< Return to Video

మనన్ని కోహౌసింగ్ ఆనందం గా ఇంకా ఎక్కవ కాలం జీవించేటట్టు ఏలా చేస్తుంది?

  • 0:01 - 0:02
    ఒంటరితనం.
  • 0:03 - 0:06
    మనందరం మన జీవితంలో ఎప్పుడో ఒకసారి
  • 0:06 - 0:07
    ఒంటరితనాన్నిఅనుభవిస్తాం.
  • 0:08 - 0:10
    ఒంటరితనం అనేది ఒంటరిగా ఉండడం కాదు,
  • 0:11 - 0:14
    మనం మన చుట్టు పక్కల వారితో
    ఎంతవరకూ సంబంధాలు కలిగి ఉన్నాం
  • 0:14 - 0:15
    అన్నది ముఖ్యం.
  • 0:16 - 0:18
    ఈ గదిలోనే ఇప్పుడు ఎవరైనా వ్యక్తి
  • 0:18 - 0:20
    వేలమంది మధ్య ఉన్నా ఒంటరితనం
  • 0:20 - 0:21
    ఎదుర్కుంటూ ఉండవచ్చు.
  • 0:23 - 0:27
    ఇక ఒంటరితనానికి కారణాలు
    చాలా విషయాలు ఆపాదించబడినా,
  • 0:27 - 0:29
    ఒక ఆర్కిటెక్ట్ గా ,
  • 0:29 - 0:32
    నేను మీకు ఈ రోజు ఒంటరితనం
    మనం నిర్మించుకున్న పరిసరాల వల్ల
  • 0:32 - 0:34
    మనంనివసించడానికి
    నిర్మించుకున్న ఇళ్ళవల్ల
  • 0:34 - 0:36
    ఏ విధంగా వస్తుందో చెబుతాను...
  • 0:37 - 0:39
    మనం ఒకసారి ఈ ఇంటి వంక చూద్దాం.
  • 0:40 - 0:41
    ఇది ఒక మంచి ఇల్లు.
  • 0:41 - 0:44
    దీన్లో ఒక పెద్ద యార్డ్, కంచె,
    రెండు కార్లు పట్టే
  • 0:44 - 0:45
    గారేజ్ ఉన్నాయి.
  • 0:46 - 0:49
    ఆ ఇల్లు ఇట్లాంటి పొరుగు మధ్య ఉండవచ్చు.
  • 0:50 - 0:52
    ఇక ప్రపంచం లో చాలా మందికి,
  • 0:52 - 0:54
    ఇట్లాంటి ఇల్లు, ఈ పరిసరాలు...
  • 0:55 - 0:56
    ఇది ఒక కల.
  • 0:57 - 1:00
    కానీ ఈ కలను నెరవేర్చుకునే ప్రమాదం ఏమిటంటే
  • 1:00 - 1:01
    సంబంధాలకు ఒక తప్పు అర్థం ఇవ్వడం.
  • 1:03 - 1:05
    ఇంకా సామాజిక ఒంటరితనం లో
    పెరుగుదల అవ్వడం.
  • 1:05 - 1:07
    నేను మీరు అనుకునేది ఇప్పుడు
  • 1:07 - 1:10
    వినగలుగుతున్నాను,ఈ గది లో
    ఎవరైనా మనసు లో అనుకుంటూ ఉండచ్చు,
  • 1:10 - 1:13
    "అది నా ఇల్లు, అవి నా పరిసరాలు,
    ఇక నా బ్లాక్ లో
  • 1:13 - 1:14
    నాకు అందరూ తెలుసు" అని
  • 1:15 - 1:17
    దానికి నా సమాధానం,"అద్భుతం!"
  • 1:17 - 1:18
    నేను మీ లాంటి వాళ్ళు
  • 1:18 - 1:21
    ఇంకా ఉంటారని ఆశిస్తున్నాను,
  • 1:21 - 1:24
    ఎందుకంటే ఈ గది లోనే చాలా మంది
    అట్లాంటి పరిస్థితుల్లో ఉంటూ
  • 1:25 - 1:27
    పొరుగు వాళ్ళ తెలియకుండా
  • 1:28 - 1:30
    వీళ్ళు వాళ్ళని గుర్తు పట్టవచ్చు
    ఇంకా పలకరించవచ్చు,
  • 1:30 - 1:32
    కానీ రహస్యం గా వాళ్ళు వాళ్ళ
  • 1:33 - 1:35
    జీవిత భాగస్వామిని "మన పొరుగువాళ్ళ
  • 1:35 - 1:37
    పేరేమిటి? "అనిఅడుగుతారు.
  • 1:38 - 1:40
    వాళ్ళు పేరు గురించి అడిగి
    పక్కవాళ్ళు తెలుసని నిరూపిస్తారు.
  • 1:43 - 1:47
    సామాజిక మాధ్యమాలు కూడా
    ఈ తప్పుడు ప్రచారానికి దోహదపడ్తాయి.
  • 1:48 - 1:50
    మనందరికీ ఈ చిత్రాలు
    చాలా బాగా తెలిసుండొచ్చు
  • 1:50 - 1:52
    మీరు ఎలివేటర్ లో నిల్చున్నారు,
    లేదా ఒక కేఫ్ లో కూర్చున్నారు,
  • 1:52 - 1:53
    మీ పక్కనంతా చూశారు,
  • 1:54 - 1:56
    అందరూ ఫోన్ లో మాట్లాడ్తున్నారు.
  • 1:57 - 1:59
    మీరు మెసేజ్ చేయట్లేదు
    ఫేస్ బుక్ చూడట్లేదు,
  • 1:59 - 2:01
    మిగతా అందరూ కూడా అదే చేస్తున్నారు,
  • 2:01 - 2:02
    ఇక , నా లాగే మీరు కూడా
  • 2:02 - 2:03
    ఎవరినో చూశారు,
  • 2:03 - 2:06
    నవ్వి ఇంకా హలో చెప్పారు,
  • 2:07 - 2:11
    ఆ వ్యక్తి తన ఇయర్ బడ్స్ తీసేసి మీతో
  • 2:11 - 2:12
    "క్షమించండి, మీరేమన్నారు?"
  • 2:12 - 2:14
    అనేటట్టు చేయగలిగారు,
  • 2:14 - 2:16
    ఇదంతా నాకు విచిత్రంగా అనిపిస్తుంది.
  • 2:17 - 2:19
    నేను మీతో ఈ రోజు ఒంటరి తనానికి పరిష్కారం
  • 2:19 - 2:20
    గురించి పంచుకోబోతున్నాను.
  • 2:21 - 2:22
    ఇది కొత్త విషయం ఏమీ కాదు.
  • 2:22 - 2:24
    నిజానికి,ఇది పాత రోజుల నుండీ
    పాటిస్తున్నదే
  • 2:24 - 2:27
    ఇది ప్రపంచం లోని ఐరోపేతర సంస్కృతులలో
  • 2:27 - 2:28
    ఇంకా వాడుకలో ఉంది.
  • 2:29 - 2:30
    50 సంవత్సరాల క్రితం,
  • 2:30 - 2:34
    డేన్స్ ఒక కొత్త పద్ధతి వాడదామనుకున్నారు,
  • 2:34 - 2:35
    ఇక అప్పటి నుండీ.
  • 2:35 - 2:39
    వేలమంది డానిష్ ప్రజలు
    ఇలా కలిసి జీవిస్తున్నారు.
  • 2:40 - 2:44
    ప్రజలకు సంఘం అంటే ఇష్టం కాబట్టి
    ఈ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా
  • 2:44 - 2:46
    విస్తృతంగా అనుసరిస్తున్నారు.
  • 2:47 - 2:49
    ఈ కాంసెప్ట్ ఒకే చొట ఇళ్ళు
  • 2:50 - 2:51
    నిర్మించడం,
    సహ గృహాలు.
  • 2:54 - 2:57
    సహ గృహాలు అంటే ప్రజలందరూ పక్కపక్కన ఉంటూ
  • 2:57 - 2:58
    ఒకరికొకరు సహాయ పడడం.
  • 2:59 - 3:01
    దీనిలో, మీ ఇల్లు మీకు ఉంటుంది,
  • 3:01 - 3:05
    కానీ ఇంట్లోనూ ఇంకా బయటా మీరు ఇతరులతో
    ముఖ్య ప్రదేశాలను పంచుకుంటారు.
  • 3:05 - 3:07
    సహ గృహాల చిత్రం చూపించే ముందు,
  • 3:07 - 3:10
    నా స్నేహితులు షీలా, స్పెన్సర్ లను
    పరిచయం చేస్తాను.
  • 3:10 - 3:14
    నేను ముందు షీలా, స్పెన్సర్లను కలిసినప్పుడు
    వాళ్ళు 60 ఏళ్ళవాళ్ళు,
  • 3:14 - 3:17
    స్పెన్సర్ ప్రాధమిక విద్య లో సుదీర్ఘ కెరీర్
  • 3:17 - 3:18
    చివర్లో ఉన్నాడు.
  • 3:19 - 3:21
    తన రిటైర్మెంట్ అప్పటికి
  • 3:21 - 3:23
    తనతో పిల్లలు ఉండరనే భావన
  • 3:23 - 3:24
    అతనికి నచ్చలేదు.
  • 3:27 - 3:28
    ఇప్పుడు వాళ్ళు
    మా పొరుగు వారు.
  • 3:28 - 3:32
    నేను ఒక కోహౌసింగ్ సంఘాన్ని డిజైన్ చేసి,
    దాన్ని నిర్మించాను
  • 3:32 - 3:33
    దాన్లోనే నా
  • 3:33 - 3:35
    ఆర్కిటెక్ట్ ప్రాక్టీస్
    పెట్టుకున్నాను.
  • 3:35 - 3:38
    ఈ సంఘం సామాజిక సంబంధాలను
    చాలా ఇష్టపడుతుంది.
  • 3:39 - 3:40
    మనం ఆ ఇళ్ళను చూద్దాం.
  • 3:41 - 3:45
    బయటి నుండి, మావి వేరే
    అపార్ట్మెంట్లలా ఉంటాయి.
  • 3:45 - 3:47
    నిజం చెప్పాలంటే పక్కవాటిలాగానే ఉంటాయి,
  • 3:47 - 3:49
    ఇంకాస్త బ్రైట్ పసుపు లో ఉంటాయి.
  • 3:50 - 3:53
    లోపల, అవి చాలా మామూలుగా ఉంటాయి.
  • 3:53 - 3:55
    మా అందరి ఇళ్ళల్లో కూడా వంటిళ్ళు
    ఇంకా లివింగ్ రూంస్,
  • 3:55 - 3:57
    పడక గదులు ఇంకా బాత్ రూంస్ ఉన్నాయి,
  • 3:57 - 4:01
    ఒక మధ్య ఖాళీ స్థలం చుట్టూ
    ఇట్లాంటి తొమ్మిది ఇళ్ళు ఉన్నాయి.
  • 4:01 - 4:02
    ఇది నా ఇల్లు,
  • 4:02 - 4:04
    ఇక ఇది షీలా స్పెన్సర్ లది.
  • 4:05 - 4:08
    ఈ భవనాన్ని ప్రత్యేకంగా నిలిపేది
  • 4:08 - 4:09
    ఈ ఇళ్ళు కాదు,
  • 4:10 - 4:12
    ఇక్కడ ఉండే కేంద్ర ప్రాంగణం
  • 4:12 - 4:16
    చుట్టూ ఉండే ఒకరితో ఒకరికి ఉండే
    సామాజిక సంబంధాలు.
  • 4:17 - 4:19
    నేను ప్రాంగణం లోకి చూసినప్పుడు,
  • 4:19 - 4:21
    షీలా ఇంకా స్పెన్సర్ లను చూడాలనుకుంటాను.
  • 4:21 - 4:23
    నిజం చెప్పాలంటే, రోజూ ఇది నేను చూసేదే,
  • 4:23 - 4:26
    మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు
    స్పెన్సర్ నాకు చెయ్యి ఊపుతూ ఉంటాడు
  • 4:27 - 4:30
    మా ఇళ్ళ నుండి, ప్రాంగణం లోకి చూసినప్పుడు,
  • 4:30 - 4:32
    సంవత్సరం లో రుతువులను బట్టి,
  • 4:32 - 4:33
    మాకు కనిపించే దృశ్యాలు:
  • 4:33 - 4:37
    పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు గుంపులు గుంపులుగా
  • 4:37 - 4:39
    ఆడుకుంటూ ఇంకా
    కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తారు.
  • 4:39 - 4:41
    ఆ ప్రదేశం అంతా నవ్వులూ
    అరుపుల్తో నిండి ఉంటుంది.
  • 4:41 - 4:43
    హూలా-హూపింగ్ జరుగుతూ ఉంటుంది.
  • 4:44 - 4:48
    ఇక మధ్య మధ్య లో
    "నన్ను కొట్టకు" లాంటి అరుపులూ
  • 4:48 - 4:50
    లేదా పిల్లల ఏడుపులూ
    వినిపిస్తూ ఉంటాయి.
  • 4:50 - 4:52
    ఈ శబ్దాలన్నీ కూడా మన రోజూ వారి
    జీవితాలలోనివి,
  • 4:54 - 4:56
    ఈ శబ్దాలన్నీ సామాజిక అనుసంధానం లో భాగం.
  • 4:56 - 5:00
    ప్రాంగణంలోని దిగువ భాగంలో
    డబుల్ డోర్స్ ఉన్నాయి,
  • 5:00 - 5:02
    అవి కామన్ హౌస్ లోకి దారి తీస్తాయి.
  • 5:03 - 5:06
    కామన్ హౌస్ ని నేను
    సహ గృహాలకు కేంద్ర బిందువు గా
  • 5:06 - 5:08
    భావిస్తాను.
  • 5:08 - 5:10
    ఎందుకంటే ఇక్కడ నుండి సామాజిక సంబంధాలు,
  • 5:10 - 5:13
    ఇంకా కమ్యూనిటీ జీవితం మొదలయ్యి,
  • 5:13 - 5:17
    మిగతా కమ్యూనిటీ మొత్తం వ్యాపిస్తుంది.
  • 5:20 - 5:22
    కామన్ హౌస్ లో మొత్తం 28 మందిమి
    ఇంకా మా అతిథులూ
  • 5:22 - 5:25
    పట్టేంత పెద్ద డైనింగ్ రూం ఉంది, మేము కనీసం
  • 5:25 - 5:27
    వారానికి మూడు సార్లు
    కలిసి భోజనాలు చేస్తాం.
  • 5:28 - 5:31
    ఆ వంటలు వండడానికి మాకు
    ఒక పెద్ద వంటిల్లు ఉంది
  • 5:31 - 5:33
    కాబట్టి మేము ముగ్గురి టీం గా
    ఏర్పడి వంతుల వారీగా
  • 5:33 - 5:35
    వంటలు చేస్తూంటాం.
  • 5:35 - 5:37
    దాని అర్థం, 17 మంది పెద్ద వాళ్ళం కాబట్టి,
  • 5:38 - 5:41
    ఆరు వారాలకొకసారి నేను వంట చేస్తాను,
  • 5:41 - 5:43
    రెండు సార్లు, నేను మాటీం కి వంట చేయడం లో
  • 5:43 - 5:45
    శుభ్రం చేయడం లో సహాయం చేస్తాను.
  • 5:45 - 5:46
    ఇక మిగిలిన అన్ని రాత్రులు,
  • 5:46 - 5:48
    నేను ఏమీ పని చేయను.
  • 5:48 - 5:51
    నేను డిన్నర్ చేస్తాను,
    మా పొరుగువాళ్ళతో మాట్లాడతాను,
  • 5:51 - 5:53
    వేరే వాళ్ళు నా గురించి జాగ్రత్తగా వండిన
  • 5:53 - 5:56
    అద్భుతమైన భోజనం చేసి
    ఇంటికి వచ్చి పడుకుంటాను.
  • 5:59 - 6:02
    మా తొమ్మిది కుటుంబాలవాళ్ళం
    ఏరికోరి ఒక ప్రత్యామ్నాయ
  • 6:02 - 6:03
    జీవన విధానాన్ని ఎంచుకున్నాం.
  • 6:04 - 6:06
    ఒంటరిగా మమ్మల్ని మా ఇళ్ళల్లో ఉంచే
  • 6:06 - 6:09
    అమెరికన్ డ్రీం ను కొనసా గించకుండా
  • 6:09 - 6:11
    మేము సహ గృహాల పద్ధతి ని
    ఎంచుకున్నాము.
  • 6:11 - 6:14
    అందువల్ల మేము మా
    సామాజిక సంబంధాలను పెంచుకోగలిగాం
  • 6:14 - 6:16
    ఇలాగే సహగృహాల పద్ధతి మొదలవుతుంది:
  • 6:16 - 6:18
    ఒకరికొకరు సహాయం చేసుకుంటూ
  • 6:18 - 6:19
    కలిసి జీవించడానికి.
  • 6:19 - 6:22
    సహ గృహాలను వేరే ఇళ్ళ నుండి వేరు చేసేది
  • 6:22 - 6:25
    ఈ ముఖ్య ఉద్దేశ్యమే.
  • 6:27 - 6:29
    ఇక ఈ ఉద్దేశ్యాన్ని చూడడం కానీ,
  • 6:29 - 6:31
    చూపించడం కానీ కష్టం,
  • 6:31 - 6:34
    అందుకని మీకు ఇంకొన్ని
    పిక్చర్స్ ద్వారా చూపాలనుకుంటున్నాను.
  • 6:34 - 6:36
    ఇక్కడ కొన్ని ఉదాహరణలున్నాయి
  • 6:36 - 6:38
    నేను వెళ్ళిన కొన్ని
    కమ్యూనిటీస్లోఈ ఉద్దేశ్యాన్ని
  • 6:38 - 6:40
    ఎట్లా వ్యక్తం చేశారో చూపడానికి.
  • 6:42 - 6:45
    అందరూ కలిసి తినే చోట
    చాలా జాగ్రత్తగా ఫర్నీచర్
  • 6:45 - 6:48
    లైటింగ్, శబ్ద సంబంధ పరికరాలు
    ఎంపిక చేశారు:
  • 6:50 - 6:52
    కామన్ హౌస్ లో పిల్లలు ఆడుకునే చోటు
  • 6:53 - 6:57
    కనిపించేటట్టు గా, అందుబాటులో ఉండేట్టు:
  • 6:59 - 7:02
    అక్కడ ఉన్న స్థలాన్నీ, ఇంకా
  • 7:02 - 7:05
    అందరూ కలిసే సమయాన్నీ పరిగణలోకి తీసుకొని
  • 7:05 - 7:08
    కమ్యూనిటీ లో మా రోజూ వారీ
    జీవితాలకు మద్దతు గా,
  • 7:08 - 7:11
    ప్రతీ కమ్యూనిటీ లోనూ ఈ స్పేసెస్
  • 7:11 - 7:13
    కమ్యూనిటాస్ అనే భావాన్ని
  • 7:13 - 7:14
    పెంచడానికి దోహద పడ్తాయి.
  • 7:15 - 7:17
    "కమ్యూనటాస్" అంటే ఏమిటి?
  • 7:18 - 7:23
    కమ్యూనిటాస్ అంటే ఒకరకం గా
    "కమ్యూనిటీ యొక్క ఆత్మ" అనుకోవచ్చు.
  • 7:24 - 7:26
    ఇక నేను 80 కంటే ఎక్కువ వేరు వేరు
    కమ్యూనిటీ లను చూశాక
  • 7:26 - 7:29
    నేను కమ్యూనిటా లను అంచనా వేసే పద్ధతి:
  • 7:29 - 7:32
    అక్కడుంటున్న వాళ్ళందరూ
    ఎంత తరచుగా కలిసి భోజనం చేస్తారు?
  • 7:33 - 7:35
    అది ఆ గ్రూప్ మీద ఆధారపడి ఉంటుంది
  • 7:35 - 7:37
    ఎంత తరచుగా వాళ్ళు భోజనానికి కలుస్తారు,
  • 7:38 - 7:41
    గత 40 ఏళ్ళుగా ప్రతీ రాత్రీ
    కలిసి తింటున్న వాళ్ళు
  • 7:41 - 7:43
    నాకు తెలుసు.
  • 7:44 - 7:46
    అప్పుడప్పుడూ నెలకొకసారి
  • 7:46 - 7:49
    లేదా రెండుసార్లు కలిసి భోజనం
    చేస్తున్నవాళ్ళు తెలుసు.
  • 7:50 - 7:54
    ఎవరైతే ఎక్కువ కలిసి తింటారో,
  • 7:54 - 7:56
    వాళ్ళు కమ్యూనిటాస్ ని ఎక్కువ స్థాయి లో
  • 7:56 - 7:58
    ప్రదర్శిస్తారని నా పరిశీలన లో తేలింది.
  • 7:58 - 8:01
    ఎందుకంటే , ఎప్పుడైతే మీరు
    కలిసి భోంచేస్తారో,కల్సి
  • 8:01 - 8:03
    ఎక్కువ పనులు చేయడానికి
    ప్లాన్స్ మొదలు పెడతారు.
  • 8:04 - 8:06
    మీరు ఎక్కువ విషయాలు పంచుకుంటారు.
  • 8:06 - 8:08
    పిల్లలు ఎదగడం చూస్తారు.
  • 8:08 - 8:11
    మన పనిసామాన్లు, కార్లు అన్నీ
    ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటాయి.
  • 8:11 - 8:12
    ఇవన్నీ ఉన్నా కూడా,
  • 8:14 - 8:15
    మా అమ్మాయి అన్నట్టు,
  • 8:15 - 8:19
    కోహౌసింగ్ లో ప్రతీదీ
    గొప్పగా, ఆనందం గా ఉండదు,
  • 8:19 - 8:23
    నాకు కమ్యూనిటీ లో ప్రతీ వాళ్ళతో
    మంచి స్నేహం ఉండదు.
  • 8:23 - 8:26
    మా మధ్య అభిప్రాయ భేధాలు, తగాదాలు ఉండవచ్చు.
  • 8:27 - 8:31
    కానీ కో హౌసింగ్ లో ఉండడం వల్ల
    మా సంబంధాల గురించి మాకు అవగాహన ఉంది.
  • 8:32 - 8:34
    మా అభిప్రాయ భేధాలను
    పరిష్కరించుకోవాలనుకుంటున్నాం.
  • 8:35 - 8:37
    మా తప్పుల్ని తెలుసుకుంటాం,
  • 8:37 - 8:40
    మా వైపు నిజాలు చెప్తాం
  • 8:40 - 8:41
    ఇక తగిన సమయం లో,
  • 8:42 - 8:43
    మేము క్షమాపణలు చెప్తాం.
  • 8:44 - 8:48
    కో హౌసింగ్ అనేది చిన్న సముదాయాలకు
    మాత్రమేఆకర్షణీయమైనదని
  • 8:48 - 8:50
    విమర్శకులు అంటారు.
  • 8:50 - 8:52
    నేను దాంతో ఏకీభవిస్తాను.
  • 8:53 - 8:55
    మనం ప్రపంచం అంతటా
    పాశ్చాత్య సంస్కృతిని చూస్తే
  • 8:55 - 8:58
    కో హౌసింగ్ లో నివసించేవాళ్ళు
    చాలా తక్కువ శాతం ఉంటారు.
  • 8:59 - 9:00
    కానీ అది మారాలి,
  • 9:01 - 9:03
    ఎందుకంటే మన జీవితాలు
    దానిమీద ఆధారపడి ఉన్నాయి
  • 9:05 - 9:09
    2015 లో, బ్రిగామ్ యూనివర్సిటీ చేసిన
    ఒక పరిశోధన లో
  • 9:09 - 9:13
    ఒంటరి గా జీవించేవాళ్ళు
    అకాల మరణం చెందే అవకాశా లు
  • 9:13 - 9:15
    ఎక్కువని తేలింది.
  • 9:17 - 9:19
    US సర్జన్ జనరల్ ఒంటరితనాన్ని
    అంటువ్యాధి లాంటిదని
  • 9:19 - 9:21
    పేర్కొన్నారు.
  • 9:21 - 9:25
    ఇది కేవలం US కి మాత్రమే
    పరిమితం కాదని చెప్పారు.
  • 9:27 - 9:29
    కాబట్టి నేను ముందర మాట్లాడినప్పుడు
  • 9:29 - 9:32
    కో హౌసింగ్ ఒంటరితనానికి విరుగుడు అని కాక,
  • 9:34 - 9:35
    కో హౌసింగ్ మీ జీవితాన్ని
  • 9:35 - 9:39
    కాపాడుతుందని చెప్పాల్సింది.
  • 9:41 - 9:44
    నేను డాక్టర్ ని ఐతే, రెండు
    ఆస్పిరింస్ తీసుకోమని, పొద్దున కాల్
  • 9:44 - 9:45
    చేయమని చెప్పేదాన్ని.
  • 9:47 - 9:48
    కానీ ఒక ఆర్కిటెక్ట్ గా,
  • 9:48 - 9:51
    నేను మీ పొరుగు వాళ్ళతో
    ఒక నడకకి వెళ్ళమని
  • 9:51 - 9:52
    భోజనం కలిసి చేయమని చెప్తాను,
  • 9:53 - 9:55
    ఇక 20 ఏళ్ళ తరువాత నాకు కాల్ చేయండి.
  • 9:56 - 9:57
    ధన్యవాదాలు.
  • 9:57 - 10:01
    (చప్పట్లు)
Title:
మనన్ని కోహౌసింగ్ ఆనందం గా ఇంకా ఎక్కవ కాలం జీవించేటట్టు ఏలా చేస్తుంది?
Speaker:
గ్రేస్ కిమ్
Description:

ఒంటరితనం ఒంటరిగా ఉండడం వల్ల రాదు. అది మనకు వేరే వాళ్ళతో ఎంతవరకూ సంబంధాలు ఉన్నాయి అనేదాని మీద ఉంటుంది.ఆమె చాలా పాతదైన కో హౌసింగ్ అనే పద్ధతి ద్వారా పొరుగు వాళ్ళతో స్తలం పంచుకొని, వాళ్ళను అర్థం చేసుకుంటూ వాళ్ళను చూసుకుంటూ ఆనందం గా ఉండవచ్చని చెపుతారు.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
10:15

Telugu subtitles

Revisions