Return to Video

01 What Makes A Computer v7

  • 0:05 - 0:09
    నా పేరు మే-లీ ఖో, నేనొక డిజైనర్, ఒక
    అన్‌వేషకురాలిని.
  • 0:10 - 0:16
    సో, నేను డిజైన్ చేసినవి కొన్ని Apple లో,
    ఇప్పుడు నేను పిల్లల వాడకానికి చేస్తున్నా
  • 0:16 - 0:18
    తద్వారా వారికి బడిలో పని సులువవుతుంది.
  • 0:18 - 0:22
    నాఇతరపనుల్లో DJ-యింగ్ ఇంకా నాట్యం ఉన్నాయి
  • 0:26 - 0:28
    కంప్యూటర్లు ప్రతిచోటా ఉన్నాయి.
  • 0:28 - 0:33
    అవి మనుషుల జేబుల్లో, కార్లలో ఉన్నాయి,
    అవి మనుషుల ముంజేతిపై కూడా ఉన్నాయి.
  • 0:33 - 0:35
    అవిప్పుడు మీబ్యాక్‌ప్యాక్ లోకూడా ఉండొచ్చు
  • 0:36 - 0:39
    ఐతేకంప్యూటర్ ని కంప్యూటర్ గా ఏదిచేస్తుంది?
  • 0:39 - 0:41
    కంప్యూటర్ ని ఒక కంప్యూటర్ గా ఏది చేసింది?
  • 0:41 - 0:43
    ఇంతకీ అది ఎలా పని చేస్తుంది?
  • 0:46 - 0:50
    హై, నేను న్యాట్! నేను Xbox ఒరిజినల్
    డిజైనర్స్ లో ఒకర్ని.
  • 0:50 - 0:56
    నాకు ఏడేళ్ళ వయసు నుండీ నేను కంప్యూటర్లతో
    పనిచేస్తున్నా,ఇప్పుడు వాస్తవ సత్యంపై ఉన్నా
  • 1:07 - 1:11
    మనుషులుగా, మనసమస్యల్ని తీర్చుకోడానికి మనం
    ఎల్లప్పుడూ టూల్స్ చేసుకున్నాం
  • 1:11 - 1:16
    ఒక వీల్‌బ్యారో, ఒక సుత్తి, లేదా ప్రింటింగ్
    ప్రెస్ లేదాట్రాక్టర్ ట్రెయిలర్ వంటి టూల్స్
  • 1:16 - 1:19
    ఈ శోధనలన్నీ మనిషి పనికి సాయం చేశాయి.
  • 1:19 - 1:21
    కాలం గడిచేకొద్దీ, ప్రజలు వెతకనారంభించారు
  • 1:21 - 1:26
    మన ఆలోచనా పని చేయడానికి ఒక మెషీన్ గనక
    డిజైన్ చేసి రూపొందిస్తే,
  • 1:26 - 1:30
    సమీకరణాల సాధన లేదా ఆకాశంలో చుక్కలు
    లెక్కించడం వంటి పని.
  • 1:30 - 1:34
    మురికి మరియు రాళ్ళు వంటి భౌతిక వస్తువుల్ని
    తరలించడం లేదా తారుమారు చేయడం కాకుండా,
  • 1:34 - 1:38
    ఈ మెషీన్లను సమాచారాన్ని తెలివిగానడపడానికి
    తయారు చేయాల్సి ఉంది.
  • 1:40 - 1:44
    ఒక ఆలోచనా యంత్రాన్ని ఎలా తయారు చేయాలని
    కంప్యూటర్ సైన్స్ ప్రముఖులుశోధిస్తుండగా
  • 1:44 - 1:47
    అది నాలుగు పనులు చేయాల్సి ఉంటుందని వాళ్ళు
    గ్రహించారు.
  • 1:48 - 1:50
    అది ఇన్‌పుట్ తీసుకోవాలి,
  • 1:51 - 1:52
    సమాచారాన్ని నిల్వ చేయాలి
  • 1:53 - 1:56
    దాన్ని ప్రక్రియ చేసి ఫలితాలను బయటికి
    ఇవ్వాలి.
  • 1:57 - 1:59
    ఇప్పుడు ఇది సులువుగా అనిపించొచ్చు,
  • 1:59 - 2:02
    ఐతే ఈ నాలుగు పనులు కంప్యూటర్లు అన్నింటికీ
    సామాన్యమే.
  • 2:03 - 2:06
    అదే కంప్యూటర్ ని కంప్యూటర్ గా చేస్తుంది.
  • 2:08 - 2:10
    తొలి కంప్యూటర్లు కొయ్య ఇంకా లోహంతో
    చేయబడేవి
  • 2:10 - 2:13
    యాంత్రిక లీవర్లు మరియు గేర్లతో.
  • 2:13 - 2:18
    20వ శతాబ్దం నాటికి, కంప్యూటర్లు విద్యుత్
    అంశాలను వాడటం మొదలయింది.
  • 2:18 - 2:21
    ఈ తొలి కంప్యూటర్లు నిజంగా పెద్దవి మరియు
    చాలా చాలా నిదానంతో ఉండేవి.
  • 2:21 - 2:25
    గది సైజు ఉండే కంప్యూటర్ ఒక చిన్న లెక్క
    చేయడానికి గంటలకొద్దీ తీసుకునేది.
  • 2:27 - 2:33
    ఈ మెషీన్లు మెరిసే వస్తువులుగా, వివిధ
    రంగుల లోహం, అనేక ఫ్లాషింగ్ లైట్లతో ఉండేవి
  • 2:33 - 2:36
    కంప్యూటర్లు బేసిక్ క్యాలికులేటర్లుగా
    మొదలయ్యాయి,
  • 2:36 - 2:41
    ఆ కాలంలో నిజంగా అద్భుతంగా ఉండి అవి కేవలం
    అంకెల్ని వెనక్కి తారుమారు చేస్తుండేవి.
  • 2:41 - 2:47
    ఐతే ఇప్పుడు మనం వాటిని ఒకదాంతో ఒకటి
    మాట్లాడుకునేలా, గేమ్స్ కి, రోబోలనీ అదుపు
  • 2:47 - 2:50
    చేసి మనం ఊహించగల పిచ్చి పనులన్నీ
    చేస్తున్నాం.
  • 2:51 - 2:54
    ఆధునిక కంప్యూటర్లు పాతవాటిలా కనిపించవు
  • 2:54 - 2:57
    ఐతే అవే నాలుగు పనుల్ని బాగా చేస్తాయి.
  • 3:03 - 3:05
    మొదట ఇన్‌పుట్ గురించి మాట్లాడదాం.
  • 3:05 - 3:07
    ఇది నాకిష్టమైంది ఎందుకంటే ఇన్‌పుట్ అనేది
    ప్రపంచం
  • 3:07 - 3:12
    చేసే పనేనా లేదా కంప్యూటర్ ఆ పని చేసేలా
    మీరు చేయించే పదార్థమా.
  • 3:12 - 3:14
    కంప్యూటర్ ఏంచేయాలో కీబోర్డుతో చెప్పొచ్చు
  • 3:14 - 3:19
    మౌస్, మైక్రోఫోన్, కెమెరాతో ఏంచేయాలో దానికి
    చెప్పొచ్చు.
  • 3:19 - 3:22
    ఇప్పుడు మీ మణికట్టుపై కంప్యూటర్ ధరిస్తే
    అది మీ గుండెలయను వినొచ్చు,
  • 3:22 - 3:26
    లేదా కారులో, కారు ఏమి చేస్తున్నదో బహుశా
    అది వినొచ్చు.
  • 3:26 - 3:31
    ఒక టచ్ స్క్రీన్ మీ వ్రేలిని గ్రహించొచ్చు,
    మరి దాన్ని అది ఇన్‌పుట్ గా తీసుకోవచ్చు.
  • 3:36 - 3:41
    ఈ వేర్వేరు ఇన్‌పుట్లన్నీ కంప్యూటర్ కి
    సమాచారమిచ్చి, మెమరీగా నిల్వ చేస్తాయి.
  • 3:42 - 3:45
    కంప్యూటర్ ప్రాసెసర్, మెమరీ నుండి సమాచారం
    తీసుకుంటుంది.
  • 3:45 - 3:48
    ఒక అల్గారిధం ఉపయోగించి అది దాన్ని మార్పు
    చేస్తుంది,
  • 3:48 - 3:50
    అది ఒక కమాండ్ల శ్రేణిలాగా ఉంటుంది, అంతే.
  • 3:50 - 3:54
    ఆ తర్వాత ప్రాసెస్ చేసిన సమాచారాన్ని మళ్ళీ
    నిల్వ అయిన మెమరీకి పంపిస్తుంది.
  • 3:54 - 3:59
    ప్రాసెస్ అయిన సమాచారం ఔట్‌పుట్ గా సిద్ధం
    అయ్యే వరకూ ఇది కొనసాగుతుంది.
  • 4:03 - 4:07
    కంప్యూటర్ సమాచారాన్ని ఎలా ఔట్‌పుట్
    చేస్తుందనేది దాని డిజైన్ బట్టి ఉంటుంది.
  • 4:07 - 4:13
    కంప్యూటర్ డిస్‌ప్లే వచనం, ఫోటోలు, వీడియోలు
    ఆటలు-వాస్తవ సత్యాన్ని కూడా చూపిస్తుంది.
  • 4:13 - 4:17
    కంప్యూటర్ ఔట్‌పుట్ లో రోబోని అదుపు చేసే
    సిగ్నల్స్ కూడా ఉండొచ్చు.
  • 4:17 - 4:20
    మరి కంప్యూటర్ ని ఇంటర్నెట్ కి కనెక్ట్
    చేసినప్పుడు,
  • 4:20 - 4:24
    ఒక కంప్యూటర్ నుండి ఔట్‌పుట్ మరోదానికి
    ఇన్‌పుట్ కావచ్చు, ఇంకా అటుదిటుగా కావచ్చు.
  • 4:26 - 4:30
    మనం ఈరోజు వాడే కంప్యూటర్లు తొలి ఆలోచించు
    యంత్రాలకు నిజంగా భిన్నంగా కనిపిస్తాయి.
  • 4:30 - 4:33
    మరి రేపటిరోజున కంప్యూటర్లు చేసేపని ఎలా
    ఉంటుందో ఎవరికితెల్సు?
  • 4:33 - 4:37
    రేపు కంప్యూటర్లు ఏం చేయాలనుకుంటున్నారో
    నిర్ణయించడానికి మీరు సాయం పొందాలని నా ఆశ.
  • 4:37 - 4:41
    ఐతే, కంప్యూటర్లు ఏ రకం టెక్నాలజీ వాడుతూ
    ఉన్నాయనేదాంతో సంబంధం లేకుండా అవి ఎప్పుడూ
  • 4:41 - 4:45
    అవే నాలుగు పనులను చేస్తున్నాయి.
  • 4:45 - 4:46
    అవి సమాచారం తీసుకుంటాయి,
  • 4:46 - 4:48
    అవి దాన్ని డేటాగా నిల్వ చేస్తాయి,
  • 4:48 - 4:50
    అవి దాన్ని ప్రాసెస్ చేస్తాయి,
  • 4:50 - 4:51
    మరి తర్వాత ఫలితాల్ని ఔట్‌పుట్ చేస్తాయి.
Title:
01 What Makes A Computer v7
Description:

more » « less
Video Language:
English
Duration:
05:10

Telugu subtitles

Revisions