< Return to Video

The Internet: Packets, Routing and Reliability

  • 0:00 - 0:08
    [పాట కౌంట్‌డౌన్: 7, 6, 5, 4, 3, 2, 1]
    ఇంటర్నెట్: ప్యాకెట్స్, రూటింగ్, రిలయబిలిటీ
  • 0:08 - 0:14
    హై. నాపేరు లిన్. నేను Spotify లో సాఫ్ట్
    వేర్ ఇంజనీర్, మరి నేను ఒప్పుకుంటున్నా,
  • 0:14 - 0:19
    ఇంటర్నెట్ యొక్క విశ్వసనీయత గురించి తరచూ
    చెబుతుంటా. ఇంటర్నెట్ చుట్టూ తిరిగే సమాచారం
  • 0:19 - 0:23
    పూర్తిగా సంభ్రమాన్ని కలిగిస్తుంటుంది. ఐతే
    మీకు అందించబడే ప్రతి డేటా భాగమూ నమ్మకంగా
  • 0:23 - 0:29
    ఉంటుందనేది ఎంతవరకూ సాధ్యం? మీరు Spotify
    నుండి ఒక పాట ప్లే చేయాలనుకున్నారనుకుందాం.
  • 0:29 - 0:34
    మీ కంప్యూటర్ నేరుగా Spotify సర్వర్లకు
    కనెక్ట్ అయి Spotify మీకు పాటను నేరుగా
  • 0:34 - 0:39
    పంపుతుందని అనిపిస్తుంది. ఐతే వాస్తవంగా అలా
    ఇంటర్నెట్ పనిచేయదు. ఒకవేళ ఇంటర్నెట్ నేరుగా
  • 0:39 - 0:44
    అంకితమైన కనెక్షన్లకు చేయబడి ఉంటే మిలియన్ల
    వాడుకదారులు చేరతారు కాబట్టి పనులు జరిగేలా
  • 0:44 - 0:48
    చేయడం అసాధ్యం. ప్రత్యేకించి ప్రతి వైరు,
    ప్రతి కంప్యూటర్ ఎప్పుడూ పనిచేస్తుందనే
  • 0:48 - 0:53
    గ్యారంటీ ఏమీ లేదు కాబట్టి. బదులుగా డేటా
    ఇంటర్నెట్ పై నేరుగా తక్కువగా వెళుతుంది.
  • 0:53 - 1:01
    అనేక ఏళ్ళ క్రితం 1970 ల్లో, నా పార్టనర్
    బాబ్ కాహన్ మరియు నేను, ఇంటర్నెట్ అనబడే
  • 1:01 - 1:07
    దాని డిజైన్ పై పనిచేయడం మొదలుపెట్టాం. బాబ్
  • 1:07 - 1:15
    మరియు నేను ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ డిజైన్
    చేసే బాధ్యత మరియు అవకాశాన్ని తీసుకున్నాం.
  • 1:15 - 1:20
    కాబట్టి మేం ఇంతవరకూ నేటితో సహా ఇంటర్నెట్
    ఎదుగుదలమరియు ఉద్భవానికి పట్టుదలగా పనిచేశాం
  • 1:20 - 1:26
    ఒక కంప్యూటర్ నుండి మరోదానికి సమాచారం ఎలా
    బదిలీ అవుతుందనేది చాలా ఆసక్తిగా ఉంటుంది.
  • 1:26 - 1:31
    అది ఒకేదారిని అనుసరించాల్సిన అవసరం లేదు.
    వాస్తవానికి మీ దారి కంప్యూటర్ మరో
  • 1:31 - 1:36
    కంప్యూటర్ సంభాషణ మధ్యలో మారవచ్చు.ఇంటర్నెట్
    పై సమాచారం ఒక కంప్యూటర్ నుండి మరో
  • 1:36 - 1:42
    కంప్యూటర్ కు వెళుతుంది, కొంత సమాచారం మరియు
    ఒక ప్యాకెట్ ఒక చోటు నుండి మరొక చోటుకు
  • 1:42 - 1:46
    వెళ్ళినట్లుగానే ఇంటర్నెట్ పై వెళ్ళేసమాచారం
    కూడా ఒక చోటు నుండి మరో చోటుకు మీరు కారులో
  • 1:46 - 1:51
    వెళ్ళినట్లుగానే వెళుతుంది. ట్రాఫిక్, రోడ్
    రద్దీని బట్టి మీరు ప్రతిసారీ వెళ్ళే ఒకే
  • 1:51 - 1:59
    చోటుకు మీరు మరో దారిని ఎంచుకోవలసిరావచ్చు.
    మరి మీరు ఒక కారులో ఎలాగైతే అన్నిరకాల
  • 1:59 - 2:04
    వస్తువుల్ని రవాణా చేయగలుగుతారో , అలాగే
    అనేక రకాల డిజిటల్ సమాచారాన్ని IP
  • 2:04 - 2:10
    ప్యాకెట్లతో పంపించొచ్చు, ఐతే కొన్ని
    పరిమితులున్నాయి. ఉదా, ఒక స్పేస్ షటిల్ ని
  • 2:10 - 2:14
    దాన్ని నిర్మిత చోటు నుండి లాంచ్ చేయాల్సిన
    చోటుకు తరలించాల్సి వస్తే ఎలా? ఆ షటిల్ ఓ
  • 2:14 - 2:19
    ట్రక్కులో పట్టదు కాబట్టి దాన్ని భాగాలుగా
    విడదీసి, ట్రక్కుల మందతో దాన్ని తరలించాలి.
  • 2:19 - 2:23
    అవి వివిధ మార్గాల్లో ప్రయాణించి గమ్యానికి
    వేర్వేరు సమయాల్లో చేరవచ్చు. ఐతే అన్ని
  • 2:23 - 2:28
    భాగాలూ అక్కడికి రాగానే మీరు వాటిని మళ్ళీ
    అమర్చి షటిల్ గా తయారు చేయవచ్చు, అప్పుడు
  • 2:28 - 2:34
    అది లాంచ్ కి సిద్ధంగా ఉంటుంది. ఇంటర్నెట్
    పై వివరాలు ఇదే విధంగానే పనిచేస్తాయి.
  • 2:34 - 2:40
    మీరు మిత్రుడికి పంపాల్సిన లేదా ఓ వెబ్‌సైట్
    కి అప్‌లోడ్ చేయాల్సిన పెద్ద ఇమేజ్ గనక ఉంటే
  • 2:40 - 2:45
    ఆ ఇమేజ్ ని మిలియన్ల 1 మరియు 0 ల బిట్స్ గా
    చేసినా ఒకే ప్యాకెట్ పంపడానికి మరీ ఎక్కువ
  • 2:45 - 2:50
    అవుతాయి. అది కంప్యూటర్ పై డేటా కాబట్టి,
    ఇమేజ్ ని పంపే కంప్యూటర్ దాన్ని త్వరగా
  • 2:50 - 2:56
    వందల వేలాది ప్యాకెట్లనబడే వాటిగా విడదీసి
    పంపగలుగుతుంది. కార్లు ట్రక్కుల మాదిరిగా ఈ
  • 2:56 - 3:00
    ప్యాకెట్లకి డ్రైవర్లు ఉండరు, అవి తమకిష్టం
    వచ్చిన మార్గాన్ని ఎంచుకోవు. ప్రతి ప్యాకెట్
  • 3:00 - 3:05
    తానువస్తున్న, వెళుతున్న ఇంటర్నెట్ చిరునామా
    కలిగి ఉంటుంది. ఇంటర్నెట్ పై రూటర్లు అనబడే
  • 3:05 - 3:09
    ప్రత్యేక కంప్యూటర్లు, ఈప్యాకెట్లు సజావుగా
    నెట్వర్క్ ల గుండా వెళ్ళేలా చేసే ట్రాఫిక్
  • 3:09 - 3:15
    మేనేజర్లుగా పనిచేస్తాయి. ఒక మార్గం రద్దీగా
    ఉంటే వేర్వేరుప్యాకెట్లు వేర్వేరుమార్గాల్లో
  • 3:15 - 3:20
    ఇంటర్నెట్ ద్వారా ప్రయాణించి స్వల్ప తేడాలో
    గమ్యానికి చేరుకోవచ్చు లేదా క్రమంలో ఉండక
  • 3:20 - 3:27
    పోవచ్చు. ఇదెలాపనిచేస్తుందో మాట్లాడదాం.
    ఇంటర్నెట్ ప్రోటోకాల్ లో భాగంగా, ప్రతిరూటర్
  • 3:27 - 3:31
    ప్యాకెట్లను పంపించడానికి అనేక మార్గాలను
    తీసుకుంటుంది, మరియు అందుబాటులోని అత్యంత
  • 3:31 - 3:37
    చౌకైనమార్గాన్ని ఎంచుకుంటుంది,ప్యాకెట్ కోసం
    గమ్యస్థానపు IP చిరునామాఆధారంగా. ఈ విషయంలో
  • 3:37 - 3:42
    ఖరీదు కాదు కానీ, సమయం మరియు రాజకీయాలు
    మరియు కంపెనీల మధ్య సంబంధాలు వంటి సాంకేతిక
  • 3:42 - 3:47
    యేతర అంశాలను బట్టి. తరచుగా డేటాప్రయాణానికి
    ఉత్తమ మార్గం అత్యంత నేరుగా ఉండితీరాల్సిన
  • 3:47 - 3:53
    పనిలేదు. మార్గాలకు ఐచ్చికాలు కలిగి ఉండడం
    నెట్వర్క్ తప్పులకు తట్టుకునేలా చేస్తుంది.
  • 3:53 - 3:58
    అంటే నెట్వర్క్ కొంత దారుణంగా ఉన్నా, నిజంగా
    దారుణంగా ఉన్నా ప్యాకెట్స్ పంపగలుగుతుంది.
  • 3:58 - 4:05
    ఇది ఇంటర్నెట్ ముఖ్య సూత్రం: విశ్వసనీయతకు
    ఆధారము. ఇప్పుడు, ఒకవేళ మీరు కొంత డేటాను
  • 4:05 - 4:09
    కోరి ఉండి, అంతా గనక డెలివరీ చేయబడకుంటే
    ఎలా? మీరొక పాట వినాలనుకోండి, మొత్తం డేటా
  • 4:09 - 4:15
    డెలివరీ అయి, పాట కచ్చితంగా ప్లే అవుతుందని
    మీరు 100% భరోసాతో ఎలా ఉండగలుగుతారు?
  • 4:15 - 4:21
    మీ కొత్తమిత్రుణ్ణి పరిచయం చేస్తున్నాం,TCP
    (ప్రసార నియంత్రణ ప్రోటోకాల్). మీ డేటా అంతా
  • 4:21 - 4:27
    ప్యాకెట్లుగా పంపడం, అందుకోవడాన్ని TCP
    మేనేజ్ చేస్తుంది.హామీ మెయిల్ సేవ అనుకోండి.
  • 4:27 - 4:32
    మీ డివైజ్ పై మీరొక పాట కోరినపుడు, Spotify
    అనేక ప్యాకెట్లుగా విడదీసిన పాటను పంపుతుంది
  • 4:32 - 4:37
    మీ ప్యాకెట్లు వచ్చినపుడు TCP పూర్తిగా చూసి
    అందుకున్న ప్రతి ప్యాకెట్ కీ రశీదుపంపుతుంది
  • 4:37 - 4:43
    అన్ని ప్యాకెట్లూ అక్కడ ఉంటే,TCP మీ డెలివరీ
    కొరకు సైన్ చేస్తుంది, మీ పని అవుతుంది.
  • 4:43 - 4:55
    (పాట ప్లే అవుతుంది).ఒకవేళ కొన్నిప్యాకెట్లు
    మిస్ అయి ఉంటే TCP సైన్ చేయదు, లేదా మీ పాట
  • 4:55 - 5:00
    బాగా వినిపించదు లేదా కొన్ని బాగాలు మిస్
    అయి ఉండొచ్చు. మిస్ అయిన లేదా అసంపూర్తి
  • 5:00 - 5:06
    ప్యాకెట్ కొరకు Spotify తిరిగి పంపుతుంది. ఆ
    కోరిన పాటకు అన్ని ప్యాకెట్ల డెలివరీని TCP
  • 5:06 - 5:13
    సరిచూసుకోగానే మీ పాట ప్లేకావడం మొదలవుతుంది
    ఒకవేళ TCP మరియు రూటర్ వ్యవస్థలు కొలవదగినవి
  • 5:13 - 5:19
    ఐతే వాటి గొప్పదనం ఏమిటి? అవి 8 లేదా 8
    బిలియన్ డివైజ్ లతో పనిచేయగలవు. వాస్తవంగా,
  • 5:19 - 5:23
    వైఫల్యం, పునరుక్తిని తట్టుకునే ఈ సూత్రాల
    కారణంగా, మనం ఎన్ని ఎక్కువ రూటర్లు జోడిస్తే
  • 5:23 - 5:28
    ఇంటర్నెట్ అంత ఎక్కువ విశ్వసనీయం అవుతుంది.
    ఇంటర్నెట్ ని ఎవరు వాడుతున్నా ఆటంకపరచకుండా
  • 5:28 - 5:34
    మనం దాని స్థాయిని పెంచడమనేది గొప్ప విషయం.
    ఇంటర్నెట్ వందల వేలాది నెట్వర్క్ లు మరియు
  • 5:34 - 5:39
    బిలియన్ల కంప్యూటర్లు మరియు డివైజ్ లను
    భౌతికంగా కనెక్ట్ చేస్తూ తయారు చేయబడింది.
  • 5:39 - 5:44
    ఇంటర్నెట్ ని ఒకదానితో మరొకటికలిపి, పరస్పరం
    మాట్లాడుకునే ఈ విభిన్న ఈ వ్యవస్థలు, డేటా
  • 5:44 - 5:51
    ఇంటర్నెట్ లో పంపించబడేందుకు అంగీకరించిన
    ప్రమాణాల కారణంగా కలిసి పనిచేస్తాయి.
  • 5:51 - 5:56
    ఇంటర్నెట్ వ్యాప్తంగా కంప్యూటింగ్ డివైజ్ లు
    లేదా రూటర్లు, ప్యాకెట్లన్నీ వాటి మార్గంలో
  • 5:56 - 6:03
    అవి గమ్యానికి చేరుకోవడానికి సాయపడతాయి,
    అవసరమైతే క్రమానుగతంగా. ఇది రోజుకు బిలియన్ల
  • 6:03 - 6:09
    సార్లు జరుగుతుంది, మీరు మరియు ఇతరులు ఒక
    ఇమెయిల్ పంపుతున్నా, ఒకవెబ్ పేజీ చూస్తున్నా
  • 6:09 - 6:14
    ఒక వీడియో చాట్, ఒక మొబైల్ యాప్ వాడుతున్నా,
    లేదా ఇంటర్నెట్ పై సెన్సార్లు లేదా డివైజ్
  • 6:14 - 6:15
    లు మాట్లాడుతున్నా.
Title:
The Internet: Packets, Routing and Reliability
Description:

more » « less
Video Language:
English
Duration:
06:26

Telugu subtitles

Revisions