నేను ధ్యానం అభ్యసిస్తున్న మొదటిరోజుల్లో శ్వాస పై శ్రధ్ధ పెట్టమని నాకు చెప్పారు దారి తప్పిన మనస్సును దారిలోకి తేవడం వినడానికి సులభంగానే అన్పిస్తుంది నేను ఏకాంతంలో నిశ్సబ్దంగా కూర్చునే వాడిని మంచి చలిలో కూడా షర్టులోంచి చెమట్లు కారేవి చాలా కష్టమైన పని కావడంతో సమయం దొరికినప్పుడల్లా కునుకు తీసేవాడిని నిజానికిది అలసట కలిగించేది అయినా సూచనలు తేలికగానే వుండేవి ముఖ్యమైందేదో పట్టుకోలేక పోతున్నానని అన్పించేది ఏకాగ్రత చూపడం ఎందుకింత కష్టం పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే మనం ఒక అంశం పై దృష్టి పెట్టాలనుకున్నప్పుడు ఈ ఉపన్యాసం వంటిది అనుకోండి ఒక దశలో మనలో సగం మంది పగటికలల్లోకి జారిపోతుంటాము లేదా మన ట్విటర్ అకౌంట్ ని చూడాలనుకుంటాం అంటే ఇక్కడేం జరుగుతోంది పరిణామశీలమైన, సంరక్షణాత్మకమైన, పధ్ధతిలో మనం పోరాడుతున్నాం సైన్స్ ఆధారిత అభ్యసన ప్రక్రియలతో ఆది జాగ్రత్త చేయబడింది గతంలో మనిషికి తెలిసిన ప్రాధమిక నాడీ సంబంధ వ్యవస్థలతో ఈ ప్రతిఫల ఆధారిత అభ్యసన ప్రక్రియనే సకారాత్మక, నకారాత్మక బలోపేతపు క్రియ అంటాము దాని మూలకారణాన్ని ఇలా చెప్పొచ్చు ఆకర్షణీయమైన ఆహారాన్ని చూస్తాం మన మెదడు చెప్తుంది కాలరీలు...జాగ్రత్త అని కానీ దాన్ని తింటాం,రుచి చూస్తాం అది మనకు నచ్చుతుంది ముఖ్యంగా మిఠాయిలు మన శరీరం మెదడుకు పంపే సంకేతాలు ఏమంటాయంటే ఏం తింటున్నావు,అదెలాంటిది గుర్తుంచుకో మనం ఈ సందర్భాన్ని గుర్తుంచుకుంటాం మరోసారీ ఇలానే చేస్తాం ఆహారాన్ని చూస్తాం తింటాం, ఆనందిస్తాం మళ్ళీ మళ్ళీ మీట నొక్కడం , ప్రవర్తన , బహుమానం సులభంగా వుందికదా కొంతకాలం తర్వాతమన బుధ్ధి ఏమంటుందో మీకు తెలుసా? దీన్ని ఆహారాన్ని గుర్తుంచుకోడంతోబాటు మరెన్నో విధాలుగు వాడవచ్చు మీకు తెలుసాఈ సారి మీ మనస్సు బాలేనప్పుడు ఉల్లాసంగా వుండడానికై మీకు నచ్చింది తినడానికి ఎందుకు ప్రయత్నించరు ఈ ఐడియా ఇచ్చినందుకు మన మెదడుకు కృతజ్ఞతలు చెప్పాలి ప్రయత్నించండి. పాటించండి మనస్సు బాగా లేనప్పుడు ఐస్ క్రీం లేదా చాకొలేట్ తింటే మనకు బావుంటుంది అదే పధ్ధతిలో వేరొక సందర్భంలో కడుపులో ఆకలి సూచనలకు బదులు ఒత్తిడితో, విచారంగా వుండడంతో తినాలనే కోరిక పెరుగుతుంది మనం టీనేజి రోజుల్లో స్కూల్లో విసుగు పుట్టినప్పుడు కొందరు మొండి పిల్లలు బయట సిగరెట్ తాగుతుంటే అనుకుంటాం హే నేనూ అలా ఆనందించాలి అని అలా పొగ తాగడం మొదలౌతుంది అది హఠాత్తుగా జరిగిందేం కాదు ప్రశాంతంగా ఆలోచించండి ఆందోళన తగ్గాలంటే పొగ తాగాలి మనసుకు నచ్చుతుంది .మళ్ళీ చేస్తాం మీట నొక్కడం , ప్రవర్తన , బహుమానం మనమిలా చేసిన ప్రతిసారీ మరింత బాగా నేర్చుకుంటాం అలా అలవాటుగా మారుతుంది కొంతకాలానికి సిగరెట్ తాగాలనే కోరిక బలీయమై ఒత్తిడికి గురిఅవుతాము లేదా తీపి వస్తువులు తినడానికై ఇప్పుడు ఇదే రకమైన ఆలోచనలతో నేర్చుకోడం నుంచి వదల్లేని స్థితికి వచ్చాం వాస్తవానికి మనల్ని మనమే చంపుకుంటున్నాం అధిక బరువు , పొగత్రాగడం ప్రపంచంలో వ్యాథులకు, మృత్యువుకూ దారితీసే కారణాల్లో నివారించదగ్గవి ఇవే ఒకసారి గతం లోకి వెళితే మన మెదడుతో పోరాడడం కంటే మనపై మనం శ్రధ్ధ చూపేలా సహజమైన, ప్రోత్సాహ పూరితమైన అభ్యసన ప్రక్రియను అవలంబిద్దాం కొత్తమలుపును చేర్చుదాం మనకి కేవలం ఆసక్తిే వుంటే తాత్కాలిక అనుభవాల సంగతేంటి మీకో ఉదాహరణ తో వివరిస్తాను నా పరిశోధనశాలలో మా శిక్షణ ప్రజల్నిి సిగరెట్ మానిపించడంలో ఉపయోగిస్తుందా అని పరిశోధించాం ఇప్పుడు శ్వాస పై శ్రధ్ధ చూపాలని నేను ప్రయత్నిస్తున్నట్లుగానే వారంతటవారే పొగ తాగడం మానేలా ప్రయత్నించవచ్చు ఇంతకు పూర్వం ఎందరో ఇలా ప్రయత్నించి విఫలులయ్యారు సరాసరి ఆరుసార్లు ఇప్పుడు జాగరూకతతోటి శిక్షణలో బలవంతంగా అనే అంశాన్ని వదిలి , ఆసక్తితో అనే దానిపై దృష్టి పెట్టాం నిజానికి మేం వారిని సిగరెట్ తాగమని చెప్పాం ఆ? అవును సిగరెట్ తాగడానికి సంకోచించకండి అన్నాం తాగుతుంటే మీకెలా వుంటుంది అనే దానిపై దృష్టి పెట్టండి వాళ్ళేం గమనించారో తెలుసా? పొగ తాగే వారిలో ఒకరి ఉదాహరణ ఇక్కడుంది ఆమె చెప్పారు,మనసు" పెట్టి తాగినప్పడు అది పాడైన చీజ్ లా వాసనేస్తోంది దాని రుచి రసాయనాల వలె వుంది యాక్ ఆమెకు ఇప్పుడు తెలిసింది పొగతాగడం తనకు హానికరం అని అందు వల్లే ఆమె మా ప్రోగ్రాం లో చేరారు ఆమె కనుక్కున్నదేంటంటే కేవలం ఆసక్తితో పొగ తాగడం వల్ల ఆ పొగ రుచి అసహ్యంగా వుందని ( నవ్వులు ) ఇప్పుడామె తెలివి నుంచి జ్ఞానంవైపు మరలారు పొగ తాగడం హానికరం అని ఆమె తలస్పర్శిగా తెలుసుకున్నారు ఆమె అంతరాంతరాలలో కూడా కూడా పొగతాగే తడవలు దూరం అయ్యాయి తన ప్రవర్తనలపట్ల అనాసక్తిని పెంచుకున్నారు ఇప్పుడు ప్రి ఫ్రంటల్ కార్ టెక్స్ లో అంటే మానవ పరిణామ దశలో చివరన ఏర్పడిన భాగం పొగ తాగవద్దని మేధా స్థాయిలో అర్థం చేసుకున్నది అది మన ప్రవర్తనను మార్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది పొగమానేయడంలో సహాయపడుతుంది తీపి పదార్థాలను మళ్ళీ మళ్ళీ తినడం ఆపేయడంలో సహాయపడుతుంది ఇదే ప్రవర్తనా నియంత్రణ దీన్నిే మన ప్రవర్తనను అదుపులో వుంచడానికి ఉపయోగిస్తాము దురదృష్టవశాత్తూ మన మెదడు లో మొదటి భాగం కూడా ఒత్తిడికి గురైనప్పుడు పనిచేయకుండా పోతుంది అంత సహాయకారిగా వుండదు ఇప్పుడు ఇవన్నింటినీ మన అనుభవాలకు జోడిస్తే మన సహచరులు, పిల్లలలా మనం కూడా ఎన్నో పనులను చేయడానికి ఇష్టపడుతాం మనం ఒత్తిడికి గురైనా ,అలసినప్పుడు అది మనకు ఉపయోగపడదని తెలిసికూడా అందులోంచి బయటపడలేము మన ప్రి ఫ్రంటల్ కార్టెక్స్ తెరమరుగైనప్పుడు మళ్ళీ పాత అలవాట్ల దారి పడతాం అందువల్లనే అనాసక్తత చాలా ముఖ్యమైనది అలవాట్ల వల్ల ఏం పొందామో చూస్తే మరింత లోతుగా అర్థం చేసుకోవడంలో తోడ్పడుతుంది అది మన అంతరాత్మకు తెలుసు కనుక మనల్ని మనం ఆపడానికి ఎక్కువ శ్రమపడక్కరలేదు ప్రవర్తన నుంచి నిగ్రహించుకోవాలంటే దాన్ని మనం మొదటగా చేయడానికి ఇష్టపడటంలేదు మనస్ఫూర్తిగా అంటే ఇదే ప్రవర్తన అనే చట్రంలో చిక్కుకుంటే నిజంగా మనమేం పొందుతామో తెలుస్తుంది గుండె లోతుల్లోఅనాసక్తిగా మారిపోతాము దాని కారణంగా పోనీలే అనుకుంటాం గారడీలా సిగరెట్ మానేస్తామని దీనిఅర్థం కాదు కాలం గడిచేకొద్దీ మనం స్పష్టంగా చూడడం నేర్చుకుంటాం మనం చేసే పనుల ఫలితాలను పాత అలవాట్లను మానుకొని క్రొత్తవి నేరుస్తాం ఇక్కడ వైరుథ్యమేంటంటే మనసు పెట్టి అంటే నిజంగా ఇష్టపడి ఆత్మీయంగా , దగ్గరగా రావడం మన మనసుల్లో ,శరీరంలో నిజంగా ఏం జరుగుతుందో అనుక్షణం తెలుసుకోవడం ఈ అపేక్ష అనేది మన అనుభవంగా మారుతుంది అప్రియమైన వాంఛలనుంచి వేగంగా దూరంగా వెళ్ళే బదులు ఈ సమ్మతినే మన అనుభవంగా మార్చుకుంటే ఆసక్తి తో సహాయపడుతుంది అది సహజంగా ప్రోత్సాహకరమైనది ఆసక్తిని ఎలా తెలుసుకోగలం అది నచ్చుతుంది మనకు జిజ్ఞాస కలిగితే ఏం అవుతుంది తీవ్రవాంఛలను తెలిపే స్పందనలను గుర్తిస్తాం అక్కడ కఠినత్వం , ఉద్రిక్తత వ్యాకులత వుంటాయి శరీర స్పందనలు పెరుగుతూ, తగ్గుతూ వుంటాయి ఇవి చిన్న చిన్న అనుభవాలు వీటిని ఎప్పటికప్పుడు అదుపులో పెట్టగలం పెద్దగా భయపెట్టే వాంఛలు శరీరాన్ని బంధించితే మనం కలవరపడిపోతాం మరోలా చెప్పాలంటే ఆదుర్దా చెందుతాం పాతవి,భయపెట్టే, ప్రతిస్పందించే అలవాట్ల నుండి బయటపడతాం మనం మరో కొత్తగా అడుగుపెడతాం లోలోపల ఒక శాస్త్రజ్ఞుడిగా మారతాం ఆత్రుతగా ఎదురుచూస్తున్న తరువాతి మలుపు కోసం ఇది మన ప్రవర్తనను ప్రభావితం చేసే అతి సామాన్య అంశంగా అన్పిస్తుండవచ్చు ఒక పరిశోధనలో తేలిందేమిటంటే ఈ mindfullness శిక్షణ ప్రజలు పొగతాగడంమానడంలో తిరుగులేని మంత్రంగా 2 రెట్లు ఎక్కువ ఉపకరిస్తుంది ఇది నిజంగా పని చేస్తుంది ధ్యానంలో వున్నవారి మెదడు పరీక్షించినప్పుడు నాడీకణజాలంలో స్వయంచాలక ప్రక్రియ బయటపడింది ఇదే డిఫాల్ట్ మోడ్ నెట్ వర్క్ అవి పని చేస్తున్నాయి ఇప్పటి అంచనా ప్రకారం ఈ నెట్ వర్క్ లో ఒక ప్రాంతాన్ని పొస్టీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ అంటారు ఇది స్వయంగా వాంఛలను రేకెత్తించడంలేదు కానీ అందులో మనం ఇరుక్కున్నా,అలవాటు పడ్డా మనల్ని తన అధీనం లోకి తీసుకుంటుంది దానికి విరుధ్ధంగా మనం వదిలేస్తే అంటే ఆ ప్రక్రియ నుంచి బయటపడి ఏమౌతుందన్నది ఆసక్తితో తెలుసుకుంటే మెదడులోని ఇదే ప్రాంతం శాంతి స్తుంది ప్రస్తుతం మేం ఆన్ లైన్ లో ఒక ఆప్ ద్వారా mindfulness శిక్షణా కార్యక్రమాలు ఈ core mechanisms లక్ష్యంగా వింత ఏంటంటే మనకు ధ్యానభంగం చేసేసాంకేతికతే అనారోగ్యకర అలవాట్ల నుండి మనం బయట పడడానికి తోడ్పడుతుంది పొగపీల్చడం , ఒత్తిడితో తినడం వంటి వ్యసనాలకు గురైన ప్రవర్తనలను కూడా ఇప్పడు సందర్భాన్నిగుర్తుకు తెచ్చుకోండి మనం ఈ పరికరాలను ప్రజల పై ప్రభావితం చేసే రంగాలలో అందుబాటులోకి తేగలం అలా వారికి మనం సహాయపడగలం వారిలోని అంతర్గత సామర్థ్యాలను వెలికిదీసి ఆసక్తితో తెలుసుకుని సిగరెటే తాగాలని , ఒత్తిడితో తినాలనే లేదా అలాంటి సందర్భాలలో మీరు పొగ తాగకున్నాఒత్తిడితో తినకున్నా బోర్ కొట్టినప్పుడు మీ ఈమెయిల్ చూసుకోవడం లాంటి ప్రేరణలు కలిగినప్పుడు మీకు పని నుండి విరామం కావాలనిపించినప్పుడు కారు నడుపుతున్నప్పుడు మెసేజ్ కు తప్పక జవాబివ్వాల్సి వచ్చినా సహజసామర్థ్యంతోఅడ్డుకట్ట వేయగలరోమో చూడండి కేవలం ఆసక్తితో తెలుసుకోండి మీ శరీరంలో ఏం జరుగుతుందనేది దాన్ని గమనించండి ఇది మరో అవకాశం మాత్రమే నిరంతరమైన అంతులేని మన అలవాట్ల దొంతర అందులోంచి బయటికి రావడానికి text messageను చూసి వెంటనే జవాబిచ్చే బదులు కొంత తేలికగా స్పందిస్తూ ఆ వాంఛను గుర్తించండి ఆసక్తితో తెలుసుకోండి అలా వదిలేయడంలోని ఆనందాన్ని అనుభవించండి మళ్ళీ మళ్లీ అలానే చేయండి కృతజ్ఞతలు ( కరతాళ ధ్వనులు )