Return to Video

Dance Party - Warm Up

  • 0:02 - 0:07
    హౌర్ అఫ్ కోడ్ | డాన్స్ పార్టీ: వార్మ్ అప్
  • 0:08 - 0:12
    నమస్తే,
  • 0:12 - 0:16
    నా పేరు మిరాల్ కాట్బి. నా వృత్తి నృత్యం చేయడం, సాఫ్టువేరు అభివృద్ధి చేయడం. ఐల్యుమినేట్ అనే సంస్థ సృష్టికర్తను.
  • 0:16 - 0:22
    కంప్యూటర్ పరిజ్ఞానం ఉపయోగించి సృజనాత్మకతను ఎన్నో విధాలుగా పెంపొందించొచ్చు,
  • 0:22 - 0:23
    వీటికి హద్దులు అంటూ ఏమి ఉండవు.
  • 0:23 - 0:28
    ఒక్క సారి సాఫ్టువేరు ఎలా తయారు చేయాలో తెలిస్తే, ఆలోచనలను ఎలాంటి విషయంలోనైనా పెంపొదించొచ్చు.
  • 0:28 - 0:31
    నేను లైట్ సూట్స్తో చేస్తాను.
  • 0:31 - 0:36
    సాఫ్టువేరు రాయడానికి సరైన పరికరాలు మీ చేతిలో ఉంటే గనుక, మీరు ఎంతో సాధించొచ్చు అంతేకాక అవకాశాలు కూడా
  • 0:36 - 0:39
    అసంఖ్యాకం అవుతాయి.
  • 0:39 - 0:44
    రానున్న గంట వ్యవధిలో, మీరు కంప్యూటర్ పరిజ్ఞాన్ని ఎలా వాడాలో, మీ సొంత నాట్యాన్ని సృష్టించడం ద్వారా తెలుసుకుంటారు.
  • 0:44 - 0:45
  • 0:45 - 0:49
    మీ కోసం ప్రాచుర్యం పొందిన సంగీతాన్ని మరియు ప్రతిభ గల నృత్యం చేసే వారిని సమావేశపరిచాము.
  • 0:49 - 0:56
    మీరు కోడు యొక్క బ్లాక్స్ ను ఉపయోగించి వేరు వేరు నృత్యం చేసేవారిని, వారి నాట్య శైలిని,
  • 0:56 - 1:00
    సంగీతానికి స్పందించే విధానాన్ని ఇంకా వారి పరస్పర సంభాషణా విధానాన్ని ఎన్నుకోవాలి.
  • 1:00 - 1:05
    మీరు గమనిస్తే, మీ తెర మూడు భాగాలుగా చేయబడుంది.
  • 1:05 - 1:07
    ఎడుమ వైపు భాగాన్ని ప్లే స్పేస్ అంటారు,
  • 1:07 - 1:10
    ఇక్కడే మీ నృత్యకారులు కనబడతారు.
  • 1:10 - 1:13
    మధ్య భాగాన్ని "టూల్ బాక్స్" అంటారు,
  • 1:13 - 1:18
    పాఠాలు పెరిగే కొద్దీ కొత్త కోడు యొక్క బ్లాకులు ఇక్కడ అందుబాటులోకి వస్తాయి.
  • 1:18 - 1:22
    కుడి వైపు భాగాన్ని "వర్క్ స్పేస్" అంటారు,
  • 1:22 - 1:28
    కోడు యొక్క బ్లాకులను టూల్ బాక్స్ నుండి ఎంపిక చేసుకుని ఇక్కడ పెట్టి, మీరు సృష్టించాలని భావించిన ఆలోచనలను కార్యరూపం దాల్చాలి.
  • 1:28 - 1:34
    మీరు పురోగతి సాధిస్తున్నపుడు, ప్రతి మెట్టుకు అవసరమైన సూచనలు తెర పై భాగంలో కనిపిస్తాయి.
  • 1:34 - 1:41
    ఏదైనా సహాయం కావలి అనుకుంటే, అక్కడ చూపిన బల్బు ఆకారాన్ని నొక్కితే చాలు.
  • 1:41 - 1:46
    ముందుగా, చిత్రంలో చూపిన విధంగా ఒక నృత్యకారుడని ఎరుపు రంగు బ్లాక్ ఉపయోగించి సృష్టించే ప్రయత్నం చేద్దాం.
  • 1:46 - 1:53
    ఆ బ్లాకును "టూల్ బాక్స్" నుండి బయటకి తీసుకు వచ్చి నారింజ రంగులో ఉన్న "సెటప్ బ్లాక్"లో పెట్టాలి.
  • 1:53 - 1:58
    ఇక్కడ నాట్యం చేసేది ఒక పిల్లి, దాని పేరు "మై ఫస్ట్ డాన్సర్".
  • 1:58 - 2:04
    దాని మీద నొక్కితే మీకు నచ్చిన పేరుతో ఆ పేరుని మార్పు చేసుకోవొచ్చు.
  • 2:04 - 2:10
    "ప్లే స్పేస్"లో నృత్యకారుడు ఎక్కడ కనిపించాలో! ఆ నిర్ణయం కూడా మీదే.
  • 2:10 - 2:13
    "ప్లే స్పేస్" పైన ఉన్న పట్టిక ద్వారా నచ్చిన సంగీతాన్ని ఎంపిక చేసుకోవొచ్చు.
  • 2:13 - 2:19
    ఆ పట్టికలో వందల కొద్దీ పాటలు ఉన్నాయి, మీకు ఇష్టమైన పాటను ఎంచుకోవొచ్చు.
  • 2:19 - 2:21
    "ప్లే స్పేస్" కింద "రన్" అనే ఎంపిక ఉంటుంది.
  • 2:21 - 2:26
    అది నొక్కగానే "ప్లే స్పేస్"లో మీరు సృష్టించిన నృత్యకారులు కనిపిస్తారు,
  • 2:26 - 2:31
    మీరు ఎంపిక చేసుకున్న సంగీతం కూడా వినిపిస్తుంది.
  • 2:31 - 2:36
    [సంగీతం]
  • 2:36 - 2:37
    మీ సొంతగా ఏదైనా ప్రయత్నించండి,
  • 2:37 - 2:39
    ఒక వేళ మీరు ముందుకి వెళ్లలేకపోతున్నారు అనుకుంటే, మరేమి దిగులు చెందొద్దు.
  • 2:39 - 2:44
    మీ ప్రయత్నాన్ని కొనసాగించండి, మీకు తెలుసుకునేలోపు, మీరు సొంతగా, ఆసక్తి కలిగించే ఒక నాట్య వేడుకను సృష్టించి
  • 2:44 - 2:45
    ఉంటారు.
  • 2:45 - 2:49
    మరి, ఈ రోజు మీరు ఏమి సృష్టించబోతున్నారు?
Title:
Dance Party - Warm Up
Description:

Start learning at http://code.org/

Stay in touch with us!
• on Twitter https://twitter.com/codeorg
• on Facebook https://www.facebook.com/Code.org
• on Instagram https://instagram.com/codeorg
• on Tumblr https://blog.code.org
• on LinkedIn https://www.linkedin.com/company/code-org
• on Google+ https://google.com/+codeorg

more » « less
Video Language:
English
Duration:
02:56
TranslateByHumans edited Telugu subtitles for Dance Party - Warm Up
TranslateByHumans edited Telugu subtitles for Dance Party - Warm Up
TranslateByHumans edited Telugu subtitles for Dance Party - Warm Up
TranslateByHumans edited Telugu subtitles for Dance Party - Warm Up

Telugu subtitles

Revisions