నా సంవత్సరంలో ప్రపంచంలోని ప్రతి దేశం నుండి ఒక పుస్తకాన్ని చదవడం
-
0:01 - 0:04ఇది చాలా తరచుగా అనేమాట
ఏమిటంటే ఒక మనిషి గురించి -
0:04 - 0:06అతని పుస్తకాల అరలో
ఏమి ఉన్నాయో చూసి చెప్పచ్చు అని. -
0:08 - 0:10నా పుస్తకాల అరలు నా గురించి ఏమి చెప్తాయి?
-
0:10 - 0:14కొన్ని సంవత్సరాల క్రితం నాకు
నేను ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు, -
0:14 - 0:16నేను ఒక ఆందోళనకరమైన విషయం కనిపెట్టాను.
-
0:17 - 0:20నా గురించి నేను ఎప్పుడూ ఒక మాదిరి
సంప్రదాయబధ్ధమైన, -
0:20 - 0:23కాస్మోపాలిటన్ కి చెందిన
వ్యక్తిగా భావించుకుంటాను. -
0:23 - 0:26కానీ నా పుస్తకాల అరలు నాకు
వేరే కధను చెప్పాయి. -
0:26 - 0:28వాటి మీద ఉన్నశీర్షికలలో చాలావరకు
-
0:28 - 0:31బ్రిటిష్ లేదా నార్త్ అమెరికన్ రచయితలవి,
-
0:31 - 0:34ఇంకా అనువాద రచనలు దాదాపుగా లేనే లేవు.
-
0:34 - 0:38నా పఠనం లో ఉన్నఈ పెద్ద,
సాంస్క్రుతిక శూన్యాన్ని కనిపెట్టడం -
0:38 - 0:40నాకు ఒక షాక్ లాగా తగిలింది.
-
0:40 - 0:44ఇంకా నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించినా,
నిజంగా సిగ్గుగా అనిపిస్తుంది. -
0:44 - 0:47నాకు తెలుసు బయట చాలామంది
రచయితలు ఇంగ్లిష్ కాకుండా తమ భాషల్లో రాసిన -
0:47 - 0:50అద్భుతమైన కధలు ఉండి ఉంటాయని.
-
0:50 - 0:54ఇంకా ఆలోచిస్తూ ఉంటే నా పఠన అలవాట్లు ఇలాగే
ఉంటే నేను బహుశా ఎప్పటికీ -
0:54 - 0:56వాటిని చూడలేనేమో అనివిచారంగా అనిపించింది.
-
0:56 - 0:59అందుకని, నాకు నేను
అధికమైన విశ్వ విఖ్యాత పుస్తకాలను -
0:59 - 1:02సూచించుకోవాలని నిర్ణయించుకున్నాను.
-
1:03 - 1:062012 UK కి ఒక అంతర్జాతీయ
సంవత్సరం గా సెట్ అయ్యింది; -
1:06 - 1:08అది లండన్ ఒలింపిక్స్ సంవత్సరం.
-
1:08 - 1:12అందుకని నేను దాన్నినా కాల పరిమితి
కింద వాడుకోవాలని -
1:12 - 1:15రోజుకి ఒక నవల, చిన్న కధల
సేకరణ లేదా ప్రపంచంలోని -
1:15 - 1:20అన్నిదేశాల నుండి చరిత్రను చదవడానికి
ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. -
1:21 - 1:22అందువల్ల నేను చేశాను.
-
1:22 - 1:24ఇంకా అది చాలా ఉత్తేజకరమైనది.
-
1:24 - 1:26నేను కొన్నివిశేషాలు నేర్చుకున్నాను
-
1:26 - 1:28కొన్ని అధ్భుతమైన కనెక్షన్స్ చేశాను
అవి ఈరోజు -
1:28 - 1:30నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
-
1:30 - 1:33కానీ అది కొన్నిఆచరణాత్మక
సమస్యలతో మొదలయ్యింది. -
1:34 - 1:39నేను ప్రపంచం లో ఉన్న
వివిధ దేశాల జాబితా లో నుండీ -
1:39 - 1:41నా ప్రాజెక్ట్ కోసం కావలసిన దేశాలు తీశాక,
-
1:41 - 1:44నేను UN-గుర్తింపు పొందిన దేశాల
జాబితాతో మిగిలాను, -
1:44 - 1:45వాటికి నేను
-
1:45 - 1:49తైవాన్ కలిపాను, దానితో
నాకు 196 దేశాల జాబితా దొరికింది. -
1:49 - 1:52తరవాత నేను నా పఠనాన్ని ఇంకా బ్లాగింగ్ ని
ఎలా సమన్వయం -
1:52 - 1:54చేసుకోవాలో ఆలోచించుకున్నాక
సుమారు, ఒక వారానికి -
1:54 - 1:57నాలుగు పుస్తకాలు
వారానికి ఐదు రోజుల చొప్పున, -
1:57 - 2:01నాకు బహుశ అన్ని దేశాల నుండి
ఇంగ్లిష్ లో పుస్తకాలు దొరక్క పోవచ్చు -
2:01 - 2:04అనే విషయాన్ని నేను అప్పుడు
ఎదుర్కోవలసి వచ్చింది. -
2:05 - 2:08UK లో ప్రతి సంవత్సరం ప్రచురితమయ్యే
సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలలో, -
2:08 - 2:11కేవలం సుమారు 4.5 శాతం
మాత్రం అనువాదాలు, అంతేకాక -
2:11 - 2:15ప్రపంచం లోని ఇంగ్లిష్ మాట్లాడే చాలా
ప్రదేశాలలో కూడా ఇదే గణాంకాలు ఉంటాయి. -
2:15 - 2:18అయినప్పటీకీ, అనువాద
పుస్తకాల ప్రచురణ నిష్పత్తి -
2:18 - 2:20వేరే చాలా దేశాలలో కొంచెం ఎక్కువగానే ఉంది.
-
2:21 - 2:244.5 శాతం అనేది మొదలు పెట్టడానికి
చాలా స్వల్ప ఆరంభం, కానీ -
2:24 - 2:26ఆ గణాంకం మీకు
చెప్పని విషయం ఏమిటంటే -
2:26 - 2:29వాటిల్లో చాలా పుస్తకాలు
బలమైన ప్రచురణ నెట్ వర్క్స్ ఉండి -
2:29 - 2:31చాలా మంది పరిశ్రమ నిపుణులు బయటకు వెళ్ళి
-
2:31 - 2:35ఇంగ్లిష్-భాష ప్రచురణకర్తలకు
-
2:35 - 2:37ఆ పుస్తకాలను అమ్మే దేశాలనుండి వచ్చినవి.
-
2:38 - 2:42అందుకని, ఉదాహరణకి, 100 పైచిలుకు పుస్తకాలు
UK లో ప్రతి సంవత్సరం ఫ్రెంచ్ నుండి అనువాదం -
2:42 - 2:44అయ్యి ప్రచురింపబడినప్పటికీ, వాటి నుండి
-
2:44 - 2:49చాలా వరకు ఫ్రాన్స్ లేదా స్విడ్జర్లాండ్
వంటి దేశాల నుండి వచ్చినవి అయ్యి ఉంటాయి. -
2:49 - 2:52ఫ్రెంచ్- మాట్లాడే ఆఫ్రికా, రెండో వైపు,
-
2:52 - 2:54అరుదుగా అవకాశాన్ని పొందుతుంది.
-
2:54 - 2:58దాని ఫలితం ఏమిటంటే వాస్తవంలో
అక్కడ చాలా దేశాలలో వాణిజ్య పరంగా -
2:58 - 3:01ఇంగ్లిష్ సాహిత్యం చాలా తక్కువ లేదా
అసలు అందుబాటులో -
3:01 - 3:02లేకుండా కూడా ఉండవచ్చు.
-
3:03 - 3:06ప్రపంచం లోనే ఎక్కువ
ప్రచురితమైన భాష యొక్క -
3:06 - 3:09పాఠకులకు వాళ్ళ పుస్తకాలు
కనపడకుండా ఉండి ఉండవచ్చు. -
3:10 - 3:12కానీ ప్రపంచాన్ని చదవడం లో నాకు ఎదురైన
-
3:12 - 3:14అన్నిటిలోకి అతి పెద్ద సవాలు నేను
-
3:14 - 3:17ఎక్కడ నుండి మొదలు పెట్టాలో
తెలవక పోవడం అనే కారణం. -
3:17 - 3:21నా జీవితం లో దాదాపు ఎక్కువ భాగం
కేవలం బ్రిటీష్ ఇంకా నార్త్ అమెరికా -
3:21 - 3:22పుస్తకాలు చదువుతూ గడపడం వల్ల,
-
3:22 - 3:26నాకు ప్రపంచం లోని వేరే భాగాల లోని
కధల మూలాలు కనిపెట్టడం -
3:26 - 3:29ఇంకా వాటి నుండి
ఎంచుకోవడం ఎలాగో తెలియ లేదు. -
3:29 - 3:32నేను స్వాజిలాండ్ నుండి ఒక కధ
యొక్క మూలాన్ని మీకు చెప్పలేను. -
3:32 - 3:35నేను నమీబియా నుండి ఒక
మంచి నవల తెలుసుకోలేను. -
3:35 - 3:37ఇంక దాచేదేమీ లేదు--
-
3:37 - 3:40నేను సాహిత్యం లో ఏమీ
తెలియని ఒక విదేశీయురాలిని. -
3:41 - 3:43కాబట్టి నేను ప్రపంచాన్ని
ఎట్లా చదవబోతున్నాను? -
3:44 - 3:46నేను సహాయం కోసం అడగ బోతున్నాను.
-
3:46 - 3:49కాబట్టి అక్టోబర్ 2011 లో, నేను
నా బ్లాగ్ ను రిజిస్టర్ చేయించాను, -
3:49 - 3:51ayearofreadingtheworld.com
-
3:51 - 3:53ఇంకా నేను ఒక చిన్న అభ్యర్థన
ఆన్ లైన్లో పోస్ట్ చేశాను. -
3:54 - 3:55నేను నాగురించివివరించాను,
-
3:55 - 3:57నా పఠనం ఎంత చిన్నది అయ్యిందో,
-
3:57 - 3:59నేను ఎవరైనా ఈ గ్రహం మీద వేరే ప్రాంతాల
-
3:59 - 4:02నుండి నేను చదవదగ్గ పుస్తకాల
గురించి ఏమైనా సలహాలు -
4:02 - 4:03ఇస్తూ మెసేజ్ పెడ్తారా అని అడిగాను.
-
4:04 - 4:08ఇప్పుడు, నాకు ఏమీ అవగాహన లేదు
అసలు ఎవరికైనా ఆసక్తి ఉంటుందో లేదో అని, -
4:08 - 4:11కానీ నేను ఆ అభ్యర్థన ఆన్ లైన్లో
పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే, -
4:11 - 4:14ప్రజలు నాతో టచ్ లోకి రావడం
మొదలు పెట్టారు. -
4:14 - 4:16అందరికంటే ముందు ,స్నేహితులు
ఇంకా సహోద్యోగులు. -
4:16 - 4:18తర్వాత అది స్నేహితుల స్నేహితులు.
-
4:18 - 4:21తర్వాత అతి త్వరలోనే, అపరిచితులు.
-
4:21 - 4:24నేను ఆ అభ్యర్థన ఆన్ లైన్ లో
పెట్టిన నాలుగు రోజులకు, -
4:24 - 4:28నాకు కౌలా లంపూర్ నుండి రాఫిడా
అనే ఆమె నుండి ఒక సందేశం వచ్చింది. -
4:28 - 4:31ఆమె తనకు నా ప్రాజెక్ట్
నచ్చిందని , ఇంకా ఆమె అక్కడ -
4:31 - 4:34ప్రాంతీయం గా ఉండే ఇంగ్లిష్-భాష
పుస్తకాల షాప్ కి వెళ్ళి నా కోసం -
4:34 - 4:37మలేసియన్ పుస్తకం ఎంపిక చేసి
నాకు పోస్ట్ చేయవచ్చా అని అడిగింది? -
4:38 - 4:40నేను ఉత్సాహం గా అంగీకరించాను.
-
4:40 - 4:41తరవాత కొన్ని వారాల తరవాత,
-
4:41 - 4:46ఒక పాకేజ్ ఒక పుస్తకం కాదు,
రెండు పుస్తకాలు కలిగి వచ్చింది-- -
4:47 - 4:50ఒకటి మలేసియా నుండి రాఫిడా యొక్క ఎంపిక,
-
4:51 - 4:55ఇంకా ఒక పుస్తకం సింగపూర్ నుండి
అది కూడా ఆమె నా కోసం ఎంపిక చేసిందే. -
4:56 - 4:59ఆ సమయం లో, నేను ఒక అపరిచితురాలు
-
4:59 - 5:026,000 మైళ్ళ కంటే ఎక్కువ దూరం లో
ఉండి తాను బహుశా ఎప్పటికీ -
5:02 - 5:04కలుసుకోలేని వారికి సహాయం చెయ్యడం కోసం
-
5:04 - 5:06అంత శ్రమ పడతారా అని ఆశ్చర్యపోయాను
-
5:07 - 5:11కానీ రాఫిడా యొక్క శ్రద్ధ ఆ సంవత్సరం లో ఒక
నమూనా లాగా ఉండి పోయింది. -
5:11 - 5:15మళ్ళీ, ప్రజలు వారి శక్తికి మించి నాకు
సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. -
5:15 - 5:18కొంత మంది నా తరఫున శోధన
మొదలు పెట్టారు,ఇంకా కొంత మంది -
5:18 - 5:21నా కోసం బుక్ షాప్ కి వెళ్ళడానికి
శలవులలో మరియు వ్యాపార ట్రిప్లలో -
5:21 - 5:23వారి మార్గమ్నుండి వేరే వెళ్ళారు.
-
5:24 - 5:27నాకు అనిపించింది,మీరు ప్రపంచాన్ని
చదవాలని అనుకుంటే కనక, -
5:27 - 5:30మీరు ఒక విశాల హ్రృదయం తో దాన్ని
ఎదుర్కోవాలనుకుంటే, -
5:30 - 5:32ప్రపంచం మీకు సహాయం చేస్తుంది.
-
5:33 - 5:34ఎపుడు దేశాల మాట వచ్చిందో
-
5:34 - 5:38వాణిజ్యపరం గా ఇంగ్లిష్ సాహిత్యం చాలా
తక్కువ లేదా అసలు లేకుండా ఉన్నప్పుడు, -
5:38 - 5:40ప్రజలు ఇంక ముందుకు వెళ్ళ లేరు.
-
5:41 - 5:44పుస్తకాలు చాలా సార్లు
ఆశ్చర్యకరమైన చోట్ల నుండి వస్తాయి. -
5:45 - 5:48ఉదాహరణార్ర్థం నా పనామా పఠనం,
నేను ట్విట్టర్ లో -
5:48 - 5:51పనామా కాలువ తో చేసిన
ఒక సంభాషణ ద్వారా వచ్చింది. -
5:51 - 5:55అవును, పనామా కాలువకు
ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది. -
5:56 - 5:58ఇంకా నేను దానిలో నా ప్రాజెక్ట్ గురించి
-
5:58 - 6:02ట్వీట్ చేసినప్పుడు, నేను పనామ రచయిత
జువన్ డేవిడ్ మోర్గాన్ యొక్క రచనలను -
6:02 - 6:04ప్రయత్నించి దాన్ని
పొందవచ్చని నాకు సూచించింది. -
6:05 - 6:07నేను మోర్గాన్ వెబ్ సైట్ కి
వెళ్ళి ఇంకా అతనివి -
6:07 - 6:10స్పానిష్- భాష లోని నవలలు
ఇంగ్లిష్ లోకి అనువాదమయ్యాయా -
6:10 - 6:12అని అడుగుతూ అతనికి ఒక మెసేజ్ పంపించాను,
-
6:12 - 6:15ఇంకా అతను ఏవీ ప్రచురణ కాలేదని,
-
6:15 - 6:17కానీ అతని దగ్గర అతని నవల
"ద గోల్డెన్ హార్స్" యొక్క -
6:17 - 6:19ప్రచురణ కాని ఒక అనువాదం
ఉంది అని చెప్పాడు. -
6:20 - 6:21నేను ఆంగ్లంలో ఆ పుస్తకాన్ని
-
6:21 - 6:24చదివినవాళ్ళలోప్రపంచం లోనే
మొట్టమొదటిదాన్నిఅయ్యేందుకు అనుమతిస్తూ -
6:24 - 6:26అతను దాన్నినాకు ఇమెయిల్ చేశాడు.
-
6:27 - 6:30నాతో ఈ విధం గా బుక్స్ పంచుకున్న రచయిత
-
6:30 - 6:32ఏ విధం గా చూసినా మోర్గాన్ ఒక్కడే కాదు.
-
6:32 - 6:34స్వీడన్ నుండి పలౌ వరకు,
-
6:34 - 6:38రచయితలు మరియు అనువాదకులు
వారి సొంత-ప్రచురిత పుస్తకాలు -
6:38 - 6:40ఇంకా ప్రచురితం కాని పుస్తకాల
-
6:40 - 6:42మాన్యుస్క్రిప్ట్స్ ఏవైతే
ఆంగ్లోఫోన్ పబ్లిషర్స్ ఎంపిక -
6:42 - 6:44చేసుకోలేదో లేదా ఇంక అసలు
అందుబాటులో లేవో, -
6:45 - 6:49నాకు కొన్ని విశేషమైన ఊహాత్మక ప్రపంచాల
విశేష సంగ్రాహవలోకనం కల్పిస్తూ పంపించారు. -
6:50 - 6:51ఉదాహరణకు,
-
6:51 - 6:56దక్షిణ ఆఫ్రికన్ రాజు గుంగున్హానె
గురించి, ఎవరైతే 19 వ శతాబ్దం లో -
6:56 - 6:58పోర్చుగీస్ కి వ్యతిరేకం గా
ప్రతిఘటన జరిపారో; -
6:59 - 7:02ఇంకా తుర్క్మెనిస్తాన్ లో
కాస్పియన్ సముద్రం ఒడ్డున -
7:02 - 7:05ఒక కుగ్రామం లోని వివాహ సాంప్రదాయాల
గురించి నేను చదివాను. -
7:07 - 7:10బ్రిడ్జెట్ జోన్స్ కి కువైట్
సమాధానాన్ని నేను కలిశాను. -
7:10 - 7:12(నవ్వులు)
-
7:13 - 7:17ఇంకా నేను అంగోలా లోని
ఒక ఓర్గీ చెట్టు గురించి చదివాను. -
7:21 - 7:23కానీ ప్రజలు నాకు ప్రపంచాన్ని చదవడం లో
-
7:23 - 7:25సహాయం చేయడానికి
ప్రజలు ఎంత శ్రమ తీసుకుంటారో -
7:25 - 7:27చెప్పడానికి అద్భుతమైన ఉదాహరణ,
-
7:27 - 7:30నా అన్వేషణ చివరిలో వచ్చింది, నేను అతిచిన్న
-
7:30 - 7:33పోర్చుగీస్-మాట్లాడే ఆఫ్రికన్ ద్వీప దేశం
సావో టోమ్ మరియు ప్రిన్సిపి నుండి -
7:33 - 7:37ఒక పుస్తకాన్ని సంపాదించడానికి
ప్రయత్నిస్తున్నప్పుడు వచ్చింది. -
7:37 - 7:41ఇక ఇన్ని నెలలు ఇంగ్లిష్ లోకి
అనువాదం చేయబడిన -
7:41 - 7:44పుస్తకాన్ని వెదకడం లో
నాకు తెలిసిన పద్ధతులన్నీప్రయత్నిస్తే -
7:44 - 7:47నాకు ఒకే ఒక్క మార్గం
మిగిలినట్టు అనిపించింది -
7:47 - 7:50అది మొదటి నుండి అనువదించబడినది
ఏదైనా దొరుకుతుందేమో చూడడం. -
7:50 - 7:52ఇప్పుడు,నేను
నిజంగా సందేహపడ్డాను -
7:52 - 7:54ఎవరైనా వారి సమయాన్ని
ఇటువంటి వాటి కోసం వెచ్చించి, -
7:54 - 7:57దీనిలో సహాయం చేయాలనుకుంటారా అని.
-
7:58 - 8:02కానీ,నేను పోర్చుగీస్
మాట్లాడే వాళ్ళ గురించి సందేశం ట్విట్టర్ -
8:02 - 8:04మరియు ఫేస్ బుక్ లో పెట్టిన వారం లో
-
8:04 - 8:07మార్గరేట్ జుల్ కోస్టా ఎవరైతే
ఆమె రంగం లో నంబర్ ఒకటి గాఉందో, -
8:07 - 8:12ఎవరైతే నోబల్ బహుమతి విజేత
జోస్ సరమగో వర్క్ ను అనువదించారో -
8:12 - 8:17ఆమె తో సహా నేను నా ప్రాజెక్ట్ లో
ఇన్వాల్వ్ చేయలేనంత మంది వచ్చారు. -
8:18 - 8:20నా తొమ్మిది మంది వాలంటీర్స్ తో కలిసి
-
8:20 - 8:23నేను కావలసినన్ని ప్రతులు
ఆన్ లైన్ లో కొనగలిగిన -
8:23 - 8:26ఒక పుస్తకం సావో టోమియన్
రచయితది కనిపెట్టగలిగాను. -
8:26 - 8:27ఇది వాటిల్లో ఒకటి .
-
8:27 - 8:31ఇంకా నేను నా స్వయం సేవకులకు
ఒక్కొక్క కాపీని పంపించాను. -
8:31 - 8:34వాళ్ళందరూ ఆ సంకలనం నుండి
రెండు,మూడు చిన్న కధలు తీసుకున్నారు, -
8:34 - 8:38వాళ్ళ మాట ప్రకారం, వారి
అనువాదాలు నాకు తిరిగి పంపించారు, -
8:38 - 8:41ఇంకా ఆరు వారాల లోపల, నా దగ్గర మొత్తం
పుస్తకం చదవడానికి తయారు గా ఉంది. -
8:42 - 8:47ఆ విషయం లోనూ, నా ప్రపంచం చదివే ఒక
సంవత్సరం లో నేను చాలా తరచుగా గమనించినట్టు, -
8:47 - 8:51నాకు ఎక్కువగా తెలియక పోవడం ఇంకా
నా పరిమితుల గురించి నేను చెప్పుకోవడం -
8:51 - 8:53ఒక పెద్ద అవకాశం గా మారింది.
-
8:54 - 8:56ఎప్పుడైతే సావో టోమ్ ఇంకా
ప్రింసిపి -
8:56 - 8:59గురించి వచ్చిందో, అది కొత్తది
నేర్చుకోవడానికి, ఒక కొత్త కధల సంకలనాన్ని -
9:00 - 9:02కనుక్కోవడానికి ఒక అవకాశం మాత్రమే కాక,
-
9:02 - 9:05ఒక వ్యక్తుల సమూహాన్ని
దగ్గరకు తీసుకుని వచ్చి -
9:05 - 9:08ఒక ఉమ్మడి సృజనాత్మక
ప్రయత్నాన్ని సులభతరం చేస్తుంది. -
9:09 - 9:13నా బలహీనత నా ప్రాజెక్ట్ కి బలం అయ్యింది.
-
9:14 - 9:17నేను ఆ సంవత్సరం చదివిన పుస్తకాలు
చాలా విషయాల పట్ల నా కళ్ళు తెరిపించాయి. -
9:18 - 9:20ఎవరైతే పఠనాన్ని ఆనందిస్తారో
-
9:20 - 9:24వాళ్ళకు తెలిసే ఉంటుంది, పుస్తకాలకు
మన నుంచి మనను బయటకు లాగి -
9:24 - 9:26వేరే వాళ్ళ మనసులో
దూర్చే అసాధారణ శక్తి ఉంది, -
9:26 - 9:28కాబట్టి, కనీసం కొంత సేపైనా,
-
9:28 - 9:30మీరు ప్రపంచం వంక వేరే
దృష్టి తో చూస్తారు. -
9:30 - 9:33అది ఒక ఇబ్బందికరమైన అనుభవం కావచ్చు,
-
9:33 - 9:35ముఖ్యం గా మీరు మన కంటే వేరే
-
9:35 - 9:38విలువలు ఉన్న సంస్కృతి నుండి కనుక
ఒక పుస్తకం చదువుతున్నట్లైతే. -
9:39 - 9:41కానీ అది నిజం గా జ్ఞానం కలిగించవచ్చు కూడా.
-
9:41 - 9:45తెలియని ఆలోచనలతో కుస్తీ పట్టడం మన
ఆలోచనలలో స్పష్టత రావడానికి సహాయపడచ్చు. -
9:46 - 9:48ఇంకా అది మనం ప్రపంచాన్ని చూసే తీరు లో
-
9:48 - 9:51బ్లైండ్ స్పాట్స్ నుకూడా చూపించచ్చు.
-
9:51 - 9:54నేను ఎప్పుడైతే దేనితో పాటు
నేను ఎదిగానో ఉదాహరణకు, -
9:54 - 9:56ఇంగ్లిష్- భాష సాహిత్యం, గురించి
-
9:56 - 9:59ఆలోచిస్తానో ఈ ప్రపంచం అందించిన గొప్ప
దానితో పోలుస్తే, నేను అది -
9:59 - 10:02చాలావరకు ఎంత సంకుచితం గా
ఉందో చూడడం మొదలు పెట్టాను. -
10:03 - 10:05ఇంకా పేజీలు తిరుగుతున్న కొద్దీ,
-
10:05 - 10:08ఇంకా ఏదో జరగడం ప్రారంభమైంది కూడా.
-
10:08 - 10:09కొంచెం కొంచెంగా,
-
10:09 - 10:14నేను సంవత్సరం మొదట్లో ప్రారంభించిన
దేశాల పొడవైన జాబితా, -
10:14 - 10:18పొడి మరియు ప్రదేశాల
పేర్ల రిజిస్టర్ ను జీవమున్న, -
10:18 - 10:21శ్వాస తీసుకొనే ఎన్టిటీలగా మార్చింది.
-
10:21 - 10:24ఇప్పుడు, నేను కేవలం ఒక పుస్తకం
చదవడం ద్వారా ఒక దేశం -
10:24 - 10:28గురించి పూర్తిగా అవగాహన సాధ్యమవుతుంది
అని నేను సూచించడం లేదు. -
10:29 - 10:33కానీ మొత్తంగా, నేను ఆ సంవత్సరంలో
చదివిన కథల వలన -
10:33 - 10:36ఇంతకు ముందు కన్నా ఎక్కువగా
మన గొప్ప గ్రహం యొక్క గొప్పతనాన్ని, -
10:36 - 10:42విభిన్నతను మరియు సంక్లిష్టతను
తెలియచేసి నన్ను మరింత సజీవంగా చేసింది. -
10:43 - 10:45ఈ ప్రపంచం కథలు మరియు
-
10:45 - 10:49చాలా మంది వ్యక్తులు ఇబ్బందులు పడి కూడా
నేను కథలు చదవటానికి సహాయము చేయడం -
10:49 - 10:50నాకు బాగా నిజమనిపించింది.
-
10:52 - 10:55ఈ రోజుల్లో, నేను నా
పుస్తకాల అరలు చూస్తే -
10:55 - 10:58లేదా నా ఈ -రీడర్ లో రచనలు
దృష్టిలో ఉంచుకుంటే, -
10:58 - 11:00అవి వేరే కథ చెప్తాయి.
-
11:01 - 11:04ఈ పుస్తకాల్లోని కథలు రాజకీయ, భౌగోళిక,
-
11:04 - 11:09సాంస్కృతిక, సామాజిక, మత విభేదాలను
మనకు కనెక్ట్ చేసే శక్తి కలిగి ఉంటాయి. -
11:09 - 11:14దీనికోసం సంభావ్య
మానవులు కలిసి పని చేయాలి. -
11:14 - 11:16అంతర్జాలానికి ధన్యవాదములు,
-
11:16 - 11:20మనము ఈ అసాధరణ పరిస్థితుల్లో నివసించడానికి
శాసనము, ఇంతకు ముందు కన్నా, -
11:20 - 11:22ఒక అపరిచితుడు, ఎవర్నైతే
-
11:22 - 11:27తను ఎప్పుడూ కలవ లేదు మరియు మన
గ్రహంలో రెండో వైపు ఉంటున్న వారిని, -
11:27 - 11:31ఒక కధలో, ఒక ప్రపంచ దృష్టికోణాన్ని, ఒక
పుస్తకాన్ని పంచుకోవటం ఇప్పుడు సులభము. -
11:32 - 11:35నేను రాబోయే అనేక సంవత్సరాలు ఈ కథను
చదువుతానని ఆశిస్తున్నాము. -
11:35 - 11:38మరియు నాతో చాలామంది
ఏకీభవిస్తారని ఆశిస్తున్నాను. -
11:38 - 11:41మనం అందరం మరింత విస్తృతంగా
చదివితే, ప్రచురణకర్తలకు -
11:41 - 11:43పుస్తకాలు అనువదించడానికి
మరింత ప్రోత్సాహం ఉంటుంది, -
11:43 - 11:45మరియు మనము అందరము
ప్రయోజనము పొందుతాము. -
11:46 - 11:47ధన్యవాదములు.
-
11:47 - 11:51(చప్పట్లు)
- Title:
- నా సంవత్సరంలో ప్రపంచంలోని ప్రతి దేశం నుండి ఒక పుస్తకాన్ని చదవడం
- Speaker:
- ఆన్ మోర్గాన్
- Description:
-
ఆన్ మోర్గాన్ తన పుస్త్లకాల అరలో "స్థూలమైన సాంస్కృతిక అంధ బిందువు" కనుగొనే వరకు తాను బాగా చదువుతానని భావించేవారు. ఇంగ్లీష్ మరియు అమెరికన్ రచయితల సమూహము నడుమ, ఆంగ్లం మాట్లాడే ప్రపంచం దాటి చాలా కొన్ని రచయితల రచనలు ఆమె వద్ద ఉన్నాయి. కాబట్టి ఆమె ఒక సంవత్సరంలో ప్రపంచంలో ప్రతి దేశం నుండి ఒక పుస్తకం చదవాలని ఒక ఔత్సాహిక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇప్పుడు ఆమె ఆంగ్ల భాష ఇష్ట బడే వాళ్ళను అనువాద రచనలను చదవమని విజ్ఞప్తి చేస్తోంది ఎందుకంటీ ఇలా చేస్తే ప్రచురణకర్తలు బాగా కష్టబడి విదేశీ సాహిత్య రత్నాలు తీసుకుని వారి తీరాలకు తిరిగి తీసుకు వస్తారని. ఇక్కడ: go.ted.com/readtheworld ఆమె పఠన ప్రయాణం ఇంటరాక్టివ్ పటాలు అన్వేషించండి .
- Video Language:
- English
- Team:
closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 12:03
![]() |
Samrat Sridhara approved Telugu subtitles for My year reading a book from every country in the world | |
![]() |
Samrat Sridhara edited Telugu subtitles for My year reading a book from every country in the world | |
![]() |
Samrat Sridhara accepted Telugu subtitles for My year reading a book from every country in the world | |
![]() |
Samrat Sridhara edited Telugu subtitles for My year reading a book from every country in the world | |
![]() |
Samrat Sridhara edited Telugu subtitles for My year reading a book from every country in the world | |
![]() |
Annamraju Lalitha edited Telugu subtitles for My year reading a book from every country in the world | |
![]() |
Annamraju Lalitha edited Telugu subtitles for My year reading a book from every country in the world | |
![]() |
Annamraju Lalitha edited Telugu subtitles for My year reading a book from every country in the world |