AI: What is Machine Learning?
-
0:08 - 0:12నాపేరు అలీ ఫ్లోరెస్, నేను Alexaలో ప్రొడక్ట్
మేనేజర్‌ని. -
0:12 - 0:15నా పేరు డాక్టర్, చెల్సియా హ్యూప్ట్. నేను అలెన్
ఇనిస్టిట్యూట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై
పనిచేస్తాను. -
0:15 - 0:20అలానే నేను Ai-పవర్డ్ అకడమిక్ సెర్చ్‌ఇంజిన్ మీద కూడా
పనిచేస్తాను. -
0:21 - 0:26మీ చుట్టు పక్కల ఉండే కంప్యూటర్‌లు నిర్ణయాలు
తీసుకుంటున్నాయి, మరియు ఆ నిర్ణయాలు మీ రోజువారీ -
0:26 - 0:31జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు ఇంటర్నెట్ సెర్చ్
చేసేటప్పుడు లేదా మీ న్యూస్‌ఫీడ్ గుండా స్క్రోల్
చేసినప్పుడు, -
0:31 - 0:34మీరు ఏమి చూడాలనేది కంప్యూటర్‌లు నిర్ణయిస్తాయి.
-
0:34 - 0:39కంప్యూటర్‌లు ఇప్పటికే మీ ముఖాన్ని గుర్తించగలవు
మరియు మీ స్వరాన్ని అర్థం చేసుకుంటాయి, -
0:39 - 0:44త్వరలో అవి మనుషుల కంటే మెరుగ్గా, కార్లు డ్రైవింగ్
చేయగలవు మరియు వ్యాధులను గుర్తించగలవు. -
0:44 - 0:47అయితే ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి?
-
0:48 - 0:53మీరు AI లేదా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అనేది విని
ఉంటారు. -
0:53 - 0:57నిజమైన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ దశాబ్దాల దూరంలో
ఉంది. -
0:57 - 1:02అయితే నేడున్న AI రకాన్ని మెషిన్ లెర్నింగ్ అని
అంటారు. -
1:02 - 1:05ఇది మీరు ప్రతిరోజూ మీకు తెలియకుండానే ఇంటరాక్ట్ అయ్యే
AI రకం. -
1:05 - 1:11ప్రపంచంలోని అతి పెద్ద సవాళ్లతో వ్యవహరించడంలో మాకు
సాయపడేందుకు ఇది ఒక అవకాశం. -
1:13 - 1:18మెషిన్ లెర్నింగ్ అంటే ప్రత్యేకంగా ప్రోగ్రామింగ్
చేయకుండానే, -
1:18 - 1:21కంప్యూటర్‌లు ప్యాట్రన్‌లను గురించి, నిర్ణయాలు
తీసుకోవడం. -
1:22 - 1:28ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనం ఇంతకు ముందు ఎన్నడూ
చేయనివిధంగా -
1:28 - 1:30ఒక కంప్యూటర్ విబిన్న రీతిలో ప్రోగ్రామ్
చేయబడుతుంది. -
1:31 - 1:37మెషిన్ లెర్నింగ్‌తో, కంప్యూటర్‌ని దశలవారీగా
ప్రోగ్రామింగ్ చేయడానికి బదులుగా, -
1:37 - 1:44మీరు ట్రయల్ అండ్ ఎర్రర్, మరియు చాలా ప్రాక్టీస్ ద్వారా
మీరు నేర్చుకునేలానే నేర్చుకోవడానికి ప్రోగ్రామ్
చేయవచ్చు. -
1:45 - 1:49అనుభవం నుంచి అభ్యసన వస్తుంది, మరియు మెషిన్ లెర్నింగ్‌కు
కూడా అది సత్యం. -
1:49 - 1:54ఈ విషయంలో, ‘‘అనుభవం’’ అంటే చాలా పెద్దమొత్తంలో
డేటా. -
1:54 - 1:58మెషిన్ లెర్నింగ్ ఎలాంటి రకం డేటానైనా తీసుకోవచ్చు:
-
1:58 - 2:05ఇమేజ్‌లు, వీడియో, ఆడియో, లేదా టెక్ట్స్, మరియు ఆ
డేటాలోని ప్యాట్రన్‌లను గుర్తించడం ప్రారంభిస్తుంది. -
2:06 - 2:11ఇది డేటాలోని ప్యాట్రన్‌లను గుర్తించడం నేర్చుకున్న
తరువాత, ఆ ప్యాట్రన్‌ల ఆధారంగా ఊహాగానాలు -
2:11 - 2:13చేయడం కూడా ఇది నేర్చుకుంటుంది.
-
2:13 - 2:18కారు ఇమేజ్, మరియు సైకిల్ ఇమేజ్ మధ్య ఉన్న తేడాను
గమనించడం వంటివి. -
2:21 - 2:26AI మరియు మెషిన్ లెర్నింగ్‌లు సొసైటీలో అతి పెద్ద
పాత్ర పోషిస్తున్నాయి, -
2:27 - 2:29మరియు మన భవిష్యత్తుకు ఒక రూపు కల్పిస్తాయి.
-
2:29 - 2:35అందువల్లనే, అందుబాటులో ఉన్న అనుభవంతో ఇది ఎలా
పనిచేస్తుందో నేర్చుకోవడం చాలా ముఖ్యం. -
2:35 - 2:39మీ స్వంత మెషిన్ లెర్నింగ్ మెడల్‌ని ట్రైన్ చేసేందుకు
మీరు ఒక అవకాశాన్ని పొందబోతున్నారు. -
2:41 - 2:47గుర్తుంచుకోండి, AI అనేది ఏదైనా ఇతర టూల్స్‌లానే
ఉంటుంది: ముందు నాలెడ్జ్ పొందుతారు, తరువాత మీరు
శక్తిని పొందుతారు!
- Title:
- AI: What is Machine Learning?
- Description:
-
AI is all around us. The most widely used form of AI is called Machine Learning and you probably interact with it every day. Find out what Machine Learning is and how it's changing our world.
Start learning at http://code.org/
Stay in touch with us!
• on Twitter https://twitter.com/codeorg
• on Facebook https://www.facebook.com/Code.org
• on Instagram https://instagram.com/codeorg
• on Tumblr https://blog.code.org
• on LinkedIn https://www.linkedin.com/company/code-org
• on Google+ https://google.com/+codeorg - Video Language:
- English
- Team:
- Code.org
- Project:
- CSF '21-'22
- Duration:
- 02:56
TranslateByHumans edited Telugu subtitles for AI: What is Machine Learning? |