-
ఈ రోజు మనం కూడికల పాఠం నేర్చుకుందాం.
-
మీరు ఏమి అనుకుంటున్నారో నాకు తెలుసు
-
"సాల్, కూడికలు అసలే సులభంగా అనిపించట్లేదు.."
-
కాని క్షమించండి.
-
నేను ఏమి అనుకుంటున్నాను అంటే
-
బహుశా ఈ పాఠం అయిపోయే సరికి
-
లేదా మరో రెండు వారాల్లో కూడికలు మీకు సులభం అయిపోతాయి.
-
ఇంకేం, మన పాఠం మొదలు పెడదాం.
-
కొన్ని సమస్యలు తీసుకుంటే
-
ఉదాహరణకు, అందరికీ తెలిసిన ఒక సాధారణ సమస్య ఏంటంటే...
-
1 + 1
-
నాకు తెలిసి, దీన్ని ఎలా చెయ్యాలో మీకు తెలిసే ఉంటుంది.
-
కాని, దీన్ని ఎలా చెయ్యాలో ఒక పద్ధతిలో మీకు చూపిస్తాను.
-
ఒక వేళ ఈ సమస్య యొక్క సమాధానం మీరు బట్టీ పట్టలేదు అనుకోండి.
-
లేదా దీనిలో మీరు ఇంకా ప్రావీణ్యులు కాలేదు అనుకోండి.
-
మీకు ముందే వచ్చు అనుకోవచ్చు, కానీ,
-
ఒక్కటి
-
దీన్ని ఒక్క టొమాటో అనుకోండి.
-
నా దగ్గర ఒక్క టొమాటో ఉంటే,
-
ఆ తర్వాత మీరు నాకు మరొక్క టొమాటో ఇచ్చారు అనుకోండి.
-
ఇప్పుడు నా దగ్గర ఎన్ని టొమాటోలు ఉన్నాయి?
-
సరే, చూద్దాం..ఒక్కటీ.....రెండు టొమాటోలు.
-
కాబట్టి 1 + 1 కూడితే 2
-
ఆ, ఇప్పుడు నాకు తెలుసు మీరు ఏమి అనుకుంటున్నారో,
-
అది చాల సులభం అని.
-
ఈ సారి దాని కంటే కొంచెం కష్టమైనది ఇస్తాను.
-
నాకు టొమాటోలు అంటే ఇష్టం. కాబట్టి, వాటితోనే చేద్దాం.
-
3 + 4 కూడితే ఎంత?
-
ఆ...ఇది కొంచెం కష్టం కదా?
-
పర్లేదు..మన టొమాటోలు ఉపయోగిద్దాం.
-
ఒకవేళ మీకు టొమాటో అంటే ఏంటో తెలీక పోతే,
-
అది ఒక కూరగాయ.
-
ఎర్రగా ఉంటుంది.
-
తింటే చాల బావుంటుంది.
-
తినే ఉంటారులే.
-
ఇప్పుడు నా దగ్గర మూడు టొమాటోలు ఉన్నాయి అనుకోండి.
-
ఒక్కటి, రెండు, మూడు....1 , 2 , 3
-
మీరు నాకు మరో నాలుగు టొమాటోలు ఇచ్చారు అనుకోండి.
-
ఈ నాలుగింటిని పసుపు రంగులో రాస్తాను.
-
ఎందుకంటే మీరు నాకు ఇస్తున్నారు అని తెలుస్తుంది
-
1
-
2
-
3
-
4
-
ఇప్పుడు నా దగ్గర ఎన్ని టొమాటోలు ఉన్నాయి?
-
1, 2, 3, 4, 5, 6, 7 టొమాటోలు
-
కాబట్టి 3 + 4 కూడితే 7
-
ఇప్పుడు నేను మీకు
-
ఇంకొక పద్దతి నేర్పిస్తాను.
-
దీన్ని అంకెల రేఖ అంటారు.
-
నాకు తెలిసి నేను అలాగే ఆలోచిస్తాను.
-
నేను మరచిపోయినప్పుడు, అంటే బట్టీ కొట్టలేదు అనుకోండి,
-
ఈ అంకెల రేఖ మీద అన్ని అంకెలను వరుసలో రాసేస్తాను.
-
ఎంత వీలైతే అంత వరకు.
-
ఎంత వరకు అంటే, నేను వాడబోయే అంకెలన్నీ పట్టేలాగా.
-
మొదటి అంకె సున్నా ఉండాలి.
-
అంటే ఏమి లేవు అని.
-
ఒక వేళ సున్నా గురించి మీకు ముందు తెలీదేమో. ఇప్పుడు తెలుసుకున్నారుగా!
-
అ తర్వాత
-
ఒక్కటి
-
రెండు
-
మూడు
-
నాలుగు
-
ఐదు
-
ఆరు
-
ఏడు
-
ఎనిమిది
-
తొమ్మిది
-
పది
-
అలా వెళ్తూనే ఉంటుంది.
-
పదకొండు
-
ఇప్పుడు 3 + 4 , కాబట్టి ముందుగా 3 తో మొదలు పెడదాం.
-
ఇక్కడ మూడు ఉంది.
-
ఇప్పుడు మనం దానికి 4 ని కూడబోతున్నాం.
-
ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అంకెల రేఖ మీద అలా ముందుకు వెళ్తాము.
-
అంటే, ఈ అంకెల రేఖమీద నాలుగు అంకెలు కుడి వైపుకి వెళ్ళాలి.
-
కాబట్టి, 1 ...2 ...3 ... 4
-
గమనించండి
-
మనం కేవలం 1, 2, 3, 4, అలా పెంచుకుంటూ వెళ్ళాము
-
చివరకు 7 వద్దకు వచ్చేసాం.
-
అదే మన సమాధానం.
-
ఇంకా రెండు కూడికలు చేద్దాం.
-
ఇప్పుడు...
-
8 + 1 ఎంత అన్నాను అనుకోండి.
-
మ్ మ్ 8 ప్లస్ 1
-
ఒక వేళ మీకు సమాధానం ముందే తెలిసి ఉండవచ్చు.
-
8 + 1 అంటే 8 తర్వాత వచ్చే అంకే కదా!
-
మన అంకెల రేఖ మీద చూసారు అనుకోండి, 8 వద్ద మొదలు పెట్టి,
-
1 అంకే లెక్కపెట్టాలి.
-
8ని ఒకటి తో కూడితే 9 వస్తుంది (అంటే 8 + 1 = 9 ).
-
ఇప్పుడు ఇంకొచెం కష్టమైనవి చేద్దాం.
-
ఒకవేళ,
-
ఈ పద్ధతి కొంచెం కష్టంగా ఉంటే,
-
ఆ టొమాటోల పద్ధతినే వాడుకోవచ్చు.
-
లేదా అంకెల రేఖనే చెయ్యొచ్చు.
-
అలా సాధన చేస్తూ ఉంటే , చివరకు
-
ఇవన్నీ మీకు తేలికగా గుర్తుంటాయి.
-
ఆ తర్వాత, ఈ కూడికలన్నీఒక్క సెకనులో చేసేస్తారు.
-
నిజమే, మీరు బాగా అభ్యాసం చెయ్యాలి అంతే.
-
ఇప్పుడు...
-
మళ్ళీ అంకెల రేఖ గీద్దాం.
-
నా దగ్గర, ఆ గీత గియ్యటానికి కావలసిన సామాగ్రి ఉంది.
-
ఇందాకటి నుంచి గీసినట్లుగా.
-
మరీ వంకర టింకరగా ఉండే గీతలు నేను గియ్యకూడదు.
-
ఇది చూడండి...చాల చక్కగా ఉంది.
-
గీస్తాను ఆగండి.
-
ఆహా.
-
సరే. ఈ గీత బావుంది.
-
తర్వాత దీన్ని మళ్ళీ చెరిపి వెయ్యాలంటే మనసు ఒప్పదు.
-
ఇప్పుడు అంకెలు వేద్దాం.
-
0
-
1
-
2
-
3
-
4
-
5
-
6
-
7
-
8
-
9
-
10
-
11
-
12
-
13
-
14
-
15
-
ఇప్పుడు చాల కష్టమైన లెక్క ఒకటి చేద్దాం.
-
ఇప్పుడు.
-
వేరే రంగుల్లో రాద్దాం.
-
5 + 6
-
కావాలంటే, ఈ వీడియోని కొంచెం ఆపి, మీరు ప్రయత్నించండి.
-
మీకు సమాధానం తెలిసే ఉంటుందేమో.
-
ఇది కొంచెం కష్టం అని ఎందుకు అన్నాను అంటే.
-
కూడితే వచ్చే మొత్తం
-
మీ రెండు చేతులకు ఉండే వ్రేళ్ళకంటే ఎక్కువ కాబట్టి.
-
కాబట్టి. వ్రేళ్ళ మీద చెయ్యటం కొంచెం కష్టం.
-
ఇప్పుడు మనము ఈ కూడికను చేద్దాం.
-
ఆ నాకు ఫోన్ వస్తోంది.
-
సర్లే...ఇప్పుడ మాట్లాడను.
-
ఎందుకంటే, నాకు మీరే చాల ముఖ్యం.
-
ఇప్పుడు మనం 5 దగ్గర మొదలు పెడదాం.
-
5 దగ్గర.
-
దానికి 6 ని కలుపుదాం.
-
కాబట్టి, 1
-
2
-
3
-
4
-
5
-
6
-
11 దగ్గరకు వచ్చాం.
-
అంటే, 5 + 6 కూడితే వచ్చేది 11.
-
ఇప్పుడు నేను మిమ్మల్నొక ప్రశ్న అడుగుతాను.
-
6 + 5 ఎంత?
-
ఆ..
-
ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. సరేనా?
-
రెండు అంకెలను ఇటు అటు మారిస్తే
-
ఒకటే సమాధానం వస్తుందా?
-
చేసి చూద్దాం.
-
దీన్ని వేరొక రంగులో చేస్తాను.
-
అప్పుడు మనకు సందేహం ఉండదు.
-
6 దగ్గర మొదలు పెడదాం.
-
ఆ పసుపు రంగుని ప్రస్తుతానికి పట్టించుకోకుండా, 5 ని కూడండి.
-
1 ... 2 ... 3 ... 4 ... 5.
-
నిజమే...ఇప్పుడు మనం అదే చోటకు వచ్చాము.
-
మీరు కూడా దీన్ని ప్రయత్నించండి.
-
రకరకాల కూడికలతో ప్రయత్నించండి.
-
అన్ని సమస్యలకు చక్కగా పనిచేస్తుంది.
-
మీరు అంకెలు తిరగదిప్పినా....సమాధానం ఒక్కటే వస్తుంది.
-
"5 + 6" అన్నా "6 + 5" అన్నా రెండూ ఒక్కటే.
-
అంతే కదా.
-
నా దగ్గర 5 టొమాటోలు ఉంటే మీరు మరో 6 టొమాటోలు ఇచ్చారు అనుకోండి,
-
నా దగ్గర 11 టొమాటోలు ఉంటాయి.
-
అదే, నా దగ్గర 6 టొమాటోలు ఉంటే, మీరు మరో 5 టొమాటోలు ఇచ్చారు అనుకోండి.
-
అప్పుడు కూడా నాకు 11 వస్తాయి...ఎలా కూడినా వచ్చేది అంతే.
-
మరో రెండు చేద్దాం.
-
సంఖ్యా రేఖ భలే ఉంది కదూ?
-
దాన్ని ఉపయోగించి ఇంకొన్ని కూడికలు చేద్దాం.
-
కాని, దాన్ని వాడే కొద్ది
-
మీరు గందరగోళం అనుకుంటారేమో.
-
ఎందుకంటే, నేను రాసిన దాని మీదే రాస్తాను.కానీ --
-
చూద్దాం. ఇప్పుడు నేను తెలుపు రంగు వాడతాను.
-
8 + 7 ఎంత?
-
మీరు గమనిస్తే, 8 ఇక్కడ ఉంది.
-
కదా? మనం ఇప్పుడు 7 ని కూడతాము.
-
1 ... 2 ... 3 ... 4 ... 5 ... 6 ... 7.
-
ఇప్పుడు 15 దగ్గరకు వచ్చాము.
-
కాబట్టి, 8 + 7 = 15
-
దానితో మీకు బాగా అర్థం అయ్యింది అనుకుంటాను.
-
ఇలాంటి సమస్యలు ఎలా చెయ్యాలో తెలిసిపోయిందిగా.
-
కొన్ని రోజుల తరవాత
-
మీరు గుణకారం కూడా నేర్చోకోబోతున్నారు.
-
కాని ఇలాంటి సమస్యలు,
-
మీరు గణితం (mathematics) మొదలు పెట్టినప్పుడు నేర్చోకునేవి.
-
వీటికి చాల అభ్యాసం అవసరం.
-
అయితే కొన్ని లెక్కలకు మీరు సమాధానాలు బట్టీ పట్టాలి.
-
కాని, కొన్నాళ్ళ తర్వాత, తిరిగి చూసుకుంటే.
-
ఇప్పుడు చూసేటప్పుడు ఎలా ఉందో
-
గుర్తు చేసుకోండి.
-
ఒక్క మూడు సంవత్సరాల తర్వాత, మళ్ళీ చూడండి.
-
అప్పుడు మీకు ఇప్పుడు ఎలా అనిపించిందో గుర్తు తెచ్చుకోండి.
-
అప్పుడు అనుకుంటారు "అది చాల సులభమైంది కదా" అని.
-
ఎందుకంటే, మీరు చాలా తొందరగా నేర్చుకుంటారు.
-
చివరకి, మీకు అర్థం అయ్యింది అనుకుంటాను.
-
ఏ కూడిక సమస్యకైనా
-
సమాధానం తెలియక పోతే
-
ఇక్కడ ఇచ్చిన అభ్యాసం లో,
-
"Hints" ని మీరు క్లిక్ చేస్తే అది వృత్తాలు గీస్తుంది.
-
అప్పుడు మీరు ఆ వృత్తాలను లెక్క వేస్తే సరిపోతుంది.
-
మీ అంతట మీరే చెయ్యాలనుకుంటే.
-
మీకు సరిగ్గా రావటానికి,
-
మీరు వృత్తాలను గీయవచ్చు.
-
లేదా అంకెల రేఖను గీయవచ్చు.
-
ఇందాక మన చేసినట్లన్నమాట.
-
ఈ పాటికి మీరు కూడికలు చెయ్యటానికి సిద్ధం గా ఉన్నారని ఆశిస్తున్నాను.
-
దుమ్ము లేపేయండి.