వావ్! మరో మూడు పజిల్స్ సాధించా! మరి మేమొక సాల్మన్ పట్టుకున్నాం. బంగారం రాశి అందినంత సంబరం కాదు కానీ, మాకు కావాల్సింది మాకు దొరికింది. ఆ తర్వాత నాటిలస్ శంఖం కూడా చేతికి వస్తుంది నాకా భావన ఉంది. ఈ శిధిలాల్లో ఏమేమి దాగుందో నాకు ఆశ్చర్యం. బహుశా మరో హెచ్చరిక! ఒకసారి లోపలికెళ్ళి చూద్దాం. నా పేరు నెట్టీ మరి నా శిధిలాలకు స్వాగతం. మేము ఎప్పుడూ పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుంటూ ఉంటాం. వర్షం వచ్చేటట్లుంటే, అప్పుడు మేమొక గొడుగు తీసుకుంటాం. మాకు ఆకలైతే గనక, ఒక స్నాక్ తింటాం. మేమొక తీగ చూస్తే గనక, అప్పుడు మేము ఎదుటి దిశలో పరుగుతీస్తాం. కంప్యూటర్లు ఈ రకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటాయి. అవి కోడ్ ఉపయోగించుకొని పరిస్థితులకు స్పందిస్తాయి. మీ కోడ్ కమాండ్లతో ఇలాంటి జవాబు ప్రోగ్రాం చేయడానికి, ఒక if పాత్ బ్లాక్ వాడండి. కమాండ్ చేయడానికి డ్రాప్ డౌన్ ఎంపిక చేయండి. ఉదా, " కుడికి if పాత్" కమాండ్ గనక రాసి, కండీషనల్ లోపల కుడి మలుపును ఉంచితే, అప్పుడు స్టీవ్ కుడివైపు బయలు దారి చేరుకోగానే, అతను ఎల్లప్పుడూ కుడివైపే తిరుగుతాడు. ఒకవేళ కుడివైపు దారి లేకపోతే, అతను కుడివైపుకు తిరగడు. ఊహించని పరిస్థితుల్లో మీరు కోడ్ ని రన్ చేస్తే ఈ కండీషనల్ if కమాండ్లు సాయపడతాయి నీటిలోపలి గుహల్లో వింతైన శిధిలాల్లాగా. if బ్లాకులు వాడటానికి ప్రయత్నించండి ఒక స్పిన్ తో మీ కోడ్ తీసుకోండి. వావ్! నెట్టీ శిధిలాలు అద్భుతంగా ఉన్నాయి. నేను నిజంగా మా పేరెంట్స్ ఇంటి నుంచి బయట పడ్డా. మీరేమనుకుంటున్నారు? చివరి పజిల్స్ పూర్తి చేయడానికి పరిస్థితులు బాగున్నాయంటారా? మరి దాన్ని ముందుకెళ్ళనిద్దాం.