అది ఏప్రిల్ 8, 2003. నేను బాగ్దాద్ లో, ఇరాక్ యుద్ధం కవర్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు, అమెరికన్స్ టాంకులు బాగ్దాద్ లోకి రావడం మొదలయ్యింది. మేము కొంత మంది విలేఖరులం మాత్రం పాలస్తైన్ హోటల్ లో ఉన్నాము, యుద్ధంలో జరిగినట్టుగా, పోరాటం మా కిటికీల బయటకు చేరుకోవడం ప్రారంభమైంది. బాగ్దాద్ నల్ల పొగ మరియు నూనెతో కవర్ అయ్యింది. ఘాటైన వాసన వస్తోంది. ఏ విషయం చూడలేకపోయాము కానీ ఏమి జరుగుతోందో మాకు తెలుసు. వాస్తవానికి, నేను ఒక వ్యాసం రాస్తూ ఉండవలసింది, కానీ ఎప్పుడూ అలానే జరుగుతుంది-- మీరు రాస్తూ ఉన్న సమయంలో ఏదో ఒక పెద్ద విషయం జరుగుతుంది. నేను ౧౬ వ అంతస్థులో ఉన్న నా గదిలో, రాసుకుంటూ, మధ్య మధ్యలో కిటికీ బయట ఏమి జరుగుతుందో చూస్తూ ఉన్నాను. అకస్మాత్తుగా, ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది. గత మూడు వారాలలో, అర-టన్ను మిస్సైల్స్ తో దాడులు జరుగుతున్నాయి, కానీ ఈ సారి మాత్రం, నాలో షాక్-- కలగడం నేను గమనించాను. ఇంకా నేను , "అది చాలా దగ్గరగా ఉంది. అది చాలా, చాలా దగ్గరగా ఉంది." అని అనుకున్నాను కాబట్టి నేను ఏమి జరుగుతుందో చూడడానికి కిందికి వెళ్ళాను. నేను ఒకసారి చూడడానికి కింద ౧౫వ అంతస్థుకి వెళ్ళాను. నేను ప్రజలు, విలేఖరులు, హాళ్ళల్లో అరవడం చూశాను . నేను ఒక గది లోకి వెళ్ళాను కాని అది ఒక క్షిపణి ద్వారా దెబ్బ తిన్నదని గ్రహించాను. ఎవరో గాయపడ్డం జరిగింది. ఒక వ్యక్తి కిటికీ దగ్గర ఉన్నాడు, టారస్ ప్రొత్స్యుక్ అనే పేరు గల కెమెరామన్, బోర్లా పడి ఉన్నాడు. ఇంతకు ముందు హాస్పిటల్లో పనిచేశాను కాబట్టి నేను సహాయం చేద్దామనుకున్నాను. కాబట్టి నేను అతనిని వెనక్కి త్రిప్పాను. కాని నేను అతనిని వెనక్కి త్రిప్పినప్పుడు, అతని స్టెర్నమ్ నుండి ప్యుబిస్ వరకు ఓపెన్ అయ్యి ఉండడం గమనించాను, నేను ఏమీ చూడలేకపోయాను. ఇంతకీ నేనుచూసింది తెల్ల,షైనీ ముత్యంలాంటి ఓ చుక్క అది నన్ను చూడకుండా చేసింది, అక్కడ ఏమి జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఒకసారి ఆచుక్క మాయమయ్యాక ఇంకా నేను ఆ గాయాన్ని చూడగలిగాక, ఏదైతే చాలా తీవ్రంగా ఉందో, నేను, నా స్నేహితులు ఒక దుప్పటి అతనికి కప్పి, 15 అంతస్థులూ అన్నిట్లోనూ ఆగుతున్నఎలివేటర్ లో అతణ్ణి తీసుకెళ్ళాం. అతణ్ణి మేము కార్లో హాస్పిటల్ కి పంపించాము. అతను హాస్పిటల్ కి వెళ్ళే దారిలో పోయాడు. క్షిపణి రెండు అంతస్థుల మధ్య పేలడం వల్ల గాయ పడి-- ౧౪ వ అంతస్థు లో ఉన్నస్పానిష్ కెమారామన్ జోస్ కూసో, ఆపరేషన్ బల్ల మీద చనిపోయాడు. కార్ వెళ్ళి పోగానే, నేను వెనక్కి వెళ్ళాను. నేను రాయాల్సిన వ్యాసం అలాగే ఉంది-- నేను రాసి తీరాల్సిందే. అందుకని-- నేనురక్తం అంటిన చేతులతో హోటల్ లాబీకి తిరిగి వచ్చాను, అప్పుడు హోటల్ గోఫర్స్ లో ఒకరు నన్ను ఆపి ౧౦ రోజులుగా నేను కట్టని టాక్స్ కట్టమన్నారు. నేను అతడిని వెళ్ళి పొమ్మని చెప్పాను. ఇంకా నాకు నేను చెప్పుకున్నాను: "అన్నీ పక్కన పెట్టు , నీ ఆలోచనలను స్పష్టం గా ఉంచుకో. నువ్వు వ్రాయాలనుకుంటే అన్నీపక్కన పెట్టాలి. నేనూ అదే చేశాను. నేను పైకి వెళ్ళి, వ్యాసం వ్రాసాను. దాన్ని పంపించాను. తరువాత, నా సహచరులను కోల్పోయిన భావాన్ని పక్కన పెడ్తే, ఇంకా ఏదో భావం నన్ను ఇబ్బంది పెడ్తోంది. నేను మెరిసే, తెల్ల చుక్కని చూస్తూ ఉన్నాను, కాని నేను అది ఏమిటో అర్థం చేసుకోలేకపోయాను. అప్పుడు, యుద్ధం ముగిసింది. తర్వాత , నేను ఆలోచించా:"అది సాధ్యం కాదు. నేను ఏమి జరిగిందో తెలుసుకోలేకపోతున్నాను." ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, ఇంకా ఇది కేవలం నాకే జరగడం లేదు. నేను నా ౨౦ నుండి ౩౫ సంవత్సరాల రిపోర్టింగ్ లో ఇలాంటి విషయాలు వేరేవాళ్ళకు జరగడం చూశాను. నేను నా మీద ప్రభావం చూపించిన విషయాలని కూడా చూశాను ఉదాహరణకు,లెబనాన్ లో నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, వయసున్న ౫ ఏళ్ళ నుండీ పోరాడుతున్న ఒక యుద్ధవీరుడు- ౨౫-సంవత్సరాల- ఓ నిజమైన అనుభవశాలి--అతన్ని మనం అనుసరిస్తాం. అతను చీకట్లో కూడా ధైర్యం తో ముందుకెళ్ళగలడు-- అతను చాలా గొప్ప సైనికుడు, ఒక నిజమైన సైనికుడు-- మనకు తెలుసు అతనితో ఉంటే సురక్షితం అని, కాబట్టి మనం అతన్ని అనుసరిస్తాం. ఒక రోజు నాకు చెప్పబడింది -- అతను కాంప్నుండి వెనక్కి రావడం వల్ల నేను అతన్ని మళ్ళీ చూశాను, పేక ఆడుతూ, ఎవరో ప్రక్క ఇంటికి వచ్చి, వారి ఆయుధం పేల్చారు. గన్ను పేలిన తరువాత, ఆ పేలుడు, ఆ ఒక్క షాట్, అతను త్వర త్వరగా బల్ల కింద, పిల్లాడిలా దాక్కునే లాగా చేసింది. అతను ఊగిపోతూ, భయాందోళనలకు గురి అయ్యాడు. అప్పటి నుండి అతను ఎన్నడూ నిలబడి పోరాటం చెయ్యలేక పోయాడు. చివరికి అతను ఒక క్రౌపియర్ గా మారాడు. నేను తరవాత అతడిని బీరట్ కాసినో లో చూశాను, అతడు ఎలాగూ నిద్ర పోలేడు కాబట్టి, అదే అతడికి సరైన ఉద్యోగం. "ఏ విషయము ఎటువంటి గాట్లు లేకుండా నిన్ను చంపుతుంది? అది ఎలా జరుగుతుంది? ఈ తెలియని విషయం ఏమిటి?" అని నాలో నేను ఆలోచించుకున్నాను. ఇది చాలా సాధారణ విషయం కాబట్టి యాధృచ్ఛికం కాదు. నేను పరిశోధించడం మొదలుపెట్టాను-- అది ఒక్కటే ఎలా చేయాలో నాకు తెలిసింది. పుస్తకాలను చదవడం ద్వారా, మానసిక వైద్యులను కలవడం ద్వారా, సంగ్రహాలయాలకు,గ్రంధాలయాలకు మొదలైనవాటికి వెళ్ళడం ద్వారా నేను పరిశొధన చేయడం మొదలు పెట్టాను. చివరికి, నేను కొంతమందికి సాధారణంగా సైనిక మానసిక వైద్యులకు-- దీని గురించి తెలుసని కనుక్కున్నాను-- ఇంకా మేము వెతుకుతున్న ఈ పరిస్థితి పేరు ట్రామా అని కనుక్కున్నాను. అమెరికన్లు దీన్ని పిటిఎస్డి లేదా ట్రామాటిక్ న్యూరోసిస్ అని పిలుస్తారు. ఇది అప్పటిలో మనుగడలో ఉండేది, కానీ మనము దాని గురించి మాట్లాడలేదు. కాబట్టి ఈ గాయం-- ఇది ఏమిటి? సరే, మరణంతో ఒక పోరాటం లాగా ఉంది. మీకు ఎప్పుడైనా మరణంతో అనుభవం ఉందేమో నాకు తెలీదు- నేను మృతదేహాలు గురించి మాట్లాడటం లేదు, లేదా ఒకరి తాత, హాస్పిటల్ బెడ్ మీద పడి ఉండడం లేదా ఎవరైనా కారు గుద్ది దెబ్బ తగిలి ఉండడం గురించి కాదు. నేను మరణం గర్జన ఎదుర్కొంటున్న వారి గురించి మాట్లాడతున్నాను. కానీ ఆ విషయం ఎవరూ చూడకూడనిది. జనాలు ఇలా చెప్తారు, "సూర్యుడు లేదా మరణాన్ని సూటిగా కళ్ళతో చూడలేము." ఏ మానవుడైనా మరణం యొక్క స్తబ్దతను ఎదుర్కొనకూడదు. కానీ అది జరిగినప్పుడు, అది కాసేపు అదృశ్యమై ఉండిపోయి-- రోజులు, వారాలు, నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు. ఆపై, ఒక సమయంలో అది పేలుతుంది, ఎందుకంటే ఏదో మీ మెదడులో ప్రవేశించింది బొమ్మ మరియు మీ మనస్సు మధ్య ఒక విధమైన కిటికీ వంటిది-- అది మీ మెదడులోకి చొచ్చుకెళ్ళింది, అక్కడే ఉండిపోయి మరియు లోపల అంతా స్థలాన్ని ఆక్రమించు కొని ఉన్నది. మరి చాలా మంది మనుష్యులు మగవాళ్ళు, ఆడవాళ్ళు, అకస్మాత్తుగా నిద్ర పోలేరు. మరియు వారు భయంకరమైన ఆందోళన దాడులు అనుభవించడానికి - విస్మయమైన దాడులు, కేవలం చిన్న భయాలు కాదు. వారు అకస్మాత్తుగా నిద్ర పొవద్దు అనుకుంటారు, ఎందుకంటే నిద్రపోయినప్పుడు, అవే పీడకలలతో ప్రతి రాత్రి బాధ పడతారు. వారు ప్రతి రాత్రి అదే బొమ్మను చూస్తారు. ఏ రకమైన బొమ్మ? ఉదాహరణకు, ఒక సైనికుడు ఒక భవనము లోనికి అడుగు పెట్టి మరియు తనపై తుపాకి గురిపెట్టిన ఇంకొక సైనికుడితో ముఖా ముఖికి దిగాడు. అతను నేరుగా గన్ బారెల్ వంక చూస్తాడు.మరియు బారెల్ హఠాత్తుగా చాలా వికారంగా అవుతుంది. ఇది మెత్తగా అయ్యి, ప్రతిదీ మ్రింగుతుంది. ఆపై అతనుఅంటాడు- తరువాత అతను అనవచ్చు, “నేను చావును చూశాను. నన్ను నేను చనిపోవడం చూశాను, కాబట్టి నేను చనిపోయాను. మరియు అప్పటి నుండి, అతనికి తెలుసు తను చనిపోయినట్టు. ఇది ఒక అవగాహన కాదు -అతను చనిపోయాడని అతను నమ్ముతున్నాడు. వాస్తవంలో, ఎవరైనా వచ్చారు, అతను వెళ్ళాడు లేదా షూట్ చేయలేదు, ఏది ఏమైనా, ఇంకా తను నిజానికి కాల్చబడలేదు - అతనికి, ఆ సమయంలో అతను మరణించాడు. లేదా అది సామూహిక సమాధి యొక్క వాసన లాగా ఉంటుంది-- నేను ర్వాన్ డా లో అలంటివి చాలా చూశాను. ఇది మీ స్నేహితుడు పిలుస్తున్న స్వరం కావచ్చు, మరియు అవి వధకు గురిఅవుతున్నాయి మరియు మనము ఏమీ చేయలేము. మీరు ఆ గొంతు వినవచ్చు, మరియు మీరు ప్రతి రాత్రి మేల్కొని ఉంటారు- వారాలు, నెలలు- ఒక ట్రాన్స్ లాంటి స్థితిలో, ఆత్రుత మరియు భయభ్రాంతులతో, పిల్లవాడి లాగా. నేను పురుషులు చిన్న పిల్లల లాగా కేకలు వేయటం చూశాను- అదే బొమ్మను చూసినప్పటి నుండి. కనుక నీ మెదడు లో ఆ భయానక చిత్రం ఉండడం, మరణం యొక్క స్తబ్దతను చూడడం- ఆ భయానక అనలాగ్ ఏదో దాచి ఉంచింది -- పూర్తిగా ఆక్రమించ బడుతుంది. మీరు ఎమీ కూడా చేయలేరు. మీరు పని చేయలేరు, ప్రేమించరు. ఇంటికి వెళ్ళి ఎవరినీ గుర్తించరు. మీరు మిమ్మల్ని కూడా గుర్తించలేరు. మీరు దాక్కుంటారు మరియు ఇంటినుంచి బయటకు వెళ్ళరు, మిమ్మల్ని మీరే ఇంట్లో బంధించుకొని, అనారోగ్యంతో ఉంటారు. ఈ సందర్భంలో ఎవరైనా లోపలికి రావడానికి ప్రయత్నించకుండా, లోపల నాణేలతో చిన్న డబ్బాలు తమ ఇంటి బయట ఉంచే వ్యక్తులు నాకు తెలుసు, అకస్మాత్తుగా, మీకు చావాలని లేదా చంపాలని, దాక్కోవాలనీ లేదా పారిపోవాలనీ అనిపించవచ్చు. మీరు ప్రేమించబడడం ఇష్టపడతారు, కానీ మీరు ప్రతి ఒక్కరినీ ద్వేషిస్తారు. ఇది మీకు ప్రతి రోజూ పూర్తిగా వదులుకోకూడదు అనే ఒక భావన మీలో ఉంటుంది మరియు మీరు విపరీతంగా బాధ పడతారు. ఒక్కరికీ అర్థం కాదు. “మీలో ఏ తప్పు లేదు. మీరు బాగానే ఉన్నట్టు ఉన్నారు. మీకు గాయాలేమీ లేవు. మీరు యుధ్ధానికి వెళ్ళారు, తిరిగి వచ్చారు, మీరు బావున్నారు.” అని వాళ్ళు అంటారు. ఈ వ్యక్తులు విపరీతంగా బాధపడుతున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య మీ రోజువారీ ప్రణాళిక నవీకరించుట వంటిది -నేను ఇప్పటికే చనిపోయాను, నేను అలాగే ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు. అదనంగా, ఇకమీదట నొప్పి ఊండదు. కొందరు ఆత్మహత్యకు, ఇతరులు తాగడం, వంతెన కింద ముగిస్తారు. ప్రతిఒక్కరికి గుర్తు వాళ్ళ తాత లేదా అంకుల్ లేదా పొరుగు అతను ఎక్కువగా త్రాగినా, ఒక్క మాట కూడా అనరు, భార్యను కొట్టి మరియు వారు ఎల్లప్పుడూ ఒక చెడ్డ మూడ్ లో ఉండి, మధ్యం మత్తులో మునిగి చనిపోయేట్లు ఉంటారు. మరియు మనము, ఎందుకు ఈ విషయంపై మాట్లాడడం లేదు? అది నిషిద్ధము కాబట్టి మనము దాని గురించి మాట్లాడము. ఇది మనము మరణం యొక్క స్తబ్దతను వ్యక్తం చేయడానికి పదాలు లేక కాదు. కానీ ఇతరులు దీనిని వినడానికి ఇష్టపడరు. మొదటిసారి నేను ఒక అసైన్మెంట్ నుండి తిరిగి వచ్చినప్పుడు, వారు "ఓహ్! అతను తిరిగి వచ్చాడు", అన్నారు. తెల్లటి మెజాపై వస్త్రం, కొవ్వొత్తులు, అతిథులతో కూడిన ఒక ఫాన్సీ విందు ఉంది. “మాకు అంతా చెప్పండి!” అన్నారు అదే నేను చేశాను. ౨౦ నిమిషాల తర్వాత, ప్రజలు నన్నుదుర్భర చూపులతో చూశారు, అతిధేయు మసిముంతను తన ముక్కుతో వాసన చూశారు. అది భయంకరంగా ఉంది మరియు నేను మొత్తం సాయంత్రాన్ని భగ్నం చేసినట్లుగా గ్రహించాను. కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు. మేము వినడానికి మాత్రము సిధ్ధముగా లేము. ప్రజలు బొత్తిగా చెప్తారు : "దయచేసి ఆపండి". ఇది ఒక అరుదైన సంఘటనగా ఉంటుందా? కాదు, అది చాలా సాధారణము. ఇరాక్ లో మరణించిన మూడు వంతుల సైనికులు – సరే, చనిపోలేదు, నన్ను ఇంకో రకంగా చెప్పనివ్వండి– ఇరాక్కు వెళ్లిన మూడు వంతుల సంయుక్త సైనికులు పి టి యస్ డీ తో బాధపడుతున్నారు. ౧౯౩౯ లో, మొదటి ప్రపంచ యుద్ధం నుండి ౨౦౦,౦౦౦ మంది సైనికులు ఇప్పటికీ, బ్రిటీష్ మనోవిక్షేప ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వియత్నాంలో, ౫౪,౦౦౦ మంది అమెరికన్లు మరణించారు. ౧౯౮౭లో, అమెరికా ప్రభుత్వం, ౧౦౨,౦౦౦ మంది అనుభవజ్ఞులను, అంటే దాదాపుగా రెట్టింపు మంది, ఆత్మహత్య చేసుకొని మరణించినట్లుగా గుర్తించారు. వియత్నాం యుద్ధం ద్వారా కంటే ఆత్మహత్య వలన రెండింతలు మరణాలు సంభవించాయి. కాబట్టి మీరు చూడండి, కేవలం ఆధునిక యుద్ధతంత్రమే కాదు పురాతన యుద్ధాలు కూడా -- మీరు దాన్ని గురించి చదువుకోవచ్చు, సాక్ష్యం అక్కడే ఉంది, అన్నిటికీ సంబంధించినది. కాబట్టి ఎందుకు మనము దాని గురించి మాట్లాడడం లేదు? ఎందుకు మనము దాని గురించి మాట్లాడలేదు? సమస్య ఏమిటంటే మీరు దాన్ని గురించి మాట్లాడక పోతే మీరు విపత్తు వైపు వెళ్తున్నారు. నయం చేయటానికి ఏకైక మార్గం ఏమిటంటే -- మరియు ఇక్కడ ఒక శుభవార్త దీనికి చికిత్స చేయగలం -- మంచ్ ది స్క్రీమ్, గోయా మొదలైనవి ఆలోచించండి-- దీనికి నిజంగానే చికిత్స చేయగలం. మనసులో పడిన బెదురు నుండీ నయం అవటానికి ఏకైక మార్గం, మరణంతో ఎన్కౌంటర్ నుండి అధిగమించి, శిలగా మారుస్తున్న మరియు మిమ్మల్ని పీడిస్తున్న దీని నుంచి బయట పడడానికి మీ బాధను చెప్పుకునే మార్గం ఎంచుకోవడం. “భాష ఒక్కటే మనల్ని అందరినీ కలిపి ఉంచుతుంది” అని జనాలు అంటుంటారు. భాష లేకుండా, మనము ఏమీ చేయలేము. ఇది మనల్ని మానవుల్ని చేస్తుంది. ఒక భయంకరమైన చిత్రం నేపథ్యంలో – ఒక పదములు లేని చిత్రం పై నిమగ్న మయ్యాడు-- అది భరించవలసిన ఏకైక మార్గం అందులో మానవ పదాలు ఉంచాలి. ఈ ప్రజలను మానవుల నుంచీ మినహాయించ బడుతున్నారు ఎందుకంటే ఎవరూ వారిని చూద్దామని కోరుకోవట్లేదు మరియు వారు ఎవరినీ చూడాలని అనుకోవటం లేదు. వారు మురికిగా, అపవిత్రతతో, సిగ్గుగా భావిస్తున్నారు. “డాక్టర్, నేను సబ్వే వాడను ఎందుకంటే నా కళ్ళలో ప్రజలు హర్రర్ చూస్తారేమోనని భయపడుతూ ఉన్నాను." అని ఎవరో అన్నారు. మరో వ్యక్తి తనకు ఒక భయంకరమైన చర్మ వ్యాధి ఉందని భావించి ఒక చర్మవ్యాధి వైద్యుడు నుండి ఇంకో వైద్యుడు దగ్గరికి గత ఆరు నెలలుగా వెళుతున్నాడు. తరువాత ఒక రోజు, వారు అతన్ని ఒక మానసిక వైద్యుని వద్దకు పంపించారు. తన రెండవ సెషన్ సమయంలో, తనకు తల నుండి బొటనవేలు వరకు ఒక భయంకరమైన చర్మం వ్యాధి ఉంది అని మానసిక వైద్యునికి చెప్పాడు. మనోరోగ వైద్యుడు "ఎందుకు మీరు ఈ స్థితిలో ఉన్నారు?" అని అడిగాడు. "నేను చనిపోయాను కాబట్టి నా శరీరం కుళ్ళిపోయి ఉండవచ్చు” అని ఆ మనిషి అన్నాడు. కాబట్టి ఇది ప్రజలపై తీవ్ర ప్రభావం కలిగి ఉందని చూడగలరు. నయం చేయడానికి, మనం దాని గురించి మాట్లాడడం అవసరం. హర్రర్ ను పదాలుగా మార్చాల్సి ఉంది - మానవ పదాలు, కాబట్టి మనము మళ్ళీ దాని గురించి మాట్లాడటానికి ఆర్గనైజ్ చేయవచ్చు. మనము ముఖా ముఖి మరణం చూడాల్సి ఉంటుంది. మరియు మనము అలా చేస్తే, మనము ఈ విషయాల గురించి మాట్లాడవచ్చు, తరువాత స్టెప్ బైస్టెప్, మాటలతో ఎంతో కృషి ద్వారా, మనము మానవత్వంలో మన స్థానాన్ని తిరిగి దక్కించుకోవచ్చు. మరియు అది ముఖ్యం. నిశ్శబ్దం మనల్ని చంపేస్తుంది. కాబట్టి దీని అర్ధం ఏమిటి? దీని అర్ధం గాయాలైన తర్వాత, ప్రశ్నించకుండా, మనము “భరించలేని తేలికతనాన్ని" కోల్పోతాము, ఇక్కడ మనల్ని అమరత్వం అన్న భావన ఉంచుతుంది– దాని అర్ధము, మనము ఇక్కడ ఉన్నాము, మనము అమరులము అనే అనుభూతి దాదాపుగా మనకు కలిగిస్తుంది, వాస్తవానికది నిజం కాదు, కానీ, మనము దాన్ని నమ్మకపోతే, "దీనిలో ఉన్న విషయము ఏమిటి?", అని చెప్తాము. కానీ గాయం నుంచీ ప్రాణాలు దక్కించుకున్న వారు అమరత్వం భావాలను కోల్పోయారు. వారు వారి తేలికతనాన్ని కోల్పోయారు. కానీ వారు ఏదో కనుగొన్నారు. కాబట్టి దీని అర్ధం, మనము మరణాన్ని ముఖతః చూసి, మరియు వాస్తవానికి దాన్ని ఎదుర్కొని, నిశ్శబ్దంగా ఉండడం లేదా దాక్కొని ఉండకుండా, ఎలాగైతే నాకు తెలిసిన కొంతమంది పురుషులు లేదా స్త్రీలు అంటే ర్వాండా నుండి మైకేల్, ఇరాక్ నుంచి కరోల్, కాంగో నుండి ఫిలిప్ వంటి వారు చేశారో మరియు నాకు తెలిసిన ఇతర ప్రజలు, ఇంకా సోర్జ్ చాలన్డొన్, ఇప్పుడు ఒక గొప్ప రచయిత, తన గాయం తర్వాత బయటి పనులను ఆపు చేశాడు. నా స్నేహితులలో ఐదుగురు, గాయాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. మనము ముఖతః మరణం చూస్తే, మనం, మర్త్య మానవులు, మానవ మర్త్యులు, మనము మరణం ఎదుర్కొని మరియు మరోసారి దాన్ని అన్ని రహస్యమైన ప్రదేశాల్లో అత్యంత రహస్యమైన ప్రదేశంగా గుర్తించి, ఎవరూ కూడా ఎప్పుడూ చూడలేదు కాబట్టి -- మనము ఈ అర్ధాన్ని తిరిగి ఇవ్వగలిగితే, అవును, మనము చస్తాము, బ్రతుకుతాము మరియు మనం తిరిగి జీవిస్తాము, కానీ మనము ముందు కంటే బలంగా తిరిగి వస్తాము. చాలా బలంగా వస్తాము. ధన్యవాదములు. (చప్పట్లు)