ఇంటర్నెట్:ఎన్‌క్రిప్షన్ మరియు పబ్లిక్ కీస్ హై, నాపేరు మియా గిల్-ఎప్నర్, నేను UC బర్క్‌లీ లో కంప్యూటర్ సైన్స్ అధినేత మరియు రక్షణ విభాగానికి పనిచేస్తా, అందులో సమాచారం భద్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తా. ఇంటర్నెట్ అనేది స్వతంత్ర మరియు బహిరంగ వ్యవస్థ. మనం వైర్లు మరియు కనెక్షన్ల మీదుగా సమాచారాన్ని పంపి, అందుకుంటాం. అది బహిరంగ వ్యవస్థ అయినా మనం ఎంతో ప్రైవేట్ డేటాని మార్పిడి చేస్తాం. క్రెడిట్ కార్డ్ నంబర్లు, బ్యాంక్ సమాచారం, పాస్‌వర్డ్ లు మరియు ఇమెయిల్స్ వంటివి. మరి ఈ ప్రైవేట్ సమాచారమంతా ఎలాగోప్యంగా ఉంటుంది? ఎన్‌క్రిప్షన్ అనే ప్రక్రియ ద్వారా ఎటువంటి రకం డేటానైనా గోప్యంగా ఉంచొచ్చు, అసలు వచనం దాచడానికి సందేశాన్ని ఏమార్చి ఉంచడం ద్వారా. ఆ సందేశాన్ని చదవదగిందిగా చేయడానికి ఇపుడు డిక్రిప్షన్ అనేది యధాస్థితికి చేసేప్రక్రియ ఇది సులువైన ఉపాయం, దీన్ని మనుషులు చాలాకాలం నుండీ చేస్తున్నారు. ఎన్‌క్రిప్షన్ యొక్క సుపరిచిత పద్ధతుల్లో ఒకటి సీజర్స్ సైఫర్. జూలియస్ సీజర్ తర్వాత ఆ పేరు వచ్చింది. అతను తమ సైన్యానికి ఇచ్చే ఆదేశాల్ని శత్రువులకు దొరికినా గుర్తించనంతగా, చదవలేనంతగా ఎన్‌క్రిప్ట్ చేశాడు. సీజర్స్ సైఫర్ అనేది అసలు సందేశంలోని ప్రతి అక్షరాన్నీ కొన్ని దశలతో ఒక అక్షరం కింద మరోదానితో రూపాంతరం చేసి మార్చివేసే ఒక అల్గారిధం. ఒకవేళ నంబర్ గనక పంపించువారికి మరియు స్వీకర్తకు మాత్రమే తెలిసి ఉంటే, అప్పుడు దానిని కీ అంటారు. చదువరి రహస్యసందేశాన్ని అన్‌లాక్ చేయడానికి ఇది వీలు కలిగిస్తుంది.ఉదా, మీ అసలు సందేశం గనక 'హలో' ఐతే అప్పుడు 5 యొక్క ఒక కీ తో సీజర్ సైఫర్ అల్గారిధం ఉపయోగిస్తే ఎన్‌ క్రిప్ట్ సందేశం ఇలా ఉంటుంది... సందేశాన్ని డీక్రిప్ట్ చేయడానికి స్వీకర్త ప్రక్రియల్ని వెనక్కిచేసే కీ వాడతారు. ఐతే సీజర్ సైఫర్ తో పెద్ద సమస్య ఉంది,ఎవరైనా ప్రతి‌ కీ ని ప్రయత్నించి ఎన్‌క్రిప్ట్ సందేశాన్ని విడదీయవచ్చు, మరియు ఇంగ్లీష్ అక్షరాలు 26 మాత్రమే, అంటే దానర్థం మెసేజ్ డీక్రిప్ట్ చేయడానికి మీరు 26కీలను మాత్రమే ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇపుడు 26 కీలను ప్రయత్నించడం కష్టమేమీ కాదు, మహా ఐతే ఒక గంట పడుతుంది. కాబట్టి దాన్ని కష్టంగా చేద్దాం. ఒకే మొత్తంతో ప్రతి అక్షరాన్నీ మార్చే బదులు వేరే మొత్తంతో ప్రతి అక్షరాన్నీ మార్చుదాం. ఈ ఉదా.లో ఒకపొడవాటి సందేశాన్ని ఎన్‌క్రిప్ట్ చేయడానికి ఒక్కో వరుస అక్షరం ఎన్ని స్థానాలు మారవలసి ఉంటుందో ఒక పది అంకెల కీ చూపుతుంది. ఈ కీ ని ఊహించడం నిజంగా కష్టమే. 10 అంకెల వాడకానికి 10 బిలియన్ కీ పరిష్కారాలుండొచ్చు సహజంగా అది ఏ మనిషీ ఎప్పటికీ సాధించలేనంత కష్టం కావచ్చు, అనేక శతాబ్దాలు పట్టవచ్చు. ఐతే నేడు సగటు కంప్యూటర్ కి ఆ 10 బిలియన్ కీ లను చేయడానికి కొద్ది సెకెన్లే పట్టొచ్చు కాబట్టి ఈ ఆధునిక యుగంలో మనుషులవద్ద కలానికి బదులు కంప్యూటర్లుఉండగా, విడగొట్టడానికి అతి కష్టమయ్యేటంత కఠినంగా మీరు సందేశాలను ఎలా ఎన్‌క్రిప్ట్ చేయగలుగుతారు? అతి కష్టం అంటే ఒక సహేతుకమైన సమయంలో గణించడానికి అనేకమైన సాధ్యతావకాశాలు ఉంటాయని అర్థం.నేటి సురక్షిత కమ్యూనికేషన్లు 256 బిట్ కీ లను ఉపయోగించి ఎన్‌క్రిప్ట్ చేయబడ్డాయి. అంటే మీసందేశాల్ని విడమర్చి చూసే కంప్యూటర్ ఈ అనేక అవకాశాల్ని ప్రయత్నిచాల్సి ఉంటుంది...కీ ని కనుక్కొని సందేశాన్ని విడదీసే వరకూ. మీ వద్ద 1000,000 సూపర్ కంప్యూటర్లు ఉండి మరి వాటిలో ప్రతీదీ సెకనుకి మిలియన్ బిలియన్ కీ లను ప్రయత్నించే సామర్థ్యం ఉన్నా, 256బిట్ ఎన్‌క్రిప్షన్ తో రక్షింపబడ్డ ఒకేఒక సందేశాన్ని విడదీయడానికి ట్రిలియన్ల ట్రిలియన్ సంవత్సరాలు పడుతుంది ప్రతి సంవత్సరమూ కంప్యూటర్ చిప్స్ వేగములో రెట్టింపు, సైజులోసగం అవుతూ ఉండవచ్చు. ఒకవేళ ఆ గణనీయ పురోగతి కొనసాగితే, నేటి అసాధ్యమైన సమస్యలు భవిష్యత్తులో కేవలం కొన్ని వందల సంవత్సరాలలో పరిష్కారం కావచ్చు మరియు 256 బిట్స్ అంత సురక్షితం కాకపోవచ్చు. నిజానికి కంప్యూటర్ల వేగాన్నిపెంచడానికి ఇప్పటికే మనం ప్రామాణిక కీ పొడవులను పెంచవలసి వచ్చింది. శుభవార్త ఏమిటంటే పొడవైన కీ ఉపయోగించడం వల్ల సందేశాలను అతికష్టంగా చేయడం సాధ్యంకాదు, ఐతే ఒక సైఫర్ ని విడదీయడానికి అది ఊహల సంఖ్యను విశేషంగా పెంచగలుగుతుంది. ఒక సందేశాన్ని కూడగట్టడానికి మరియు విడదీయడానికి సెండర్ మరియు స్వీకర్త ఒకే కీ ని పంచుకుంటే దానిని సిమ్మెట్రిక్ ఎన్‌క్రిప్షన్ అంటారు. దీనితో, సీజర్ సైఫర్ లాగా, రహస్య కీ ని రానున్న కాలం లో ఉభయులూ గోప్యంగా అంగీకరించాల్సి ఉంటుంది. అది మనుషులకు గొప్ప విషయం, ఐతే ఇంటర్నెట్ ఓపెన్ మరియు పబ్లిక్ కాబట్టి, ఒకరహస్య కీ పై అంగీకారానికి కంప్యూటర్లు రెండు గోప్యంగా కలవడం అసాధ్యం. దానికి బదులు కంప్యూటర్లు అసిమ్మెట్రిక్ ఎన్‌క్రిప్షన్ కీస్ వాడవచ్చు, పబ్లిక్ కీ ని ఎవరితోనైనా మార్చుకోవచ్చు, ఒక ప్రైవేట్ కీ పంచుకోబడదు. డేటా ఎన్‌క్రిప్ట్ చేయడానికి పబ్లిక్ కీ పనికొస్తుంది, ఎవరైనా దాంతో రహస్య సందేశం చేయవచ్చు, ఐతే రహస్య కీ ప్రైవేట్ కీ ప్రాప్యతతో కంప్యూటర్ మాత్రమే డీక్రిప్ట్ చేస్తుంది.అదెలా పనిచేస్తుందనేది కొంత లెక్క. దాంట్లోకి మనం ఇప్పుడే వెళ్ళం. మీకొక వ్యక్తిగత మెయిల్ బాక్స్ ఉందనుకోండి, అందులో ఎవరైనా మెయిల్ ఉంచొచ్చు, ఐతే దానికి వాళ్ళకో కీ కావాలి.ఇపుడు మీరు అనేక డిపాజిట్ కీ కాపీలు చేసి ఒకటి మీ మిత్రుడికి పంపి దాన్ని బహిరంగ అందుబాటులోనికి తేవచ్చు. మీ మిత్రుడు లేదా ఒక కొత్త మనిషి ఆ పబ్లిక్ కీ ఉపయోగించి మీ డిపాజిట్ స్లాట్ ని పొందవచ్చు మరియు అందులో సందేశం ఉంచొచ్చు, ఐతే ఆ రహస్య సందేశాలన్నింటి ప్రాప్యత కోసం మీరు మాత్రమే ప్రైవేట్ కీతో మెయిల్ బాక్స్ తెరవగలరు. మరి ఒక రక్షిత సందేశాన్ని తిరిగి మీ మిత్రుడికి వారి మెయిల్ బాక్స్ కి పబ్లిక్ డిపాజిట్ కీ ఉపయోగించి పంపించొచ్చు.ఈవిధంగా మీరు రక్షిత సందేశాల్ని ప్రైవేట్ కీ ఒప్పందం లేకుండానే పంపొచ్చు. ఓపెన్ ఇంటర్నెట్ పై అన్ని రక్షిత సందేశాలకూ పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ పునాది. వెబ్ ని బ్రౌజ్ చేసేటపుడు మనకు రక్షణ ఇచ్చే SSL ఇంకా TLS అనబడే సెక్యూరిటీ ప్రోటోకాల్స్ తో సహా. మీ కంప్యూటర్ దీన్ని ఈ రోజు వాడుతూ ఉంది, మీరు మీ బ్రౌజర్ యొక్క అడ్రస్ బార్ పై ఎపుడుచిన్నలాక్ లేదాhttpsఅక్షరాల్ని చూసినా. దీనర్థం, మీరుచూస్తున్న వెబ్‌సైట్ తో డేటాని మార్చుకోవడానికి మీ కంప్యూటర్ పబ్లిక్ కీ ఎన్‌క్రిప్షన్ వాడుతోందని. ఇంటర్నెట్ పైకి ఎంత ఎక్కువమంది వస్తే అంత ప్రైవేట్ డేటా ప్రసారవ్యాప్తి అవుతుంది, మరియు ఆ డేటాను భద్రపరచుకోవడం మరింత ముఖ్యమవుతుంది. మరియు కంప్యూటర్ల వేగం ఇంకా పెరిగే కొద్దీ మనం కంప్యూటర్లు ఎన్‌క్రిప్షన్ని విడగొట్టడానికి కష్టమయ్యేలా కొత్తమార్గాల్ని కనిపెట్టాలి. ఇదేనేను చేస్తున్నది, అదిమారుతూనే ఉంటుంది.