అవర్ ఆఫ్ కోడ్ Minecraft |ఈవెంట్లు ఈ తర్వాతి స్థాయిలో, మీరు Steve గా లేదా Alex గా ఉండవచ్చు. పైకి, కిందికి, ఎడమ, ఇంకా కుడికి కదలడానికి మీ కీబోర్డ్ పై యారో బటన్లను నొక్కండి. ఇప్పుడు మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి చుట్టూ తిరగొచ్చు. ఒక జీవిని ఉపయోగించడానికి, దానివైపు నడవండి, మీ వైపుకు తిప్పండి, స్పేస్ బార్ నొక్కండి. మీరు టచ్ స్క్రీన్ వాడుతుంటే, తిప్పడానికై పైకి కిందికి కుడి ఎడమకు స్వైప్ చేయండి. తర్వాత మీ ముందున్న వస్తువు వాడటానికి గేమ్ ని తట్టండి. ఐతే దాన్ని వాడినప్పుడు ఏమి జరుగుతుంది? Minecraft లో, గొర్రెల్ని కదిలిస్తే ఉన్ని రాలుతుంది, ఆవుల్ని కొడితే పారిపోతాయి, మరి మీరు దగ్గరికెళ్తే తీగలు పైకి పాకుతాయి. ఈవెంట్లనబడే వీటికి ఇలా ప్రతిస్పందనలు జరుగుతాయి, వీటికి ధన్యవాదాలు. ఏదైనా జరిగినప్పుడు వినమని లేదా ఆగమని ఈవెంట్లు మీ ప్రోగ్రాముకు చెబుతాయి. మరి అది అయినప్పుడు ఒక చర్యను చేస్తాయి. ఇంతవరకూ మీరు ఒక ఈవెంట్ వాడారు. మీ ప్రాణి పుట్టినప్పుడు లేదా గేమ్ మొదలైనప్పుడు "వెన్ స్పాన్డ్" స్లాట్ లో మీరు ఉంచిన కోడ్ నడుస్తుంది. తర్వాతి కొద్ది స్థాయిల్లో, మీకు స్లాట్లు కొత్తవి ఉంటాయి, "తాకినప్పుడు" ని తాకితే ఆ జీవి నడుస్తుంది, "వాడినప్పుడు" వంటిది ఆ జీవిని మీరు వాడినప్పుడు కదులుతుంది. లేదా ఎండ వచ్చినప్పుడు జాంబీ మాయం కావాలంటే దాన్ని "పగటిపూట" స్లాట్ లో ఉంచండి.