Return to Video

ఒక నగరంలో మృతులకోసం స్థలం కరువైతే ఏమవుతుంది?

  • 0:00 - 0:05
    నేను ఉపేక్షించాను , కానీ అది లాభదాయకమైనది
  • 0:05 - 0:07
    పెట్టుబడి అవకాశాన్నిచ్చేది కూడా
  • 0:08 - 0:11
    గడిచిన పదేళ్ళలో U.K లో
  • 0:11 - 0:14
    స్థిరాస్తుల రంగంలో ఖనన స్థలాల
    ప్రసక్తి మళ్లీ వచ్చింది
  • 0:14 - 0:17
    దాదాపు 3:1 నిష్పత్తిలో
  • 0:18 - 0:22
    ప్రైవేట్ సమాధి స్థలాలు ఏర్పాటౌతున్నాయి
    మదుపరుల కోసం ప్లాట్ల రూపంలో
  • 0:22 - 0:25
    3000 పౌండ్లకు దగ్గరగా వాటి ధర మొదలౌతున్నది
  • 0:25 - 0:28
    40 % అభివృధ్దిని సాధించాలని వారి ప్రణాళిక
  • 0:28 - 0:34
    నిరంతరమైన గిరాకీయే ఇందులోని గొప్పఅవకాశం
  • 0:36 - 0:38
    వాస్తవమైన ప్రతిపాదన ఇది
  • 0:38 - 0:43
    ఈ రకమైన పెట్టుబడులను కొన్ని కంపెనీలు
    ఆహ్వానిస్తున్నాయి.
  • 0:43 - 0:45
    కానీ , నా ఆసక్తి దీనికి విరుధ్ధంగా వుంది
  • 0:46 - 0:48
    నేను ఆర్కిటెక్ట్ ని,
    పట్టణ రూపశిల్పిని కూడా
  • 0:48 - 0:49
    గడచిన సంవత్సరన్నర కాలంలో
    మృత్యువు,
  • 0:49 - 0:52
    మృత్యుముఖంలో వున్నవారి
    పట్ల గల దృక్పధాలను గమనిస్తున్నాను
  • 0:52 - 0:56
    మన నగరాలు , దాని లోని నిర్మాణాలు
    ఎలా రూపుదిద్దుకుంటున్నాయో
  • 0:57 - 1:00
    అలా వేసవిలో నేను నా మొదటి ప్రదర్శనను
    ఏర్పాటు చేసాను.
  • 1:00 - 1:02
    వెనిస్ లో మృత్యువు ,నిర్మాణ శిల్పం గురించి
  • 1:02 - 1:04
    వెనిస్ లో మృత్యువు అనే పేరుతో
  • 1:05 - 1:07
    ఎందుకంటే మృత్యువు అనే అంశం గురించి
  • 1:07 - 1:10
    మాట్లాడటాన్ని అసౌకర్యంగా భావిస్తాము
  • 1:10 - 1:12
    ప్రదర్శన ఆసాంతం ఉల్లాసభరితంగా
    రూపొందించబడింది
  • 1:12 - 1:15
    దానివల్ల జనం దానితో మమేకం అవుతారు
  • 1:15 - 1:18
    ప్రదర్శనాంశాల్లో ఒకటి
    interactive map of London
  • 1:18 - 1:21
    అందులో నగరంలోని స్థిరాస్థుల వివరాలున్నాయి
  • 1:21 - 1:23
    మరణానంతర క్రియలకోసం కేటాయించినట్టివి
  • 1:23 - 1:26
    మీరా పటంపై వేలు కదుపుతుంటే
  • 1:26 - 1:29
    ఆ స్థలం ఖాళీ జాగానా,భవనమా లేక సిమెట్రీయా
  • 1:29 - 1:30
    తెలిసిపోతుంది
  • 1:31 - 1:33
    మీరు చూస్తున్న ఆ తెలుపురంగు ఆకారాలు
  • 1:33 - 1:36
    అన్నీకూడా ఆసుపత్రులు,హాస్పిసెస్ లు
  • 1:36 - 1:39
    నగరంలోని మార్చురీలు, సిమెట్రీలు
  • 1:39 - 1:41
    నిజానికి అధికభాగం సిమెట్రీలు
  • 1:42 - 1:46
    మేం చూపించాలనుకుంటున్నది మృత్యువు,ఖననమనే
  • 1:46 - 1:48
    విషయాల గురించి మనం ఆలోచించము
  • 1:48 - 1:51
    అవన్నీ మన చుట్టూఉన్నవే కాక మన
    నగరాల్లోని ముఖ్య భాగాలు
  • 1:52 - 1:56
    ప్రతిఏటా U.K లో 5 లక్షలమంది చనిపోతున్నారు
  • 1:57 - 2:00
    అందులో పాతిక భాగం ఖననమవాలనుకుంటున్నారు
  • 2:00 - 2:04
    ఇతర పశ్చిమ యూరప్ దేశాల వలె U.K.లోనూ
  • 2:04 - 2:05
    ఖనన ప్రదేశాలు తగ్గిపోతున్నాయి
  • 2:05 - 2:07
    ముఖ్యంగా ప్రధాన నగరాల్లో
  • 2:08 - 2:11
    లండన్ మహానగర పాలికాకు ఈ సంగతి తెలుసు
  • 2:11 - 2:15
    ముఖ్య కారణం జనాభా పెరుగుదల
  • 2:15 - 2:18
    వాస్తవానికి ప్రస్తుతమున్న సిమెట్రీలు
    దాదాపుగా నిండుకున్నాయి
  • 2:18 - 2:22
    U.K.లో ఖనన స్థలాలు శాశ్వతమనుకునే
    సంప్రదాయముంది
  • 2:22 - 2:26
    వసతులు మెరుగుపరచాల్సిన అవసరముంది
    ప్రజలు ఆస్థలాలను వాడుకోవాలనుకుంటున్నారు
  • 2:26 - 2:29
    ఇళ్లు, ఆఫీసులు లేదా దుకాణాలను కట్టడానికై
  • 2:30 - 2:32
    వారు కొన్ని పరిష్కారాలు
    సూచిస్తున్నారు
  • 2:32 - 2:36
    ఎలాగంటే 50 సం' తర్వాత సమాధులను
    మళ్లీ వాడుకోవచ్చునని
  • 2:36 - 2:38
    లేదా మృతులను నాలుగు నిలువులలో ఖననం చేయాలని
  • 2:38 - 2:41
    దాంతో నలుగురిని ఒకే స్థలంలో ఖననం చేయొచ్చు
  • 2:41 - 2:44
    అలా స్థలాన్ని మరింత బాగా వాడుకోవచ్చు
  • 2:44 - 2:47
    ఈ పద్దతిలో సమీప భవిష్యత్తులో
    లండన్ లో ఖననానికై మరింత
  • 2:47 - 2:49
    స్థలాన్ని పొందగలమని ఆశించొచ్చు
  • 2:49 - 2:52
    సాంప్రదాయికంగా సిమెట్రీలు
    సంరక్షింపబడట్లేదు
  • 2:52 - 2:54
    ప్రాంతీయ అధికారులచేత
  • 2:54 - 2:57
    ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇందులో
    న్యాయపరమైన అడ్డంకులు లేవు
  • 2:57 - 3:00
    U.K దేశీయులెవరికైనా ఖననానికై
    స్థలాన్ని కేటాయించడంలో
  • 3:00 - 3:05
    పరంపరగా ఇది ప్రైవేట్, ధార్మిక
    సంస్థలచే జరుగుతోంది
  • 3:05 - 3:08
    ఉదా:చర్చిలు, మసీదులు,ఆరాధనాస్థలాలు
  • 3:09 - 3:12
    కానీ అప్పుడప్పుడు లాభదాయక బృందాలచే కూడా
    చేయబడుతున్నది
  • 3:12 - 3:14
    ఈ ప్రక్రియలో భాగమవ్వాలని అనుకుంటున్నవారితో
  • 3:14 - 3:18
    మీకు తెలుసా వారు చిన్నపాటి సమాధి స్థలాల
    కోసం వెతుకుతున్నారు
  • 3:18 - 3:20
    ఖరీదు ఎక్కువ గా వుండినందున
  • 3:20 - 3:22
    బాగా డబ్బులను సమకూర్చుకోవాలనిపిస్తుంది
  • 3:23 - 3:26
    నిజానికి,బయటికి వెళ్ళి మీ కోసం
    ఒక సిమెట్రీని మొదలుపెట్టాలంటే
  • 3:26 - 3:28
    మీరు పెట్టవచ్చు
  • 3:28 - 3:30
    సౌత్ వేల్స్ లో ఒక జంట ఉన్నారు
  • 3:30 - 3:33
    వారికొక ఫాంహౌస్ , దానికి ఆనుకొని
    పొలాలు కూడా వున్నాయి
  • 3:33 - 3:35
    ఆ స్థలాన్ని అభివృధ్ధి చేయాలనుకుంటున్నారు
  • 3:35 - 3:37
    వారికెన్నో ఆలోచనలున్నాయి
  • 3:37 - 3:40
    మొదట వారొక పార్క్ గా మారుద్దామనుకొన్నారు
  • 3:40 - 3:42
    దానికి కౌన్సిల్ వారు ఒప్పుకోలేదు
  • 3:42 - 3:44
    తరువాత చేపల చెరువు పెట్టాలనుకున్నారు
  • 3:44 - 3:45
    మళ్ళీ కౌన్సిల్ అంగీకరించలేదు
  • 3:46 - 3:48
    అప్పుడు సిమెట్రీగా మార్చాలనే
    ఆలోచన వారికి వచ్చింది
  • 3:48 - 3:51
    వారు లెక్కగట్టారు, ఇలా చేయడం ద్వారా
  • 3:51 - 3:53
    స్థలం విలువను పెంచగలమని తెలుసుకున్నారు
  • 3:53 - 3:58
    95 వేల పౌండ్ల నుండి పది లక్షల పౌండ్ల దాకా
  • 3:59 - 4:04
    సిమెట్రీ లనుంచి లాభాలు పొందవచ్చుననే
    అంశానికి తిరిగి వస్తే
  • 4:04 - 4:06
    పరిహాసాస్పదంగా అనిపిస్తుంది కదా
  • 4:06 - 4:10
    ఖననప్రదేశాల ధరలు ఎక్కువగా వుండడమే కారణం
  • 4:10 - 4:12
    నిజానికి ఇది తప్పుదోవ పట్టించేదిలా వుంది
  • 4:12 - 4:14
    వాటి ధరలు ఎక్కు వున్నట్టు అన్పిస్తాయి
  • 4:14 - 4:18
    నిజానికి ఆ స్థలాల నిర్వహణ భారం
    ఆ ధరలకు కారణం
  • 4:18 - 4:21
    రాబోయే 50 సం. వరకూ ఎవరో ఒకరుఅక్కడ
    పెరిగే గడ్డిని కత్తిరించాల్సుంటుంది
  • 4:21 - 4:24
    సిమెట్రీల నుంచి డబ్బు సంపాదించడం
    కష్టం అని దానర్థం
  • 4:24 - 4:27
    ఈ కారణంచేతనే అవి సంస్థల చేత
    నిర్వహింపబడుతుంటాయి
  • 4:27 - 4:29
    లేదా లాభాపేక్షలేని బృందాలచే
  • 4:29 - 4:32
    చివరికి కౌన్సిల్ వీరికి అనుమతులనిచ్చింది
  • 4:32 - 4:34
    వారు కొత్త సిమెట్రీలను
    కట్టాలని ప్రయత్నిస్తున్నారు
  • 4:34 - 4:38
    ఇది ఎలా పనిచేస్తుందో మీకు వివరిస్తాను
  • 4:38 - 4:40
    నేనిప్పుడు U.K లో ఒక నిర్మాణం చేయాలనుకుంటే
  • 4:40 - 4:42
    ఉదాహరణకు ఒక సెమెట్రీ
  • 4:42 - 4:45
    మొదటగా నేను నిర్మాణ అనుమతికోసం
    దరఖాస్తు చేయాలి
  • 4:45 - 4:49
    ఒక క్లయింట్ కోసం ఆఫీస్ భవనాన్ని కట్టాలంటే
  • 4:49 - 4:51
    లేదా మా ఇంటిని విస్తరించాలంటే
  • 4:51 - 4:55
    లేక , మీకు తెలుసా నాకో షాపుంటే దాన్ని
    ఆఫీస్ గా మార్చాలంటే
  • 4:55 - 4:57
    ఎన్నో నమూనాలను గీయాల్సివుంటుంది
  • 4:57 - 4:59
    వాటిని అనుమతికోసం కౌన్సిల్ కు
    సమర్పించాల్సివుంటుంది
  • 4:59 - 5:03
    వారు అది ఆ పరిసరాలకు సరిపడుతుందా
    లేదా వంటివి చూస్తారు
  • 5:03 - 5:05
    అది వుండాల్సిన విధంగా వుందా అని చూస్తారు
  • 5:05 - 5:09
    దాని ప్రభావం ఎలా వుంటుందో వంటివీ చూస్తారు
  • 5:09 - 5:10
    చుట్టుప్రక్కల పరిసరాలమీదా
  • 5:10 - 5:12
    ఇంకా ఎలాంటి వాటి మీదఆలోచిస్తారంటే
  • 5:12 - 5:14
    కాలుష్యానికి కారణమౌతుందా అనికూడా
  • 5:14 - 5:16
    లేదా ట్రాఫిక్ ఎక్కువౌతుందా అనికూడా
  • 5:16 - 5:19
    నేను కట్టిన దానికి చేరుకోవాలనుకుంటే
  • 5:19 - 5:21
    దీంట్లో కొన్ని మంచి
    సంగతులు కూడా వున్నాయి
  • 5:21 - 5:23
    దుకాణాల వంటి ప్రాంతీయ సేవలు
    అందుబాటులోకి రావచ్చు
  • 5:23 - 5:25
    చుట్టుప్రక్కల వారికి అవసరమైనవి
  • 5:26 - 5:29
    వారు లాభనష్టాలను బేరీజు వేసుకుని
  • 5:29 - 5:30
    నిర్ణయాలను తీసుకుంటారు
  • 5:31 - 5:35
    నేనొక పెద్ద సిమెట్రీని కట్టాలనుకుంటే
    ఇలాంటి సోపానాలుంటాయి
  • 5:35 - 5:37
    కాని నాకొక చిన్న స్థలం కనుక వుంటే
  • 5:37 - 5:41
    అయిదారుమందిని నేను ఖననం చేయాలనుకుంటే
  • 5:42 - 5:45
    నిజానికి నేనెవరి అనుమతీ
    తీసుకోవాల్సిన అవసరంలేదు
  • 5:46 - 5:50
    వాస్తవానికి U.K.లో ఖననానికి సంబంధించి
    నియమాలు పెద్దగా లేవు
  • 5:50 - 5:54
    వున్న ఆ కొద్ది కూడా జలాన్ని
    కలుషితం చేయవద్దనే
  • 5:54 - 5:57
    అంటే నదులు, భూగర్భ జలాలను
    కలుషితం చేయవద్దనేవే
  • 5:57 - 6:00
    నిజానికి నీ స్వంతానికి చిన్న సిమెట్రీని
    ఏర్పాటు చేసుకోవాలంటే
  • 6:00 - 6:01
    చేసుకోవచ్చు
  • 6:01 - 6:05
    నా ఉద్దేశ్యంలో నిజానికి
    దీన్నెవరు చేస్తారో చెప్పనా ?
  • 6:06 - 6:10
    మీరో సంపన్న కుటుంబానికి చెంది ,
    విశాలమైన ఎస్టేట్ ను కలిగుంటే
  • 6:10 - 6:12
    అందులో మీరో సమాధిని ఏర్పాటు
    చేసుకునే అవకాశముంది
  • 6:12 - 6:14
    మీ కుటుంబాన్నంతా అక్కడే ఖననం చేయవచ్చు
  • 6:15 - 6:17
    కానీ అసాధారణ విషయమేంటంటే
  • 6:17 - 6:20
    ఒక కొలతవున్న భూభాగం మీకవసరం లేదు
  • 6:20 - 6:23
    మృతుల ఖననాన్ని అనుమతించడానికి ముందు
  • 6:23 - 6:25
    సాంకేతికంగా దాని అర్థమేంటంటే
  • 6:25 - 6:29
    ఇది శివార్ల లోని మీ ఇంటి పెరటికీ
    అన్వయిస్తుంది
  • 6:29 - 6:30
    ( నవ్వులు )
  • 6:30 - 6:34
    దీన్ని మీరు మీ ఇంట్లో ప్రయత్నించాలనుకుంటే
  • 6:34 - 6:38
    website ద్వారా సహకారాన్ని అందించే
    సంస్థలు కొన్ని ఉన్నాయి
  • 6:38 - 6:40
    అవి మీకు ఉపయోగపడగలవు
  • 6:40 - 6:42
    వాళ్లు మీకు చెప్పే మొదటి విషయం
  • 6:42 - 6:46
    ఖననం కోసం ముందు కెళ్ళడానికి పూర్వం
    మీకో సర్టిఫికెట్ కావాల్సివుంటుంది
  • 6:46 - 6:49
    జనాల్ని చంపేసి, మీ పెరట్లో ఖననం చేయడానికి
    మీకు అవకాశం లేదు
  • 6:49 - 6:51
    ( నవ్వులు )
  • 6:52 - 6:56
    ఖననస్థలానికి సంబంధించిన వివరాలను రికార్ఢ్
    చేసి వుంచమని కూడా వారు మీకు చెప్తారు
  • 6:56 - 6:59
    అయితే అవి లాంఛనప్రాయాలే
  • 6:59 - 7:02
    ఇరుగుపొరుగు దీన్ని ఇష్టపడక పోవచ్చునని
    వారు హెచ్చరిస్తారు
  • 7:02 - 7:06
    న్యాయంగా చెప్పాలంటే ఇంచుమించు
    వారు చేయగలిగిందేమీ లేదిక్కడ
  • 7:06 - 7:11
    ఒకవేళ మీలో ఎవరికైనా ఈ లాభదాయకమైన
    ఆలోచన ఇంకా మనసులో వుంటే
  • 7:11 - 7:13
    అలాంటి ఖననస్థలాల ధరలెలా వుంటాయో
  • 7:13 - 7:16
    దాని కోసం మీరెంత డబ్బు ఏర్పాటు చేసుకోవాలో
  • 7:16 - 7:18
    వారు హెచ్చరిస్తారు దానివలన మీ ఇంటివిలువ
  • 7:18 - 7:20
    20 % వరకూ తగ్గవచ్చునని
  • 7:21 - 7:22
    నిజానికి ఇంకా ఎక్కువ వుండొచ్చు
  • 7:22 - 7:25
    దాని తరువాత మీ ఇంటినెవరూ కొనకపోవచ్చు
  • 7:26 - 7:29
    దీంట్లో నేను కనుక్కున్న ఆకర్షణేంటంటే
  • 7:29 - 7:34
    వాస్తవానికి మృత్యువు పట్ల మన వైఖరులను
    ఇది క్రోడీకరిస్తుంది
  • 7:34 - 7:39
    U.K లోను, యూరప్ అంతటా ఈ గణాంకాలు
    దాదాపుగా ఇలానే వుండవచ్చు
  • 7:39 - 7:42
    30% మంది మాత్రమే ఎవరితోనైనా
    మాట్లాడి వుంటారు
  • 7:42 - 7:44
    మృత్యువుకు పట్ల వారి ఆశలను గూర్చి
  • 7:44 - 7:45
    75 సం .వయస్సు. దాటిన వారిలోనూ
  • 7:46 - 7:49
    45 % మాత్రమే దీని గూర్చి మాట్లాడివుంటారు
  • 7:49 - 7:52
    దానికి జనం చెప్పే కారణాలు మీకు తెలుసు
  • 7:52 - 7:54
    చావు వారికి దూరంలో వుందని అనుకుంటారు
  • 7:54 - 7:57
    ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నామని
    అనుకుంటారు
  • 7:57 - 7:58
    దాని గురించి మాట్లాడడం ద్వారా
  • 7:58 - 8:00
    మీకు తెలుసు , కొంతవరకు
  • 8:00 - 8:04
    మనకు సదుపాయాలను కల్పించడానికి
    బయటి ప్రపంచంలో కొందరున్నారు
  • 8:04 - 8:07
    ప్రభుత్వం ఇలాంటి విషయాలపట్ల అధికారాన్ని
    నిబంధనలను కలిగివుంది
  • 8:07 - 8:10
    ఉదా:ఖననానికి సంబంధించిన
  • 8:10 - 8:12
    ఏర్పాట్లు చేసే నిర్వాహకులున్నారు
  • 8:12 - 8:14
    వారి వారి ఉద్యోగ కాలాన్నంతా దీనికై
    అంకితంచేస్తారు
  • 8:14 - 8:16
    అయితే అదే నగరాలకు వచ్చేసరికి
  • 8:16 - 8:19
    మన నగరాల్లో మృత్యువు ఎలా
    అమరుతుందని ఆలోచిస్తే
  • 8:19 - 8:23
    క్రమబధ్ధీకరణ , డిజైన్, ఆలోచన చాలా తక్కువ
  • 8:23 - 8:24
    మనం ఊహించినదాని కంటె
  • 8:24 - 8:27
    అయితే మనం దీని గురించి ఆలోచించట్లేదు
  • 8:27 - 8:29
    కాని ప్రజలందరూ దాన్ని గురించి
    ఆలోచిస్తున్నారని ఊహించొచ్చు
  • 8:30 - 8:32
    కాని , వారు శ్రధ్ధ తీసుకోవడం లేదు కూడా
  • 8:32 - 8:33
    కృతజ్ఞతలు.
  • 8:33 - 8:36
    ( కరతాళధ్వనులు )
Title:
ఒక నగరంలో మృతులకోసం స్థలం కరువైతే ఏమవుతుంది?
Speaker:
అలిసన్ కిల్లింగ్
Description:

UK లో మీరు బయటికి వెళ్ళి, ఒక స్వంత సిమెట్రీని ఏర్పాటు చేసుకోవాలంటే ,అది సాధ్యమే అంటారు అలిసన్ కిల్లింగ్. ప్రజలు చనిపోయే ప్రదేశం గురించీ, ఖనన ప్రదేశం గురించీ చాలా ఆలోచిస్తున్నారు ఆమె.ఆర్కిటెక్ట్ , TED అనుయాయి అయి ఆమె ఈ ప్రసంగంలో మన నగరాలు, పట్టణాల్లో ఉపేక్షిస్తున్న ఒక అంశాన్ని సామాజిక , ఆర్థిక దృక్కోణంలో ఆలోచించేలా విశదీకరిస్తున్నారు.అదే సిమెట్రీ.మీరెక్కడఖననమవొచ్చు అనే విషయాన్ని హాస్యభరితంగా , ఆకర్షణీయంగా వైరుధ్య పూరితమైన u.kచట్టాల ఆధారంగా ప్రసంగించారు.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
08:49

Telugu subtitles

Revisions