ఐతే మీరు ఏ గ్రేడ్ లో ఉన్నారు? రెండు. పది. ఫస్ట్ గ్రేడ్. ప్రోగ్రాం నేర్చుకున్నప్పుడు 8వ గ్రేడ్. నేను 6 వ గ్రేడ్ లో ఉన్నపుడు నా మొదటికంప్యూటర్ తెచ్చుకున్నా. ప్రజల సమస్యని తీర్చగలగడం నాకు ఆనందాన్నిస్తోంది. మీయంతట మీరు చెప్పొచ్చు, ఒక ఆలోచన నుండి వస్తువులు చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ అనేక విషయాలకు ఆధారం, కాలేజ్ విద్యార్థులు, నిపుణులు మరో ఇరవై లేదా ముప్పైఏళ్ళ పాటు చేయబోయే పనులకి. నాకు ప్రోగ్రామింగ్ అంటే ఇష్టం, ఎందుకంటే ప్రజలకి సాయపడ్డం నాకిష్టం.ప్రజల జీవితాల్ని సులభం చేయబోయే ఒక పని చేసే అవకాశం ఒకటి నాకు వచ్చింది. మనం సూపర్ పవర్ కావడానికి అది అతి దగ్గరి విషయమని నేననుకుంటున్నా. మొదలుచేయడం అతి ముఖ్యమైన భాగం. నాకు నేను ఇంకా మొదట్లో ఉన్నా, మరి నాతోపాటు నువ్వూ నేర్చుకోవాలి. నేను జాన్ వెచ్చే, నేను పోప్‌క్యాప్ గేమ్స్ స్థాపకుల్లో ఒకణ్ణి. మేము మొక్కలు, జాంబీస్ బిజెవెల్డ్ ఇంకా పెగెల్ వంటి గేమ్స్ చేస్తాం గేమ్ గురించి మీ కోడ్ ఎంత కచ్చితమని కాదు, మీ కళ ఎంత కచ్చితం కాదని. దీని భావన ఇంకా ఇదెంత వినోదమని. దాన్ని ప్రయత్నించడం ఇంకా చేయడం, నేర్చుకోవడం, అలవర్చుకోవడం, గేమ్స్ చేయడంలో మీ స్వంత నైపుణ్యాల్ని ద్వారా మాత్రమే మీరుగ్రహిస్తారు. మీకిష్టమైన వీడియో గేముందా?మనం గేమ్ దిశగా ఒకడుగు ముందుకెళ్ళి ప్లేల్యాబ్ లా గేమ్స్ చేయబోతున్నాం. మంచి గెమ్స్ కి ఓ కథ ఉంటుంది మరియు ప్రతి కథకూ నటులుంటారు. నటులు మాట, కదలిక, చర్య మరియు పరస్పరం మాట్లాడ్డం వంటీవి చేస్తారు. బహుశా గేమ్ రూల్స్ ని బట్టి పాయింట్స్ తెస్తారు. ఈరోజు మనం ఇవన్నీ ఎలా చేయాలో నేర్చుకుందాం, ఒకటొకటి, అన్నా, ఎల్సా, హిరో, బేమ్యాక్స్, వంటి డిస్నీపాత్రల్తో స్క్రాచ్ నుండి ఫోన్ పై పంపి ఆడగల గేమును చేద్దాం. మీస్క్రీన్ మూడు భాగాలవుతుంది. ఎడమ గేమ్ స్పేస్, అక్కడ మీ ప్రోగ్రాం రన్ అవుతుంది. ప్రతి లెవెల్ సూచనలు దిగువ రాయబడ్డాయి. ఈ మధ్యది టూల్ బాక్స్. మరి ఈ బ్లాక్ లలో ప్రతీదీ కోడ్ భాగం. కుడివైపునుండే వైట్ స్పేస్ ని వర్క్ స్పేస్ అంటారు, మరి ఇక్కడే మనం ప్రోగ్రాం నిర్మిస్తాం. మొదలుపెట్టడానికి మీరు మీ బ్లాకుల్ని ఆరంజ్ "వెన్ రన్" బ్లాక్ కి లింక్ చేయాల్సుంటుంది. మీరు అనేక బ్లాకుల్ని పసుపు ఔట్‌లైన్ కనబడే వరకూ బైటికి లాగి కలిపి లింక్ చేయొచ్చు, మరి అప్పుడవి కలిసి చిటపటలాడతాయి. ఈ మొదటి పజిల్ లో, హిరో యాక్టర్ 1 గా మరియు బేమ్యాక్స్ యాక్టర్ 2 గా ఉంటారు. హిరో బేమ్యాక్స్ ని చేరుకోవడానికి మనం"మూవ్ రైట్" బ్లాక్ ని బైటికిలాగి దాన్ని "వెన్ రన్" బ్లాక్ కి లింక్ చేయాలి. మీ వద్ద మీ బ్లాక్స్ ఉన్నాయంటే, మీరుచేసిన ప్రోగ్రాం చూడ్డానికి "రన్" బటన్ నొక్కండి.మొదలెట్టండి చివరికి మీరు మీ స్వంత గేమ్ చేసుకోగలుగుతారు ఈ అద్భుతమైన యాక్టర్లతో, అవి మాట్లాడగలవు, స్కోర్ చేయగలవు, మైక్రోబోట్స్, చెర్రీలు, సాస్ పాన్స్, స్పార్కిల్, ఐస్ తోయగలవు, ఒకదాన్నొకటి పాడు చేయనూ గలవు. అంతా మీ ఇష్టం మరి. ఉంటా!