Return to Video

The Internet: IP Addresses and DNS

  • 0:02 - 0:09
    ఇంటర్నెట్: IP చిరునామా మరియు DNS
  • 0:10 - 0:14
    హై. నాపేరు పావోలా, నేను మైక్రోసాఫ్ట్ లో
    సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని.
  • 0:14 - 0:20
    ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో మాట్లాడుకుందాం.
    ఒకరినుండి మరొకరు మాట్లాడుకోవడానికి నా జాబ్
  • 0:20 - 0:26
    నెట్వర్క్ ల మీద ఆధారపడి ఉంది, ఐతే 1970ల్లో
    దీనికి ప్రామాణిక పద్ధతి లేదు.కమ్యూనికేషన్
  • 0:26 - 0:33
    సాధ్యతకై ఇంటర్నెట్వర్కింగ్ ప్రోటోకాల్
    కనిపెట్టడానికి వింట్ సెర్ఫ్, బాబ్ కాహన్
  • 0:33 - 0:39
    గార్లు బాగా శ్రమించారు. ఈ శోధన, ఇప్పుడు
    మనం ఇంటర్నెట్ అని పిలిచే దానికి పునాది
  • 0:39 - 0:44
    వేసింది. ఇంటర్నెట్ అనేది నెట్వర్క్ ల
    నెట్వర్క్.అది ప్రపంచంలోని బిలియన్ల డివైజ్
  • 0:44 - 0:51
    లను లింక్ చేస్తుంది. మీరు బహుశ వైఫై ద్వారా
    లాప్‌టాప్ లేదా ఫోన్ కి కనెక్ట్ అయిఉండొచ్చు
  • 0:51 - 0:57
    ఆ వైఫై కనెక్షన్ ఒక ఇంటర్నెట్ సేవాప్రదాతకు
    కనెక్ట్ చేస్తుంది,ఆ ISP మిమ్మల్ని బిలియన్ల
  • 0:57 - 1:02
    కొద్దీ డివైజ్ లకు కనెక్ట్ చేస్తుంది ప్రపంచ
    వ్యాప్తంగా వందల వేలాది ఇంటర్ కనెక్ట్
  • 1:02 - 1:09
    అయిన నెట్వర్క్ లతో. చాలామంది గుర్తించని ఒక
    విషయమేమంటే, ఇంటర్నెట్ అనేది నిజంగా ఒక
  • 1:09 - 1:16
    డిజైన్ సిద్ధాంతం మరియు కొన్నిప్రోటోకాల్స్
    చే వ్యక్తం చేయబడిన ఒక కళాశిల్పం అని.
  • 1:16 - 1:20
    ప్రోటోకాల్ అనేది చక్కగా కూర్పు చేయబడిన
    నియమాలు మరియు ప్రమాణాలు. అన్ని పక్షాలూ
  • 1:20 - 1:26
    దాన్ని వాడేందుకు ఒప్పుకుంటే అది ఇబ్బంది
    లేకుండా కమ్యూనికేట్ చేసుకునేవీలు చేస్తుంది
  • 1:26 - 1:32
    భౌతికంగా నెట్వర్క్ ఎలా పనిచేస్తుందనేది
    ముఖ్యం కాదు, డిజైన్ సిద్ధాంతం ఇంటర్నెట్ కి
  • 1:32 - 1:38
    కొత్త కమ్యూనికేషన్ టెక్నాలజీలనుఅలవర్చుకుని
    గ్రహించే వీలునిచ్చింది. ఇది ఎందుకంటే కొత్త
  • 1:38 - 1:43
    టెక్నాలజీ ఇంటర్నెట్ ని శైలిగావాడుకోవడానికి
    ఏ ప్రోటోకాల్ పనిచేస్తుందో తెల్సుకోవడానికే.
  • 1:43 - 1:49
    ఇంటర్నెట్ పై ఉండేవిభిన్న డివైజ్ లు విశిష్ట
    చిరునామాలు కలిగి ఉంటాయి. ఇంటర్నెట్ పై
  • 1:49 - 1:54
    ఒక చిరునామా కేవలం, ఒక ఫోన్ నంబర్ లేదా
    వీధి చిరునామా లాంటి సంఖ్య మాత్రమే, అది
  • 1:54 - 2:00
    నెట్వర్క్ వైపు నుండి ప్రతి కంప్యూటర్ లేదా
    డివైజ్ కి విశిష్టంగా ఉంటుంది. ఇది అనేక
  • 2:00 - 2:05
    ఇళ్ళు మరియు వ్యాపారాలకుఉండే తపాలా చిరునామా
    లాంటిది. మెయిల్ లో ఒక లేఖ పంపడానికి మీకు
  • 2:05 - 2:09
    ఆ వ్యక్తి తెలిసుండాల్సిన అవసరం లేదు, ఐతే
    మీకు చిరునామా మరియు దాన్నిసరిగా రాయడమెలాగో
  • 2:09 - 2:14
    తెలిసుండాలి, తద్వారా ఆలేఖ గమ్యానికి మెయిల్
    వ్యవస్థచే తీసుకుపోబడుతుంది. ఇంటర్నెట్ పై
  • 2:14 - 2:20
    కంప్యూటర్ల కొరకు చిరునామా వ్యవస్థ ఒకేలా
    ఉంటుంది మరియు ఇంటర్నెట్ ప్రోటోకాల్ లేదా
  • 2:20 - 2:25
    సులువుగా IP అని పిలువబడే ఇంటర్నెట్
    కమ్యూనికేషన్ లో ఉపయోగించే ముఖ్యమైన ప్రోటో
  • 2:25 - 2:32
    కాల్స్ యొక్క ముఖ్యభాగంగా ఉంటుంది.కంప్యూటర్
    చిరునామాను IPచిరునామా అంటారు. ఒకవెబ్‌సైట్
  • 2:32 - 2:37
    సందర్శన అంటే మీ కంప్యూటర్ మరో కంప్యూటర్ ని
    సమాచారం అడగడం. మీ కంప్యూటర్ మరో కంప్యూటర్
  • 2:37 - 2:41
    IP చిరునామాకు ఒక సందేశం పంపిస్తుంది, అది
    జన్మ చిరునామాతో సహా పంపుతుంది, కావున జవాబు
  • 2:41 - 2:48
    ఎక్కడికి పంపాలో ఆ కంప్యూటర్ కు తెలుస్తుంది
    మీరు ఒక IP చిరునామా చూసే ఉంటారు.అది కేవలం
  • 2:48 - 2:55
    అంకెల గుత్తి!ఈఅంకెలు స్థాయిక్రమంలో ఏర్పాటు
    చేయబడి ఉంటాయి. ఇంటి చిరునామాకు దేశం, నగరం
  • 2:55 - 3:02
    వీధి, ఇంటి నంబర్ ఉన్నట్లుగా IP చిరునామా
    అనేక భాగాలను కలిగి ఉంటుంది. డిజిటల్ డేటా
  • 3:02 - 3:10
    లాగా, ఈ నంబర్లన్నీ బిట్స్ లో చూపబడతాయి.
    సాంప్రదాయ IP చిరునామాలు 32 బిట్స్ పొడవు
  • 3:10 - 3:16
    చిరునామా ప్రతిభాగమూ 8 బిట్స్ తో ఉంటుంది.
    తొలి నంబర్లు మామూలుగా డివైజ్ యొక్క దేశం
  • 3:16 - 3:22
    మరియు ప్రాంతీయ నెట్వర్క్ ని చూపుతాయి. ఆ
    తర్వాత సబ్-నెట్వర్క్, చివరగా నిర్దిష్ట
  • 3:22 - 3:30
    డివైజ్ వస్తుంది. IP చిరునామా ఈ వెర్షన్ ని
    IPv4 అంటారు. ఇది 1973 లో రూపొందింది మరియు
  • 3:30 - 3:36
    80 ల మొదట్లో విస్తృతంగా స్వీకరించబడింది,
    ఇంటర్నెట్ కు కనెక్ట్ అయిన 4 బిలియన్లకుపైగా
  • 3:36 - 3:41
    డివైజ్ లకు విశిష్ట చిరునామాలను ఇస్తోంది.
    ఐతేఇంటర్నెట్ వింట్ సెర్ఫ్ ఊహించినదానికంటే
  • 3:41 - 3:47
    కూడా మరింత ఎక్కువ ప్రజాదరణ పొందింది మరియు
    4 బిలియన్ విశిష్టచిరునామాలు సరిపోకపోవచ్చు.
  • 3:47 - 3:53
    ఇప్పుడు మనం IPv6 అనబడే పొడవాటి IP చిరునామా
    ఉండే బహు-సంవత్సర రూపాంతర దశలో ఉన్నాము.
  • 3:53 - 4:04
    అది చిరునామాకు 128 బిట్స్ వంతున వాడుతూ
    సుమారు 340 అన్‌డెసిలియన్ విశిష్టచిరునామాలు
  • 4:04 - 4:09
    ఇస్తుంది. అది భూమిపై ప్రతి ఇసుక రేణువుకూ
    ఒక IP చిరునామా ఉన్నంతకంటే ఎక్కువ.
  • 4:09 - 4:16
    అనేకమంది ఇంటర్నెట్ చిరునామాను అస్సలు చూడరు
    లేదా పట్టించుకోరు. డొమైన్ నేమ్ సిస్టం లేదా
  • 4:16 - 4:23
    DNS అనబడే వ్యవస్థ సంబంధిత చిరునామాకు
    www.example.com లాగా పేరు పెడుతుంది.
  • 4:23 - 4:29
    డొమైన్ పేరు చూసేందుకు మరియు IP చిరునామాతో
    అనుబంధానికి మీకంప్యూటర్ DNS ఉపయోగిస్తుంది
  • 4:29 - 4:33
    అది మీకంప్యూటర్ ని ఇంటర్నెట్ పై గమ్యానికి
    కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది.మరియు అది
  • 4:33 - 4:38
    ఇలా ఉంటుంది: (స్వరం1)"హేయ్,www.code.org."
    వెళ్ళాలనుకుంటున్నా నేను. (స్వరం 2) "ఊ..
  • 4:38 - 4:50
    సరే ఆ డొమైన్ కి నాకు IP చిరునామా తెలీదు,
    అడుగుతా ఉండు. హేయ్ code.orgకి ఎలావెళ్ళాలో
  • 4:50 - 4:59
    నీకు తెల్సా? (స్వరం 3) "ఆ. దానికి ఇదిగో
    174.129.14.120. ఇలా వెళ్ళచ్చు" (స్వరం 2)
  • 4:59 - 5:04
    "ఓ, సరే, మంచిది, ధన్యవాదాలు. నేను దాన్ని
    రాసుకొని సేవ్ చేసుకుంటా, మళ్ళీ అవసరానికి
  • 5:04 - 5:14
    హేయ్ ఇదిగో నువ్వడిగిన చిరునామా." (స్వరం 1)
    "చాలా బాగుంది! ధన్యవాదాలు." మరి బిలియన్లలో
  • 5:14 - 5:20
    ఒకటైన వెబ్‌సైట్ ని కనుక్కోవడానికి బిలియన్ల
    డివైజ్ లకు మనంఒకసిస్టమ్ ఎలా రూపొందిస్తాం?
  • 5:20 - 5:28
    ఒక DNS సర్వర్ అన్ని డివైజ్ ల నుండీ వచ్చే
    అభ్యర్థనల్ని నిర్వహణ చేయడం అసాధ్యం. జవాబు
  • 5:28 - 5:33
    ఏమిటంటే, DNS సర్వర్లు పంపిణీ చేయబడిన
    హైరార్కేలో కనెక్ట్ అయి ఉంటాయి,మరియు జోన్లు
  • 5:33 - 5:41
    గా .org, .com, .net మొ.అతిపెద్ద డొమైన్లుగా
    విడదీయబడి ఉంటాయి. ఒరిజినల్ గా ప్రభుత్వ
  • 5:41 - 5:48
    మరియు విద్యా సంస్థల కోసం DNS ఒక పబ్లిక్
    కమ్యూనికేషన్ ప్రోటోకాల్ గా రూపొందించబడింది
  • 5:48 - 5:55
    దాని బహిరంగతత్వం కారణంగా, DNS సైబర్
    దాడులకు లొంగిపోయే అవకాశం ఉంటుంది.
  • 5:55 - 6:03
    ఉదా, దాడి DNS స్ఫూఫింగ్. హ్యాకర్ ఒక DNS
    సర్వర్ లో చొరబడి తప్పు చిరునామాతో జత
  • 6:03 - 6:09
    అయ్యేలా ఒక డొమైన్ పేరును మార్చుకుంటారు.
    ఇది ఒక మోసపు వెబ్‌సైట్ కి ఆ హ్యాకర్
  • 6:09 - 6:16
    పంపించేలా చేస్తుంది. ఇలా మీకు జరిగితే, ఆ
    వెబ్‌సైట్ ని నిజమైనదిగా మీరు వాడుకుంటారు
  • 6:16 - 6:24
    కాబట్టిమీరు నిస్సహాయసమస్యల్ని ఎదుర్కొంటారు
    ఇంటర్నెట్ భారీగా రోజురోజుకూ పెరుగుతుంటుంది
  • 6:24 - 6:31
    ఐతే ఇంటర్నెట్ ఎంత పెరిగినా తట్టుకునేలా
    డొమైన్ నేమ్ సిస్టమ్ మరియు ఇంటర్నెట్
  • 6:31 - 6:35
    ప్రోటోకాల్ రూపొందించబడి ఉంటాయి.
Title:
The Internet: IP Addresses and DNS
Description:

more » « less
Video Language:
English
Duration:
06:45

Telugu subtitles

Revisions