మీ కోసం మీరు మాట్లాడడం ఎలా
-
0:01 - 0:04ఏదైనా ఒక విషయం గురించి
మాట్లాడడం చాలా కష్టం. -
0:05 - 0:10నేను ఈ సంగతి సరిగ్గా
నెల రోజుల క్రితం, నేను నా భార్య మొదటిసారి -
0:10 - 0:12తల్లి తండ్రులమైనప్పుడు
తెలుసుకున్నాను. -
0:13 - 0:15అది చాలా అధ్భుతమైన సందర్భం.
-
0:15 - 0:17అది ఉల్లాసకరమైన ఇంకా ఉప్పొంగిపోయే సందర్భం
-
0:17 - 0:20కానీ భయపెట్టేది కూడా.
-
0:20 - 0:25అది ముఖ్యం గా ఎప్పుడంటే
మేముఆస్పత్రి నుండి ఇంటికి -
0:25 - 0:26ఇక మా చిన్న బాబుకు
సరిపోయిన -
0:26 - 0:30పోషకాలు బ్రెస్ట్ ఫీడింగ్ నుండి
అందుతున్నాయో లేదో మాకు తెలవనప్పుడు. -
0:31 - 0:34ఇక మేము పీడియాట్రిషియన్ ని
పిలుద్దామనుకున్నాము, -
0:34 - 0:37కానీ మేము మా మొదటి ముద్ర
చెడ్డగా ఉండకూడదని లేదా క్రేజీ -
0:37 - 0:39తల్లితండ్రులుగా మామ్మల్ని
అనుకోకూడదని అనుకున్నాము. -
0:39 - 0:41కాబట్టి మేము భయ పడ్డాము.
-
0:41 - 0:42ఇంకావేచి ఉన్నాము.
-
0:42 - 0:44మేము మరుసటి రోజు డాక్టర్
దగ్గరికి వెళ్ళినప్పుడు, -
0:44 - 0:49ఆమె వాడికి వెంటనే ఫార్ములా ఇచ్చారు
ఎందుకంటే వాడు బాగా నీరసం గా ఉన్నాడు. -
0:49 - 0:51మా అబ్బాయి ఇప్పుడు బానే
-
0:51 - 0:54ఉన్నాడు, మా డాక్టర్ మేము ఎప్పుడు
కావాలన్నా ఆమెను కలవచ్చన్నారు. -
0:54 - 0:56కానీ ఆ సమయం లో
-
0:56 - 0:58నేను మాట్లాడాల్సింది,
కానీ నేను మాట్లాడలేదు. -
0:59 - 1:02కానీ కొన్ని సార్లు మనం మాట్లాడగూడని
సమయం లో మాట్లాడతాము, -
1:02 - 1:06అది 10 సంవత్సరాల క్రితం నేను నాతమ్ముణ్ణి
చిన్నబుచ్చినప్పుడు తెలుసుకున్నాను. -
1:07 - 1:09నా తమ్ముడు ఒక డాక్యుమెంటరీ దర్శకుడు,
-
1:09 - 1:11ఇక అతని మొదటి
చిత్రాలలో ఒకదానికి, -
1:11 - 1:13ఒక పంపిణీ సంస్థ నుండి ఒక ఆఫెర్ వచ్చింది.
-
1:13 - 1:15అతను ఉత్తేజితమయ్యాడు,
-
1:15 - 1:17ఇక అతను దాన్ని
అంగీకరించడానికి మక్కువ చూపాడు. -
1:17 - 1:20కానీ చర్చల గురించి తెలిసిన ఒక వ్యక్తిగా,
-
1:20 - 1:23నేను తనను ఒక ఎదురు ప్రతిపాదన
చేయమని పట్టు పట్టాను, -
1:23 - 1:26ఇంకా నేను దాన్నిపరిపూర్ణం గా
చేయడానికి అతనికి సహాయ పడ్డాను. -
1:26 - 1:28ఇక అది పరిపూర్ణం గా ఉంది--
-
1:28 - 1:30అది అన్ని విధాలుగా అవమానకరంగా ఉంది.ఆ కంపనీ
-
1:30 - 1:32వాళ్ళు దాన్ని
అవమానంగా తీసుకున్నారు, -
1:32 - 1:34వాళ్ళు ఆఫర్ ను వెనక్కి తీసుకున్నారు
-
1:34 - 1:36ఇక నా తమ్ముడి వద్ద ఏమీ మిగల్లేదు.
-
1:36 - 1:40ఇక నేను చాలామంది ప్రజలను ఈ భావ వ్యక్తీకరణ
గురించిన గందరగోళాన్ని గురించి అడిగా: -
1:40 - 1:42ఎప్పుడు వాళ్ళు తమ ఉనికిని చాటవచ్చు,
-
1:42 - 1:44ఎప్పుడు వాళ్ళ అభిరుచుల్నిచెప్పచ్చు,
-
1:44 - 1:46ఎప్పుడు వాళ్ళ అభిప్రాయాలను చెప్పచ్చు,
-
1:46 - 1:48ఎప్పుడు వాళ్ళ కోరికలను తెలపచ్చు అని.
-
1:49 - 1:53ఇక నాకు వచ్చిన కధల యొక్క శ్రేణి
చాలా వైవిధ్యమైనది ఇంకా విభిన్నమైనది, -
1:53 - 1:56కానీ అవన్నీ కలిసి ఒక విశ్వవ్యాప్తమైన భాష.
-
1:56 - 1:59నేను నా అధికారి తప్పు
చేస్తే సరి దిద్దచ్చా? -
1:59 - 2:03నా విషయాల్లో జోక్యం చేసుకునే
నా సహోద్యోగి ని నేను ఎదుర్కొనచ్చా? -
2:03 - 2:06నా స్నేహితుడి అసహ్యమైన జోక్ ను
ఖండించవచ్చా? -
2:06 - 2:10నా అభద్రతా భావాలను నేను అతి
ఎక్కువగా ప్రేమించే వ్యక్తికి చెప్పొచ్చా? -
2:11 - 2:14ఇక ఈ అనుభవాల ద్వారా నేను గుర్తించాను
-
2:14 - 2:18ఏమంటే మనలో ప్రతి ఒక్కరికీ ఒక
ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఉంటుంది. -
2:18 - 2:23ఇక ఒక్కొక్కసారి మనం చాలాబలం గా ఉండి
మనల్ని మనం ఎక్కువ ప్రోత్సహించుకుంటాము. -
2:23 - 2:25నా తమ్ముడి విషయం లో అదే జరిగింది.
-
2:25 - 2:29కనీసం ఒక ఆఫర్ చేయడం కూడా అతని ఆమోదయోగ్యమైన
ప్రవర్తనయొక్క హద్దులు దాటి ఉంది. -
2:30 - 2:31కొన్ని సార్లు మనం
బలహీనంగా ఉంటాం. -
2:31 - 2:33నేను ఇంకా నా భార్యా
విషయంలో అదే జరిగింది. -
2:33 - 2:36ఇక ఈ ఆమోదయోగ్యమైన ప్రవర్తన అనేది--
-
2:36 - 2:39మన హద్దుల్లోఉన్నత కాలం
మనకు బహుమతి లభించినట్లే. -
2:39 - 2:43ఎప్పుడైతే మనం మన హద్దులనుదాటుతామో
అప్పుడు మనం రకరకాలుగా శిక్షింపబడతాము. -
2:43 - 2:46మనం తోసిపుచ్చబడతాం, లేదా
చిన్నబుచ్చబడతాం, లేదా ఇంక బహిష్క్రుతమైతాం. -
2:46 - 2:49లేదా మనం జీతంలో పెరుగుదల లేదా
పదోన్నతి లేదా ఆ ఒప్పందాన్ని కోల్పోతాం. -
2:50 - 2:53ఇప్పుడు, మనం మొదట తెలుసుకోవాల్సింది:
-
2:53 - 2:54నా హద్దులు ఏమిటి?
-
2:55 - 2:59కానీ చాలా ముఖ్యమైన విషయం
ఏన్టంటే మన హద్దులు స్థిరంగా ఉండవు; -
2:59 - 3:01అది వాస్తవంగా
క్రియాశీలకమైనది. -
3:01 - 3:05అది సందర్భాన్ని బట్టి ఇరుకుగా
లేదా విశాలం గా అవుతూ ఉంటుంది. -
3:05 - 3:09ఇక హద్దులను ఒక విషయం మిగతా
అన్ని విషయాల కంటే ఎక్కువగా నిర్ణయిస్తుంది, -
3:10 - 3:11అదే మన శక్తి.
-
3:11 - 3:14మన శక్తి మన హద్దులను నిర్ణయిస్తుంది.
-
3:14 - 3:15ఏది శక్తి?
-
3:15 - 3:17శక్తి చాలా రూపాల్లో వస్తుంది.
-
3:17 - 3:20చర్చల్లో, అది ప్రత్యామ్నాయ
రూపంలో వస్తుంది. -
3:20 - 3:22నా తమ్ముడి దగ్గర
ప్రత్యామ్నాయం లేదు;అందుకే -
3:22 - 3:23అతని దగ్గర శక్తి లేదు.
-
3:23 - 3:25కంపనీ దగ్గర చాలా
ప్రత్యామ్నాయాలున్నాయి; -
3:25 - 3:26వాళ్ళకు శక్తి ఉంది.
-
3:26 - 3:29కొన్ని సార్లు దేశానికి కొత్త కావచ్చు,
valasadarulu kavochu, -
3:29 - 3:31లేదా ఒక సంస్థకు
కొత్త కావచ్చు, -
3:31 - 3:32లేదా ఒక అనుభవానికి
కొత్త కావచ్చు, -
3:32 - 3:34నాకుఇంకా నా భార్యకు తల్లిదండ్రులుగా కొత్త.
-
3:34 - 3:36కొన్నిసార్లు అది మన పని దగ్గర ,
-
3:36 - 3:39అక్కడ ఒకరు అధికారి ఇంకా
మరొకరు కింది ఉద్యోగి. -
3:39 - 3:40కొన్నిసార్లు అది సంబంధాలలో ఉంటుంది,
-
3:40 - 3:43అక్కడ ఒక వ్యక్తి రెండవవారి కంటే
ఎక్కువ ఖర్చు పెట్టచ్చు. -
3:43 - 3:47ఇక అసలు విషయం ఏమిటంటే
మనకు చాలా అధికారం ఉన్నప్పుడు, -
3:47 - 3:49మన హద్దులు కూడా విశాలం గా ఉంటాయి.
-
3:49 - 3:51మనకు మన పరిధుల్లో ఉండడానికి
కావలసినంత స్వేచ్ఛ ఉంటుంది. -
3:52 - 3:54కానీ మన దగ్గర శక్తి లేనప్పుడు,
మన పరిధి ఇరుకౌతుంది -
3:55 - 3:56మనకు తక్కువ స్వేచ్ఛ ఉంటుంది.
-
3:57 - 4:00సమస్య ఏమంటే ఎప్పుడైతే
మన పరిధి ఇరుకయ్యిందో, -
4:00 - 4:04అది తక్కువ అధికారం వల్ల
సందిగ్ధస్థితిని పుట్టిస్తుంది. -
4:04 - 4:07ఇది ఎప్పుడతే మనం మాట్లాడమో
అప్పుడు మనం గుర్తించబడం , -
4:07 - 4:10కానీ మనం మాట్లాడితే, మనం
శిక్షించబడ్తాం లాంటి సందర్భాలలో -
4:11 - 4:13జరుగుతుంది.
-
4:13 - 4:16ఇప్పుడు, మీలో చాలా మంది ఈ
"సందిగ్ధ స్థితి" అనే మాట వినే -
4:16 - 4:19ఉంటారు.ఇంకా దానికి సంబంధించిన జెండర్
అనే ఇంకో పదాన్ని కూడా. -
4:19 - 4:23ఈ జెండర్ సందిగ్ధ స్థితి ఏమంటే మహిళల్లో
ఎవరైతే మాట్లాడరో వాళ్ళు గుర్తించబడరు, -
4:23 - 4:26ఇకమహిళల్లో ఎవరైతే మాట్లాడతారో
వాళ్ళు శిక్షించబడతారు. -
4:26 - 4:31కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే మహిళలకు
మగవాళ్ళ లాగానే మాట్లాడాల్సిన అవసరం ఉంది, -
4:31 - 4:33కానీ వాళ్ళకు అలా
చేయకుండా హద్దులున్నాయి. -
4:34 - 4:37కానీ నా రెండు దశాబ్దాల పరిశోధన
ఏమి చూపిస్తుందంటే -
4:37 - 4:41లింగ భేదం లాగా కనిపించేది
-
4:41 - 4:43నిజమైన జెండర్ యొక్క సందిగ్ధ స్థితి కాదు,
-
4:43 - 4:46అది నిజం గా తక్కువ అధికారం వల్ల
సందిగ్ధ స్థితి. -
4:46 - 4:48ఇక లింగ భేదం లాగా కనిపించేది
-
4:48 - 4:51నిజానికి తరచుగా అధికారం
చూపించడం లో తేడాలు. -
4:51 - 4:54తరచుగా మనం ఒక మహిళ ఇంకా
ఒక పురుషుడు మధ్య ఒక తేడా చూస్తాం -
4:54 - 4:55లేదా పురుషులు ఇంకా
మహిళలు, -
4:55 - 4:59ఇక అనుకుంటాం," జీవ సంబంధ కారణం.
ప్రాధమికంగా జెండర్ -
4:59 - 5:00గురించి ఏదో తేడా ఉంది."
-
5:00 - 5:02కానీ నా అధ్యయనాలలో,
-
5:02 - 5:06చాలా లింగభేధాలకి
అధికారమే కారణం అనేది మంచివివరణగా -
5:07 - 5:08అనిపించింది.
-
5:08 - 5:11కాబట్టి అది తక్కువ అధికారం
వల్ల సందిగ్ధ స్థితి. -
5:12 - 5:17ఇక తక్కువ అధికారం వల్ల సందిగ్ధ స్థితి
అంటే మన పరిధి ఇరుకు గా ఉన్నట్టు, -
5:17 - 5:19ఇక మనకు అధికారం లేనట్టు.
-
5:19 - 5:20మన పరిధి ఇరుకుగా ఉంటుంది,
-
5:20 - 5:22మన సందిగ్ధ స్థితి చాలా
ఎక్కువగా ఉంటుంది. -
5:22 - 5:25మన పరిధి పెంచుకోవడానికి
మనం దారులు వెతుక్కోవాలి. -
5:25 - 5:26గత కొన్ని దశాబ్దాలుగా ,
-
5:26 - 5:29నేను నా సహోద్యోగులూ రెండు
విషయాలు నిజంగా అవసరమని కనుక్కున్నాం. -
5:30 - 5:34మొదటిది: నీ ద్ఱుష్టిలో నువ్వు
శక్తిమంతుడుగా కనిపిస్తావు. -
5:34 - 5:38రెండవది: నువ్వు వేరేవాళ్ళ ద్ఱుష్టిలో
శక్తిమంతుడుగా కనిపిస్తావు. -
5:38 - 5:39ఎప్పుడైతే నేను శక్తివంతం గా అనుకుంటానో
-
5:40 - 5:42నేను నమ్మకంగా కనపడ్తాను,
భయపడుతూ కాదు; -
5:42 - 5:44నా పరిధిని నేను విశాలం చేసుకుంటాను.
-
5:44 - 5:46ఎప్పుడైతే వేరే వాళ్ళు నన్ను
శక్తిమంతుడిగా -
5:47 - 5:49చూస్తారో,వాళ్ళు నాకు విశాలమైన
పరిధిని మంజూరు చేస్తారు. -
5:49 - 5:54కాబట్టి మనకు మన ప్రవర్తనను విశాలం
చేసుకోవడానికికొన్ని పరికరాలు కావాలి. -
5:54 - 5:56ఇక ఈ రోజు నేను మీకు కొన్ని
పరికరాలు ఇవ్వబోతున్నాను. -
5:56 - 5:58మన గురించి మాట్లాడడం
ప్రమాదమైనదే, -
5:59 - 6:02కానీ ఈ పరికరాలు మీరు మాట్లాడడం
వల్ల వచ్చిన ప్రమాదాన్ని తగ్గిస్తాయి. -
6:03 - 6:09నేను మీకు ఇచ్చే మొదటి పరికరం
ముఖ్యమైనది కనుక్కొన్నప్పుడు -
6:09 - 6:10చర్చలలో కనుక్కోబడ్డది.
-
6:10 - 6:14సగటున, మహిళలు బేర సారాల పట్టిక లో
తక్కువ ఆశయాలతో కూడినవి ప్రతిపాదిస్తారు -
6:14 - 6:18ఇక పురుషుల కంటే నాసిరకం
ఫలితాన్ని పొందుతారు. -
6:18 - 6:21కానీ హాన్నా రిలె బౌల్స్ ఇంకా
ఎమిలీ అమానతుల్లా ఒక సందర్భం లో -
6:21 - 6:25మహిళలు పురుషులంత మహత్వకాంక్షతో
ఉంటారని ఇంకా పురుషులకు సమానంగా ఫలితాన్ని -
6:25 - 6:27పొందుతారని
కనుక్కున్నారు. -
6:27 - 6:31ఎప్పుడైతే వాళ్ళు వేరే వాళ్ళకు
సలహాలు ఇస్తారో అప్పుడు. -
6:31 - 6:33ఎప్పుడైతే వాళ్ళు వేరే వాళ్ళకు
సలహాలు ఇస్తారో, -
6:33 - 6:38వాళ్ళు వాళ్ళ అసలు పరిధిని గుర్తించి వాళ్ళ
మనసు లోనే విశాలం చేసుకున్టారు. వాళ్ళు -
6:38 - 6:40ఎక్కువ ధ్రుఢం గా తయారవుతారు.
-
6:40 - 6:43దీన్ని కొన్ని సార్లు "తల్లి ఎలుగుబంటి
పరిణామం"అంటారు. -
6:43 - 6:46ఒక తల్లి ఎలుగుబంటి తన పిల్లలకు అనుకూలంగా
-
6:46 - 6:50మాట్లాడినట్టు, మనం వేరే వాళ్ళకు
సలహాలిచ్చినప్పుడు, మన వాదన మనం కనుగొనచ్చు. -
6:50 - 6:53కానీ కొన్ని సార్లు మనకు మనమే
సలహాలిచ్చుకోవాల్సి ఉంటుంది. -
6:53 - 6:55అది మనం ఎలా చేస్తాం?
-
6:55 - 6:59మనకు మనమే సలహాలిచ్చుకోవడం లో
అతి ముఖ్యమైన పరికరాలలో ఒకటి -
6:59 - 7:01అన్ని కోణాల నుండీ ఆలోచించడం.
-
7:01 - 7:04ఇక అన్ని కోణాల నుండీ
ఆలోచించడం నిజానికి సులభం: -
7:04 - 7:08అది కేవలం ప్రపంచాన్ని వేరే వ్యక్తి
ద్ఱుష్టి నుండి చూడడం. -
7:09 - 7:13ఇది మన పరిధిని విశాలం చేసుకోవడం లో
అతి ముఖ్యమైన పరికరం. -
7:13 - 7:15ఎప్పుడైతే నేను నీ
కోణం తీసుకొన్నానో -
7:15 - 7:17ఇంకా నీకు నిజం గా ఏమి కావాలో ఆలోచించానో,
-
7:17 - 7:20నువ్వు నాకు నిజం గా కావాల్సింది
ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. -
7:21 - 7:23కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది:
-
7:23 - 7:25వేరే వాళ్ళ ద్ఱుష్టి కోణం నుండి
చూడడం చాలా కష్టం. -
7:25 - 7:27సో మనం ఒక చిన్న ప్రయోగం చేద్దాం.
-
7:27 - 7:30మీఅందరినీ మీ చేయి ఇట్లా
పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను: -
7:30 - 7:31మీ వేలు--పైకి పెట్టండి.
-
7:32 - 7:36ఇక మీ అందరినీ మీ నుదుటి మీద ఎంత త్వరగా
వీలైతేఅంత త్వరగా ఒక కాపిటల్ E -
7:36 - 7:38గీయాల్సిందిగా కోరుతున్నాను.
-
7:40 - 7:43ఓకె, మనం E ని రెండు రకాలలో
ఒక రకం గా గీయవచ్చు,ఇది నిజానికి -
7:43 - 7:47వేరే వాళ్ళ కోణం తీసుకోవడాన్ని
పరీక్షించడం కోసం రూపకల్పన చేయబడింది. -
7:47 - 7:49నేను మీకు ఒక వ్యక్తి నుదిటి పై ఒక E ఉన్న
-
7:49 - 7:51రెండు చిత్రాలు చూపించబోతున్నాను--
-
7:51 - 7:53నా పూర్వ విద్యార్ధి,ఎరికా హాల్.
-
7:53 - 7:55ఇక మీరు అక్కడ చూడగలరు,
-
7:55 - 7:57అది సరియైన E.
-
7:57 - 8:00వేరే వ్యక్తికి Eలాగా కనపడడం కోసం
ఆ Eని నేను గీశాను. -
8:00 - 8:02అది వేరే వాళ్ళ కోణం నుండి చూసే E
-
8:02 - 8:05ఎందుకంటే అది E లాగా వేరే వాళ్ళ
ద్ఱుష్టి కోణం నుండి కనపడ్తుంది. -
8:05 - 8:08కానీ ఇక్కడ ఉన్న ఈ E
స్వీయ కేన్ద్రీక్రుతమైనది. -
8:09 - 8:11మనం తరచుగా స్వీయ కేంద్రీకృతమవుతాం.
-
8:11 - 8:14ఇక మనం సంక్షోభంలో ముఖ్యంగా
స్వీయ కేన్ద్రీక్రుతమవుతాం. -
8:14 - 8:16నేను ఒక ముఖ్యమైన
సంక్షోభం గురించి చెప్పాలి. -
8:16 - 8:19వాట్స్నోవిల్లె,కాలిఫోర్నియాలో
ఒక బాంక్ లోకి ఒక వ్యక్తి వచ్చాడు. -
8:20 - 8:23ఇక అతను"నాకు $2000 ఇవ్వండి,
లేదా నేను మొత్తం -
8:23 - 8:25బాంక్ ని ఒక
బాంబ్ తో పేల్చేస్తాను" అన్నాడు. -
8:26 - 8:28ఇప్పుడు,ఆ బాంక్ మానేజర్
అతనికి డబ్బులు ఇవ్వలేదు. -
8:28 - 8:29ఆమె ఒక అడుగు
వెనక్కేసింది. -
8:30 - 8:31అతని ద్రుష్టి కోణం తీసుకుంది,
-
8:31 - 8:34ఇక ఆమె చాలా ముఖ్యమైన విషయం గుర్తించింది.
-
8:34 - 8:36అతను డబ్బులు ఒక నిర్దిష్ట మొత్తంలో
అడిగాడు -
8:36 - 8:38కాబట్టి ఆమె అంది,
-
8:39 - 8:41"ఎందుకు నువ్వు $2,000 కోసం అడిగావు?"అని.
-
8:41 - 8:44ఇక అతనన్నాడు," నా స్నేహితుడికి
నేనుతక్షణమే $2,000 -
8:44 - 8:46ఇవ్వకపోతే అతను గెంటివేయబడ్తాడు"
-
8:46 - 8:49ఇక ఆమె అన్నది,"ఓహ్!నువ్వు బాంక్ ని
దోచుకోవాలనుకోవట్లేదు--నువ్వు -
8:49 - 8:51అప్పు తీసుకోవాలనుకుంటున్నావ్".
-
8:51 - 8:52(నవ్వులు)
-
8:52 - 8:54నువ్వు నా ఆఫీస్ కి ఎందుకు రాకూడదు,
-
8:54 - 8:56ఇక మనం నీ పేపర్ వర్క్
అంతా పూర్తి చేద్దాం." -
8:56 - 8:57(నవ్వులు)
-
8:57 - 9:02ఆమె వెంటనే వేరే కోణంనుండి చూడడం ఒకఅస్థిర
పరిస్థితి నిర్వీర్యం అయ్యేటట్టు చేసింది. -
9:02 - 9:04కాబట్టి మనం వేరే వాళ్ళ ద్ఱుష్టి కోణం
-
9:04 - 9:09తీసుకున్నప్పుడు అది,మనన్ని కాంక్షాపూరితంగా
-
9:09 - 9:12కానీ ఇంకా అందరూ ఇష్ట పడేటట్టు చేస్తుంది,
-
9:12 - 9:15ఇక అది ఫ్లెక్సిబులిటీ కి ఒక సంకేతం.
-
9:15 - 9:19మీరు కార్లు అమ్మే వ్యక్తి అనుకోన్డి,ఇక
మీరు ఒక వ్యక్తి కి కార్ ఆమ్మాలనుకున్నారు. -
9:20 - 9:24మీరు అతనికి రెండు ఆప్షన్లు చూపిస్తే మీరు
ఎక్కువ కార్లు అమ్మే అవకాశం ఉంది. -
9:24 - 9:26మొదటిదిఆప్షన్ A:
-
9:26 - 9:29ఈ కారుకు $24,000 ఇంకా 5-ఏళ్ళ గ్యారంటీ.
-
9:29 - 9:30లేదా ఆప్షన్ B:
-
9:31 - 9:33$23,000 ఇంకా 3-ఏళ్ళ గ్యారంటీ.
-
9:34 - 9:37నా పరిశోధన ఎప్పుడైతే మీరు
ప్రజలకు ఆప్షన్స్ లో ఎంపిక చేసుకోనిస్తారో, -
9:37 - 9:39అది వాళ్ళ ఆత్మరక్షణ ధోరణిని తగ్గించి,
-
9:39 - 9:42వాళ్ళు మీఆఫర్ను అంగీకరించవచ్చు,
అనిచూపిస్తుంది. -
9:42 - 9:44ఇక ఇది కేవలం అమ్మేవాళ్ళతో పని చేయదు;
-
9:44 - 9:46ఇది తల్లితండ్రులతో కూడా.
-
9:46 - 9:47నామేనకోడలు
నాలుగేళ్ళప్పుడు, -
9:47 - 9:50తను బట్టలు వేసుకోనన్నది
ఇంకా అన్నిటినీ వద్దన్నది. -
9:50 - 9:53కానీ నా చెల్లెలుకి ఒక
అద్భుతమైన ఆలోచన వచ్చింది. -
9:53 - 9:56నేను నా కూతురిని ఎంపిక
చేసుకోనిస్తే ఎలా ఉంటుందని? -
9:56 - 9:58ఈ షర్టా లేక ఆషర్టా? ఓకె, ఆ షర్ట్.
-
9:58 - 10:00ఆ పాంటా లేక ఆ పాంటా? ఓకె,ఆ పాంట్.
-
10:00 - 10:01ఇక అది బాగా పని చేసింది.
-
10:01 - 10:05తను ఎక్కువ వ్యతిరేకించకుండానే
బట్టలు త్వరగా తొడుక్కుంది. -
10:05 - 10:08నేను ప్రజలు బయటకి సౌకర్యంగా
-
10:08 - 10:10ఎప్పుడు మాట్లాడతారనిప్రపంచం లో ఎప్పుడు
-
10:10 - 10:11అడిగినా నంబర్ వన్ సమాధానం:
-
10:11 - 10:16"నాకు ప్రేక్షకుల లో సామాజిక మద్దతు
ఉన్నప్పుడు;నాకు మిత్రులు ఉన్నప్పుడు". -
10:16 - 10:20కాబట్టి మనం మన వైపు మిత్రులు
ఉండాలని కోరుకుంటాం. -
10:20 - 10:21మనం దాన్ని ఎలా చేస్తాం?
-
10:22 - 10:24వెల్,మార్గాలలో ఒకటీ తల్లి
ఎలుగుబంటిలాగా ఉండడం. -
10:24 - 10:26మనం ఎప్పుడు ఇతరులకు
సలహాఇస్తామో, -
10:26 - 10:29మనం మనపరిధిని మన ద్ఱుష్టి లోఇంకా వేరే
వాళ్ళ ద్ఱుష్టిలో విశాలం చేసుకుంటాం, -
10:29 - 10:31కానీ మనం బలమైన మిత్రులను
కూడా సంపాదించుకుంటాం. -
10:32 - 10:37ఇంకొక మార్గం మిత్రులను సంపాదించడానికి ,
ప్రత్యేకం గా ఉన్నత స్థానాల్లో, -
10:37 - 10:39వేరే వాళ్ళను సలహాలడగడం.
-
10:39 - 10:45మనంఎప్పుడువేరేవాళ్ళను సలహాఅడుగుతామోవాళ్ళని
పొగుడుతున్నాంఇంకా వినయం చూపిస్తున్నాం -
10:45 - 10:47కాబట్టి,వాళ్ళు మనని
ఇష్టపడతారు -
10:47 - 10:50ఇది నిజం గా ఇంకొక సందిగ్ధ స్థితి ని
పరిష్కరించడానికి పనికొస్తుంది. -
10:51 - 10:53ఇక అది సెల్ఫ్ ప్రమోషన్ సందిగ్ధస్థితి.
-
10:53 - 10:55సెల్ఫ్ ప్రమోషన్
-
10:55 - 10:58సందిగ్ధ స్థితి ఏమంటే
మనం సాధించిన విజయాలు ప్రకటించుకోకపోతే, -
10:58 - 10:59ఎవరూ పట్టించుకోరు.
-
10:59 - 11:02ఇక మనం ప్రకటించుకుంటే,
మనన్ని ఇష్ట పడరు. -
11:02 - 11:05కానీ మనం కనుక మన విజయాలలో
ఒక దాని గురించి సలహా అడుగుతే, -
11:05 - 11:10మనం సమర్హులుగానే కాక వాళ్ళ ద్రుష్టి లో
ఇష్టమైన వాళ్ళ లాగా ఉండవచ్చు. -
11:10 - 11:13ఇక ఇది ఎంత శక్తివంతమైనదంటే
-
11:13 - 11:15ఇది పని చేస్తుందని మనకు
ముందే తెలిసి పోతుంది. -
11:15 - 11:20నా జీవితం లో చాలా సార్లు జరిగింది ఒక
తక్కువ అధికారం కల వ్యక్తికి -
11:20 - 11:24నన్ను సలహా అడగమని సలహా ఇవ్వడం
జరిగిందని నాకు ముందే హెచ్చరిక అందుతుంది. -
11:24 - 11:27నేనుదీనిలో మూడువిషయాలు
మీరు గమనించమంటున్నాను: -
11:27 - 11:30మొదటిది, నాకు తెలుసు వాళ్ళు
నా దగ్గరికి సలహా కోసం వస్తారని. -
11:30 - 11:34రెండవది, నేను వాస్తవం లో సలహా లు
అడగడం వల్ల ప్రయోజనాల -
11:34 - 11:35మీద పరిశోధన చేశాను
-
11:36 - 11:38ఇక మూడొది, అది ఇప్పటికీ పని చేస్తోన్ది!
-
11:39 - 11:40నేనువాళ్ళఆలోచన
తీసుకున్నా, -
11:40 - 11:42నేను వాళ్ళ పిలుపులకు
ఎక్కువ స్పందిస్తున్నాను, -
11:42 - 11:46నేను వాళ్ళు సలహా కోసం అడిగారు
కాబట్టిఎక్కువ అంకిత భావంతో ఉన్నాను. -
11:46 - 11:50ఇప్పుడు ఇంకొక సమయం మనం
ఆత్మవిస్వాసం తో బయటకు మాట్లాడే సందర్భం -
11:50 - 11:52మనకు నైపుణ్యం ఉన్నప్పుడు.
-
11:52 - 11:54నైపుణ్యం మనకు విశ్వసనీయత నిస్తుంది.
-
11:55 - 11:58మనకు ఎక్కువ అధికారం ఉంటే
అప్పటికే మనకు విశ్వసనీయత ఉన్నట్టు. -
11:58 - 11:59మనకు కేవలం
మంచి సాక్ష్యంకావాలి. -
12:00 - 12:03మనకు అధికారం లేకుంటే,
మనకు విశ్వసనీయత లేదు. -
12:03 - 12:05మనకు అద్భుతమైన సాక్ష్యం కావాలి.
-
12:05 - 12:09ఇక మనం నిపుణుడిగా మారడానికి ఒక మార్గం
-
12:09 - 12:11మన అభిరుచులను ఉపయోగించుకోవడం.
-
12:12 - 12:16నేను మీ అందరినీ రాబోయే
కొద్ది రోజులలో మీ స్నేహితుల దగ్గరికివెళ్ళి -
12:16 - 12:17కేవలం"నేను మీ ఒక
అభిరుచిని -
12:17 - 12:20నాకు వర్ణించమని అడుగుతున్నాను ".
అని చెప్పమంటున్నాను. -
12:21 - 12:23నేను ప్రపంచం లో చాలామంది
వ్యక్తుల చేత ఇది చేయించాను -
12:23 - 12:25ఇక వాళ్ళను నేను అడిగాను,
-
12:25 - 12:27"మీరు అవతలి వ్యక్తి వాళ్ళ అభిరుచి ని
-
12:27 - 12:29వర్ణిస్తున్నప్పుడుఆవ్యక్తిలో
ఏమి గమనించారు?" -
12:29 - 12:31ఇక సమాధానాలు చాలా సార్లు ఒకటే ఉండేవి.
-
12:31 - 12:33"వాళ్ళకళ్ళు మెరుస్తాయి
ఇంకాపెద్దవైతాయి". -
12:33 - 12:36"వాళ్ళు ఒక పెద్ద వెలిగిపోయే
నవ్వు నవ్వుతారు". -
12:36 - 12:37"వాళ్ళు అన్నిట్లోచేతులను
వాడతారు -
12:37 - 12:40నేను దాక్కున్నా
ఎందుకంటే వాళ్ళచేతులు నా వైపున్నాయి". -
12:40 - 12:42" వాళ్ళు త్వరగా ఎక్కువ స్థాయి లో
మాట్లాడతారు". -
12:42 - 12:43(నవ్వులు)
-
12:43 - 12:46"వాళ్ళు ఒక రహస్యం చెపుతున్నట్టుగా
నా మీదకు వంగుతారు" -
12:46 - 12:47ఇక అప్పుడు వాళ్ళతో
నేనంటాను, -
12:47 - 12:50"వాళ్ళ అభిరుచి విన్నప్పుడు
మీకేమనిపించింది?" -
12:50 - 12:53వాళ్ళు అంటారు, "నా కళ్ళు మెరిశాయి.
-
12:53 - 12:54నేను నవ్వాను.
-
12:54 - 12:55నేను వంగాను".
-
12:55 - 12:57మనం ఎప్పుడైతే మన అభిరుచిని పెంచుకుంటామో,
-
12:57 - 13:01మన ద్రుష్టి లో మనకు మనమే మాట్లాడడానికి
కావలసిన ధైర్యం ఇచ్చుకుంటాం, -
13:01 - 13:04ఇంకా మాట్లాడడానికి అనుమతి కూడా
వేరే వాళ్ళ నుండి పొందుతాం. -
13:05 - 13:10మన అభిరుచులను వాడుకోవడంమనంపిరికి వాళ్ళమని
అందరూ అనుకున్నప్పుడు కూడా పనిచేస్టుంది. -
13:11 - 13:15మహిళలూ ఇంకా పురుషులూ ఇద్దరూ కూడా పని వద్ద
కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే శిక్షించ పడతారు. -
13:15 - 13:22కానీలిజ్జీ వోల్ఫ్ చూపించింది ఎప్పుడైతే మనం
మన అభిరుచులను బలమైనభావోద్వేగాలుగా -
13:22 - 13:28మలచుకుంటే,మహిళలూ ఇంకాపురుషులిద్దరి పిరికి
ప్రవర్తన పట్ల ఉన్న తిరస్కార భావన పోతుంది. -
13:29 - 13:32నేను నా దివంగత తండ్రివి కొన్ని మాటలు
చెప్పి ముగించాలనుకుంటున్నాను -
13:32 - 13:34అవి నా తండ్రి నా తమ్ముడి
పెళ్ళిలో మాట్లాడినవి. -
13:35 - 13:36ఇదిగో మా అందరి పిక్చర్.
-
13:38 - 13:40నా తండ్రి నా లాగే ఒక మానసిక వైద్యుడు,
-
13:40 - 13:44కానీ ఆయనకు నిజమైన ప్రేమ ఇంకా అసలు
అభిరుచి సినిమా మీద ఉండేది, -
13:44 - 13:45నా తమ్ముడిలాగా.
-
13:45 - 13:47ఇక ఆయన నా తమ్ముడి పెళ్ళి కోసమని ఒక
ఉపన్యాసం రాశారు -
13:48 - 13:51అందులో మనం మన మానవ జీవితంలో
హాస్యం లో మన పాత్రల గురించి రాశారు. -
13:51 - 13:53ఇక ఆయన అన్నారు," నీ స్పర్శ తేలిక గా ఉంటే,
-
13:53 - 13:57నువ్వు నీ ప్రదర్షనను ఇంకా మంచి గా
ఇంకా మెరుగు పర్చడానికి వీలుంటుంది. -
13:57 - 14:01ఎవరైతే వాళ్ళ పాత్రలను హత్తుకోని ఇంకా
మెరుగుపర్చడానికి పనిచేస్తారో వాళ్ళనివాళ్ళు -
14:02 - 14:05పెంచుకుంటారు, మార్చుకుంటారు,
ఇంకా విశాలం చేసుకుంటారు. -
14:05 - 14:06దాన్ని బాగా పోషించండి,
-
14:06 - 14:08ఇక మీ రోజులు చాలా ఆనందం గా ఉంటాయి".
-
14:09 - 14:11నా తండ్రి చెప్పేదేమిటంటే
-
14:11 - 14:14మన అందరికీ ఈ ప్రపంచం లో పాత్రలూ
ఇంకా హద్దులూ కేటాయించబడ్డాయి. -
14:15 - 14:19కానీ ఆయన ఈ చర్చ సారాంశాన్ని
కూడా చెపుతున్నారు; -
14:19 - 14:24ఆ పాత్రలూ ఇంకా హద్దులూనిరంతరంవిస్తరిస్తూ
ఇంకా అభివ్రుద్ధి చెందుతున్నాయి. -
14:25 - 14:27కాబట్టి ఎప్పుడు ఒక సన్నివేశం ఉన్నా
-
14:27 - 14:29దూకుడుగా ఉండే తల్లి
ఎలుగులాగా ఇంకా -
14:29 - 14:31వినయంగా సలహాలు అడిగే
వారిలామారండి. -
14:32 - 14:36అద్భుతమైన ఆధారాలను ఇంకా
బలమైన మిత్రులను ఉంచుకోన్డి. -
14:36 - 14:38ఉద్వేగభరితం గా అవతలి కోణం నుండి
ఆలోచించండి. -
14:39 - 14:40ఇక మీరు ఈ పరికరాలు వాడినట్లైతే --
-
14:41 - 14:44మీలో ప్రతి ఒక్కరూ ఈ పరికరాలు వాడవచ్చు--
-
14:44 - 14:48మీ ఆమోదకరమైన ప్రవర్తన యొక్క
హద్దుల్ని విశాలం చేసికోవచ్చు, -
14:48 - 14:51ఇక మీ రాబోయే రోజులన్నీ
ఎక్కువగా ఆనందకరం గా ఉంటాయి. -
14:52 - 14:53ధన్యవాదాలు.
-
14:53 - 14:56(చప్పట్లు)
- Title:
- మీ కోసం మీరు మాట్లాడడం ఎలా
- Speaker:
- ఆడం గాలింస్కీ
- Description:
-
more » « less
ఒక విషయం గురించి మాట్లాడడం కష్టం, మనం మాట్లాడితీరాలని తెలిసినప్పుడు కూడాకూడా.సాంఘిక మనస్తత్వవేత్త ఆడం గాలింస్కీ మార్గ నిర్దేశం లో మీ గురించి మీరు చాటుకోవడం నేర్చుకోన్డి,క్లిష్టమైన సామాజిక పరిస్థితుల్లో మార్గనిర్దేశం చేయడం ఇంకా మీ స్వీయ శక్తి యొక్క హద్దులను విస్తరించుకోవడం నేర్చుకోన్డి.
- Video Language:
- English
- Team:
closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 15:08
| TED Translators admin approved Telugu subtitles for How to speak up for yourself | ||
| Riaki Ponist commented on Telugu subtitles for How to speak up for yourself | ||
| Chiguluri Akhila accepted Telugu subtitles for How to speak up for yourself | ||
| Chiguluri Akhila edited Telugu subtitles for How to speak up for yourself | ||
| Annamraju Lalitha edited Telugu subtitles for How to speak up for yourself | ||
| Annamraju Lalitha edited Telugu subtitles for How to speak up for yourself | ||
| Annamraju Lalitha edited Telugu subtitles for How to speak up for yourself | ||
| Annamraju Lalitha edited Telugu subtitles for How to speak up for yourself |
Riaki Ponist
Hello, TEDx version of this talk is available in this link:
http://www.amara.org/en/teams/ted/tasks/?team_video=414443
If you are translating or have translated this talk, please consider taking the TEDx version as well.