ప్రపంచంలో ఉన్న యువతులందరూ
తక్కువ కాకుండా ఎక్కువ చేయడానికి
ప్రోత్సాహించబడితే ఎలా ఉంటుంది
మేము ఎలా కనిపిస్తున్నాం కంటే
మేము ఎం చేయగలమని
దృష్టి పెడితే ఎలా ఉంటుంది.
ఒక యువతిగా, నేను ఏ ప్రపంచంలో ఉన్నానంటే,
నిత్యం నన్ను తక్కువ చేయమని సందేశాలు వస్తూ,
తక్కువ తినమని, తక్కువ ధరించమని,
సన్నగా ఉండమని,
నా ఆశయాలను అణచుకోమని,
నన్ను కాపాడే వాడి కోసం వేచి చూడమని,
నేను ధృడంగా లేకపొవడం వలన,
అబ్బాయిలు చేసే పనులు చేయొద్దని చెప్తారు.
ఈ సందేశాలు నా అభద్రతాభావానికి
ఇంధనం అవుతాయి.
నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను,
నేను సరితూగగలనా,
వెర్రి దానిలా కనిపించకుండా ఉండడానికి
సురక్షితమైన పనులే చెయ్యాలా అని.
ఊహించండి,
ఒక దేశంలో యువతులందరూ,
తమ అవకాశాలపై నమ్మకంతో ఒక అడుగు
ముందుకు వేస్తే ఎలా ఉంటుంది.
ఆ దేశ భవిష్యత్తు ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది?
ఇప్పుడు ఊహించండి ఈ గ్రహంలోని యువతులందరూ
వారి ఆలోచనలో ఒక్క అడుగు
తాము ఏం సాధించగలమని ముందుకు వేస్తే
ఎలా ఉంటుంది.
మన ప్రపంచ భవిష్యత్తు
ఎంత ఆశాజనకంగా ఉంటుంది ?
అది సాహసోపేతమైన ఆలోచన.
తక్కువగా మిగిలిపోవడం కన్నా
ప్రయత్నిచడంలోనే ఎంతో సరదా ఉంది.
ఈ ఏప్రిల్ లో, 14 సం.ల వయసులో,
ఉత్తర ధృవం అధిరోహించిన
యువతి యువకుల్లో
అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించాను.
(చప్పట్లు)
ధన్యవాదాలు.
(చప్పట్లు)
ధన్యవాదాలు.
అది ఏ యువతైనా చేసిన గడిచిన రెండు సం.లో
అతి పెద్ద ప్రయాణం.
(చప్పట్లు)
ధన్యవాదాలు.
నా అంతటి బరువున్న స్లెడ్ ను
ధృవం నుండి నేరుగా
150 కిలోమీటర్లు,
మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో లాగాను.
నూటయాభై కిలోలు అంత కష్టమనిపించదు,
మీరు ఆర్కిటిక్ సముద్రం పైన
వాతావరణం అర్థం చేస్కునేంతవరకు.
మంచుతో నిండి, సముద్రపు మంచు ఢీకొని
తయారైన మంచు రాళ్ళు
ఉన్న కుదింపు మండలాల గుండా
మాకు దారి ఎప్పుడూ దొరికేది కాదు,
కొన్ని సార్లు ఆ మంచు రాళ్ళు ఎన్నో మీటర్లు
ఎత్తున్న మంచు గోడలుగా తయారవుతాయి.
సముద్రపు మంచు నుండి విడివడి
దారి తీస్తున్న నీరు వెంబడి
దారి వెతుక్కోవల్సి వచ్చేది.
అలా కుదరకపోతే, స్లెడ్లను ఉపయోగించి
వంతెనను తయారు చేసేవాళ్ళం,
లేదా ఎవరైనా సూట్ ధరించి,
ఈది, ఆవలి ఒడ్డుకి చేరుకుని,
మా స్లెడ్ లను ఉపయోగించి చేసిన తెప్ప
సాయంతో మమ్మల్ని లాగేవారు.
తేలుతున్న సముద్రపు మంచుపై,
మేము ప్రయాణించాము,
కాబట్టి, సముద్ర ప్రవాహం
మా దారి మళ్ళిస్తూ ఉండేది.
మా కింద ఉన్న మంచు విరిగే శబ్దాలు విని,
కొన్నిసార్లు, ఘనీభవించిన ఆ సముద్రంలో
పడిపోతామేమోనని ఆశ్చర్యపోతుండేవాళ్ళం.
ధృవ ఎలుగుబంట్ల దారిని దాటుతూ,
రాత్రంతా వాటి కోసం మేల్కొని ఉన్నాం,
ఎలాగూ నిద్ర వచ్చేది కాదు,
ఎందుకంటే సంవత్సరంలోని ఈ సమయంలో
అక్కడ 24గం.లు పగలే.
నేను స్కీయర్ ని కూడా కాను.
ముందు సం. న్యూజిల్యాండ్ పర్యటనలో
మూడురోజుల పాటు స్కీయింగ్ నేర్చుకున్నాను.
(నవ్వులు)
నేను నివసించే ప్రదేశంలో మంచు ఉండేది కాదు,
అందుకే ఒక సం. ముందునుండి ప్రతీ రోజూ,
టైర్లను లాగుతూ శిక్షణ పొందేదానిని.
మీరు ఊహించినట్లు, ప్రయాణం నెమ్మదిగా,
కష్టంగా ఉండేది.
కొన్ని బొబ్బలు మినహా నా కాలి వేళ్ళ
స్పర్శ కోల్పోయాను.
ఆ మృతచర్మం పోయిన తర్వాత,
మళ్ళీ స్పర్శ తెలిసింది.
అత్యంత చెత్త విషయం ఎమిటంటే,
నేను టాయిలెట్ కు వెళ్ళిన ప్రతీసారీ,
గెడ్డ కట్టే చలి మరియూ మంచు వలన,
నా పైతొడ మరియూ పిర్రల భాగంలో,
హిమఘాతానికి గురి అయ్యాను.
(నవ్వులు)
కానీ దాన్ని ఆస్వాదించాను
నా జీవితంలోని అత్యద్భుతమైన అనుభవం అది.
మన గ్రహంలోని ఆ సుందర, సున్నిత ప్రాంతంతో
నేను ప్రేమలో పడ్డాను.
తిరిగి వచ్చి స్నేహితులని, తల్లిదండ్రులను
కలవడానికి వేచి చూడలేకపోయినా
ఆ ప్రదేశం వదిలి రావడానికి,
చాలా బాధ కలిగింది.
వచ్చే ఏప్రిల్ లో 15సం.ల వయసులో
540 కిలోమీటర్లు గ్రీన్ ల్యాండ్ లో
స్కీయింగ్ చేయాలని,
వచ్చే సం. ఆఖరులో
అంటార్కిటికా తీరం నుండి దక్షిణ ధ్రువం వరకూ
1,170 కి. మీలు స్కీయింగ్ చేస్తాను.
అప్పటికి నాకు 16సం.ల నిండుతాయి.
నేను అక్కడికి చేరుకుంటే,
కొన్ని చిన్న రికార్డులతో పాటు
రెండు ధృవాలకు స్కీయింగ్ చేసి,
పోలార్ హ్యాట్రిక్ పూర్తి చేసిన
అతి పిన్న వయస్కురాలిని అవుతాను.
నా ఈ చిన్న జీవితంలో
పక్క వారికి తెలిపేంతగా
నేను ఏం నేర్చుకున్నాను ?
నన్ను తక్కువగా ఉండమని రోజూ వచ్చే సందేశాలు
తప్పని నేను తెలుసుకున్నాను
నా కలలను విస్తరించడం ద్వారా
తక్కువగా ఆలోచించడం కష్టం
అని తెల్సుకున్నాను.
మనం ఎలా కనిపిస్తున్నామనేదాని కంటే,
మన శరీరం, మనసుపై దృష్టి నిలిపితే,
అంతులేని అవకాశాలను కనుగొని
మనవంతు ఈ ప్రపంచానికి సాయం
అందించగలమని గుర్తిద్దాం.
మన శరీరాకృతి మార్చుకోవాలనుకోవడం
ఏం తప్పు కాదు,
కానీ వేరే ఎవరో నిర్దేశించిన
దృశ్య ప్రామాణికం కోసం
తమ ఆరోగ్యాన్ని, సామర్ధ్యాన్నీ
త్యాగం చేయడం తప్పు.
మనం ఎలా కనిపిస్తున్నాం కంటే
మనం ఏం చేస్తున్నాం అని తెలియజేద్దాం
మీరు ఆలోచించినట్లైతే,
ఇక్కడ హాస్యాస్పదమైన విషయమేమిటంటే
సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ ఫిట్నెస్ ఖాతాలు
తాము అద్దం ముందు నిల్చుని
ఏమీ చేయని తమ ఫోటోలను పెడుతుంటారు
(నవ్వులు)
అది స్ఫూర్తిదాయకం కాదు.
అది కేవలం మనందరినీ బాధపడేలా చేయడమే.
దాని కంటే, ఎదోకటి చేస్తున్న
ప్రజల ఫొటోలు, వీడియోలు స్ఫూర్తిదాయకమైనవి.
ధన్యవాదాలు.
(నవ్వులు)
ఈ విషయాలు మనం ఎలా మార్చగలం ?
మన దృష్టిని ఎలా మార్చగలం ?
నేనైతే, భయానికి ఎదురెళ్తున్న
మహిళలని చూసి,
ఏం సాధ్యమో నేర్చుకుంటాను.
మరింత గొప్పపనులు చేసిన
ఎందరో యువతుల ఉదాహరణలు
చరిత్రలో ఉన్నాయి.
వారితో సమానమైన ఆశ్చర్యం కలిగించేది,
తమ కుటుంబం కోసం,
చదువుకుంటూ పార్ట్ టైం
పని చేస్తున్న అమ్మాయిలు;
తాము నమ్మినదాని కొరకు
కృషి చేస్తున్న అమ్మాయిలు;
ప్రతీ ఉదయం చీకటితోనే నిద్ర లేచి
వారికి నచ్చిన క్రీడలో రాణించడానికి
శిక్షణ పొందుతున్న అమ్మాయిలు;
విద్య కోసం నిద్రపోకుండా చదివే అమ్మయిలు;
తక్కువగా ఉండమనే సందేశాలను
తిరస్కరించే ప్రతీ అమ్మాయి.
మీరు నా పేరెంట్, నా బంధువు,
నా గురువు, లేదా నా కోచ్ అయితే,
నేను మీతో మాట్లాడుతున్నాను.
కేవలం నేను ఒక అమ్మాయిని కనుక
అతి జాగ్రత్త చూపొద్దు.
రిస్క్ తీసుకోమని నన్ను ప్రోత్సహించండి
మీకు కాదు నాకు నచ్చిన కలలను వెంటాడడానికి.
సోదరీమణులారా -
మన స్నేహితురాళ్ళ విజయాలను జరుపుకుందాం.
వారిని తక్కువగా భావించొద్దు
నా స్నేహితుల నాకిచ్చిన మద్దతు
చూసి నేను ఆశ్చర్యపోయాను.
అన్నిటికంటే ముఖ్యమైనది
మనంతట మనమే ప్రారంభించాలి.
మనకు మనమే శత్రువులం.
మన దారిని వదలి,
పక్కవారు ఏమనుకుంటారని ఎక్కువ ఆలోచించొద్దు.
నిజమేమిటంటే ప్రతీ ఒక్కరూ
ఇతరులు తమ గురించి ఏమాలోచిస్తారని
ఆందోళన పడేవారే.
మన విలువలననుసరించి
మనకేం కావాలనే విషయంపై
దృష్టి పెట్టాలి.
మన తల్లిదండ్రుల, స్నేహితుల,
పాఠశాల విలువలు కాదు.
ఇతరులకు దీనిని చేయవద్దు,
మీ కోసం దీన్ని చేయండి.
మనం నమ్మినది నిజం చేయాలంటే ధైర్యం కావాలి.
మనం ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
మీరు ఏపనైనా పరిపూర్ణంగా చేయగలిగేంత
వరకూ వేచి చూడొద్దు.
వెంటనే ప్రారంభించండి.
నేను ఉత్తర ధృవానికి వెళ్ళే ముందు
కేవలం ఒక్కసారి మాత్రమే స్కీయింగ్ చేసాను.
ఆలోచిస్తే చాలా హాస్యంగా తోస్తుంది.
(నవ్వులు)
మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిలబడి
గలాటాని ఉపయోగించి
మూత్రించడానికి ప్రయత్నించి విఫలమైయ్యాను.
(నవ్వులు)
ఆ రోజు మిగిలిన భాగమంతా
మూత్రంతో తడిసిన నా ప్యాంట్లతో
స్కీయింగ్ చేసాను.
(నవ్వులు)
ధైర్యం అనేది భయం లేకపోవడం కాదు
మన భయానికి, సందేహానికి ఎదురునిలిచి
ప్రయత్నం చేయడం.
శౌర్యం లేనిదే, మన జీవితాలు చిన్నవైపోతాయి.
మన ఆలోచనలో, ఆకాంక్షల్లో,
యువతులు ఏం సాధించగలరని,
ఒక అడుగు ముందుకు వేద్దాం.
మనం ఎలా ఉన్నాం కంటే ఏం సాధించగలమని,
నిరంతరం ఆలోచిస్తూ ఉందాం.
ఈ చిన్న అడుగులన్నీ కలిసి,
యువతులు సామర్ధ్యం సమిష్టిగా విస్తరింపబడి,
ప్రపంచం భవిష్యత్తు బాగుంటుంది.
ధన్యవాదాలు.
(చప్పట్లు)