హౌర్ అఫ్ కోడ్ | డాన్స్ పార్టీ: వార్మ్ అప్ నమస్తే, నా పేరు మిరాల్ కాట్బి. నా వృత్తి నృత్యం చేయడం, సాఫ్టువేరు అభివృద్ధి చేయడం. ఐల్యుమినేట్ అనే సంస్థ సృష్టికర్తను. కంప్యూటర్ పరిజ్ఞానం ఉపయోగించి సృజనాత్మకతను ఎన్నో విధాలుగా పెంపొందించొచ్చు, వీటికి హద్దులు అంటూ ఏమి ఉండవు. ఒక్క సారి సాఫ్టువేరు ఎలా తయారు చేయాలో తెలిస్తే, ఆలోచనలను ఎలాంటి విషయంలోనైనా పెంపొదించొచ్చు. నేను లైట్ సూట్స్తో చేస్తాను. సాఫ్టువేరు రాయడానికి సరైన పరికరాలు మీ చేతిలో ఉంటే గనుక, మీరు ఎంతో సాధించొచ్చు అంతేకాక అవకాశాలు కూడా అసంఖ్యాకం అవుతాయి. రానున్న గంట వ్యవధిలో, మీరు కంప్యూటర్ పరిజ్ఞాన్ని ఎలా వాడాలో, మీ సొంత నాట్యాన్ని సృష్టించడం ద్వారా తెలుసుకుంటారు. మీ కోసం ప్రాచుర్యం పొందిన సంగీతాన్ని మరియు ప్రతిభ గల నృత్యం చేసే వారిని సమావేశపరిచాము. మీరు కోడు యొక్క బ్లాక్స్ ను ఉపయోగించి వేరు వేరు నృత్యం చేసేవారిని, వారి నాట్య శైలిని, సంగీతానికి స్పందించే విధానాన్ని ఇంకా వారి పరస్పర సంభాషణా విధానాన్ని ఎన్నుకోవాలి. మీరు గమనిస్తే, మీ తెర మూడు భాగాలుగా చేయబడుంది. ఎడుమ వైపు భాగాన్ని ప్లే స్పేస్ అంటారు, ఇక్కడే మీ నృత్యకారులు కనబడతారు. మధ్య భాగాన్ని "టూల్ బాక్స్" అంటారు, పాఠాలు పెరిగే కొద్దీ కొత్త కోడు యొక్క బ్లాకులు ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. కుడి వైపు భాగాన్ని "వర్క్ స్పేస్" అంటారు, కోడు యొక్క బ్లాకులను టూల్ బాక్స్ నుండి ఎంపిక చేసుకుని ఇక్కడ పెట్టి, మీరు సృష్టించాలని భావించిన ఆలోచనలను కార్యరూపం దాల్చాలి. మీరు పురోగతి సాధిస్తున్నపుడు, ప్రతి మెట్టుకు అవసరమైన సూచనలు తెర పై భాగంలో కనిపిస్తాయి. ఏదైనా సహాయం కావలి అనుకుంటే, అక్కడ చూపిన బల్బు ఆకారాన్ని నొక్కితే చాలు. ముందుగా, చిత్రంలో చూపిన విధంగా ఒక నృత్యకారుడని ఎరుపు రంగు బ్లాక్ ఉపయోగించి సృష్టించే ప్రయత్నం చేద్దాం. ఆ బ్లాకును "టూల్ బాక్స్" నుండి బయటకి తీసుకు వచ్చి నారింజ రంగులో ఉన్న "సెటప్ బ్లాక్"లో పెట్టాలి. ఇక్కడ నాట్యం చేసేది ఒక పిల్లి, దాని పేరు "మై ఫస్ట్ డాన్సర్". దాని మీద నొక్కితే మీకు నచ్చిన పేరుతో ఆ పేరుని మార్పు చేసుకోవొచ్చు. "ప్లే స్పేస్"లో నృత్యకారుడు ఎక్కడ కనిపించాలో! ఆ నిర్ణయం కూడా మీదే. "ప్లే స్పేస్" పైన ఉన్న పట్టిక ద్వారా నచ్చిన సంగీతాన్ని ఎంపిక చేసుకోవొచ్చు. ఆ పట్టికలో వందల కొద్దీ పాటలు ఉన్నాయి, మీకు ఇష్టమైన పాటను ఎంచుకోవొచ్చు. "ప్లే స్పేస్" కింద "రన్" అనే ఎంపిక ఉంటుంది. అది నొక్కగానే "ప్లే స్పేస్"లో మీరు సృష్టించిన నృత్యకారులు కనిపిస్తారు, మీరు ఎంపిక చేసుకున్న సంగీతం కూడా వినిపిస్తుంది. [సంగీతం] మీ సొంతగా ఏదైనా ప్రయత్నించండి, ఒక వేళ మీరు ముందుకి వెళ్లలేకపోతున్నారు అనుకుంటే, మరేమి దిగులు చెందొద్దు. మీ ప్రయత్నాన్ని కొనసాగించండి, మీకు తెలుసుకునేలోపు, మీరు సొంతగా, ఆసక్తి కలిగించే ఒక నాట్య వేడుకను సృష్టించి ఉంటారు. మరి, ఈ రోజు మీరు ఏమి సృష్టించబోతున్నారు?