మీరెప్పుడైనా చేసిందే పదే పదే చేయడం గురించి
ఊహించగలరా? బహుశా ఎప్పటికీ లేదేమో
ఎందుకంటే పదేపదే పనులు చేయడంలో కంప్యూటర్లు
చాలా బాగుంటాయి. ఇది "రిపీట్ ఫరెవర్" బ్లాక్
ఈ బ్లాకులోనిది ఏదైనా ఈ గేములో ఎప్పటికీ
జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం గనక యాక్టర్
ప్లేయర్ లేకుండా ఏదైనా పదేపదే చేయాలనుకుంటే
మనం ఈ బ్లాకుల్ని "రిపీట్ ఫరెవర్" లోపల
ఉంచుతాం. ఈ తర్వాతి పజిల్ లో, అన్నా పైకీ
కిందికీ నడుస్తూ ఉండేలా చేయడం మన లక్ష్యం.
రిపీట్ కమాండ్లు ఎలా పనిచేస్తాయో నేర్చుకోడం
మీరు మీ స్వంత గేమును నిర్మించుకునేటప్పుడు
ఎంతో సమయాన్ని ఆదా చేస్తుంది.