1 00:00:01,640 --> 00:00:06,660 హౌర్ అఫ్ కోడ్ | డాన్స్ పార్టీ: వార్మ్ అప్ 2 00:00:07,980 --> 00:00:11,720 నమస్తే, 3 00:00:11,720 --> 00:00:16,270 నా పేరు మిరాల్ కాట్బి. నా వృత్తి నృత్యం చేయడం, సాఫ్టువేరు అభివృద్ధి చేయడం. ఐల్యుమినేట్ అనే సంస్థ సృష్టికర్తను. 4 00:00:16,270 --> 00:00:21,550 కంప్యూటర్ పరిజ్ఞానం ఉపయోగించి సృజనాత్మకతను ఎన్నో విధాలుగా పెంపొందించొచ్చు, 5 00:00:21,550 --> 00:00:22,560 వీటికి హద్దులు అంటూ ఏమి ఉండవు. 6 00:00:22,560 --> 00:00:28,480 ఒక్క సారి సాఫ్టువేరు ఎలా తయారు చేయాలో తెలిస్తే, ఆలోచనలను ఎలాంటి విషయంలోనైనా పెంపొదించొచ్చు. 7 00:00:28,480 --> 00:00:30,810 నేను లైట్ సూట్స్తో చేస్తాను. 8 00:00:30,810 --> 00:00:35,540 సాఫ్టువేరు రాయడానికి సరైన పరికరాలు మీ చేతిలో ఉంటే గనుక, మీరు ఎంతో సాధించొచ్చు అంతేకాక అవకాశాలు కూడా 9 00:00:35,540 --> 00:00:38,960 అసంఖ్యాకం అవుతాయి. 10 00:00:38,960 --> 00:00:43,610 రానున్న గంట వ్యవధిలో, మీరు కంప్యూటర్ పరిజ్ఞాన్ని ఎలా వాడాలో, మీ సొంత నాట్యాన్ని సృష్టించడం ద్వారా తెలుసుకుంటారు. 11 00:00:43,610 --> 00:00:45,100 12 00:00:45,100 --> 00:00:49,370 మీ కోసం ప్రాచుర్యం పొందిన సంగీతాన్ని మరియు ప్రతిభ గల నృత్యం చేసే వారిని సమావేశపరిచాము. 13 00:00:49,370 --> 00:00:56,120 మీరు కోడు యొక్క బ్లాక్స్ ను ఉపయోగించి వేరు వేరు నృత్యం చేసేవారిని, వారి నాట్య శైలిని, 14 00:00:56,120 --> 00:01:00,320 సంగీతానికి స్పందించే విధానాన్ని ఇంకా వారి పరస్పర సంభాషణా విధానాన్ని ఎన్నుకోవాలి. 15 00:01:00,320 --> 00:01:05,080 మీరు గమనిస్తే, మీ తెర మూడు భాగాలుగా చేయబడుంది. 16 00:01:05,080 --> 00:01:06,600 ఎడుమ వైపు భాగాన్ని ప్లే స్పేస్ అంటారు, 17 00:01:06,600 --> 00:01:09,640 ఇక్కడే మీ నృత్యకారులు కనబడతారు. 18 00:01:09,640 --> 00:01:12,790 మధ్య భాగాన్ని "టూల్ బాక్స్" అంటారు, 19 00:01:12,790 --> 00:01:18,060 పాఠాలు పెరిగే కొద్దీ కొత్త కోడు యొక్క బ్లాకులు ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. 20 00:01:18,060 --> 00:01:21,580 కుడి వైపు భాగాన్ని "వర్క్ స్పేస్" అంటారు, 21 00:01:21,580 --> 00:01:28,310 కోడు యొక్క బ్లాకులను టూల్ బాక్స్ నుండి ఎంపిక చేసుకుని ఇక్కడ పెట్టి, మీరు సృష్టించాలని భావించిన ఆలోచనలను కార్యరూపం దాల్చాలి. 22 00:01:28,310 --> 00:01:33,520 మీరు పురోగతి సాధిస్తున్నపుడు, ప్రతి మెట్టుకు అవసరమైన సూచనలు తెర పై భాగంలో కనిపిస్తాయి. 23 00:01:33,520 --> 00:01:40,770 ఏదైనా సహాయం కావలి అనుకుంటే, అక్కడ చూపిన బల్బు ఆకారాన్ని నొక్కితే చాలు. 24 00:01:40,770 --> 00:01:46,310 ముందుగా, చిత్రంలో చూపిన విధంగా ఒక నృత్యకారుడని ఎరుపు రంగు బ్లాక్ ఉపయోగించి సృష్టించే ప్రయత్నం చేద్దాం. 25 00:01:46,310 --> 00:01:52,770 ఆ బ్లాకును "టూల్ బాక్స్" నుండి బయటకి తీసుకు వచ్చి నారింజ రంగులో ఉన్న "సెటప్ బ్లాక్"లో పెట్టాలి. 26 00:01:52,770 --> 00:01:57,970 ఇక్కడ నాట్యం చేసేది ఒక పిల్లి, దాని పేరు "మై ఫస్ట్ డాన్సర్". 27 00:01:57,970 --> 00:02:03,530 దాని మీద నొక్కితే మీకు నచ్చిన పేరుతో ఆ పేరుని మార్పు చేసుకోవొచ్చు. 28 00:02:03,530 --> 00:02:10,250 "ప్లే స్పేస్"లో నృత్యకారుడు ఎక్కడ కనిపించాలో! ఆ నిర్ణయం కూడా మీదే. 29 00:02:10,250 --> 00:02:13,420 "ప్లే స్పేస్" పైన ఉన్న పట్టిక ద్వారా నచ్చిన సంగీతాన్ని ఎంపిక చేసుకోవొచ్చు. 30 00:02:13,420 --> 00:02:19,120 ఆ పట్టికలో వందల కొద్దీ పాటలు ఉన్నాయి, మీకు ఇష్టమైన పాటను ఎంచుకోవొచ్చు. 31 00:02:19,120 --> 00:02:21,220 "ప్లే స్పేస్" కింద "రన్" అనే ఎంపిక ఉంటుంది. 32 00:02:21,220 --> 00:02:25,870 అది నొక్కగానే "ప్లే స్పేస్"లో మీరు సృష్టించిన నృత్యకారులు కనిపిస్తారు, 33 00:02:25,870 --> 00:02:31,060 మీరు ఎంపిక చేసుకున్న సంగీతం కూడా వినిపిస్తుంది. 34 00:02:31,060 --> 00:02:35,810 [సంగీతం] 35 00:02:35,810 --> 00:02:37,250 మీ సొంతగా ఏదైనా ప్రయత్నించండి, 36 00:02:37,250 --> 00:02:39,110 ఒక వేళ మీరు ముందుకి వెళ్లలేకపోతున్నారు అనుకుంటే, మరేమి దిగులు చెందొద్దు. 37 00:02:39,110 --> 00:02:44,280 మీ ప్రయత్నాన్ని కొనసాగించండి, మీకు తెలుసుకునేలోపు, మీరు సొంతగా, ఆసక్తి కలిగించే ఒక నాట్య వేడుకను సృష్టించి 38 00:02:44,280 --> 00:02:45,280 ఉంటారు. 39 00:02:45,280 --> 00:02:48,980 మరి, ఈ రోజు మీరు ఏమి సృష్టించబోతున్నారు?