ఇప్పుడు if స్టేట్మెంట్లు నేర్చుకోబోతున్నాం ప్రోగ్రామును నేర్చుకోడానికి if ప్రకటనలు ముఖ్యభాగం. కంప్యూటర్ నిర్ణయం తీసుకోడానికి అవి సాయపడతాయి. అన్ని కంప్యూటర్లూ నా ఫోన్ తో సహా వాటిని వాడతాయి. ఉదా.ఫోన్ అన్‌లాక్ చేస్తే అదొక కోడ్ రన్ చేసి, పాస్‌వర్డ్ ని సరిగా ఎంటర్ చేస్తే ఫోన్ అన్‌లాక్ అవుతుంది. లేదంటే ఎరర్ మెసేజ్ చూపిస్తుందని చెబుతుంది. ప్రపంచంలో వాళ్ళేం చూశారో Steve ఇంకా Alice చెప్పడానికి మీరు మీ కోడ్ లో if వాడొచ్చు. ఉదా. వాళ్ళముందు ఒక రాయి ఉంటే, వాళ్ళు ఎడమకు తిరగొచ్చు. లేదా వాళ్ళొక చెట్టు వద్దకు చేరితే కుడికి తిరగొచ్చు. ఈ విషయంలో మేము లావాలో పడాలనుకోవడం లేదు. లావా కోసం ప్లాన్ చేయడం సులభం. మనం దాన్ని స్క్రీన్ మీద చూడొచ్చు. ఐతే మనం రాయి కింద ఉంచలేని లావా సంగతేమిటి? మనం రాయిని తీసిన తర్వాత ముందుకెళ్ళే ముందు అక్కడ ఇంతకు ముందు లావా ఉందా అని చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ లావా ఉంటే, మనం ముందుకెళ్ళే ముందు మన పాత్ర ముందర ఒక రాయి ఉంచాలనుకుంటున్నాం. ఆ విధంగా మనం క్షేమంగా ముందుకెళ్ళచ్చు. మరింత తవ్వడానికిదే సమయం! మీ అడుగును చూడ్డానికి if స్టేట్మెంట్ గుర్తుంచుకోండి.