Return to Video

కాస్మాలజీ లెక్చర్ 1

  • 0:13 - 0:24
    సరే, మొదలు పెడదాం. ఈ త్రైమాసికంలో విషయం కాస్మాలజీ.
    కాస్మాలజీ చాలా పాత విషయమే.
  • 0:24 - 0:35
    ఇది వేల ఏళ్ళ నాటిది. ఐతే, అదంతా నేనిపుడు
    చెప్పబోవటం లేదు. వేల ఏళ్ళ కిందటిది అంటే,
    గ్రీకుల నాటిదని నా ఉద్దేశం
  • 0:35 - 0:39
    అంతేగాని, ఇప్పుడు మనం వేల ఏళ్ళ కిందకి
    వెళ్ళబోవటం లేదు.
  • 0:39 - 0:51
    మహా ఐతే, 20 వ శతాబ్దపు
    రెండవ త్రైమాసికానికి వెళ్తాం.
  • 0:51 - 0:56
    విశ్వం విస్తరిస్తోందని హబుల్
    కనుక్కున్న నాటికి వెళ్దాం.
  • 0:56 - 1:00
    అయితే, కాస్మాలజీ శాస్త్రం గురించి కొన్ని
    మాటలు మాత్రం చెప్పుకుందాం
  • 1:00 - 1:05
    కాస్మాలజీ శాస్త్రం కొత్తది. మనకు తెలిసిన
    విషయం వరకూ అయితే అది కొత్తదే.
  • 1:05 - 1:09
    ఒక నిముషం కిందటే చెప్పాను అది చాలా పాతది
    అని. ఒక రకంగా అంతే.
  • 1:09 - 1:12
    కానీ ఆధునిక కాస్మాలజీ మాత్రం చాలా కొత్తది.
  • 1:12 - 1:18
    అది హబుల్ తర్వాత చాలా కాలం తర్వాతదే.
  • 1:18 - 1:29
    3 డిగ్రీల మైక్రోవేవ్ రేడియేషన్ను బిగ్‌బ్యాంగ్ అవశేషంగా కనుక్కున్నపుడు అది మొదలైంది.
  • 1:29 - 1:37
    1960ల్లో జరిగిందది. నేనప్పుడు విద్యార్థిని
  • 1:37 - 1:47
    అంతకు ముందు కాస్మాలజీ, ఒక రకంగా చెప్పాలంటే.. ఫిజిక్సు లాగా కంటే
  • 1:47 - 1:54
    నేచురల్ సైన్సు లాగా ఉండేది. నేచురలిస్టులు
    చేసే పరిశోధనల్లాగా
  • 1:54 - 1:59
    ఇక్కడొక నక్షత్రం, అక్కడొక గాలక్సీ కనబడతై
  • 1:59 - 2:05
    వాటిని వర్గీకరిస్తారు.. వాటికి పేర్లు పెడతారు.. ఖచ్చితంగా
    తెలుసుకొనేందుకు కొన్ని కొలతలు వేస్తారు.
  • 2:05 - 2:14
    కానీ కచ్చితత్వం ఎంత తక్కువగా ఉంటుందంటే..
    అది సరైనదో కాదో తెలుసుకోవడం బహు కష్టం.
  • 2:14 - 2:21
    ఫిజిసిస్టులు ఈ విషయంపై దృష్టి సారించింది
    ఈ మధ్యనే.
  • 2:21 - 2:31
    ఎందుకు దృష్టి పెట్టారంటే, నక్షత్రాలు,
    గాలక్సీలు అన్నీ భౌతిక వ్యవస్థలు కావడమే.
  • 2:31 - 2:37
    వాటికి యాంగులర్ మొమెంటం ఉంటుంది, భౌతిక
    వ్యవస్థలకు ఉండే లక్షణాలన్నీ వాటికీ ఉంటాయి
  • 2:37 - 2:46
    అక్కడ రసాయనాలున్నాయి -అంచేత ఫిజికల్
    కెమిస్టులు దృష్టి పెట్టారు - కానీ యావత్తు విశ్వాన్నీ ఒక భౌతిక వ్యవస్థగా..
  • 2:46 - 2:55
    గణితం ద్వారా భౌతికసూత్రాలు సమీకరణాల ద్వారా
    అధ్యయనం చెయ్యాల్సిన వ్యవస్థగా భావిస్తే
  • 2:55 - 3:01
    - సమీకరణాలు ఎప్పుడూ ఉన్నాయి.
    అయితే తప్పు సమీకరణాలు-
  • 3:01 - 3:08
    సరైన, కచ్చితమైన, పరిశీలనలతో
    సరిపోయే సమీకరణాలు
  • 3:08 - 3:21
    వీటితో కూడిన కాస్మాలజీ ఇటీవలిదే.ఫిజిక్సులో
    నా అనుభవమంత, సుమారు యాభై ఏళ్ళు, అంతే.
  • 3:21 - 3:33
    మనం విశ్వాన్ని ఒక వ్యవస్థగా, సమీకరణాల
    సాయంతో అధ్యయనం చెయ్యబోతున్నాం.
  • 3:33 - 3:38
    మీకు సమీకరణాలు పడకపోతే, మీరు సరైన చోటికి
    రాలేదన్నమాటే. సరే.. ఎక్కడ మొదలెడదాం?
  • 3:38 - 3:52
    కొన్ని పరిశీలనలతో మొదలు పెడదాం. తొట్టతొలి
    పరిశీలన - ఇది పరమ సత్యమేమీ కాదు.
  • 3:52 - 3:59
    ఎందుకంటే ఫిజిక్సు పరమ సత్యమైనదేమీ కాదు
    సుమారుగా సత్యంలా కనిపిస్తుందంతే
  • 3:59 - 4:09
    విశ్వం అనేది ఐసోట్రాపిక్ గా ఉంది. అంటే
    ఈ దిశలో చూసినా, ఆ దిశలో చూసినా
  • 4:09 - 4:16
    అయితే నేరుగా నక్షత్రం వంక చూస్తేను,
    దాన్నుండి దూరంగా చూస్తేనూ భేదం ఉంటుంది
  • 4:16 - 4:27
    కానీ మొత్తమ్మీద, దగ్గరగా ఉన్న విశ్వం నుండి
    మన గాలక్సీ నుండి దూరంగా విశ్వాన్ని చూస్తే
  • 4:27 - 4:33
    విశ్వమంతా ఏ దిశలో చూసినా ఒకేలా కనిస్తుంది.
  • 4:33 - 4:37
    దాన్ని ఐసోట్రాపిక్ అంటారు -ఏ దిశలో చూసినా
    ఒకేలా ఉండటం.
  • 4:37 - 4:44
    మరి, విశ్వం ఐసోట్రాపిక్ గా ఉంటే - ఒక
    మినహాయింపు ఉంది, అది కాసేపట్లో చెబుతాను-
  • 4:44 - 4:55
    ఐసోట్రాపిక్ గా ఉంటే, దాదాపుగా అది
    హోమోజీనియస్‌గా ఉందని కూడా చెప్పొచ్చు.
  • 4:55 - 4:59
    హోమోజీనియస్ అంటే ఏ దిశలోనైనా ఒక్కలాగే
    ఉండటం కాదు, ఏ ప్రదేశంలో చూసినా ఒకేలా ఉండటం
  • 4:59 - 5:11
    ఓ పదహారు గాలక్సీల నుండి చూస్తే కనిపించేది
    ఇక్కడ నుండి చూస్తే ఎలా ఉందో అలానే ఉంటుంది.
  • 5:11 - 5:18
    అన్నిటి కంటే ముందు అసలు, దాని గురించి ఎందుకు?
    ఐసోట్రోపిక్ గా ఉండటం అనేది
  • 5:18 - 5:23
    మీరు సుదూర ప్రదేశానికి వెళ్తే కూడా
    ఒకేలా ఉంటుందని ఎందుకు చెబుతోంది?
  • 5:23 - 5:34
    దానికి జవాబు చాలా సులువు. కొన్ని గాలక్సీలు
    ఉన్నాయనుకోండి.
  • 5:34 - 5:45
    మనం మాట్లాడుకునేది వేటి గురించి అనేది
    ఈ పాఠాల మొదటి భాగంలో పట్టించుకోనక్కర లేదు
  • 5:45 - 5:53
    అవి గాలక్సీలా, పార్టికిల్సా అనేది పట్టించుకో
    నక్కరలేదు. అవి ద్రవ్య కేంద్రాలు అంతే.
  • 5:53 - 6:00
    అవి విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. నేను
    వాటిని పార్టికిల్సని పిలుస్తూ పోవచ్చు కూడా
  • 6:00 - 6:10
    పార్టికిల్సని అన్నానంటే దాని అర్థం
    గాలక్సీలనే. ప్రత్యేకించి నేను చెబితే తప్ప.
  • 6:10 - 6:14
    విశ్వంలో అలాంటివి బోలెడున్నాయి.
  • 6:14 - 6:24
    కనబడే విశ్వంలో ఎన్ని గాలక్సీలున్నాయో
    ఎవరికైనా తెలుసా..?
  • 6:24 - 6:26
    దాదాపు పదివేల కోట్లు (వంద బిలియన్లు): 10 టు ది పవర్ ఆఫ్ 11
  • 6:26 - 6:32
    గుర్తు పెట్టుకోదగ్గ సంఖ్యలు కొన్నున్నాయ్.
    గుర్తు పెట్టుకోవడం మంచి సంగతే.
  • 6:32 - 6:40
    ఖగోళ శాస్త్రానికి తెలిసినంతవరకు,
    టెలిస్కోపులతో మనం చూడగలిగేవి
  • 6:40 - 6:50
    10పవర్11 గాలక్సీలు, ఒక్కో గాలక్సీలో 10పవర్
    11 నక్షత్రాలూ, వెరసి 10పవర్22 నక్షత్రాలు
  • 6:50 - 6:56
    ఒక్కో నక్షత్రానికి పది గ్రహాలుంటే,
    10 టు ది పవర్ ఆఫ్ 23 గ్రహాలు ఉన్నాయి
  • 7:10 - 7:17
    మనం ఇక్కడ ఉండి, ఏ దిశలో చూసినా
    అది ఒకేలా ఉంటుంది అనుకుంటే..
  • 7:17 - 7:21
    అది ఏ దిశలో చూసినా ఒకేలా ఉంటుందనే కాకుండా
  • 7:21 - 7:23
    ఏ ప్రదేశంలో చూసినా ఒకేలా ఉంటుందని
    అంటాన్నేను.
  • 7:23 - 7:27
    ఒకవేళ, ప్రతి ప్రదేశంలోనూ ఒకేలా ఉండదు
    అనుకుంటే దాని అర్థం ఏమిటి..
  • 7:27 - 7:38
    ఐసోట్రోపిక్‌గా ఉండి,హోమోజీనియస్‌గా
    ఉండకుండా ఉండాలంటే, అది వలయాలుగా ఉండాలి
  • 7:38 - 7:42
    ఐసోట్రోపిక్‌గా ఉంటూనే హోమోజీనియస్‌గా
    ఉండకుండా ఉండాలంటే అది అలాగే ఉండాలి..
  • 7:42 - 7:49
    ..ఔను, షెల్స్ లాగా ఉండాలి - ఎవరో షెల్స్
    అన్నట్టున్నారు. షెల్ లాంటి ఆకృతి ఉండాలి.
  • 7:49 - 7:57
    ఎందుకు? కచ్చితంగా షెల్స్ అని కాదు.
    అలాంటి..
  • 7:57 - 8:09
    ఇలాంటి పరిస్థితిలో మీరు ఏదైనా ప్రదేశానికి
    వెళ్ళి చుట్టూచూస్తే ఐసోట్రోపిక్‌గా కనిపించదు
  • 8:09 - 8:17
    ఐసోట్రోపిక్‌గా కనబడాలంటే
    మనం విశ్వానికి కేంద్రస్థానంలో ఉండాలి
  • 8:17 - 8:24
    -మనం విశ్వానికి కేంద్రస్థానంలో ఉంటే, మిగతా ఖగోళ వస్తువులన్నీ యాదృచ్ఛికంగానో, ఎవరో పేర్చినట్టుగానో
  • 8:24 - 8:28
    మనచుట్టూ తిరుగుతూ, చుట్టూ
    అన్నీ సౌష్టవాకృతిలో ఉన్నట్టే.
  • 8:28 - 8:35
    దాన్ని మనం ఒప్పుకోకపోతే, అప్పుడు విశ్వం
    హోమోజీనియస్‌గా ఉందని నమ్మాల్సిందే.
  • 8:35 - 8:39
    హోమోజీనియస్ అంటే, మనం చూసినంత మేరా
  • 8:42 - 8:54
    విశ్వం, పదార్థాలతో (పార్టికిల్స్)
    యూనిఫార్మ్ గా కూడుకుని ఉంది.
  • 8:54 - 8:57
    సమంగా నిండి ఉంది. సరే.
  • 8:57 - 9:02
    దాన్ని కాస్మొలాజికల్ సూత్రం అంటారు.
    ఎందుకది వాస్తవం?
  • 9:02 - 9:11
    ఎందుక్కాదు? అది కాస్మొలాజికల్ సూత్రం కదా.
    అలాంటి వాదన కూడా చేస్తారు కొందరు.
  • 9:11 - 9:18
    అది వాస్తవం ఎందుకంటే అది వాస్తవమని
    పరిశీలించారు కాబట్టి - సుమారుగా!
  • 9:18 - 9:23
    అది ఎంతవరకు సరైనదో నాకు తెలియదు గానీ,
    కొన్ని మీడియాల్లో వచ్చింది..
  • 9:23 - 9:27
    కొంత మంది ఖగోళ శాస్త్రవేత్తలు ఎంత పెద్ద
    ఖగోళ ఆకృతులను చూసారంటే..
  • 9:27 - 9:35
    ఈ బ్లాక్‌బోర్డు కనబడే విశ్వమైతే, ఈ
    మాత్రపు పరిమాణంలో అవి ఉన్నాయట
  • 9:35 - 9:41
    ఇది సంపూర్ణ సమ సౌష్ఠవం అనే ఐడియాకు
    కొంత వ్యతిరేకంగా ఉన్నట్టుగా తోస్తోంది.
  • 9:41 - 9:46
    అయితే, సంపూర్ణ సమ సౌష్ఠవం అనేది
    కచ్చితమైనదేమీ కాదనుకోండి:
  • 9:46 - 9:51
    అక్కడ గాలక్సీలున్నాయంటే దానర్థం
    ఇక్కడ ఇక్కడా ఒకేలా లేవని అర్థం
  • 9:51 - 9:55
    వాస్తవానికి గాలక్సీల సమూహాలు, గాలక్సీల
    మహా సమూహాలూ ఉన్నాయి
  • 9:55 - 9:58
    అంచేత అది నిజంగా హోమోజీనియస్‌గా
    ఉన్నట్టు అనిపించదు,
  • 9:58 - 10:06
    చాలా పెద్ద స్థాయిలో సమూహాల రూపంలో ఉంటుంది.
  • 10:06 - 10:11
    వందల కోట్ల కాంతిసంవత్సరాల పరిమాణంలో.
    బహుశా కాస్త తక్కువ స్థాయిలో;
  • 10:11 - 10:18
    అంత పెద్ద స్థాయిలో సగటున తీసుకుంటే
    అది హోమోజీనియస్‌గా ఉన్నట్టే.
  • 10:18 - 10:22
    సరే.. ఈ వాస్తవం దగ్గర మొదలు పెట్టి
    మనం ముందుకు సాగుదాం.
  • 10:22 - 10:35
    ఓ ఫిజిక్సు సమస్యను లేవనెత్తడంలో
    మొదటి అడుగు ఏమిటి?
  • 10:35 - 10:42
    ఔను, చరరాశులేంటో తెలుసుకోవడం. మామూలుగానైతే
    మీ పెన్సిలు ముక్కు చెక్కుకోవడం
  • 10:42 - 10:49
    ముక్కు చెక్కుకున్నాక.. మీ చరరాశులేంటో
    తెలుసుకోవడంలో మీరు నిపుణులేలే,
  • 10:49 - 11:02
    దీనికంటే ముందు వస్తుందో తరువాత వస్తుందో
    తెలీదు గానీ.. ఒక మంచి ముందడుగు ఏంటంటే..
  • 11:02 - 11:08
    ఔనౌను, నిజమే. మనం వెనక్కి పోతున్నాం.
    కావాలనే కొన్ని దశాబ్దాలు వెనక్కి పోతున్నాం
  • 11:08 - 11:18
    యాభైలు అరవైలు నలభైల కాలానికి పోతున్నాం
  • 11:18 - 11:25
    కాస్మొలాజికల్ సూత్రాన్ని ముందుకు తెచ్చారు.
    తెచ్చే హక్కు వాళ్లకు లేనప్పటికీ
  • 11:25 - 11:30
    వాళ్ళేమన్నారంటే.. "అది హోమోజీనియస్‌గా ఉంది
    దాన్ని కాస్మొలాజికల్ సూత్రం అని అందాం,
  • 11:30 - 11:34
    అది నిజమని ఎలా అంటావు అని ఎవరైనా అడిగితే
    అది సూత్రం కాబట్టి అని చెబుదాం"
  • 11:34 - 11:39
    ఆ తరవాత, మరిన్ని ఖగోళ పరిశీలనలు జరిగాక,
    ఆఖరికి
  • 11:39 - 11:44
    అసలు సంగతిని కాస్మిక్ మైక్రోవేవ్
    బ్యాక్‌గ్రౌండ్ తేల్చేసింది. ఒక రకంగా
  • 11:44 - 11:50
    ఆదిమ ద్రవ్యరాశి చాలా సమంగా విస్తరించి
    ఉండేది. దాని దగ్గరికి తరువాత వద్దాం
  • 11:50 - 12:01
    సరే, సమంగా విస్తరించి ఉన్న - వాయువు
    అనుకుందాం - ఉండేది. అది సమంగా ఉన్న వాయువు.
  • 12:01 - 12:08
    పార్టికిల్ లతో ఉన్న వాయువు. అందులోని ప్రతి
    పదార్థం ఇతర పదార్థాలతో సంపర్కిస్తూండేది
  • 12:08 - 12:14
    స్థూలంగా గాలక్సీలకు ఎలేక్ట్రికల్ ఛార్జి
    లేదు. అవి ఎలక్ట్రికల్‌గా తటస్థం.
  • 12:14 - 12:16
    కానీ అవి గురుత్వంగా తటస్థం కాదు
  • 12:16 - 12:24
    న్యూటోనియన్ గ్రావిటీ ద్వారా సంపర్కిస్తూ
    ఉంటాయి.ఆ స్థాయిలో అదొక్కటే ముఖ్యమైన ఫోర్స్
  • 12:24 - 12:34
    ద్రవ్యరాశి ఎలక్ట్రికల్‌గా తటస్థంగా ఉండే చాలా పెద్ద స్థాయిల్లో,
    ఒకే ఒక్క ముఖ్యమైన ఫోర్సు గురుత్వ బలమే
  • 12:34 - 12:41
    ఈ గురుత్వ బలం ద్రవ్యరాశి అంతటినీ ఒకచోటికి లాగుతుంది. లేదా దాన్ని ఏదో రకంగా ప్రభావితం చేస్తుంది. కానీ ఇది కాస్త తికమకగా ఉంటుంది
  • 12:41 - 12:48
    ఇదిగో ఇక్కడ ఉన్న ఈ బిందువుకు
    ఏం జరుగుతుంది?
  • 12:48 - 12:54
    అది కేంద్రం వైపుకు త్వరణంతో కదులుతుందా -
    ఎందుకంటే కేంద్రం వద్ద ద్రవ్యరాశి పెద్ద మొత్తంలో ఉంది.
  • 12:54 - 13:01
    లేక..,ఇక్కడికి కదులుతుందా-ఎందుకంటే ఇక్కడ
    ఎంత ద్రవ్యం ఉందో ఇక్కడా అంతే ద్రవ్యం ఉంది.
  • 13:01 - 13:05
    నిజానికి అది ఎటైనా కదలవచ్చు అనిపిస్తోంది
  • 13:05 - 13:09
    ఒక వైపున ఎంత ఉందో రెండో వైపున కూడా అంతే
    ఉంది కాబట్టి అది కదలకుండా అక్కడే ఉండాలి
  • 13:09 - 13:11
    అది అక్కడే ఉండాలి
  • 13:11 - 13:17
    ఇక్కడున్న దాని సంగతేంటి? దీని పరిస్థితీ
    అంతే! ఏ రెండు ప్రదేశాలైనా సమానమే కాబట్టి
  • 13:17 - 13:23
    కాబట్టి సహజంగా అనుకునేది ఏంటంటే,
    విశ్వం స్టాటిక్‌గా ఉండి ఉండాలి అని
  • 13:23 - 13:31
    ఉన్నచోటనే ఉండాలి. ఎందుకంటే దాన్ని ఒకవైపుకో
    మరోవైపుకో కదిలించే బలమేమీ లేదు కాబట్టి
  • 13:31 - 13:38
    అది తప్పు. ఇవ్వాళ కాస్మాలజీకి సంబంధించిన
    న్యూటోనియన్ సూత్రాలు తెలుసుకుందాం.
  • 13:39 - 13:48
    విశ్వం విస్తరిస్తోందనే సంగతిని వినే ఉంటారు
  • 13:48 - 13:53
    ఐన్‌స్టీన్ జనరల్ సాపేక్షతా సిద్ధాంతం
    చెప్పేదాకా అది అర్థం కాలేదని కూడా
  • 13:53 - 13:55
    వినే ఉంటారు. అది అవాస్తవం.
  • 13:55 - 14:01
    చారిత్రికంగా అది వాస్తవం కావచ్చు,
    సంవత్సరాల లెక్కన అది వాస్తవమే.
  • 14:01 - 14:08
    ఐన్‌స్టీన్ సాపేక్షతా సిద్ధాంతాన్ని
    చెప్పేదాకా విస్తరిస్తున్న విశ్వాన్ని
  • 14:09 - 14:15
    పూర్తిగా అర్థం చేసుకోలేదన్నది వాస్తవం తేదీ
    ప్రకారం ఇది వాస్తవమే, తార్కికంగా కాదు.
  • 14:15 - 14:19
    విస్తరిస్తున్న విశ్వాన్ని న్యూటన్
    చెప్పగలిగి ఉండేవాడు
  • 14:19 - 14:30
    న్యూటన్ చెప్పలేదు, మనం చెబుదాం. ఇంకాస్త
    తెలివైనవాడై ఉంటే అతడు ఎలా చెప్పేవాడో అలా
  • 14:30 - 14:35
    ముందుగా, మీ చరరాశులేవో తెలుసుకోవాల్సిందే,
  • 14:35 - 14:45
    అయితే మొదటి అడుగేంటంటే సమస్య లోకి
    ఆర్డినేట్ లను చొప్పించడం
  • 14:45 - 14:48
    దానర్థం ఎప్పుడూ ఉండే అర్థమే:
  • 14:48 - 14:57
    ఖగోళాన్ని మూడు డైమెన్షన్ల కోఆర్డినేట్లుగా
    విభజించాలి. నేను రెండే గీస్తున్నాను
  • 14:57 - 15:04
    అంటే: ఒక కాల్పనిక కోఆర్డినేట్ల
    గ్రిడ్‌ను చేర్చాలి
  • 15:04 - 15:12
    ఈ గ్రిడ్‌లో పక్క పక్కన ఉన్న బిందువుల
    మధ్య దూరాన్ని ఎంత తీసుకోవాలి?
  • 15:12 - 15:19
    ఒక మీటరుగా తీసుకోవచ్చు పది మీటర్లు,
    మిలియన్ మీటర్లు ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు
  • 15:19 - 15:24
    అయితే ఈ బిందువుల మధ్య దూరాన్ని
    నిశ్చయించుకునే కంటే తెలివైన పని ఒకటుంది.
  • 15:24 - 15:34
    తెలివైన పని ఏంటంటే, ఇలా ఊహించండి.. ఈ పాయింట్లు ఎల్లప్పుడూ
  • 15:34 - 15:38
    అదే గాలక్సీల గుండా పోతాయని అనుకోండి.
  • 15:38 - 15:47
    మరోలా చెప్పాలంటే, గాలక్సీలే గ్రిడ్‌ను
    రూపొందిస్తాయి.
  • 15:47 - 15:53
    అవి ఈ గ్రిడ్‌ను ఎలా రూపొందిస్తాయంటే,
    ఏం జరిగినా సరే..
  • 15:53 - 15:56
    గాలక్సీలన్ని సమ సౌష్ఠవంలో ఉంటాయి కాబట్టి
  • 15:56 - 16:03
    ఇక్కడున్న గాలక్సీ ఎప్పుడూ గ్రిడ్ లోని అదే
    బిందువు వద్దనే ఉంటుంది
  • 16:03 - 16:08
    ఇక్కడున్న గాలక్సీ గ్రిడ్ లోని ఈ బిందువు
    వద్దనే ఉంటుంది
  • 16:08 - 16:16
    అంటే దానర్థం, విశ్వం వ్యాకోచించినా,
    సంకోచించినా గ్రిడ్ కూడా వ్యాకో..
  • 16:16 - 16:20
    దీన్ని మరో రకంగా చెబుతాను. గాలక్సీలు
    ఒకదాని కొకటి సాపేక్షంగా కదులుతూ ఉంటే,
  • 16:20 - 16:23
    -ఒకదాన్నుంచి ఒకటి దూరంగానో దగ్గరగానో -
  • 16:23 - 16:25
    అప్పుడు గ్రిడ్ కూడా వాటితో పాటు కదులుతుంది
  • 16:25 - 16:32
    కోఆర్డినేట్లను ఎలా ఎంచుకుందామంటే గాలక్సీలు
    గ్రిడ్‌లో ఘనీభూతమై ఉంటాయన్నమాట
  • 16:32 - 16:37
    అది చెయ్యడం తేలికేమీ కాదు
  • 16:37 - 16:44
    గాలక్సీలు కొన్ని ఇలా కదులుతూ, కొన్ని అలా,
    కొన్ని ఇలా కదులుతూ ఉంటే
  • 16:44 - 16:48
    ఇష్టం వచ్చినట్లుగా కదులుతూ ఉంటే
  • 16:48 - 16:57
    కోఆర్డినేట్లను గాలక్సీలకు అతికించి
    ఉంచడం కుదరదు.
  • 16:57 - 17:01
    ఎందుకంటే ఒకే బిందువు వద్ద ఒక్కోటి
    ఒక్కో రకంగా కదులుతుంది
  • 17:01 - 17:07
    కానీ అంతరిక్షంలోకి చూసినపుడు అదికాదు
    మనకు కనిపించేది.
  • 17:07 - 17:16
    అవి ఒకదానికొకటి పొందికగా కదులుతూ ఉన్నట్టే
    ఉంటాయి. ఒక గ్రిడ్‌లో ఘనీభూతమై ఉన్నట్లుగా
  • 17:16 - 17:22
    బహుశా గ్రిడ్ విస్తరిస్తున్నట్లుగానో,
    సంకోచిస్తున్నట్లుగానో కనిపిస్తుంది - సరే.. దాని సంగతి తరువాత చూద్దాం
  • 17:22 - 17:27
    గ్రిడ్ ఘనీభూతమై ఉన్నట్లు ఉంటుంది.
  • 17:27 - 17:34
    ఇక్కడ జరిగే ప్రతీ చలనమూ
    గ్రిడ్ విస్తరించడం వలన గానీ,
    సంకోచించడం వలన గాని.
  • 17:35 - 17:41
    ఇరుగు పొరుగున ఉన్న గాలక్సీల సాపేక్ష చలనం
    గురించిన పరిశీలన అది
  • 17:41 - 17:48
    ఇక్కడ ఇక్కడా ఉన్న గాలక్సీలు ఒకదాని కొకటి
    సాపేక్షంగా గొప్ప వేగంతో ఏమీ కదలడం లేదు
  • 17:48 - 17:54
    చక్కగా, పొందికగా కదులుతున్నాయి
  • 17:54 - 18:01
    ఇక, మనం కోఆర్డినేట్లను ఎంచుకుందాం. వాటిని x, y, z అని అందాం.
  • 18:01 - 18:12
    కానీ x, y, z లను దూరాలుగా కొలవడం లేదు.
    ఎందుకంటే గ్రిడ్ పొడవు కాలంతో మారుతూంటుంది.
  • 18:12 - 18:22
    గాలక్సీలు గ్రిడ్‌లో ఎక్కడున్నాయనే దాన్నిబట్టి
    వాటికి పేర్లు పెట్టాం. ఇప్పుడొక ప్రశ్న:
  • 18:22 - 18:24
    ఈ దూరం..
  • 18:24 - 18:33
    ఇక్కడున్న రెండు బిడువులు ఒకదాని కొకటి x దూరంలో ఉన్నాయనుకుందాం. ఆ x దూరాన్ని delta-x అనుకుందాం
  • 18:33 - 18:35
    అవి ఎంత దూరంలో ఉన్నాయి?
  • 18:35 - 18:41
    అవి ఎంత దూరంలో ఉన్నాయో ఇంకా తెలియదు. కానీ వాటి మధ్య దూరం ఎంత ఉందో నేను సూత్రికరించబోతున్నా,
  • 18:41 - 18:48
    -వాస్తవ దూరం, మీటర్లలో, లేదా స్కేలుతో కొలిచే ఏదో ఒక కొలతలో-
  • 18:48 - 18:51
    ఒక్కో వైపు ఒక కాంతిసంవత్సరం ఉండొచ్చు,
  • 18:51 - 18:53
    ఒక మిలియను కాంతిసంవత్సరాలు ఉండొచ్చు
  • 18:53 - 19:00
    వాస్తవ దూరం delta-x కు అనుపాతంలో ఉంటుంది
  • 19:00 - 19:03
    ఇదిగో ఇక్కడున్న ఇద్దరి మధ్య దూరం,
    ఈ ఇద్దరి మధ్య ఉన్న దూరంలో సగం ఉంటుంది.
  • 19:03 - 19:06
    ఈ ఇద్దరి మధ్య ఉన్న దూరంలో
    మూడో వంతు ఊంటుంది.
  • 19:06 - 19:15
    ఇది ఒక పారామీటరు ఇంటూ delta-x కు అనుపాతంలో
    ఉంటుంది. దాన్ని స్కేల్ పారామీటరు అంటారు.
  • 19:15 - 19:20
    ఈ స్కేల్ పారామీటరు స్థిరాంకం కావచ్చు
    కాకపోనూ వచ్చు.
  • 19:20 - 19:27
    అది స్థిరాంకం కావచ్చు. అది స్థిరాంకమైతే
    గాలక్సీల మధ్య దూరం
  • 19:27 - 19:31
    గ్రిడ్‌లో స్థిరంగా ఉంటుంది, కాలంతో పాటు
    మారదు, స్థిరంగా ఉంటుంది.
  • 19:31 - 19:36
    కానీ, అది కాలానుగుణంగా మారుతూనూ ఉండొచ్చు.
    దానికి అవకాశం ఇద్దాం.
  • 19:36 - 19:43
    అంటే రెండు గాలక్సీల మధ్య దూరం,
    ఈ గాలక్సీని a అందాం, దీన్ని b అందాం,
  • 19:43 - 19:53
    a కి b కి దూరం a(t)ఇంటూ delta-x ab.delta-x
    అంటే ఈ రెంటి మధ్య ఉన్న కోఆర్డినేట్ దూరం
  • 19:53 - 19:57
    మరింత జనరల్‌గా రాస్తాను
  • 19:58 - 20:05
    రెండు గాలక్సీలు గ్రిడ్‌లో ఏవో
    రెండు స్థానాల్లో ఉన్నాయనుకుందాం
  • 20:05 - 20:10
    ఆ రెండింటి మధ్య దూరం..
  • 20:10 - 20:18
    Dab ఈజ్ ఈక్వల్ టు a(t) - అదే a(t), ఆ తర్వాత స్క్వేర్ రూట్ - పైథాగరస్ సిద్ధాంతం-
  • 20:18 - 20:26
    delta-x స్క్వేర్డ్, ప్లస్ delta-y స్క్వేర్డ్, ప్లస్ delta-z స్క్వేర్డ్
  • 20:26 - 20:32
    మరోలా చెప్పాలంటే, గ్రిడ్ లో దూరాన్ని గ్రిడ్ యూనిట్లలో కొలిచి, a (t) తో హెచ్చవేస్తే
  • 20:32 - 20:38
    రెండు బిందువుల మధ్య వాస్తవ దూరం వస్తుంది.
  • 20:38 - 20:42
    ముందే నేను చెప్పినట్లు, a(t) అనేది కాలంతో పాటు స్థిరంగా ఉండొచ్చు, ఉండకపోనూ వచ్చు
  • 20:42 - 20:49
    అయితే అది స్థిరంగా లేదు. ఉంటే గనక, గాలక్సీలు అంతరిక్షంలో స్థిరంగా ఘనీభూతమై ఉన్నట్లే, చలనం లేనట్లే.
  • 20:49 - 20:54
    కానీ మనం చూస్తున్నది అది కాదు, అవి ఒకదాన్నుంచి ఒకటి దూరంగా జరుగుతూ ఉన్నాయి.
  • 20:54 - 21:05
    సరే, ఇక లెక్క చేద్దాం, గాలక్సీ a, గాలక్సీ b ల మధ్య వేగం
  • 21:05 - 21:13
    ఇది గాలక్సీ a దూరం - ఓ.. ఇది delta-a-b.. దూరం.. దూరానికి కోఆర్డినేట్..
  • 21:13 - 21:22
    ఇదిగో ఈ తేలిక సూత్రాన్ని వాడదాం. పైథాగరస్‌ను కాసేపు పక్కన పెడదాం. x-యాక్సిస్ ను మాత్రమే తీసుకుందాం. దాని వలన ఇబ్బందేమీ లేదు.
  • 21:24 - 21:32
    ఇదిగో ఇది D ab. a b గాలక్సీల సాపేక్ష వేగం ఏమిటి?
  • 21:32 - 21:38
    అది దీని టైం డెరివేటివ్, అంతే కదా? దూరం యొక్క టైం డెరివేటివే వేగం.
  • 21:38 - 21:44
    a, b ల మధ్య వేగం, టైం డెరివేటివ్ కు సమానం, వీటిలో మారుతున్నది ఏంటి అంటే
  • 21:44 - 21:53
    a b లకు.. a, b లు గ్రిడ్‌లో స్థిరంగా ఉన్నాయి.. delta-x మారదు, అది స్థిరం..
  • 21:53 - 22:00
    మారేది కేవలం a మాత్రమే. అంచేత వేగం a యొక్క డెరివేటివే
  • 22:00 - 22:05
    a dot అంటే a యొక్క టైం డెరివేటివ్
  • 22:06 - 22:15
    a dot ఇంటు delta-x. నేను చేసిందల్లా ఈ సూత్రాన్ని టైంతో డిఫరెన్షియేట్ చెయ్యడమే
  • 22:15 - 22:20
    వేగం, దూరాల నిష్పత్తిని ఇలా రాయవచ్చు
  • 22:20 - 22:23
    a ని వదిలేద్దాం.. వద్దొద్దు ఉంచుదాం.. a b..
  • 22:23 - 22:32
    వేగం, దూరాల నిష్పత్తి అంటే a-dot, a ల నిష్పత్తే
  • 22:35 - 22:43
    delta-x రద్దయిపోయింది, చూడండి. ఇది భలే ఉంది, అంటే దూర, వేగాల నిష్పత్తి
  • 22:43 - 22:50
    ఏ రెండు గాలక్సీలు అనేదానిపై ఆధారపడి లేదు. ప్రతీ జత గాలక్సీలు
  • 22:50 - 22:55
    అవి ఎంత దూరంగా ఉన్నా, ఎంత దగ్గరగా ఉన్నా, ఒకదానికొకటి ఎంత కోణంలో ఉన్నా
  • 22:55 - 22:58
    ఆ రెంటి మధ్య సాపేక్ష వేగం
  • 22:58 - 23:04
    సాపేక్షంగా దూరంగా కదలడం, లేదా వ్యతిరేక దిశలో కదలడం
  • 23:04 - 23:10
    వేగం, దూరాల నిష్పత్తి a-dot బై a
  • 23:12 - 23:16
    దీన్నొకసారి చూడండి, దీని పేరేంటి, ఎవరికైనా తెలుసా?
  • 23:16 - 23:23
    హబుల్ కాన్‌స్టంట్. దీన్ని హబుల్ కాన్‌స్టంట్ అంటారు. దీన్ని H అందాం
  • 23:23 - 23:29
    మరి, ఇది స్థిరాంకం అవడానికి కారణ మేమైనా ఉందా? దాన్ని స్థిరాంకం అంటున్నామంటే దానర్థం ఏమిటి?
  • 23:29 - 23:35
    అది టైంతో సంబంధం లేకుండా ఉండాల్సిన కారణమేమీ లేదు. ఉండదు కూడా.
  • 23:35 - 23:42
    ఇక్కడ మనం కనుక్కున్న దేంటంటే, అది x నుండి స్వేచ్ఛగా ఉంది.
  • 23:42 - 23:46
    మీరు ఎక్కడున్నారో, ఏ రెండు గాలక్సీల గురించి మాట్లాడుతున్నారో సంబంధం లేదు,
  • 23:46 - 23:57
    అదే హబుల్ స్థిరాంకం. ఏదైనా ఒక సమయానికి, అంచేత హబుల్ స్థిరాకం అనేది ఒక రకంగా సరైన పేరు కాదు.
  • 23:57 - 24:00
    హబుల్...
  • 24:00 - 24:06
    హబుల్ పరామితి, హబుల్ ప్రమేయం. అది స్థానంతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా ఉంటుంది.
  • 24:06 - 24:08
    కానీ కాలం పై ఆధారపడి ఉంటుంది.
  • 24:08 - 24:10
    ఇప్పుడు దీన్ని ప్రామాణిక రూపంలో రాద్దాం.
  • 24:10 - 24:13
    విశ్వంలోని ఏ రెండు గాలక్సీల మధ్య..
  • 24:13 - 24:18
    వేగమైనా
  • 24:18 - 24:23
    అదే హబుల్ పరామితి ఇంటూ
  • 24:23 - 24:26
    ఆ రెంటి మధ్య దూరానికి సమానంగా ఉంటుంది
  • 24:26 - 24:30
    ఇదే హబుల్ సూత్రపు డెరివేషను.
  • 24:30 - 24:40
    విద్యార్థి ఎవరో ఒక ప్రశ్న అడుగుతున్నాడు
  • 24:40 - 24:43
    ఔనౌను. నిజం.
  • 24:43 - 24:44
    ఔను.
  • 24:45 - 24:47
    హబుల్ సూత్రం నిజమేనని
  • 24:47 - 24:51
    హబుల్ కనుక్కోకపోయి ఉంటే..
  • 24:51 - 24:52
    వీటిని రాసేవాళ్ళమే కాదు
  • 24:53 - 24:55
    అయితే, ఇంకో వైపు, హబుల్ సూత్రం
  • 24:55 - 24:58
    అంత ఆశ్చర్యకరమైనదేమీ కాదు
  • 24:58 - 25:02
    ఓ పెద్దాయన చెప్పాడు.. అన్నిటికంటే వేగంగా పరుగెత్తే గుర్రం
  • 25:02 - 25:05
    అన్నిటి కంటే దూరం పోతుంది అని.
  • 25:05 - 25:06
    సరే.
  • 25:08 - 25:12
    ఎంత వేగంగా వెళ్తే అంత దూర దూరంగా వెళ్తారు.
  • 25:12 - 25:15
    ఇది చెబుతున్నదదే. అయితే
  • 25:16 - 25:20
    ఒక ఆసక్తికరమైన సంగతేంటంటే..ఈ సూత్రానికీ
  • 25:20 - 25:24
    హబుల్ సూత్రానికీ, నువ్వు చెప్పినట్లే, దగ్గరి సంబంధం ఉంది
  • 25:25 - 25:28
    అయితే, గ్రిడ్‌లో ప్రతీదీ కదులుతున్నదని ఇది చెబుతుంది
  • 25:28 - 25:31
    గ్రిడ్ సైజు స్కేలు
  • 25:31 - 25:35
    కాలానుగుణంగా మారవచ్చు మారకపోనూ వచ్చు
  • 25:35 - 25:38
    అయితే అది కాలానుగుణంగా మారుతున్నది లెండి
  • 25:38 - 25:42
    హబుల్ స్థిరాంకం అనేది a కి
  • 25:42 - 25:45
    a యొక్క కాల డెరివేటివ్‌కూ
    మధ్య ఉన్న నిష్పత్తే
  • 25:47 - 25:50
    సరే, వాస్తవాలివి. వాస్తవాలు ఇవే.
  • 25:51 - 25:53
    హబుల్ కనుక్కున్న వాస్తవాలు ఇవే.
  • 25:53 - 25:57
    థియొరెటికల్ కాస్మాలజిస్టులు పనిచేసేది దీని పైనే
  • 25:58 - 26:02
    దీని గురించి మరికొన్ని సంగతులు
    చెప్పుకుందాం
  • 26:07 - 26:11
    ఒక ప్రాంతంలో ఉండే ద్రవ్యరాశి సంగతేంటి..
  • 26:11 - 26:16
    delta-x delta-y delta-z పరిమాణమున్న
    ప్రాంతాన్ని తీసుకుందాం
  • 26:18 - 26:21
    నా ఉద్దేశం ఒక ఈ మాత్రం పెద్ద ప్రాంతం..
  • 26:21 - 26:24
    నా విశ్వం ఎక్కడుంది..
  • 26:24 - 26:26
    ఇదిగో ఇక్కడుంది నా విశ్వం
  • 26:27 - 26:32
    చిన్నపాటి పరిమాణాలను సరాసరి చేసేంత
  • 26:32 - 26:34
    పెద్దది అనుకుందాం
  • 26:34 - 26:37
    అక్కడ ద్రవ్యరాశి ఎంత ఉంది
  • 26:39 - 26:43
    అక్కడున్న ద్రవ్యరాశి
  • 26:44 - 26:48
    Dx, Dy, Dz లకు అనుపాతంలో ఉంటుంది
  • 26:48 - 26:51
    ప్రాంతం ఎంత పెద్దదైతే, ద్రవ్యరాశి అంత ఎక్కువ ఉంటుంది
  • 26:51 - 26:55
    ద్రవ్యరాశి ఎంత అంటే, దాన్ని nu అందాం
  • 26:55 - 26:59
    nu అంటే ఒక యూనిట్ ఘనపరిమాణపు గ్రిడ్‌లో
  • 26:59 - 27:01
    ఉన్న ద్రవ్యరాశి
  • 27:01 - 27:05
    కానీ ఘనపరిమాణాన్ని మీటర్లలో కొలవటం లేదు
  • 27:05 - 27:07
    x తో కొలుస్తున్నాం
  • 27:08 - 27:10
    అంచేత
  • 27:11 - 27:17
    delta-x delta-y delta-z ఘనపరిమాణపు ప్రాంతంలోని ద్రవ్యరాశి
  • 27:18 - 27:22
    మరి, ఆ ప్రాంతపు వాస్తవ ఘనపరిమాణం ఎంత
  • 27:22 - 27:25
    ఇలా అందాం.., అదే ప్రాంతపు ఘనపరిమాణం
  • 27:25 - 27:30
    ఆ ప్రాంతపు ఘనపరిమాణం
    delta-x delta-y delta-z కాదు
  • 27:30 - 27:31
    ఎందుకు?
  • 27:32 - 27:36
    x-అక్షం, y-అక్షం, z-అక్షం
    ల వెంట దూరం
  • 27:37 - 27:41
    delta-x కాదు, a ఇంటూ delta-x
  • 27:42 - 27:45
    దానర్థం, ఆ గడి యొక్క ఘనపరిమాణం
  • 27:46 - 27:52
    ఆ గడి యొక్క ఘనపరిమాణం a^3 ఇంటూ
    delta-x delta-y delta-z
  • 27:52 - 27:55
    సరేనా?
  • 27:56 - 28:00
    ఎందుకంటే, x-అక్షం వెంట దూరం
  • 28:00 - 28:03
    a ఇంటూ delta-x q ఇంటూ delta-y a ఇంటూ
    delta-z
  • 28:03 - 28:07
    ఇప్పుడు ద్రవ్య సాంద్రతకు (డెన్సిటీ)
    సూత్రం రాద్దాం
  • 28:07 - 28:10
    సాంద్రత అంటే ఈ ఉద్దేశం ద్రవ్యరాశి యొక్క
    భౌతిక సాంద్రత
  • 28:10 - 28:14
    ఒక క్యూబిక్ కిలోమీటరుకు, లేదా క్యూబిక్
    కాంతిసంవత్సరానికి ఎంత ద్రవ్యరాశి ఉంది
  • 28:14 - 28:15
    లేదా మరేదైనా కొలత కావచ్చు
  • 28:15 - 28:18
    యూనిట్లు మనం ఇంకా అనుకోలేదు
  • 28:18 - 28:20
    యూనిట్లు తరవాత చెప్పుకుందాం
  • 28:20 - 28:22
    సరే, మీటర్లు బానే ఉంది
  • 28:22 - 28:25
    మీటర్, సెకండ్, కిలోగ్రాము బానే ఉన్నాయి
  • 28:25 - 28:27
    ద్రవ్యరాశిని కిలోగ్రాముల్లో
  • 28:27 - 28:30
    ఘనపరిమాణాన్ని క్యూబిక్ మీటర్లలోను
    కొలవొచ్చు
  • 28:30 - 28:32
    సాంద్రత అంటే ఏమిటి?
  • 28:32 - 28:36
    అవును. సాంద్రత అందాం, సాంద్రతకు
    ప్రామాణిక సూచిక rho
  • 28:36 - 28:38
    అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు
  • 28:38 - 28:40
    సాంద్రతను rho తో సూచిస్తాం
  • 28:40 - 28:44
    ఇక్కడ రాద్దాం, సాంద్రత
  • 28:44 - 28:48
    సాంద్రత అంటే, క్యూబిక్ మీటర్లకు
    కిలోగ్రాములు అనుకోవచ్చు
  • 28:48 - 28:51
    ద్రవ్యరాశి, ఘనపరిమాణాల నిష్పత్తి అది
  • 28:53 - 28:55
    అది ద్రవ్యరాశి, ఘనపరిమాణాల నిష్పత్తి
  • 28:55 - 28:59
    ఇక్కడున్న nu డివైడెడ్ బై a^3
  • 29:02 - 29:07
    అది మన సూత్రం, nu డివైడెడ్ బై a^3
  • 29:08 - 29:11
    ఇక, ఇక్కడున్న ఒక్కో గడి లోని ద్రవ్యరాశి
  • 29:12 - 29:15
    స్థిరంగా ఉంటుంది
  • 29:15 - 29:19
    ఎందుకలా? ఎందుకంటే, గాలక్సీలు గ్రిడ్‌తో
    కదులుతాయి కాబట్టి
  • 29:19 - 29:24
    అంటే, గ్రిడ్ లోని ఏదైనా ఒక ప్రాంతంలోని
    ద్రవ్యరాశి మారదు
  • 29:25 - 29:29
    దాన్నే nu అని నేను అన్నాను, గ్రీక్ అక్షరం
    nu
  • 29:30 - 29:32
    సాంద్రత కావాలంటే దాన్ని ఘనపరిమాణంతో
    భాగించాలి
  • 29:32 - 29:34
    a కాలంతో పాటు మారుతూ ఉంటే
  • 29:34 - 29:36
    సాంద్రత కాలానుగుణంగా మారుతూంటుంది
  • 29:36 - 29:41
    అది స్పష్టమే, విశ్వం విస్తరిస్తూంటే,
    సాంద్రత తగ్గుతూంటుంది
  • 29:41 - 29:45
    విశ్వం కుంచించుకు పోతే,
    సాంద్రత పెరుగుతుంది
  • 29:45 - 29:49
    ముందు ముందు మనం వాడబోయే సూత్రం ఇదే
  • 29:57 - 29:59
    సరే, ఇప్పటి వరకూ..
  • 29:59 - 30:03
    యూక్లిడ్ చెయ్యలేనిదేదీ ఇంతవరకూ మనం చెయ్యలా
  • 30:03 - 30:06
    న్యూటన్ అవసరమే రాలేదింతవరకు.
  • 30:06 - 30:08
    ఇప్పుడు న్యూటన్ ప్రవేశిస్తున్నాడు
  • 30:08 - 30:10
    న్యూటన్ ఏమన్నాడంటే, చూడండీ
  • 30:10 - 30:12
    ఆటలాడొద్దు
  • 30:12 - 30:14
    ఇవన్నీ మర్చిపోదాం..
  • 30:14 - 30:18
    విశ్వం హోమోజీనియస్‌గా ఉందనీ..
    ఇలాంటివన్నీ అనుకుందాం
  • 30:18 - 30:21
    కానీ న్యూటన్ స్వాతిశయం గల మనిషి
  • 30:21 - 30:25
    తాను విశ్వానికి కేంద్రంలో ఉన్నానని
    అనుకునేవాడు
  • 30:26 - 30:29
    సహజంగానే అతను ఇలా భావిస్తాడు ..
  • 30:29 - 30:32
    నేను, ఐజాక్ న్యూటన్
  • 30:34 - 30:35
    ఆరిజిన్ దగ్గర ఉన్నాను.
  • 30:36 - 30:39
    మనకు తెలుసు, న్యూటన్‌కు కూడా
    తెలిసే ఉంటుంది
  • 30:40 - 30:42
    అతడు తెలివైనవాడయితే
  • 30:42 - 30:44
    ఇవే సమీకరణాలు అతడికీ వచ్చి ఉండేవి
  • 30:44 - 30:46
    అతను ఎక్కడున్నా సరే!
  • 30:46 - 30:49
    న్యూటను, మనమూ విశ్వానికి కేంద్రం
    వద్ద ఉన్నామని
  • 30:51 - 30:55
    అనుకుని గ్రిడ్‌ను రూపొందించుకోవడంలో
    తప్పేమీ లేదు
  • 30:55 - 30:56
    సరే
  • 30:57 - 31:01
    న్యూటన్ చుట్టూ.., పైగా
  • 31:07 - 31:11
    తాను కదలకుండా ఉన్నాననికూడా న్యూటన్ అంటాడు
  • 31:11 - 31:13
    నేను కదలడం లేదు, స్థిరంగా నిలబడి ఉన్నాను.
  • 31:15 - 31:18
    న్యూటన్ విశ్వకేంద్రం వద్ద స్థిరంగా ఉన్నాడు
  • 31:18 - 31:21
    లెక్క కోసం
  • 31:22 - 31:24
    ఇప్పుడు అతనికేం కావాలంటే,
  • 31:25 - 31:27
    మనం మాట్లాడుకునే స్కేలులో
  • 31:27 - 31:30
    ప్రతిదీ సమంగా విస్తరించి ఉంది
  • 31:31 - 31:35
    ఇప్పుడతడు ఒక సుదూర గాలక్సీని చూస్తాడు
  • 31:36 - 31:39
    ఇదుగో ఈ గాలక్సీని చూస్తాడు
  • 31:42 - 31:45
    ఆ గాలక్సీ ఎలా కదులుతుందో
    తెలుసుకోవాలనుకుంటాడు
  • 31:46 - 31:50
    న్యూటన్ సమీకరణాలకు లోబడి కదులుతుంది
  • 31:54 - 31:58
    ప్రతిది ప్రతీదాన్నీ ఆకర్షిస్తుందని న్యూటన్
    సమీకరణాలు చెబుతాయి
  • 31:58 - 32:02
    న్యూటన్ సిద్ధాంతంలో ఒక ప్రత్యేకత ఉంది
  • 32:02 - 32:04
    న్యూటన్‌కు ఈ సిద్ధాంతం తెలుసు
  • 32:04 - 32:06
    నిజానికి దాన్ని న్యూటన్ సిద్ధాంతం అంటారు
  • 32:06 - 32:08
    న్యూటన్ సిద్ధాంతం ఏం చెబుతోందంటే
  • 32:08 - 32:13
    ఒక వ్యవస్థపై ఉన్న గురుత్వ బలం ఏమిటో
    తెలుసుకోవాలంటే
  • 32:13 - 32:16
    అంతా ఐసోట్రోపిక్‌గా ఉంది కాబట్టి
  • 32:16 - 32:19
    హోమోజీనియస్‌గా ఉండాల్సిన అవసరం కూడా లేదు
  • 32:19 - 32:21
    అంతా ఐసోట్రోపిక్‌గా ఉంది కాబట్టి
  • 32:21 - 32:22
    మనకు తెలియాల్సింది
  • 32:22 - 32:25
    ఒక రిఫరెన్స్ ఫ్రేములో ఉన్న గురుత్వ బలం..
  • 32:25 - 32:28
    ఇక్కడ నేను గీసినది.. మనకు తెలియాల్సింది
  • 32:28 - 32:31
    ఆ పార్టికిల్ మీద ఉన్న గురుత్వ బలం ఎంత అని
  • 32:32 - 32:35
    ఒక గోళాన్ని గీయండి
  • 32:38 - 32:41
    ఆ పార్టికిల్ ఆ గోళంపై ఉండేలా,
  • 32:42 - 32:45
    కేంద్రం ఆరిజిన్ దగ్గర ఉండేలా.
  • 32:45 - 32:49
    ఆ గోళం లోపల ఉన్న ద్రవ్యరాశి అంతా
  • 32:49 - 32:53
    అదంతా ఆరిజిన్ దగ్గర కేంద్రీకరించి
    ఉందని భావించండి
  • 32:53 - 32:56
    భావించండి అంతే మనం దాన్నేమీ కదిలించడం లేదు
  • 32:56 - 33:00
    ఈ గోళం లోని ద్రవ్యరాశి అంతా
  • 33:00 - 33:01
    ఆరిజిన్ దగ్గరే ఉందని అనుకోండి
  • 33:02 - 33:04
    మరి, బయట ఏముంది?
  • 33:04 - 33:06
    బయటున్న ద్రవ్యరాశులు?
  • 33:07 - 33:08
    పట్టించుకోకండి
  • 33:08 - 33:11
    న్యూటన్ సిద్ధాంతం ప్రకారం ఒక పార్టికిల్‌పై
    ఉన్న బలం
  • 33:11 - 33:16
    -ఇలాంటి ఐసోట్రోపిక్ ప్రపంచంలో-
  • 33:16 - 33:23
    అంతా పార్టికిల్ వ్యాసార్థపు గోళం లోపలి
    నుండే వస్తుంది గానీ
  • 33:23 - 33:26
    బయటి నుంచి ఏమీ రాదు
  • 33:30 - 33:32
    దీన్ని గతంలో క్లాసికల్ మెకానిక్స్ క్లాసులో
  • 33:32 - 33:37
    నిరూపించి ఉంటాం. నాకు గుర్తులేదు.
    కానీ, ఇది వాస్తవం
  • 33:37 - 33:40
    ఇది వాస్తవ సిద్ధాంతం. అందుచేతనే..
  • 33:40 - 33:45
    మనం ఇక్కడ ఈ కలంపై గురుత్వ బలాన్ని
    లెక్కిస్తున్నాం
  • 33:46 - 33:53
    భూమి ద్రవ్యరాశి అంతా కేంద్రం వద్ద ఉందని
    భావించి లెక్కిస్తున్నాం
  • 33:53 - 33:56
    ఇక్కడి గురుత్వ బలాన్ని లెక్కించేటపుడు
  • 33:56 - 34:00
    భూమి ఒక గోళమని గుర్తుంచుకుంటూ
  • 34:00 - 34:02
    అది సమరూపంగా ఉందని అనుకుంటూ
  • 34:02 - 34:06
    ద్రవ్యరాశి అంతా భూమి కేంద్రం వద్దే
    ఉందని అనుకోవచ్చు
  • 34:06 - 34:09
    అఫ్‌కోర్స్ కలం భూమిని తాకనంతవరకే
  • 34:09 - 34:11
    లేదు..
  • 34:11 - 34:16
    కలం భూమిని తాకనంతవరకూ ద్రవ్యరాశి అంతా
    భూమి కేంద్రం వద్దే ఉందని అనుకోవచ్చు
  • 34:16 - 34:20
    పైగా, బయటున్న ద్రవ్యరాశి, దీనికి బయట
  • 34:21 - 34:25
    బయట చాలా ఉన్నప్పటికీ, చాలా ద్రవ్యరాశి ఉంది
  • 34:25 - 34:29
    నేను ఈ భవనం పైకప్పు గురించి మాట్లాడ్డం లేదు
  • 34:29 - 34:31
    బయటున్న గాలక్సీల గురించి మాట్లాడుతున్నా.
  • 34:31 - 34:34
    బయట చాలా ఉన్నాయి,
    కానీ కలానికి వాటి ప్రభావం తెలియదు
  • 34:34 - 34:36
    గోళం లోపల ఉన్నవాటి ప్రభావమే ఉంటుంది
  • 34:36 - 34:39
    న్యూటన్ ఏమన్నాడంటే.. నేనేం చేస్తానంటే
  • 34:39 - 34:44
    నేను ఈ గాలక్సీని తీసుకుంటాను
  • 34:45 - 34:49
    అది కొంత దూరాన ఉంది. ఈ దూరం ఎంత..
  • 34:49 - 34:52
    ఈ దూరం D
  • 34:52 - 34:55
    దూరం ఎంతంటే
  • 34:55 - 35:00
    స్క్వేర్ రూట్ ఆఫ్ x^2+y^2+z^2
  • 35:01 - 35:05
    x^2,y^2,z^2 లు ఈ బిందువు కోఆర్డినేట్లు
  • 35:05 - 35:07
    ఇంటూ a
  • 35:11 - 35:13
    కేంద్రం నుండి ఉన్న దూరం
  • 35:13 - 35:17
    ఇది కనబడుతోందా?
    ఎందుకోగానీ ఇది ఎర్రరంగులో పడింది.
  • 35:17 - 35:21
    నేను చూసుకోలేదు. ఎరుపు కనబడుతోందా? సరే.
  • 35:22 - 35:26
    స్క్వేర్ రూట్ ఆఫ్ x^2+y^2+z^2.
    అది పైథాగరస్
  • 35:26 - 35:29
    వాస్తవ దూరం కావాలంటే దాన్ని a తో
    హెచ్చవేయాలి
  • 35:30 - 35:37
    D ఈక్వల్స్ టూ a(t) వీటన్నిటినీ R అందాం,
    క్యాపిటల్ R
  • 35:38 - 35:41
    R ను మీటర్లలో కొలవం
  • 35:41 - 35:44
    అది కేవలం స్క్వేర్ రూట్ ఆఫ్ x^2+y^2+z^2.
  • 35:45 - 35:50
    అది కేంద్రం నుండి గాలక్సీ వద్దకు ఉన్న దూరం
  • 35:51 - 35:57
    న్యూటన్ సమీకరణాలు బలాలు, త్వరణాల
    గురించి చెబుతాయి
  • 35:57 - 36:02
    ముందు x యొక్క త్వరణాన్ని కనుక్కుందాం
  • 36:02 - 36:07
    ఆరిజిన్ తో సాపేక్షికంగా x అనే బిందువు
    వద్ద ఉన్న గాలక్సీ త్వరణం
  • 36:08 - 36:10
    ముందుగా.. వేగం
  • 36:10 - 36:18
    వేగం V ఈజ్ ఈక్వల్ టూ a dot(t) ఇంటూ R
  • 36:18 - 36:24
    మరి త్వరణం? త్వరణం కావాలంటే
    మళ్ళీ డిఫరెన్షియేట్ చెయ్యాలి
  • 36:26 - 36:32
    త్వరణం ఈజ్ ఈక్వల్ టు
    a double dot (t) ఇంటూ R.
  • 36:32 - 36:36
    టైమును బట్టి R మారుతుందో లేదో
    మనం చూసుకుంటూండాలా?
  • 36:37 - 36:42
    లేదు. ఎందుకంటే ఈ విస్తరించే లాటిస్‌లో
    గాలక్సీ ఒక స్థిర బిందువు వద్ద ఉంది.
  • 36:42 - 36:46
    ఆ గాలక్సీకి R అనేది స్థిరం.
  • 36:46 - 36:49
    కాబట్టి.. ఇదీ త్వరణం.
  • 36:49 - 36:54
    కావాలంటే గాలక్సీ ద్రవ్యరాశితో
    హెచ్చవేయవచ్చు
  • 36:54 - 36:57
    కానీ ఆ అవసరం లేదు. అది త్వరణం, అంతే.
  • 36:57 - 36:59
    ఇది దేనికి సమానం..
  • 36:59 - 37:07
    ఈ లోపల ఉన్న మొత్తం ద్రవ్యరాశి యొక్క
    త్వరణానికి సమానం చేద్దాం
  • 37:07 - 37:13
    మొదటి ప్రశ్న, అసలక్కడ ద్రవ్యరాశి ఎంత ఉంది?
  • 37:13 - 37:18
    ఈ గోళం లోపల ఉన్న ద్రవ్యరాశి
  • 37:20 - 37:23
    దీన్ని సరిపోల్చే సూత్రం ఏంటంటే..
  • 37:23 - 37:30
    న్యూటన్ గురుత్వ సూత్రం. ఫోర్స్ ఈజ్ ఈక్వల్
    టు మాస్ ఇంటూ మాస్
  • 37:31 - 37:35
    ఈ చిన్న m అంటే దేని ద్రవ్యరాశి?
  • 37:35 - 37:36
    అదుగో ఆ గాలక్సీది
  • 37:36 - 37:39
    ఆ పెద్ద M.. అది దేనిది?
  • 37:39 - 37:43
    అది, లోపల ఉన్న మొత్తం ద్రవ్యరాశి
  • 37:43 - 37:49
    వాటి మధ్య దూరం స్క్వేర్డ్,
  • 37:50 - 37:55
    ఇక్కడో రెండు మిస్సయ్యాయి. రెండు పదాలు
  • 37:56 - 38:02
    న్యూటన్ గురుత్వ స్థిరాంకం- 6.7x10^-11
    ప్లస్ యూనిట్లు
  • 38:02 - 38:05
    ఇంకోటి కావాలి.. ఏంటో ఎవరికైనా తెలుసా?
  • 38:05 - 38:12
    మైనస్ గుర్తు! దాని అర్థం అది ఆకర్షించే
    బలం అని.. లోపలికి లాగేది
  • 38:12 - 38:19
    లోపలికి లాక్కునే బలాన్ని నెగటివ్‌గా
    గుర్తించడం సంప్రదాయం
  • 38:19 - 38:22
    బయటికి తోసే బలం పాజిటివ్
  • 38:22 - 38:26
    సరే. m ద్రవ్యరాశి గల పార్టికిల్‌పై ఉన్న
    గురుత్వ బలం ఇది
  • 38:27 - 38:29
    గురుత్వ త్వరణం ఏది?
  • 38:29 - 38:33
    గురుత్వ త్వరణం కావాలంటే ద్రవ్యరాశి m ని
    తీసెయ్యండి
  • 38:33 - 38:35
    తీసెయ్యండి
  • 38:35 - 38:42
    త్వరణం అంటే యూనిట్ మాస్‌పై ఉన్న ఫోర్సు
  • 38:42 - 38:44
    ఇదిగో ఇదీ త్వరణం
  • 38:44 - 38:48
    మైనస్ M G డివైడెడ్ బై D స్క్వేర్
  • 38:48 - 38:51
    అది త్వరణం..
  • 38:51 - 38:53
    ఏంటీ?
  • 38:56 - 39:01
    లేదు, దాన్ని స్మాల్ m తో డివైడ్ చెయ్యాలి
  • 39:03 - 39:08
    ఈ లోపల ఉన్న మొత్తం ద్రవ్యరాశి వలన
    కలిగే త్వరణం ఇదీ
  • 39:09 - 39:18
    అది a double dot (t) ఇంటూ R కు సమానం
  • 39:19 - 39:22
    ఇది ఎక్కడికి పోతోందో దేవుడికే తెలియాలి
  • 39:22 - 39:26
    ముక్కు ఎటుంటే అటు పోతున్నాం,
    సమీకరణాలు రాసుకుంటూ..
  • 39:26 - 39:31
    ఇలాగే చెయ్యాలి. కొన్ని భౌతిక నియమాలను
    తీసుకుని
  • 39:31 - 39:33
    సమీకరణాలను రాసుకుని
  • 39:33 - 39:37
    గుడ్డిగా వాటి వెంటబడి పోవడమే
  • 39:37 - 39:39
    మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం వచ్చేంతవరకూ!
  • 39:39 - 39:44
    ఇపుడు మనం ఆటోపైలట్ మీద ఉన్నాం.
    సమీకరణాలను రాస్తున్నాం, అంతే
  • 39:44 - 39:47
    దాన్ని మళ్ళీ రాస్తాను
  • 39:47 - 39:53
    a double dot R ఈజ్ ఈక్వల్ టు మైనస్ M G
  • 39:53 - 39:58
    బై D స్క్వేర్. D బదులు ఇదిగో
    దీన్ని రాద్దాం
  • 39:58 - 40:02
    దూరం ఈజ్ a ఇంటూ R
  • 40:02 - 40:07
    ఎవరికి తెలుసు, మనం ఏదైనా ఆసక్తికరమైన
    సంగతిని కనుక్కోవచ్చు.
  • 40:07 - 40:10
    ప్రస్తుతానికి మాత్రం, గుడ్డిగా..
  • 40:11 - 40:14
    a(t) స్క్వేర్డ్, లేకపోతే ఉత్త a స్క్వేర్డ్
  • 40:19 - 40:25
    a స్క్వేర్డ్ ఇంటూ D స్క్వేర్డ్ .. కాదు
    a స్క్వేర్డ్ ఇంటూ R స్క్వేర్డ్. కదా?
  • 40:30 - 40:33
    సరే. ఇక..
  • 40:34 - 40:37
    ఇప్పుడు రెండువైపులా R తో భాగిస్తాను
  • 40:37 - 40:42
    ఎక్కడికి వెళ్తున్నానో నాకు రహస్యంగా తెలుసు
    కదా?
  • 40:42 - 40:45
    మీకూ తెలిసే ఉంటుందిలే.
  • 40:45 - 40:47
    R క్యూబ్‌డ్ తో భాగించి
  • 40:47 - 40:50
    ఇంకొక a తో భాగిస్తాను
  • 40:51 - 40:53
    ఇది a క్యూబ్‌డ్ అవుతుంది
  • 40:54 - 40:56
    సరే.
  • 40:57 - 41:01
    ఇది బానే ఉంది.
  • 41:01 - 41:05
    తరువాతి ప్రశ్న: ఈ గోళపు ఘనపరిమాణం ఏంటి?
  • 41:05 - 41:07
    ఈ గోళపు ఘనపరిమాణం రాద్దాం
  • 41:07 - 41:09
    ఇది న్యూటన్ సమీకరణం
  • 41:10 - 41:12
    ఇప్పుడు, గోళపు ఘనపరిమాణం
  • 41:12 - 41:15
    ఘనపరిమాణం ఏంటి?
  • 41:16 - 41:21
    4/3 పై,
  • 41:21 - 41:25
    అక్కడున్నది R క్యూబ్‌డా? కాదు D క్యూబ్‌డ్
  • 41:26 - 41:31
    అంటే a క్యూబ్‌డ్ ఇంటూ R క్యూబ్‌డ్
  • 41:32 - 41:35
    ఎందుకంటే, దూరం అంటే a ఇంటూ R
  • 41:35 - 41:37
    అది వాస్తవ భౌతిక ఘనపరిమాణం (వాల్యూమ్)
  • 41:37 - 41:43
    వాల్యూమ్ అంటే మీటర్ల వంటి ప్రామాణిక
    కొలతతో కొలిచినట్టు అన్నమాట
  • 41:43 - 41:44
    అదే వాల్యూమ్
  • 41:44 - 41:49
    ఇక్కడ చూసారా.. a క్యూబ్‌డ్ ఇంటూ R క్యూబ్‌డ్
  • 41:49 - 41:51
    దాన్ని రాస్తాను. వాల్యూమ్
  • 41:51 - 41:57
    3 బై 4 పై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు
    a క్యూబ్‌డ్ R క్యూబ్‌డ్
  • 41:58 - 42:01
    తప్పనుకుంటా. అలా రాయకూడదనుకుంటా
  • 42:02 - 42:05
    వద్దు. అలా రాయవద్దు.
  • 42:05 - 42:11
    ఈ సమీకరణంలోఇక్కడ హారంలో a క్యూబ్‌డ్
    R క్యూబ్‌డ్ ఉన్నాయి చూడండి
  • 42:11 - 42:18
    దీన్ని 4 బై 3 పై తో భాగిద్దాం
  • 42:19 - 42:22
    4 బై 3 పై తో హెచ్చవేద్దాం
  • 42:23 - 42:26
    4 బై 3 పై
  • 42:27 - 42:30
    ఇక్కడ చేసిన పనికి ఇక్కడ విరుగుడు చేసా
  • 42:31 - 42:36
    ఇక్కడ చూసారా, మాస్ బై వాల్యూం వచ్చింది
  • 42:36 - 42:38
    మాస్ బై వాల్యూం ఏమిటి?
  • 42:38 - 42:40
    సాంద్రత. డెన్సిటీ!
  • 42:41 - 42:44
    ఏదో మంచి పనే జరగబోతున్నట్లుంది
  • 42:44 - 42:47
    a double dot బై a ఈజ్ ఈక్వల్ టు
  • 42:47 - 42:52
    మైనస్ 4/3 పై న్యూటన్ స్థిరాంకం ఇంటూ
  • 42:52 - 42:58
    ఆ గోళం లోని మాస్‌కు దాని వాల్యూంకూ ఉన్న
    నిష్పత్తి
  • 42:58 - 43:03
    అదే సాంద్రత
  • 43:09 - 43:13
    ఇపుడు.. సమీకరణం బాగుంది.
  • 43:14 - 43:18
    గమనించండి, అది R మీద ఆధారపడి లేదు
  • 43:18 - 43:21
    విశ్వం సాంద్రత మనకు తెలిస్తే
  • 43:21 - 43:26
    మనం ఎక్కడున్నామనే దానిపై
    సాంద్రత ఆధారపడి లేదు
  • 43:26 - 43:30
    విశ్వపు సాంద్రత R పై ఆధారపడదు
  • 43:30 - 43:36
    ఎడమ వైపు నుండి R పోయింది.
    కుడి వైపుకు R సంగతి గుర్తులేదు
  • 43:37 - 43:41
    అంటే, ఈ సమీకరణం ఏ గాలక్సీకైనా సరిపోతుంది.
  • 43:41 - 43:43
    అది ఎంత దూరాన ఉన్నా సరే!
  • 43:44 - 43:49
    ఈ సమీకరణం వేరే గాలక్సీ కోసం చేసినా..,
    ఇదే సమీకరణం వచ్చేది.
  • 43:49 - 43:54
    ఏ గాలక్సీ గురించి మాట్లాడుతున్నామో
    ఈ సమీకరణానికి తెలిసేది..
  • 43:55 - 43:58
    ..ఒక్క R వల్లనే. కానీ అదేమో సమీకరణం
    నుండి తప్పుకుంది.
  • 43:58 - 44:00
    అది మంచిదేలే.
  • 44:00 - 44:05
    ఎందుకంటే ఎక్కడ ఉన్నామనే దానిపై ఆధారపడని
    a గురించి ఆలోచించాలంటే
  • 44:07 - 44:10
    అది లేకపోవడమే మంచిది
  • 44:10 - 44:16
    కాబట్టి, న్యూటన్ నిర్ధారించాడు..
  • 44:16 - 44:21
    a యొక్క సమీకరణమే గాలక్సీలన్నిటికీ
    సార్వత్రిక సమీకరణమని
  • 44:23 - 44:27
    (విద్యార్థి ప్రశ్న)
  • 44:30 - 44:35
    ఆరిజిన్ ఎక్కడ ఉన్నా మనకు
    ఇదే ఫలితం వచ్చేది.
  • 44:43 - 44:45
    అవును
  • 44:46 - 44:50
    లేదు, అది సరిపోయింది. సమాధానం
    దీనిపై ఆధార..
  • 44:50 - 44:55
    లేదు లేదు విషయం ఏంటంటే, ఆ
    ట్రాన్స్‌ఫర్మేషన్ను జాగ్రత్తగా చెయ్యాలి
  • 44:55 - 44:57
    ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ను జాగ్రత్తగా చెయ్యాలి
  • 44:57 - 45:02
    నువ్వు మరో ఆరిజిన్‌కి వెళ్తే, నీ రిఫరెన్సు
    ఫ్రేంలో ఉంటే న్యూటన్ ఏం చెప్పి ఉండేవాడంటే
  • 45:02 - 45:07
    నా రిఫరెన్సు ఫ్రేంకు చేస్తాను, దానికి
    ఆరిజిన్‌లో నేను ఉంటాను
  • 45:07 - 45:15
    సాపేక్షంగా కదులుతున్న ఓ గాలక్సీతో పోల్చి
    దీన్ని అధ్యయనం చెయ్యాలి
  • 45:15 - 45:21
    అతడూ ఇవే సమీకరణాలను కనుక్కుని ఉండేవాడు.
    అయితే ట్రాన్స్ఫర్మేషన్ జాగ్రత్తగా చెయ్యాలి
  • 45:22 - 45:27
    మనం మనల్ని మనం కేంద్రం వద్ద
    పెట్టుకుని దాన్నుండి తప్పించుకున్నాం
  • 45:27 - 45:32
    అంతిమంగా, మీరు ఎక్కడున్నారనేది ఈ సూత్రం
    పట్టించుకోదు, చూసారుగా.
  • 45:32 - 45:39
    మనం ఏ గాలక్సీలో ఉన్నాం అనేదానిపై ఏదీ
    ఆధారపడి లేదు అని నిరూపితమైంది.
  • 45:39 - 45:46
    (విద్యార్థి ప్రశ్న: గురుత్వ బలం ఎప్పుడూ
    ఆరిజిన్ వైపే ఉంటుంది, కదా?)
  • 45:48 - 45:53
    అది సాపేక్ష బలం. సరిగ్గా ఆలోచిస్తే
    అది సాపేక్ష బలం
  • 45:53 - 45:59
    లేదు, ఔనౌను..
  • 45:59 - 46:04
    ఈ రకంగా ఆలోచిస్తే, ఆ బలం ఎప్పుడూ
    ఆరిజిన్ వైపే ఉంటుంది. అవును
  • 46:04 - 46:08
    మనం చలనంలో ఉన్న మరో గాలక్సీలో ఉండి
  • 46:08 - 46:11
    ఈ ట్రాన్స్ఫర్మేషన్లన్నీ చేస్తే
  • 46:11 - 46:17
    కదిలే ఫ్రేములో మిధ్యా బలాలు, ఇనర్షియల్
    బలాలూ ఉంటాయని గుర్తుంచుకోండి
  • 46:17 - 46:20
    వీటిని కూడా పరిగణించాలి
  • 46:20 - 46:24
    ఇక్కడున్న వ్యక్తి దృష్టిలో
  • 46:24 - 46:30
    ఇక్కడున్న గాలక్సీకి ఒక బలం ఉంది, అది
    ఈ దిశలో ఉందని అనుకోవచ్చు
  • 46:30 - 46:36
    ప్లస్ ఒక మిధ్యాబలం. తన త్వరణం కారణంగా
    ఏర్పడిన ఇనర్షియల్ బలం
  • 46:36 - 46:43
    మనం ఈ కేంద్రం వద్ద ఉండడం ద్వారా తప్పించు
    కున్నాం. అక్కడ వేగం లేదు, త్వరణం లేదు
  • 46:44 - 46:53
    ప్రశ్న ఏంటంటే, ఏ గాలక్సీలో ఉన్నామో సంబంధం
    లేకుండా మనకు పరిష్కారం వస్తుందా లేదా అని
  • 46:55 - 46:58
    అదీ మనకు వచ్చే ముఖ్యమైన సందేశం
  • 46:58 - 47:01
    ఏ గాలక్సీలో ఉన్నామనే దానిపై పరిష్కారం
    ఆధారపడి లేదు
  • 47:01 - 47:06
    తాను కేంద్రం వద్ద ఉన్నాననే న్యూటన్
    అనుకోలుపై అది ఆధారపడ లేదు
  • 47:07 - 47:12
    (విద్యార్థి ప్రశ్న: కాన్‌స్టంట్ కాదు అని
    అనుకుంటే ఏమైనా మారి ఉండేదా?)
  • 47:14 - 47:16
    ఔను.
  • 47:16 - 47:23
    nu కాన్‌స్టంట్ కాకపోతే పరిష్కారం
    మారి ఉండేది.
  • 47:23 - 47:26
    (విద్యార్థి ప్రశ్న: )
  • 47:26 - 47:29
    స్పేస్‌లో కాన్‌స్టంట్‌గా ఉండటమా?
  • 47:29 - 47:36
    స్పేస్‌లో కాన్‌స్టంట్‌గా ఉండటం అంటే విశ్వం
    హోమోజీనియస్‌గా ఉంది అనే సూత్రమే
  • 47:36 - 47:40
    కచ్చితంగా! విశ్వం హోమోజీనియస్‌గా ఉండటం
    పైనే అంతా ఆధారపడి ఉంది
  • 47:42 - 47:50
    మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అనే సంఖ్య
    స్పేస్‌లో ఎక్కడైనా ఒకటే
  • 47:52 - 47:55
    ఔను. ప్రతిదీ దానిపై ఆధారపడి ఉంది
  • 47:57 - 47:59
    సరే. ఇదుగో ఈ ఒక్క సమీకరణం..
  • 47:59 - 48:03
    ఇది కాస్మాలజీకి గుండెకాయ లాంటి
    ప్రాథమిక సమీకరణం
  • 48:03 - 48:07
    ఇదొక డిఫరెన్షియల్ సమీకరణం. కాలాన్ని బట్టి a
    ఎలా మారుతుందో చెప్పే సమీకరణం
  • 48:07 - 48:09
    దీనిలో చూడాల్సిన సంగతులు చాలానే ఉన్నాయి
  • 48:09 - 48:12
    మొదటి ఆసక్తికరమైన సంగతి ఏంటంటే..
  • 48:12 - 48:16
    విశ్వం స్థిరంగా ఉండటం అసంభవం
  • 48:17 - 48:20
    స్థిరంగా ఉండటం అంటే
    కాలాన్ని బట్టి మారక పోవడం
  • 48:20 - 48:24
    -అది ఖాళీగా ఉంటే తప్ప. ఖాళీగా ఉండటం అంటే
    rho ఈజ్ ఈక్వల్ టు 0
  • 48:24 - 48:28
    అది ఖాళీగా ఉన్నప్పుడే.. ఈ వైపు
    సున్నా అవుతుంది,
  • 48:29 - 48:34
    a యొక్క రెండవ టైం డెరివేటివ్
    సున్నా అవుతుంది.
  • 48:35 - 48:40
    అంచేత, విశ్వం స్థిరంగా లేదు
    అనే ఫలితాన్ని మనం సాధించాం.
  • 48:43 - 48:48
    సరే. ఇలాంటి సమీకరణాన్ని సాధించేందుకు
    ఇంకోటేం చెయ్యొచ్చంటే,
  • 48:50 - 48:56
    rho స్థానంలో nu డివైడెడ్ బై a క్యూబ్‌డ్‌ను
    ప్రతిక్షేపించడం
  • 48:56 - 48:58
    nu అనేది కాన్‌స్టంట్
  • 48:58 - 49:06
    nu అంటే ఒక యూనిట్ కోఆర్డినేట్ వాల్యూంలోని
    గాలక్సీల సంఖ్య ఇంటూ గాలక్సీ మాస్
  • 49:06 - 49:12
    గాలక్సీలు గ్రిడ్‌లో ఘనీభూతమై ఉన్నాయి
    కాబట్టి, అది కాలానుగుణంగా మారదు
  • 49:12 - 49:17
    అంచేత ఈ సమీకరణంలో ఇంకో స్టెప్ రాయవచ్చు
  • 49:20 - 49:26
    a double dot.. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు.
    a double dot ఎందుకు..
  • 49:26 - 49:30
    ఎందుకంటే న్యూటన్ సమీకరణం
    త్వరణం గురించి కాబట్టి
  • 49:31 - 49:35
    అంచేత a double dot ఉండటంలో
    ఆశ్చర్యమేమీ లేదు.
  • 49:35 - 49:40
    ఈక్వల్ టు మైనస్ 4 బై 3 pi ఇంటూ G
  • 49:42 - 49:45
    ఇంటూ డెన్సిటీ. కానీ ఇక్కడ ఒక సంగతి..
  • 49:45 - 49:48
    డెన్సిటీ కాన్‌స్టంట్ కాదు, nu కాన్‌స్టంట్
  • 49:48 - 49:52
    nu బై a క్యూబ్‌డ్ కాన్‌స్టంట్ కాదు. అది
    కాలానుగుణంగా మారుతోంది కాబట్టి
  • 49:52 - 49:57
    దీన్ని ఇక్కడ పెడదాం. nu బై a క్యూబ్‌డ్
  • 49:58 - 50:02
    ఇక్కడ చాలా కాన్‌స్టంట్ లున్నాయి.
    మైనస్ గుర్తు కాన్‌స్టంట్..
  • 50:02 - 50:07
    4 బై 3 pi కాన్‌స్టంట్ , G అంటే
    న్యూటన్ కాన్‌స్టంట్
  • 50:07 - 50:10
    nu కూడా కాన్‌స్టంటే
  • 50:10 - 50:14
    అంటే ఇక్కడున్న వన్నీ కాన్‌స్టంట్లే. a తప్ప
  • 50:14 - 50:17
    మనకిక్కడ ఒక రకమైన డిఫరెన్షియల్
    ఈక్వేషన్ ఉంది
  • 50:17 - 50:21
    ఇదొక డిఫరెన్షియల్ ఈక్వేషన్.
    చలనం యొక్క సమీకరణం
  • 50:21 - 50:24
    4 pi G nu బై 3 అనే కాన్‌స్టంట్లతో కూడినది
  • 50:25 - 50:31
    చలనానికి స్కేల్ ఫాక్టర్ a తో మనకిక్కడ
    సమీకరణం దొరికింది. a అనేది ఒక టైం ఫంక్షన్.
  • 50:33 - 50:36
    ఈ సమీకరణాన్ని తొలుత కనుక్కున్నదెవరు?
  • 50:37 - 50:42
    జనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీ సందర్భంలో
    దీన్ని కనుక్కున్నారు
  • 50:43 - 50:48
    కనుక్కున్నది ఫ్రీడ్‌మన్,
    అలెగ్జాండర్ ఫ్రీడ్‌మన్ అనుకుంటా
  • 50:51 - 50:55
    మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోక ముందనుకుంటా
  • 50:55 - 50:59
    థియరీ ఆఫ్ రిలెటివిటీ వాడి కనుక్కున్నాడు
  • 50:59 - 51:02
    ఐన్‌స్టీన్ కనుక్కుని ఉండాల్సింది.
  • 51:03 - 51:09
    కానీ ఇది సంభవమే. దీనిలో న్యూటోనియన్
    మెకానిక్స్ తప్ప ఇంకేం లేదు.
  • 51:11 - 51:16
    (విద్యార్థి ప్రశ్న)
  • 51:17 - 51:19
    హెచ్చవెయ్యాలని అనుకుంటే సరే, అలాగే చెయ్యి
  • 51:23 - 51:28
    ఇలా రాయడం సంప్రదాయం. సంప్రదాయం, అంతే
  • 51:29 - 51:35
    (విద్యార్థి ప్రశ్న: ఆ నెగటివ్ గుర్తు
    విస్తరిస్తోందో, సంకోచిస్తోందో చెప్పదా?)
  • 51:35 - 51:39
    విస్తరిస్తోందో, సంకోచిస్తోందో అది చెప్పదు
  • 51:39 - 51:40
    ఎందుకో చెబుతాను.
  • 51:40 - 51:42
    రాస్తాను..
  • 51:42 - 51:45
    దాన్ని పక్కన పెట్టండి మనకు భూమి ఉంది
  • 51:45 - 51:49
    దీన్ని వేరేదాంతో పోల్చి చూద్దాం
  • 51:49 - 51:53
    భూమి, ఇక్కడొక పార్టికిల్ ఉంది.
  • 51:54 - 51:57
    దాన్ని x-యాక్సిస్ మీద పెడదాం
  • 51:57 - 52:01
    ఆ పార్టికిల్‌కు ఒక సమీకరణం ఉంది..
  • 52:01 - 52:06
    దాన్నిx అందాం. అంటే ఇపుడు కోఆర్డినేట్ కాదు
  • 52:06 - 52:11
    x అంటే ఇక్కడ భూమి నుండి ఎత్తు అని
  • 52:12 - 52:15
    ఒక సమీకరణం రాద్దాం,
    x double dot ఈజ్ ఈక్వల్ టు
  • 52:16 - 52:19
    గురుత్వ బలం. గురుత్వ బలం ఏంటి?
  • 52:19 - 52:24
    M G బై x స్క్వేర్డ్ మైనస్
  • 52:24 - 52:28
    అంతే. సుమారుగా అంతే.
  • 52:28 - 52:33
    సరే, ఈ సమీకరణం మనకు చెబుతున్న దేంటంటే
  • 52:33 - 52:37
    పార్టికిల్ భూమి వైపుకు త్వరణంలో ఉంది అని
  • 52:37 - 52:41
    మైనస్ గుర్తుకు అర్థం,
    త్వరణం భూమి వైపుకు ఉందని
  • 52:42 - 52:46
    కానీ అది భూమి వైపుకు పోతోందా, భూమి నుండి
    దూరంగా పోతోందా అనేది
  • 52:46 - 52:50
    వేగానికి సంబంధించినది, త్వరణానికి కాదు.
  • 52:50 - 52:53
    వేగం ఇటుందా, అటు ఉందా
  • 52:53 - 52:59
    ఇక్కడ ఓ మనిషి ఈ పార్టికిల్‌ను తీసుకుని
    ఆ దిశలో విసిరాడనుకోండి
  • 53:00 - 53:04
    దానికి పాజిటివ్ వేగం ఉంటుంది,
    అది భూమి నుండి దూరంగా పోతుంది
  • 53:04 - 53:10
    ఆ పార్టికిల్‌ను ఈ దిశలో విసిరాడనుకోండి.
    అది భూమివైపుకు వెళ్తుంది.
  • 53:10 - 53:14
    యాక్సిస్ తగ్గుతోంది. కానీ త్వరణం మారదు.
  • 53:14 - 53:20
    రెండు సందర్భాల్లోనూ నెగటివ్ త్వరణం
    ఉంటుంది. దానర్థం, ఇటు పోతూంటే
  • 53:20 - 53:24
    అది వెనక్కి తిరుగుతుంది. తిరగవచ్చు.
  • 53:24 - 53:28
    ఈ దిశలో పోతూంటే, లోపలికి వచ్చే
    వేగం పెరుగుతుంది
  • 53:28 - 53:33
    అది వెనక్కి తిరుగుతుందా లేదా అనేది
    దేనిపై ఆధారపడి ఉంటుంది?
  • 53:34 - 53:39
    తొలి పరిస్థితి, అది పలాయన వేగం కంటే
    ఎక్కువా తక్కువా అనేదానిపై
  • 53:39 - 53:43
    అయితే రెండు సందర్భాల్లోనూ త్వరణం
    భూమివైపే ఉంటుంది
  • 53:43 - 53:51
    త్వరణం భూమివైపు ఉందని తెలిసినంత మాత్రాన,
    అది కదులుతున్నది పైకా కిందికా అనేది తెలీదు
  • 53:52 - 53:57
    అది పైకైనా కిందికైనా కదులుతూ ఉండొచ్చు.
    అర్థమైంది కదా. సరే.
  • 53:57 - 54:02
    విశ్వం విస్తరిస్తోందా, సంకోచిస్తోందా
    అనేది ఈ సమీకరణం చెప్పదు
  • 54:02 - 54:06
    కానీ రెండవ డెరివేటివ్ నెగటివ్
    అని మాతం చెబుతుంది.
  • 54:06 - 54:10
    దానర్థం, అది విస్తరిస్తున్నప్పటికీ,
    నెమ్మదిస్తోందని అర్థం
  • 54:10 - 54:13
    విస్తరిస్తోంటే, నెమ్మదిస్తోంది
  • 54:13 - 54:18
    సంకోచిస్తోంటే, సంకోచం వేగవంత మౌతోంది.
  • 54:19 - 54:24
    ఇక్కడొక సారూప్యత ఉంది. మీ వేగం పలాయన వేగం
    కంటే ఎక్కువా తక్కువా అనేది
  • 54:24 - 54:25
    దాని సంగతి తరువాత
  • 54:26 - 54:31
    సరే. నన్నొక ప్రశ్న అడిగారు..
  • 54:32 - 54:35
    ..నీ పేరు... [not clear]
  • 54:38 - 54:43
    .. దీన్ని చూడు, ఇది నెగటివ్
  • 54:45 - 54:50
    అతడు దీన్ని చూసి అన్నాడు "ఇది పాజిటివ్"
  • 54:50 - 54:53
    విశ్వం విస్తరిస్తోంటే.. ఇది పాజిటివ్
  • 54:53 - 54:57
    ఇది నెగటివ్ ఎందుకయింది? ఎందుకంటే
    నువ్వు దీన్ని సరిగ్గా చూడలేదు.
  • 54:57 - 54:59
    ఇక్కడ రెండు డాట్‌లున్నాయి.
    ఇక్కడ ఒకటే ఉంది.
  • 54:59 - 55:02
    ఇది వేగం. ఇది త్వరణం.
  • 55:02 - 55:06
    త్వరణం నెగటివ్‌గా ఉండటం అవాంఛనీయమేమీ కాదు.
  • 55:06 - 55:10
    నువ్వు నీ ఫెర్రారి కారులో ఉన్నావు,
    దిగువకు పోతున్నావు
  • 55:18 - 55:21
    బ్రేకు తొక్కావు
  • 55:21 - 55:27
    నీ త్వరణం నెగటివ్. కానీ వేగం పాజిటివే.
  • 55:27 - 55:31
    నీ వేగం తగ్గుతోంది, కానీ
    ముందుకే పోతున్నావ్.
  • 55:34 - 55:37
    వాస్తవానికి విశ్వం నెమ్మదించడం లేదు.
  • 55:38 - 55:46
    న్యూటన్ ఏంచేసి ఉండేవాడో అదే మనం చేసాం.
    కాస్మాలజిస్టు లంతా ఇదే సరైన దనుకున్నారు..
  • 55:46 - 55:50
    ..సుమారు 15 ఏళ్ళ కిందటి దాకా!
  • 55:52 - 55:55
    15 ఏళ్ళు
  • 55:55 - 55:59
    అది న్యూటన్ విశ్వ సిద్ధాంతం న్యూటన్ మోడల్
  • 56:02 - 56:08
    ఈ మోడలే ప్రామాణిక మోడల్
  • 56:08 - 56:12
    విశ్వానికి ప్రామాణిక మోడల్
  • 56:13 - 56:17
    ..వేగం పెరుగుతున్న విశ్వాన్ని
    కనుక్కునే దాకా!
  • 56:17 - 56:21
    ఈ మోడల్‌ను వేగం తగ్గుతున్న విశ్వం అనొచ్చు,
  • 56:21 - 56:25
    కానీ విశ్వవేగం పెరుగుతోంది. అంటే
    ఈ సమీకరణంలో మరొకటేదో ఉండాలి
  • 56:25 - 56:30
    లేదా చాలా ఉండి ఉండాలి. వాటి సంగతి తరవాత.
  • 56:30 - 56:35
    కొన్ని భాగాలు ఐన్‌స్టీన్
    చెప్పినట్లుగా చెయ్యాలి
  • 56:35 - 56:38
    సరే
  • 56:45 - 56:51
    ఇపుడు.. కాస్మాలజీ గురించి కాదు..
  • 56:52 - 56:59
    భూతలం మీంచి పైకి విసిరిన పార్టికిళ్ళు,
    రాళ్ళు, రప్పల గురించి మాట్లాడుకుందాం
  • 57:11 - 57:14
    సమీకరణాలు ఒకేలా ఉంటాయి
  • 57:18 - 57:23
    వాటిని ఒక నిముషం పరిశీలించి
    నేర్చుకోవాల్సిన సంగతులేంటో చూద్దాం.
  • 57:27 - 57:30
    ఇదిగో భూమి, దాన్ని మనం ఒక బిందువుగా
    భావిద్దాం.
  • 57:30 - 57:36
    అది బిందువని చెప్పే సిద్ధాంతాన్ని న్యూటన్
    నిరూపించాడు కాబట్టి బిందువు అని అనుకోవచ్చు
  • 57:36 - 57:39
    మనం బయటున్నాం. భూ ఉపరితలానికి పైన ఉన్నాం.
  • 57:39 - 57:42
    ఇది భూమి
  • 57:43 - 57:48
    ఇక్కడొక పార్టికిల్ ఉంది
  • 57:49 - 57:53
    ఇక్కడ, x యాక్సిస్ మీద పెడదాం.
  • 57:53 - 57:57
    దాని సమీకరణాలేంటి.. న్యూటన్ సమీకరణాలు..
  • 57:58 - 58:04
    న్యూటన్ సమీకరణాలకు మరొక రూపు ఉంది.
    అవి శక్తి నిత్యత్వాన్ని చూపిస్తాయి
  • 58:06 - 58:11
    ఈ పార్టికిల్ ఎనర్జీని ఇక్కడ రాద్దాం.
  • 58:13 - 58:17
    నిజానికి ఇది
  • 58:18 - 58:21
    ఇక్కడున్న సమీకరణం కంటే ఉపయోగకరం
  • 58:21 - 58:25
    ఎనర్జీ సమీకరణం మరింత ఉపయోగకరం
  • 58:25 - 58:28
    ఈ పార్టికిల్ ఎనర్జీ ఏంటి?
  • 58:28 - 58:33
    అది బయటికి పోతోంది, దానికి వేగం ఉంది. వేగం
    నెగటివ్ కావచ్చు. అది లోపలికి వస్తూండొచ్చు.
  • 58:33 - 58:39
    ఈ పార్టికిల్ మొత్తం ఎనర్జీ
    కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ
  • 58:39 - 58:45
    కైనెటిక్ ఎనర్జీ, ఒకటి బై రెండు,
    పార్టికిల్ మాస్, భూమి మాస్ కాదు.
  • 58:46 - 58:51
    పార్టికిల్ మాస్ ఇంటూ వేగం స్క్వేర్డ్
  • 58:51 - 58:54
    దాన్ని మనం x dot స్క్వేర్డ్ అని అనొచ్చు
  • 58:54 - 58:57
    ప్రస్తుతానికి దాన్ని వేగం స్క్వేర్డ్ గానే
    ఉంచేద్దాం
  • 58:57 - 59:02
    మరి పొటెన్షియల్ ఎనర్జీ సంగతేంటి..
    పొటెన్షియల్ ఎనర్జీ గుర్తుందా?
  • 59:02 - 59:09
    పొటెన్షియల్ ఎనర్జీ అంటే మైనస్
    చిన్న m పెద్ద M న్యూటన్ స్థిరాంకం బై
  • 59:09 - 59:14
    బై? R, R స్క్వేర్డా? R.
  • 59:20 - 59:25
    మళ్ళీ చెప్పండి. x.x. ఔను. x.
  • 59:29 - 59:36
    ఇది పాజిటివైనా నెగటివైనా కావచ్చు.ఎనర్జీ
    పాజిటివ్‌గానే ఉండాలసిన పని లేదు
  • 59:37 - 59:42
    ఉదాహరణకు, ఇక్కడి ఈ పార్టికిల్ కదలకుండా
    ఉందనుకుందాం.
  • 59:42 - 59:49
    అది అక్కడికెలా వచ్చిందో తెలియదు. ఒక సమయం
    t కి అది అక్కడికి వచ్చి స్థిరంగా ఉంది
  • 59:50 - 59:55
    x కు పాజిటివ్ విలువ ఉంది.
    అది ఎప్పుడూ పాజిటివే
  • 59:55 - 60:00
    భూమి నుంచి దూరం అది.
    x కోఆర్డినేట్ కాదు
  • 60:01 - 60:05
    x ఎప్పుడూ పాజిటివే. ఇది ఎప్పుడూ నెగటివ్.
  • 60:06 - 60:10
    పార్టికిల్ కదలకుండా ఉంటే, ఇది 0 కావచ్చు.
  • 60:10 - 60:14
    ఆ సందర్భంలో ఎనర్జీ నెగటివ్‌గా ఉంటుంది.
  • 60:14 - 60:17
    ఎనర్జీ పాజిటివ్ గానూ ఉండవచ్చు.
  • 60:17 - 60:21
    ఇదే పార్టికిల్ ఇదే స్థానం వద్ద ఉందనుకుందాం
  • 60:21 - 60:23
    దానికొక వేగం ఇవ్వండి.
  • 60:24 - 60:29
    వేగం సరిపడినంత ఉంటే,
    ఇది దీన్ని మించిపోవచ్చు.
  • 60:30 - 60:35
    ఆ సమీకరణం రాస్తాను.. వేగం సరిపడినంత ఉంటే,
    ఇది దీన్ని మించిపోవచ్చు.
  • 60:35 - 60:40
    కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ కంటే
    ఎక్కువగా ఉంటుంది.
  • 60:40 - 60:45
    అపుడు మొత్తం ఎనర్జీ పాజిటివ్‌గా ఉంటుంది.
  • 60:46 - 60:51
    మొత్తం ఎనర్జీ పాజిటివ్ అయితే
    ఇది వెనక్కి తిరగదు
  • 60:52 - 60:58
    తిరగదు. ఎందుకో చూద్దాం.. ఈ పార్టికిల్
    ఇక్కడ నుంచి వెనక్కి తిరుగుతుందనుకుందాం
  • 61:01 - 61:05
    మొత్తం ఎనర్జీ పాజిటివ్ అయితే
    ఎందుకు వెనక్కి తిరగదు?
  • 61:05 - 61:09
    శక్తికి నిత్యత్వ నియమం ఉంది కాబట్టి,
    ఈ క్షణంలో ఎనర్జీ ఎంత ఉందో
  • 61:09 - 61:14
    ఏ క్షణంలోనైనా అంతే ఉంటుంది.
    శక్తి నిత్యత్వ నియమం.
  • 61:14 - 61:17
    ఇది ఈ బిందువు వద్ద వెనక్కి
    తిరుగుతుందనుకుందాం
  • 61:17 - 61:21
    ఈ బిందువు వద్ద వేగం ఎంత ఉంటుంది? సున్నా!
  • 61:21 - 61:26
    మరి ఎనర్జీ ఎంత ఉంటుంది? నెగటివ్!
  • 61:26 - 61:32
    అంచేత, అది వెనక్కి తిరిగితే, ఎనర్జీ
    నెగటివ్ అన్నమాటే!
  • 61:32 - 61:36
    అది వెనక్కి తిరక్కపోతే ఎనర్జీ పాజిటివ్
  • 61:36 - 61:42
    ఎనర్జీ సున్నా అయితే, అది పారామీటర్ స్పేస్
    అంచున ఉన్నట్టు.
  • 61:43 - 61:48
    ఎనర్జీ పాజిటివ్ అయితే, పార్టికిల్ ముందుకు
    పోయీ పోయీ తప్పించుకుంటుంది.
  • 61:48 - 61:52
    ఎనర్జీ సున్నా అయితే,
    సరిగ్గా అది పలాయన వేగం
  • 61:52 - 61:57
    ఎనర్జీ సున్నా అయితే అది తప్పించుకుంటుందో
    లేదో తరువాత అడుగుదాం.
  • 61:57 - 62:03
    పలాయన వేగం ఏమిటి? పలాయన వేగమంటే దీనికి
    పరిష్కారం. ఈ సమీకరణం ఈజ్ ఈక్వల్ టు సున్నా.
  • 62:03 - 62:07
    దాన్ని రాద్దాం. 1 బై 2 v స్క్వేర్డ్
  • 62:07 - 62:13
    నేను m ను వదిలేస్తాను, అది
    రెండు వైపులా రద్దైపోతుంది కాబట్టి.
  • 62:14 - 62:20
    1 బై 2 V స్క్వేర్డ్ ఈజ్ ఈక్వల్ టు
    పెద్ద M పెద్ద G బై x.
  • 62:20 - 62:25
    2 తో హెచ్చవేద్దాం
  • 62:25 - 62:29
    ఇదిగో ఇది పలాయన వేగానికి సూత్రం.
  • 62:29 - 62:34
    ఎనర్జీ సరిగ్గా సున్నా అయినపుడు,
    ఇది పలాయన వేగానికి సూత్రం.
  • 62:34 - 62:38
    సరిగ్గా ఇదే పద్ధతిలో
  • 62:38 - 62:44
    విశ్వం కూడా పలాయన వేగానికి
    పైనా ఉండొచ్చు, కిందా ఉండొచ్చు
  • 62:44 - 62:48
    పలాయన వేగం వద్దా ఉండొచ్చు.
  • 62:49 - 62:52
    కొద్ది సేపట్లో దాన్ని చూద్దాం
  • 62:52 - 62:56
    దీనంతటికీ అర్థం ఏంటంటే, పలాయన వేగం
    కంటే పైన ఉంటే
  • 62:56 - 62:59
    ప్రారంభంలో ఒకానొక సమయంలో
  • 62:59 - 63:04
    బాహ్య విస్తరణ ఎంత వేగంగా ఉందంటే
  • 63:04 - 63:06
    అది వెనక్కి తిరగదు
  • 63:06 - 63:11
    పలాయన వేగం కంటే తక్కువ ఉంటే,
    విశ్వం వెనక్కి తిరిగి, సంకోచిస్తుంది.
  • 63:12 - 63:15
    అదీ కారణం, దీన్ని చూపించటానికి.
  • 63:15 - 63:18
    పలాయన వేగం ఒక హద్దు.
  • 63:18 - 63:23
    ఒక వస్తువు పలాయన వేగం వద్ద ఉందంటే
    దాని ఎనర్జీ 0 ఉన్నట్టే
  • 63:24 - 63:29
    గుర్తుంచుకోండి, పలాయన వేగం
    అంటే ఎనర్జీ సున్నా.
  • 63:30 - 63:35
    ఇక ఇక్కడున్న పార్టికిల్‌పై దృష్టి పెడదాం
  • 63:36 - 63:41
    ఇక్కడున్న ఈ పార్టికిల్‌కు
  • 63:42 - 63:47
    తాను కేంద్రం వద్ద ఉన్న బిందు మాస్ యొక్క
    గురుత్వక్షేత్రంలో తిరుగుతున్నానని తెలుసు
  • 63:47 - 63:52
    M అనే బిందు మాస్
  • 63:53 - 63:58
    ఇక్కడున్న ఈ సమస్య స్థానంలో
  • 63:59 - 64:04
    ఇదిగో దీన్ని పెట్టవచ్చు
  • 64:04 - 64:08
    ఇది సరిగ్గా అదే సమస్య
  • 64:08 - 64:13
    ఎనర్జెటిక్స్‌ను లెక్క వేద్దాం
  • 64:13 - 64:17
    ఈ పార్టికిల్ యొక్క కైనెటిక్,
    పొటెన్షియల్ ఎనర్జీలు
  • 64:17 - 64:21
    అది కాన్‌స్టంట్ అని గుర్తుంచుకోండి
  • 64:21 - 64:24
    అది కాన్‌స్టంట్ ఎందుకంటే
  • 64:24 - 64:28
    మాస్ అంతా కేంద్రం వద్ద ఉంటే ఈ పార్టికిల్
    ఎలా కదలాలో సరిగ్గా అలాగే కదులుతోంది
  • 64:28 - 64:33
    ఆ సందర్భంలో ఎనర్జీ కాన్‌స్టంట్‌గా ఉంటుంది.
  • 64:33 - 64:36
    నేను ముందు రాసిన సంగతులను ఎత్తెయ్యవచ్చు
  • 64:36 - 64:39
    వాటిని చేద్దాం
  • 64:39 - 64:44
    (విద్యార్థి ప్రశ్న)
  • 64:47 - 64:53
    లేదు, ఈ మొత్తమంతా పెరుగుతోంది.
    అయితే ఇది గ్రిడ్ అని గుర్తుంచుకోండి.
  • 64:53 - 64:57
    ప్రతిదీ గ్రిడ్‌తో కదులుతుంది.
  • 64:57 - 65:00
    మారేదల్లా a మాత్రమే
  • 65:00 - 65:04
    ఈ గోళం లోని ద్రవ్యరాశి స్థిరం.
  • 65:04 - 65:10
    అంటే, ఇక్కడి వ్యక్తి ఈ గోళంలో చూసే
    గాలక్సీల సంఖ్య స్థిరంగా ఉంటుంది.
  • 65:10 - 65:12
    సరే.
  • 65:13 - 65:16
    కాబట్టి, మాస్ మారటం గురించి
    మనం ఆందోళన పడకూడదు
  • 65:17 - 65:21
    ఇప్పుడు, ఎనర్జీ లెక్క వేద్దాం
  • 65:21 - 65:26
    న్యూటన్ ఫ్రేములో కైనెటిక్ / పొటెన్షియల్
    ఎనర్జీని లెక్కిద్దాం
  • 65:26 - 65:29
    న్యూటన్ ఫ్రేములో కైనెటిక్ ఎనర్జీ
  • 65:29 - 65:35
    1 బై 2 ఈ గాలక్సీ మాస్
  • 65:35 - 65:39
    ఇంటూ వేగం స్క్వేర్డ్ అంటే
    a dot స్క్వేర్డ్ R స్క్వేర్డ్
  • 65:40 - 65:44
    అదే R, ఎక్కడది..
  • 65:44 - 65:47
    అదే R
  • 65:47 - 65:51
    D ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ R
  • 65:51 - 65:54
    దూరం ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ R
  • 65:54 - 65:58
    వేగం a dot ఇంటూ R, ఇది 1 బై 2 m,
    V స్క్వేర్డ్
  • 65:59 - 66:06
    తరవాత, మైనస్ చిన్న m పెద్ద M G
  • 66:06 - 66:11
    డివైడెడ్ బై దూరం, కదా? డివైడెడ్ బై దూరం.
  • 66:12 - 66:16
    అది పొటెన్షియల్ ఎనర్జీ. mMG.
    ఇపుడు దూరం ఏంటి?
  • 66:16 - 66:20
    దూరం a ఇంటూ R, కదా.
  • 66:23 - 66:29
    అది దీని ఎనర్జీ.
  • 66:31 - 66:36
    సరళత్వం కోసం, సరళత్వం కోసమూ, నేను
    కాస్త అలసిపోయి ఉన్నందునా..
  • 66:37 - 66:42
    ఇవ్వాళ, ఎనర్జీ సరిగ్గా సున్నా అయిన కేసును
    మాత్రమే చేద్దాం.
  • 66:42 - 66:47
    అది దేన్ని సూచిస్తుంది? సరిగ్గా పలాయన వేగం
  • 66:47 - 66:50
    ఇతర కేసులు తేలికే.
  • 66:50 - 66:55
    ఈ కేసు చేద్దాం. సరేనా.
  • 66:55 - 66:59
    ఈ కేసులో..
  • 66:59 - 67:02
    విశ్వం సరిగ్గా అంచున ఉంది
  • 67:03 - 67:07
    అది వెనక్కి తిరిగి కుంచించుకు పోతుందో,
    ముందు సాగిపోతుందో తెలియదు.
  • 67:09 - 67:11
    ఏదో ఒకటి చేసే క్షణాన ఉంది
  • 67:11 - 67:15
    సరే, దీన్ని సున్నాకు సమానం చేద్దాం.
  • 67:17 - 67:22
    ఈ సమీకరణాన్ని సాధిద్దాం. మనకు తెలిసిన
    సంగతులతో దీన్ని సాధిద్దాం
  • 67:23 - 67:28
    ముందుగా ఏం చెయ్యాలంటే,
    ఈ చిన్న m ను తీసేద్దాం
  • 67:28 - 67:32
    దాన్ని ఎందుకు తీసెయ్యాలి?
    అది రెండు చోట్లా కనిపిస్తోంది కాబట్టి
  • 67:32 - 67:36
    అన్నీ కలిపి సున్నా కాబట్టి
    దాన్ని m తో భాగించాను
  • 67:37 - 67:42
    2 తో హెచ్చవేస్తున్నాను కూడా
  • 67:49 - 67:54
    తరువాత R స్క్వేర్డ్ తో భాగిస్తున్నాను.
    ఎందుకు భాగిస్తున్నాను?
  • 67:54 - 67:58
    నాకు ఇక్కడ హారంలో R క్యూబ్‌డ్ కావాలి.
    ఎందుకంటే
  • 67:58 - 68:03
    వాల్యూమ్‌లో R క్యూబ్‌డ్ వస్తుంది.
    వాల్యూమ్‌తో డెన్సిటీ వస్తుంది.
  • 68:03 - 68:07
    దీనిలో డెన్సిటీ తెచ్చేందుకు
    ప్రయత్నిస్తున్నాను
  • 68:07 - 68:10
    R స్క్వేర్డ్ తో భాగిస్తాను
  • 68:11 - 68:15
    ఇపుడు హారంలో R క్యూబ్‌డ్. బాగుంది.
  • 68:15 - 68:19
    ఇక్కడొక మాస్ ఉంది, హారంలో R క్యూబ్‌డ్ ఉంది
  • 68:19 - 68:22
    డెన్సిటీ వస్తున్నట్లే ఉంది కానీ ఇంకా రాలా.
  • 68:22 - 68:27
    ఎందుకంటే, గోళపు వాల్యూమ్ a క్యూబ్‌డ్ ఇంటూ
    R క్యూబ్‌డ్ గానీ, a ఇంటూ R క్యూబ్‌డ్ కాదు
  • 68:27 - 68:32
    అందుకని, సమీకరణాన్ని a స్క్వేర్డ్ తో
    భాగిస్తాను
  • 68:37 - 68:42
    సరే.
  • 68:52 - 68:55
    a క్యూబ్‌డ్ ఇంటూ R క్యూబ్‌డ్
  • 68:58 - 69:04
    తరవాత ఏం చెయ్యాలి? దీన్ని 4 బై 3
    ఇంటూ pi తో హెచ్చవేస్తాను
  • 69:05 - 69:08
    దాంతో ఇది వాల్యూం అవుతుంది
  • 69:08 - 69:14
    చిన్న పొరపాటు.. దీన్ని కూడా 4 బై 3
    ఇంటూ pi తో హెచ్చవేయాలి.
  • 69:17 - 69:20
    ఈజ్ ఈక్వల్ టు సున్నా
  • 69:23 - 69:26
    దాదాపుగా అయిపోయింది.
  • 69:26 - 69:27
    తిరిగి రాద్దాం.
  • 69:28 - 69:33
    a dot బై a - స్క్వేర్డ్. a dot బై a
    ఎంటో గుర్తుందా?
  • 69:35 - 69:41
    అది హబుల్ కాన్‌స్టంట్. కాదు, కాన్‌స్టంట్
    కాదు, నేను వెనక్కి తీసుకుంటున్నా
  • 69:41 - 69:44
    అది హబుల్ థింగీ
  • 69:44 - 69:49
    a dot బై a - స్క్వేర్డ్. అంటే
    హబుల్ థింగీ స్క్వేర్డ్
  • 69:49 - 69:54
    అది ఈక్వల్ టు, దీన్నంతటినీ
    కుడివైపుకు తీసుకుపోతున్నా
  • 69:55 - 70:00
    8 పై బై 3, ప్రసిద్ధమైన 8,
    2 ఇంటూ 4 8, 8 pi బై 3
  • 70:03 - 70:06
    G ఒకటుంది
  • 70:06 - 70:11
    ఇప్పుడు M డివైడెడ్ బై గోళపు వాల్యూమ్
  • 70:12 - 70:15
    ఇదంతా చేసినది దీని కోసమే
  • 70:16 - 70:21
    a, R ల గుణకాలను హారంలో పెట్టినది ఎందుకంటే
  • 70:21 - 70:27
    M డివైడెడ్ బై గోళపు వాల్యూమ్ రావడం కోసం
    అంటే rho
  • 70:27 - 70:32
    అది మాస్ డెన్సిటీ rho,
    వాస్తవ మాస్ డెన్సిటీ
  • 70:32 - 70:37
    a dot బై a స్క్వేర్డ్ ఈజ్ ఈక్వల్ టు
    8 pi బై 3 G ఇంటూ rho.
  • 70:39 - 70:43
    అది ఫ్రీడ్‌మన్ సమీకరణం
  • 70:43 - 70:46
    అది ఫ్రీడ్‌మన్ సమీకరణం
  • 70:48 - 70:51
    దాన్ని మామూలుగా ఇలాగే రాస్తారు
  • 70:51 - 70:55
    ఇది ఈ సమీకరణానికి సమానం.
  • 70:55 - 70:59
    ఇక్కడున్న ఈ సమీకరణం ఎనర్జీ కన్సర్వేషన్,
    ఎనర్జీ సున్నా అనుకుని చేసినది
  • 70:59 - 71:03
    ఇది న్యూటన్ సమీకరణం
  • 71:03 - 71:08
    ఒకే ఫిజిక్సు - న్యూటన్ వెర్షన్ ఒకటి,
    కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వెర్షన్ ఒకటి
  • 71:09 - 71:12
    ఇది ఎక్కువ ఉపయోగకరం
  • 71:13 - 71:17
    దీన్ని ఫ్రీడ్‌మన్ సమీకరణం అందాం.
  • 71:18 - 71:22
    ఇది పూర్తిగా జనరల్ సమీకరణం కాదు, ఎందుకంటే
    మనం ఎనర్జీని సున్నా చేసాం కాబట్టి.
  • 71:22 - 71:27
    సరిగ్గా పలాయన వేగానికి సెట్ చేసాం
  • 71:28 - 71:32
    కాబట్టి, ఈ విశ్వం తిరిగి కుంచించుకు పోదు
  • 71:32 - 71:34
    ఏమౌతుందంటే..
  • 71:35 - 71:40
    మనమొక వస్తువును పలాయన వేగంతో
    విసిరితే ఏం జరుగుతుంది?
  • 71:41 - 71:47
    కాలం గడిచే కొద్దీ దాని చలనం ఎలా ఉంటుంది?
  • 71:47 - 71:53
    ఫలానా కారణమంటూ ఏమీ లేకుండా అది
    నెమ్మదిస్తూ పోతుంది. వెనక్కి మాత్రం తిరగదు
  • 71:53 - 71:58
    ఈ విశ్వం ఫలానా కారణమంటూ ఏమీ లేకుండా అది
    నెమ్మదిస్తూ పోతుంది.
  • 71:58 - 72:01
    వెనక్కి మాత్రం తిరగదు
    - ఆ కారణాల వల్లనే
  • 72:02 - 72:05
    అదీ.. ఫ్రీడ్‌మన్ సమీకరణం
  • 72:06 - 72:09
    దాన్ని సాధించాలనే ఉంది నాకు.
    కానీ సరిపడినంత సమాచారం లేదు.
  • 72:09 - 72:13
    సరిపడినంత ఎందుకు తెలీదంటే, ఇక్కడున్న ఈ rho
  • 72:13 - 72:14
    ఈ rho తో ఏం చెయ్యాలో నాకు తెలీదు
  • 72:14 - 72:17
    rho తో ఏం చెయ్యాలో మనకు తెలుసు
  • 72:17 - 72:22
    సమీకరణం గుర్తుందా..
    rho ఈజ్ ఈక్వల్ కాన్‌స్టంట్ nu
  • 72:22 - 72:27
    ఈ కాన్‌స్టంట్ ను విలువ
    మన ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు
  • 72:30 - 72:33
    అది మాస్ పర్ యూనిట్ కోఆర్డినేట్ వాల్యూమ్
  • 72:34 - 72:40
    కోఆర్డినేట్లను మార్చి, ఆ కోఆర్డినేట్ల
    వాల్యూములో ఉన్న మాస్‌ను మార్చవచ్చు
  • 72:40 - 72:44
    వాస్తవానికి nu ముఖ్యమైనదేమీ కాదు
  • 72:44 - 72:49
    rho ఈజ్ ఈక్వల్ టు nu డివైడెడ్ బై
    a క్యూబ్‌డ్.. గుర్తుందా?
  • 72:50 - 72:56
    ఇప్పుడు మనం ఈ సమీకరణాన్నే మరింత
    ఉపయోగపడేలా రాయవచ్చు
  • 72:56 - 73:04
    a dot బై a స్క్వేర్డ్
    ఈజ్ ఈక్వల్ టు 8 pi బై 3
  • 73:04 - 73:08
    G nu
  • 73:08 - 73:12
    nu కాన్‌స్టంట్, కాలంతో అది మారదు
  • 73:12 - 73:17
    డివైడెడ్ బై a క్యూబ్‌డ్
  • 73:21 - 73:27
    ఇక్కడున్న ఇవన్నీ కాన్‌స్టంట్ -
    8 pi nu బై 3 ఇంటూ G -అంతా కాన్‌స్టంట్
  • 73:28 - 73:36
    కావాలనుకుంటే nu ని మాత్రమే తీసుకుని
    8 pi G బై 3 మొత్తాన్నీ 1 అని తీసుకోవచ్చు.
  • 73:37 - 73:40
    వాటిలో అంత విషయమేమీ లేదు
  • 73:40 - 73:45
    బేసిక్ సమీకరణం, బేసిక్ రూపంలోని సమీకరణం..
  • 73:48 - 73:55
    a dot బై a స్క్వేర్డ్ ఈజ్ ఈక్వల్ టు
    ఒక కాన్‌స్టంట్..
  • 73:55 - 73:59
    ప్రస్తుతానికి ఆ కాన్‌స్టంట్‌ను 1 అనుకుందాం
    సింపులుగా ఉండటం కోసం
  • 73:59 - 74:01
    ..ఈజ్ ఈక్వల్ టు 1 బై a క్యూబ్‌డ్
  • 74:01 - 74:06
    ఈ సమీకరణాన్ని సాధిస్తే,
    దీన్ని సాధించినట్లే
  • 74:07 - 74:10
    ఒక దాన్నుంచి మరోదానికి వెళ్ళడం
    కష్టమేమీ కాదు
  • 74:11 - 74:15
    ఈ సమీకరణాన్ని ఎలా సాధించాలో చూద్దాం
  • 74:16 - 74:21
    కుడివైపున ఉన్నది ఎప్పుడూ పాజిటివే,
    గమనించండి.
  • 74:24 - 74:28
    అది ఎప్పుడూ సున్నా కాదు,
    a ఎంత పెద్దదైనా సరే
  • 74:28 - 74:31
    అది ఎప్పుడూ పాజిటివే
  • 74:32 - 74:37
    a పెద్దదయ్యే కొద్దీ అది చిన్నదవుతూ ఉంటుంది
  • 74:37 - 74:44
    దానర్థం, a dot బై a ఎప్పుడూ సున్నా కాదు
  • 74:44 - 74:48
    a dot సున్నా అయితే, విశ్వం
    వెనక్కి తిరుగుతుంది
  • 74:48 - 74:55
    అక్కడ విశ్వం వెనక్కి తిరుగుతుంది.
    విస్తరణ వేగం సున్నా అయినపుడు
  • 74:55 - 74:58
    విస్తరణ వేగం ఎప్పటికీ సున్నాకాదు
    అని ఇది చెబుతోంది
  • 74:58 - 75:03
    హబుల్ కాన్‌స్టంట్ గుర్తు మారదు. హబుల్
    కాన్‌స్టంట్ స్క్వేర్డ్ ఎప్పటికీ సున్నాకాదు
  • 75:03 - 75:07
    సున్నా కాదు, గుర్తూ మారదు
  • 75:07 - 75:14
    కానీ అది నెమ్మదిస్తుంది. కాలం గడిచే కొద్దీ
    హబుల్ కాన్‌స్టంట్ చిన్నదైపోతూ ఉంటుంది
  • 75:15 - 75:20
    విస్తరించడంలో విశ్వం అలిసి పోవడం లాంటిది
  • 75:21 - 75:24
    అయితే ఆగిపోయేంతగా అది అలిసిపోదు.
  • 75:24 - 75:29
    సరే, దీన్ని సాధిద్దాం
  • 75:29 - 75:34
    ఆలస్యం అవుతోంది. అలసి పోతున్నాను
  • 75:35 - 75:41
    తేలిగ్గా సాధించే మార్గంలో వెళ్తాను. ఇలాంటి
    సమీకరణాలు ముందు కూడా చూస్తాం
  • 75:41 - 75:45
    ఇలాంటి సమీకరణాలు కాస్మాలజీ..
  • 75:46 - 75:49
    "ఇలాంటి" సమీకరణాలు అన్నాను
  • 75:50 - 75:56
    కాస్మాలజీకి గుండెకాయలాంటివి.
    వాటిని సాధిద్దాం.
  • 75:57 - 75:59
    వాటిని తేలిగ్గా సాధించవచ్చు
  • 75:59 - 76:02
    ఒక రకానికి, సాధన కోసం చూద్దాం
  • 76:03 - 76:06
    సమీకరణాన్ని సాధించే బదులు సాధన కోసం
    వెతుకుదాం
  • 76:06 - 76:13
    అ ఏదో ఒక కాన్‌స్టంట్ ఇంటూ టైం టు ది పవర్
    ఆఫ్ ఎంతో కొంత అయినపుడు పరిష్కారం చూద్దాం
  • 76:16 - 76:20
    ఈ పద్ధతిలో సాధించగలమో లేదో తెలియదు,
    కానీ ప్రయత్నించుదాం
  • 76:21 - 76:27
    మాదిరి పరిష్కారం ఒకటి... a ప్రొపోర్షనల్
    టు T, a ప్రొపోర్షనల్ టు T అంటే ఏంటి..
  • 76:27 - 76:32
    అంటే సింపులుగా, కాలం గడిచే కొద్దీ
    a పెరుగుతూ పోతుంది
  • 76:33 - 76:37
    అది కరెక్టని మనం అనుకోం, కాలానుగుణంగా
    వస్తువులు నెమ్మదిస్తాయి
  • 76:37 - 76:41
    కానీ ఇలాంటి వాటి సాధన కోసం మనం
    ప్రయత్నించవచ్చు. ప్రయత్నించుదాం రండి..
  • 76:41 - 76:45
    ఈ సమీకరణాన్ని వాడి
  • 76:45 - 76:49
    c,p ల ను సాధించవచ్చేమో చూద్దాం
  • 76:49 - 76:54
    సరే.., a dot ఏంటి?
  • 76:54 - 76:58
    a dot అంటే c p t టు ది పవర్ ఆఫ్ మైనస్ 1
  • 76:59 - 77:02
    డిఫరెన్షియేషన్, అంతే.
  • 77:02 - 77:06
    ఇప్పుడు a dot బై a, చాలా తేలిక
  • 77:06 - 77:12
    a తో భాగించాలి. దీన్ని
    c t టు ది పవర్ ఆఫ్ p తో భాగించాలి
  • 77:14 - 77:19
    c క్యాన్సిలై పోయింది
    కాన్‌స్టంట్ క్యాన్సిలై పోయింది.
  • 77:21 - 77:26
    t టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 బై t టు ది పవర్ ఆఫ్ p ఎంత
  • 77:26 - 77:30
    p బై t, కదా.
  • 77:31 - 77:37
    అది ఎడమ వైపుది. సారీ,
    దాన్ని స్క్వేర్డ్ చెయ్యాలి
  • 77:43 - 77:49
    p స్క్వేర్డ్ బై t స్క్వేర్డ్ .
    అది ఎడమవైపుది
  • 77:57 - 78:01
    ఇప్పుడు 1 బై a క్యూబ్‌డ్. అదేంటో చూద్దాం
  • 78:03 - 78:07
    1 బై a క్యూబ్‌డ్ అంటే 1 బై c క్యూబ్‌డ్
  • 78:11 - 78:16
    t టు ది పవర్ ఆఫ్ 3p. ఇది కరెక్టేనా?
    కరెక్టే
  • 78:25 - 78:28
    ఇప్పుడు రెండు వైపులనూ
    ఎలా మ్యాచ్ చెయ్యాలో చూద్దాం
  • 78:28 - 78:33
    దీన్ని తీసేద్దాం. రెండు వైపులనూ
    ఎలా మ్యాచ్ చేద్దాం.
  • 78:33 - 78:37
    హారంలో ఒక పవరుంది. ఇక్కడ కూడా పవర్ ఉంది.
  • 78:38 - 78:43
    ఇది 1 బై t స్క్వేర్డ్, ఇది 1 బై t టు ది
    పవరాఫ్ 3p కానీ p ఏంటో నేను ఇంకా చెప్పలేదు.
  • 78:44 - 78:50
    దీన్ని మ్యాచ్ చెయ్యాలంటే.. సాధన కోసం
    చూద్దామని చెప్పాను - c t టు ది పవరాఫ్ p
  • 78:50 - 78:54
    c p లు ఎలా ఉండాలో తెలుసుకోగలమేమో చూద్దాం
  • 78:54 - 78:57
    ముందుగా మనం తెలుసుకునేది,
    3p, 2 తో సమానమవ్వాలని
  • 78:57 - 78:59
    లేకపోతే వీటిని మ్యాచ్ చెయ్యలేం.
  • 78:59 - 79:03
    t టు ది పవరాఫ్ 4 అనేది t స్క్వేర్డ్ తో
    మ్యాచ్ కాదు
  • 79:03 - 79:07
    మనం నేర్చుకున్న మొదటి సంగతి..
  • 79:07 - 79:10
    3p అనేది ఈక్వల్ టు 2 కావాల్సిందే అని
  • 79:10 - 79:14
    దాని సంగతి ఒక నిముషంలో చూద్దాం
  • 79:14 - 79:19
    దీంతో ఈ t స్క్వేర్డ్,
    ఈ t స్క్వేర్డ్ సమానమౌతాయి
  • 79:20 - 79:24
    ఇపుడు మనం కాన్‌స్టంట్లను
    కూడా మ్యాచ్ చెయ్యాలి
  • 79:24 - 79:26
    కాన్‌స్టంట్ ఏం చెబుతోందంటే..
  • 79:26 - 79:31
    p స్క్వేర్డ్ ఈజ్ ఈక్వల్ టు
    1 బై c క్యూబ్‌డ్ అని
  • 79:37 - 79:42
    దీన్ని బట్టి, మనం p గురించి గానీ
    c గురించి గానీ తెలుసుకుంటే సరిపోతుంది
  • 79:44 - 79:48
    మనకు p తెలిస్తే.. p తెలుసు మనకు.
    ఇక్కడ నుండి p తెలుసు
  • 79:48 - 79:51
    కాబట్టి మనకు కాన్‌స్టంట్ తెలుసు
  • 79:51 - 79:54
    కాన్‌స్టంట్ గురించి ఆసక్తి లేదు మనకు.
    ఆసక్తి కలిగించేది p
  • 79:54 - 79:59
    p ఏం చెబుతోందంటే..
  • 80:00 - 80:05
    a అంటే t టు ది పవరాఫ్ 2/3 అని
  • 80:07 - 80:10
    ఈజ్ ఈక్వల్ టు 2/3
  • 80:11 - 80:16
    ఏదో ఒక కాన్‌స్టంట్ ఇంటూ t టు ది పవరాఫ్ 2/3
  • 80:17 - 80:21
    న్యూటోనియన్ విశ్వం అలా విస్తరిస్తుంది..
  • 80:21 - 80:26
    ..అది ఖచ్చితంగా పలాయన వేగం వద్ద ఉంటే!
  • 80:26 - 80:30
    స్కేల్ ఫ్యాక్టరుతో అది విస్తరిస్తుంది.
    గాలక్సీలన్నీ
  • 80:30 - 80:36
    టైమ్ టు ది పవరాఫ్ 2/3 తో విస్తరిస్తూంటాయి
  • 80:36 - 80:40
    అది చాలా అసాధారణమైన డెరివేషన్
  • 80:40 - 80:45
    న్యూటన్ ఇది ఎందుకు చెయ్యలేదో నాకు తెలీటంలా
  • 80:45 - 80:50
    అతడది చెయ్యకపోవడం నాకు కోపం తెప్పిస్తోంది.
    అతడది చేసి ఉండాల్సింది
  • 80:54 - 80:59
    ఈ సమయంలో అతడు [unlear] వెళ్ళాడనుకుంటా.
    ఏం జరిగిందో తెలియదు
  • 81:01 - 81:05
    ఇది జరిగిన సంవత్సరం..
  • 81:47 - 81:51
    కాదు, అతడు తన విశ్వాన్ని..
    ఊహించి ఉండాల్సింది
  • 81:51 - 81:55
    ఆ అవును.. అతడు ఊహించాడు..
    హోమోజీనియస్ విశ్వం..
  • 81:56 - 82:04
    అతడు ఇది ఊహించాడు.
    దాదాపు దగ్గరి దాకా వచ్చాడు
  • 82:04 - 82:08
    ప్రశ్నలన్నీ అడిగాడు కానీ అంతు చూడలేదు
  • 82:19 - 82:22
    (విద్యార్థి ప్రశ్న)
  • 82:22 - 82:23
    వాస్తవంగా కాదు
  • 82:24 - 82:29
    మంచి ప్రశ్న. అది పూర్తిగా
    న్యూటోనియన్ సిద్ధాంతం
  • 82:29 - 82:32
    న్యూటోనియన్ సిద్ధాంతంలో
    స్పేస్ ఫ్లాట్‌గా ఉంటుంది
  • 82:32 - 82:36
    స్పేస్ ఫ్లాట్‌గా ఉంటుంది,
    అది అనంతంగా ఉంటుంది
  • 82:37 - 82:40
    న్యూటోనియన్ విశ్వం అనంతంగా ఉంటుంది
  • 82:40 - 82:43
    అది స్పేషియల్‌గా ఫ్లాట్‌గా ఉంటుంది
  • 82:43 - 82:47
    దానికి ఎలాంటి ఐన్‌స్టీనియన్ జామెట్రీ ఉండదు
  • 82:47 - 82:52
    అది విస్తరిస్తూనో సంకోచిస్తూనో ఉన్నప్పటికీ
  • 82:54 - 82:57
    అది సంపూర్ణంగా న్యూటోనియన్ అయి ఉండేది
  • 82:57 - 83:02
    సరే. ఇదెందుకు చేసానంటే, మొదటిది ఇది తేలిక.
  • 83:02 - 83:07
    రెండోది-ఇందులో ముందుముందు చదవబోయే ఫిజిక్సు
  • 83:07 - 83:10
    చాలా ఉంది - అయితే ఇక్కడ తేలిక రూపంలో ఉంది.
  • 83:17 - 83:21
    ఇది ఒక మోడల్ విశ్వాన్ని మనకు చూపిస్తుంది
  • 83:22 - 83:27
    టైం యొక్క 2/3 పవర్‌లో విస్తరించే
    మోడల్ విశ్వం
  • 83:40 - 83:45
    కాదు. ఈ సమీకరణంలో ఇంకో టర్మ్ ఉంది..
  • 83:50 - 83:54
    దాని సంగతి ముందుముందు చూస్తాం.
  • 83:55 - 84:00
    కాదు, అది కుదరదు. నెగటివ్ ఎనర్జీ ఉంటే
    విశ్వం తిరిగి కుంచించుకు పోతుంది.
  • 84:01 - 84:05
    ఇంకొక టర్మ్ ఉంది. ఈసారి ఆ
    రెండో టర్మును తీసుకుని,
  • 84:05 - 84:09
    మూడు సంభావ్యతల గురించి మాట్లాడుకుందాం
  • 84:09 - 84:12
    సున్నా కంటే తక్కువ, అంటే తిరిగి
    కుంచించుకుపోవడం
  • 84:12 - 84:17
    సున్నా కంటే ఎక్కువ, అంటే విశ్వం
    ఇంకో ఆలోచన లేకుండా విస్తరిస్తూ పోవడం
  • 84:17 - 84:21
    ఇక ఇది.. ఇది క్రిటికల్ పాయింటు
  • 84:21 - 84:24
    ఏదో పద్ధతిలో నెమ్మదించడం
  • 84:26 - 84:30
    ఇలాంటి దానికి ఒక బొమ్మ ఉంది
    ఎప్పుడూ ఆ బొమ్మ గీస్తూ ఉంటారు
  • 84:30 - 84:35
    ఇలా ఉంటుందది. ఈ బొమ్మను మీరు చూసే ఉంటారు.
  • 84:35 - 84:43
    వర్టికల్ యాక్సిస్ మీద a ను గీయాలి.
  • 84:48 - 84:53
    హారిజాంటల్ యాక్సిస్ మీద టైంను గీయాలి
  • 84:54 - 84:59
    a, t కు సమానమైతే, అందులో
    సెన్సిబుల్ కాస్మాలజీ ఏమీ లేదు
  • 84:59 - 85:04
    దాన్ని గీద్దాం అంతే. a ఈజ్ ఈక్వల్ టు t
  • 85:05 - 85:11
    a త్వరణం తగ్గుతుందంటే అర్థం ఏమిటి?
    త్వరణం నెగటివ్ అని.
  • 85:12 - 85:19
    త్వరణం తగ్గుతోందంటే ఈ కర్వు
    ఇలా వంగుతుంది, ఇలా పోదు.
  • 85:19 - 85:23
    రెండో డెరివేటివ్ నెగటివ్ అన్నమాట
  • 85:23 - 85:25
    కర్వు ఇలా పోతుంది
  • 85:25 - 85:29
    a టు ది పవరాఫ్ 2/3 సుమారుగా ఇలా ఉంటుంది
  • 85:35 - 85:39
    అయితే అది పెరుగుతూ పోతుంది
  • 85:41 - 85:44
    మరి, సంకోచించే విశ్వం సంగతేంటి?
  • 85:44 - 85:47
    విశ్వం తిరిగి కుంచించుకుపోతే ఏంటి
  • 85:47 - 85:51
    కుంచించుకుపోయే విశ్వం ఇలా ఉంటుంది
  • 85:55 - 85:58
    క్రాష్
  • 86:01 - 86:05
    ఇది సరళరేఖలో పోదు
  • 86:07 - 86:11
    కొద్దికొద్దిగా వంగుతూ పోతుంది
  • 86:11 - 86:15
    పాజిటివ్ ఎనర్జీ ఉన్న విశ్వం
    సుమారుగా ఇలాగే ఉండి,
  • 86:16 - 86:20
    సరళరేఖలో పోతుంది.
  • 86:23 - 86:27
    ఈ మూడు కేసుల గురించి నేను చెబుతాను
  • 86:29 - 86:34
    ఇదికరెక్టేనా? కాదు, ఇది సరికాదు దీన్ని
    వెనక్కి తీసుకుంటున్నాను
  • 86:37 - 86:39
    ఇది సరికాదు.
  • 86:41 - 86:44
    పాజిటివ్ ఎనర్జీ కేసును మళ్ళీ చేద్దాం
  • 86:44 - 86:47
    ఏదేమైనా, ఈ కేసులన్నిటిలోనూ
  • 86:47 - 86:51
    టెండెన్సీ వంగటమే. ఎందుకంటే
    త్వరణం నెగటివ్ కాబట్టి.
  • 86:51 - 86:54
    వాస్తవ విశ్వం ఇలా కనిపించదు
  • 86:54 - 86:58
    వాస్తవ విశ్వం ఇలా మొదలై
  • 86:58 - 87:02
    తరువాత పైకి వంగడం మొదలు పెడుతుంది.
  • 87:02 - 87:06
    వేగవంతమౌతుంది.
    వాస్తవ విశ్వం వేగం పెరుగుతోంది
  • 87:22 - 87:27
    సమీకరణాన్ని వివరంగా సాధిద్దాం.
    సొల్యూషన్ ఇది
  • 87:33 - 87:36
    లేదు, ఇదొక్కటే సొల్యూషన్
  • 87:36 - 87:40
    ఎనర్జీ సున్నా కాకుండా మార్చవచ్చు
  • 87:44 - 87:48
    అలా చేస్తే ఇతర రకాల సొల్యూషన్లను
    సృష్టించవచ్చు
  • 88:02 - 88:07
    సరే, ఇంకా ప్రశ్నలేమైనా.. నేను అలిసిపోయాను
  • 88:07 - 88:11
    డెరివేటివ్ చిన్నదై పోతుంది.
    a టు ది పవరాఫ్ 2/3
  • 88:12 - 88:16
    చూద్దాం. మనం ఈసరికే చేసేసాం.
  • 88:21 - 88:25
    టు ది పవరాఫ్ 2/3 - a..
  • 88:26 - 88:32
    a dot ఈజ్ ఈక్వల్ టు 2/3,
    1 బై t టు ది పవరాఫ్ 1/3
  • 88:33 - 88:38
    సో స్లోప్ సున్నా వైపు పోతుంది
    t పెరుగుతూ పోతుంది
  • 88:38 - 88:42
    కాని అది ఎప్పుడూ పాజిటివే.
    అందుకే అలిసి పోవడం అన్నాం
  • 88:42 - 88:46
    స్లోపు..
  • 88:49 - 88:54
    ఐన్‌స్టీన్ స్టాటిక్ విశ్వాన్ని ఎందుకు
    వివరించలేక పోయాడో ఇప్పుడు మనం చూడొచ్చు
  • 88:55 - 89:00
    అది చూద్దాం. నేను అనుకున్న దాని కంటే
    ముందుకు పోతున్నా. అలా ముందుకు పోను
  • 89:17 - 89:21
    సరే. ఇక..
  • 89:21 - 89:25
    న్యూటన్‌కు ఆభిజాత్య ముండేదనుకుంటా..
  • 89:25 - 89:29
    ఈ విశ్వం వయసు 6000 ఏళ్ళని న్యూటన్
    అనుకున్నాడు
  • 89:29 - 89:32
    వాస్తవంతో పొంతన కుదరడం లేదు..
  • 89:32 - 89:35
    ఔను, న్యూటన్ విశ్వాసి
  • 89:35 - 89:39
    అతను చెయ్యక పోవడానికి కారణం, బహుశా
  • 89:39 - 89:44
    విశ్వం వయసు గురించి తనకున్న నమ్మకానికి
    దీనికీ పొంతన కుదరక పోవడం కావచ్చు
  • 90:23 - 90:27
    అదే pai G
  • 90:35 - 90:39
    ఆశ్చర్యమేమీ లేదు, ఇది ఎనర్జీ
    గురించినది కాబట్టి.
  • 90:45 - 90:49
    ఇది కాస్మొలాజికల్ కాన్‌స్టంట్
    లేని సిద్ధాంతం
  • 90:49 - 90:54
    కాస్మొలాజికల్ కాన్‌స్టంట్
    త్వరణానికి సంబంధించినది
  • 90:54 - 90:58
    ఇది కాస్మొలాజికల్ కాన్‌స్టంట్
    లేని సిద్ధాంతం
  • 90:58 - 91:02
    దీన్ని మ్యాటర్ డామినేటెడ్ విశ్వం అంటారు.
  • 91:02 - 91:06
    మ్యాటర్ డామినేటెడ్ విశ్వం ఏందుకో
    తరువాత చెబుతాను
  • 91:10 - 91:15
    (విద్యార్థి: విశ్వం విస్తరిస్తోందని తెలుసు
  • 91:15 - 91:18
    మధ్యలో సంకోచించే గాలక్సీ లేమైనా ఉన్నాయా?)
  • 91:18 - 91:22
    ఉన్నాయి.
  • 91:23 - 91:28
    సగటున ఈ విశాల విశ్వం విస్తరిస్తోంది
  • 91:29 - 91:32
    కానీ కొన్ని ప్రాంతాలు..
  • 91:32 - 91:36
    ఉదాహరణకు, మన గాలక్సీ ఆండ్రోమెడాతో
    కలిసి సంకోచిస్తోంది
  • 91:36 - 91:40
    ఆండ్రోమెడా మన నుంచి దూరంగా పోవడం లేదు.
  • 91:41 - 91:45
    కానీ సుదూర విశాల విశ్వ స్థాయిలో..
  • 91:45 - 91:50
    హబుల్ సూత్రం అన్ని దూరాలకూ వాస్తవం కాదు
  • 91:50 - 91:55
    దూరాలు పెరిగే కొద్దీ దాని కచ్చితత్వం
    పెరుగుతుంది.
  • 91:56 - 92:00
    దాని కచ్చితత్వం..
  • 92:02 - 92:04
    ఒకదానికొకటి బంధంలో ఉన్న
    వస్తువుల విషయంలో తక్కువ
  • 92:04 - 92:08
    దగ్గరగా ఉన్న వస్తువులు గురుత్వాకర్షణ
    వల్లనో
  • 92:08 - 92:12
    మరేదైనా బలం వల్లనో బంధంలో ఉంటాయి.
  • 92:13 - 92:20
    మొత్తమ్మీద, సరాసరిన, ప్రతీదీ, ప్రతీ దాని
    నుంచీ దూరంగా కదులుతోంది
  • 92:20 - 92:24
    అక్కడక్కడా గాలక్సీలకు విలక్షణమైన
    కదలికలు (పెక్యులియర్ మోషన్) ఉంటే ఉండవచ్చు
  • 92:24 - 92:27
    పెక్యులియర్ మోషన్ అనేది టెక్నికల్ టర్మ్.
  • 92:27 - 92:31
    అది టెక్నికల్ టర్మ్.
  • 92:31 - 92:34
    అంటే.. మమూలు కంటే విలక్షణంగా అని అర్థం
  • 92:34 - 92:41
    (విద్యార్థి ప్రశ్న: అంటే లెక్కవేసేటపుడు
    అలాంటి గాలక్సీలను లెక్కలోకి తీసుకోకూడదా?)
  • 92:41 - 92:45
    విశాల స్థాయిలో సగటు తీసుకుంటే
  • 92:45 - 92:49
    ఈ చిన్నపాటి వ్యత్యాసాలను
    పట్టించుకో నక్కర్లేదు
  • 92:55 - 93:00
    ఈ గదిలోని గాలి యూనిఫారంగా ఉంది అనడం
    లాంటిదే ఇది
  • 93:00 - 93:05
    అది నిజం కాదు. అందులో కొన్ని తేడాలున్నాయి
    కొన్ని చోట్ల సాంద్రత ఎక్కువగా ఉంటుంది
  • 93:05 - 93:10
    కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. కానీ
    సరాసరిన కొన్ని మాలిక్యూల్‌ల కంటే
  • 93:11 - 93:15
    పెద్ద పరిమాణంలో గదిలో గాలి
    యూనిఫారంగా ఉంది.
  • 93:16 - 93:19
    అలాంటిదే ఇది.
  • 93:19 - 93:25
    (ఆండ్రోమెడా పాలపుంత వైపు వస్తోంది.
    ఈ చలనం విస్తరించే విశ్వం లోపలేనా)
  • 93:27 - 93:31
    ఔను. కారణమేమైనప్పటికీ
  • 93:31 - 93:37
    ఆండ్రోమెడా చరిత్ర గురించి, పాలపుంతతో దాని
  • 93:37 - 93:41
    డైనమిక్స్ గురించీ నాకు పూర్తిగా తెలియదు..
  • 93:43 - 93:48
    అయితే, అది ఏర్పడిన ప్రాంతంలో సాంద్రత
    ఎక్కువగా ఉంది.
  • 93:48 - 93:54
    దాంతో ఈ రెండు గాలక్సీలకు ద్రవ్యరాశి
    ఎక్కువగా ఉంది ఎంతంటే..
  • 93:56 - 94:00
    విశ్వ విస్తరణ ప్రభావాన్ని అధిగమించేంత.
  • 94:02 - 94:07
    మామూలు కంటే కొంత వైపరీత్యం అది
  • 94:19 - 94:23
    లేదు అవి సరిసమానం
  • 94:31 - 94:34
    లేదు అందులో తేడా లేదు
  • 94:34 - 94:40
    గాలక్సీలు ఒకదాని నుండి ఒకటి దూరంగా
    జరుగుతున్నాయనైనా అనుకోవాలి
  • 94:40 - 94:46
    లేదా అవి గ్రిడ్‌లో ఇమిడిపోయాయి,
    గ్రిడ్ విస్తరిస్తోంది అనైనా అనుకోవాలి
  • 94:48 - 94:51
    అది మ్యాథమాటికల్ వాస్తవం
  • 94:52 - 94:56
    బహుశా ఐన్‌స్టీన్ పద్ధతిలో ఆలోచిస్తే
  • 94:56 - 95:00
    స్పేస్ విస్తరిస్తోందని అనుకోవడం సహజమైన
    భావన. కానీ ఈ రెండూ ఒకటే
  • 95:06 - 95:11
    (సూపర్ నోవాలు ఉన్నాయి అనేందుకు
    రుజువులున్నాయా అనే విద్యార్థి ప్రశ్నకు)
  • 95:16 - 95:20
    ఉన్నాయి, కాస్మిక్ మైక్రోవేవ్
    బ్యాక్‌గ్రౌండ్ నుండి ఉన్నాయి
  • 95:24 - 95:26
    దాని సంగతి ముందుముందు వస్తుంది
  • 95:27 - 95:32
    విభిన్నమైన పరిశీలనల నెట్‌వర్క్ అది
  • 95:33 - 95:38
    సూపర్ నోవా, కాస్మిక్ మైక్రోవేవ్
    బ్యాక్‌గ్రౌండ్ పరస్పరం చక్కగా కుదురుతాయి
Title:
కాస్మాలజీ లెక్చర్ 1
Description:

(2013 జనవరి 14) లియొనార్డ్ సస్కిండ్ కాస్మాలజీ అధ్యయనాన్ని పరిచయం చేస్తున్నారు. విస్తరిస్తున్న విశ్వాన్ని వివరించే సాంప్రదాయిక భౌతిక సమీకరణాలను సాధిస్తున్నారు.

స్టాన్‌ఫోర్డ్ కంటిన్యుయింగ్ ప్రోగ్రాములో చేసిన ప్రసంగం

more » « less
Video Language:
English
Duration:
01:35:47
వీవెన్ edited Telugu subtitles for Cosmology Lecture 1
వీవెన్ edited Telugu subtitles for Cosmology Lecture 1
వీవెన్ edited Telugu subtitles for Cosmology Lecture 1
వీవెన్ edited Telugu subtitles for Cosmology Lecture 1
వీవెన్ edited Telugu subtitles for Cosmology Lecture 1
తుమ్మల శిరీష్ కుమార్ edited Telugu subtitles for Cosmology Lecture 1
తుమ్మల శిరీష్ కుమార్ edited Telugu subtitles for Cosmology Lecture 1
తుమ్మల శిరీష్ కుమార్ edited Telugu subtitles for Cosmology Lecture 1
Show all

Telugu subtitles

Revisions