ప్రెస్టన్: నేను గొప్ప చెప్పాలనుకోవట్లేదు
ఐతే నేను పార్కూర్ లో చాలా బాగుంటాను.
లిజ్జీ: ఇక పడుకుందాం, స్టేసీ తిరిగొస్తే
మరి పగలంతా ఉండాల్సొస్తుంది.
స్టేసీ: సరే గైస్ నేను Minecraft ఆఫీసుల
నుండి వచ్చేశా, నా గేములో ఉన్న సమస్య ఎలా
సరిచేయాలో నాకు తెలుసనుకుంటున్నా.
నేనొక ఫంక్షన్ వాడొచ్చనుకుంటున్నా.
ముందు దీన్ని ఓపెన్ చెయ్యనివ్వండి.
ఫంక్షన్ అనేది సూచనల నిర్దిష్ట కూర్పుగా
ఉంటుంది, ఒక వంట వంటి నిర్దిష్ట పని పూర్తి
చేయడానికి.
తర్వాతి కొద్ది స్థాయిల్లో, పజిల్స్ సాధనకు
మీరు వాడగల ఫంక్షన్లకు అందుబాటు
మీకు ఉంటుంది.
వర్క్ స్పేస్ లో కోడ్ ఉన్నప్పుడు అది ఏమి
చేస్తుందో చూడ్డానికి ఫంక్షన్ చూడండి
ఇక టూల్ బాక్స్ లో దానిపేరుతో ఉన్న బ్లాక్
చూసి, దాన్ని టూల్ బాక్స్ నుండి "వెన్ రన్"
బ్లాక్ లోనికి లాగిపడేయండి.