హై, నా పేరు జాన్. నేను Google లో సర్చ్ మరియు యంత్ర అభ్యసన జట్ల నాయకుణ్ణి. నాకు అద్భుతంగా స్ఫూర్తినిచ్చేది ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అల్పమైన ప్రశ్నలు మరియు ముఖ్యమైన ప్రశ్నలు అడిగేందుకు సర్చ్ ఇంజన్లు తిప్పేస్తారు. కాబట్టి మనమివ్వగలిగిన మంచి జవాబులు ఇవ్వడం మనకు ఒక పెద్ద బాధ్యత. హై. నా పేరు అక్షయ, నేను బింగ్ సర్చ్ టీములో పని చేస్తున్నా. మనము అనేక సార్లు కృత్రిమ తెలివితేటలు మరియు యంత్ర అభ్యసనం చూడ్డానికి ప్రయత్నం చేయడం మొదలుపెట్టాము. ఐతే వాడుకదారులు దీనిని ఎలా వాడబోతున్నారనే దానిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే చివరికి మనం సమాజానికి ఒక ప్రభావం చూపించాల్సి ఉంటుంది. ఒక సులువైన ప్రశ్న అడుగుతాను. శుక్రగ్రహానికి ప్రయాణం ఎంత కాలం పడుతుంది? ఈ ఫలితాలు ఎక్కణ్ణించి వచ్చాయి మరి ఎందుకు ఇది మరోదానికంటే ముందు జాబితా చేయబడింది? సరే. ముందుకు దూకి, సర్చ్ ఇంజన్ మీ అభ్యర్థనని ఒక ఫలితంగా ఎలా మార్చిందో చూద్దాం. మీరు తెల్సుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే మీరెప్పుడు సర్చ్ చేశారు, సర్చ్ ఇంజన్ మీ సర్చ్ ని వాస్తవసమయంలో సర్చ్ చేయుటకు వరల్డ్ వైడ్ వెబ్ కు వెళ్ళట్లేదు. అందుకనే ఇంటర్నెట్ పై బిలియన్ వెబ్‌సైట్లు ఉన్నాయి‌ ప్రతినిముషంలో వందలాదిగా కొత్తవి సృష్టించబడుతున్నాయి. కాబట్టి సర్చ్ ఇంజన్ గనక మీక్కావాల్సిన దాని కోసం ప్రతి సైట్ నీ చూడాలంటే, దానికి ఎంత సమయమైనా సరిపోదు. కాబట్టి మీ శోధన వేగంగా చేయండి, సర్చ్ ఇంజన్లు స్థిరంగా వెబ్ ని ముందస్తుగా స్కాన్ చేస్తున్నాయి మీ సర్చ్ తో తర్వాత సహాయపడొచ్చని రికార్డు చేయడానికి. ఆ విధంగా, మీరు శుక్రగ్రహ ప్రయాణం గురించి సర్చ్ చేసినపుడు సర్చ్ ఇంజన్ కి ఏమి కావాలో ముందే తెల్సు, మీకు వాస్తవ సమయంలో జవాబివ్వడానికి అదెలా పనిచేస్తుందో ఇదిగో. ఇంటర్నెట్ అనేది, హైపర్ లింక్ లతో కనెక్ట్ చేయబడిన పేజీల గూడు. సర్చ్ ఇంజన్లు స్థిరంగా స్పైడర్ అనే ఒక ప్రోగ్రామును రన్ చేస్తాయి, అది ఈ వెబ్ పేజీలను దాటి వాటి నుంచి సమాచారం సేకరిస్తుంది. హైపర్ లింక్ ని కనుగొన్న ప్రతిసారీ అది ప్రతిపేజీని చూసేవరకూ దాన్ని అనుసరిస్తుంది. అది మొత్తం ఇంటర్నెట్ పై దాన్ని చూస్తుంది. స్పైడర్ చూసే ప్రతి పేజీ కొరకు సర్చ్ కి కావాల్సిన ఏ సమాచారాన్నైనా అది రికార్డు చేస్తుంది సర్చ్ ఇండెక్స్ అనే ఒక డేటాబేస్ కి కలుపుతూ. ఇపుడు, మునుపటి సర్చ్ కి వెనక్కి వెళ్దాం మరి సర్చ్ ఇంజన్ ఎలా ఫలితాలతో వచ్చిందో కనుక్కోగలమేమో చూద్దాం. శుక్రగ్రహానికి వెళ్ళటానికి ఎంతకాలం పడుతుందని అడిగినప్పుడు సర్చ్ ఇంజన్ ఆ పదాలన్నింటినీ సర్చ్ ఇండెక్స్ లో చూస్తుంది, ఆ పదాలు కలిగియున్న పేజీల జాబితాను ఇంటర్నెట్ లో పొందడానికి. ఐతే ఈ సర్చ్ పదాల్ని కేవలం చూడ్డానికి మిలియన్ల పేజీల్ని తిరగేయాలి, కాబట్టి సర్చ్ ఇంజన్ మీకు మంచి ఫలితాలు చూపగల సామర్థ్యాన్ని ముందుగా కలిగి ఉండాలి. మీరు దేనికోసం చూస్తున్నారో సర్చ్ ఇంజన్ ఊహించాలి కాబట్టి ఉపాయమంతా ఇక్కడే ఉంది. ప్రతి సర్చ్ ఇంజన్ తన స్వంత అల్గారిధం ఉపయోగిస్తుంది మీకేమి కావాలో దాని ఆలోచన ఆధారంగా పేజీలను ర్యాంక్ చేయడానికి. సర్చ్ ఇంజన్ యొక్క ర్యాంకింగ్ అల్గారిధం మీ శోధన పదము పేజీ శీర్షికలో చూపబడుతుందేమో చెక్ చేయొచ్చు పదాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తుందేమో లేదా ఇతర లెక్కల ఏదేని నంబరును చూపుతుందేమో చెక్ చేయొచ్చు అది మెరుగ్గా నిర్ధారించడానికి సహాయపడొచ్చు, ఏ పేజీలు మీకు కావాలి, ఏపేజీలు వద్దు అని. Google చాలా ప్రసిద్ధ అల్గారిధం కనుక్కొంది ఒక సర్చ్ కోసం అత్యంత సముచిత ఫలితాలు ఎంచుకోవడానికి, ఒక పేజీకి ఎన్ని ఇతర వెబ్ పేజీలు లింక్ అయ్యాయని లెక్కలోకి తీసుకుంటూ. ఆలోచన ఏమిటంటే, అనేక వెబ్‌సైట్లు గనక ఒక వెబ్ పేజీ ఆసక్తిగా ఉందనుకుంటే, బహుశా అది మీరు ఎదురు చూస్తున్నది కావచ్చు. ఈ అల్గారిధం ని పేజ్ ర్యాంక్ అంటారు, అది వెబ్ పేజీల్ని ర్యాంక్ చేసినందుకు కాదు, ఐతే దాన్ని కనుగొన్న ల్యారీ పేజ్ పేరుతో ఇచ్చారు, ఆయన Google స్థాపకుల్లో ఒకరు. ఒక వెబ్‌సైట్ ని మీరు సందర్శిస్తే అది డబ్బు చేసుకుంటుంది స్పామర్లు నిరంతరంగా సర్చ్ అల్గారిధం గేమ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు, తద్వారా ఫలితాల్లో ఉన్నతంగా జాబితా చేయబడతారు. సర్చ్ ఇంజన్లు తమ అల్గారిధంలను అప్‌డేట్ చేస్తాయి, నకిలీ లేదా నమ్మదగని సైట్లు పైకి చేరకుండా నివారించడానికి. అంతిమంగా, నమ్మదగని పేజీలపై ఒక కన్నేసి ఉంచడమనేది మీ ఇష్టం వెబ్ చిరునామా చూస్తూ అది నమ్మదగిన వనరుగా నిర్ధారణ చేసుకొంటూ. సర్చ్ ప్రోగ్రాములు ఎపుడూ అల్గారిధం లను మెరుగుచేయడానికి వస్తుంటాయి, తద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయి, పోటీదారులకంటే వేగమైన ఫలితాలు వస్తాయి. నేటి సర్చ్ ఇంజన్లు, మీ సర్చ్ ని కుదించడానికి మీరు బహిరంగంగా ఇవ్వని సమాచారాన్ని సైతమూ వాడుకుంటాయి. ఉదా, మీరు డాగ్ పార్కుల కొరకు సర్చ్ చేసి ఉంటే, అనేక సర్చ్ ఇంజన్లు దగ్గర ఉండే డాగ్ పార్కుల కొరకు మీకు ఫలితాలను ఇస్తాయి, మీరు మీ స్థానమును టైప్ చేయనప్పటికీ. ఆధునిక సర్చ్ ఇంజన్లు కూడా పేజీపై గల పదాల కంటే ఎక్కువగా అర్థం చేసుకుంటాయి, ఐతే మీరు చూస్తున్న దానికంటే ఉత్తమంగా ఏది జత అవుతుందో దాన్ని శోధించడానికి చూస్తాయి. ఉదా, మీరు గనక వేగంగా అడుగేసే వారి కోసం సర్చ్ చేస్తే, మీరొక అథ్లెట్ కోసంచూస్తున్నారని అదిగ్రహిస్తుంది. ఐతేమీరు పొడుగ్గా అడుగేసేవారి కోసం చూస్తే అది మీ వంటగది కొరకు ఆప్షన్లు కనుక్కొంటుంది. పదాల్ని బాగా అర్థం చేసుకోవడానికి, మనం మెషీన్ లెర్నింగ్ అనే ఒక కృత్రిమ తెలివితేటల్ని ఉపయోగిస్తాము. అది సర్చ్ చేయడానికి సర్చ్ అల్గారిధంలను పేజీ పై విడి అక్షరాలు లేదా పదాల్ని మాత్రమే కాకుండా, పదాల్లో దాగిఉన్న అర్థాన్ని అర్థం చేసుకుంటుంది. ఇంటర్నెట్ విపరీతంగా విస్తరిస్తోంంది, ఐతే సర్చ్ ఇంజన్లను డిజైన్ చేసే టీములు గనక తమ విధులు సరిగా నిర్వర్తిస్తే, మీకు కావాల్సిన సమాచారం ఎల్లప్పుడూ కొద్ది నొక్కుల దూరములోనే ఉంటుంది.