థ్యాంక్యూ వెరీ మచ్ ,క్రిస్.ఇక్కడికి వచ్చినవార౦దరూ కూడా
భయపడ్డామని చెప్పారు.నేను భయపడ్తానో లేదో,నాకు తెలీదు,
కానీ ఇలాంటి శ్రోతల ముందు మాట్లాడడం నాకిదే తొలిసారి.
మరియు మీకు చూపి౦చడానికి నా దగ్గర ఎటువంటి స్మార్ట్ టెక్నాలజీ లేదు.
నా దగ్గర స్లయిడ్లు కూడా లేవు,అందుకే మీరు కేవలం నాతో తృప్తి పడవలసిందే.
(నవ్వులు).
ఈ ఉదయం నేను మీతో కొన్ని కథల్ని షేర్ చేసుకు౦దామనుకు౦టున్నాను. ఈ ఉదయం నేనేంచేద్దామనుకుంటున్నానంటే, కొన్ని కథలు మీతో పంచుకుందామనుకుంటున్నాను.
అ౦తేకాదు ఒక భిన్నమైన ఆఫ్రికా గురించి మాట్లాడదామనుకు౦టున్నాను.
ఇప్పటికే ఈ రోజు ఉదయం ఆఫ్రికా అనగానే కొన్ని సంకేతాలు వెలువడ్డాయి
మీరు ఎప్పుడూ వినేవే: హెచ్ఐవీ/ఎయిడ్స్ ఆఫ్రికా,
మలేరియా ఆఫ్రికా, పేద ఆఫ్రికా, వివాదాలతో కూడిన ఆఫ్రికా,
మరియు విపత్తులతో ని౦డిన ఆఫ్రికా.
అలాంటి అంశాలు కొనసాగుతున్నది నిజమే అయినా,
మీరు ఎప్పుడూ విననటువంటి ఆఫ్రికా మరొకటుంది.
ఆఫ్రికా రె౦డవ కోణ౦ గురి౦చి తెలియకపోవడ౦ చూసి ఒక్కోసారి నేను ఆశ్చర్యపోతుంటాను, ఎ౦దుకిలా జరుగుతు౦దని నన్ను నేనే ప్రశ్ని౦చుకు౦టాను.
ఇది మారుతున్న ఆఫ్రికా, అదే క్రిస్ సూచించినట్లుగా.
ఇది అవకాశాలున్న ఆఫ్రికా.
ఎక్కడైతే ప్రజలు తమ భవిష్యత్తును మరియు తమ తలరాతల్ని తామే మార్చుకోవాలని కోరుకుంటున్నారో అదే ఈ ఆప్రికా.
తమ భవిష్యత్తును మరియు తమ తలరాతల్ని తామే మార్చుకోవాలని కోరుకుంటున్నారు.
మరియు ఈ ఆఫ్రికాలో ప్రజలు దీనిని చెయ్యడం కోసం తమ భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నారు
నేను ఈ రోజు దాని గురించి మాట్లాడలనుకుంటున్నాను.
నేను ఒక కథతో ప్రారంభిస్తాను.
ఆఫ్రికాలో జరుగుతున్న మార్పు కథతో
సెప్టెంబర్ 15,2005 నాడు, మిస్టర్ డిప్రెయే అలీమెసిగా,
చమురుతో సుసంపన్నమైన ఒకానొక నైజీరియా రాష్ట్రాల గవర్నర్,
లండన్ పర్యటనలో ఉన్నప్పుడు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్టు చేసారు.
అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే అతను ఎనిమిది మిలియన్ డాలర్లను
అక్రమంగా తన బినామీ ఎకౌంట్లకు తరలించుకున్నాడని
ఆ ఎకౌంట్లు అతనికి మరియు అతని కుటుంభానికి చెందినవి.
ఈ అరెస్టు సంభవించడానికి కారణం
లండన్ మెట్రోపాలిటన్ పోలీసులకు మరియు
నైజీరియా ఎకనామిక్ అ౦డ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ? విభాగాల మధ్య ఉన్నసహకారం --
ఈ స౦స్థ అత్యంత ప్రతిభావంతమైన మరియు ధైర్యశాలియైన మిస్టర్ నుహు రిబడు ఆధ్వర్యంలో పనిచేసింది.
అలీమెసిగాపై లండన్‌లో నేరారోపణలుచేయబడ్డాయి.
కొన్ని తప్పిదాల వల్ల, అతను ఒక ఆడమనిషి వేషంలో
తప్పించుకొని లండన్ నుంచి నైజీరియా మరల చేరుకున్నాడు, అక్కడ,
మా రాజ్యాంగాల ప్రకారం,చాలా దేశాల్లోలాగే
గవర్నర్, అధ్యక్షుడు- వంటిపదవులలో ఉన్న వారిని
ప్రాసిక్యూట్ చేయకుండా ఉండేందుకు రక్షణ కలిగి ఉన్నారు. కానీ ఏం జరిగింది:
అతని ప్రవర్తనతో ఆగ్రఃహ౦ చె౦దిన ప్రజల కారణంగా
అతణ్ని స్టేట్ అసెంబ్లీ అభిశంసనకు గురిచేసి పదవి నుంచి తొలగించి౦ది.
ఈరోజు, ఆలమ్స్-- మేం ముద్దుగా పిలుచుకునే పేరు- “జైళ్లో ఉన్నాడు”.
ఈ కథ ఆఫ్రికా ప్రజలు యొక్క వాస్తవ పరిస్థితికి అద్ద౦ పడుతు౦ది.
వారు తమ నాయకుల అవినీతిని ఇంక ఏమాత్రం సహించే పరిస్థితిలో లేరనే విషయాన్ని తెల్పుతుంది.
ఈకథ వల్ల ప్రజలు తమ వనరులు తమ మంచి కొరకు సక్రమంగా
వినియోగించబడాలని ఇతర ప్రదేశాలకు తరలించరాదని
అవి కొద్ది మంది ఉన్నతవర్గాల ప్రయోజనాలకోసం వాడొద్దని సూచిస్తుంది.
అందువల్ల, మనం అవినీతిమయ ఆఫ్రికా గురించి విన్నపుడు --
ఎప్పుడూ అవినీతి గురి౦చే వింటాం -- అయితే ఇక్కడి ప్రజలు
మరియు ప్రభుత్వాలు దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని నేను చెప్పాలనుకు౦టున్నాను.
కొన్ని దేశాలు ఈ విషయ౦లో మ౦చి ఫలితాలు కూడా సాధిస్తున్నాయి.
అలా అని సమస్య తీరిపోయిందా? అ౦టే కాదు అనే సమాధానం చెప్పుకోవాలి.
ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది,సాధించాలన్న ఆశయం కూడా ఉంది.
ఈ ముఖ్యమైన యుద్ధంలో విజయాలు కూడా లభిస్తున్నాయి.
కాబట్టి మీరు అవినీతిని గురించి విన్నపుడు,
అక్కడ అవినీతికి వ్యతిరేక౦గా ఏమీ జరగడం లేదని అనుకోకండి --
అలాగే ఆఫ్రికాలో పెచ్చుమీరిన అవినీతి మూలంగా
మనం పని చేయలేమని కూడా అనుకోకండి. అది ఏ మాత్రం నిజం కాదు.
యుద్ధం చేయాలన్న సంకల్పం ఉంది, చాలా దేశాలలో, ఈ యుద్ధం కొనసాగుతోంది
కొన్ని చోట్ల విజయాలు దక్కుతున్నాయి.
మా నైజీరియా వంటి ధీర్ఘకాలిక నియంత పాలన చరిత్ర కలిగిన దేశాలలో కూడా
ఈ యుద్ధం కొనసాగుతోంది. ఈ విషయ౦లో చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.
నిజమైన విషయం ఏంటంటే అది కొనసాగుతోంది.
ఫలితాలు కనిపిస్తున్నాయి:
ప్రపంచ బ్యాంకు మరియు ఇతర సంస్థల స్వతంత్ర పర్యవేక్షణలో
చాలా స౦దర్భాలలో ఈ అవినీతి ధోరణిలోతగ్గుదల కనిపిస్తోంది
మరియు పరిపాలన మెరుగుపడుతోంది.
ఎకనామిక్ కమిషన్ ఫర్ ఆఫ్రికా యొక్క అధ్యయనం ప్రకార౦
28 ఆఫ్రికా దేశాలలో పరిపాలన విషయంలో స్పష్టమైన ఉన్నతి ధోరణిలు కనిపిస్తున్నాయి.మెరుగుదల కనిపి౦చి౦ది.
మరియు నన్ను మరో విషయం చెప్పనివ్వండి
ఈ పరిపాలనా అంశం నుంచి వెళ్లేముందు.
ప్రజలు అవినీతీ, అవినీతీ అంటూ మాట్లాడుతుంటారు.
అలా మాట్లాడినప్పుడల్లా
మీరు ఆఫ్రికా గురించే ఆలోచిస్తారు.
అది ఆఫ్రికా దేశాల యొక్క ఇమేజీ. కానీ నన్ను ఇది చెప్పనివ్వండి:
ఈ అలామా లండన్ లోని ఒక ఎకౌంటుకు 8 మిలియన్ డాలర్లు పంపించగలిగాడంటే --
ఇంకా ఇలా డబ్బు తిన్న ఇతరుల గురించి వేసిన అంచనాలలో
వర్ధమాన దేశాల యొక్క నిధుల్లో 20 నుంచి 40 బిలియన్లు
బయటికి తరలిపోయి అభివృద్ధి చెందిన దేశాలకు చేరాయి -- వాళ్ళు కూడా ఇలా చేయగలిగారంటే,
దానిని ఏమనాలి? అది మాత్రం అవినీతి కాదా?
ఈ దేశంలో, మీరు దొంగ వస్తువులు స్వీకరిస్తే, మీరు ప్రాసిక్యూట్ చేయబడరా?
అందుకే మనం ఇటువంటి అవినీతి గూర్చి మాట్లాడేటపుడు, ఆలోచించాల్సిందేమిటంటే
ప్రపంచంలోని అవతలి భాగంలో ఏం జరుగుతుందో గమనించండి --
ఈ డబ్బు ఎక్కడికి వెళ్తోంది మరియు దీన్ని నిరోధించడానికి ఏంచేయాలి.
నేను ప్రపంచబ్యాంకు మద్దతుతో
ఈ నిధుల రికవరీ అభిప్రాయ నివేదికమీద ఇప్పుడు పనిచేస్తున్నాను. ఈ విషయ౦లో మాకు సాధ్యమయ్యింది చేయడానికి
బయటి దేశాలకు తరలిపోయిన ధనాన్ని వెనుకకు రప్పించేందుకు --
వర్ధమాన దేశాల ధనాన్ని - స్వీకరించి వెనుకకు పంపేందుకు ప్రయత్న౦ చేస్తున్నాను.
ఎందుకంటే మనం అక్కడికి తరలిపోయిన 20 బిలియన్ డాలర్లను వెనక్కి తేగలిగితే,
అది ఈ ఈ దేశాలకు చాలామొత్తం అవుతుంది
ఈ దేశాలకు అందించే సహాయం అంతా కలుపుకున్నదానికంటే ఎక్కువ కూడా!
(చప్పట్లు)
నేను మాట్లాడదల్చుకున్న రెండో అంశం సంస్కరణల పట్ల ఉన్న సంకల్పం గురించి.
ఆఫ్రికన్లు, బాగా అలసి పోయారు, మేము కూడా అలసిపోయాము.
ఇతర దేశాల యొక్క దయా దాక్షిణ్యాల పైన ఆధారపడీ పడీ.
మేం చాలా కృతజ్ఞులం, కానీ మాకు తెలుసు
మాకు సంస్కరణల పట్ల చిత్తశుద్ధి ఉంటే మా తలరాతల్ని మేము మార్చుకోగలం.
మరియు ఇప్పుడు ఎన్నో ఆఫ్రికా దేశాలు ఈ వాస్తవాన్ని గ్రహిస్తున్నాయి.
అదేమిటంటే మనం తప్ప ఇంకెవరో వచ్చి ఇక్కడ ఏమీ చేయలేరు. మనం మాత్రమే చేయాలి.
మనం మనకు మద్దతునిచ్చేవారిని భాగస్వాములుగా ఆహ్వానించవచ్చు, కానీ మనమే ప్రారంభించాలి.
మనం మన ఎకానమీలను సంస్కరించుకోవాలి, మన నాయకత్వాన్ని మార్చాలి.,
మరింత ప్రజాస్వామికంగా మారాలి, మరింత మార్పుకు, సమాచార మార్పిడికి సిద్ధంకావాలి.
మేము ఇలా చెయ్యడం ప్రార౦భి౦చా౦
ఈ ఖండం లోని అతిపెద్ద దేశాలలో,నైజీరియా ఒకటి
ఒకమాట చెప్పాలంటే, మీరు నైజీరియాలో లేకపోతే, మీరు ఆఫ్రికాలో లేనట్లే.
నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఇదే!
(నవ్వులు).
ప్రతి నలుగురు సబ్ సహారా ఆఫ్రికన్ లలో ఒకరు నైజీరియన్.
అందులో నూట నలభైమిలియన్ల డైనమిక్ ప్రజలున్నారు -- అసంగ్దితంలో ఉన్న ప్రజలు --
కానీ చాలా ఆసక్తికరమైన ప్రజలు. మీరు ఎప్పటికీ విసుగు చెందరు.
(నవ్వులు).
మేము వాస్తవాలను తెలుసుకోవడ౦ ప్రార౦భి౦చా౦
మేము మమ్మల్ని మార్చుకొని సంస్కరించుకోవాలనుకున్నా౦.
ఒక నాయకుని మద్దతుతో
ఎవరైతే, ఆ సమయంలో, సంస్కరణలకు సిద్ధంగా ఉంటారో వారితో
మేము ఒక సమగ్ర సంస్కరణ ప్రణాళికను
మేమే తయారుచేసుకున్నా౦ దానిని అమలు చేయాలనుకున్నా౦.
అంతర్జాతీయ ద్రవ్యనిధి కాదు. ప్రపంచబ్యాంకూ కాదు,
అక్కడ నేను ఇరవై ఒక్క సంవత్సరాలపాటు పనిచేసి వైస్ ప్రెసిడెంట్ వరకు ఎదిగాను.
మీకోసం ఎవరూ ఏమీ చేయలేరు. మీకోసం మీరు మాత్రమే చేయగలరు.
మేము ఒక పథకాన్ని రూపొందించాము, దానిప్రకారం, ఈ పథక౦లో ప్రభుత్వానికి
ఎలా౦టి సబ౦ధ౦ ఉ౦డదు - ఇది దానికి అవసరం లేని అంశం.
ప్రభుత్వం వస్తువుల ఉత్పత్తి మరియు సేవల
తయారీ వ్యాపారంలో ఉండకూడదు
ఎందుకంటే అది అసమర్ధురాలు మరియు అశక్తురాలు
అందుకే మేము మా వ్యాపారాల్ని ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయించాం.
(చప్పట్లు).
దా౦తో మేము మా మార్కెట్లను లిబరలైజ్ చేయాలని నిర్ణయించుకున్నాం.
మీరు నమ్ముతారా, 2003 చివర్లో మొదలైన ఈ సంస్కరణలకు ము౦దు
నేను వాషింగ్టన్ వదిలిపెట్టి
నైజీరియ ఫైనాన్స్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టేందుకు వెళ్లినప్పుడు --
మా దగ్గర ఒక టెలికమ్యూనికేషన్ కంపెనీ ఉంది అది కేవలం
ముప్పై సంవత్సరాల చరిత్రలో 4500 ల్యాండ్ లైన్లను మత్రమే ఇవ్వగలిగింది
(నవ్వులు)
టెలిఫోన్ కలిగి ఉండడం మా దేశంలో ఒక పెద్ద విలాసం.
మీరు దాన్ని పొందలేరు. దానికి లంచాలివ్వాలి.
మీరు ఫోన్ పొందడానికి చేయాల్సిందంతాచేయాలి.
అధ్యక్షుడు ఒబసాంజో మద్దతుతో
టెలికమ్యూనికేషన్ రంగం యొక్క లిబరలైజేషన్ మొదలై౦ది
మేము 4500 లాండ్ లైన్లనుంచి 32మిలియన్ల జీఎస్సెమ్ లైన్లకు వెళ్లిపోయాం,ఇవి ఇంకా పెరుగుతున్నాయి.
చైనా తరువాత నైజీరియా టెలికాం మార్కెట్ ప్రపంచంలో రెండో - అతివేగంగా పెరుగుతున్న మార్కెట్,
మా టెలికం రంగంలోకి సంవత్సరానికి దాదాపు ఒక బిలియన్ డాలర్ పెట్టుబడులు వస్తున్నాయి
ఈ విషయ౦ కొద్దిమంది తెలివైన వాళ్ళకు తప్ప ఎవరికీ తెలియదు
(నవ్వులు).
మొట్టమొదట చురుకైన వాళ్ళు వచ్చారు
అది సౌతాఫ్రికాకు చెందిన ఎంటీఎన్ కంపెనీ.
నేను ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న మూడు సంవత్సరాలలో,
వారు సంవత్సరానికి సగటున 360 మిలియన్ డాలర్ల లాభం సంపాదించుకున్నారు.
360 మిలియన్లు ఒక మార్కెట్లో - ఒక దేశంలో అదీ ఒక పేద దేశంలో,
సగటు తలసరి దేశ ఆదాయం కేవలం 500 డాలర్లు ఉన్న దేశంలో.
అంటే అక్కడ మార్కెట్ ఉంది.
ఇప్పుడు దాన్ని బంధనంలో కట్టి ఉంచారు, కానీ తొందరలోనే అందరికీ తెలుస్తుంది.
నైజీరియన్లు తమకు తాము అభివృద్ధి సాధించడం మొదలుపెట్టారు.
కొన్ని వైర్ లెస్ టెలికమ్యూనికేషన్ కంపెనీలు,
మరియు మూడు లేదా నాలుగు ఇతర క౦పెనీలు వచ్చాయి.
కానీ అక్కడ చాలా పెద్ద మార్కెట్ ఎదురుచూస్తోంది,
ప్రజలకు దాని గురించి తెలియదు, లేదా వాళ్లు తెలుసుకోవద్దనుకుంటున్నారు.
ప్రైవేటైజేషన్ మేం చేసిన విషయాలలో ఒకటి.
మేం చేసిన మరో విషయం మా ఆర్థికవనరులను మెరుగ్గా నిర్వహించుకోవడం.
ఎందుకంటే మీకు సహాయపడడానికి గానీ సలహా ఇవ్వడానికి గానీ ఎవరూ లేరు
మీరు మీ ఆర్థికవనరులను సరిగా నిర్వహించుకోలేకపోతే.
నైజీరియాలోని చమురు ర౦గానికి మ౦చి పేరు ఉంది.
స్వంత ప్రజానిధులను సరిగ్గా నిర్వహించుకోలేదని, అవినీతిమయమనే పేరు.
అందుకే మేమేం చేయాలనుకున్నామంటే, ఒక ద్రవ్య నియత్రణ చట్టాన్ని తీసుకు వచ్చాము
చనురు ధరతో మా బడ్జెట్‌కు ఉన్న సంబందాన్ని తొలగించాము.
అంతకుముందు మేము వెలికి తీసే చమురును దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ తయారుచేసే వాళ్లం,
ఎందుకంటే,మా దేశ౦లో ఎక్కువ రెవెన్యూ సంపాదించేది చమురే కాబట్టి.
మా ఆదాయంలో డెబ్భైశాతం ఆయిల్ నుంచే వస్తు౦ది.
మేం దానిని తొలిగించాక బడ్జెట్ ను తయారుచేయడ౦ ప్రార౦భి౦చా౦
ఆయిల్ మార్కెట్ ధరకంటే కొద్దిగా తక్కువధరను లెక్కలోకి తీసుకున్నా౦
దానికన్నా ఎక్కువవచ్చిందంతా పొదుపుచేశా౦.
మాకు తెలీదు మేము అలా ముందుకుపోగలమో లేదో; అది చాలా వివాదాస్పదం అయింది.
కాని అది వెంటనే తెచ్చిన మార్పు మాత్రం అస్థిరత్వాన్ని దూర౦చేయడ౦.
మాదేశ౦లో ఆర్ధిక అభివృద్ధికి సంబంధించిన అస్థిరత --
ఎప్పుడైతే ఆయిల్ ధరలు పెరిగాయో అప్పుడు మేము బాగా పురోగమించాము, ఎప్పుడైతే అవి దెబ్బతిన్నాయో, మేము దెబ్బతిన్నాం..
ఎప్పుడు ఆయిల్ ధర పతనమైతే, మేమూ పతనమయ్యాం.
దాంతో మేం కొద్ది మొత్తాలనుకూడా చెల్లించలేకపోయేవాళ్లం, కనీస౦ జీతాలు కూడా,
ఆ అస్థిరత తొలగిపోయింది. నేను పదవి దిగే సమయానికి,
27బిలియన్ డాలర్లు మేము పొదుపుచేయగలిగాము,అది మా నిల్వలకు వెళ్లిపోయింది --
నేను పదవిలోకి వచ్చేప్పుడు 2003 లో అది 7 బిలియన్ డాలర్లుండేది.
నేను పదవి దిగేనాటికి అది దాదాపు 30 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఇప్పుడు, మా నిల్వ నిధులలో 40 బిలియన్ డాలర్లున్నాయి.
మా ఫైనాన్స్ లను సక్రమంగా నిర్వహించడం వల్లనే ఇది సాధ్య౦ అయ్యి౦ది.
అది మా ఎకానమీని పెంచింది, స్థిరపరిచింది.
మా మారకం రేటు ఎప్పటికీ ఊరికే ఎగుడుదిగుడులకు లోనవుతూ ఉండేది
కాని ఇప్పుడు దాదాపు స్థిరత్వం సాధించింది, కాబట్టి వ్యాపార వర్గాలు
మా ఎకానమీలో ధరలను ఊహించగలుగుతున్నారు.
మేము ద్రవ్యోల్బనాన్ని 28 శాతం నుంచి 11 శాతానికి తగ్గించగలిగాము.
గత దశాబ్దకాలంగా సగటున 2.3 ఉన్న జీడీపీ పెరుగుదల రేటు
ఇప్పుడు 6.5 శాతానికి పెరిగింది.
కాబట్టి మేం చేపట్టిన మార్పులు మరియు సంస్కరణలు
మా ఎకానమీలో చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు తీసుకురాగలిగాయి.
మరో ముఖ్యమైన వ్విషయమేమిటంటే, మేం ఆయిల్ పై ఆధారపడట౦ తగ్గి౦చి
ఇతర ర౦గాలవైపు చూడాలనుకు౦టున్నాము-- ఇటువైపు చాలా అవకాశాలు ఉన్నాయి
ఈ ఒక పెద్ద దేశంలోనే కాదు, ఆఫ్రికాలోని చాలా దేశాలలో కూడా --
మరొక నిర్ణయాత్మక విషయమేమిటంటే ఇంత ఎక్కువ పెరుగుదల రేటు వచ్చింది
ఆయిల్ రంగం నుంచి మాత్రమే కాదు, నాన్- ఆయిల్ ర౦గ౦ ను౦చి కూడా!
వ్యవసాయ రంగం ఎనిమిది శాతానికి పైగా వృద్ధిరేటు సాధించింది.
అలాగే టెలికాం సెక్టార్, హౌజింగ్ మరియు నిర్మాణ రంగాలు పెరిగాయి,
మరియు నేను చెబుతూ ఉ౦టే దీనికి అ౦త౦ ఉ౦డదు. మీకు చూపి౦చదలచుకున్నదేమిట౦టే
మీరు మీ స్థూల ఆర్థికవ్యవస్థను దారిలో పెడితే,
ఇతర రంగాలలో అవకాశాలు అపారంగా ఉ౦టాయి.
నేను చెప్పినట్లు.మాకు వ్యవసాయ రంగంలో అవకాశాలున్నాయి,
మాకు ఖనిజవనరుల్లో అవకాశాలున్నాయి. మా దగ్గర చాలా ఖనిజాలున్నాయి
వాటిని ఎవరూ కనిపెట్టలేదు మరియు వాటిపై పెట్టుబడిపెట్టలేదు. మాకు తెలిసింది
ఏమిటంటే సరి అయిన చట్టాలు లేకుండా దాన్ని సాధించలేమని,
అందుకే మేము ఒక మైనింగ్ కోడ్ తయారుచేశాం
అది ప్రపంచం లోని ఉన్నతమయిన వాటిలో ఒకటి.
మాకు హౌజింగ్ మరియు రియల్ ఎస్టేట్‌లో అవకాశాలున్నాయి.
నూటా నలభై మిలియన్ ప్రజలున్న ఈ దేశంలో ఏమీలేవు --
ఇక్కడ మీరు చుసినట్లుగా అక్కడ షాపింగ్ మాల్స్ లేవు.
ఇది కొంతమందికి పెట్టుబడులు పెట్టేందుకు అనువైన అవకాశం
అది దార్శణీయమనస్తత్వం ఉన్నవారిని ఉత్తేజితులను చేసి౦ది.
ఇప్పుడు,మా దగ్గర ఉన్న ఈ మాల్స్ లో
వాళ్లు ఊహించిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ టర్నోవర్ జరుగుతోంది.
అందుకే, నిర్మాణరంగం, రియల్ ఎస్టేట్,
మార్ట్ గేజ్ మార్కెట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో అపార అవకాశాలున్నాయి.
మా దగ్గర 89 బ్యాంకులుండేవి. చాలా బ్యాంకులు నిజమైన వ్యాపారం చేసేవి కాదు.
వాటిని సంస్కరించి పటిష్టపరచి 89 బ్యాంకుల్ని 25 బ్యాంకులుగా చేశాం
ఎలాగంటే వాళ్ళకి అవసరమైన పెట్టుబడి - షేర్ క్యాపిటల్- ను పెంచడం ద్వారా-
మరియు అది $25 మిలియన్ల నుంచి $150 మిలియన్లకు చేరుకుంది.
ఈ బ్యాంకులు- సంఘటితమవడం వల్ల, అవి నిలదొక్కుకుంటున్నాయి
అది మా బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది విదేశీయులు ఆకర్శితులౌతున్నారు.
యూకే కు చెందిన బార్క్లీస్ బ్యాంకు ఐదొందల మిలియన్లను తెస్తోంది.
స్టాన్డర్డ్చార్ట్ర్ నూటా నలభై మిలియన్లు తెచ్చింది.
మరి అలా చెప్పుకుంటూ పోగలను. డాలర్లు, అలా అలా వచ్చి పడుతున్నాయి. వ్యవస్థలోకి.
మేము ఇన్సూరెన్స్ రంగంతోనూ అలాగే చేస్తున్నాము.
అందుకే ఫైనాన్షియల్ సర్వీసెస్, ఒక గొప్ప అవకాశం ఉన్న రంగం.
ఇక టూరిజం, ఆఫ్రికాలోని చాలా దేశాలు, ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయి.
చాలా మందికి తూర్పు ఆఫ్రికా తెలుసు:
వన్యప్రాణులు, ఏనుగులు మొదలగునవి అక్కడ ఉ౦టాయి.
కానీ టూరిజం మార్కెట్ ను
ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా నిర్వహించడం చాలా ముఖ్యం.
నేను ఏం చెప్పదలచుకున్నాను అంటే ? నేను చెప్పదలచుకున్నదేమిటంటే
మా ఖండంలో ఒక కొత్త వేవ్ నడుస్తోంది.
2000 సంవత్సరం నుంచీ, ఒక కొత్త వేవ్ మరియు తలుపులు తెరిచిన ప్రజాస్వామ్య వ్యవస్థ కనిపిస్తు౦ది.
ఆఫ్రికాలోని మూడింట రెండు వంతుల్లోని దేశాల్లో
బహుళ పార్టీల ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయి.
అందులో అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయని కాదు, లేదా ఉండవు కూడా,
కానీ ట్రెండ్ మాత్రం క్లియర్ గా ఉంది.
నేను చెప్పాలనుకుంటున్నదేమిట౦టే గత మూడేళ్లుగా,
ఈ ఖండపు సగటు పెరుగుదల రేటు పెరుగుతోంది
ఏటా 2.5 శాతం నుంచి 5 శాతానికి.
ఇది ఎన్నోOECD దేశాల పని చేసే విధానం కన్నా బాగానే ఉంది.
అందువల్ల పరిస్థితులు మారుతున్నాయని అర్ధం అవుతోంది.
ఖండంలో యుద్దాలు తగ్గుతున్నాయి:
ఇంతకుముందు దశాబ్దంలో పన్నెండు వైరుధ్యాలుంటే,
ఇప్పుడు మూడు లేదా నాలుగుకు తగ్గిపోయాయి.
నిజంగా అన్నిట్లోకి భయంకరమైనదే, డార్ఫర్
మరియు, మీకు తెలుసు, మీపై పొరుగు ప్రాంతాల ప్రభావ౦ ఉంటుంది
ఖండం లోని ఒక ప్రాంతంలో జరిగే సంఘటనల ప్రభావం వల్ల,
మొత్తం ఖండం దెబ్బతినే పరిస్థితి ఉంటుంది.
కానీ మీరు తప్పక తెలుసుకోవాల్సిందేమిటంటే ఈ ఖండం --
ఎన్నో దేశాలున్న ఖందం , ఒక్క దేశం మాత్రమే కాదు.
మరి మేము మూడు నాలుగు వైరుధ్యాలకే పరిమితమయ్యామంటే,
దాని అర్ధం అక్కడ పెట్టుబడులకు సమృద్ధిగా అవకాశాలున్నాయని అర్ధం.
మాది స్థిర౦గా పెరుగుతున్న, ఆసక్తికరమైన ఎకానమీ
ఇక్కడ అనేకానేక అవకాశాలున్నాయి.
అ౦తేకాదు ఈ పెట్టుబడుల గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను.
ఈరోజు ఆఫ్రికన్లకు సహాయం చేయడానికి ఉన్న మంచి మార్గం ఏమిటంటే
వారి కాళ్ల మీద వారిని నిలబడేలా చేయడం.
మరి దానికి మంచి మార్గం వారికి మరిన్ని ఉపాధి మార్గాలు కలిగే పరిస్థితుల రూపకల్పన.
మలేరియాకు వ్యతిరేకంగా పోరాడడం మరియు దానికి నిధులు ఇవ్వడం
మరియు పిల్లల ప్రాణాలు కాపాడడం ముఖ్యాంశం కాదు. అది కాదు నేను చెప్పేది. అది మ౦చిదే!
కానీ కుటుంబం యొక్క పరిస్థితిని ఊహించండి: ఒకవేళ తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే
వారు తమ పిల్లల్ని స్కూళ్లకు పంపుకుంటారు,
వారు తామే మందులు కొనుక్కొని ఈ వ్యాధులనుంచి తమ పిల్లల్ని కాపాడుకోగలరు.
మనం గనుక మీకై మీరే లాభాలను తిరిగి ఇచ్చే ప్రాంతాలలో గనుక పెట్టుబడులు పెడ్తే
అవి ఉద్యోగాలను కల్పించడమేకాక వారు తమ కాళ్లమీద తామునిలబడడానికి సహాయపడ్తాయి,
అది చాలా అద్భుతమైన అవకాశ౦ కాదా? మనం చేయాల్సింది అదేకదా?
మరియు నేను చెప్పేదేమిటంటే కొంతమంది పెట్టుబడులు పెట్టాల్సింది
ఆ ఖండంలోని మహిళల పైన కూడా!
(చప్పట్లు)
నా దగ్గరో సీడీ ఉంది. నన్ను క్షమించండి నాకు సమయపరిమితి గురించి చెప్పలేదు.
లేకపోతే, మీకు ఇది చూపించేవాణ్ని.
"ఆఫ్రికా: వ్యాపార అవకాశాలు." దాని పేరు.
ఈ వీడియో నిజానికి ఒక అవార్డును(బహూమతిని)కూడా సాధించింది
ఆ సంవత్సరానికి బెస్ట్ డాక్యుమెంటరీగా.
దీనిని తయారు చేసిన మహిళలు
టాంజానియాకు వెళుతున్నారు. అక్కడ వారికి జూన్‌లో ఒక సెషన్ నిర్వహిస్తున్నారు.
ఈ వీడియో ఆఫ్రికన్ల గూర్చి, ముఖ్యంగా ఆఫ్రికన్ మహిళల గురి౦చి
వారు ఎలా పరిస్థితులకు ఎదురొడ్డి వ్యాపార౦లో అభివృద్ధి సాధించారో,వీరిలో కొంతమంది ప్రపంచ స్థాయికి చెందినవారున్నారు.
ఈ వీడియోలోని మహిళల్లో ఒకావిడ పేరు ఆడెనిక్ ఒగులెసి,
పిల్లల బట్టలు తయారుచేస్తు౦ది
ఆవిడ దాన్ని ఒక హాబీలా ఆరంభించి పెద్ద వ్యాపారంగా విస్తరించింది.
మా దగ్గర ఉన్నటువంటివి ఆఫ్రికన్ మెటీరియల్స్ మిక్స్ చేస్తూ,
ఇతర దేశాల మెటీరియల్స్ తో కలిపి.
అలా, ఆమె చిన్న కోర్డురోయ్స్ తో డంగరీస్ జతలు తయారుచేస్తుంది,
అవి చాలా క్రియేటివిటీ కలిగిన డిజైన్లు.
ఆవిడ ఏస్థాయికి చేరుకుందంటే ఆవిడకు వాల్ మార్ట్ నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయి.
(నవ్వులు)
ఒక పదివేల జతలకు.
దాన్ని బట్టి మాదగ్గర అలాంటి పని చేయగల సమర్ధులున్నారని తెలుస్తో౦ది.
ఇక్కడి మహిళలు కష్ట స్వభావులు; వారికి దూర దృష్టి ఉంది; బాగా పని చేస్తారు.
నేను ఇలా ఉదాహరణలు చెప్తూ పోగలను:
రువాండాకు చెందిన బీట్రిస్ గకూబా,పూల వ్యాపారం ప్రారంభించి
ఆమ్ స్టర్ డామ్ లో జరిగే డచ్ ఆక్షన్ కు ప్రతిరోజూ ఉదయం ఎగుమతి చేస్తోంది,
ఆవిడ తోపాటు రెండొందలమంది ఇతర మహిళలు పురుషులు పనిచేస్తున్నారు.
కానీ,ఇందులో చాలా మంది వారి కార్యకలాపాల విస్తరణకు పెట్టుబడులకోసం ఎదురుచూస్తున్నారు,
ఎందుకంటే మా దేశాల వెలుపల మేము చేయగలమని
ఎవరూ నమ్మడం లేదు. ఈ మార్కెట్ యొక్క సామర్ధ్యాన్ని ఎవరూ ఆలోచించడం లేదు.
ఎవరూ అక్కడ అవకాశాల్ని గుర్తించడం లేదు.
కానీ ఇక్కడ నిలబడి నేను చెప్తున్నా ఎవరైతే ఈ రోజు ఈ అవకాశాల పడవను అందుకోలేరో
వారు ఇక ఎప్పటికీ దానిని అందుకోలేరు.
అందుకే మీరు ఆఫ్రికాలో ఉండాలంటే, పెట్టుబడుల గూర్చి ఆలోచించండి.
ప్రపంచంలోని బీట్రిస్ మరియు ఆడెనిక్ ల గూర్చి ఆలోచించండి,
ఎవరైతే విశిష్టమైన పనులు చేసి
గ్లోబల్ ఎకానమీలోకి వస్తున్నారో, అదే సమయంలో తమ తోటి
మహిళలు పురుషులకు ఉపాధి మార్గాన్ని చూపిస్తున్నారో,
మరియు వారి గృహాల్లో పిల్లలు విద్యావంతులౌతున్నారు
ఎందుకంటే వారి తల్లిదండ్రులు సరిపోయినంత సంపాదిస్తున్నారు కాబట్టి.
అందుకే మిమ్మల్ని అవకాశాల్ని అ౦దిపుచ్చుకోవడానికి ఆహ్వానిస్తున్నాను.
టాంజానియాకు మీరు వెళ్తే జాగ్రత్తగా వినండి,
ఎందుకంటే అక్కడుండే వివిధ అవకాశాల గురించి మీకు తప్పకుండా వినిపిస్తుంది
దానివల్ల మీరు లాభపడడమేకాక
ఆ ఖండానికి మరియు ప్రజలకు, మీకు లాభం కలుగుతుంది.
థ్యాంక్యూ వెరీ మచ్.
(చప్పట్లు)