Return to Video

The Internet: Encryption & Public Keys

  • 0:03 - 0:08
    ఇంటర్నెట్:ఎన్‌క్రిప్షన్ మరియు పబ్లిక్ కీస్
  • 0:09 - 0:14
    హై, నాపేరు మియా గిల్-ఎప్నర్, నేను UC
    బర్క్‌లీ లో కంప్యూటర్ సైన్స్ అధినేత మరియు
  • 0:14 - 0:19
    రక్షణ విభాగానికి పనిచేస్తా, అందులో సమాచారం
    భద్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తా. ఇంటర్నెట్
  • 0:19 - 0:26
    అనేది స్వతంత్ర మరియు బహిరంగ వ్యవస్థ. మనం
    వైర్లు మరియు కనెక్షన్ల మీదుగా సమాచారాన్ని
  • 0:26 - 0:30
    పంపి, అందుకుంటాం. అది బహిరంగ వ్యవస్థ అయినా
    మనం ఎంతో ప్రైవేట్ డేటాని మార్పిడి చేస్తాం.
  • 0:30 - 0:36
    క్రెడిట్ కార్డ్ నంబర్లు, బ్యాంక్ సమాచారం,
    పాస్‌వర్డ్ లు మరియు ఇమెయిల్స్ వంటివి. మరి
  • 0:36 - 0:41
    ఈ ప్రైవేట్ సమాచారమంతా ఎలాగోప్యంగా ఉంటుంది?
    ఎన్‌క్రిప్షన్ అనే ప్రక్రియ ద్వారా ఎటువంటి
  • 0:41 - 0:45
    రకం డేటానైనా గోప్యంగా ఉంచొచ్చు, అసలు వచనం
    దాచడానికి సందేశాన్ని ఏమార్చి ఉంచడం ద్వారా.
  • 0:45 - 0:52
    ఆ సందేశాన్ని చదవదగిందిగా చేయడానికి ఇపుడు
    డిక్రిప్షన్ అనేది యధాస్థితికి చేసేప్రక్రియ
  • 0:52 - 0:57
    ఇది సులువైన ఉపాయం, దీన్ని మనుషులు చాలాకాలం
    నుండీ చేస్తున్నారు. ఎన్‌క్రిప్షన్ యొక్క
  • 0:57 - 1:02
    సుపరిచిత పద్ధతుల్లో ఒకటి సీజర్స్ సైఫర్.
    జూలియస్ సీజర్ తర్వాత ఆ పేరు వచ్చింది. అతను
  • 1:02 - 1:07
    తమ సైన్యానికి ఇచ్చే ఆదేశాల్ని శత్రువులకు
    దొరికినా గుర్తించనంతగా, చదవలేనంతగా
  • 1:07 - 1:13
    ఎన్‌క్రిప్ట్ చేశాడు. సీజర్స్ సైఫర్ అనేది
    అసలు సందేశంలోని ప్రతి అక్షరాన్నీ కొన్ని
  • 1:13 - 1:17
    దశలతో ఒక అక్షరం కింద మరోదానితో రూపాంతరం
    చేసి మార్చివేసే ఒక అల్గారిధం. ఒకవేళ నంబర్
  • 1:17 - 1:21
    గనక పంపించువారికి మరియు స్వీకర్తకు మాత్రమే
    తెలిసి ఉంటే, అప్పుడు దానిని కీ అంటారు.
  • 1:21 - 1:29
    చదువరి రహస్యసందేశాన్ని అన్‌లాక్ చేయడానికి
    ఇది వీలు కలిగిస్తుంది.ఉదా, మీ అసలు సందేశం
  • 1:29 - 1:36
    గనక 'హలో' ఐతే అప్పుడు 5 యొక్క ఒక కీ తో
    సీజర్ సైఫర్ అల్గారిధం ఉపయోగిస్తే ఎన్‌
  • 1:36 - 1:43
    క్రిప్ట్ సందేశం ఇలా ఉంటుంది... సందేశాన్ని
    డీక్రిప్ట్ చేయడానికి స్వీకర్త ప్రక్రియల్ని
  • 1:43 - 1:50
    వెనక్కిచేసే కీ వాడతారు. ఐతే సీజర్ సైఫర్ తో
    పెద్ద సమస్య ఉంది,ఎవరైనా ప్రతి‌
  • 1:50 - 1:56
    కీ ని ప్రయత్నించి ఎన్‌క్రిప్ట్ సందేశాన్ని
    విడదీయవచ్చు, మరియు ఇంగ్లీష్
  • 1:56 - 2:00
    అక్షరాలు 26 మాత్రమే, అంటే దానర్థం మెసేజ్
    డీక్రిప్ట్ చేయడానికి మీరు 26కీలను మాత్రమే
  • 2:00 - 2:07
    ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇపుడు 26 కీలను
    ప్రయత్నించడం కష్టమేమీ కాదు, మహా ఐతే ఒక గంట
  • 2:07 - 2:13
    పడుతుంది. కాబట్టి దాన్ని కష్టంగా చేద్దాం.
    ఒకే మొత్తంతో ప్రతి అక్షరాన్నీ మార్చే బదులు
  • 2:13 - 2:19
    వేరే మొత్తంతో ప్రతి అక్షరాన్నీ మార్చుదాం.
    ఈ ఉదా.లో ఒకపొడవాటి సందేశాన్ని ఎన్‌క్రిప్ట్
  • 2:19 - 2:27
    చేయడానికి ఒక్కో వరుస అక్షరం ఎన్ని స్థానాలు
    మారవలసి ఉంటుందో ఒక పది అంకెల కీ చూపుతుంది.
  • 2:27 - 2:34
    ఈ కీ ని ఊహించడం నిజంగా కష్టమే. 10 అంకెల
    వాడకానికి 10 బిలియన్ కీ పరిష్కారాలుండొచ్చు
  • 2:34 - 2:40
    సహజంగా అది ఏ మనిషీ ఎప్పటికీ సాధించలేనంత
    కష్టం కావచ్చు, అనేక శతాబ్దాలు పట్టవచ్చు.
  • 2:40 - 2:46
    ఐతే నేడు సగటు కంప్యూటర్ కి ఆ 10 బిలియన్
    కీ లను చేయడానికి కొద్ది సెకెన్లే పట్టొచ్చు
  • 2:46 - 2:51
    కాబట్టి ఈ ఆధునిక యుగంలో మనుషులవద్ద కలానికి
    బదులు కంప్యూటర్లుఉండగా, విడగొట్టడానికి అతి
  • 2:51 - 2:58
    కష్టమయ్యేటంత కఠినంగా మీరు సందేశాలను ఎలా
    ఎన్‌క్రిప్ట్ చేయగలుగుతారు? అతి కష్టం అంటే
  • 2:58 - 3:04
    ఒక సహేతుకమైన సమయంలో గణించడానికి అనేకమైన
    సాధ్యతావకాశాలు ఉంటాయని అర్థం.నేటి సురక్షిత
  • 3:04 - 3:10
    కమ్యూనికేషన్లు 256 బిట్ కీ లను ఉపయోగించి
    ఎన్‌క్రిప్ట్ చేయబడ్డాయి. అంటే మీసందేశాల్ని
  • 3:10 - 3:16
    విడమర్చి చూసే కంప్యూటర్ ఈ అనేక అవకాశాల్ని
    ప్రయత్నిచాల్సి ఉంటుంది...కీ ని కనుక్కొని
  • 3:16 - 3:24
    సందేశాన్ని విడదీసే వరకూ. మీ వద్ద 1000,000
    సూపర్ కంప్యూటర్లు ఉండి మరి వాటిలో ప్రతీదీ
  • 3:24 - 3:31
    సెకనుకి మిలియన్ బిలియన్ కీ లను ప్రయత్నించే
    సామర్థ్యం ఉన్నా, 256బిట్ ఎన్‌క్రిప్షన్ తో
  • 3:31 - 3:38
    రక్షింపబడ్డ ఒకేఒక సందేశాన్ని విడదీయడానికి
    ట్రిలియన్ల ట్రిలియన్ సంవత్సరాలు పడుతుంది
  • 3:38 - 3:43
    ప్రతి సంవత్సరమూ కంప్యూటర్ చిప్స్ వేగములో
    రెట్టింపు, సైజులోసగం అవుతూ ఉండవచ్చు. ఒకవేళ
  • 3:43 - 3:48
    ఆ గణనీయ పురోగతి కొనసాగితే, నేటి అసాధ్యమైన
    సమస్యలు భవిష్యత్తులో కేవలం కొన్ని వందల
  • 3:48 - 3:55
    సంవత్సరాలలో పరిష్కారం కావచ్చు మరియు 256
    బిట్స్ అంత సురక్షితం కాకపోవచ్చు. నిజానికి
  • 3:55 - 4:01
    కంప్యూటర్ల వేగాన్నిపెంచడానికి ఇప్పటికే మనం
    ప్రామాణిక కీ పొడవులను పెంచవలసి వచ్చింది.
  • 4:01 - 4:06
    శుభవార్త ఏమిటంటే పొడవైన కీ ఉపయోగించడం వల్ల
    సందేశాలను అతికష్టంగా చేయడం సాధ్యంకాదు, ఐతే
  • 4:06 - 4:12
    ఒక సైఫర్ ని విడదీయడానికి అది ఊహల సంఖ్యను
    విశేషంగా పెంచగలుగుతుంది. ఒక సందేశాన్ని
  • 4:12 - 4:17
    కూడగట్టడానికి మరియు విడదీయడానికి సెండర్
    మరియు స్వీకర్త ఒకే కీ ని పంచుకుంటే దానిని
  • 4:17 - 4:24
    సిమ్మెట్రిక్ ఎన్‌క్రిప్షన్ అంటారు. దీనితో,
    సీజర్ సైఫర్ లాగా, రహస్య కీ ని రానున్న కాలం
  • 4:24 - 4:30
    లో ఉభయులూ గోప్యంగా అంగీకరించాల్సి ఉంటుంది.
    అది మనుషులకు గొప్ప విషయం, ఐతే ఇంటర్నెట్
  • 4:30 - 4:36
    ఓపెన్ మరియు పబ్లిక్ కాబట్టి, ఒకరహస్య కీ పై
    అంగీకారానికి కంప్యూటర్లు రెండు గోప్యంగా
  • 4:36 - 4:42
    కలవడం అసాధ్యం. దానికి బదులు కంప్యూటర్లు
    అసిమ్మెట్రిక్ ఎన్‌క్రిప్షన్ కీస్ వాడవచ్చు,
  • 4:42 - 4:49
    పబ్లిక్ కీ ని ఎవరితోనైనా మార్చుకోవచ్చు, ఒక
    ప్రైవేట్ కీ పంచుకోబడదు. డేటా ఎన్‌క్రిప్ట్
  • 4:49 - 4:56
    చేయడానికి పబ్లిక్ కీ పనికొస్తుంది, ఎవరైనా
    దాంతో రహస్య సందేశం చేయవచ్చు, ఐతే రహస్య కీ
  • 4:56 - 5:01
    ప్రైవేట్ కీ ప్రాప్యతతో కంప్యూటర్ మాత్రమే
    డీక్రిప్ట్ చేస్తుంది.అదెలా పనిచేస్తుందనేది
  • 5:01 - 5:06
    కొంత లెక్క. దాంట్లోకి మనం ఇప్పుడే వెళ్ళం.
    మీకొక వ్యక్తిగత మెయిల్ బాక్స్ ఉందనుకోండి,
  • 5:06 - 5:11
    అందులో ఎవరైనా మెయిల్ ఉంచొచ్చు, ఐతే దానికి
    వాళ్ళకో కీ కావాలి.ఇపుడు మీరు అనేక డిపాజిట్
  • 5:11 - 5:17
    కీ కాపీలు చేసి ఒకటి మీ మిత్రుడికి పంపి
    దాన్ని బహిరంగ అందుబాటులోనికి తేవచ్చు. మీ
  • 5:17 - 5:21
    మిత్రుడు లేదా ఒక కొత్త మనిషి ఆ పబ్లిక్ కీ
    ఉపయోగించి మీ డిపాజిట్ స్లాట్ ని పొందవచ్చు
  • 5:21 - 5:27
    మరియు అందులో సందేశం ఉంచొచ్చు, ఐతే ఆ రహస్య
    సందేశాలన్నింటి ప్రాప్యత కోసం మీరు మాత్రమే
  • 5:27 - 5:32
    ప్రైవేట్ కీతో మెయిల్ బాక్స్ తెరవగలరు. మరి
    ఒక రక్షిత సందేశాన్ని తిరిగి మీ మిత్రుడికి
  • 5:32 - 5:38
    వారి మెయిల్ బాక్స్ కి పబ్లిక్ డిపాజిట్ కీ
    ఉపయోగించి పంపించొచ్చు.ఈవిధంగా మీరు రక్షిత
  • 5:38 - 5:44
    సందేశాల్ని ప్రైవేట్ కీ ఒప్పందం లేకుండానే
    పంపొచ్చు. ఓపెన్ ఇంటర్నెట్ పై అన్ని రక్షిత
  • 5:44 - 5:49
    సందేశాలకూ పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ పునాది.
    వెబ్ ని బ్రౌజ్ చేసేటపుడు మనకు రక్షణ ఇచ్చే
  • 5:49 - 5:56
    SSL ఇంకా TLS అనబడే సెక్యూరిటీ ప్రోటోకాల్స్
    తో సహా. మీ కంప్యూటర్ దీన్ని ఈ రోజు వాడుతూ
  • 5:56 - 6:01
    ఉంది, మీరు మీ బ్రౌజర్ యొక్క అడ్రస్ బార్ పై
    ఎపుడుచిన్నలాక్ లేదాhttpsఅక్షరాల్ని చూసినా.
  • 6:01 - 6:07
    దీనర్థం, మీరుచూస్తున్న వెబ్‌సైట్ తో డేటాని
    మార్చుకోవడానికి మీ కంప్యూటర్ పబ్లిక్ కీ
  • 6:07 - 6:13
    ఎన్‌క్రిప్షన్ వాడుతోందని. ఇంటర్నెట్ పైకి
    ఎంత ఎక్కువమంది వస్తే అంత ప్రైవేట్ డేటా
  • 6:13 - 6:19
    ప్రసారవ్యాప్తి అవుతుంది, మరియు ఆ డేటాను
    భద్రపరచుకోవడం మరింత ముఖ్యమవుతుంది. మరియు
  • 6:19 - 6:24
    కంప్యూటర్ల వేగం ఇంకా పెరిగే కొద్దీ మనం
    కంప్యూటర్లు ఎన్‌క్రిప్షన్ని విడగొట్టడానికి
  • 6:24 - 6:29
    కష్టమయ్యేలా కొత్తమార్గాల్ని కనిపెట్టాలి.
    ఇదేనేను చేస్తున్నది, అదిమారుతూనే ఉంటుంది.
Title:
The Internet: Encryption & Public Keys
Description:

more » « less
Video Language:
English
Duration:
06:40

Telugu subtitles

Revisions