అద్భుతం! మేమొక కాడ్‌ఫిష్ పట్టుకున్నాం! మీకు తెల్సా, మీరొక కాడ్‌ఫిష్ ని డాల్ఫిన్ కి వేస్తే, అది మిమ్మల్ని పగిలిన ఓడ వద్దకు తీసుకెళ్తుంది, అక్కడ ఒక నిధి ఉండొచ్చుగా? మనమింకా దగ్గరకు రావాలి. తర్వాతి పజిల్స్ సెట్ మాయతో ఉంటాయి, కాబట్టి మనం మరికొన్ని కోడింగ్ నైపుణ్యాలు నేర్చుకోవడం మంచిది. ఇదేమిటి? ఒక గుహా? స్వాగతం, సాహసికులూ! నా పేరు స్క్విడ్. గత పజిల్స్ కొన్నిట్లో మీరు అవే కమాండ్లు పదేపదే మళ్ళీ మళ్ళీ వాడటం నేను గమనించాను. కొంత అలసిపోయి ఉండొచ్చు. ఒక పని మళ్ళీ మళ్ళీ పదే పదే చేయడానికి ఒక మార్గం ఉందని మీరెప్పుడైనా కోరుకున్నారా, పాత్రలు కడగడం లేదా మీ పళ్ళు తోమడం, ఆయాసపడకుండా లేదా విసుగు చెందకుండా? అలా అయితే బాగుంటుంది. కోడింగ్ లూప్స్ వాడి ఒక పని పదే పదే మళ్ళీ మళ్ళీ చేయడానికి కంప్యూటర్లు చాలా బాగుంటాయి మీ ప్రోగ్రాము ఒకే సూచనల్ని అనేకసార్లు చేయాలనుకున్నప్పుడు మీరు ఒక లూప్ వాడొచ్చు! లూప్ లో, లక్ష్యం చేరేవరకూ రిపీట్ చేయడానికి కమాండ్ తో పాటుగా సూచనలు ఉంటాయి. లక్ష్యం లూప్ వరకూ మీ ప్రోగ్రాము ఒక రిపీట్ మొదలు చేసిందంటే, అదిసూచనల్ని చదువుతుంటుంది లోపలే అది లక్ష్యం చేరేదాకా. మీ కోసం దీన్ని ప్రయత్నించండి! రిపీట్ లోపల గోల్ బ్లాక్ వరకూ, మీరు రిపీట్ చేయాలనుకుంటున్న కమాండ్లు ఉంచండి, రన్ క్లిక్ చేయండి, ఇక దాన్ని చూస్తూఉండండి! మంచిది, అదొక చిన్న విచిత్రం. స్క్విడ్స్ కోడ్ చేస్తాయనిఎవరికెరుక? వాటికి వ్రేళ్ళుంటాయని నేనసలే అనుకోలేదు. సో, ఇప్పుడు లూప్స్ గురించి తెల్సింది. మరింత నిధి కోసం వాటిని వాడుకుందాం.