చావుతో పోరాటం తరువాత చల్లటి ప్రకంపనం
-
0:01 - 0:05అది ఏప్రిల్ 8, 2003. నేను బాగ్దాద్ లో,
ఇరాక్ యుద్ధం కవర్ చేస్తూ ఉన్నాను. -
0:06 - 0:10ఆ రోజు, అమెరికన్స్ టాంకులు బాగ్దాద్ లోకి
రావడం మొదలయ్యింది. మేము కొంత మంది -
0:10 - 0:15విలేఖరులం మాత్రం పాలస్తైన్ హోటల్ లో
ఉన్నాము, యుద్ధంలో జరిగినట్టుగా, పోరాటం -
0:16 - 0:22మా కిటికీల బయటకు చేరుకోవడం ప్రారంభమైంది.
-
0:22 - 0:27బాగ్దాద్ నల్ల పొగ మరియు నూనెతో కవర్
అయ్యింది. ఘాటైన వాసన వస్తోంది. -
0:27 - 0:29ఏ విషయం చూడలేకపోయాము కానీ ఏమి జరుగుతోందో
-
0:30 - 0:34మాకు తెలుసు. వాస్తవానికి, నేను ఒక వ్యాసం
రాస్తూ ఉండవలసింది, -
0:35 - 0:38కానీ ఎప్పుడూ అలానే జరుగుతుంది--
మీరు రాస్తూ ఉన్న సమయంలో ఏదో ఒక -
0:38 - 0:40పెద్ద విషయం జరుగుతుంది. నేను ౧౬ వ
అంతస్థులో -
0:40 - 0:44ఉన్న నా గదిలో, రాసుకుంటూ, మధ్య మధ్యలో
కిటికీ బయట ఏమి జరుగుతుందో చూస్తూ ఉన్నాను. -
0:44 - 0:47అకస్మాత్తుగా, ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది.
గత మూడు వారాలలో, -
0:47 - 0:50అర-టన్ను మిస్సైల్స్ తో దాడులు
జరుగుతున్నాయి, కానీ ఈ సారి -
0:50 - 0:52మాత్రం, నాలో షాక్-- కలగడం నేను
-
0:53 - 0:56గమనించాను. ఇంకా నేను , "అది చాలా దగ్గరగా
ఉంది. -
0:56 - 0:58అది చాలా, చాలా దగ్గరగా ఉంది."
అని అనుకున్నాను -
0:58 - 1:01కాబట్టి నేను ఏమి జరుగుతుందో
చూడడానికి కిందికి వెళ్ళాను. -
1:01 - 1:07నేను ఒకసారి చూడడానికి కింద ౧౫వ
అంతస్థుకి వెళ్ళాను. నేను ప్రజలు, -
1:07 - 1:11విలేఖరులు, హాళ్ళల్లో అరవడం చూశాను .
నేను ఒక గది లోకి వెళ్ళాను -
1:11 - 1:14కాని అది ఒక క్షిపణి ద్వారా దెబ్బ
తిన్నదని గ్రహించాను. -
1:14 - 1:19ఎవరో గాయపడ్డం జరిగింది. ఒక వ్యక్తి కిటికీ
దగ్గర ఉన్నాడు, టారస్ ప్రొత్స్యుక్ అనే -
1:19 - 1:22పేరు గల కెమెరామన్, బోర్లా పడి ఉన్నాడు.
ఇంతకు ముందు హాస్పిటల్లో పనిచేశాను -
1:22 - 1:24కాబట్టి నేను సహాయం చేద్దామనుకున్నాను.
-
1:24 - 1:29కాబట్టి నేను అతనిని వెనక్కి త్రిప్పాను.
కాని నేను అతనిని వెనక్కి త్రిప్పినప్పుడు, -
1:29 - 1:32అతని స్టెర్నమ్ నుండి ప్యుబిస్ వరకు ఓపెన్
-
1:33 - 1:35అయ్యి ఉండడం గమనించాను,
నేను ఏమీ చూడలేకపోయాను. -
1:35 - 1:39ఇంతకీ నేనుచూసింది తెల్ల,షైనీ ముత్యంలాంటి
ఓ చుక్క అది నన్ను చూడకుండా చేసింది, -
1:40 - 1:42అక్కడ ఏమి జరుగుతుందో నాకు అర్థం కాలేదు.
-
1:46 - 1:50ఒకసారి ఆచుక్క మాయమయ్యాక
ఇంకా నేను ఆ గాయాన్ని చూడగలిగాక, -
1:50 - 1:54ఏదైతే చాలా తీవ్రంగా ఉందో, నేను, నా
స్నేహితులు ఒక దుప్పటి అతనికి కప్పి, -
1:56 - 2:0215 అంతస్థులూ అన్నిట్లోనూ ఆగుతున్నఎలివేటర్
లో అతణ్ణి తీసుకెళ్ళాం. అతణ్ణి మేము కార్లో -
2:02 - 2:09హాస్పిటల్ కి పంపించాము. అతను హాస్పిటల్ కి
వెళ్ళే దారిలో పోయాడు. క్షిపణి రెండు -
2:09 - 2:11అంతస్థుల మధ్య పేలడం వల్ల గాయ పడి--
-
2:11 - 2:15౧౪ వ అంతస్థు లో ఉన్నస్పానిష్ కెమారామన్
జోస్ కూసో, ఆపరేషన్ బల్ల మీద చనిపోయాడు. -
2:15 - 2:18కార్ వెళ్ళి పోగానే, నేను వెనక్కి వెళ్ళాను.
-
2:18 - 2:22నేను రాయాల్సిన వ్యాసం అలాగే ఉంది--
నేను రాసి తీరాల్సిందే. అందుకని-- -
2:22 - 2:25నేనురక్తం అంటిన చేతులతో హోటల్ లాబీకి
తిరిగి వచ్చాను, అప్పుడు హోటల్ -
2:25 - 2:29గోఫర్స్ లో ఒకరు నన్ను ఆపి ౧౦ రోజులుగా
నేను కట్టని టాక్స్ కట్టమన్నారు. -
2:29 - 2:32నేను అతడిని వెళ్ళి పొమ్మని చెప్పాను.
ఇంకా నాకు నేను -
2:32 - 2:35చెప్పుకున్నాను: "అన్నీ పక్కన పెట్టు ,
నీ ఆలోచనలను -
2:35 - 2:38స్పష్టం గా ఉంచుకో. నువ్వు వ్రాయాలనుకుంటే
అన్నీపక్కన పెట్టాలి. నేనూ అదే చేశాను. -
2:38 - 2:42నేను పైకి వెళ్ళి, వ్యాసం వ్రాసాను. దాన్ని
పంపించాను. తరువాత, నా సహచరులను -
2:42 - 2:47కోల్పోయిన భావాన్ని పక్కన పెడ్తే, ఇంకా ఏదో
భావం నన్ను ఇబ్బంది పెడ్తోంది. నేను -
2:48 - 2:52మెరిసే, తెల్ల చుక్కని చూస్తూ ఉన్నాను,
-
2:52 - 2:55కాని నేను అది ఏమిటో అర్థం చేసుకోలేకపోయాను.
అప్పుడు, యుద్ధం ముగిసింది. -
2:55 - 2:59తర్వాత , నేను ఆలోచించా:"అది సాధ్యం కాదు.
-
2:59 - 3:01నేను ఏమి జరిగిందో తెలుసుకోలేకపోతున్నాను."
ఎందుకంటే ఇది -
3:02 - 3:05మొదటిసారి కాదు, ఇంకా ఇది కేవలం నాకే
జరగడం లేదు. నేను నా ౨౦ నుండి -
3:07 - 3:09౩౫ సంవత్సరాల రిపోర్టింగ్ లో ఇలాంటి
-
3:09 - 3:12విషయాలు వేరేవాళ్ళకు జరగడం చూశాను.
నేను నా మీద ప్రభావం -
3:12 - 3:14చూపించిన విషయాలని కూడా చూశాను
-
3:15 - 3:19ఉదాహరణకు,లెబనాన్ లో నాకు తెలిసిన ఒక
అతను ఉన్నాడు, -
3:20 - 3:22వయసున్న ౫ ఏళ్ళ నుండీ
పోరాడుతున్న ఒక యుద్ధవీరుడు- -
3:22 - 3:26౨౫-సంవత్సరాల- ఓ నిజమైన అనుభవశాలి--అతన్ని
మనం అనుసరిస్తాం. -
3:29 - 3:31అతను చీకట్లో కూడా ధైర్యం తో
ముందుకెళ్ళగలడు-- -
3:31 - 3:34అతను చాలా గొప్ప సైనికుడు,
ఒక నిజమైన సైనికుడు-- మనకు తెలుసు -
3:36 - 3:38అతనితో ఉంటే సురక్షితం అని,
కాబట్టి మనం -
3:39 - 3:42అతన్ని అనుసరిస్తాం.
-
3:42 - 3:44ఒక రోజు నాకు చెప్పబడింది --
-
3:44 - 3:46అతను కాంప్నుండి
వెనక్కి రావడం వల్ల -
3:46 - 3:49నేను అతన్ని మళ్ళీ చూశాను, పేక ఆడుతూ,
-
3:49 - 3:52ఎవరో ప్రక్క ఇంటికి వచ్చి,
వారి ఆయుధం పేల్చారు. -
3:53 - 3:57గన్ను పేలిన తరువాత, ఆ పేలుడు, ఆ ఒక్క షాట్,
అతను త్వర త్వరగా బల్ల కింద, పిల్లాడిలా -
3:57 - 4:00దాక్కునే లాగా చేసింది.
అతను ఊగిపోతూ, -
4:00 - 4:02భయాందోళనలకు గురి అయ్యాడు.
అప్పటి నుండి -
4:02 - 4:04అతను ఎన్నడూ నిలబడి
పోరాటం చెయ్యలేక పోయాడు. -
4:04 - 4:07చివరికి అతను ఒక క్రౌపియర్ గా మారాడు.
-
4:07 - 4:11నేను తరవాత అతడిని బీరట్ కాసినో లో చూశాను,
అతడు ఎలాగూ -
4:11 - 4:14నిద్ర పోలేడు కాబట్టి,
అదే అతడికి సరైన ఉద్యోగం. -
4:14 - 4:18"ఏ విషయము ఎటువంటి గాట్లు
లేకుండా నిన్ను చంపుతుంది? -
4:18 - 4:20అది ఎలా జరుగుతుంది?
-
4:20 - 4:26ఈ తెలియని విషయం ఏమిటి?"
అని నాలో నేను ఆలోచించుకున్నాను. -
4:26 - 4:31ఇది చాలా సాధారణ విషయం
కాబట్టి యాధృచ్ఛికం కాదు. -
4:31 - 4:35నేను పరిశోధించడం మొదలుపెట్టాను--
-
4:35 - 4:39అది ఒక్కటే ఎలా చేయాలో నాకు తెలిసింది.
-
4:40 - 4:44పుస్తకాలను చదవడం ద్వారా,
మానసిక వైద్యులను కలవడం ద్వారా, -
4:44 - 4:47సంగ్రహాలయాలకు,గ్రంధాలయాలకు
మొదలైనవాటికి వెళ్ళడం ద్వారా -
4:47 - 4:50నేను పరిశొధన చేయడం మొదలు పెట్టాను.
-
4:50 - 4:55చివరికి, నేను కొంతమందికి సాధారణంగా
సైనిక మానసిక వైద్యులకు-- -
4:55 - 5:02దీని గురించి తెలుసని కనుక్కున్నాను--
ఇంకా మేము వెతుకుతున్న -
5:04 - 5:06ఈ పరిస్థితి పేరు ట్రామా అని
కనుక్కున్నాను. అమెరికన్లు -
5:06 - 5:11దీన్ని పిటిఎస్డి లేదా ట్రామాటిక్
న్యూరోసిస్ అని పిలుస్తారు. -
5:11 - 5:13ఇది అప్పటిలో మనుగడలో
ఉండేది, కానీ మనము దాని -
5:13 - 5:17గురించి మాట్లాడలేదు. కాబట్టి ఈ గాయం--
-
5:17 - 5:25ఇది ఏమిటి?
సరే, మరణంతో ఒక పోరాటం లాగా ఉంది. -
5:26 - 5:30మీకు ఎప్పుడైనా మరణంతో అనుభవం
ఉందేమో నాకు తెలీదు- -
5:31 - 5:35నేను మృతదేహాలు గురించి మాట్లాడటం లేదు,
లేదా ఒకరి తాత, హాస్పిటల్ బెడ్ -
5:35 - 5:38మీద పడి ఉండడం లేదా ఎవరైనా
కారు గుద్ది దెబ్బ తగిలి ఉండడం -
5:38 - 5:42గురించి కాదు. నేను మరణం గర్జన
ఎదుర్కొంటున్న వారి గురించి -
5:42 - 5:49మాట్లాడతున్నాను. కానీ ఆ విషయం
ఎవరూ చూడకూడనిది. జనాలు ఇలా చెప్తారు, -
5:52 - 5:55"సూర్యుడు లేదా మరణాన్ని
సూటిగా కళ్ళతో చూడలేము." -
5:55 - 5:58ఏ మానవుడైనా మరణం యొక్క
స్తబ్దతను ఎదుర్కొనకూడదు. -
5:59 - 6:02కానీ అది జరిగినప్పుడు, అది
కాసేపు అదృశ్యమై ఉండిపోయి-- -
6:02 - 6:07రోజులు, వారాలు, నెలలు,
కొన్నిసార్లు సంవత్సరాలు. -
6:07 - 6:11ఆపై, ఒక సమయంలో అది పేలుతుంది, ఎందుకంటే
ఏదో మీ మెదడులో ప్రవేశించింది బొమ్మ -
6:12 - 6:17మరియు మీ మనస్సు మధ్య
ఒక విధమైన కిటికీ వంటిది-- -
6:18 - 6:24అది మీ మెదడులోకి చొచ్చుకెళ్ళింది, అక్కడే
ఉండిపోయి మరియు లోపల అంతా స్థలాన్ని -
6:24 - 6:29ఆక్రమించు కొని ఉన్నది. మరి చాలా మంది
మనుష్యులు మగవాళ్ళు, ఆడవాళ్ళు, -
6:29 - 6:34అకస్మాత్తుగా నిద్ర పోలేరు. మరియు వారు
భయంకరమైన ఆందోళన దాడులు అనుభవించడానికి - -
6:34 - 6:41విస్మయమైన దాడులు, కేవలం చిన్న
భయాలు కాదు. వారు అకస్మాత్తుగా -
6:41 - 6:44నిద్ర పొవద్దు అనుకుంటారు, ఎందుకంటే
నిద్రపోయినప్పుడు, అవే -
6:44 - 6:50పీడకలలతో ప్రతి రాత్రి బాధ పడతారు.
వారు ప్రతి రాత్రి అదే బొమ్మను చూస్తారు. -
6:50 - 6:54ఏ రకమైన బొమ్మ? ఉదాహరణకు,
ఒక సైనికుడు ఒక భవనము లోనికి -
6:54 - 6:59అడుగు పెట్టి మరియు తనపై తుపాకి గురిపెట్టిన
ఇంకొక సైనికుడితో ముఖా ముఖికి దిగాడు. -
6:59 - 7:04అతను నేరుగా గన్ బారెల్ వంక చూస్తాడు.మరియు
బారెల్ హఠాత్తుగా చాలా వికారంగా అవుతుంది. -
7:05 - 7:08ఇది మెత్తగా అయ్యి, ప్రతిదీ మ్రింగుతుంది.
ఆపై అతనుఅంటాడు- -
7:09 - 7:11తరువాత అతను అనవచ్చు, “నేను చావును
చూశాను. నన్ను నేను -
7:12 - 7:15చనిపోవడం చూశాను, కాబట్టి నేను
చనిపోయాను. మరియు -
7:15 - 7:17అప్పటి నుండి, అతనికి తెలుసు
తను చనిపోయినట్టు. ఇది ఒక -
7:17 - 7:21అవగాహన కాదు -అతను చనిపోయాడని
అతను నమ్ముతున్నాడు. -
7:21 - 7:24వాస్తవంలో, ఎవరైనా వచ్చారు, అతను వెళ్ళాడు
లేదా షూట్ చేయలేదు, ఏది ఏమైనా, -
7:24 - 7:28ఇంకా తను నిజానికి కాల్చబడలేదు - అతనికి,
ఆ సమయంలో అతను మరణించాడు. లేదా -
7:28 - 7:29అది సామూహిక సమాధి
-
7:29 - 7:31యొక్క వాసన లాగా ఉంటుంది--
-
7:31 - 7:34నేను ర్వాన్ డా లో అలంటివి చాలా చూశాను.
ఇది మీ స్నేహితుడు -
7:34 - 7:36పిలుస్తున్న స్వరం కావచ్చు,
మరియు అవి వధకు -
7:37 - 7:39గురిఅవుతున్నాయి మరియు మనము ఏమీ
చేయలేము. మీరు ఆ గొంతు -
7:40 - 7:44వినవచ్చు, మరియు మీరు ప్రతి రాత్రి
మేల్కొని ఉంటారు- వారాలు, నెలలు- -
7:46 - 7:51ఒక ట్రాన్స్ లాంటి స్థితిలో, ఆత్రుత మరియు
భయభ్రాంతులతో, పిల్లవాడి లాగా. -
7:51 - 7:54నేను పురుషులు చిన్న పిల్లల లాగా
కేకలు వేయటం చూశాను- -
7:55 - 8:00అదే బొమ్మను చూసినప్పటి నుండి. కనుక నీ
మెదడు లో ఆ భయానక చిత్రం ఉండడం, -
8:00 - 8:03మరణం యొక్క స్తబ్దతను చూడడం-
ఆ భయానక అనలాగ్ ఏదో దాచి ఉంచింది -- -
8:03 - 8:07పూర్తిగా ఆక్రమించ బడుతుంది.
మీరు ఎమీ కూడా చేయలేరు. -
8:07 - 8:09మీరు పని చేయలేరు, ప్రేమించరు.
-
8:09 - 8:11ఇంటికి వెళ్ళి ఎవరినీ గుర్తించరు.
-
8:11 - 8:14మీరు మిమ్మల్ని కూడా గుర్తించలేరు.
మీరు దాక్కుంటారు మరియు -
8:15 - 8:19ఇంటినుంచి బయటకు వెళ్ళరు, మిమ్మల్ని
మీరే ఇంట్లో బంధించుకొని, -
8:19 - 8:22అనారోగ్యంతో ఉంటారు. ఈ సందర్భంలో ఎవరైనా
లోపలికి రావడానికి ప్రయత్నించకుండా, -
8:22 - 8:25లోపల నాణేలతో చిన్న డబ్బాలు తమ ఇంటి
బయట ఉంచే వ్యక్తులు -
8:26 - 8:29నాకు తెలుసు, అకస్మాత్తుగా, మీకు చావాలని
-
8:29 - 8:33లేదా చంపాలని, దాక్కోవాలనీ లేదా
పారిపోవాలనీ అనిపించవచ్చు. -
8:34 - 8:38మీరు ప్రేమించబడడం ఇష్టపడతారు,
కానీ మీరు ప్రతి ఒక్కరినీ ద్వేషిస్తారు. -
8:38 - 8:41ఇది మీకు ప్రతి రోజూ పూర్తిగా వదులుకోకూడదు
అనే ఒక భావన మీలో ఉంటుంది -
8:43 - 8:45మరియు మీరు విపరీతంగా బాధ పడతారు.
-
8:45 - 8:47ఒక్కరికీ అర్థం కాదు. “మీలో ఏ తప్పు లేదు.
-
8:47 - 8:49మీరు బాగానే ఉన్నట్టు ఉన్నారు. మీకు
-
8:49 - 8:49గాయాలేమీ లేవు.
-
8:49 - 8:52మీరు యుధ్ధానికి వెళ్ళారు, తిరిగి వచ్చారు,
-
8:52 - 8:54మీరు బావున్నారు.” అని వాళ్ళు
అంటారు. ఈ వ్యక్తులు -
8:54 - 8:58విపరీతంగా బాధపడుతున్నారు.
కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. -
9:00 - 9:06ఆత్మహత్య మీ రోజువారీ ప్రణాళిక నవీకరించుట
వంటిది -నేను ఇప్పటికే చనిపోయాను, -
9:06 - 9:08నేను అలాగే ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు.
-
9:08 - 9:11అదనంగా, ఇకమీదట నొప్పి ఊండదు.
కొందరు ఆత్మహత్యకు, ఇతరులు తాగడం, -
9:11 - 9:13వంతెన కింద ముగిస్తారు.
ప్రతిఒక్కరికి గుర్తు -
9:13 - 9:15వాళ్ళ తాత లేదా అంకుల్ లేదా పొరుగు అతను
-
9:15 - 9:18ఎక్కువగా త్రాగినా, ఒక్క మాట
కూడా అనరు, -
9:18 - 9:24భార్యను కొట్టి మరియు వారు ఎల్లప్పుడూ ఒక
చెడ్డ మూడ్ లో ఉండి, మధ్యం మత్తులో మునిగి -
9:24 - 9:29చనిపోయేట్లు ఉంటారు. మరియు మనము,
ఎందుకు ఈ విషయంపై మాట్లాడడం లేదు? -
9:29 - 9:31అది నిషిద్ధము కాబట్టి మనము దాని
-
9:31 - 9:33గురించి మాట్లాడము.
ఇది మనము మరణం యొక్క -
9:33 - 9:36స్తబ్దతను వ్యక్తం చేయడానికి
పదాలు లేక కాదు. -
9:36 - 9:41కానీ ఇతరులు దీనిని వినడానికి ఇష్టపడరు.
మొదటిసారి నేను ఒక అసైన్మెంట్ నుండి -
9:42 - 9:45తిరిగి వచ్చినప్పుడు, వారు
"ఓహ్! అతను తిరిగి వచ్చాడు", -
9:45 - 9:46అన్నారు.
-
9:46 - 9:49తెల్లటి మెజాపై వస్త్రం, కొవ్వొత్తులు,
అతిథులతో కూడిన ఒక ఫాన్సీ -
9:49 - 9:50విందు ఉంది.
-
9:50 - 9:51“మాకు అంతా
-
9:51 - 9:52చెప్పండి!” అన్నారు
-
9:52 - 9:57అదే నేను చేశాను. ౨౦ నిమిషాల
తర్వాత, ప్రజలు నన్నుదుర్భర -
9:57 - 9:59చూపులతో చూశారు, అతిధేయు మసిముంతను
తన ముక్కుతో వాసన చూశారు. -
9:59 - 10:01అది భయంకరంగా ఉంది మరియు నేను మొత్తం
-
10:01 - 10:05సాయంత్రాన్ని భగ్నం చేసినట్లుగా
గ్రహించాను. కాబట్టి నేను దాని గురించి -
10:05 - 10:09మాట్లాడలేదు. మేము వినడానికి
మాత్రము సిధ్ధముగా లేము. -
10:09 - 10:13ప్రజలు బొత్తిగా చెప్తారు : "దయచేసి ఆపండి".
ఇది ఒక అరుదైన సంఘటనగా ఉంటుందా? -
10:13 - 10:16కాదు, అది చాలా సాధారణము.
ఇరాక్ లో మరణించిన మూడు -
10:16 - 10:18వంతుల సైనికులు – సరే, చనిపోలేదు, నన్ను
-
10:18 - 10:19ఇంకో రకంగా
-
10:19 - 10:22చెప్పనివ్వండి–
-
10:22 - 10:23ఇరాక్కు వెళ్లిన మూడు వంతుల
-
10:23 - 10:24సంయుక్త సైనికులు
-
10:24 - 10:27పి టి యస్ డీ తో బాధపడుతున్నారు.
-
10:27 - 10:30౧౯౩౯ లో, మొదటి ప్రపంచ యుద్ధం నుండి
౨౦౦,౦౦౦ మంది సైనికులు -
10:30 - 10:32ఇప్పటికీ, బ్రిటీష్ మనోవిక్షేప
ఆసుపత్రుల్లో -
10:32 - 10:34చికిత్స పొందుతూ ఉన్నారు.
-
10:34 - 10:35వియత్నాంలో, ౫౪,౦౦౦ మంది
-
10:35 - 10:39అమెరికన్లు మరణించారు.
-
10:39 - 10:40౧౯౮౭లో, అమెరికా
-
10:40 - 10:45ప్రభుత్వం, ౧౦౨,౦౦౦ మంది
-
10:45 - 10:50అనుభవజ్ఞులను, అంటే దాదాపుగా
-
10:50 - 10:55రెట్టింపు మంది, ఆత్మహత్య చేసుకొని
-
10:55 - 10:59మరణించినట్లుగా గుర్తించారు. వియత్నాం
-
10:59 - 11:05యుద్ధం ద్వారా కంటే ఆత్మహత్య వలన
-
11:05 - 11:09రెండింతలు మరణాలు సంభవించాయి.
-
11:09 - 11:14కాబట్టి మీరు చూడండి, కేవలం ఆధునిక
-
11:14 - 11:17యుద్ధతంత్రమే కాదు పురాతన
-
11:17 - 11:19యుద్ధాలు కూడా -- మీరు దాన్ని గురించి
-
11:19 - 11:23చదువుకోవచ్చు, సాక్ష్యం అక్కడే ఉంది,
-
11:23 - 11:25అన్నిటికీ సంబంధించినది.
-
11:25 - 11:28కాబట్టి ఎందుకు మనము దాని
-
11:28 - 11:30గురించి మాట్లాడడం లేదు?
-
11:30 - 11:34ఎందుకు మనము దాని గురించి మాట్లాడలేదు?
-
11:34 - 11:40సమస్య ఏమిటంటే మీరు దాన్ని గురించి
-
11:40 - 11:45మాట్లాడక పోతే మీరు విపత్తు
వైపు వెళ్తున్నారు. -
11:45 - 11:48నయం చేయటానికి ఏకైక మార్గం ఏమిటంటే --
-
11:49 - 11:52మరియు ఇక్కడ ఒక శుభవార్త
దీనికి చికిత్స చేయగలం -- -
11:52 - 11:57మంచ్ ది స్క్రీమ్, గోయా
మొదలైనవి ఆలోచించండి-- -
11:57 - 12:02దీనికి నిజంగానే చికిత్స చేయగలం. మనసులో
పడిన బెదురు నుండీ నయం అవటానికి -
12:02 - 12:06ఏకైక మార్గం, మరణంతో ఎన్కౌంటర్ నుండి
అధిగమించి, శిలగా -
12:06 - 12:08మారుస్తున్న మరియు మిమ్మల్ని పీడిస్తున్న
-
12:08 - 12:12దీని నుంచి బయట పడడానికి మీ బాధను
చెప్పుకునే మార్గం ఎంచుకోవడం. -
12:12 - 12:14“భాష ఒక్కటే మనల్ని అందరినీ కలిపి
ఉంచుతుంది” అని -
12:14 - 12:17జనాలు అంటుంటారు. భాష లేకుండా,
మనము ఏమీ చేయలేము. -
12:17 - 12:19ఇది మనల్ని మానవుల్ని చేస్తుంది.
-
12:19 - 12:21ఒక భయంకరమైన చిత్రం నేపథ్యంలో –
-
12:21 - 12:25ఒక పదములు లేని చిత్రం పై నిమగ్న మయ్యాడు--
అది భరించవలసిన -
12:25 - 12:27ఏకైక మార్గం అందులో మానవ పదాలు ఉంచాలి.
-
12:28 - 12:30ఈ ప్రజలను మానవుల నుంచీ మినహాయించ
-
12:30 - 12:34బడుతున్నారు ఎందుకంటే ఎవరూ
వారిని చూద్దామని కోరుకోవట్లేదు -
12:34 - 12:36మరియు వారు ఎవరినీ చూడాలని
అనుకోవటం లేదు. వారు -
12:36 - 12:38మురికిగా, అపవిత్రతతో, సిగ్గుగా
భావిస్తున్నారు. -
12:38 - 12:40“డాక్టర్, నేను సబ్వే వాడను ఎందుకంటే
-
12:40 - 12:42నా కళ్ళలో ప్రజలు హర్రర్
-
12:42 - 12:44చూస్తారేమోనని భయపడుతూ ఉన్నాను." అని ఎవరో
-
12:44 - 12:45అన్నారు. మరో వ్యక్తి
-
12:45 - 12:46తనకు ఒక భయంకరమైన
-
12:46 - 12:50చర్మ వ్యాధి ఉందని భావించి ఒక
చర్మవ్యాధి వైద్యుడు నుండి ఇంకో -
12:50 - 12:52వైద్యుడు దగ్గరికి గత ఆరు నెలలుగా
వెళుతున్నాడు. తరువాత -
12:53 - 12:54ఒక రోజు, వారు అతన్ని ఒక మానసిక
-
12:54 - 12:56వైద్యుని వద్దకు పంపించారు.
-
12:56 - 12:58తన రెండవ సెషన్ సమయంలో,
తనకు తల నుండి బొటనవేలు వరకు -
12:58 - 13:02ఒక భయంకరమైన చర్మం వ్యాధి ఉంది
అని మానసిక వైద్యునికి చెప్పాడు. -
13:02 - 13:05మనోరోగ వైద్యుడు "ఎందుకు మీరు ఈ
స్థితిలో ఉన్నారు?" అని అడిగాడు. -
13:05 - 13:09"నేను చనిపోయాను కాబట్టి నా శరీరం
కుళ్ళిపోయి ఉండవచ్చు” అని -
13:09 - 13:16ఆ మనిషి అన్నాడు. కాబట్టి ఇది ప్రజలపై
తీవ్ర ప్రభావం కలిగి ఉందని చూడగలరు. -
13:16 - 13:20నయం చేయడానికి, మనం దాని గురించి మాట్లాడడం
అవసరం. హర్రర్ ను పదాలుగా మార్చాల్సి ఉంది - -
13:20 - 13:24మానవ పదాలు, కాబట్టి మనము మళ్ళీ దాని
-
13:25 - 13:30గురించి మాట్లాడటానికి ఆర్గనైజ్ చేయవచ్చు.
మనము ముఖా ముఖి మరణం చూడాల్సి ఉంటుంది. -
13:30 - 13:34మరియు మనము అలా చేస్తే, మనము ఈ విషయాల
గురించి మాట్లాడవచ్చు, తరువాత -
13:34 - 13:37స్టెప్ బైస్టెప్, మాటలతో ఎంతో కృషి ద్వారా,
మనము మానవత్వంలో మన స్థానాన్ని -
13:37 - 13:41తిరిగి దక్కించుకోవచ్చు. మరియు అది ముఖ్యం.
నిశ్శబ్దం మనల్ని చంపేస్తుంది. -
13:41 - 13:45కాబట్టి దీని అర్ధం ఏమిటి? దీని అర్ధం
గాయాలైన తర్వాత, ప్రశ్నించకుండా, -
13:45 - 13:49మనము “భరించలేని తేలికతనాన్ని" కోల్పోతాము,
ఇక్కడ మనల్ని అమరత్వం అన్న భావన ఉంచుతుంది– -
13:49 - 13:52దాని అర్ధము, మనము ఇక్కడ ఉన్నాము,
మనము అమరులము అనే -
13:52 - 13:53అనుభూతి దాదాపుగా మనకు కలిగిస్తుంది,
-
13:53 - 13:56వాస్తవానికది నిజం కాదు, కానీ,
మనము దాన్ని నమ్మకపోతే, -
13:56 - 13:59"దీనిలో ఉన్న విషయము ఏమిటి?",
అని చెప్తాము. కానీ గాయం -
13:59 - 14:01నుంచీ ప్రాణాలు దక్కించుకున్న వారు అమరత్వం
-
14:01 - 14:05భావాలను కోల్పోయారు. వారు వారి
తేలికతనాన్ని కోల్పోయారు. -
14:05 - 14:08కానీ వారు ఏదో కనుగొన్నారు. కాబట్టి
దీని అర్ధం, మనము -
14:09 - 14:14మరణాన్ని ముఖతః చూసి, మరియు వాస్తవానికి
దాన్ని ఎదుర్కొని, నిశ్శబ్దంగా ఉండడం -
14:15 - 14:18లేదా దాక్కొని ఉండకుండా, ఎలాగైతే నాకు
తెలిసిన కొంతమంది పురుషులు లేదా స్త్రీలు -
14:18 - 14:25అంటే ర్వాండా నుండి మైకేల్,
ఇరాక్ నుంచి కరోల్, -
14:25 - 14:27కాంగో నుండి ఫిలిప్ వంటి వారు చేశారో
-
14:27 - 14:29మరియు నాకు తెలిసిన ఇతర ప్రజలు, ఇంకా
-
14:29 - 14:31సోర్జ్ చాలన్డొన్, ఇప్పుడు ఒక
గొప్ప రచయిత, -
14:31 - 14:34తన గాయం తర్వాత బయటి పనులను ఆపు చేశాడు.
-
14:34 - 14:39నా స్నేహితులలో ఐదుగురు, గాయాన్ని
తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. -
14:39 - 14:42మనము ముఖతః మరణం చూస్తే, మనం, మర్త్య
మానవులు, మానవ మర్త్యులు, -
14:42 - 14:46మనము మరణం ఎదుర్కొని మరియు మరోసారి
-
14:46 - 14:51దాన్ని అన్ని రహస్యమైన ప్రదేశాల్లో
అత్యంత రహస్యమైన ప్రదేశంగా గుర్తించి, -
14:51 - 14:54ఎవరూ కూడా ఎప్పుడూ చూడలేదు కాబట్టి --
-
14:54 - 14:57మనము ఈ అర్ధాన్ని తిరిగి ఇవ్వగలిగితే,
-
14:58 - 15:00అవును, మనము చస్తాము, బ్రతుకుతాము
-
15:00 - 15:09మరియు మనం తిరిగి జీవిస్తాము,
కానీ మనము ముందు కంటే బలంగా తిరిగి వస్తాము. -
15:09 - 15:14చాలా బలంగా వస్తాము.
-
15:14 - 15:15ధన్యవాదములు.
-
15:15 - 15:17(చప్పట్లు)
- Title:
- చావుతో పోరాటం తరువాత చల్లటి ప్రకంపనం
- Speaker:
- జీన్-పాల్ మేరీ
- Description:
-
ఏప్రిల్ 2003 లో, అమెరికన్ దళాలు బాగ్దాద్ చుట్టుకోవటం ప్రారంభించగానే, ఒక షెల్ జీన్-పాల్ మారి అనే రచయిత మరియు యుద్ధం కరస్పాండెంట్ రిపోర్టింగ్ చేస్తున్న భవనాన్ని గుద్దుకుంది. అక్కడ అతను పురాతన కాలం నుంచి జీవితాలను పణంగా పెట్టి యుద్ధంలో పాల్గొన్న వారితో తన పరిచయాన్ని ప్రారంభించి, చావుతో ముఖా ముఖి పోరాటం చేయవలసి వచ్చింది. మేరీ అదుగుతాడు “ఏ మచ్చలు కనిపించకుండా మిమ్మల్ని ఏ విషయం చంపుతుంది? అది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని మనకు తెలుసు – లేక మేరీ మరణ శూన్యమైన ఒక అనుభవం గురించి వివరిస్తున్నారు. ఈ శోధించే చర్చలో, అతను మృత్యువు మరియు సైకోసిస్ మరియు భయానక మరియు గాయం పరిణామాల గురించి ప్రశ్నలకు సమాధానాలను శోధిస్తుంది.
- Video Language:
- French
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 15:30
Samrat Sridhara approved Telugu subtitles for Jean-Paul Mari speaks at TEDxCannes | ||
Ashwin Reddy accepted Telugu subtitles for Jean-Paul Mari speaks at TEDxCannes | ||
Ashwin Reddy edited Telugu subtitles for Jean-Paul Mari speaks at TEDxCannes | ||
Ashwin Reddy edited Telugu subtitles for Jean-Paul Mari speaks at TEDxCannes | ||
Ashwin Reddy edited Telugu subtitles for Jean-Paul Mari speaks at TEDxCannes | ||
Annamraju Lalitha edited Telugu subtitles for Jean-Paul Mari speaks at TEDxCannes | ||
Annamraju Lalitha edited Telugu subtitles for Jean-Paul Mari speaks at TEDxCannes | ||
Annamraju Lalitha edited Telugu subtitles for Jean-Paul Mari speaks at TEDxCannes |