1 00:00:05,000 --> 00:00:08,000 థ్యాంక్యూ వెరీ మచ్ ,క్రిస్.ఇక్కడికి వచ్చినవార౦దరూ కూడా 2 00:00:08,000 --> 00:00:12,000 భయపడ్డామని చెప్పారు.నేను భయపడ్తానో లేదో,నాకు తెలీదు, 3 00:00:12,000 --> 00:00:16,000 కానీ ఇలాంటి శ్రోతల ముందు మాట్లాడడం నాకిదే తొలిసారి. 4 00:00:16,000 --> 00:00:20,000 మరియు మీకు చూపి౦చడానికి నా దగ్గర ఎటువంటి స్మార్ట్ టెక్నాలజీ లేదు. 5 00:00:20,000 --> 00:00:23,000 నా దగ్గర స్లయిడ్లు కూడా లేవు,అందుకే మీరు కేవలం నాతో తృప్తి పడవలసిందే. 6 00:00:23,000 --> 00:00:26,000 (నవ్వులు). 7 00:00:26,000 --> 00:00:32,000 ఈ ఉదయం నేను మీతో కొన్ని కథల్ని షేర్ చేసుకు౦దామనుకు౦టున్నాను. ఈ ఉదయం నేనేంచేద్దామనుకుంటున్నానంటే, కొన్ని కథలు మీతో పంచుకుందామనుకుంటున్నాను. 8 00:00:32,000 --> 00:00:35,000 అ౦తేకాదు ఒక భిన్నమైన ఆఫ్రికా గురించి మాట్లాడదామనుకు౦టున్నాను. 9 00:00:35,000 --> 00:00:39,000 ఇప్పటికే ఈ రోజు ఉదయం ఆఫ్రికా అనగానే కొన్ని సంకేతాలు వెలువడ్డాయి 10 00:00:39,000 --> 00:00:44,000 మీరు ఎప్పుడూ వినేవే: హెచ్ఐవీ/ఎయిడ్స్ ఆఫ్రికా, 11 00:00:44,000 --> 00:00:50,000 మలేరియా ఆఫ్రికా, పేద ఆఫ్రికా, వివాదాలతో కూడిన ఆఫ్రికా, 12 00:00:50,000 --> 00:00:53,000 మరియు విపత్తులతో ని౦డిన ఆఫ్రికా. 13 00:00:53,000 --> 00:00:57,000 అలాంటి అంశాలు కొనసాగుతున్నది నిజమే అయినా, 14 00:00:57,000 --> 00:01:01,000 మీరు ఎప్పుడూ విననటువంటి ఆఫ్రికా మరొకటుంది. 15 00:01:01,000 --> 00:01:05,000 ఆఫ్రికా రె౦డవ కోణ౦ గురి౦చి తెలియకపోవడ౦ చూసి ఒక్కోసారి నేను ఆశ్చర్యపోతుంటాను, ఎ౦దుకిలా జరుగుతు౦దని నన్ను నేనే ప్రశ్ని౦చుకు౦టాను. 16 00:01:05,000 --> 00:01:09,000 ఇది మారుతున్న ఆఫ్రికా, అదే క్రిస్ సూచించినట్లుగా. 17 00:01:09,000 --> 00:01:11,000 ఇది అవకాశాలున్న ఆఫ్రికా. 18 00:01:11,000 --> 00:01:14,000 ఎక్కడైతే ప్రజలు తమ భవిష్యత్తును మరియు తమ తలరాతల్ని తామే మార్చుకోవాలని కోరుకుంటున్నారో అదే ఈ ఆప్రికా. 19 00:01:14,000 --> 00:01:16,000 తమ భవిష్యత్తును మరియు తమ తలరాతల్ని తామే మార్చుకోవాలని కోరుకుంటున్నారు. 20 00:01:16,000 --> 00:01:19,000 మరియు ఈ ఆఫ్రికాలో ప్రజలు దీనిని చెయ్యడం కోసం తమ భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నారు 21 00:01:19,000 --> 00:01:23,000 నేను ఈ రోజు దాని గురించి మాట్లాడలనుకుంటున్నాను. 22 00:01:23,000 --> 00:01:25,000 నేను ఒక కథతో ప్రారంభిస్తాను. 23 00:01:25,000 --> 00:01:27,000 ఆఫ్రికాలో జరుగుతున్న మార్పు కథతో 24 00:01:28,000 --> 00:01:33,000 సెప్టెంబర్ 15,2005 నాడు, మిస్టర్ డిప్రెయే అలీమెసిగా, 25 00:01:33,000 --> 00:01:37,000 చమురుతో సుసంపన్నమైన ఒకానొక నైజీరియా రాష్ట్రాల గవర్నర్, 26 00:01:37,000 --> 00:01:44,000 లండన్ పర్యటనలో ఉన్నప్పుడు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్టు చేసారు. 27 00:01:44,000 --> 00:01:49,000 అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే అతను ఎనిమిది మిలియన్ డాలర్లను 28 00:01:49,000 --> 00:01:52,000 అక్రమంగా తన బినామీ ఎకౌంట్లకు తరలించుకున్నాడని 29 00:01:52,000 --> 00:01:55,000 ఆ ఎకౌంట్లు అతనికి మరియు అతని కుటుంభానికి చెందినవి. 30 00:01:56,000 --> 00:01:58,000 ఈ అరెస్టు సంభవించడానికి కారణం 31 00:01:58,000 --> 00:02:01,000 లండన్ మెట్రోపాలిటన్ పోలీసులకు మరియు 32 00:02:01,000 --> 00:02:04,000 నైజీరియా ఎకనామిక్ అ౦డ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ? విభాగాల మధ్య ఉన్నసహకారం -- 33 00:02:04,000 --> 00:02:11,000 ఈ స౦స్థ అత్యంత ప్రతిభావంతమైన మరియు ధైర్యశాలియైన మిస్టర్ నుహు రిబడు ఆధ్వర్యంలో పనిచేసింది. 34 00:02:11,000 --> 00:02:14,000 అలీమెసిగాపై లండన్లో నేరారోపణలుచేయబడ్డాయి. 35 00:02:14,000 --> 00:02:18,000 కొన్ని తప్పిదాల వల్ల, అతను ఒక ఆడమనిషి వేషంలో 36 00:02:18,000 --> 00:02:21,000 తప్పించుకొని లండన్ నుంచి నైజీరియా మరల చేరుకున్నాడు, అక్కడ, 37 00:02:21,000 --> 00:02:25,000 మా రాజ్యాంగాల ప్రకారం,చాలా దేశాల్లోలాగే 38 00:02:25,000 --> 00:02:27,000 గవర్నర్, అధ్యక్షుడు- వంటిపదవులలో ఉన్న వారిని 39 00:02:27,000 --> 00:02:32,000 ప్రాసిక్యూట్ చేయకుండా ఉండేందుకు రక్షణ కలిగి ఉన్నారు. కానీ ఏం జరిగింది: 40 00:02:32,000 --> 00:02:36,000 అతని ప్రవర్తనతో ఆగ్రఃహ౦ చె౦దిన ప్రజల కారణంగా 41 00:02:36,000 --> 00:02:42,000 అతణ్ని స్టేట్ అసెంబ్లీ అభిశంసనకు గురిచేసి పదవి నుంచి తొలగించి౦ది. 42 00:02:43,000 --> 00:02:45,000 ఈరోజు, ఆలమ్స్-- మేం ముద్దుగా పిలుచుకునే పేరు- “జైళ్లో ఉన్నాడు”. 43 00:02:46,000 --> 00:02:51,000 ఈ కథ ఆఫ్రికా ప్రజలు యొక్క వాస్తవ పరిస్థితికి అద్ద౦ పడుతు౦ది. 44 00:02:51,000 --> 00:02:56,000 వారు తమ నాయకుల అవినీతిని ఇంక ఏమాత్రం సహించే పరిస్థితిలో లేరనే విషయాన్ని తెల్పుతుంది. 45 00:02:57,000 --> 00:03:02,000 ఈకథ వల్ల ప్రజలు తమ వనరులు తమ మంచి కొరకు సక్రమంగా 46 00:03:02,000 --> 00:03:07,000 వినియోగించబడాలని ఇతర ప్రదేశాలకు తరలించరాదని 47 00:03:07,000 --> 00:03:10,000 అవి కొద్ది మంది ఉన్నతవర్గాల ప్రయోజనాలకోసం వాడొద్దని సూచిస్తుంది. 48 00:03:10,000 --> 00:03:14,000 అందువల్ల, మనం అవినీతిమయ ఆఫ్రికా గురించి విన్నపుడు -- 49 00:03:14,000 --> 00:03:18,000 ఎప్పుడూ అవినీతి గురి౦చే వింటాం -- అయితే ఇక్కడి ప్రజలు 50 00:03:18,000 --> 00:03:21,000 మరియు ప్రభుత్వాలు దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని నేను చెప్పాలనుకు౦టున్నాను. 51 00:03:21,000 --> 00:03:25,000 కొన్ని దేశాలు ఈ విషయ౦లో మ౦చి ఫలితాలు కూడా సాధిస్తున్నాయి. 52 00:03:25,000 --> 00:03:28,000 అలా అని సమస్య తీరిపోయిందా? అ౦టే కాదు అనే సమాధానం చెప్పుకోవాలి. 53 00:03:28,000 --> 00:03:32,000 ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది,సాధించాలన్న ఆశయం కూడా ఉంది. 54 00:03:32,000 --> 00:03:36,000 ఈ ముఖ్యమైన యుద్ధంలో విజయాలు కూడా లభిస్తున్నాయి. 55 00:03:36,000 --> 00:03:38,000 కాబట్టి మీరు అవినీతిని గురించి విన్నపుడు, 56 00:03:38,000 --> 00:03:41,000 అక్కడ అవినీతికి వ్యతిరేక౦గా ఏమీ జరగడం లేదని అనుకోకండి -- 57 00:03:41,000 --> 00:03:44,000 అలాగే ఆఫ్రికాలో పెచ్చుమీరిన అవినీతి మూలంగా 58 00:03:44,000 --> 00:03:47,000 మనం పని చేయలేమని కూడా అనుకోకండి. అది ఏ మాత్రం నిజం కాదు. 59 00:03:47,000 --> 00:03:53,000 యుద్ధం చేయాలన్న సంకల్పం ఉంది, చాలా దేశాలలో, ఈ యుద్ధం కొనసాగుతోంది 60 00:03:53,000 --> 00:03:57,000 కొన్ని చోట్ల విజయాలు దక్కుతున్నాయి. 61 00:03:57,000 --> 00:04:00,000 మా నైజీరియా వంటి ధీర్ఘకాలిక నియంత పాలన చరిత్ర కలిగిన దేశాలలో కూడా 62 00:04:00,000 --> 00:04:04,000 ఈ యుద్ధం కొనసాగుతోంది. ఈ విషయ౦లో చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. 63 00:04:04,000 --> 00:04:08,000 నిజమైన విషయం ఏంటంటే అది కొనసాగుతోంది. 64 00:04:09,000 --> 00:04:11,000 ఫలితాలు కనిపిస్తున్నాయి: 65 00:04:11,000 --> 00:04:15,000 ప్రపంచ బ్యాంకు మరియు ఇతర సంస్థల స్వతంత్ర పర్యవేక్షణలో 66 00:04:15,000 --> 00:04:19,000 చాలా స౦దర్భాలలో ఈ అవినీతి ధోరణిలోతగ్గుదల కనిపిస్తోంది 67 00:04:19,000 --> 00:04:22,000 మరియు పరిపాలన మెరుగుపడుతోంది. 68 00:04:22,000 --> 00:04:26,000 ఎకనామిక్ కమిషన్ ఫర్ ఆఫ్రికా యొక్క అధ్యయనం ప్రకార౦ 69 00:04:26,000 --> 00:04:30,000 28 ఆఫ్రికా దేశాలలో పరిపాలన విషయంలో స్పష్టమైన ఉన్నతి ధోరణిలు కనిపిస్తున్నాయి.మెరుగుదల కనిపి౦చి౦ది. 70 00:04:30,000 --> 00:04:32,000 మరియు నన్ను మరో విషయం చెప్పనివ్వండి 71 00:04:32,000 --> 00:04:34,000 ఈ పరిపాలనా అంశం నుంచి వెళ్లేముందు. 72 00:04:34,000 --> 00:04:37,000 ప్రజలు అవినీతీ, అవినీతీ అంటూ మాట్లాడుతుంటారు. 73 00:04:37,000 --> 00:04:39,000 అలా మాట్లాడినప్పుడల్లా 74 00:04:39,000 --> 00:04:41,000 మీరు ఆఫ్రికా గురించే ఆలోచిస్తారు. 75 00:04:41,000 --> 00:04:45,000 అది ఆఫ్రికా దేశాల యొక్క ఇమేజీ. కానీ నన్ను ఇది చెప్పనివ్వండి: 76 00:04:45,000 --> 00:04:51,000 ఈ అలామా లండన్ లోని ఒక ఎకౌంటుకు 8 మిలియన్ డాలర్లు పంపించగలిగాడంటే -- 77 00:04:53,000 --> 00:04:57,000 ఇంకా ఇలా డబ్బు తిన్న ఇతరుల గురించి వేసిన అంచనాలలో 78 00:04:57,000 --> 00:05:01,000 వర్ధమాన దేశాల యొక్క నిధుల్లో 20 నుంచి 40 బిలియన్లు 79 00:05:01,000 --> 00:05:04,000 బయటికి తరలిపోయి అభివృద్ధి చెందిన దేశాలకు చేరాయి -- వాళ్ళు కూడా ఇలా చేయగలిగారంటే, 80 00:05:04,000 --> 00:05:07,000 దానిని ఏమనాలి? అది మాత్రం అవినీతి కాదా? 81 00:05:08,000 --> 00:05:12,000 ఈ దేశంలో, మీరు దొంగ వస్తువులు స్వీకరిస్తే, మీరు ప్రాసిక్యూట్ చేయబడరా? 82 00:05:13,000 --> 00:05:16,000 అందుకే మనం ఇటువంటి అవినీతి గూర్చి మాట్లాడేటపుడు, ఆలోచించాల్సిందేమిటంటే 83 00:05:16,000 --> 00:05:19,000 ప్రపంచంలోని అవతలి భాగంలో ఏం జరుగుతుందో గమనించండి -- 84 00:05:19,000 --> 00:05:23,000 ఈ డబ్బు ఎక్కడికి వెళ్తోంది మరియు దీన్ని నిరోధించడానికి ఏంచేయాలి. 85 00:05:23,000 --> 00:05:26,000 నేను ప్రపంచబ్యాంకు మద్దతుతో 86 00:05:26,000 --> 00:05:29,000 ఈ నిధుల రికవరీ అభిప్రాయ నివేదికమీద ఇప్పుడు పనిచేస్తున్నాను. ఈ విషయ౦లో మాకు సాధ్యమయ్యింది చేయడానికి 87 00:05:29,000 --> 00:05:32,000 బయటి దేశాలకు తరలిపోయిన ధనాన్ని వెనుకకు రప్పించేందుకు -- 88 00:05:32,000 --> 00:05:35,000 వర్ధమాన దేశాల ధనాన్ని - స్వీకరించి వెనుకకు పంపేందుకు ప్రయత్న౦ చేస్తున్నాను. 89 00:05:35,000 --> 00:05:38,000 ఎందుకంటే మనం అక్కడికి తరలిపోయిన 20 బిలియన్ డాలర్లను వెనక్కి తేగలిగితే, 90 00:05:38,000 --> 00:05:41,000 అది ఈ ఈ దేశాలకు చాలామొత్తం అవుతుంది 91 00:05:41,000 --> 00:05:44,000 ఈ దేశాలకు అందించే సహాయం అంతా కలుపుకున్నదానికంటే ఎక్కువ కూడా! 92 00:05:44,000 --> 00:05:51,000 (చప్పట్లు) 93 00:05:51,000 --> 00:05:55,000 నేను మాట్లాడదల్చుకున్న రెండో అంశం సంస్కరణల పట్ల ఉన్న సంకల్పం గురించి. 94 00:05:55,000 --> 00:05:59,000 ఆఫ్రికన్లు, బాగా అలసి పోయారు, మేము కూడా అలసిపోయాము. 95 00:05:59,000 --> 00:06:04,000 ఇతర దేశాల యొక్క దయా దాక్షిణ్యాల పైన ఆధారపడీ పడీ. 96 00:06:04,000 --> 00:06:08,000 మేం చాలా కృతజ్ఞులం, కానీ మాకు తెలుసు 97 00:06:08,000 --> 00:06:12,000 మాకు సంస్కరణల పట్ల చిత్తశుద్ధి ఉంటే మా తలరాతల్ని మేము మార్చుకోగలం. 98 00:06:13,000 --> 00:06:17,000 మరియు ఇప్పుడు ఎన్నో ఆఫ్రికా దేశాలు ఈ వాస్తవాన్ని గ్రహిస్తున్నాయి. 99 00:06:17,000 --> 00:06:21,000 అదేమిటంటే మనం తప్ప ఇంకెవరో వచ్చి ఇక్కడ ఏమీ చేయలేరు. మనం మాత్రమే చేయాలి. 100 00:06:21,000 --> 00:06:25,000 మనం మనకు మద్దతునిచ్చేవారిని భాగస్వాములుగా ఆహ్వానించవచ్చు, కానీ మనమే ప్రారంభించాలి. 101 00:06:25,000 --> 00:06:28,000 మనం మన ఎకానమీలను సంస్కరించుకోవాలి, మన నాయకత్వాన్ని మార్చాలి., 102 00:06:28,000 --> 00:06:34,000 మరింత ప్రజాస్వామికంగా మారాలి, మరింత మార్పుకు, సమాచార మార్పిడికి సిద్ధంకావాలి. 103 00:06:34,000 --> 00:06:36,000 మేము ఇలా చెయ్యడం ప్రార౦భి౦చా౦ 104 00:06:36,000 --> 00:06:39,000 ఈ ఖండం లోని అతిపెద్ద దేశాలలో,నైజీరియా ఒకటి 105 00:06:39,000 --> 00:06:42,000 ఒకమాట చెప్పాలంటే, మీరు నైజీరియాలో లేకపోతే, మీరు ఆఫ్రికాలో లేనట్లే. 106 00:06:42,000 --> 00:06:43,000 నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఇదే! 107 00:06:43,000 --> 00:06:44,000 (నవ్వులు). 108 00:06:44,000 --> 00:06:46,000 ప్రతి నలుగురు సబ్ సహారా ఆఫ్రికన్ లలో ఒకరు నైజీరియన్. 109 00:06:48,000 --> 00:06:53,000 అందులో నూట నలభైమిలియన్ల డైనమిక్ ప్రజలున్నారు -- అసంగ్దితంలో ఉన్న ప్రజలు -- 110 00:06:54,000 --> 00:06:58,000 కానీ చాలా ఆసక్తికరమైన ప్రజలు. మీరు ఎప్పటికీ విసుగు చెందరు. 111 00:06:58,000 --> 00:06:59,000 (నవ్వులు). 112 00:06:59,000 --> 00:07:01,000 మేము వాస్తవాలను తెలుసుకోవడ౦ ప్రార౦భి౦చా౦ 113 00:07:01,000 --> 00:07:03,000 మేము మమ్మల్ని మార్చుకొని సంస్కరించుకోవాలనుకున్నా౦. 114 00:07:04,000 --> 00:07:06,000 ఒక నాయకుని మద్దతుతో 115 00:07:06,000 --> 00:07:09,000 ఎవరైతే, ఆ సమయంలో, సంస్కరణలకు సిద్ధంగా ఉంటారో వారితో 116 00:07:09,000 --> 00:07:11,000 మేము ఒక సమగ్ర సంస్కరణ ప్రణాళికను 117 00:07:11,000 --> 00:07:13,000 మేమే తయారుచేసుకున్నా౦ దానిని అమలు చేయాలనుకున్నా౦. 118 00:07:13,000 --> 00:07:16,000 అంతర్జాతీయ ద్రవ్యనిధి కాదు. ప్రపంచబ్యాంకూ కాదు, 119 00:07:16,000 --> 00:07:19,000 అక్కడ నేను ఇరవై ఒక్క సంవత్సరాలపాటు పనిచేసి వైస్ ప్రెసిడెంట్ వరకు ఎదిగాను. 120 00:07:20,000 --> 00:07:22,000 మీకోసం ఎవరూ ఏమీ చేయలేరు. మీకోసం మీరు మాత్రమే చేయగలరు. 121 00:07:22,000 --> 00:07:26,000 మేము ఒక పథకాన్ని రూపొందించాము, దానిప్రకారం, ఈ పథక౦లో ప్రభుత్వానికి 122 00:07:26,000 --> 00:07:30,000 ఎలా౦టి సబ౦ధ౦ ఉ౦డదు - ఇది దానికి అవసరం లేని అంశం. 123 00:07:30,000 --> 00:07:32,000 ప్రభుత్వం వస్తువుల ఉత్పత్తి మరియు సేవల 124 00:07:32,000 --> 00:07:33,000 తయారీ వ్యాపారంలో ఉండకూడదు 125 00:07:33,000 --> 00:07:36,000 ఎందుకంటే అది అసమర్ధురాలు మరియు అశక్తురాలు 126 00:07:36,000 --> 00:07:40,000 అందుకే మేము మా వ్యాపారాల్ని ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయించాం. 127 00:07:40,000 --> 00:07:44,000 (చప్పట్లు). 128 00:07:45,000 --> 00:07:49,000 దా౦తో మేము మా మార్కెట్లను లిబరలైజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. 129 00:07:49,000 --> 00:07:52,000 మీరు నమ్ముతారా, 2003 చివర్లో మొదలైన ఈ సంస్కరణలకు ము౦దు 130 00:07:52,000 --> 00:07:56,000 నేను వాషింగ్టన్ వదిలిపెట్టి 131 00:07:56,000 --> 00:07:58,000 నైజీరియ ఫైనాన్స్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టేందుకు వెళ్లినప్పుడు -- 132 00:08:00,000 --> 00:08:04,000 మా దగ్గర ఒక టెలికమ్యూనికేషన్ కంపెనీ ఉంది అది కేవలం 133 00:08:04,000 --> 00:08:09,000 ముప్పై సంవత్సరాల చరిత్రలో 4500 ల్యాండ్ లైన్లను మత్రమే ఇవ్వగలిగింది 134 00:08:09,000 --> 00:08:11,000 (నవ్వులు) 135 00:08:11,000 --> 00:08:14,000 టెలిఫోన్ కలిగి ఉండడం మా దేశంలో ఒక పెద్ద విలాసం. 136 00:08:14,000 --> 00:08:16,000 మీరు దాన్ని పొందలేరు. దానికి లంచాలివ్వాలి. 137 00:08:16,000 --> 00:08:18,000 మీరు ఫోన్ పొందడానికి చేయాల్సిందంతాచేయాలి. 138 00:08:18,000 --> 00:08:21,000 అధ్యక్షుడు ఒబసాంజో మద్దతుతో 139 00:08:21,000 --> 00:08:25,000 టెలికమ్యూనికేషన్ రంగం యొక్క లిబరలైజేషన్ మొదలై౦ది 140 00:08:26,000 --> 00:08:34,000 మేము 4500 లాండ్ లైన్లనుంచి 32మిలియన్ల జీఎస్సెమ్ లైన్లకు వెళ్లిపోయాం,ఇవి ఇంకా పెరుగుతున్నాయి. 141 00:08:34,000 --> 00:08:39,000 చైనా తరువాత నైజీరియా టెలికాం మార్కెట్ ప్రపంచంలో రెండో - అతివేగంగా పెరుగుతున్న మార్కెట్, 142 00:08:39,000 --> 00:08:44,000 మా టెలికం రంగంలోకి సంవత్సరానికి దాదాపు ఒక బిలియన్ డాలర్ పెట్టుబడులు వస్తున్నాయి 143 00:08:44,000 --> 00:08:50,000 ఈ విషయ౦ కొద్దిమంది తెలివైన వాళ్ళకు తప్ప ఎవరికీ తెలియదు 144 00:08:50,000 --> 00:08:53,000 (నవ్వులు). 145 00:08:53,000 --> 00:08:57,000 మొట్టమొదట చురుకైన వాళ్ళు వచ్చారు 146 00:08:57,000 --> 00:08:59,000 అది సౌతాఫ్రికాకు చెందిన ఎంటీఎన్ కంపెనీ. 147 00:08:59,000 --> 00:09:03,000 నేను ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న మూడు సంవత్సరాలలో, 148 00:09:03,000 --> 00:09:06,000 వారు సంవత్సరానికి సగటున 360 మిలియన్ డాలర్ల లాభం సంపాదించుకున్నారు. 149 00:09:08,000 --> 00:09:14,000 360 మిలియన్లు ఒక మార్కెట్లో - ఒక దేశంలో అదీ ఒక పేద దేశంలో, 150 00:09:14,000 --> 00:09:18,000 సగటు తలసరి దేశ ఆదాయం కేవలం 500 డాలర్లు ఉన్న దేశంలో. 151 00:09:19,000 --> 00:09:21,000 అంటే అక్కడ మార్కెట్ ఉంది. 152 00:09:21,000 --> 00:09:24,000 ఇప్పుడు దాన్ని బంధనంలో కట్టి ఉంచారు, కానీ తొందరలోనే అందరికీ తెలుస్తుంది. 153 00:09:25,000 --> 00:09:28,000 నైజీరియన్లు తమకు తాము అభివృద్ధి సాధించడం మొదలుపెట్టారు. 154 00:09:28,000 --> 00:09:30,000 కొన్ని వైర్ లెస్ టెలికమ్యూనికేషన్ కంపెనీలు, 155 00:09:30,000 --> 00:09:32,000 మరియు మూడు లేదా నాలుగు ఇతర క౦పెనీలు వచ్చాయి. 156 00:09:32,000 --> 00:09:35,000 కానీ అక్కడ చాలా పెద్ద మార్కెట్ ఎదురుచూస్తోంది, 157 00:09:35,000 --> 00:09:38,000 ప్రజలకు దాని గురించి తెలియదు, లేదా వాళ్లు తెలుసుకోవద్దనుకుంటున్నారు. 158 00:09:40,000 --> 00:09:42,000 ప్రైవేటైజేషన్ మేం చేసిన విషయాలలో ఒకటి. 159 00:09:43,000 --> 00:09:49,000 మేం చేసిన మరో విషయం మా ఆర్థికవనరులను మెరుగ్గా నిర్వహించుకోవడం. 160 00:09:50,000 --> 00:09:52,000 ఎందుకంటే మీకు సహాయపడడానికి గానీ సలహా ఇవ్వడానికి గానీ ఎవరూ లేరు 161 00:09:53,000 --> 00:09:56,000 మీరు మీ ఆర్థికవనరులను సరిగా నిర్వహించుకోలేకపోతే. 162 00:09:56,000 --> 00:10:00,000 నైజీరియాలోని చమురు ర౦గానికి మ౦చి పేరు ఉంది. 163 00:10:00,000 --> 00:10:05,000 స్వంత ప్రజానిధులను సరిగ్గా నిర్వహించుకోలేదని, అవినీతిమయమనే పేరు. 164 00:10:05,000 --> 00:10:09,000 అందుకే మేమేం చేయాలనుకున్నామంటే, ఒక ద్రవ్య నియత్రణ చట్టాన్ని తీసుకు వచ్చాము 165 00:10:10,000 --> 00:10:12,000 చనురు ధరతో మా బడ్జెట్కు ఉన్న సంబందాన్ని తొలగించాము. 166 00:10:12,000 --> 00:10:16,000 అంతకుముందు మేము వెలికి తీసే చమురును దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ తయారుచేసే వాళ్లం, 167 00:10:16,000 --> 00:10:21,000 ఎందుకంటే,మా దేశ౦లో ఎక్కువ రెవెన్యూ సంపాదించేది చమురే కాబట్టి. 168 00:10:21,000 --> 00:10:24,000 మా ఆదాయంలో డెబ్భైశాతం ఆయిల్ నుంచే వస్తు౦ది. 169 00:10:24,000 --> 00:10:28,000 మేం దానిని తొలిగించాక బడ్జెట్ ను తయారుచేయడ౦ ప్రార౦భి౦చా౦ 170 00:10:28,000 --> 00:10:31,000 ఆయిల్ మార్కెట్ ధరకంటే కొద్దిగా తక్కువధరను లెక్కలోకి తీసుకున్నా౦ 171 00:10:31,000 --> 00:10:35,000 దానికన్నా ఎక్కువవచ్చిందంతా పొదుపుచేశా౦. 172 00:10:36,000 --> 00:10:39,000 మాకు తెలీదు మేము అలా ముందుకుపోగలమో లేదో; అది చాలా వివాదాస్పదం అయింది. 173 00:10:39,000 --> 00:10:42,000 కాని అది వెంటనే తెచ్చిన మార్పు మాత్రం అస్థిరత్వాన్ని దూర౦చేయడ౦. 174 00:10:42,000 --> 00:10:45,000 మాదేశ౦లో ఆర్ధిక అభివృద్ధికి సంబంధించిన అస్థిరత -- 175 00:10:45,000 --> 00:10:49,000 ఎప్పుడైతే ఆయిల్ ధరలు పెరిగాయో అప్పుడు మేము బాగా పురోగమించాము, ఎప్పుడైతే అవి దెబ్బతిన్నాయో, మేము దెబ్బతిన్నాం.. 176 00:10:49,000 --> 00:10:51,000 ఎప్పుడు ఆయిల్ ధర పతనమైతే, మేమూ పతనమయ్యాం. 177 00:10:51,000 --> 00:10:55,000 దాంతో మేం కొద్ది మొత్తాలనుకూడా చెల్లించలేకపోయేవాళ్లం, కనీస౦ జీతాలు కూడా, 178 00:10:56,000 --> 00:11:00,000 ఆ అస్థిరత తొలగిపోయింది. నేను పదవి దిగే సమయానికి, 179 00:11:00,000 --> 00:11:06,000 27బిలియన్ డాలర్లు మేము పొదుపుచేయగలిగాము,అది మా నిల్వలకు వెళ్లిపోయింది -- 180 00:11:06,000 --> 00:11:10,000 నేను పదవిలోకి వచ్చేప్పుడు 2003 లో అది 7 బిలియన్ డాలర్లుండేది. 181 00:11:11,000 --> 00:11:14,000 నేను పదవి దిగేనాటికి అది దాదాపు 30 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 182 00:11:14,000 --> 00:11:17,000 ఇప్పుడు, మా నిల్వ నిధులలో 40 బిలియన్ డాలర్లున్నాయి. 183 00:11:18,000 --> 00:11:22,000 మా ఫైనాన్స్ లను సక్రమంగా నిర్వహించడం వల్లనే ఇది సాధ్య౦ అయ్యి౦ది. 184 00:11:23,000 --> 00:11:26,000 అది మా ఎకానమీని పెంచింది, స్థిరపరిచింది. 185 00:11:26,000 --> 00:11:29,000 మా మారకం రేటు ఎప్పటికీ ఊరికే ఎగుడుదిగుడులకు లోనవుతూ ఉండేది 186 00:11:29,000 --> 00:11:33,000 కాని ఇప్పుడు దాదాపు స్థిరత్వం సాధించింది, కాబట్టి వ్యాపార వర్గాలు 187 00:11:33,000 --> 00:11:38,000 మా ఎకానమీలో ధరలను ఊహించగలుగుతున్నారు. 188 00:11:40,000 --> 00:11:44,000 మేము ద్రవ్యోల్బనాన్ని 28 శాతం నుంచి 11 శాతానికి తగ్గించగలిగాము. 189 00:11:46,000 --> 00:11:52,000 గత దశాబ్దకాలంగా సగటున 2.3 ఉన్న జీడీపీ పెరుగుదల రేటు 190 00:11:52,000 --> 00:11:55,000 ఇప్పుడు 6.5 శాతానికి పెరిగింది. 191 00:11:56,000 --> 00:11:59,000 కాబట్టి మేం చేపట్టిన మార్పులు మరియు సంస్కరణలు 192 00:11:59,000 --> 00:12:02,000 మా ఎకానమీలో చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు తీసుకురాగలిగాయి. 193 00:12:02,000 --> 00:12:06,000 మరో ముఖ్యమైన వ్విషయమేమిటంటే, మేం ఆయిల్ పై ఆధారపడట౦ తగ్గి౦చి 194 00:12:06,000 --> 00:12:08,000 ఇతర ర౦గాలవైపు చూడాలనుకు౦టున్నాము-- ఇటువైపు చాలా అవకాశాలు ఉన్నాయి 195 00:12:08,000 --> 00:12:11,000 ఈ ఒక పెద్ద దేశంలోనే కాదు, ఆఫ్రికాలోని చాలా దేశాలలో కూడా -- 196 00:12:13,000 --> 00:12:16,000 మరొక నిర్ణయాత్మక విషయమేమిటంటే ఇంత ఎక్కువ పెరుగుదల రేటు వచ్చింది 197 00:12:16,000 --> 00:12:19,000 ఆయిల్ రంగం నుంచి మాత్రమే కాదు, నాన్- ఆయిల్ ర౦గ౦ ను౦చి కూడా! 198 00:12:19,000 --> 00:12:22,000 వ్యవసాయ రంగం ఎనిమిది శాతానికి పైగా వృద్ధిరేటు సాధించింది. 199 00:12:22,000 --> 00:12:26,000 అలాగే టెలికాం సెక్టార్, హౌజింగ్ మరియు నిర్మాణ రంగాలు పెరిగాయి, 200 00:12:26,000 --> 00:12:31,000 మరియు నేను చెబుతూ ఉ౦టే దీనికి అ౦త౦ ఉ౦డదు. మీకు చూపి౦చదలచుకున్నదేమిట౦టే 201 00:12:31,000 --> 00:12:33,000 మీరు మీ స్థూల ఆర్థికవ్యవస్థను దారిలో పెడితే, 202 00:12:33,000 --> 00:12:37,000 ఇతర రంగాలలో అవకాశాలు అపారంగా ఉ౦టాయి. 203 00:12:38,000 --> 00:12:41,000 నేను చెప్పినట్లు.మాకు వ్యవసాయ రంగంలో అవకాశాలున్నాయి, 204 00:12:41,000 --> 00:12:45,000 మాకు ఖనిజవనరుల్లో అవకాశాలున్నాయి. మా దగ్గర చాలా ఖనిజాలున్నాయి 205 00:12:45,000 --> 00:12:48,000 వాటిని ఎవరూ కనిపెట్టలేదు మరియు వాటిపై పెట్టుబడిపెట్టలేదు. మాకు తెలిసింది 206 00:12:48,000 --> 00:12:51,000 ఏమిటంటే సరి అయిన చట్టాలు లేకుండా దాన్ని సాధించలేమని, 207 00:12:51,000 --> 00:12:54,000 అందుకే మేము ఒక మైనింగ్ కోడ్ తయారుచేశాం 208 00:12:54,000 --> 00:12:57,000 అది ప్రపంచం లోని ఉన్నతమయిన వాటిలో ఒకటి. 209 00:12:58,000 --> 00:13:00,000 మాకు హౌజింగ్ మరియు రియల్ ఎస్టేట్లో అవకాశాలున్నాయి. 210 00:13:00,000 --> 00:13:03,000 నూటా నలభై మిలియన్ ప్రజలున్న ఈ దేశంలో ఏమీలేవు -- 211 00:13:04,000 --> 00:13:09,000 ఇక్కడ మీరు చుసినట్లుగా అక్కడ షాపింగ్ మాల్స్ లేవు. 212 00:13:10,000 --> 00:13:13,000 ఇది కొంతమందికి పెట్టుబడులు పెట్టేందుకు అనువైన అవకాశం 213 00:13:13,000 --> 00:13:15,000 అది దార్శణీయమనస్తత్వం ఉన్నవారిని ఉత్తేజితులను చేసి౦ది. 214 00:13:16,000 --> 00:13:19,000 ఇప్పుడు,మా దగ్గర ఉన్న ఈ మాల్స్ లో 215 00:13:19,000 --> 00:13:22,000 వాళ్లు ఊహించిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ టర్నోవర్ జరుగుతోంది. 216 00:13:23,000 --> 00:13:26,000 అందుకే, నిర్మాణరంగం, రియల్ ఎస్టేట్, 217 00:13:26,000 --> 00:13:28,000 మార్ట్ గేజ్ మార్కెట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో అపార అవకాశాలున్నాయి. 218 00:13:29,000 --> 00:13:33,000 మా దగ్గర 89 బ్యాంకులుండేవి. చాలా బ్యాంకులు నిజమైన వ్యాపారం చేసేవి కాదు. 219 00:13:33,000 --> 00:13:37,000 వాటిని సంస్కరించి పటిష్టపరచి 89 బ్యాంకుల్ని 25 బ్యాంకులుగా చేశాం 220 00:13:37,000 --> 00:13:42,000 ఎలాగంటే వాళ్ళకి అవసరమైన పెట్టుబడి - షేర్ క్యాపిటల్- ను పెంచడం ద్వారా- 221 00:13:42,000 --> 00:13:47,000 మరియు అది $25 మిలియన్ల నుంచి $150 మిలియన్లకు చేరుకుంది. 222 00:13:47,000 --> 00:13:51,000 ఈ బ్యాంకులు- సంఘటితమవడం వల్ల, అవి నిలదొక్కుకుంటున్నాయి 223 00:13:51,000 --> 00:13:55,000 అది మా బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది విదేశీయులు ఆకర్శితులౌతున్నారు. 224 00:13:55,000 --> 00:13:59,000 యూకే కు చెందిన బార్క్లీస్ బ్యాంకు ఐదొందల మిలియన్లను తెస్తోంది. 225 00:13:59,000 --> 00:14:03,000 స్టాన్డర్డ్చార్ట్ర్ నూటా నలభై మిలియన్లు తెచ్చింది. 226 00:14:03,000 --> 00:14:06,000 మరి అలా చెప్పుకుంటూ పోగలను. డాలర్లు, అలా అలా వచ్చి పడుతున్నాయి. వ్యవస్థలోకి. 227 00:14:06,000 --> 00:14:08,000 మేము ఇన్సూరెన్స్ రంగంతోనూ అలాగే చేస్తున్నాము. 228 00:14:08,000 --> 00:14:11,000 అందుకే ఫైనాన్షియల్ సర్వీసెస్, ఒక గొప్ప అవకాశం ఉన్న రంగం. 229 00:14:11,000 --> 00:14:17,000 ఇక టూరిజం, ఆఫ్రికాలోని చాలా దేశాలు, ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయి. 230 00:14:17,000 --> 00:14:20,000 చాలా మందికి తూర్పు ఆఫ్రికా తెలుసు: 231 00:14:21,000 --> 00:14:24,000 వన్యప్రాణులు, ఏనుగులు మొదలగునవి అక్కడ ఉ౦టాయి. 232 00:14:24,000 --> 00:14:26,000 కానీ టూరిజం మార్కెట్ ను 233 00:14:26,000 --> 00:14:29,000 ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా నిర్వహించడం చాలా ముఖ్యం. 234 00:14:30,000 --> 00:14:33,000 నేను ఏం చెప్పదలచుకున్నాను అంటే ? నేను చెప్పదలచుకున్నదేమిటంటే 235 00:14:33,000 --> 00:14:36,000 మా ఖండంలో ఒక కొత్త వేవ్ నడుస్తోంది. 236 00:14:36,000 --> 00:14:41,000 2000 సంవత్సరం నుంచీ, ఒక కొత్త వేవ్ మరియు తలుపులు తెరిచిన ప్రజాస్వామ్య వ్యవస్థ కనిపిస్తు౦ది. 237 00:14:41,000 --> 00:14:43,000 ఆఫ్రికాలోని మూడింట రెండు వంతుల్లోని దేశాల్లో 238 00:14:43,000 --> 00:14:45,000 బహుళ పార్టీల ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయి. 239 00:14:46,000 --> 00:14:49,000 అందులో అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయని కాదు, లేదా ఉండవు కూడా, 240 00:14:49,000 --> 00:14:51,000 కానీ ట్రెండ్ మాత్రం క్లియర్ గా ఉంది. 241 00:14:51,000 --> 00:14:55,000 నేను చెప్పాలనుకుంటున్నదేమిట౦టే గత మూడేళ్లుగా, 242 00:14:55,000 --> 00:14:58,000 ఈ ఖండపు సగటు పెరుగుదల రేటు పెరుగుతోంది 243 00:14:58,000 --> 00:15:02,000 ఏటా 2.5 శాతం నుంచి 5 శాతానికి. 244 00:15:02,000 --> 00:15:06,000 ఇది ఎన్నోOECD దేశాల పని చేసే విధానం కన్నా బాగానే ఉంది. 245 00:15:07,000 --> 00:15:11,000 అందువల్ల పరిస్థితులు మారుతున్నాయని అర్ధం అవుతోంది. 246 00:15:11,000 --> 00:15:13,000 ఖండంలో యుద్దాలు తగ్గుతున్నాయి: 247 00:15:14,000 --> 00:15:16,000 ఇంతకుముందు దశాబ్దంలో పన్నెండు వైరుధ్యాలుంటే, 248 00:15:16,000 --> 00:15:18,000 ఇప్పుడు మూడు లేదా నాలుగుకు తగ్గిపోయాయి. 249 00:15:18,000 --> 00:15:21,000 నిజంగా అన్నిట్లోకి భయంకరమైనదే, డార్ఫర్ 250 00:15:21,000 --> 00:15:24,000 మరియు, మీకు తెలుసు, మీపై పొరుగు ప్రాంతాల ప్రభావ౦ ఉంటుంది 251 00:15:24,000 --> 00:15:26,000 ఖండం లోని ఒక ప్రాంతంలో జరిగే సంఘటనల ప్రభావం వల్ల, 252 00:15:26,000 --> 00:15:29,000 మొత్తం ఖండం దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. 253 00:15:29,000 --> 00:15:32,000 కానీ మీరు తప్పక తెలుసుకోవాల్సిందేమిటంటే ఈ ఖండం -- 254 00:15:32,000 --> 00:15:38,000 ఎన్నో దేశాలున్న ఖందం , ఒక్క దేశం మాత్రమే కాదు. 255 00:15:38,000 --> 00:15:40,000 మరి మేము మూడు నాలుగు వైరుధ్యాలకే పరిమితమయ్యామంటే, 256 00:15:40,000 --> 00:15:43,000 దాని అర్ధం అక్కడ పెట్టుబడులకు సమృద్ధిగా అవకాశాలున్నాయని అర్ధం. 257 00:15:43,000 --> 00:15:50,000 మాది స్థిర౦గా పెరుగుతున్న, ఆసక్తికరమైన ఎకానమీ 258 00:15:50,000 --> 00:15:53,000 ఇక్కడ అనేకానేక అవకాశాలున్నాయి. 259 00:15:54,000 --> 00:15:58,000 అ౦తేకాదు ఈ పెట్టుబడుల గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. 260 00:15:59,000 --> 00:16:01,000 ఈరోజు ఆఫ్రికన్లకు సహాయం చేయడానికి ఉన్న మంచి మార్గం ఏమిటంటే 261 00:16:02,000 --> 00:16:05,000 వారి కాళ్ల మీద వారిని నిలబడేలా చేయడం. 262 00:16:05,000 --> 00:16:09,000 మరి దానికి మంచి మార్గం వారికి మరిన్ని ఉపాధి మార్గాలు కలిగే పరిస్థితుల రూపకల్పన. 263 00:16:10,000 --> 00:16:14,000 మలేరియాకు వ్యతిరేకంగా పోరాడడం మరియు దానికి నిధులు ఇవ్వడం 264 00:16:14,000 --> 00:16:18,000 మరియు పిల్లల ప్రాణాలు కాపాడడం ముఖ్యాంశం కాదు. అది కాదు నేను చెప్పేది. అది మ౦చిదే! 265 00:16:19,000 --> 00:16:23,000 కానీ కుటుంబం యొక్క పరిస్థితిని ఊహించండి: ఒకవేళ తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే 266 00:16:23,000 --> 00:16:25,000 వారు తమ పిల్లల్ని స్కూళ్లకు పంపుకుంటారు, 267 00:16:25,000 --> 00:16:28,000 వారు తామే మందులు కొనుక్కొని ఈ వ్యాధులనుంచి తమ పిల్లల్ని కాపాడుకోగలరు. 268 00:16:28,000 --> 00:16:32,000 మనం గనుక మీకై మీరే లాభాలను తిరిగి ఇచ్చే ప్రాంతాలలో గనుక పెట్టుబడులు పెడ్తే 269 00:16:32,000 --> 00:16:37,000 అవి ఉద్యోగాలను కల్పించడమేకాక వారు తమ కాళ్లమీద తామునిలబడడానికి సహాయపడ్తాయి, 270 00:16:37,000 --> 00:16:42,000 అది చాలా అద్భుతమైన అవకాశ౦ కాదా? మనం చేయాల్సింది అదేకదా? 271 00:16:42,000 --> 00:16:45,000 మరియు నేను చెప్పేదేమిటంటే కొంతమంది పెట్టుబడులు పెట్టాల్సింది 272 00:16:45,000 --> 00:16:47,000 ఆ ఖండంలోని మహిళల పైన కూడా! 273 00:16:48,000 --> 00:16:55,000 (చప్పట్లు) 274 00:16:55,000 --> 00:17:00,000 నా దగ్గరో సీడీ ఉంది. నన్ను క్షమించండి నాకు సమయపరిమితి గురించి చెప్పలేదు. 275 00:17:00,000 --> 00:17:02,000 లేకపోతే, మీకు ఇది చూపించేవాణ్ని. 276 00:17:02,000 --> 00:17:05,000 "ఆఫ్రికా: వ్యాపార అవకాశాలు." దాని పేరు. 277 00:17:06,000 --> 00:17:09,000 ఈ వీడియో నిజానికి ఒక అవార్డును(బహూమతిని)కూడా సాధించింది 278 00:17:09,000 --> 00:17:11,000 ఆ సంవత్సరానికి బెస్ట్ డాక్యుమెంటరీగా. 279 00:17:11,000 --> 00:17:13,000 దీనిని తయారు చేసిన మహిళలు 280 00:17:13,000 --> 00:17:18,000 టాంజానియాకు వెళుతున్నారు. అక్కడ వారికి జూన్లో ఒక సెషన్ నిర్వహిస్తున్నారు. 281 00:17:19,000 --> 00:17:24,000 ఈ వీడియో ఆఫ్రికన్ల గూర్చి, ముఖ్యంగా ఆఫ్రికన్ మహిళల గురి౦చి 282 00:17:24,000 --> 00:17:29,000 వారు ఎలా పరిస్థితులకు ఎదురొడ్డి వ్యాపార౦లో అభివృద్ధి సాధించారో,వీరిలో కొంతమంది ప్రపంచ స్థాయికి చెందినవారున్నారు. 283 00:17:29,000 --> 00:17:32,000 ఈ వీడియోలోని మహిళల్లో ఒకావిడ పేరు ఆడెనిక్ ఒగులెసి, 284 00:17:32,000 --> 00:17:34,000 పిల్లల బట్టలు తయారుచేస్తు౦ది 285 00:17:34,000 --> 00:17:39,000 ఆవిడ దాన్ని ఒక హాబీలా ఆరంభించి పెద్ద వ్యాపారంగా విస్తరించింది. 286 00:17:39,000 --> 00:17:42,000 మా దగ్గర ఉన్నటువంటివి ఆఫ్రికన్ మెటీరియల్స్ మిక్స్ చేస్తూ, 287 00:17:43,000 --> 00:17:44,000 ఇతర దేశాల మెటీరియల్స్ తో కలిపి. 288 00:17:44,000 --> 00:17:49,000 అలా, ఆమె చిన్న కోర్డురోయ్స్ తో డంగరీస్ జతలు తయారుచేస్తుంది, 289 00:17:49,000 --> 00:17:53,000 అవి చాలా క్రియేటివిటీ కలిగిన డిజైన్లు. 290 00:17:55,000 --> 00:17:58,000 ఆవిడ ఏస్థాయికి చేరుకుందంటే ఆవిడకు వాల్ మార్ట్ నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయి. 291 00:17:59,000 --> 00:18:00,000 (నవ్వులు) 292 00:18:01,000 --> 00:18:03,000 ఒక పదివేల జతలకు. 293 00:18:04,000 --> 00:18:08,000 దాన్ని బట్టి మాదగ్గర అలాంటి పని చేయగల సమర్ధులున్నారని తెలుస్తో౦ది. 294 00:18:08,000 --> 00:18:13,000 ఇక్కడి మహిళలు కష్ట స్వభావులు; వారికి దూర దృష్టి ఉంది; బాగా పని చేస్తారు. 295 00:18:13,000 --> 00:18:15,000 నేను ఇలా ఉదాహరణలు చెప్తూ పోగలను: 296 00:18:15,000 --> 00:18:19,000 రువాండాకు చెందిన బీట్రిస్ గకూబా,పూల వ్యాపారం ప్రారంభించి 297 00:18:19,000 --> 00:18:24,000 ఆమ్ స్టర్ డామ్ లో జరిగే డచ్ ఆక్షన్ కు ప్రతిరోజూ ఉదయం ఎగుమతి చేస్తోంది, 298 00:18:24,000 --> 00:18:28,000 ఆవిడ తోపాటు రెండొందలమంది ఇతర మహిళలు పురుషులు పనిచేస్తున్నారు. 299 00:18:29,000 --> 00:18:33,000 కానీ,ఇందులో చాలా మంది వారి కార్యకలాపాల విస్తరణకు పెట్టుబడులకోసం ఎదురుచూస్తున్నారు, 300 00:18:34,000 --> 00:18:37,000 ఎందుకంటే మా దేశాల వెలుపల మేము చేయగలమని 301 00:18:37,000 --> 00:18:42,000 ఎవరూ నమ్మడం లేదు. ఈ మార్కెట్ యొక్క సామర్ధ్యాన్ని ఎవరూ ఆలోచించడం లేదు. 302 00:18:42,000 --> 00:18:45,000 ఎవరూ అక్కడ అవకాశాల్ని గుర్తించడం లేదు. 303 00:18:45,000 --> 00:18:48,000 కానీ ఇక్కడ నిలబడి నేను చెప్తున్నా ఎవరైతే ఈ రోజు ఈ అవకాశాల పడవను అందుకోలేరో 304 00:18:48,000 --> 00:18:50,000 వారు ఇక ఎప్పటికీ దానిని అందుకోలేరు. 305 00:18:50,000 --> 00:18:56,000 అందుకే మీరు ఆఫ్రికాలో ఉండాలంటే, పెట్టుబడుల గూర్చి ఆలోచించండి. 306 00:18:57,000 --> 00:19:03,000 ప్రపంచంలోని బీట్రిస్ మరియు ఆడెనిక్ ల గూర్చి ఆలోచించండి, 307 00:19:03,000 --> 00:19:06,000 ఎవరైతే విశిష్టమైన పనులు చేసి 308 00:19:06,000 --> 00:19:09,000 గ్లోబల్ ఎకానమీలోకి వస్తున్నారో, అదే సమయంలో తమ తోటి 309 00:19:09,000 --> 00:19:12,000 మహిళలు పురుషులకు ఉపాధి మార్గాన్ని చూపిస్తున్నారో, 310 00:19:12,000 --> 00:19:14,000 మరియు వారి గృహాల్లో పిల్లలు విద్యావంతులౌతున్నారు 311 00:19:14,000 --> 00:19:17,000 ఎందుకంటే వారి తల్లిదండ్రులు సరిపోయినంత సంపాదిస్తున్నారు కాబట్టి. 312 00:19:18,000 --> 00:19:22,000 అందుకే మిమ్మల్ని అవకాశాల్ని అ౦దిపుచ్చుకోవడానికి ఆహ్వానిస్తున్నాను. 313 00:19:23,000 --> 00:19:27,000 టాంజానియాకు మీరు వెళ్తే జాగ్రత్తగా వినండి, 314 00:19:27,000 --> 00:19:31,000 ఎందుకంటే అక్కడుండే వివిధ అవకాశాల గురించి మీకు తప్పకుండా వినిపిస్తుంది 315 00:19:31,000 --> 00:19:36,000 దానివల్ల మీరు లాభపడడమేకాక 316 00:19:36,000 --> 00:19:41,000 ఆ ఖండానికి మరియు ప్రజలకు, మీకు లాభం కలుగుతుంది. 317 00:19:41,000 --> 00:19:42,000 థ్యాంక్యూ వెరీ మచ్. 318 00:19:42,000 --> 00:19:50,000 (చప్పట్లు)