ఇది చాలా తరచుగా అనేమాట ఏమిటంటే ఒక మనిషి గురించి అతని పుస్తకాల అరలో ఏమి ఉన్నాయో చూసి చెప్పచ్చు అని. నా పుస్తకాల అరలు నా గురించి ఏమి చెప్తాయి? కొన్ని సంవత్సరాల క్రితం నాకు నేను ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు, నేను ఒక ఆందోళనకరమైన విషయం కనిపెట్టాను. నా గురించి నేను ఎప్పుడూ ఒక మాదిరి సంప్రదాయబధ్ధమైన, కాస్మోపాలిటన్ కి చెందిన వ్యక్తిగా భావించుకుంటాను. కానీ నా పుస్తకాల అరలు నాకు వేరే కధను చెప్పాయి. వాటి మీద ఉన్నశీర్షికలలో చాలావరకు బ్రిటిష్ లేదా నార్త్ అమెరికన్ రచయితలవి, ఇంకా అనువాద రచనలు దాదాపుగా లేనే లేవు. నా పఠనం లో ఉన్నఈ పెద్ద, సాంస్క్రుతిక శూన్యాన్ని కనిపెట్టడం నాకు ఒక షాక్ లాగా తగిలింది. ఇంకా నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించినా, నిజంగా సిగ్గుగా అనిపిస్తుంది. నాకు తెలుసు బయట చాలామంది రచయితలు ఇంగ్లిష్ కాకుండా తమ భాషల్లో రాసిన అద్భుతమైన కధలు ఉండి ఉంటాయని. ఇంకా ఆలోచిస్తూ ఉంటే నా పఠన అలవాట్లు ఇలాగే ఉంటే నేను బహుశా ఎప్పటికీ వాటిని చూడలేనేమో అనివిచారంగా అనిపించింది. అందుకని, నాకు నేను అధికమైన విశ్వ విఖ్యాత పుస్తకాలను సూచించుకోవాలని నిర్ణయించుకున్నాను. 2012 UK కి ఒక అంతర్జాతీయ సంవత్సరం గా సెట్ అయ్యింది; అది లండన్ ఒలింపిక్స్ సంవత్సరం. అందుకని నేను దాన్నినా కాల పరిమితి కింద వాడుకోవాలని రోజుకి ఒక నవల, చిన్న కధల సేకరణ లేదా ప్రపంచంలోని అన్నిదేశాల నుండి చరిత్రను చదవడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. అందువల్ల నేను చేశాను. ఇంకా అది చాలా ఉత్తేజకరమైనది. నేను కొన్నివిశేషాలు నేర్చుకున్నాను కొన్ని అధ్భుతమైన కనెక్షన్స్ చేశాను అవి ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కానీ అది కొన్నిఆచరణాత్మక సమస్యలతో మొదలయ్యింది. నేను ప్రపంచం లో ఉన్న వివిధ దేశాల జాబితా లో నుండీ నా ప్రాజెక్ట్ కోసం కావలసిన దేశాలు తీశాక, నేను UN-గుర్తింపు పొందిన దేశాల జాబితాతో మిగిలాను, వాటికి నేను తైవాన్ కలిపాను, దానితో నాకు 196 దేశాల జాబితా దొరికింది. తరవాత నేను నా పఠనాన్ని ఇంకా బ్లాగింగ్ ని ఎలా సమన్వయం చేసుకోవాలో ఆలోచించుకున్నాక సుమారు, ఒక వారానికి నాలుగు పుస్తకాలు వారానికి ఐదు రోజుల చొప్పున, నాకు బహుశ అన్ని దేశాల నుండి ఇంగ్లిష్ లో పుస్తకాలు దొరక్క పోవచ్చు అనే విషయాన్ని నేను అప్పుడు ఎదుర్కోవలసి వచ్చింది. UK లో ప్రతి సంవత్సరం ప్రచురితమయ్యే సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలలో, కేవలం సుమారు 4.5 శాతం మాత్రం అనువాదాలు, అంతేకాక ప్రపంచం లోని ఇంగ్లిష్ మాట్లాడే చాలా ప్రదేశాలలో కూడా ఇదే గణాంకాలు ఉంటాయి. అయినప్పటీకీ, అనువాద పుస్తకాల ప్రచురణ నిష్పత్తి వేరే చాలా దేశాలలో కొంచెం ఎక్కువగానే ఉంది. 4.5 శాతం అనేది మొదలు పెట్టడానికి చాలా స్వల్ప ఆరంభం, కానీ ఆ గణాంకం మీకు చెప్పని విషయం ఏమిటంటే వాటిల్లో చాలా పుస్తకాలు బలమైన ప్రచురణ నెట్ వర్క్స్ ఉండి చాలా మంది పరిశ్రమ నిపుణులు బయటకు వెళ్ళి ఇంగ్లిష్-భాష ప్రచురణకర్తలకు ఆ పుస్తకాలను అమ్మే దేశాలనుండి వచ్చినవి. అందుకని, ఉదాహరణకి, 100 పైచిలుకు పుస్తకాలు UK లో ప్రతి సంవత్సరం ఫ్రెంచ్ నుండి అనువాదం అయ్యి ప్రచురింపబడినప్పటికీ, వాటి నుండి చాలా వరకు ఫ్రాన్స్ లేదా స్విడ్జర్లాండ్ వంటి దేశాల నుండి వచ్చినవి అయ్యి ఉంటాయి. ఫ్రెంచ్- మాట్లాడే ఆఫ్రికా, రెండో వైపు, అరుదుగా అవకాశాన్ని పొందుతుంది. దాని ఫలితం ఏమిటంటే వాస్తవంలో అక్కడ చాలా దేశాలలో వాణిజ్య పరంగా ఇంగ్లిష్ సాహిత్యం చాలా తక్కువ లేదా అసలు అందుబాటులో లేకుండా కూడా ఉండవచ్చు. ప్రపంచం లోనే ఎక్కువ ప్రచురితమైన భాష యొక్క పాఠకులకు వాళ్ళ పుస్తకాలు కనపడకుండా ఉండి ఉండవచ్చు. కానీ ప్రపంచాన్ని చదవడం లో నాకు ఎదురైన అన్నిటిలోకి అతి పెద్ద సవాలు నేను ఎక్కడ నుండి మొదలు పెట్టాలో తెలవక పోవడం అనే కారణం. నా జీవితం లో దాదాపు ఎక్కువ భాగం కేవలం బ్రిటీష్ ఇంకా నార్త్ అమెరికా పుస్తకాలు చదువుతూ గడపడం వల్ల, నాకు ప్రపంచం లోని వేరే భాగాల లోని కధల మూలాలు కనిపెట్టడం ఇంకా వాటి నుండి ఎంచుకోవడం ఎలాగో తెలియ లేదు. నేను స్వాజిలాండ్ నుండి ఒక కధ యొక్క మూలాన్ని మీకు చెప్పలేను. నేను నమీబియా నుండి ఒక మంచి నవల తెలుసుకోలేను. ఇంక దాచేదేమీ లేదు-- నేను సాహిత్యం లో ఏమీ తెలియని ఒక విదేశీయురాలిని. కాబట్టి నేను ప్రపంచాన్ని ఎట్లా చదవబోతున్నాను? నేను సహాయం కోసం అడగ బోతున్నాను. కాబట్టి అక్టోబర్ 2011 లో, నేను నా బ్లాగ్ ను రిజిస్టర్ చేయించాను, ayearofreadingtheworld.com ఇంకా నేను ఒక చిన్న అభ్యర్థన ఆన్ లైన్లో పోస్ట్ చేశాను. నేను నాగురించివివరించాను, నా పఠనం ఎంత చిన్నది అయ్యిందో, నేను ఎవరైనా ఈ గ్రహం మీద వేరే ప్రాంతాల నుండి నేను చదవదగ్గ పుస్తకాల గురించి ఏమైనా సలహాలు ఇస్తూ మెసేజ్ పెడ్తారా అని అడిగాను. ఇప్పుడు, నాకు ఏమీ అవగాహన లేదు అసలు ఎవరికైనా ఆసక్తి ఉంటుందో లేదో అని, కానీ నేను ఆ అభ్యర్థన ఆన్ లైన్లో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే, ప్రజలు నాతో టచ్ లోకి రావడం మొదలు పెట్టారు. అందరికంటే ముందు ,స్నేహితులు ఇంకా సహోద్యోగులు. తర్వాత అది స్నేహితుల స్నేహితులు. తర్వాత అతి త్వరలోనే, అపరిచితులు. నేను ఆ అభ్యర్థన ఆన్ లైన్ లో పెట్టిన నాలుగు రోజులకు, నాకు కౌలా లంపూర్ నుండి రాఫిడా అనే ఆమె నుండి ఒక సందేశం వచ్చింది. ఆమె తనకు నా ప్రాజెక్ట్ నచ్చిందని , ఇంకా ఆమె అక్కడ ప్రాంతీయం గా ఉండే ఇంగ్లిష్-భాష పుస్తకాల షాప్ కి వెళ్ళి నా కోసం మలేసియన్ పుస్తకం ఎంపిక చేసి నాకు పోస్ట్ చేయవచ్చా అని అడిగింది? నేను ఉత్సాహం గా అంగీకరించాను. తరవాత కొన్ని వారాల తరవాత, ఒక పాకేజ్ ఒక పుస్తకం కాదు, రెండు పుస్తకాలు కలిగి వచ్చింది-- ఒకటి మలేసియా నుండి రాఫిడా యొక్క ఎంపిక, ఇంకా ఒక పుస్తకం సింగపూర్ నుండి అది కూడా ఆమె నా కోసం ఎంపిక చేసిందే. ఆ సమయం లో, నేను ఒక అపరిచితురాలు 6,000 మైళ్ళ కంటే ఎక్కువ దూరం లో ఉండి తాను బహుశా ఎప్పటికీ కలుసుకోలేని వారికి సహాయం చెయ్యడం కోసం అంత శ్రమ పడతారా అని ఆశ్చర్యపోయాను కానీ రాఫిడా యొక్క శ్రద్ధ ఆ సంవత్సరం లో ఒక నమూనా లాగా ఉండి పోయింది. మళ్ళీ, ప్రజలు వారి శక్తికి మించి నాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కొంత మంది నా తరఫున శోధన మొదలు పెట్టారు,ఇంకా కొంత మంది నా కోసం బుక్ షాప్ కి వెళ్ళడానికి శలవులలో మరియు వ్యాపార ట్రిప్లలో వారి మార్గమ్నుండి వేరే వెళ్ళారు. నాకు అనిపించింది,మీరు ప్రపంచాన్ని చదవాలని అనుకుంటే కనక, మీరు ఒక విశాల హ్రృదయం తో దాన్ని ఎదుర్కోవాలనుకుంటే, ప్రపంచం మీకు సహాయం చేస్తుంది. ఎపుడు దేశాల మాట వచ్చిందో వాణిజ్యపరం గా ఇంగ్లిష్ సాహిత్యం చాలా తక్కువ లేదా అసలు లేకుండా ఉన్నప్పుడు, ప్రజలు ఇంక ముందుకు వెళ్ళ లేరు. పుస్తకాలు చాలా సార్లు ఆశ్చర్యకరమైన చోట్ల నుండి వస్తాయి. ఉదాహరణార్ర్థం నా పనామా పఠనం, నేను ట్విట్టర్ లో పనామా కాలువ తో చేసిన ఒక సంభాషణ ద్వారా వచ్చింది. అవును, పనామా కాలువకు ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది. ఇంకా నేను దానిలో నా ప్రాజెక్ట్ గురించి ట్వీట్ చేసినప్పుడు, నేను పనామ రచయిత జువన్ డేవిడ్ మోర్గాన్ యొక్క రచనలను ప్రయత్నించి దాన్ని పొందవచ్చని నాకు సూచించింది. నేను మోర్గాన్ వెబ్ సైట్ కి వెళ్ళి ఇంకా అతనివి స్పానిష్- భాష లోని నవలలు ఇంగ్లిష్ లోకి అనువాదమయ్యాయా అని అడుగుతూ అతనికి ఒక మెసేజ్ పంపించాను, ఇంకా అతను ఏవీ ప్రచురణ కాలేదని, కానీ అతని దగ్గర అతని నవల "ద గోల్డెన్ హార్స్" యొక్క ప్రచురణ కాని ఒక అనువాదం ఉంది అని చెప్పాడు. నేను ఆంగ్లంలో ఆ పుస్తకాన్ని చదివినవాళ్ళలోప్రపంచం లోనే మొట్టమొదటిదాన్నిఅయ్యేందుకు అనుమతిస్తూ అతను దాన్నినాకు ఇమెయిల్ చేశాడు. నాతో ఈ విధం గా బుక్స్ పంచుకున్న రచయిత ఏ విధం గా చూసినా మోర్గాన్ ఒక్కడే కాదు. స్వీడన్ నుండి పలౌ వరకు, రచయితలు మరియు అనువాదకులు వారి సొంత-ప్రచురిత పుస్తకాలు ఇంకా ప్రచురితం కాని పుస్తకాల మాన్యుస్క్రిప్ట్స్ ఏవైతే ఆంగ్లోఫోన్ పబ్లిషర్స్ ఎంపిక చేసుకోలేదో లేదా ఇంక అసలు అందుబాటులో లేవో, నాకు కొన్ని విశేషమైన ఊహాత్మక ప్రపంచాల విశేష సంగ్రాహవలోకనం కల్పిస్తూ పంపించారు. ఉదాహరణకు, దక్షిణ ఆఫ్రికన్ రాజు గుంగున్హానె గురించి, ఎవరైతే 19 వ శతాబ్దం లో పోర్చుగీస్ కి వ్యతిరేకం గా ప్రతిఘటన జరిపారో; ఇంకా తుర్క్మెనిస్తాన్ లో కాస్పియన్ సముద్రం ఒడ్డున ఒక కుగ్రామం లోని వివాహ సాంప్రదాయాల గురించి నేను చదివాను. బ్రిడ్జెట్ జోన్స్ కి కువైట్ సమాధానాన్ని నేను కలిశాను. (నవ్వులు) ఇంకా నేను అంగోలా లోని ఒక ఓర్గీ చెట్టు గురించి చదివాను. కానీ ప్రజలు నాకు ప్రపంచాన్ని చదవడం లో సహాయం చేయడానికి ప్రజలు ఎంత శ్రమ తీసుకుంటారో చెప్పడానికి అద్భుతమైన ఉదాహరణ, నా అన్వేషణ చివరిలో వచ్చింది, నేను అతిచిన్న పోర్చుగీస్-మాట్లాడే ఆఫ్రికన్ ద్వీప దేశం సావో టోమ్ మరియు ప్రిన్సిపి నుండి ఒక పుస్తకాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వచ్చింది. ఇక ఇన్ని నెలలు ఇంగ్లిష్ లోకి అనువాదం చేయబడిన పుస్తకాన్ని వెదకడం లో నాకు తెలిసిన పద్ధతులన్నీప్రయత్నిస్తే నాకు ఒకే ఒక్క మార్గం మిగిలినట్టు అనిపించింది అది మొదటి నుండి అనువదించబడినది ఏదైనా దొరుకుతుందేమో చూడడం. ఇప్పుడు,నేను నిజంగా సందేహపడ్డాను ఎవరైనా వారి సమయాన్ని ఇటువంటి వాటి కోసం వెచ్చించి, దీనిలో సహాయం చేయాలనుకుంటారా అని. కానీ,నేను పోర్చుగీస్ మాట్లాడే వాళ్ళ గురించి సందేశం ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లో పెట్టిన వారం లో మార్గరేట్ జుల్ కోస్టా ఎవరైతే ఆమె రంగం లో నంబర్ ఒకటి గాఉందో, ఎవరైతే నోబల్ బహుమతి విజేత జోస్ సరమగో వర్క్ ను అనువదించారో ఆమె తో సహా నేను నా ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేయలేనంత మంది వచ్చారు. నా తొమ్మిది మంది వాలంటీర్స్ తో కలిసి నేను కావలసినన్ని ప్రతులు ఆన్ లైన్ లో కొనగలిగిన ఒక పుస్తకం సావో టోమియన్ రచయితది కనిపెట్టగలిగాను. ఇది వాటిల్లో ఒకటి . ఇంకా నేను నా స్వయం సేవకులకు ఒక్కొక్క కాపీని పంపించాను. వాళ్ళందరూ ఆ సంకలనం నుండి రెండు,మూడు చిన్న కధలు తీసుకున్నారు, వాళ్ళ మాట ప్రకారం, వారి అనువాదాలు నాకు తిరిగి పంపించారు, ఇంకా ఆరు వారాల లోపల, నా దగ్గర మొత్తం పుస్తకం చదవడానికి తయారు గా ఉంది. ఆ విషయం లోనూ, నా ప్రపంచం చదివే ఒక సంవత్సరం లో నేను చాలా తరచుగా గమనించినట్టు, నాకు ఎక్కువగా తెలియక పోవడం ఇంకా నా పరిమితుల గురించి నేను చెప్పుకోవడం ఒక పెద్ద అవకాశం గా మారింది. ఎప్పుడైతే సావో టోమ్ ఇంకా ప్రింసిపి గురించి వచ్చిందో, అది కొత్తది నేర్చుకోవడానికి, ఒక కొత్త కధల సంకలనాన్ని కనుక్కోవడానికి ఒక అవకాశం మాత్రమే కాక, ఒక వ్యక్తుల సమూహాన్ని దగ్గరకు తీసుకుని వచ్చి ఒక ఉమ్మడి సృజనాత్మక ప్రయత్నాన్ని సులభతరం చేస్తుంది. నా బలహీనత నా ప్రాజెక్ట్ కి బలం అయ్యింది. నేను ఆ సంవత్సరం చదివిన పుస్తకాలు చాలా విషయాల పట్ల నా కళ్ళు తెరిపించాయి. ఎవరైతే పఠనాన్ని ఆనందిస్తారో వాళ్ళకు తెలిసే ఉంటుంది, పుస్తకాలకు మన నుంచి మనను బయటకు లాగి వేరే వాళ్ళ మనసులో దూర్చే అసాధారణ శక్తి ఉంది, కాబట్టి, కనీసం కొంత సేపైనా, మీరు ప్రపంచం వంక వేరే దృష్టి తో చూస్తారు. అది ఒక ఇబ్బందికరమైన అనుభవం కావచ్చు, ముఖ్యం గా మీరు మన కంటే వేరే విలువలు ఉన్న సంస్కృతి నుండి కనుక ఒక పుస్తకం చదువుతున్నట్లైతే. కానీ అది నిజం గా జ్ఞానం కలిగించవచ్చు కూడా. తెలియని ఆలోచనలతో కుస్తీ పట్టడం మన ఆలోచనలలో స్పష్టత రావడానికి సహాయపడచ్చు. ఇంకా అది మనం ప్రపంచాన్ని చూసే తీరు లో బ్లైండ్ స్పాట్స్ నుకూడా చూపించచ్చు. నేను ఎప్పుడైతే దేనితో పాటు నేను ఎదిగానో ఉదాహరణకు, ఇంగ్లిష్- భాష సాహిత్యం, గురించి ఆలోచిస్తానో ఈ ప్రపంచం అందించిన గొప్ప దానితో పోలుస్తే, నేను అది చాలావరకు ఎంత సంకుచితం గా ఉందో చూడడం మొదలు పెట్టాను. ఇంకా పేజీలు తిరుగుతున్న కొద్దీ, ఇంకా ఏదో జరగడం ప్రారంభమైంది కూడా. కొంచెం కొంచెంగా, నేను సంవత్సరం మొదట్లో ప్రారంభించిన దేశాల పొడవైన జాబితా, పొడి మరియు ప్రదేశాల పేర్ల రిజిస్టర్ ను జీవమున్న, శ్వాస తీసుకొనే ఎన్టిటీలగా మార్చింది. ఇప్పుడు, నేను కేవలం ఒక పుస్తకం చదవడం ద్వారా ఒక దేశం గురించి పూర్తిగా అవగాహన సాధ్యమవుతుంది అని నేను సూచించడం లేదు. కానీ మొత్తంగా, నేను ఆ సంవత్సరంలో చదివిన కథల వలన ఇంతకు ముందు కన్నా ఎక్కువగా మన గొప్ప గ్రహం యొక్క గొప్పతనాన్ని, విభిన్నతను మరియు సంక్లిష్టతను తెలియచేసి నన్ను మరింత సజీవంగా చేసింది. ఈ ప్రపంచం కథలు మరియు చాలా మంది వ్యక్తులు ఇబ్బందులు పడి కూడా నేను కథలు చదవటానికి సహాయము చేయడం నాకు బాగా నిజమనిపించింది. ఈ రోజుల్లో, నేను నా పుస్తకాల అరలు చూస్తే లేదా నా ఈ -రీడర్ లో రచనలు దృష్టిలో ఉంచుకుంటే, అవి వేరే కథ చెప్తాయి. ఈ పుస్తకాల్లోని కథలు రాజకీయ, భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక, మత విభేదాలను మనకు కనెక్ట్ చేసే శక్తి కలిగి ఉంటాయి. దీనికోసం సంభావ్య మానవులు కలిసి పని చేయాలి. అంతర్జాలానికి ధన్యవాదములు, మనము ఈ అసాధరణ పరిస్థితుల్లో నివసించడానికి శాసనము, ఇంతకు ముందు కన్నా, ఒక అపరిచితుడు, ఎవర్నైతే తను ఎప్పుడూ కలవ లేదు మరియు మన గ్రహంలో రెండో వైపు ఉంటున్న వారిని, ఒక కధలో, ఒక ప్రపంచ దృష్టికోణాన్ని, ఒక పుస్తకాన్ని పంచుకోవటం ఇప్పుడు సులభము. నేను రాబోయే అనేక సంవత్సరాలు ఈ కథను చదువుతానని ఆశిస్తున్నాము. మరియు నాతో చాలామంది ఏకీభవిస్తారని ఆశిస్తున్నాను. మనం అందరం మరింత విస్తృతంగా చదివితే, ప్రచురణకర్తలకు పుస్తకాలు అనువదించడానికి మరింత ప్రోత్సాహం ఉంటుంది, మరియు మనము అందరము ప్రయోజనము పొందుతాము. ధన్యవాదములు. (చప్పట్లు)