[పాట కౌంట్‌డౌన్: 7, 6, 5, 4, 3, 2, 1] ఇంటర్నెట్: ప్యాకెట్స్, రూటింగ్, రిలయబిలిటీ హై. నాపేరు లిన్. నేను Spotify లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్, మరి నేను ఒప్పుకుంటున్నా, ఇంటర్నెట్ యొక్క విశ్వసనీయత గురించి తరచూ చెబుతుంటా. ఇంటర్నెట్ చుట్టూ తిరిగే సమాచారం పూర్తిగా సంభ్రమాన్ని కలిగిస్తుంటుంది. ఐతే మీకు అందించబడే ప్రతి డేటా భాగమూ నమ్మకంగా ఉంటుందనేది ఎంతవరకూ సాధ్యం? మీరు Spotify నుండి ఒక పాట ప్లే చేయాలనుకున్నారనుకుందాం. మీ కంప్యూటర్ నేరుగా Spotify సర్వర్లకు కనెక్ట్ అయి Spotify మీకు పాటను నేరుగా పంపుతుందని అనిపిస్తుంది. ఐతే వాస్తవంగా అలా ఇంటర్నెట్ పనిచేయదు. ఒకవేళ ఇంటర్నెట్ నేరుగా అంకితమైన కనెక్షన్లకు చేయబడి ఉంటే మిలియన్ల వాడుకదారులు చేరతారు కాబట్టి పనులు జరిగేలా చేయడం అసాధ్యం. ప్రత్యేకించి ప్రతి వైరు, ప్రతి కంప్యూటర్ ఎప్పుడూ పనిచేస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు కాబట్టి. బదులుగా డేటా ఇంటర్నెట్ పై నేరుగా తక్కువగా వెళుతుంది. అనేక ఏళ్ళ క్రితం 1970 ల్లో, నా పార్టనర్ బాబ్ కాహన్ మరియు నేను, ఇంటర్నెట్ అనబడే దాని డిజైన్ పై పనిచేయడం మొదలుపెట్టాం. బాబ్ మరియు నేను ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ డిజైన్ చేసే బాధ్యత మరియు అవకాశాన్ని తీసుకున్నాం. కాబట్టి మేం ఇంతవరకూ నేటితో సహా ఇంటర్నెట్ ఎదుగుదలమరియు ఉద్భవానికి పట్టుదలగా పనిచేశాం ఒక కంప్యూటర్ నుండి మరోదానికి సమాచారం ఎలా బదిలీ అవుతుందనేది చాలా ఆసక్తిగా ఉంటుంది. అది ఒకేదారిని అనుసరించాల్సిన అవసరం లేదు. వాస్తవానికి మీ దారి కంప్యూటర్ మరో కంప్యూటర్ సంభాషణ మధ్యలో మారవచ్చు.ఇంటర్నెట్ పై సమాచారం ఒక కంప్యూటర్ నుండి మరో కంప్యూటర్ కు వెళుతుంది, కొంత సమాచారం మరియు ఒక ప్యాకెట్ ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళినట్లుగానే ఇంటర్నెట్ పై వెళ్ళేసమాచారం కూడా ఒక చోటు నుండి మరో చోటుకు మీరు కారులో వెళ్ళినట్లుగానే వెళుతుంది. ట్రాఫిక్, రోడ్ రద్దీని బట్టి మీరు ప్రతిసారీ వెళ్ళే ఒకే చోటుకు మీరు మరో దారిని ఎంచుకోవలసిరావచ్చు. మరి మీరు ఒక కారులో ఎలాగైతే అన్నిరకాల వస్తువుల్ని రవాణా చేయగలుగుతారో , అలాగే అనేక రకాల డిజిటల్ సమాచారాన్ని IP ప్యాకెట్లతో పంపించొచ్చు, ఐతే కొన్ని పరిమితులున్నాయి. ఉదా, ఒక స్పేస్ షటిల్ ని దాన్ని నిర్మిత చోటు నుండి లాంచ్ చేయాల్సిన చోటుకు తరలించాల్సి వస్తే ఎలా? ఆ షటిల్ ఓ ట్రక్కులో పట్టదు కాబట్టి దాన్ని భాగాలుగా విడదీసి, ట్రక్కుల మందతో దాన్ని తరలించాలి. అవి వివిధ మార్గాల్లో ప్రయాణించి గమ్యానికి వేర్వేరు సమయాల్లో చేరవచ్చు. ఐతే అన్ని భాగాలూ అక్కడికి రాగానే మీరు వాటిని మళ్ళీ అమర్చి షటిల్ గా తయారు చేయవచ్చు, అప్పుడు అది లాంచ్ కి సిద్ధంగా ఉంటుంది. ఇంటర్నెట్ పై వివరాలు ఇదే విధంగానే పనిచేస్తాయి. మీరు మిత్రుడికి పంపాల్సిన లేదా ఓ వెబ్‌సైట్ కి అప్‌లోడ్ చేయాల్సిన పెద్ద ఇమేజ్ గనక ఉంటే ఆ ఇమేజ్ ని మిలియన్ల 1 మరియు 0 ల బిట్స్ గా చేసినా ఒకే ప్యాకెట్ పంపడానికి మరీ ఎక్కువ అవుతాయి. అది కంప్యూటర్ పై డేటా కాబట్టి, ఇమేజ్ ని పంపే కంప్యూటర్ దాన్ని త్వరగా వందల వేలాది ప్యాకెట్లనబడే వాటిగా విడదీసి పంపగలుగుతుంది. కార్లు ట్రక్కుల మాదిరిగా ఈ ప్యాకెట్లకి డ్రైవర్లు ఉండరు, అవి తమకిష్టం వచ్చిన మార్గాన్ని ఎంచుకోవు. ప్రతి ప్యాకెట్ తానువస్తున్న, వెళుతున్న ఇంటర్నెట్ చిరునామా కలిగి ఉంటుంది. ఇంటర్నెట్ పై రూటర్లు అనబడే ప్రత్యేక కంప్యూటర్లు, ఈప్యాకెట్లు సజావుగా నెట్వర్క్ ల గుండా వెళ్ళేలా చేసే ట్రాఫిక్ మేనేజర్లుగా పనిచేస్తాయి. ఒక మార్గం రద్దీగా ఉంటే వేర్వేరుప్యాకెట్లు వేర్వేరుమార్గాల్లో ఇంటర్నెట్ ద్వారా ప్రయాణించి స్వల్ప తేడాలో గమ్యానికి చేరుకోవచ్చు లేదా క్రమంలో ఉండక పోవచ్చు. ఇదెలాపనిచేస్తుందో మాట్లాడదాం. ఇంటర్నెట్ ప్రోటోకాల్ లో భాగంగా, ప్రతిరూటర్ ప్యాకెట్లను పంపించడానికి అనేక మార్గాలను తీసుకుంటుంది, మరియు అందుబాటులోని అత్యంత చౌకైనమార్గాన్ని ఎంచుకుంటుంది,ప్యాకెట్ కోసం గమ్యస్థానపు IP చిరునామాఆధారంగా. ఈ విషయంలో ఖరీదు కాదు కానీ, సమయం మరియు రాజకీయాలు మరియు కంపెనీల మధ్య సంబంధాలు వంటి సాంకేతిక యేతర అంశాలను బట్టి. తరచుగా డేటాప్రయాణానికి ఉత్తమ మార్గం అత్యంత నేరుగా ఉండితీరాల్సిన పనిలేదు. మార్గాలకు ఐచ్చికాలు కలిగి ఉండడం నెట్వర్క్ తప్పులకు తట్టుకునేలా చేస్తుంది. అంటే నెట్వర్క్ కొంత దారుణంగా ఉన్నా, నిజంగా దారుణంగా ఉన్నా ప్యాకెట్స్ పంపగలుగుతుంది. ఇది ఇంటర్నెట్ ముఖ్య సూత్రం: విశ్వసనీయతకు ఆధారము. ఇప్పుడు, ఒకవేళ మీరు కొంత డేటాను కోరి ఉండి, అంతా గనక డెలివరీ చేయబడకుంటే ఎలా? మీరొక పాట వినాలనుకోండి, మొత్తం డేటా డెలివరీ అయి, పాట కచ్చితంగా ప్లే అవుతుందని మీరు 100% భరోసాతో ఎలా ఉండగలుగుతారు? మీ కొత్తమిత్రుణ్ణి పరిచయం చేస్తున్నాం,TCP (ప్రసార నియంత్రణ ప్రోటోకాల్). మీ డేటా అంతా ప్యాకెట్లుగా పంపడం, అందుకోవడాన్ని TCP మేనేజ్ చేస్తుంది.హామీ మెయిల్ సేవ అనుకోండి. మీ డివైజ్ పై మీరొక పాట కోరినపుడు, Spotify అనేక ప్యాకెట్లుగా విడదీసిన పాటను పంపుతుంది మీ ప్యాకెట్లు వచ్చినపుడు TCP పూర్తిగా చూసి అందుకున్న ప్రతి ప్యాకెట్ కీ రశీదుపంపుతుంది అన్ని ప్యాకెట్లూ అక్కడ ఉంటే,TCP మీ డెలివరీ కొరకు సైన్ చేస్తుంది, మీ పని అవుతుంది. (పాట ప్లే అవుతుంది).ఒకవేళ కొన్నిప్యాకెట్లు మిస్ అయి ఉంటే TCP సైన్ చేయదు, లేదా మీ పాట బాగా వినిపించదు లేదా కొన్ని బాగాలు మిస్ అయి ఉండొచ్చు. మిస్ అయిన లేదా అసంపూర్తి ప్యాకెట్ కొరకు Spotify తిరిగి పంపుతుంది. ఆ కోరిన పాటకు అన్ని ప్యాకెట్ల డెలివరీని TCP సరిచూసుకోగానే మీ పాట ప్లేకావడం మొదలవుతుంది ఒకవేళ TCP మరియు రూటర్ వ్యవస్థలు కొలవదగినవి ఐతే వాటి గొప్పదనం ఏమిటి? అవి 8 లేదా 8 బిలియన్ డివైజ్ లతో పనిచేయగలవు. వాస్తవంగా, వైఫల్యం, పునరుక్తిని తట్టుకునే ఈ సూత్రాల కారణంగా, మనం ఎన్ని ఎక్కువ రూటర్లు జోడిస్తే ఇంటర్నెట్ అంత ఎక్కువ విశ్వసనీయం అవుతుంది. ఇంటర్నెట్ ని ఎవరు వాడుతున్నా ఆటంకపరచకుండా మనం దాని స్థాయిని పెంచడమనేది గొప్ప విషయం. ఇంటర్నెట్ వందల వేలాది నెట్వర్క్ లు మరియు బిలియన్ల కంప్యూటర్లు మరియు డివైజ్ లను భౌతికంగా కనెక్ట్ చేస్తూ తయారు చేయబడింది. ఇంటర్నెట్ ని ఒకదానితో మరొకటికలిపి, పరస్పరం మాట్లాడుకునే ఈ విభిన్న ఈ వ్యవస్థలు, డేటా ఇంటర్నెట్ లో పంపించబడేందుకు అంగీకరించిన ప్రమాణాల కారణంగా కలిసి పనిచేస్తాయి. ఇంటర్నెట్ వ్యాప్తంగా కంప్యూటింగ్ డివైజ్ లు లేదా రూటర్లు, ప్యాకెట్లన్నీ వాటి మార్గంలో అవి గమ్యానికి చేరుకోవడానికి సాయపడతాయి, అవసరమైతే క్రమానుగతంగా. ఇది రోజుకు బిలియన్ల సార్లు జరుగుతుంది, మీరు మరియు ఇతరులు ఒక ఇమెయిల్ పంపుతున్నా, ఒకవెబ్ పేజీ చూస్తున్నా ఒక వీడియో చాట్, ఒక మొబైల్ యాప్ వాడుతున్నా, లేదా ఇంటర్నెట్ పై సెన్సార్లు లేదా డివైజ్ లు మాట్లాడుతున్నా.