10 సంవత్సరాల క్రితం, నేను గ్లోబల్ డెవలప్ మెంట్ అంశం పై
స్వీడన్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు బోధించే పనిని చేపట్టాను. అంతకుముందు నేను
సుమారుగా 20 సంవత్సరాలపాటు ఆఫ్రికన్ సంస్థలతో కలసి ఆఫ్రికాలో ఆకలి అనే అంశం పై అధ్యయన౦ చేశాను,
అందువల్ల నాకు ప్రపంచం గురించి కూడా కొంత అవగాహన కలిగి౦ది.
మా మెడికల్ యూనివర్సిటీ లోని కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్ లో
గ్లోబల్ హెల్త్ అనే ఒక అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ప్రారంభించాను. మీకేదైనా
కొత్త అవకాశం వచ్చినప్పుడు కొద్దిగా నెర్వస్ అనేది కలుగుతుంది.
మా దగ్గరికి చేరే విద్యార్ధులు అంతకుముందే స్వీడిష్ కాలేజీలలో
ఉన్నత శ్రేణి ర్యా౦కులు సాధి౦చిన వారే ఉ౦టారు.-- వారికి నేను చెప్పబోయే అ౦శ౦ గురి౦చి
అ౦తా తెలిసి ఉ౦డవచ్చు. అందుకే వారికి నేనొక ముందస్తు పరీక్షను నిర్వహించాను
అందులోని ప్రశ్నల ద్వారా నేనెంతో నేర్చుకున్నాను, అందులో ఇది ఒకటి:
ఈ ఐదు జంటలలో అత్యధిక శిశుమరణాలు గల దేశం ఏది?
నేను జవాబులలో దేశాలను కొన్ని జంటలుగా ఉంచాను,
ప్రతి జంటలోని ఒక దేశంలో రెండోదేశానికి రెట్టింపు మరణాలుండేటట్లు జవాబులు సెట్ చేశాను. దాని అర్ధం
నేను డేటా అనిశ్చితికన్నా ఎక్కువ తేడా ఉండే విధ౦గా అమర్చాను.
నేను మిమ్మల్ని పరీక్షించబోవట్లేదు, కానీ ఈ జవాబుల్లో అత్యధిక మరణాల రేటు టర్కీలో ఉ౦ది,
మిగతా జవాబుల్లో పోలండ్, రష్యా, పాకిస్థాన్ మరియు దక్షిణ ఆఫ్రికాలున్నాయి.
ఇవీ స్వీడిష్ విధ్యార్థుల యొక్క సమాధానాలు.నేను నన్ను సమాధానపర్చుకొనేంత
విరామం లభించైన తర్వాత,అది కొంత సేపైనా, నాకు సంతోషం కల్గింది,
కాకపోతే: అవకాశమున్న ఐదు సమాధానాలలో 1.8 కరెక్టు. దానర్ధం ఏమిటంటే
అంతర్జాతీయ హెల్త్ ప్రొఫెసరుకు బోధించే అవకాశం ఎంతో ఉందని అర్ధమయింది --
(నవ్వులు) మరియు నా కోర్సుకు కూడా.
కాకపోతే ఒక అర్ధరాత్రి, నేను ఒక నివేదిక తయారుచేసుకునే సమయంలో
నిజంగా నేనో కొత్త విషయాన్ని కనుగొన్నాను. అదేమిట౦టే,
అగ్రగామి స్వీడిష్ విద్యార్ధులకు గణాంకాల పరంగా
ప్రపంచం గురించి చింపాంజీల క౦టే చాలా తక్కువ తెలుసు అని గమని౦చాను.
(నవ్వులు)
ఎందుకంటే నేను చింపాంజీలకు రె౦డు అరటి పళ్ళు ఇచ్చి శ్రీలంక మరియు టర్కీ వ౦టి ఆప్షన్స్ ఇచ్చి ఉ౦టే
అవి కూడా సగం కరెక్టు సమాధానాలు చెప్పుండేవేమో! మా విద్యార్థుల్లాగే వాటి జవాబులు కూడా యాభై శాత౦ కరెక్టే అయ్యేవి.
కానీ విద్యార్ధులు ఆమాత్రం కూడా చెప్పలేకపోయారు. నాకు వారి అజ్ఞానం మాత్రం సమస్యగా అనిపించలేదు
వారిలో ముందు ను౦చే ఉన్న అభిప్రాయాలు ఈ పరిస్థ్రితికి కారణ౦.
నేను కరోలిన్ స్కా ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ల అనైతికతపై ఒక అధ్యయనాన్నికూడా నిర్వహించాను
(నవ్వులు)
- ఈ అధ్యయన౦ పై నేను మెడిసిన్లో నోబెల్ ప్రైజును అ౦దుకోవచ్చు.
అక్కడి ప్రొఫెసర్లు కూడా చింపాంజీలతో సమానంగా విజ్ఞానాన్ని కలిగి ఉన్నారు.
(నవ్వులు)
అప్పుడే నేను కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉందని తెలుసుకోగలిగాను,
ఎందుకంటే ప్రపంచంలో ఏంజరుగుతుందనే సమాచార౦
మరియు ప్రతీ దేశం యొక్క శిశు ఆరోగ్యం అందరికీ బాగా తెలుసుంటుంది.
మీరు ఇక్కడ చూస్తున్నది మేము తయారు చేసిన సొఫ్ట్ వేర్. ఇ౦దులో ఒక్కో బబుల్ ఒకదేశాన్నిసూ చిస్తుంది.
ఇక్కడున్న దేశం చైనా. ఇదేమో ఇండియా.
ఆ దేశ జనాభాను అనుసరించి ఆ బబుల్ సైజుంటుంది, క్రింది అక్షం ఫెర్టిలిటీ రేటును సూచిస్తుంది.
ప్రపంచపటం చూస్తే మీకేమనిపిస్తుందని ప్రశ్ని౦చినప్పుడు
నా విద్యార్థులు ఎలా స్ప౦ది౦చారో తెలుసా?
"మీరు ప్రపంచాన్ని చూస్తే నిజంగా ఏమనుకుంటుంటారు?" అని అడిగాను
అయితే, ముందుగా నేను గమని౦చి౦ది ఏ౦ట౦టే వారిదగ్గరున్న ముఖ్యమైన పుస్తకం, టిన్ టిన్ అని
(నవ్వులు).
"ప్రపంచం అ౦టే ’మేము’ ఇంకా ’వారు’, అని సమాధాన౦ అచ్చి౦ది.
మేము అంటే పాశ్చాత్య దేశాలూ మరియు అవి అంటే మూడో ప్రపంచదేశాలు" అని వారి అర్థ౦.
" సరే పాశ్చాత్య దేశాలంటే మీ దృష్టిలో ఏంటి?" అని నేనడిగాను.
" ధీర్ఘాయువు మరియు చిన్న కుటుంబాలు, మరియు మూడో దేశాలంటే అల్పాయువు, పెద్ద కుటుంబాలు."
అందుకే దీన్ని ఇలా సూపించాను. ఇక్కడ ఫెర్టిలిటీ రేటు: ప్రతీ మహిళకు గల పిల్లలు,
ఒకటి,రెండు,మూడు,నాలగు, ఒక్కక్కరికీ ఎనిమిది మ౦ది వరకూ పిల్లలున్నారు.
1962 నుంచీ మనదగ్గర మంచి డాటా ఉంది- 1960 ను౦చీ అన్ని దేశాల కుటుంబాల పరిమాణ౦ మీద కూడా
ఇ౦దులో తప్పొప్పుల అవకాశం తక్కువ. ఇక్కడపుట్టుక సమయ౦లో ఆయుప్రమాణం వేస్తున్నాను,
కొన్ని దేశాలకు 30 ఏళ్ళు నుంచి మరికొన్నింటికి 70 ఏళ్లు వరకు ఉ౦ది.
1962లో కేవలం కొద్ది దేశాలే ఉన్నాయిక్కడ.
అవి పారిశ్రామికాభివృద్ధి చెందిన దేశాలు, వాటిలో చిన్న కుటుంబాలు, దీర్ఘాయువు ఉంది.
మరియు ఇక్కడున్నవి అభివృద్ధిచెందుతున్న దేశాలు:
వాటిలో పెద్ద కుటుంబాలు మరియు పోలిస్తే వారి ఆయుష్షు కూడా తక్కువ.
1962 నుంచి ఏంజరిగింది ? మనం ఇప్పుడు జరిగిన మార్పులు చూద్దా౦.
ఆ విద్యార్ధులు చెప్పింది కరెక్టేనా? ఇంకా రెండురకాల దేశాలున్నాయా?
లేదా ఈ వర్ధమాన దేశాలలో కూడా చిన్నకుటుంబాలు ఉంటున్నాయా?
వారి ఆయిష్షు కూడా పెరిగి ఎక్కువకాల౦ జీవిస్తున్నారా?
మనం ప్రపంచాన్ని అప్పటితో ఆపేశాం. ఇవి ఐరాస గణాంకాలు
మనం ఇలా వెళ్దాం. మీరు గమనిస్తున్నారా?
ఇది చైనా దేశం, మంచి ఆరోగ్యం వైపు పోతోంది, మెరుగవుతోంది.
అన్ని హరితవర్ణపు లాటిన్ అమెరికా దేశాలు చిన్న కుటుంబాల వైపుకు వెళ్తున్నాయి.
ఇక్కడ కనిపిస్తున్న పసుపు వర్ణపు దేశాలు అరబ్ దేశాలు,
వాటిలో ఇ౦కా పెద్ద కుటుంబాలున్నాయా?, లేదు, వారిలో ఆయుష్షు పెరిగి౦ది, కానీ పెద్ద కుటుంబాలు తగ్గాయి
ఈ ఆకుపచ్చవి ఆఫ్రికన్ దేశాలు క్రింద ఉన్నాయి. అవి ఇంకా అలాగే ఉన్నాయి.
ఇది భారతదేశం. ఇది ఇండోనేషియా, చాలా వేగంగా కదులుతోంది,
(నవ్వులు)
ఇక్కడ 80వ దశకంలోని బంగ్లాదేశ్, ఇంకా ఆఫ్రికన్ దేశాలలాగానే ఉంది.
కానీ ఇప్పుడు, బంగ్లాదేశ్ చూడండి-- 80 లలో అక్కడ చమత్కారం జరిగింది:
ఇమాంలు కూడా కుటుంబనియంత్రణను ప్రోత్సహించారు.
అలావారు కొ౦త ము౦దుకు వెళ్ళిపోయారు. 90 దశకంలో, భయంకరమైన హెచ్ ఐవీ ఉపద్రవం వచ్చింది
అది ఆఫ్రికా దేశాల ఆయుప్రమాణాన్ని అల్పస్థాయికి తీసుకువెళ్ళింది.
ఇతర దేశాలన్నీ పైకి వెళ్లి ఆమూలకు చెరుకుంటున్నాయి,
అక్కడ మనకు ధీర్ఘాయువు మరియు చిన్నకుటుంబాలు కనిపిస్తున్నాయి, ఒక కొత్త ప్రపంచం పూర్తిగా.
(చప్పట్లు).
మనం అమెరికా మరియు వియత్నాం దేశాలను నేరుగా పోల్చి చూద్దాం.
1964:అమెరికా చిన్న కుటుంబాలు ధీర్ఘాయువు కలిగి ఉంది;
వియత్నాం మాత్రం పెద్ద కుటుంబాలు మరియు అల్పాయువు, మరియు ఏంజరిగిందో చూద్దాం:
యుద్ద సమయంలోని అన్ని మరణాల తర్వాత కూడా డాటా ఏ౦ చెబుతు౦ద౦టే
ప్రజల ఆయుప్రమాణంలో మెరుగుదల కనిపిస్తోంది. ఆ ఏడాది ముగిసే సరికి,
వియత్నాంలో కుటుంబనియంత్రణ మొదలైంది వారు చిన్న కుటుంబాలకు వెళ్ళిపోయారు.
మరియు అమెరికా ధీర్ఘాయువు వైపుకు పైకి వెళ్లింది,
కుటుంబ సైజును అలాగే ఉంచుకుంటూ. మరియు ఇది 80 వ దశకం,
వాళ్ళు కమ్యూనిస్ట్ విధానాన్ని వీడి, మార్కెట్ ఎకానమీకి మరలిపోయారు,
అది సామాజిక జీవనం కన్నా వేగంగా కదులుతోంది. మరి ప్రస్తుతం, మనకు
వియత్నాంలో అదే ఆయు ప్రమాణం మరియు అదే కుటుంబ సైజు
1974, యుద్ధం ముగిసే సమయానికి. వియత్నాం, అమెరికాలో 2003లో ఉన్న విధ౦గా మారిపోయి౦ది.
నా ఉద్దేశంలో మనమంతా-- డాటాను చూడకపోతే --
ఆసియాలో జరిగిన మహత్తరమైన మార్పును తక్కువగా అంచనావేస్తాం, అ౦దుకే
ఆర్ధిక మార్పుకంటే ముందు మనం సామాజిక మార్పును చూడాలి.
మనం ఇప్పుడు చూపించిన విధంగా కాక మరోవిధంగా చూద్దాం
ప్రపంచంలో ఆదాయం విస్తరణ ఎలాఉందో. ఇది ప్రపంచంలో ఆదాయ విస్తరణ.
ఒక రోజుకు ఒక డాలర్, పది డాలర్లు లేదా వంద డాలర్లు.
పేదా మరియు ధనవంతుల మధ్య ఏమాత్రం తారతమ్యతలేదు. ఇదికేవలం మిథ్య మాత్రమే!
అక్కడ కొద్దిగా ఉబ్బుగా ఉంది. కానీ అక్కడకూడా ప్రజలున్నారు.
మరి మనం ఇప్పుడు ఆదాయం ఎక్కడ ముగుస్తుందో చూద్దాం - ఈ ఆదాయం-
ఇది ప్రపంచం యొక్క వంద శాతం ఆదాయం వార్షికంగా. మరి ఇందులో ధనవంతులైన 20శాతం మంది,
74శాతం ఆదాయాన్ని తీసుకోగా. బీదలుగా ఉన్నా 20 శాతం మంది,
రెండు శాతం సంపాదించుకోగలుగుతారు. ఈ అంశం ఇలా వర్ధమాన దేశాలలో
అనుమానం గా కనిపిస్తోంది. మనం సహాయం గురి౦చి ఆలోచిస్తే,
ఇక్కడ ఉన్న ప్రజలు, ఈ ప్రజలకు సహాయాన్ని అందిస్తారనుకంటాం. కానీ మధ్యలో,
మనకు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉంది, కానీ వారికి ప్రపంచ ఆదాయంలో 24 శాతం వాటానే అ౦దుతో౦ది.
మనం దీన్ని ఇంకోలా విన్నాం. మరి వీళ్లెవరు?
విభిన్న దేశాలెక్కడున్నాయి? నేను ఆఫికా చూపిస్తాను.
ఇది ఆఫ్రికా. ప్రపంచంలో 10 శాతం జనాభా ఇక్కడ ఉ౦ది. దారిద్ర్యం కూడా ఎక్కువే!
ఇది OECD.ధనిక దేశం. ఐరాస యొక్క కంట్రీక్లబ్.
మరి వాళ్ళంతా ఇక్కడ ఈ భాగ౦లో ఉన్నారు. ఆఫ్రికా మరియు OECD ఒకదానిపైన ఒకటి ఉన్నాయి.
ఇది లాటిన్ అమెరికా. వారిదగ్గర భూమిపై ఉన్న అన్ని వనరులు ఉన్నాయి.
పేదల నుంచి కోటీశ్వరుల వరకూ, లాటిన్ అమెరికాలో ఉన్నారు.
దానిపైన, మనం తూర్పు ఐరోపా, తూర్పు ఆసియా, దక్షిణాసియా దేశాలను పెట్టవచ్చు,
మనం ఇప్పుడు కాలం వెనక్కి వెళ్లి ఏం జరుగుతుందో చూద్దాం,
దాదాపు 70వ దశక౦లోకి? అప్పుడు ఈ మోపురం చాలా పెద్దగా ఉంది.
అప్పుడు కటిక దారిద్ర్యంలో బతికిన వారిలో ఎక్కువ ఆసియా వాసులే.
అప్పుడు ప్రపంచం సమస్య ఆసియాలోని దారిద్ర్యమే! ఇప్పుడు నేను ప్రపంచాన్ని ముందుకు పోనిస్తాను,
జనాభా పెరుగుతున్నకొద్దీ
వందలాది మిలియన్ల ఆసియన్లు దారిద్ర్యంనుంచి బయట పడుతున్నారు, కానీ అదే సమయ౦లో కొంతమంది
ఇంకా దారిద్ర్యంలోకి వెళ్తున్నారు, మనం ఈరోజు చూస్తున్న తీరు ఇదే.
ప్రపంచబ్యాంకు వారి విశ్వసనీయమైన అ౦చనాల ప్రకారం
రెండుప్రపంచాల మధ్య ఉన్న తేడా పూర్తిగా చెరిగి పోను౦ది.చాలా మ౦ది ప్రజలు ఈ రె౦చు ప్రప౦చాల మధ్య ఉంటారు.
అఫ్ కోర్స్ ఇక్కడ ఉన్నది లాగరిథమ్ స్కేల్ అనుకోండి,
కానీ మన ఆర్ధికాభివృద్ధి కాన్సెప్ట్ శాతాలలో ఉంటుంది. మనం దాన్ని
పర్స౦టైల్ పెరుగుదల ప్రాతిపదికన పరిశీలిద్దా౦. నేను దీన్ని మార్చి,
కుటుంబ ఆదాయానికి బదులు తలసరి జీడీపీ తీసుకుని, మరియు దీన్ని తిప్పి
వ్యక్తిగత డాటాను ప్రాంతీయ జీడీపీగా మార్చి,
ఈ ప్రాంతాలను ఇలా క్రిందికి తీసుకెళ్తా, అప్పుడు కూడా బబుల్ సైజు ఇంకా జనాభాను సూచిస్తుంది.
అప్పుడు కూడా OECD అక్కడుంటే, సబ్- సహారా ఆఫ్రికా ఇక్కడుంటు౦ది.
మరి ఇక్కణ్నుంచి అరబ్ దేశాల్ని తీసేద్దా౦,
ఆఫ్రికా మరియు ఆసియా నుంచి వచ్చిన వాటిని తీసి, వాటిని విడిగా పెడ్దాం,
మరి ఈ అక్షాన్ని మరింతగా పెంచి, నేను దీనికి ఇక్కడో కొత్త డైమెన్షన్ ఇవ్వడానికి
శిశు మరణాల వ౦టి సామాజికాంశాలను కలిపాను.
ఇప్పుడు ఈ అక్షం మీద ఆదాయం, మరియు మరో అక్ష౦ మీద జీవి౦చి ఉ౦డే అవకాశ౦ ఉన్న శిశువుల స౦ఖ్యను ఉ౦చాను.
కొన్ని దేశాలలో, 99.7 శాతం మంది పిల్లలు ఐదు సంవత్సరాల వయసువరకు జీవి౦చి ఉంటారు;
ఇతర దేశాలలో, అది 70 శాతం మాత్రమే. మరియు ఇక్కడ మాత్రం అంతరం కనిపిస్తోంది
OECD,లాటిన్ అమెరికా,తూర్పు యూరప్, తూర్పు ఆసియా,
అరబ్ రాష్ట్రాలు, దక్షిణాసియా మరియు సబ్-సహారా ఆఫ్రికా పిల్లల ఆయుష్షు విషయ౦లో అ౦తర౦ చాలా ఉ౦ది.
శిశువుల మరణాలకు మరియు ఆదాయానికి చాలా దగ్గరి సంబంధం కనిపిస్తోంది.
కానీ నన్ను సబ్-సహారా ఆఫ్రికాను విడదీసి చూస్తే, అక్కడ ఆరోగ్యం ఉ౦ది మరియు మరింత మెరుగైన ఆరోగ్య వసతులు అక్కడున్నాయి
నేను అక్కడికి వెళ్లి సబ్ సహారా ఆఫ్రికా దేశాలను వేర్వేరు దేశాలుగా విభజిస్తాను.
ఇక్కడున్న బబుల్ పగిలిపోతే, ఆ చిన్న బబుల్స్ ఆ దేశం యొక్క ఆదేశ జనాభాను సూచిస్తాయి.
అక్కడ క్రింద సియరాలియోన్ ఉంది. మారిషస్ అదిగో అక్కడ పైన ఉంది. మారిషస్
వాణిజ్య అంక్షలను ఎత్తివేసిన మొదటి దేశం, అందుకే వారు వాళ్ల చక్కెర అమ్ముకోగలిగారు.
వాళ్లు టెక్స్ టైల్స్ ను, ఐరోపా మరియు ఉత్తర అమెరికా దేశాలతో సమానమైన షరతులతో అమ్మగలిగారు.
ఆఫ్రికాలో చాలా పెద్ద అంతరాలు కనిపిస్తున్నాయి. మరియు ఘనా ఇక్కడ మధ్యలో ఉంది.
ఇది సియరా లియోన్, వీరికి మానవత్వపు సాయ౦ అ౦దుతో౦ది.
ఇక్కడ ఉగాండా ఉ౦ది, వీరికి అభివృద్ధి సహాయం అ౦దుతో౦ది.. ఇక్కడ మీరు పెట్టుబడులు పెట్టవచ్చు.
మీరు హాలీడేస్ కు వెళ్ళవచ్చు. ఆఫ్రికాలో మనకు చాలా పెద్ద ఎత్తున తేడా కనిపిస్తుంది
కానీ అక్కడ కూడా చాల విషయాల్లో సమానత్వం కనిపిస్తుంది. దీనిని మన౦ అరుదుగా గమనిస్తా౦.
నేను ఇక్కడ దక్షిణాసియాను విడదీస్తాను. ఈ మధ్యలో ఉన్న పెద్ద బబుల్ భారతదేశం.
కానీ ఆఫ్ఘనిస్తాన్ మరియు శ్రీలంకల మధ్య చాలా పెద్ద అంతరం కనిపిస్తోంది.
నేను ఇప్పుడు అరబ్ రాష్ట్రాలను విడదీస్తాను. అవి ఎలాఉన్నాయి? ఒకే వాతావరణం, ఒకే సంస్కృతి,
ఒకే మతం. పొరుగుదేశాల మధ్యలోకూడా పెద్ద అంతరం.
యెమెన్లో అంతర్యుద్ధం ఉ౦ది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో డబ్బును సమానంగా వ్యయంచేశారు.
ఇది నిజ౦గా నిజ౦. ఆ దేశంలో పనిచేస్తున్న ఇతరదేశాల కార్మికుల పిల్లలను కూడా వారు సమాన౦గానే చూశారు.
మనం అనుకునే దానికంటే గణాంకాలు చాలా మెరుగైనవి. చాలా మంది గణాంకాలు దండగ అనుకుంటారు.
అక్కడ కొంత అసందిగ్దతకు తావుండొచ్చు, కానీ మనం ఆ అంతరాన్ని ఇక్కడ గమనించవచ్చు:
కాంబోడియా, సింగపూర్. వీటి మధ్య తేడా చాలా చాలా ఎక్కువగా కనిపిస్తుంది
గణాంకాల యొక్క లోపాలను మించి తేడా ఉంది. తూర్పు యూరప్:
చాలా కాలం సోవియట్ యూనియన్ లాగా ఉంది, కానీ పది సంవత్సరాల తర్వాత
చాలా మారి౦ది. లాటిన్ అమెరికా కూడా.
ఈరోజు, లాటిన్ అమెరికాలో ఆరోగ్యకరమైన దేశంకోసం చూడడానికి క్యూబాకే వెళ్లనక్కరలేదు.
రాబోయే కొన్ని సంవత్సరాలలో చిలీలో క్యూబాకన్నా తక్కువ శిశుమరణాల రేటు నమోదవబోతోంది.
మనకు ఇక్కడ అత్యధికాదాయం గల OECD దేశాలున్నాయి.
మరియు ఇక్కడ ప్రపంచం యొక్క మొత్తం ధోరణి తెలుసుకోగలం,
అది దాదాపు ఇలా ఉండవచ్చు. మరి మనం దానివంక చూస్తే,
ఇలా కనిపిస్తుంది -- ప్రపంచం, 1960లో, అది కదలడ౦ మొదలుపెట్టింది.1960.
అదిగో మావోసేటుంగ్. చైనాకు ఆయన ఆరోగ్యం తెచ్చారు. తర్వాత ఆయన చనిపోయారు.
తర్వాత డెంగ్ జియోపింగ్ వచ్చారు చైనాకు డబ్బునుతెచ్చారు, వాళ్లను మళ్లీ ప్రధాన స్రవ౦తిలోకి తీసుకొచ్చారు.
ఇప్పుడు మనం వివిధ దేశాలు వేర్వేరు దిశల్లో ఎలా వెళ్తున్నాయో చూశా౦,
అందుకే కొద్దిగా కష్టమైన పనే
ప్రపంచపు ధోరణికి ఉదాహరణగా నిలిచే దేశాన్ని కనిపెట్టడం.
నేను మిమ్మల్ని తిరిగి 1960 ప్రాంతానికి తీసుకెళ్లాలనుకుంటున్నాను.
నేను ఇక్కడున్న దక్షిణ కొరియాను, ఇదిగో బ్రెజిల్ తో పోల్చాలనుకుంటున్నాను,
ఇదిగో ఇది. దీని లేబుల్ నానుంచి వెళ్లిపోయింది. మరియు నేను ఉగాండాతో పోల్చాలనుకుంటున్నా,
అక్కడుంది. నేను దాన్ని ముందుకు పరిగెత్తిస్తా, ఇలా.
మీరు గమనించవచ్చు దక్షిణ కొరియా ఎలా చాలా చాలా వేగంగా పురోగమిస్తుందో,
కానీ బ్రెజిల్ చాలా నెమ్మదిగా పురోగమిస్తున్నది.
మనం తిరిగి వెనక్కి వెళ్దాం. ఇప్పుడు మనం వాటిపైన ట్రయల్స్ వేద్దా౦, ఇలా,
మీరు మళ్ళీ అభివృద్ధి వేగాన్ని గమనించవచ్చు
అది చాలా చాలా భిన్నంగా ఉ౦టు౦ది, కానీ దేశాలన్నీ దాదాపు ఒకేవిధంగా ఒకే రేటులో కదులుతున్నాయి
డబ్బు మరియు ఆరోగ్యం అంశాలలో మాత్రం, కానీ మరింత వేగంగా కదలవచ్చు అనిపిస్తోంది
ఒకవేళ డబ్బు కన్నా ఆరోగ్యం విషయంలో ముందుగా ఉంటే
అది చూపించడానికి, మీరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను గమనించండి.
వాళ్లు ఇక్కణ్నుంచి వచ్చారు, ఒక ఖనిజాల దేశం. వాళ్లు ఆయిల్ మొత్తం వెలికితీశారు,
డబ్బు చాలా సంపాదించారు, కానీ ఆరోగ్యాన్ని సూపర్ మార్కెట్లో కొనలేరుగా.
మీరు ఆరోగ్యానికి పెట్టుబడి పెట్టాలి. మీరు పిల్లల్ని స్కూళ్లకు పంపించాలి.
మీరు ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. మీరు దేశ జనాభాను విద్యావంతుల్ని చేయాలి.
ఈ పనిని షేక్ సయీద్ చాలా బాగానే చేశాడు.
అందుకే ఆయిల్ ధరలు పతనమవుతున్నాగానీ, ఆయన ఈ దేశాన్ని ఈ స్థితికి తేగలిగాడు.
అందుకే మనం దాదాపు ప్రపంచం యొక్క ప్రధాన రూపాన్ని చూడగలుగుతున్నాము,
ఎక్కడైతే దేశాలన్నీ వారి ధనాన్ని ఉపయోగించగలుగుతున్నాయో
గతంలో ఖర్చుచేసినదానికన్నా ఇప్పుడు మెరుగ్గా ఖర్చు పెడుతున్నాయి.
దేశాలయొక్క సగటు గణాంకాలను పరిశీలించినప్పుడు, అవి ఇలా కనిపిస్తున్నాయి.
సగటు గణాంకాల్ని ఉపయోగించుకోవడం చాలా ప్రమాదకరమైనది, ఎందుకంటే అక్కడ
దేశాల్లోని ప్రా౦తాల మధ్య చాలా తారతమ్యాలు ఉన్నాయి.అందుకే మీరు అక్కడికి వెళ్లి చూసినట్లయితే, మీకు
ఇప్పుడు ఉగాండా 1960లో దక్షిణకొరియా ఉన్న స్థితిలో ఉంది. నేను ఉగాండాను విడదీసిచూసినట్లయితే,
దాని లోపల కూడా తారతమ్యాలున్నాయి. ఇవి ఉగాండాలోని విభజనలు.
ధనవంతులైన ఇరవైశాతం ఉగాండన్లు ఇక్కడ ఉన్నారు.
బీదవాళ్ళు ఇదిగో ఇక్కడ క్రింద ఉన్నారు. అదేవిధంగా, దక్షిణాఫ్రికాను చేస్తే, అది ఇలా ఉంది.
నేను గనుక క్రిందికి వెళ్లి నైగర్ ను చూస్తే, ఎక్కడైతే తీవ్రమైన క్షామం పరిస్థితులున్నాయో,
చివరిగా, అది ఇలా ఉంది. ఇరవై శాతం ఉన్న నైగర్లు ఇక్కద ఉన్నారు,
మరియు దక్షిణాఫ్రికాలోని ఇరవైశాతం ధనికులు ఇక్కడున్నారు,
మరి అందుకే ఆఫ్రికాలో సమస్యల పరిష్కారానికి ఏం చర్యలుకావాలో అని అనుకుంటుంటాం.
ప్రపంచంలో ఉన్నవన్నీ ఆఫ్రికాలోనూ ఉన్నాయి. కానీ మీరు అందరికీ
హెచ్ఐవీ (మందులు) అందుబాటులో ఉండడం గురించి ఆలోచించలేరు, ఈ భాగంలో వారికి
ఇక్కడ క్రింది వారికి అమలుపర్చిన అదే స్ట్రాటజీని అమలుచేయలేం. ప్రపంచాన్ని అభివృద్ది చేయడానికి
పథకాల రూపకల్పన ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది, వాటిని మనం ఇక్కడ ప్రాంతీయస్థాయి
అధారంగా చేయలేము. మనం మరింత బాగా లోతులకు వెళ్లి అధ్యయనం చేయాలి.
విద్యార్ధులకు దీనిని ఉపయోగించుకునే అవకాశముంటే వారికి చాలా ఆసక్తికలుగుతుంది.
ఇంకా విధాన నిర్ణేతలు మరియు కార్పోరేట్ సెక్టార్ కూడా
ప్రపంచం ఎలా మారుతోందో చూడ్డానికి ఆసక్తి చూపుతారు.మరి ఇప్పుడు అదెందుకు జరగడం లేదు?
మన దగ్గరున్న గణాంకాలను ఎందుకు ఉపయోగించుకోవట్లేదు మనం? మనదగ్గర ఐరాస గణాంకాలున్నాయి,
జాతీయ గణాంకాల ఆయా దేశాల సంస్థలదగ్గరున్నాయి
యూనివర్సిటీల దగ్గర, ఇతర ప్రభుత్వేతర సంస్థల వద్దా ఈ గణాంకాలున్నాయి.
ఈ గణాంకాలన్నీ డేటాబ్యాంకుల్లో భద్రంగా దాచిపెట్టబడి ఉన్నాయి.
కానీ ప్రజలిక్కడున్నారు, ఇంటర్ నెట్ ఉంది, కానీ మన౦ వాటిని సమర్ధవంతంగా ఉపయోగించుకోలేకపోతున్నాం.
మనం చూసిన మారుతున్న ప్రపంచపు సమాచారంలో
ప్రభుత్వ౦ సేకరి౦చిన గణాంకాలు ఇ౦దులోకలపలేదు. అక్కడ కొన్ని ఇలాంటి వెబ్ పేజీలున్నాయి.
ఈ పేజీలలో కొన్ని మాత్రం డాటాబేస్ లనుంచి అవసరమైన సమాచార౦ తీసుకొంటుంటాయి,
కానీ కొ౦దరు ప్రబుద్ధులు మాత్రం వీటికి రేట్లు కడతారు, మూర్ఖపు పాస్ వర్డులను పెట్టి బోరింగ్ గణాంకాలను చేస్తారు.
(పెద్దగా నవ్వులు). (చప్పట్లు).
ఇది ఏ మాత్రం పనిచేయదు. కాబట్టి మనకేం కావాలి? మనదగ్గర డాటాబేసులున్నాయి.
మనకుకొత్తగా డేటాబేసులు అవసరం లేదు. మనదగ్గర అద్భుతమైన టూల్స్ ఉన్నాయి,
మరియు మరికొన్ని ఇలా జతచేరుతున్నాయి. అందుకే మేం ఆరంభించాం
ఒక లాభాపేక్షలేని కార్యక్రమాన్ని. మేం దీన్ని- డేటాను డిజైన్ తో సంధానిస్తున్నాం --
మేం దీన్ని గ్యాప్ మైండర్ అని పిలుస్తున్నాం, లండన్ అండర్ గ్రౌండ్ లో వెళ్లేప్పుడు, మిమ్మల్ని
" మైండ్ ద గ్యాప్ (స్థలం వదలండి)" అంటుంటారు, అలాగే దీనికి గ్యాప్ మైండర్ సరైనదని మా భావన.
ఇలా డేటాను అనుసంధానించే సాఫ్ట్ వేర్ రాయడం మొదలుపెట్టాము.
మరియు అదేమంత కష్టమైన పనికాదు. దానికి కొన్ని సంవత్సరాలు పట్టింది, అలాగే మేము కొన్ని యానిమేషన్స్ రూపొందించాం
మీరు ఒక డేటా సెట్ ను తీసుకొని ఇలా పెట్టండి.
మేము ఐరాస డేటాకు స్వాతంత్ర్యం కల్పిస్తున్నాం, అలాగే కొన్ని ఐరాస సంస్థలకు కూడా.
కొన్ని దేశాలు వారి డేటాబేస్ లను ప్రపంచం వినియోగించుకొనేందుకు అనుమతిస్తున్నాయి,
కానీ మనకు కావాల్సినదేమిటంటే, అఫ్ కోర్స్ ఒక సెర్చ్ ఫంక్షన్.
ఆ సెర్చ్ ఫంక్షన్ ద్వారా ఈ డేటాను సెర్చబుల్ ఫార్మాట్లోకి కాపీ చేయవచ్చు
మనం ప్రపంచం లోకి వెళ్లామనుకోండి. మనం ఏం వింటాం?
నేను ప్రధాన గణాంకాల యూనిట్లపై ఆంత్రోపాలజీ అధ్యయన౦ చేశానని అందరూ అంటారు,
"అది సాధ్యంకాదు. అలా చేయలేము. మన సమాచారం ఎంత ప్రత్యేకమైనదంటే
అది చాల లోతైనది, అందుకే ఇతర విషయాలను వెతికినట్లుగా మన్౦ దాన్ని వెతకలేము.
అందుకే సమాచారాన్ని విద్యార్ధులకు స్వేచ్చగా అందివ్వలేము, అలాగే ప్రపంచ౦లోని వ్యాపారవేత్తలకు కూడా."
ఇలా౦టి స్వేచ్ఛా సమాచార స్రవ౦తి కోసమే మన ప్రయత్న౦.
ప్రజల డబ్బుతో తయారైన గణాంకాలేమో ఇలా క్రింద ఉన్నాయి.
కానీ మనం నెట్ లో మాత్రం ఇలాంటి పూలు పూయాలనుకుంటాం.
మనం చేయాల్సింది వాటిని వెతికితే దొరికే రూపంలోకి మార్చి, ప్రజలు ఉపయోగించుకునేలా చేయడం
వాటిని వివిధ డిజైన్ టూల్స్ తో యానిమేట్ అలా చేయడం.
ఈ స౦దర్భ౦గా మీకో శుభవార్త. నా దగ్గరున్న ఆ శుభవార్త ఏమిటంటే, ఇప్పటి
ఐరాస గణాంకాల అధిపతి, అది అసాధ్యం అనడం లేదు.
అతను కేవలం " మా వల్ల కాదు" అని మాత్రమే అంటున్నారు.
(నవ్వులు).
ఆయన చాలా తెలివైన వ్యక్తికదా?
(నవ్వులు).
అందుకే రాబోయే రోజుల్లో గణాంకాల్లో ఎన్నో వింతలు చూడనున్నాం
మనం ఆదాయ విస్తరణ వివరాల్ని కొత్త విధాల్లో చూడబోతాం.
1970 లో ఇది చైనాలో ఆదాయం విస్తరణ ఇది.
1970 లో ఇది అమెరికాలో ఆదాయం విస్తరణ ఇది.
అసలు ఒకదాన్ని ఒకటి కవర్ చేయడమేలేదు, అసలే లేదు. మరి ఏం జరిగింది?
ఇందులో అసలు ఏం జరిగింది: ఆ చైనా ఆదాయం పెరుగుతోంది, ఆ రెండూ ఎంతమాత్రం సమానంకాదు,
మరి ఇక్కడ కనిపిస్తున్న చైనా ఆదాయ౦ , అమెరికాను దాటిపోయి౦ది.
దాదాపు దెయ్యం లాగా, కదూ, ఆ?
(నవ్వులు).
అది చాలా భయంకరంగా ఉంది.కానీ ఇలాంటి సమాచారం ఉండడం చాలా ముఖ్యమని నేననుకుంటున్నాను.
మనం నిజంగా వాటిని చూడాలి. చూసి ఊరుకోకుండా,
నేను ప్రతీ వేయిమందికీ ఇంటర్ నెట్ యూజర్స్ గురించి చెప్పి ముగిస్తాను.
ఈ సాఫ్ట్ వేర్ లో, మనం వివిధ దేశాలనుంచీ చాలా సులభంగా 500 వేరియబుల్స్ ఎంపికచేసుకోవచ్చు.
దీనికి మారేందుకు చాలా సమయం పడుతుంది,
కానీ ఆ యాక్సిస్ లపైన, మీరు కోరుకున్న వేరియబుల్స్ చాలా సులభంగా ఎంపికచేసుకోవచ్చు.
కానీ విషయమేమిటంటే మనం డేటాబేస్ లను ఉచితంగా పొందవచ్చు.
వాటిని సెర్చబుల్ చేయవచ్చు, రెండుక్లిక్ లలో , వాటిని పొందవచ్చు,
గ్రాఫిక్ ఫార్మాట్లలోకి మార్చి వీటిని మీరు సులభంగా అర్ధం చేసుకోవచ్చు.
అయితే, గణాంకనిపుణులకు అది ఇష్టం లేదు, వారి ఉద్దేశం ప్రకారం ఇవి
నిజాన్ని చూపించవు; మనకు గణాంకాల, విశ్లేషణాత్మక పద్ధతులు కావాలి.
కానీ ఇది ఊహాత్మకంగా రూపొందించింది.
నేను ఇప్పుడు ప్రపంచం తో ముగిస్తాను. అక్కడ, ఇంటర్ నెట్ వస్తోంది.
ఇంటర్ నెట్ వినియోగదారుల సంఖ్య ఇలా పోతోంది. ఇది తలసరి జీడీపీ.
మరియు ఇప్పుడు నవీన టెక్నాలజీ వస్తోంది, కానీ ఆశ్చర్యకరంగా, ఎంత బాగా
దేశాల యొక్క ఆర్ధిక పరిస్థితులకు సరిపోతుంది. అందుకే వంద డాలర్ల
కంప్యూటర్ చాలా ముఖ్యమైనది. కానీ అది కొత్త టెండెన్సీ.
అది చూస్తే ప్రపంచం సమానంగా మారుతున్నట్లు లేదూ? ఈ దేశాలు
వారి ఆర్ధిక పెరుగుదలకంటే ఎక్కువ ఎదుగుతున్నాయి మరియు రాబోయే సంవత్సరాలలో వాటిని
గమనించడం ఇంకా ఆసక్తికరం, కానీ నేను పబ్లిక్ ఫండెడ్ డాటాతో మీరు
అలా చూడగలగాలన్నదే నా ఆశ. మీ అందరికీ కృతజ్ఞతలు.
చప్పట్లు