హై, నా పేరు జాన్.
నేను Google లో సర్చ్ మరియు యంత్ర అభ్యసన
జట్ల నాయకుణ్ణి.
నాకు అద్భుతంగా స్ఫూర్తినిచ్చేది ఏమిటంటే
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అల్పమైన
ప్రశ్నలు మరియు ముఖ్యమైన ప్రశ్నలు
అడిగేందుకు
సర్చ్ ఇంజన్లు తిప్పేస్తారు.
కాబట్టి మనమివ్వగలిగిన మంచి జవాబులు
ఇవ్వడం మనకు ఒక పెద్ద బాధ్యత.
హై. నా పేరు అక్షయ, నేను బింగ్ సర్చ్ టీములో
పని చేస్తున్నా.
మనము అనేక సార్లు కృత్రిమ తెలివితేటలు
మరియు
యంత్ర అభ్యసనం చూడ్డానికి ప్రయత్నం
చేయడం మొదలుపెట్టాము.
ఐతే వాడుకదారులు దీనిని ఎలా వాడబోతున్నారనే
దానిపై దృష్టి పెట్టాలి,
ఎందుకంటే చివరికి మనం సమాజానికి ఒక ప్రభావం
చూపించాల్సి ఉంటుంది.
ఒక సులువైన ప్రశ్న అడుగుతాను.
శుక్రగ్రహానికి ప్రయాణం ఎంత కాలం పడుతుంది?
ఈ ఫలితాలు ఎక్కణ్ణించి వచ్చాయి
మరి ఎందుకు ఇది మరోదానికంటే ముందు జాబితా
చేయబడింది?
సరే. ముందుకు దూకి, సర్చ్ ఇంజన్ మీ
అభ్యర్థనని ఒక
ఫలితంగా ఎలా మార్చిందో చూద్దాం.
మీరు తెల్సుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే
మీరెప్పుడు
సర్చ్ చేశారు, సర్చ్ ఇంజన్ మీ సర్చ్ ని
వాస్తవసమయంలో సర్చ్ చేయుటకు
వరల్డ్ వైడ్ వెబ్ కు వెళ్ళట్లేదు.
అందుకనే ఇంటర్నెట్ పై బిలియన్ వెబ్సైట్లు
ఉన్నాయి
ప్రతినిముషంలో వందలాదిగా కొత్తవి
సృష్టించబడుతున్నాయి.
కాబట్టి సర్చ్ ఇంజన్ గనక మీక్కావాల్సిన దాని
కోసం ప్రతి సైట్ నీ చూడాలంటే, దానికి
ఎంత సమయమైనా సరిపోదు.