ఇప్పుడు మనం గేమ్ ప్రోగ్రామర్లందరూ నిత్యమూ వాడే విషయం గురించి నేర్చుకోబోతున్నాం. అవి "ఈవెంట్లు". ఏదైనా జరిగినప్పుడు వినమని ఒక ఈవెంట్ మీ ప్రోగ్రాముకు చెబుతుంది. మరియు అది జరిగినప్పుడు, అది ఒక చర్యను చేస్తుంది. ఈవెంట్లకు కొన్ని ఉదాహరణలుగా ఒక మౌస్ క్లిక్ వినడం, ఒక యారో బటన్, లేదా స్క్రీన్ పై తట్టడం. ఇక్కడ మనం, ప్లేయర్ అప్/డౌన్ యారో కీ లేదా అప్/డౌన్ బటన్లు వాడితే బేమ్యాక్స్ హిరోను తాకే వరకూ పైకి కదిలి రాపుంజెల్ ని తాకడానికి కిందికి వచ్చేలా చేయబోతున్నాం. మనం "వెన్ అప్ యారో" బ్లాక్ వాడతాం మరియు దానికి యాక్టర్ అప్ బ్లాక్ జోడిస్తాం, కావున ప్లేయర్ అప్ యారో కీ నొక్కితే, "వెన్ అప్ యారో" బ్లాక్ కి జతచేసిన అంతా నడుస్తుంది. బేమ్యాక్స్ కిందికి దిగడానికీ అదే చేస్తాం. దశ దశకూ మీ గేమ్ మరింత సంభాషణాత్మకంగా తయారవుతుంది.