అయితే, వడ్డీ అంటే ఏమిటి?
మనందరం దాని గురించి వినే ఉంటాం.
ఒక సంవత్సరం.
ఇది మీరు, ఇది నేను.
ఇప్పుడు మీరు నాకు $100 ఇవ్వండి.
అయితే, నా వద్ద $100 ఉన్నాయి, అలా సంవత్సరం గడచింది,
నా దగ్గర $100 ఇంకా ఉన్నాయి.
నేనా $100 మీకు తిరిగి ఇచ్చేస్తే,
మీరు అద్దె ఏమీ తీసుకోనట్టు.
కేవలం మీ డబ్బు మీకు తిరిగివచ్చిందంతే.
మీరు వడ్డీ ఏమీ వసూలు చేయలేదు.
కానీ మీరు $100 ఇప్పుడు ఇస్తాను కానీ
సంవత్సరం తర్వాత $110 ఇవ్వాలి అని అన్నారనుకోండి.
అలాంటప్పుడు, నేను మీకు ఎంత ఇవ్వాలి
$100 లను ఒక సంవత్సరం ఉంచుకున్నందుకు?
నేను $10 అదనంగా చెల్లిస్తాను, కదా?
నేను $100 తిరిగి ఇచ్చేస్తున్నాను, ఆపై ఇంకో $10 కూడా ఇస్తున్నాను.
నేను అదనంగా ఇచ్చే $10
మీ డబ్బును నేను ఉంచుకున్నందుకు గానూ మీరు ఇచ్చే రుసుము
ఆ $10 వడ్డీ.
$100, 10%తో కూడి.
ఇప్పుడు బారువడ్డీ మరియు
చక్రవడ్డీల మధ్య తేడాలను చూద్దాం.
అవునా?