Return to Video

The Internet: Cybersecurity & Crime

 • 0:02 - 0:07
  ఇంటర్నెట్-సైబర్ భద్రత మరియు నేరం
 • 0:07 - 0:11
  హై, నాపేరు జెన్నీ మార్టిన్, నేను సైబర్
  భద్రత పరిశోధన డైరెక్టర్
 • 0:11 - 0:16
  సిమాంటెక్ వద్ద. నేడు సైబర్ నేరం సమాజానికి
  పెద్ద సమస్యల్ని కలిగిస్తోంది,
 • 0:16 - 0:23
  వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఇంకా జాతీయ భద్రత
  విషయంలో కూడా. కేవలం గత కొద్ది ఏళ్ళలో
 • 0:23 - 0:27
  వందల మిలియన్ల క్రెడిట్ కార్డు నంబర్లు
  చోరీ అయ్యాయి,
 • 0:27 - 0:31
  పదుల మిలియన్ల సామాజిక భద్రత నంబర్లు మరియు
  ఆరోగ్య రక్షణ రికార్డులు పోయాయి,
 • 0:31 - 0:35
  అణుసంబంధిత సెంట్రిఫ్యూజ్ లు కూడా హ్యాక్
  అయ్యాయి, మరియు మానవరహిత
 • 0:35 - 0:40
  ఏరియల్ డ్రోన్లు హైజాక్ అయ్యాయి. ఇదంతా
  నిస్సహాయతల్ని దోచుకోవడం ద్వారా హార్డ్ వేర్
 • 0:40 - 0:45
  మరియు సాఫ్ట్ వేర్ లో, లేదా మరీ తరచుగా
  సాఫ్ట్ వేర్ వాడే వ్యక్తుల అనుద్దేశిత
 • 0:45 - 0:53
  నిర్ణయాలను అవకాశం చేసుకోడంవల్ల జరుగుతోంది
  ఈ సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తులు ఒకే
 • 0:53 - 0:58
  ప్రొఫైల్ లేదా ప్రేరణ కలిగి ఉండరు, ఒక
  అంతర్జాతీయ ఉగ్రవాది నుండి
 • 0:58 - 1:03
  హక్కుల కోసం పోరాడే టీనేజర్ దాకా ఎవరైనా
  అయి ఉండొచ్చు. నేడు అతిపెద్ద దేశాలు కేవలం
 • 1:03 - 1:09
  మామూలు సైన్యమే గాక మంచి నైపుణ్యం గల సాయుధ
  సైబర్ సైన్యాన్ని కలిగి ఉన్నారు. నిజానికి
 • 1:09 - 1:12
  తర్వాతి ప్రపంచయుద్ధం మారణాయుధాలతో
  జరగకపోవచ్చు, ఐతే కంప్యూటర్లతో,
 • 1:12 - 1:17
  జాతీయ నీటి సరఫరాలు, విద్యుత్ గ్రిడ్ లు
  మరియు రవాణా వ్యవస్థల్ని ఆపేస్తూ జరగొచ్చు.
 • 1:17 - 1:25
  హై. నాపేరు పారిసా, నేను గూగుల్ భద్రత
  రాకుమారిని. నేను ఎన్నో విభిన్న
 • 1:25 - 1:30
  ఉత్పాదనలు మరియు విభిన్న మార్గాల్లో
  మన సాఫ్ట్ వేర్ సాధ్యమైనంత సురక్షితంగా
 • 1:30 - 1:34
  ఉంచడం గురించి పని చేసి ఉన్నాను.
 • 1:34 - 1:37
  మరి సైబర్ నేరం ఈ పడగ కింద ఎలా పనిచేస్తుందో
  ఒకసారి చూద్దాం
 • 1:37 - 1:41
  సాఫ్ట్ వేర్ వైరస్ లు, సర్వీస్ దాడుల
  గురించి, మరియు ఫిషింగ్ స్కామ్ ల గురించి
 • 1:41 - 1:46
  తెల్సుకుందాం. జీవశాస్త్రం మరియు జీవితంలో,
  ఒక వైరస్ జీవి దగ్గు, తుమ్ము లేదా భౌతిక
 • 1:46 - 1:49
  స్పర్శచే వ్యాప్తి అవుతుంది.
 • 1:49 - 1:53
  కణాలను సంక్రమిస్తూ, వాటి జన్యు పదార్థాన్ని
  ఎక్కిస్తూ వైరస్ లు పని చేస్తాయి, ఆ
 • 1:53 - 1:59
  కణాల్ని పెంచుతాయి. మనుషులు నిజంగా జబ్బుపడి
  ఇతరులకు సోకింపజేసేలా అవి చేస్తాయి.
 • 1:59 - 2:04
  కంప్యూటర్ వైరస్ కూడా అలాగే పనిచేస్తుంది.
  వైరస్ అనేది రాయదగిన ఒక ప్రోగ్రాము, దాన్ని
 • 2:04 - 2:10
  ఇన్‌స్టాల్ చేయొచ్చు, మామూలుగా దురుద్దేశంతో
  మరియు యూజర్, అతని కంప్యూటర్ కి హాని చేస్తూ
 • 2:10 - 2:16
  ఇతర కంప్యూటర్లకు ఆ వైరస్ వ్యాప్తి అయ్యే
  అవకాశం కూడా ఉంది. ఇంతకీ వైరస్ మీ కంప్యూటర్
 • 2:16 - 2:20
  కి ఎలా చేరుతుంది? దాడిచేసే వ్యక్తి మరొక
  కంప్యూటర్ కి హాని చేసే మార్గాలు రెండు
 • 2:20 - 2:25
  ఉన్నాయి. అవి ఒక ప్రోగ్రామును ఇన్‌స్టాల్
  చేసి ప్రోగ్రాం ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తాయి
 • 2:25 - 2:29
  ఉదా, అనేక వైరస్ లు సెక్యూరిటీ అప్‌డేట్ల
  రూపంలో దెబ్బతీస్తాయి. మీ కంప్యూటర్
 • 2:29 - 2:36
  సాఫ్ట్ వేర్ బలహీనత కలిగి ఉంటే, అటాకర్ మీ
  అనుమతి లేకుండానే వైరస్ ని
 • 2:36 - 2:39
  ఇన్‌స్టాల్ చేయగలుగడం కూడా సాధ్యం.
 • 2:39 - 2:44
  ఒకసారి వైరస్ మీ కంప్యూటర్లో ఉందంటే, అది మీ
  ఫైల్స్ ని చోరీ లేదా తొలగించగలదు, ఇతర
 • 2:44 - 2:48
  ప్రోగ్రాంలను కంట్రోల్ చేయగలదు, లేదా
  ఎవరైనా రిమోట్ గా మీ కంప్యూటర్ ని అదుపు
 • 2:48 - 2:50
  చేసేలా కూడా చేయగలదు.
 • 2:50 - 2:56
  కంప్యూటర్ వైరస్ లు వాడి, హ్యాకర్లు ప్రపంచ
  వ్యాప్తంగా మిలియన్ల కంప్యూటర్లను స్వాధీనం
 • 2:56 - 3:01
  చేసుకోగలరు డిజిటల్ సైన్యంగా, లేదంటే బోనెట్
  గా, వెబ్‌సైట్లపై దాడి చేసి స్వాధీనత కోసం.
 • 3:01 - 3:07
  ఈ రకం దాడిని సేవను విస్తృతంగా నిరాకరణ
  చేయడం అంటారు.
 • 3:07 - 3:10
  హ్యాకర్లు ఒక వెబ్‌సైట్ ని అనేక అభ్యర్థనలతో
  ముంచెత్తేలా చేస్తారు.
 • 3:10 - 3:15
  అనేక కంప్యూటర్ల నుండి ఒకేసారి దాడి జరిగితే
  దాన్ని మనం విస్తృత సేవా
 • 3:15 - 3:17
  నిరాకరణ అంటాం.
 • 3:17 - 3:22
  అనేక వెబ్‌సైట్లు రోజులో మిలియన్ల కొద్దీ
  అభ్యర్థనలకు స్పందిస్తాయి, ఐతే మీరు వాటిని
 • 3:22 - 3:25
  వేర్వేరుచోట్లనుండి వచ్చే బిలియన్ ట్రిలియన్
  రిక్వెస్ట్ లతో నొక్కితే,
 • 3:25 - 3:32
  కంప్యూటర్లు ఓవర్‌లోడ్ అయి నిలిచిపోతాయి.
  సైబర్ నేరగాళ్ళు వాడే మరో ట్రిక్ ఏమిటంటే
 • 3:32 - 3:36
  ప్రజల్ని బోల్తాకొట్టించి సున్నిత వ్యక్తిగత
  సమాచారం పంచుకునేలా అనేక స్పామ్ ఇమెయిల్స్
 • 3:36 - 3:39
  ని ఒకే ప్రయత్నములో పంపించేస్తారు.
 • 3:39 - 3:45
  దీన్ని ఫిషింగ్ స్కామ్ అంటారు. నమ్మకంగా
  కనిపించే ఇమెయిల్ లాగా మిమ్మల్ని లాగిన్
 • 3:45 - 3:50
  అడుగుతూ, మీరు ఖాతాలో లాగిన్ అయి ఇమెయిల్
  క్లిక్ చేయగానే ఒక తప్పుడు వెబ్‌సైట్ కి
 • 3:50 - 3:52
  తీసుకుపోవడాన్ని ఫిషింగ్ స్కామ్ అంటారు.
 • 3:52 - 3:56
  మీరెలాగైనా లాగిన్ అయితే, మీరు పాస్‌వర్డ్
  ఇచ్చేలా మిమ్మల్ని బోల్తా కొట్టిస్తారు.
 • 3:56 - 4:00
  హ్యాకర్లు సమాచారం చోరీ చేయడానికి మీ స్వంత
  ఖాతాల ప్రాప్యతకు మీ లాగిన్ రహస్యాల్ని
 • 4:00 - 4:06
  వాడతారు, మీ డబ్బును కూడా దొంగిలించొచ్చు.
  అదృష్టవశాత్తూ ఇంటర్నెట్ ని సురక్షితం
 • 4:06 - 4:10
  చేయడానికి అనేక కంపెనీలు, చట్టాలు మరియు
  ప్రభుత్వ సంస్థలు పని చేస్తున్నాయి.
 • 4:10 - 4:15
  ఐతే, ఈ ప్రయత్నాలు మాత్రమే సరిపోవు.
 • 4:15 - 4:18
  ఒక కంప్యూటర్ హ్యాక్ అయినప్పుడు అది భద్రత
  డిజైన్ లేదా సాఫ్ట్ వేర్ సమస్యగా
 • 4:18 - 4:23
  మీరు అనుకోవచ్చు. తొంభై శాతం సమయం సిస్టం
  హ్యాక్ అయినా అది సెక్యూరిటీ బగ్ వల్ల కాదు
 • 4:23 - 4:27
  మనిషి చేసే సులువైన తప్పిదం వల్ల అలా
 • 4:27 - 4:35
  అవుతుంది. మనకు మనం రక్షించుకోవడానికి
  చాలా మార్గాలున్నాయి. తరచూ మీ
 • 4:35 - 4:39
  చర్యలు మీ స్వంత డేటా మరియు కంప్యూటర్ యొక్క
  భద్రతను ప్రభావితం చేయడమే గాక మీ
 • 4:39 - 4:42
  బడిలో, పనిచోటులో మరియు ఇంట్లో
 • 4:42 - 4:47
  ప్రతి ఒక్కరి భద్రతను కూడా. బిలియన్లు లేదా
  ట్రిలియన్ల డాలర్లను పణంగా చేసి
 • 4:47 - 4:52
  సైబర్ నేరస్థులు ఏటా చక్కగా తయారవుతున్నారు
  మరి మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంది.
Title:
The Internet: Cybersecurity & Crime
Description:

more » « less
Video Language:
English
Duration:
05:02

Telugu subtitles

Revisions Compare revisions