత్రిమ వాతావరణం సృష్టించాడు.అతడు కనుగొన్నది మనలను ఆందోళనలకు గురి చేసేదిగా వుంది. విమానంలో ఒక వ్యక్తి తుమ్మితే గాలి ఆ సూక్ష్మ క్రిములను ఇతర ప్రయాణీకులకు సోకేలా చేస్తున్నది.అనిమేషన్ ద్వారా విమానంలో తుమ్ము ప్రయాణ వివరాలను మనతో పంచుకున్నాడు.దానికై అతడు బహుమతి పొందిన పరిష్కారాన్ని పరిచయం చేసాడు.ఇది ఒక చిన్న రెక్క ఆకార సాధనం.ఇది తాజా గాలిని విమానంలో పెంచుతూ, సూక్ష్మ క్రిములతో నిండిన గాలిని బయటికి వెళ్ళేలా చేస్తుంది.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
06:28

Telugu subtitles

Revisions