అల్జీమర్స్ సాధారణ ముసలితనము కాదు - మరియు మనం దానిని నయం చేయవచ్చు
-
0:01 - 0:031901 సంవత్సరంలో
అగస్టే అనే మహిళ -
0:03 - 0:06ఫ్రాంక్ఫర్ట్లో ఒక వైద్య ఆశ్రయం
తీసుకున్నారు. -
0:07 - 0:08అగస్టే రకరకాల భ్రాంతులను
కలిగి ఉంది -
0:09 - 0:12మరియు ఆమెకు తన జీవితంలో చాలా
ప్రాథమిక వివరాలు కూడా గుర్తు లేవు. -
0:12 - 0:14ఆమె యొక్క డాక్టర్ ను
ఆల్విస్ అని పిలిచేవారు. -
0:16 - 0:18ఆల్విస్ కు అగస్టేకు ఎలా
సహాయం చేయాలో తెలియలేదు -
0:18 - 0:22ఆమెను 1906 వరకు వీక్షించారు,
తరువాత పాపం, ఆమె చనిపోయింది. -
0:23 - 0:25ఆమె చనిపోయిన తరువాత,
ఆల్విస్ శవపరీక్ష చేశాడు -
0:25 - 0:28మరియు అగస్టే మెదడులోతను మునుపెన్నడూ
చూడని వింత ఫలకాలు -
0:29 - 0:31మరియు టాంగల్స్ ఉన్నట్లు గుర్తించారు.
-
0:31 - 0:33ఇప్పుడు ఇక్కడ ఇంకా ముఖ్యమైన
విషయం ఒకటి ఉంది. -
0:34 - 0:37బహుశ అగస్టే ఇప్పటి వరకూ జీవించి
ఉన్నట్లయితే, మనము ఆల్విస్ -
0:38 - 0:43114 సంవత్సరాల క్రితం చేయగలిగినంత సహాయం
కంటే ఎక్కువ అందించగలిగి ఉండే వాళ్ళము కాదు. -
0:44 - 0:48ఆల్విస్ పూర్తి పేరు
డాక్టర్. ఆల్విస్ అల్జీమర్స్. -
0:49 - 0:51మరియు అగస్టే డిటర్ మనము
ఇప్పుడు అల్జీమర్స్ -
0:51 - 0:55అని పిలిచే మతిమరపు వ్యాధి కలిగిన
మొట్టమొదటి రోగిగా నిర్ధారణ చేయబడింది. -
0:56 - 0:591901 నుండి, వైద్యశాస్త్రం ఎంతగానో
పురోగతి సాధించింది. -
0:59 - 1:03మనము అంటువ్యాధులు నుండి రక్షించుకోడానికి
యాంటీబయాటిక్స్ మరియు టీకాలు కనుగొన్నాము, -
1:03 - 1:07క్యాన్సర్ కోసం అనేక చికిత్సలు,
హెచ్ఐవీ కోసం ఆన్టీరిట్రోవైరల్స్, -
1:07 - 1:10గుండె జబ్బులకు స్టాటిన్స్ ఇంకా చాలా చాలా.
-
1:11 - 1:18కానీ మనము అల్జీమర్స్ వ్యాధి చికిత్సలో
ముఖ్యంగా ఎటువంటి పురోగతిని చేయలేదు. -
1:18 - 1:20నేను దశాబ్దంపాటు అల్జీమర్స్ కు
-
1:20 - 1:23చికిత్సను కనుగొనేందుకు పనిచేసిన
శాస్త్రవేత్తల బృందంలో భాగంగా ఉన్నాను. -
1:24 - 1:26అందుకే దీని గురించి
ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. -
1:26 - 1:30అల్జీమర్స్ తో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా
40 మిలియన్ల మంది బాధ పడుతున్నారు. -
1:30 - 1:36కానీ 2050 నాటికి,ఇది 150 మిలియన్ ప్రజలను
ప్రభావితం చేయవచ్చు- -
1:36 - 1:40ఇందులో, మీలో చాలా మంది ఉండవచ్చు.
-
1:41 - 1:44మీరు 85 లేక ఎక్కువ సంవత్సరాలు
-
1:45 - 1:50బ్రతికి ఉంటె ప్రతి ఇద్దరిలో ఒకరికి
అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంది. -
1:52 - 1:55ఒక రకంగా చెప్పాలంటే, మీరు
మీ బంగారు సంవత్సరాలు -
1:55 - 1:57అల్జీమర్స్ తో బాధ పడ వచ్చు లేదా ఆ వ్యాధి
-
1:57 - 2:01వచ్చిన స్నేహితునికో లేక సన్నిహితునికో
సహాయం చేస్తూ ఉండి ఉండవచ్చు. -
2:02 - 2:04ఇప్పటికే కేవలం యునైటెడ్ స్టేట్స్ లోనే ,
-
2:04 - 2:09అల్జీమర్స్ సంరక్షణ కోసం ప్రతి సంవత్సరం
అయ్యే ఖర్చు 200 బిలియన్ డాలర్లు. -
2:10 - 2:14ప్రతి ఐదు మెడికేర్ డాలర్లలో ఒకటి
అల్జీమర్స్ కోసం ఖర్చు అవుతోంది. -
2:15 - 2:18ఇది ఈనాడు అత్యంత ఖరీదైన వ్యాధి,
-
2:18 - 2:21మరియు నేటి తరం వృధ్ధులయ్యే నాటికి,
అంటే 2050 నాటికి, -
2:21 - 2:23ఖర్చులు ఐదు రెట్లు పెరుగుతాయని అంచనా.
-
2:24 - 2:27స్థూలంగా చెప్పాలంటే, ఇది మిమ్మల్ని
ఆశ్చర్య పరుస్తుంది -
2:27 - 2:32ఎందుకంటే అల్జీమర్స్ అతి పెద్ద వైద్య
మరియు సామాజిక సవాళ్ళలో ఒకటి. -
2:33 - 2:35కానీ అది పరిష్కరించేందుకు
చాలా తక్కువ చేశాము. -
2:36 - 2:39నేడు, ప్రపంచవ్యాప్తంగా మరణానికి
మొదటి 10 కారణాలలో, -
2:40 - 2:47అల్జీమర్స్ వ్యాధిని నిరోధించడం, నయం చేయడం
లేదా పెరగకుండా మనము ఏమీ చేయలేము. -
2:48 - 2:51మనము ఇతర వ్యాధుల కన్నా అల్జీమర్స్
గురించి తక్కువ అర్థం చేసుకున్నాము -
2:52 - 2:55ఎందుకంటే దాని పరిశోధనలో తక్కువ
సమయం మరియు పెట్టుబడి వెచ్చంచాము. -
2:55 - 2:59ప్రతి సంవత్సరం అల్జీమర్స్ చికిత్సలో
కాన్సర్ కన్నా మరింత ఖర్చు అయునా -
2:59 - 3:02మరియు మరణాల సంఖ్య అదే మోస్తరులో
ఉన్నప్పటికీ యుఎస్ ప్రభుత్వం -
3:02 - 3:05కాన్సర్ పరిశోధనకు, ఆల్జిమీర్స్ కన్నా,
-
3:06 - 3:11ప్రతి సంవత్సరం10 రెట్లు ఎక్కువ
డబ్బు ఖర్చు చేస్తుంది. -
3:12 - 3:16వనరుల కొరత మరింత సైద్ధాంతిక
కారణం నుంచి వచ్చింది: -
3:16 - 3:17అవగాహన లేకపోవడం.
-
3:19 - 3:22ఇక్కడ కొద్ది మందికి తెలుసు కానీ
అందరికీ తెలియాలి ఎందుకంటే: -
3:23 - 3:28ఆల్జీమర్స్ ఒక వ్యాధి మరియు
దాన్ని మనము నయం చేయగలము. -
3:28 - 3:31గత 114 ఏళ్ళలో చాలా వరకు,
శాస్త్రవేత్తలతో సహా -
3:31 - 3:36ప్రతి ఒక్కరూ తప్పుగా వృద్ధాప్యాన్ని,
అల్జీమర్స్ గా తికమక పడ్డారు. -
3:36 - 3:38వృద్ధాప్యము రావడము
వయస్సు పెరగడం -
3:38 - 3:40మామూలు అనివార్యమైన
భాగంగా భావించే వాళ్ళము. -
3:41 - 3:43కానీ మనం ఒకసారి
ఆల్జీమర్స్ పేషంట్ మెదడు -
3:43 - 3:47చిత్రాన్ని ఆరోగ్యవంతమైన వ్రృద్ధుల
మెదడు చిత్రంతో పోల్చినట్లైతే -
3:47 - 3:50ఆ వ్యాధి కలిగించే
భౌతిక నష్టాన్ని చూడవచ్చు. -
3:51 - 3:55జ్ఞాపకశక్తి బాగా తగ్గడం మరియు మానసిక
సామర్ధ్యాలు దెబ్బతినడం వంటి నష్టాలను -
3:55 - 3:57ఆల్జీమెర్స్ మెదడుకి కలిగిస్తుంది.
-
3:57 - 4:02ఇది గణనీయంగా ఆయుర్దాయం తగ్గించడమే
కాకుండా ప్రాణాంతకమైన వ్యాధి. -
4:02 - 4:06Dr.ఆల్జీమెర్స్ అగస్టె మెదడులో
విచిత్రమైన ఫలకాలూ,మరియు టాంగిల్స్ -
4:06 - 4:08శతాబ్దం క్రితం చూసింది గుర్తు చేసుకొండి.
-
4:08 - 4:11సుమారు శతాబ్దం మనకు
దీనిని గురించి ఏమీ తెలవదు -
4:12 - 4:15నేడు మనకు అవి ప్రోటీన్ కణాల
నుండి తయారు అవుతాయని తెలుసు. -
4:16 - 4:17మీరు ఒక ప్రోటీన్ కణాన్ని ఒక కాగితం
-
4:17 - 4:21ముక్క లాగా దేన్ని మడిచి మనం
ఒరిగామి చెయ్యచ్చో దానిలాగా ఊహించుకోవచ్చు. -
4:22 - 4:24దాని మీద జిగురు చుక్కలు ఉంటాయి.
-
4:25 - 4:30మరియు దానిని మడిచినప్పుడు,
ఈ జిగురు ముక్కలు లోపలివైపుకు వస్తాయి. -
4:30 - 4:34కానీ కొన్నిసార్లు అట్లా జరగక,
జిగురు ముక్కలు బయటివైపుకు ఉండిపోతాయి. -
4:34 - 4:37ఇది ప్రోటీన్ కణాలను ఒకదానికొకటి
అతుక్కునేలా చేసి,ఉండలుగా -
4:37 - 4:41తద్వారా అవి పెద్ద ఫలకాలుగా
మరియు టాంగిల్స్ గా ఏర్పడేటట్లు చేస్తుంది. -
4:42 - 4:44దీనినే మనం ఆల్జీమర్స్ బాధితుల
మెదళ్ళలో చూడవచ్చు. -
4:45 - 4:48మేము గత 10సంవత్సరాలుగా
యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ లో ఈ పొరపాటు -
4:48 - 4:51ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవడానికి
ప్రయత్నిస్తున్నాం. -
4:52 - 4:56అక్కడ ఉన్న అనేక దశలలో సంక్లిష్టమైన ఏ దశను
ఆపు చేయాలో తెలుసుకోవడం ఉదాహరణకు--- -
4:57 - 4:58బాంబును నిర్వీర్యం చేయడం.
-
4:59 - 5:01ఒక తీగ తెంచడంతో ఏమీ జరగక పోవచ్చు.
-
5:01 - 5:03వేరే తీగ తెంచితే బాంబు పేలవచ్చు.
-
5:04 - 5:06మనము ఏ దశను ఆపాలో కనుక్కోవాలి,
-
5:06 - 5:08ఆపై అది చేయడానికి ఒక ఔషధం సృష్టించాలి.
-
5:09 - 5:11ఇటీవల వరకు, మేము చాలా భాగం
-
5:11 - 5:14తీగలు తెంచి ఉత్తమ ఫలితాలు
ఆశిస్తూ ఉన్నాం. -
5:14 - 5:16కానీ ఇప్పుడు మనతో మెడిక్స్,
జీవ,జన్యు,భౌతిక శాస్త్రజ్ఞులు, -
5:16 - 5:22కెమిస్టులు, ఇంజనీర్లుమరియుగణితశాస్త్రజ్ఞుల
వంటి భిన్న నేపధ్యం కల ప్రజలు కలిశారు. -
5:22 - 5:26మరియు కలిసి, మేమందరం ఒక క్లిష్టమైన
దశని ఈ ప్రక్రియలో గుర్తించగలిగాం -
5:26 - 5:30మరియు ఇప్పుడు ఒక కొత్త రకమైన మందులను
పరీక్షిస్తున్నాంఅవి ప్రత్యేకంగా -
5:31 - 5:32ఈదశని బ్లాక్ చేసి వ్యాధిని తగ్గిస్తాయి.
-
5:32 - 5:35ఇప్పుడు మీకు మా తాజా ఫలితాలు
కొన్ని చూపించనివ్వండి. -
5:35 - 5:38మా లాబ్ కాకుండా బయటి వ్యక్తులు
ఎవరూ దీనిని చూడలేదు. -
5:38 - 5:43ఈ కొత్త మందులను పురుగుల మీద వాడినప్పుడు
ఏం జరిగిందో మనం కొన్ని వీడియోలు చూద్దాం -
5:43 - 5:44ఇవి ఆరోగ్యకరమైన పురుగులు,
-
5:44 - 5:47అవి సాధారణంగా అటూ ఇటూ
కదలడం మీరు చూడవచ్చు. -
5:48 - 5:50ఈ పురుగులు ,ఒక పక్క,
-
5:50 - 5:54ప్రోటీన్ కణాలు వాటి లోపల
కలిసి అతుక్కోని ఉన్నాయి-- -
5:54 - 5:55ఆల్జిమీర్స్ బాధితుల్లోలాగా.
-
5:55 - 5:58మీరు వారిని స్పష్టంగా
జబ్బుపడిన వారిగా చూడగలరు. -
5:58 - 6:03కానీ మేము మా కొత్త మందులు ఈ పురుగులకు
ప్రారంభ దశలో ఇచ్చి ఉంటే, -
6:03 - 6:06అప్పుడు మేము వారు ఆరోగ్యకరంగా ఉండి
సాధారణ ఆయుష్షు జేవించేట్లుగా చూసేవాళ్ళం. -
6:07 - 6:11ఇది కేవలం ఒక ప్రారంభ సానుకూల ఫలితం,
కానీ ఇటువంటి పరిశోధన మనకు -
6:11 - 6:16అల్జీమర్స్ ఒక అర్థం చేసుకోగలిగిన మరియు
నయం చేయగలిగిన వ్యాధి అని సూచిస్తుంది. -
6:16 - 6:19114 సంవత్సరాలు వేచియున్నతరువాత,
-
6:19 - 6:21వచ్చే 10 నుంచి 20 సంవత్సరాలలో
ఎంతో కొంత సాధించవచ్చు -
6:21 - 6:23అని నిజమైన ఆశ కలుగుతోంది.
-
6:24 - 6:28కానీ ఆ ఆశ పెరిగి అల్జీమర్స్ ని చివరకు
ఓడించడానికి మాకు సహాయం అవసరం. -
6:29 - 6:31నా లాంటి శాస్త్రవేత్తల గురించి కాదు -
-
6:31 - 6:32ఇది మీ గురించి.
-
6:33 - 6:36మనమందరము ప్రయత్నిస్తే అల్జీమర్స్
వ్యాధిని ఓడించవచ్చు అనే -
6:36 - 6:39అవగాహన అందరిలో పెంచవచ్చు.
-
6:39 - 6:41ఇతర వ్యాధుల విషయంలో,
-
6:41 - 6:44రోగులు మరియు వారి కుటుంబాలు
మరింత పరిశోధన కోసం -
6:44 - 6:47మరింత చొరవ తీస్కొని ప్రభుత్వం,
ఔషధ పరిశ్రమ ,సైంటిస్టుల మీద, -
6:47 - 6:49నియంత్రించేవారి మీద,
ఒత్తిడి తీసుకొస్తున్నారు. -
6:49 - 6:541980లలో HIV కి మెరుగైన చికిత్స
కోసం అది చాలా అవసరం. -
6:54 - 6:58నేడు,మనం అదే ఉత్సాహాన్ని క్యాన్సర్ ని
ఓడించడంలో కూడా చూడవచ్చు. -
6:58 - 7:03కాని ఆల్జిమర్స్ బాధితులు
వారి కొరకు వారు మాట్లాడలేరు. -
7:03 - 7:07మరియు వారి కుటుంబాలు,బయటపడని బాధితులు,
వారి ప్రియమైన వారి సేవలో రాత్రి పగలు, -
7:07 - 7:10గడుపుతూ అలిసిపోయి
మార్పు కోసం ఆలోచించనూ లేరు. -
7:11 - 7:14కాబట్టి,ఇది నిజంగా మీ బాధ్యత.
-
7:16 - 7:19అల్జీమర్స్ చాలా వరకు,
జన్యుపరమైన వ్యాధి, కాదు. -
7:19 - 7:21మెదడు ఉన్న ప్రతి ఒక్కరికీ
ప్రమాదం ఉన్నట్లే. -
7:22 - 7:27నేడు, అగస్టే వంటి 40 మిలియన్ రోగులు,
-
7:27 - 7:30తమ కోసం కావలసిన మార్పును
సృష్టించలేని స్థితిలో ఉన్నారు. -
7:30 - 7:31వాళ్ళ సహాయం కొరకు మాట్లాడండి,
-
7:32 - 7:34మరియు నివారణకు సహాయం ఆర్ధించండి.
-
7:35 - 7:36ధన్యవాదాలు.
-
7:37 - 7:40(చప్పట్లు)
- Title:
- అల్జీమర్స్ సాధారణ ముసలితనము కాదు - మరియు మనం దానిని నయం చేయవచ్చు
- Speaker:
- శామ్యూల్ కోహెన్
- Description:
-
more » « less
ప్రపంచంలో 40 మిలియన్లకు పైగా ప్రజలు అల్జీమర్స్ వ్యాధితో (మతిమరపు వ్యాధి) బాధ పడుతున్నారు, మరియు ఆ సంఖ్య రాబోయే సంవత్సరాల్లో గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. 100 సంవత్సరాల క్రితం ఈ వ్యాధిని వర్గీకరణ చేసినప్పటికినీ, ఈ వ్యాధి చికిత్సలో మనము చెప్పుకొదగ్గ పురోగతి సాధించలేదు. శామ్యూల్ కోహెన్ అనే శాస్త్రవేత్త తన ప్రయోగశాల నుండి, అల్జీమర్స్ పరిశోధనలో నూతన పురోగతి మరియు ఆశా సందేశాన్ని పంచుకున్నారు. ఆయన అంటున్నారు “ఆల్జీమెర్స్ ఒక వ్యాధి మరియి దాన్ని మనం నయం చేయగలం”.
- Video Language:
- English
- Team:
closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 07:53
| Samrat Sridhara approved Telugu subtitles for Alzheimer's is not normal aging — and we can cure it | ||
| Samrat Sridhara accepted Telugu subtitles for Alzheimer's is not normal aging — and we can cure it | ||
| Samrat Sridhara edited Telugu subtitles for Alzheimer's is not normal aging — and we can cure it | ||
| Samrat Sridhara edited Telugu subtitles for Alzheimer's is not normal aging — and we can cure it | ||
| Samrat Sridhara edited Telugu subtitles for Alzheimer's is not normal aging — and we can cure it | ||
| Annamraju Lalitha edited Telugu subtitles for Alzheimer's is not normal aging — and we can cure it | ||
| Annamraju Lalitha edited Telugu subtitles for Alzheimer's is not normal aging — and we can cure it | ||
| Annamraju Lalitha edited Telugu subtitles for Alzheimer's is not normal aging — and we can cure it |