ఇంటర్నెట్: HTTP మరియు HTML
నాపేరు జాస్మిన్, నేను XBOX వన్ ఇంజనీరింగ్
టీములో ప్రోగ్రాం మేనేజర్ గా చేస్తున్నా.
మా అతిపెద్ద ఫీచర్లలో ఒకటి XBOX లైవ్. ఇదొక
ఆన్లైన్ సర్వీస్, ఇది ప్రపంచవ్యాప్తంగా
గేమర్లను కనెక్ట్ చేస్తుంది, మరియు అది
జరగడానికి మేము ఇంటర్నెట్ పై ఆధారపడతాం. ఇది
అంత సులువైన పనేమీ కాదు, తెరవెనుక ఎన్నో
పనులు జరుగుతుంటాయి. ప్రజలు స్పందించి మరియు
కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి ఇంటర్నెట్ మొత్తం
మారుతూ ఉంది.ఐతే ఇదెలా పనిచేస్తుంది? ప్రపంచ
వ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లు ఒకదాంతో మరోటి
ఎలా మాట్లాడుకుంటాయి?వెబ్ బ్రౌజింగ్ చూద్దాం
మొదట ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి.ఇది మీరు
వెబ్ పేజీల్ని చేరుకోవడానికి వాడే యాప్. ఇక
వెబ్ అడ్రస్ లేదా URL టైప్ చేయండి, దానర్థం
మీరు విజిట్ చేయాలనుకునే వెబ్సైట్ యొక్క
యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్,tumblr.com లా.
హై, నేను డేవిడ్ కార్ప్, Tumblr ఫౌండర్ ని.
మనం రోజూ వాడే వెబ్ బ్రౌజర్లు వాస్తవంగా ఎలా
పనిచేస్తాయో మాట్లాడేందుకు మేమిక్కడ ఉన్నాం.
మీ వెబ్ బ్రౌజరులో ఒకఅడ్రస్ టైప్ చేసి ఎంటర్
కొడితే ఏం జరుగుతుందని ఆశ్చర్యపోవచ్చు.
అది మీరు ఊహించనంత అద్భుతంగా ఉంటుంది మరి.
ఆ క్షణంలో మీ కంప్యూటర్ సర్వర్ అనే మరో
కంప్యూటర్ తో మాట్లాడటం మొదలుపెడుతుంది, అది
మామూలుగా వేలాది మైళ్ళదూరంలో ఉంటుంది. మరి
మిల్లీసెకెన్లలో మీ కంప్యూటర్ ఒక వెబ్సైట్
కోసం సర్వర్ ని అడుగుతుంది, మరి ఆ సర్వర్ మీ
కంప్యూటర్ తో HTTPఅనేభాషలో తిరిగి మాట్లాడటం
మొదలుపెడుతుంది. HTTP అంటే,హైపర్ టెక్స్ట్
ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. దాన్ని మీరు ఒక
కంప్యూటర్ మరొక కంప్యూటర్ ని ఒకడాక్యుమెంట్
కోసం అడిగే భాషగా అనుకోవచ్చు. మరియు అది
వాస్తవంగా చక్కగా ముక్కుసూటిగా అడగడంవంటిది.
మీరు గనక మీ కంప్యూటర్ మరియు వెబ్ బ్రౌజర్
మధ్య సంభాషణను ఇంటర్నెట్ పై అడ్డుకుంటే,
అది ప్రధానంగా "GET" అభ్యర్థనలు అనబడే
వాటితో చేయబడుతుంది. అవి నిజంగా చాలా
సులువైన పదం GET మరియు మీరు కోరుతున్న
డాక్యుమెంట్ పేరుగా ఉంటుంది. కావున మీరు
Tumblr లోనికి లాగిన్ అయి,మా లాగిన్ పేజీ
కావడానికి ప్రయత్నిస్తే మీరు Tumblr సర్వర్
లో GET/లాగిన్ కు అభ్యర్థన పంపుతున్నట్లు.
Tumblr లాగిన్ పేజీ కోసం మీకు HTML కోడ్
అవసరమవుతుందని అది Tumblr కు చెబుతుంది. మరి
HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్
మరియు ఒక పేజీ ఎలా కనిపించాలో వెబ్ బ్రౌజర్
కు చెప్పడానికి మీరు ఆ లాంగ్వేజ్ వాడవచ్చు.
మీరు వికీపీడియా గురించి ఆలోచిస్తే, నిజంగా
అది పెద్ద సులువైన డాక్యుమెంట్ మరియు మీరు
ఆ శీర్షికను పెద్దది మరియు లావుగా చేయడానికి
సరైన ఫాంట్ చేయడానికి, కొంత వచనాన్ని కొన్ని
ఇతర పేజీలకు లింక్ చేయడానికి, కొంతవచనం లావు
చేయడానికి, కొంత ఇటాలిక్ చేయడానికి, పేజీ
మధ్యలో ఒక బొమ్మ ఉంచడానికి, బొమ్మను కుడికి
జరపడానికి, బొమ్మను ఎడమకు జరపడానికి మీరు
వాడే లాంగ్వేజ్ HTML అయి ఉంటుంది. వెబ్ పేజీ
వచనం నేరుగా HTML లో చేర్చబడి ఉంటుంది, ఐతే
బొమ్మలు లేదా వీడియోలవంటి ఇతర భాగాలు వాటి
స్వంత URLతో విడిఫైల్స్ గా ఉంటాయి, దాన్ని
కోరవలసి ఉంటుంది. వీటికి బ్రౌజర్ విడిగా
HTTP రిక్వెస్టులు పంపుతుంది మరియు వాటిని
వచ్చినట్లుగా ప్రదర్శిస్తుంది. వెబ్ పేజ్ లో
గనక అనేక విభిన్న బొమ్మలు ఉంటే, వాటిలో
ప్రతీదానికీ విడిగా HTTP రిక్వెస్ట్ కావాలి
పేజీ కూడా నెమ్మదిగా లోడ్ అవుతుంది. మీరు
కొన్నిసార్లు వెబ్ ని బ్రౌజ్ చేస్తే మీరు
కేవలం GET రిక్వెస్టులతో పేజీని కోరడం లేదు.
కొన్నిసార్లు ఒక ఫారం నింపడం లేదా ప్రశ్న
వేయడం ద్వారా సమాచారం పంపిస్తారు. మీబ్రౌజర్
HTTP POST రిక్వెస్ట్ ఉపయోగించి దీన్ని వెబ్
బ్రౌజర్ కి పంపుతుంది. మీరుTumblr లో లాగిన్
అయినట్టు. మొదట POST రిక్వెస్ట్ చేస్తారు.
Tumblr లాగిన్ పేజీకి అది ఒక POST, దానికి
కొంత డేటా జత అయి ఉంటుంది. అది మీ ఇమెయిల్
అడ్రస్, ఇమెయిల్ పాస్వర్డ్ కలిగి ఉంటుంది.
అది Tumblr సర్వర్ కి వెళుతుంది. Tumblr
సర్వర్ దానికి సరేఅని మీరు డేవిడ్ అంటుంది
అది తిరిగి మీ బ్రౌజర్ కి వెబ్ పేజ్ పంపుతూ,
సక్సెస్ అంటుంది! డేవిడ్ గా లాగిన్.ఐతే వెబ్
పేజ్ తో పాటు అది కొంత కనిపించని కుకీడేటాని
పంపుతుంది, దాన్ని మీబ్రౌజర్ సేవ్ చేస్తుంది
అది నిజంగా ముఖ్యం ఎందుకంటే ఆవిధంగా ఒక వెబ్
సైట్ మీరు ఎవరో గుర్తు పెట్టుకునే మార్గమది.
నిజంగా ఆ కుకీ డేటా అంతా Tumblr కి ఒక ID
కార్డు. అది మిమ్మల్ని డేవిడ్ గా గుర్తించే
ఒక నంబర్. మరియు మీ వెబ్ బ్రౌజర్ ఆ నంబర్ కి
కట్టుబడి తర్వాతి సమయం మీరు Tumblr ని రీ
ఫ్రెష్ చేసినప్పుడు,తర్వాత మీరు Tumblr.com
కి వెళ్ళినప్పుడు, మీ బ్రౌజర్ ఆటోమేటిక్
గా ఆ ఐడి నంబరును రిక్వెస్టుతో జతపరచి
దాన్ని Tumblr సర్వర్లకు పంపిస్తుంది. ఇపుడు
Tumblr సర్వర్లు మీ బ్రౌజర్ నుండి వచ్చే
రిక్వెస్ట్ ను చూస్తాయి, ఐడి నంబర్ చూస్తాయి
"సరే, ఇది డేవిడ్ నుండి రిక్వెస్ట్" అని
తెలుసుకుంటాయి. ఇపుడు ఇంటర్నెట్ పూర్తిగా
ఓపెన్ అయింది. దాని కనెక్షన్లన్నీ పంచుకోబడి
సమాచారం సాదావచనంలో పంపుతుంది.ఇది ఇంటర్నెట్
పై మీరు పంపే ఏదేని వ్యక్తిగత సమాచారంపై
హ్యాకర్ల కన్నుపడేందుకు సాధ్యతనిస్తుంది.
ఐతే సెక్యూర్ సాకెట్స్ లేయర్ మరియు TLS
వాడుతూ సురక్షిత చానల్ పై కమ్యూనికేట్
చేయాలని మీ వెబ్ బ్రౌజర్ ని అడుగుతూ
సురక్షిత వెబ్సైట్లు దీన్ని నివారిస్తాయి.
మీ కమ్యూనికేషన్లు చోరీ లేదా మార్పు కాకుండా
రక్షించుకోడానికి వాటి చుట్టూ భద్రత పొరలాగా
చుట్టబడే SSLమరియుTLS గురించి మీరుచూడొచ్చు.
మీబ్రౌజర్ అడ్రస్ బార్ పై HTTPSతర్వాత చిన్న
లాక్ కనిపిస్తే SSLమరియుTLS యాక్టివ్ గా
ఉంటాయి. మీHTTPSరిక్వెస్టులన్నీ సురక్షితంగా
ఉండేలా HTTPS ప్రోటొకాల్స్ చూసుకుంటాయి.
సురక్షిత కనెక్షన్ లో ఉండమని మీ బ్రౌజర్ ని
వెబ్సైట్ అడిగినపుడు, అది ముందు ఒక డిజిటల్
సర్టిఫికెట్ ఇస్తుంది.ఇది క్లెయిం చేయాల్సిన
వెబ్సైట్ అని నిరూపించే ఐడి కార్డులాగా
అదిఉంటుంది.డిజిటల్ సర్టిఫికెట్లు వెబ్సైట్
లనుగుర్తించి వాటికి సర్టిఫికెట్లు జారీచేసే
ప్రాధికార సంస్థలచే ప్రచురించబడతాయి.
అవి విశ్వసనీయ సంస్థలుగా ఉండి వెబ్సైట్ల
గుర్తింపులను వెరిఫై చేస్తాయి. అదే విధంగానే
ప్రభుత్వం ID లేదా పాస్వర్డ్ ను ఇవ్వొచ్చు.
ఇపుడు ఒకవెబ్సైట్ సరైన డిజిటల్ సర్టిఫికెట్
లేకుండా కనెక్షన్ స్టార్ట్ చేసే ప్రయత్నం
చేస్తే, మీబ్రౌజర్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది
అది వెబ్ బ్రౌజింగ్ యొక్క బేసిక్స్. మనంరోజూ
చూసే ఇంటర్నెట్ లో భాగం. ఇక HTTP మరియు DNS
HTML, మీడియా ఫైల్స్ లేదా వెబ్ పై దేనినైనా
మేనేజ్ చేస్తాయి. దీన్ని సుసాధ్యం చేసేవి
TCP/IP మరియు రూటర్ నెట్వర్క్ లు. సమాచారం
అంతటినీ అవిచిన్నప్యాకెట్లుగా విడదీసి రవాణా
చేస్తాయి. ఆ ప్యాకెట్లు బైనరీ, 1 మరియు 0 ల
వరుసతో చేయబడి భౌతికంగా విద్యుత్ వైర్లు,
ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మరియు వైర్లెస్
నెట్వర్క్ లచే పంపించబడతాయి. అదృష్టం కొద్దీ
ఇంటర్నెట్ యొక్క ఒక లేయర్ ఎలా పనిచేస్తుందో
మీరు నేర్చుకున్నారంటే, వివరాలన్నింటినీ
గుర్తుపెట్టుకోవాల్సిన పనిలేకుండా దానిపై
మీరు ఆధారపడవచ్చు. ఆ లేయర్లన్నీ కలిసి
విజయవంతంగా నమ్మకంగా సమాచారం అందిస్తాయని
మనం బాగా విశ్వసించవచ్చు.