-
ఐతే మీరు ఏ గ్రేడ్ లో ఉన్నారు? రెండా. పదా.
ఫస్ట్ గ్రేడ్. ప్రోగ్రాం నేర్చుకున్నప్పుడు
-
8వ గ్రేడ్. నేను 6 వ గ్రేడ్ లో ఉన్నపుడు నా
మొదటికంప్యూటర్ తెచ్చుకున్నా. ప్రజల సమస్యని
-
తీర్చగలగడం నాకు ఆనందాన్నిస్తోంది. మీయంతట
మీరు చెప్పొచ్చు, ఒక ఆలోచన నుండి వస్తువులు
-
చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ అనేక విషయాలకు
ఆధారం, కాలేజ్ విద్యార్థులు, నిపుణులు మరో
-
20 లేదా 30 ఏళ్ళ పాటు చేయబోయే అనేక పనులకి.
నాకు ప్రోగ్రామింగ్ అంటే ఇష్టం, ఎందుకంటే
-
ప్రజలకి సాయపడ్డం నాకిష్టం.ప్రజల జీవితాల్ని
సులభం చేయబోయే ఒక పని చేసే అవకాశం ఒకటి నాకు
-
వచ్చింది. మనం సూపర్ పవర్ కావడానికి అది అతి
దగ్గరి విషయమని నేననుకుంటున్నా. మొదలుచేయడం
-
అతి ముఖ్యమైన భాగం. నాకు నేను ఇంకా మొదట్లో
ఉన్నా, మరి నాతోపాటు నువ్వూ నేర్చుకోవాలి.
-
నీవుఎప్పుడూ చేయాలనుకున్న నీకిష్టమైన వీడియో
ఒకటి ఏదైనా ఉందా? సరే,మనం కేవలం ప్లేలాబ్
-
ఉపయోగించి గేముల్ని క్రియేట్ చేయబోతున్నాం.
మంచి గేమ్ లకి కథలు ఉంటాయి, మరి ప్రతీ
-
కథకు నటులు ఉంటారు. నటులు మాట్లాడ్డం, నడవడం
ఒకరికొకరు మాట్లాడుకోవడం వంటివి చేస్తారు,
-
ఆ గేమ్ రూల్స్ బట్టి పాయింట్లనూ పొందవచ్చు.
ఈ రోజు మనం ఈ పనులన్నింటినీ తమాషా నటులైన
-
వాచీలు, జాంబీలు, విదేశీయులు,ఇంకా జంతువుల
తో ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం --మరి ఆ
-
తర్వాత స్క్రాచ్ నుండి ఒక గేమ్ నిర్మిస్తాం
దాన్ని ఫోన్ పై పంచుకోవచ్చు, ఆడుకోవచ్చు.
-
మీ స్క్రీన్ 3 ప్రధాన భాగాలుగా విడిపోయింది.
ఎడమన గేమ్ స్పేస్ ఉంది, అందులో మీ ప్రోగ్రాం
-
నడుస్తుంది. ప్రతి లెవెల్ కి సూచనలు దిగువన
వ్రాయబడ్డాయి. మధ్యలో ప్రాంతం టూల్ బాక్స్,
-
ఈ బ్లాకుల్లో ప్రతీదీ కోడ్ యొక్క ఒక భాగం.
కుడివైపున ఉండే వైట్ స్పేస్ ని వర్క్ స్పేస్
-
అంటారు, ఇక్కడనే మనం మన ప్రోగ్రామును
నిర్మిస్తాం.
-
మొదలుచేయడానికి, మీరు మీ బ్లాక్ లను ఆరంజ్
"వెన్ రన్" బ్లాక్ కి లింక్ చేయాల్సుంటుంది.
-
మీరు పసుపుగీతను చూసేవరకూ అనేక కోడ్ లను
కలిపి బయటికి లాగడం ద్వారా కలిపేయవచ్చు, మరి
-
తర్వాత అవి కల్సిపోతాయి.
-
ఈ మొదటి పజిల్ లో, మన యాక్టర్ ఒక పెంగ్విన్,
అది "హలో!" చెప్పేలా చేస్తాం, "సే" బ్లాక్
-
బైటికి లాగి "వెన్ రన్" బ్లాక్ కి లింక్
చేసి మరియు "హలో" టైప్ చేయడం ద్వారా. మనం
-
"మూవ్ రైట్" మరియు "మూవ్ లెఫ్ట్" ఉపయోగించి
కూడా పెంగ్విన్ కదిలేలా చేయవచ్చు. మీ బ్లాక్
-
లు మీకు సిద్ధం కాగానే, మీరు ఏమి ప్రోగ్రాం
చేశారో చూసేందుకు "రన్ బటన్" నొక్కండి. ఇక
-
మొదలుపెట్టండి, చివరికి మీరు మీస్వంత గేమును
అన్ని రకాల ప్లేయర్లతో సృష్టించవచ్చు, అవి
-
మాట్లాడుకునేలా, సంతోషం,విచారంగా, పాయింట్స్
స్కోర్ చేస్తూ లేదా బంతులేస్తూ, లేదాపరస్పరం
-
పాడుచేసుకునేలా ఉండొచ్చు. అది మీ ఇష్టం,
ఎలా కావాలో అలా.